trinadha rao nakkina
-
ఆ ఆశ, ఆలోచన నాకు లేదు: త్రినాథరావు నక్కిన
‘‘పన్నెండేళ్ల నా కెరీర్లో ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే వేగంగా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన, ఆశ నాకు లేదు. నంబర్లు తక్కువ అయినా మంచి సినిమాలు తీయాలన్నదే నా ఆకాంక్ష. అందుకే నిదానంగా చేసుకుంటూ వెళుతున్నాను’’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం ‘చౌర్య పాఠం’. కార్తీక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో త్రినాథరావు విలేకరులతో పంచుకున్న విశేషాలు.→ కార్తీక్ ఘట్టమనేని తండ్రి ఐజీగా చేశారు. ఆయన హయాంలో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి కార్తీక్ చెప్పినప్పుడు సరదాగా అనిపించింది. ఈ నేపథ్యంలో సినిమా చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ కేసుని స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షన్ యాడ్ చేసి, ఈ కథ రాశాడు కార్తీక్. ఈ సినిమాకి దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి పేరుని తనే చెప్పాడు. ‘కార్తికేయ’ సినిమా షూటింగ్లో తన చురుకుదనం, ప్రతిభని గుర్తించాను. దీంతో ఓకే చెప్పాను. తను ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ని మాత్రం మూడుసార్లు మార్పించాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూసుకున్నాక చాలా బాగుందనిపించింది. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కథకి రెండింతలు న్యాయం చేశాడు. ఈ చిత్రం దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా ఉంటుంది (నవ్వుతూ). → కొత్తవాళ్లకి ఒక వేదిక సృష్టించి, అవకాశాలు ఇవ్వాలన్నది నా కల. ఎప్పటి నుంచో ఉన్న ఆ కల ‘చౌర్యపాఠం’తో నెరవేరింది. నిర్మాతగా మారి డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. కేవలం కొత్తవారికి అవకాశం కల్పించా లనే మంచి ఉద్దేశంతోనే నిర్మాతగా మారాను. మేం అనుకున్నదాని కంటే పది శాతం బడ్జెట్ పెరిగింది. మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో రాజీ పడకుండా మంచి క్యాలిటీతో తీశాం.→ ఇంద్ర రామ్ ఈ కథకి సరిగ్గా సరి΄ోయాడు. కొత్తవాడు కదా సరిగ్గా చేస్తాడో? లేదో అనుకున్నాం. సెట్స్‌కి వెళ్లాక రెండు రోజులు కంగారు పడినా, ఆ తర్వాత బాగా నటించాడు. అలానే ΄ాయల్ రాధాకృష్ణ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా చక్కగా నటించింది. → ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం తగ్గించడానికి చాలా కారణాలున్నాయి. వాళ్లని థియేటర్స్‌కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం హవీష్ హీరోగా నా డైరెక్షన్లో చేస్తున్న సినిమా 25 శాతం పూర్తయింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజుగారి బ్యానర్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌లో సినిమాలు చేయాల్సి ఉంది. -
ఆర్ఎక్స్ 100 నేను చేయాల్సిన సినిమా: యంగ్ హీరో
కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా కొత్త వారితో తీసినవే. అవి మంచి విజయాల్ని సాధించాయి. అలాగే మా ‘చౌర్య పాఠం’ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు యంగ్ హీరో ఇంద్ర రామ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చౌర్య పాఠం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు ఈ చిత్రంతో ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెడుతున్నారు.కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇంద్ర రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.⇢ ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. కథా రచయిత కార్తిక్ వాళ్ళ ఫాదర్ ఐజి గా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ ని తీసుకొని అక్కడ నుంచి టన్నల్ తవ్వి బ్యాంక్ లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని చేయడం జరిగింది.⇢ ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేశాం. ఇలాంటి సినిమా చేయడానికి ఎలాంటి రిఫరెన్స్ ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాలో టన్నల్స్ క్రియేట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక డిఫరెంట్ వరల్డ్. చాలా కష్టపడ్డాం. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది.⇢ ఈ సినిమాకి విజయ సేతుపతి గారు, నాగచైతన్య గారు, వరుణ్ తేజ్ అన్న అందరూ సపోర్ట్ చేశారు. అలాగే సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయ్యింది.⇢ నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు. -
సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు.దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. -
చూడటానికి తమిళ సినిమాల్లో విలన్ లా ఉంటాడు కానీ!
-
'అందరికీ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం'.. నక్కిన త్రినాథరావు అభ్యంతరకర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.మహిళా కమిషన్ ఆగ్రహం..తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)ఇలా చేయడం రెండోసారి..అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్లో మాట్లాడారు. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఈవెంట్లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. -
'నువ్వలా... నేనిలా' మూవీ పోస్టర్స్
-
'నువ్వలా... నేనిలా' ఫస్ట లుక్