
'మన్మథుడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అన్షు (Anshu Sagar).. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేసింది. అదే 'మజాకా' (Mazaka Movie). ఈ మూవీ థియేటర్లలో సరిగా ఆడలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ టైంలో అన్షు.. నుదుటిపై ప్లాస్టర్ తో కనిపించింది. ఏం జరిగిందా అనుకున్నారు గానీ ఈమె చెప్పకపోవడంతో ఎవరూ దీని గురించి అడగలేదు.
(ఇదీ చదవండి: 'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు)
ఇప్పుడు స్వయంగా అన్షునే తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నెల క్రితం ఊహించని విధంగా గాయపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రేమ వల్ల ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్లాస్టర్ కెమెరాల కోసం పెట్టుకున్నది కాదని, అది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
నుదుటిపై పెద్ద గాయం కావడంతో ఆస్పత్రికి అన్షు వెళ్లడంతో కుట్లు వేశారు. తర్వాత దానిపై ప్లాస్టర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని.. వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి గాయాలు తనని ఆపలేవని, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానని అన్షు చెప్పుకొచ్చింది. మజాకా మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమంత పెద్దగా ఆడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లిపోయింది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)
Comments
Please login to add a commentAdd a comment