
కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా కొత్త వారితో తీసినవే. అవి మంచి విజయాల్ని సాధించాయి. అలాగే మా ‘చౌర్య పాఠం’ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు యంగ్ హీరో ఇంద్ర రామ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చౌర్య పాఠం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు ఈ చిత్రంతో ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెడుతున్నారు.కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇంద్ర రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
⇢ మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.
⇢ ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. కథా రచయిత కార్తిక్ వాళ్ళ ఫాదర్ ఐజి గా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ ని తీసుకొని అక్కడ నుంచి టన్నల్ తవ్వి బ్యాంక్ లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని చేయడం జరిగింది.
⇢ ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేశాం. ఇలాంటి సినిమా చేయడానికి ఎలాంటి రిఫరెన్స్ ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాలో టన్నల్స్ క్రియేట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక డిఫరెంట్ వరల్డ్. చాలా కష్టపడ్డాం. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది.
⇢ ఈ సినిమాకి విజయ సేతుపతి గారు, నాగచైతన్య గారు, వరుణ్ తేజ్ అన్న అందరూ సపోర్ట్ చేశారు. అలాగే సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయ్యింది.
⇢ నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు.