Anshu Ambani
-
'అందరికీ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం'.. నక్కిన త్రినాథరావు అభ్యంతరకర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina) కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అన్షుపై (Actress Anshu) అసభ్యకర రీతిలో మాట్లాడారు. మజాకా మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హీరోయిన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆయనపై మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది.మహిళా కమిషన్ ఆగ్రహం..తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.(ఇది చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)ఇలా చేయడం రెండోసారి..అయితే నక్కిన త్రినాథరావు అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. గతంలోనూ చౌర్య పాఠం మూవీ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణపై కూడా ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. 'అందరికీ హగ్ ఇస్తుంది కానీ.. నాకు మాత్రం ఇవ్వడం లేదు' అని ఈవెంట్లో మాట్లాడారు. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది.. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. పేమేంట్ విత్ జీఎస్టీతో కలిపి మొత్తం ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా నాకు హగ్ ఇవ్వడం లేదు అని నక్కిన త్రినాథరావు అభ్యంతంకర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఈవెంట్లో అన్షుపై కామెంట్స్ చేయడంతో పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నక్కిన త్రినాథరావు ఇలా మాట్లాడటం తొలిసారి కాదని అంటున్నారు. తాజాగా మన్మధుడు హీరోయిన్‌పై అలా మాట్లాడటం రెండోసారని మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. -
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
మన్మథుడు హీరోయిన్ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారుతాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారుమీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం)రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.టీజర్ లాంచ్ ఈవెంట్లో అసభ్యకర వ్యాఖ్యలుఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్లో హీరోయిన్ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం -
హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు (Trinadha Rao Nakkina)పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోయిన్ అన్షు (Actress Anshu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. త్రినాథరావు వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద వెల్లడిచింది. దర్శకుడికి త్వరలోనే నోటీసు జారీ చేస్తామని తెలిపింది.హీరోయిన్ కోసమే సినిమా చూశా..కాగా నక్కినేని త్రినాథరావు ప్రస్తుతం మజాకా సినిమా (Mazaka Movie)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం (జనవరి 12న) జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాధ రావు.. హీరోయిన్ అన్షు గురించి మాట్లాడాడు. అన్షును చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లామని, అందులో ఆమె ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అలాంటి అన్షు.. మరోసారి హీరోయిన్గా కళ్లముందుకు వచ్చేసరికి నమ్మలేకపోయానన్నాడు.సన్నబడింది.. కానీ!అయితే అప్పటికి, ఇప్పటికి అన్షు కాస్త సన్నబడిందన్నాడు. మరీ ఇంత సన్నగా ఉంటే సరిపోదు, లావు పెరగమని చెప్పానంటూ హద్దులు దాటుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. తన శరీరాకృతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇదే ఈవెంట్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఇన్సిడెంట్ను రీక్రియేట్ చేశాడు. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ.. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయి వాటర్ బాటిల్ అడిగి.. కవర్ చేసి తర్వాత పేరు చెబుతాడు. సేమ్.. అలాగే ఇక్కడ కూడా త్రినాధరావు రెండో హీరోయిన్ పేరు మర్చిపోయినట్లు నాటకమాడాడు. సమయానికి గుర్తు రావడం లేదన్నట్లుగా వాటర్ బాటిల్ అడిగాడు. కాసేపటికి రీతూ వర్మ కదూ.. నిజంగానే నీ పేరు పేరు గుర్తుండదంటూ కవర్ చేశాడు. పేరు మర్చిపోయినట్లుగా యాక్టింగ్ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దర్శకుడి ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో త్రినాధరావు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరాడు. 'మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే.. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. (చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! ఇప్పట్లో ఆగేలా లేడుగా)20 ఏళ్ల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు చాలామంది గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. 20 ఏళ్ల తర్వాత ఆమె మజాకా మూవీతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా సినిమా విషయానికి వస్తే ఇందులో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు డైరెక్షన్ చేస్తున్నాడు.ధమాకాతో బ్లాక్‌బస్టర్ హిట్రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. త్రినాధరావు విషయానికి వస్తే.. ఈయన ప్రియతమా నీవచ కుశలమా సినిమాతో దర్శకుడిగా మారారు. మేం వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా పలు సినిమాలు తెరకెక్కించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మజాకా మూవీ చేస్తున్నాడు. Yesterday was an unfortunate slip of the tongue by Dir #NakkinaTrinadhRaoIt’s a wrong example to set & we should have been cautious to avoid itTrinadh garu & Team #Mazaka apologise for the poor choice of words to Anshu garu & to all Women out there,We are because of you ♥️ pic.twitter.com/KQvLSeBtJ1— Sundeep Kishan (@sundeepkishan) January 13, 2025 చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్‌కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
నాభి అందాలతో రాశీ.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన తృప్తి!
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కృతి సనన్ మత్తెక్కించేలా చూస్తూ కాక రేపుతున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి బాయ్ ఫ్రెండ్ తో 'రానా నాయుడు' బ్యూటీ క్యూట్ పోజులు షాకింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్న మెగాడాటర్ నిహారిక చూస్తేనే మతిపోయేల్లాంటి స్టిల్స్ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Jasnya Jayadeesh (@jasnya_k_jayadeesh) View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. నాగార్జున, సోనాలి బింద్రే, బ్రహ్మానందం, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒకరిని మించి మరొకరు ఈ మూవీకి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. 'మన్మథుడు'లో ఓ హీరోయిన్గా చేసిన అన్షు.. ఇప్పుడు నాగార్జునని కలిసింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో.. హీరోయిన్లుగా చేసిన సోనాలి బింద్రే, అన్షు కూడా అంతే అందంగా కనిపిస్తారు. అయితే ఈ మూవీ చేసిన తర్వాత అన్షు.. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్‌లో సెటిలైపోయింది. దాదాపు 20-21 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన అన్షు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది. రీసెంట్గా 'మన్మథుడు' జోడీ నాగార్జున-అన్షు కలిసి పార్టీ చేసుకున్నారు. పలు ఫొటోలు బయకొచ్చాయి. తాజాగా ఇప్పుడు నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్‌లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి' అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
ఆ ఒక్క కారణం వల్లే సినిమాలు మానేశా: మన్మథుడు హీరోయిన్
అన్షు అంబానీ.. చేసింది నాలుగే నాలుగు సినిమాలు.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్లో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను తెలుగు ఆడియన్స్ ఇట్టే గుర్తుపడతారు. తను నటించిన తొలి చిత్రం మన్మథుడు. ఈ మూవీ అటు నాగార్జునకు, ఇటు అన్షుకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాదే రాఘవేంద్ర సినిమా చేసిందీ బ్యూటీ. మిస్సమ్మలో అతిథి పాత్రలో మెరిసింది. 2004లో జై అనే తమిళ చిత్రంలో చివరిసారిగా నటించింది. తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. 2003లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లాడి లండన్‌లో సెటిలైంది. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఇరవై ఏండ్ల తర్వాత ఈమె మీడియా ముందుకు వచ్చింది. 16 ఏళ్ల వయసులోనే.. తాజాగా ఏదో పని మీద భారత్‌కు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తను సినిమాలు మానేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అన్షు మాట్లాడుతూ.. నేను ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగాను, కానీ నా పూర్వీకులు భారతీయులే. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియాకు వచ్చాను. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఓపక్క సినిమాల్లో యాక్టివ్ అవ్వాలనుకున్నా.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టాలనుకున్నాను. పదేపదే అలాంటి క్యారెక్టర్.. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గానే ఛాన్స్ వచ్చింది. ఆ రెండింటిలోనూ నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో కూడా ఇలా చనిపోయే రోల్సే ఆఫర్ చేశారు. పదేపదే అలాంటి క్యారెక్టర్సే వస్తుండటంతో విసుగెత్తిపోయాను. ఇవి చేసే బదులు ఖాళీగా ఉండటం నయమనుకున్నాను. అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయాను. ఒక క్యారెక్టర్ బాగా చేశారని పదేపదే ఆ నటులను అదే పాత్రకు పరిమితం చేయడం కరెక్ట్ కాదు' అని చెప్పుకొచ్చింది అన్షు అంబానీ. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్‌లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్‌గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్‌కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్‌లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్‌కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్‌గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్)