
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినిమాకు రివ్యూలు రాయరని అనుకున్నానని అన్నారు. చౌర్యపాఠం మూవీకి చాలామంది బాగానే రాశారని తెలిపారు. అందరూ కూడా మేచ్యూర్‌డ్‌గానే రాసినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇటీవల టాలీవుడ్‌లో రివ్యూలపై హీరో నాని సైతం మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందు నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం మూవీ రివ్యూలపై చాలా సందర్భాల్లో మాట్లాడారు. గత కొద్దికాలంగా రివ్యూలపై టాలీవుడ్‌లో పెద్దఎత్తున చర్చ జరుగుతన్న వేళ త్రినాథరావు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.
కాగా.. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో త్రినాథరావు రివ్యూలపై స్పందించారు.