
ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయి రావడమే అరుదు. అలాంటిది వచ్చిన అవకాశాల్ని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ 'బేబీ' వైష్ణవిని చూస్తుంటే మాత్రం తప్పటడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వరసపెట్టి రెండు ఫ్లాప్స్ పడ్డాయి.
షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. సినిమాల్లోనూ బన్నీ, నాని సరసన సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీతో హీరోయిన్ గా మారిందో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇలాంటప్పుడే ఆచితూచి కథలు ఎంచుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
ఈ క్రమంలోనే దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా నటించిన 'లవ్ మీ' అనే హారర్ మూవీ చేసింది. ఇదొక సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి గుర్తులేదు. తాజాగా టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' చేసింది. ఇదైనా ఈమె దశ మారుస్తుందనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది.
సినిమా ఫ్లాప్ కావడానికి వైష్ణవి చైతన్య పూర్తి కారణం కాకపోవచ్చు. కానీ ఇలా వరస సినిమాలు ఫెయిల్ అవుతున్నాయంటే అందులో వైష్ణవి స్క్రిప్ట్ సెలక్షన్ లాంటి పొరపాట్లు కూడా ఉంటాయి. ఇకముందైనా మంచి కథల్ని ఎంచుకుని మూవీస్ చేస్తే సరి. లేదంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.
(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ))