
కామెడీ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో ఎవరైనా సరే మూవీ బాగుంటే చాలు ఆదరిస్తారు. అలాంటి నమ్మకంతో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది 'మజాకా'. సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, 'మన్మథుడు' పేమ్ అన్షు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ వివరాలు కూడా బయటకొచ్చాయి.
కొడుకుతో పాటు తండ్రి ప్రేమలో పడటం, అలా అమ్మాయిల వెనక తిరగడం అనే కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపించారు. అలా 'మజాకా'.. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన వస్తోంది. వీకెండ్ వచ్చేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తుంది.
(ఇదీ చదవండి: తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్)
ఇక ఓటీటీ హక్కులు విషయానికొస్తే చాలారోజుల క్రితమే డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మంచి రేటుకే డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారం ఈ మూవీ డిజిటల్ గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment