Mazaka Movie
-
ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో మిగతా సినిమాల మాటేమో గానీ కామెడీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంక్రాంతికి అలా వచ్చిన ఓ కామెడీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వచ్చిన కొన్నిరోజులకు థియేటర్లలోకి వచ్చిన మరో హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie). ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ లో చిన్నచిన్న లోపాలే దీనికి కారణం. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే) -
నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?
'మన్మథుడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అన్షు (Anshu Sagar).. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేసింది. అదే 'మజాకా' (Mazaka Movie). ఈ మూవీ థియేటర్లలో సరిగా ఆడలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ టైంలో అన్షు.. నుదుటిపై ప్లాస్టర్ తో కనిపించింది. ఏం జరిగిందా అనుకున్నారు గానీ ఈమె చెప్పకపోవడంతో ఎవరూ దీని గురించి అడగలేదు.(ఇదీ చదవండి: 'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు)ఇప్పుడు స్వయంగా అన్షునే తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నెల క్రితం ఊహించని విధంగా గాయపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రేమ వల్ల ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్లాస్టర్ కెమెరాల కోసం పెట్టుకున్నది కాదని, అది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.నుదుటిపై పెద్ద గాయం కావడంతో ఆస్పత్రికి అన్షు వెళ్లడంతో కుట్లు వేశారు. తర్వాత దానిపై ప్లాస్టర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని.. వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి గాయాలు తనని ఆపలేవని, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానని అన్షు చెప్పుకొచ్చింది. మజాకా మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమంత పెద్దగా ఆడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లిపోయింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’(Mazaka) . ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదని చెప్పినట్లుగాను ఈ మూవీ ఉంటుంది. పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్( Rao Ramesh), రీతూవర్మ(Ritu Varma), అన్షు ప్రధాన పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించారు.మజాకా సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సినిమా వినోదాత్మకంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సందీప్ కిషన్, 'మన్మథుడు' పేమ్ అన్షు భారీగానే కష్టపడ్డారు. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ డీల్ మాత్రం మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సినిమా చూసిన దిల్ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్ రాజు ఓ మాట అన్నారని గుర్తు చేసుకున్నారు.దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. -
'మజాకా' మూవీ థాంక్స్ మీట్ లో మెరిసిన రీతు వర్మ (ఫొటోలు)
-
సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా
కామెడీ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో ఎవరైనా సరే మూవీ బాగుంటే చాలు ఆదరిస్తారు. అలాంటి నమ్మకంతో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది 'మజాకా'. సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, 'మన్మథుడు' పేమ్ అన్షు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ వివరాలు కూడా బయటకొచ్చాయి.కొడుకుతో పాటు తండ్రి ప్రేమలో పడటం, అలా అమ్మాయిల వెనక తిరగడం అనే కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపించారు. అలా 'మజాకా'.. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన వస్తోంది. వీకెండ్ వచ్చేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్)ఇక ఓటీటీ హక్కులు విషయానికొస్తే చాలారోజుల క్రితమే డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మంచి రేటుకే డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారం ఈ మూవీ డిజిటల్ గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ) -
Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ
టైటిల్: మజాకానటీనటులు: సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్నిర్మాత: రాజేశ్ దండకథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడదర్శకత్వం: త్రినాథరావు నక్కినసంగీతం: లియోన్ జేమ్స్సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీవిడుదల తేది: ఫిబ్రవరి 26, 2025యంగ్ హీరో సందీప్ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్ హిట్ ట్రాక్ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్ కాంబినేషన్ దీన్నే నమ్ముకుంది. రొటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్ సన్నివేశం..ఇలా సెట్ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.వాస్తవానికి ఈ కథ లైన్ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్ ఉన్న పాయింట్ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్ రిపీట్.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. తండ్రికొడుకులుగా రావు రమేశ్, సందీప్ కిషన్ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్ ఇరగదీశాడు. యంగ్ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్ ఆది కామెడీ జస్ట్ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. Rating : 2.75/5 -
నా సినిమాల్లో విలువలు ఉండేలా చూసుకుంటాను: దర్శకుడు నక్కిన త్రినాథరావు
‘‘నా సినిమాల్లో ఎంత ఫన్ ఉన్నా విలువలు ఉండేలానూ జాగ్రత్తలు తీసుకుంటాను. ‘సినిమా చూపిస్త మావ, నేను.. లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా!’... ఇలా నా చిత్రాల్లో డైలాగ్స్ రూపంలోనో, సీన్స్ రూపంలోనో విలువలు ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రతి మగాడికీ ఓ మహిళ తోడు ఎంత అవసరమో ‘మజాకా’లో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన(Nakkina Trinadha rao). సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో నక్కిన త్రినాథరావు చెప్పిన విశేషాలు.⇒ ఇద్దరు మగాళ్లు మాత్రమే ఉన్న ఆడ దిక్కులేని ఓ ఇంట్లో ఓ మహిళ పని చేసేందుకు భయపడుతుంటుంది. అందుకే ఆ తండ్రీకొడుకులు తమకో ఫ్యామిలీ కావాలనుకుంటారు. వాళ్లు పడే తపన, చేసే ప్రయత్నాల సమాహారమే ‘మాజాకా’ కథ. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. కానీ చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచి అమ్మ ఎమోషన్‌ను అనుభూతి చెందని ఓ వ్యక్తి ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈ తండ్రీకొడుకులు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను సినిమాలోనే చూడాలి. ⇒ ప్రసన్నకుమార్ మంచి కథలు ఇస్తున్నారు. అందుకే ఆయనతో సినిమాలు చేస్తున్నాను. నా సొంత కథలతో చేయనని కాదు... నా సొంత కథలతో చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇటీవల రైటర్ శ్రీనివాస్ ఓ కథ చెప్పాడు... నచ్చింది. ‘మజాకా’ రిలీజ్ తర్వాత ఆలోచిస్తాను.⇒ నా ప్రొడక్షన్లోని ‘చౌర్యపాఠం’ సినిమాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ‘అనకాపల్లి’ అనే సెమీ పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ చేస్తున్నాను. ‘మజాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్ మజాకా’ ఉంది. ‘ధమాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ అనుకుంటున్నాం. రవితేజగారితో చేస్తే బాగానే ఉంటుంది. మా ప్రయత్నం కూడా ఇదే... చూడాలి. -
డబుల్ మజాకా ఉంటుంది: రాజేష్ దండా
‘‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత త్రినాథరావుగారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మజాకా’. ఈ సినిమాని ఆయన బాగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. ‘మజాకా’ కి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో ఈ మూవీ చివరలో ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ కూడా వేస్తున్నాం’’ అని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించారు.బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రేపు(బుధవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేష్ దండా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రైటర్ ప్రసన్నగారి శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్ ‘మజాకా’. భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం కూడా ఉంటుంది. మా మూవీ రిలీజ్ డేట్‌కి తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ కొత్తగా ΄్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ సుంకరగారు లైవ్ షూటింగ్ ఐడియా చెప్పారు.ఆయనతో నా భాగస్వామ్యం కొనసాగుతుంది. వచ్చే ఏడాది మా కాంబినేషన్లో ఓ స్టార్ హీరోతో బిగ్ మూవీ చేయబోతున్నాం. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్లతో నా అనుబంధం ప్రత్యేకమైనది.. వారితో మళ్లీ సినిమాలు చేస్తాను. ఇకపై వినోదాత్మక సినిమాలే చేస్తాను. ‘సామజవరగమన’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా, హీరోయిన్ సంయుక్తతో ఓ చిత్రం చేస్తున్నాను’’ అని చెప్పారు. -
హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వారంపాటు అమ్మ బాధలోనే: డైరెక్టర్
ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్‌లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.ఎలాంటి శిక్ష వేసినా ఓకేతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది. అమ్మను చూసి భయమేసిందిఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన 'మజాకా'.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు తకిటి తదిమి తందాన, శబ్దం,అగాథియా తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏది రిలీజ్ కానుందంటే?\ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 24 - మార్చి 1)నెట్ఫ్లిక్స్డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28అమెజాన్ ప్రైమ్జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సిరీస్) ఫిబ్రవరి 27సుడల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28హాట్స్టార్సూట్స్: లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 24బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28లవ్ అండర్ కన్స్ట్రక్షన్ (మలయాళ సిరీస్) - ఫిబ్రవరి 28ది వాస్ప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28సైనా ప్లేస్వర్గం (మలయాళ మూవీ) - ఫిబ్రవరి 24ఎంఎక్స్ ప్లేయర్ఆశ్రమ్ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి) -
నవ్వులు గట్టిగా వినిపిస్తాయి: సందీప్ కిషన్
సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్‌లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.నా కెరీర్లో హయ్యెస్ట్ నంబర్స్ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్‌గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.‘‘ఈ చిత్రంలో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రావు రమేశ్. ‘‘కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న సందీప్ కిషన్‌కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాప్ట్ అనిపించింది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్‌గారు, నేను హ్యాట్రిక్ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్ దండా. హీరోయిన్ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు. -
'మజాకా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నంబర్స్‌కే మర్యాద: సందీప్ కిషన్
‘‘నేను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మజాకా’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న (రావు రమేశ్) ఒకే ఇంట్లో ఉండే బ్యాచిలర్స్‌లా బతుకుతుంటాము. మమ్మల్ని ఎవరూ పండగలకు, వేడుకలకు పిలవరు. మా ఇంట్లో మహిళలు పని చేయాలనుకోరు. ఇలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka movie). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్ పంచుకున్న విశేషాలు.⇒ నాకు నచ్చిన కథతో సినిమా చేశాను. నిర్మాతకు డబ్బులొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు... ఇలాంటి ఉద్దేశ్యంతోనే నేను సినిమాలు చేసుకుంటూ నా కెరీర్లో పరిగెత్తాను. నా తర్వాతి సినిమాల నంబర్స్ (వసూళ్లను ఉద్దేశించి..) ఇంత ఉండాలనే నాలెడ్జ్ నాకు అప్పట్లో లేదు. ఈ నాలెడ్జ్ వచ్చే సమయానికి అంటే... 2019లో నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. ‘మైఖేల్’ నుంచి మళ్లీ పుంజుకున్నాను. నంబర్స్ గురించి ఆలోచించాను. ‘మైఖేల్’కు పెద్ద నంబర్స్ రాలేదు.కానీ నాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు పెరిగింది. ‘భైరవ కోన’ మూవీ పెద్ద నంబర్స్ రాగలవనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. రాయన్ (ఇందులో సందీప్ ఓ లీడ్ రోల్ చేశారు) హిట్‌గా నిలిచింది. కానీ ఇది ధనుష్ అన్న చిత్రం. ఇప్పుడు ‘మజాకా’కు పెద్ద నంబర్స్ వస్తాయి. చెప్పాలంటే... నంబర్స్ గురించి నాకు పెద్ద ఆసక్తి లేదు. కానీ నంబర్స్ వస్తేనే మర్యాద. కళకో, కృషికో దక్కని మర్యాద నంబర్స్‌కు లభిస్తోంది. గత ఐదేళ్లలో నా మార్కెట్ పది రెట్లు పెరిగింది.⇒ ‘మజాకా’లో ఇప్పటివరకు ఎవరూ చెప్పని మంచి పాయింట్‌ను టచ్ చేశాం. రావు రమేశ్‌గారికి, నాకు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలు తీస్తారు త్రినాథరావుగారు. ప్రసన్నగారు మంచి కథ రాశారు. అనిల్, రాజేశ్గార్లంటే నాకు హోమ్ ప్రోడక్షన్. ఒకరు నాకు అన్నలాంటివారు. రాజేశ్ మంచి ఫ్రెండ్. ⇒ నా పదిహనేళ్ల కెరీర్లో ముప్పై సినిమాలు చేశాను. నా జర్నీలో కొత్త కథలను, దర్శకులను, ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశాననే ఆనందం ఉంది. రాబిన్‌హుడ్ లాంటి క్యారెక్టర్‌తో పీరియాడికల్ ఫిల్మ్ చేయాలని ఉంది. అయితే ఖాళీగా అయినా ఉంటాను కానీ, కమర్షియల్ సినిమాల్లో విలన్‌గా చేయను. ఇక తమిళంలో నాకు మంచి ఆదరణ లభిస్తుండటం హ్యాపీ. ప్రస్తుతం సంజయ్ (ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు) డైరెక్షన్లో మూవీ చేస్తున్నాను. ‘ఫ్యామిలీ మేన్’ థర్డ్ సీజన్లో నటించాను. నెట్‌ఫ్లిక్స్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. -
నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది.. మజాకా హీరోయిన్ రీతూ వర్మ (ఫోటోలు)
-
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: రీతూ వర్మ
‘మజాకా’(Mazaka)లో యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో నటించాడు.బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను చేయలేదు. ఆడియన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది’అని అన్నారు రీతూ వర్మ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ(Ritu Varma) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది.→ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.→ ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది→ త్రినాథ్ రావు గత సినిమాల మాదిరే మజాక కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది.→ సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్షు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం తెలుగు క్లాసులు కూడా తీసుకుంది.→ డైరెక్టర్ త్రినాధ్ రావు చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా ఉంటారు.త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.→ నా సీనీ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను. అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది. నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని ఉంది.→ ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.