
సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్‌లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.
నా కెరీర్‌లో హయ్యెస్ట్ నంబర్స్ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్‌గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.
‘‘ఈ చిత్రంలో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రావు రమేశ్. ‘‘కెప్టెన్ మిల్లర్, భైరవకోన, రాయన్’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న సందీప్ కిషన్‌కు పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ యాప్ట్ అనిపించింది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్‌గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్‌గారు, నేను హ్యాట్రిక్ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్ దండా. హీరోయిన్ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment