
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు.
దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు.