టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.
మహిళా కమిషన్ ఆగ్రహం..
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.
(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)
ఇలా చేయడం రెండోసారి..
అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్‌లో మాట్లాడారు. మా యూనిట్‌లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్‌టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన ఈవెంట్‌లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్‌గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.
సన్నబడింది.. కానీ!
అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్‌ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్‌లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment