వివాహ ఘడియలు మొదలయ్యితే వధూవరుల కుటుంబాల్లో చెప్పలేని ఆనందం నిండి ఉంటుంది. ఆ సంతోష సమయంలో వారు నాలుగు స్టెప్పులేస్తే వేడుకలో మరింత సందడి వాతవారణం నెలకొంటుంది. పెళ్లి సమయంలో నవవధువు ఏదైన పాటకు డ్యాన్స్ చేస్తే ఆ వీడియో వెంటనే నెట్టింట వైరల్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా వాటిని నెటిజన్లు కూడా షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లిలో నూతన దంపతులు వేసిన డ్యాన్స్ వీడియో ట్రెండ్ అవుతుంది. పెళ్లిలో మొదట ఆమె అద్భుతమైన నృత్యం చేసి అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అతిథులు కూడా చప్పట్లు కొడుతూ మరింత జోష్ నింపారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.
అప్పుడు బుల్లెట్టు బండి
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా’ అంటూ తెలుగింటి అమ్మాయి మోహన భోగరాజు పాడిన ఈ పాట ఒకప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేసింది. పెళ్లి సమయంలో వధువు అభిరుచులు తెలిపేలా ఈ పాట లిరిక్స్ ఉంటాయి. గతంలో ఇదే పాటతో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి తర్వాత తన భర్తను సర్‌ప్రైజ్ చేసింది. పెళ్లి తంతులో భాగంగా జరిగిన బరాత్‌లో ‘బుల్లెట్టు బండి’ పాటకు ఆమె అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ సాంగ్‌తో వారికి ఫుల్ క్రేజ్ వచ్చింది.
the amount of times i watched this reel is unhealthy 😭 pic.twitter.com/wgtQL5lme7
— akshi 𐙚 (@hrudayamaxx) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment