
తెలుగులో మిగతా సినిమాల మాటేమో గానీ కామెడీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంక్రాంతికి అలా వచ్చిన ఓ కామెడీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వచ్చిన కొన్నిరోజులకు థియేటర్లలోకి వచ్చిన మరో హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie). ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.
రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర‍్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)
శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ లో చిన్నచిన్న లోపాలే దీనికి కారణం. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.
'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే)

Comments
Please login to add a commentAdd a comment