Movie News
-
వారి నటన, హావభావాలకు నవ్వకుండా ఉండలేరు.. ఆ ఘనత వారికే సొంతం!
నవ్వడం ఒక వరం. నవ్వు రావాలంటే కూడా అదృష్టం ఉండాలి. మన జీవితంలో ప్రతిరోజు నవ్వుతూ బతకాలంటే మనకు రాసి పెట్టుండాలి. అదేంటి నవ్వడానికి ఓక జోక్ వింటే చాలుగా.. ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఎందుకు అనుకుంటున్నారా? మీరు చెప్పింది కూడా కరెక్ట్ కానీ.. నవ్వడం అందరికీ సరదాగా ఉంటుంది. కానీ మనం ఒకరిని నవ్వించాలంటే మాత్రం మన వద్ద ఏదో ప్రత్యేకత ఉండాలి. అందరూ జోక్స్ చెబుతారు.. కానీ కొందరి చెబితేనే నవ్వు వస్తుంది. అలా మనం తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్వించిన కమెడియన్స్ ఎంతమంది అలా వెళ్లమీదే లెక్క పెట్టేస్తారు. ఎందుకంటే అలా నవ్వించడం కొందరికీ మాత్రమే సాధ్యపడుతుంది. అలా మనల్ని వెండితెరపై దశాబ్దాల పాటు నవ్వించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క బ్రహ్మనందం పేరే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బాబు మోహన్, ఎంఎస్ నారాయణ అలీ, వేణుమాధవ్, సునీల్ లాంటి కమెడియన్స్ కూడా మన టాలీవుడ్లో తమ హావభావాలతో మనల్ని నవ్వించారు. అంతకుముందు అల్లూరి రామలింగయ్య, పద్మనాభం, రాజా బాబు లాంటి ఎందరో మహానుభావులు సైతం వెండితెరపై నవ్వులు పూయించారు. ఆదివారం (మే 4వ తేదీ) ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తన నటనతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించిన వారిని, నవ్విస్తోన్న వారిని ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం.కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పద్మనాభం..అప్పట్లో ప్రముఖ హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి. సింహాద్రిపురంలో జన్మించిన ఆయన వెండి తెరపై హాస్యాన్ని పండించి తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారు. శాస్త్రిగా మెప్పించిన అల్లు రామలింగయ్య..తెలుగు సినిమా చరిత్రలో కమెడియన్ల విషయంలో వేళ్ల మీద లెక్క పెడితే అందులో మొదట వినిపించే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు ఆయనే. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రలతో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. ఆ తర్వాత భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి దాదాపు 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రలతో సినీ ప్రియులను అలరించారు. పుట్టిల్లు, ‘మాయాబజార్ సినిమ్లాల్లోనీ శాస్త్రులు పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది.బక్కపలచని రాజా బాబు..అప్పట్లో తన హవా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యనటుల్లో రాజా బాబు ఒకరు. తనదైన నటనతో ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారని చెబుతుంటారు. తెలుగు సినీ చరిత్రలో హాస్యనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.హాస్య బ్రహ్మ బ్రహ్మనందం..టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి హాస్యనటుడిగా నిలిచారు. కేవలం తన హావభావాలతో నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు దక్కించుకున్నారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్‌గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. చివరిసారిగా తన కుమారుడితో కలిసి బ్రహ్మ ఆనందం మూవీలో కనిపించారు. ఆయనతో పాటు టాలీవుడ్లో అలీ, సునీల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బాబు మోహన్, వేణు మాధవ్ సినీ ప్రియులను తమ నటన, కామెడీతో నవ్వులు పండించారు. -
నాని నీకు హ్యాట్సాఫ్.. 'హిట్ 3'పై రామ్ చరణ్ ట్వీట్
నాని లేటెస్ట్ మూవీ హిట్ 3.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరీ సూపర్ అని అనట్లేదు గానీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ కూడా రెండు రోజుల్లో రూ.62 కోట్లకు పైనే వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాడు. 'హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు' అని చరణ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడీ స్థాయికి చేరిన నాని.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది. అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని 'ద ప్యారడైజ్', మార్చి 27న చరణ్ 'పెద్ది' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు హిట్ 3 కోసం చరణ్ ట్వీట్ పెట్టడం చూస్తుంటే చరణ్ కి పోటీగా వస్తాడా? తప్పుకొంటాడా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) -
యానిమల్ మూవీ.. సందీప్ కాన్ఫిడెన్స్ వల్లే సాధ్యమైంది: నిర్మాత భూషణ్ కుమార్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మోస్ట్ వయొలెంట్ మూవీగా విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ మూవీపై కొందరు సినీ ప్రముఖులు సైతం విమర్శలు చేశారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ కావడంపై నిర్మాత భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. యానిమల్ మూవీ ఓపెనింగ్ రోజు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి కారణం సందీప్ రెడ్డి వంగానే అన్నారు. ఈ మూవీ విజయానికి క్రెడిట్ అంతా సందీప్‌కే దక్కుతుందని తెలిపారు.భూషణ్ కుమార్ మాట్లాడుతూ..' యానిమల్ సినిమాపై సందీప్ నమ్మకం వేరే స్థాయిలో ఉండేది. అందుకే అతనికే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ సినిమా. రణ్‌బీర్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్రను చేయలేదు. ఈ సినిమా ఎంత బాగా వర్కవుట్ అవుతుందో అప్పుడు మాకెవరికీ తెలియదు. ఈ మూవీపై భారీగానే విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్లను సాధించింది. ఏ సర్వేలో చూసినా మోస్ట్ అవైటేడ్ చిత్రం యానిమల్ అనే వచ్చింది. ఈ సినిమా దర్శకుడిపై పూర్తి నమ్మకముంది. అందుకే సందీప్‌కే క్రెడిట్ ఇస్తాను. మొదటి కాపీ చూసినప్పుడు నిడివి చాలా ఎక్కువగా ఉందని అతనితో చెప్పా. కానీ సందీప్ నాతో.. సర్, నన్ను ఏమీ కట్ చేయమని అడగకండి. ఈ మూవీ అద్భుతమైన బిజినెస్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా సాధిస్తుందని సందీప్ నాతో అన్నారని' వివరించారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు. -
టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ'
చిన్న లేదా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలని.. స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా రిలీజ్ చేసేందుకు కాస్త ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఇది మైనస్ అయితే మరికొన్నిసార్లు ప్లస్ అవ్వొచ్చు. తాజాగా తమిళంలో సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజైన ఓ చిన్న మూవీకి ఇలానే ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా? దాని సంగతేంటి?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) తెలుగులో ఈ వారం హిట్ 3 రిలీజైంది. సక్సెస్ అందుకుంది. తమిళంలో సూర్య రెట్రో విడుదలైంది. కానీ పాజిటివ్ టాక్ రాలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ వీకెండ్ దాటితే రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చిత్రానికి పోటీగా తమిళంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా రిలీజైంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ తప్పితే ఇందులో తెలుగువాళ్లకు తెలిసిన ముఖాలేం లేవు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' కథ విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ధర్మదాస్ అనే వ్యక్తి.. కొవిడ్ వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతాడు. దీంతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని చెన్నైకి వలస వస్తాడు. ఆ తర్వాత తను ఉంటున్న కాలనీ వాసులతో ఎలా కలిసిపోయాడు? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) ఈ సినిమాలో సింపుల్ స్టోరీనీ అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి? ఆ జీవితం మిగతావారితో కలిసి ఎలా జీవించాలి? ప్రతి మనిషి మరో మనిషికి తోడుగా ఉంటూ ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే అంశాల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా, చూస్తున్నంతసేపు గుండె బరువెక్కేలా ఈ సినిమాని తీయడం విశేషం.రెట్రో మూవీకి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు గానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ గట్టిగా ఉండొచ్చు. ఈ సినిమాని తీసింది ఓ యూట్యూబర్ కావడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతానికైతే ఇది తమిళంలో మాత్రం రిలీజైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన) -
రెడ్ రోజ్ తో రుహానీ.. ట్రెండీవేర్ లో అనసూయ
రోజ్ ఫ్లవర్ తో గ్లామరస్ గా రుహానీ శర్మ మేకప్ లేకుండా సెల్ఫీలు పోస్ట్ చేసిన రష్మికచీర లాంటి చుడీదార్ లో యాంకర్ అనసూయకాశీ వెళ్లిపోయిన హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్గ్లామర్ తో రెచ్చిపోతున్న ఐశ్వర్యా రాజేశ్పడవలో పార్టీ చేసుకున్న హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ చేసిన బలగం బ్యూటీ కావ్య View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి నిరాశ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్‌లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రంగా రానుంది.ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్‌కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కారు దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన
'కాకి పిల్ల కాకికి ముద్దు' అని తెలుగులో ఓ సామెత ఉంది. దీన్ని చాలామంది దర్శకులకు అన్వయించి చెప్పొచ్చు. ఎందుకంటే తాము తీసిన సినిమా పెద్ద కళాఖండం అనుకుంటారు. ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించినా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు రాదు. 'ఆదిపురుష్' దర్శకుడి మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) తాజాగా ముంబైలో జరిగిన వేవ్ సమ్మిట్ లో పాల్గొన్న దర్శకుడు ఓం రౌత్.. 'ఆదిపురుష్' గురించి చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇది విని ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండటం ఇక్కడ కొసమెరుపు.వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఓం రౌత్.. ఆదిపురుష్ తెలుగు హక్కుల్ని రూ.120 కోట్లకు కొన్నారని, అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసినట్లే కదా అని చెప్పుకొచ్చాడు. ఈ లాజిక్ దెబ్బకు అందరికీ నోట మాట రావట్లేదు. ఎందుకంటే రూ.120 కోట్లు పెట్టి కొనడం కాదు, అంతకు మించిన వసూళ్లు వస్తే అప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసినట్లు. ఈ లాజిక్ ఓం రౌత్ కి ఎప్పుడు అర్థమవుతుందోనని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఓం రౌత్.. ఆదిపురుష్ గనుక సరిగా తీసి ఉంటే ఈ పాటికే మరో సినిమా లైన్ లో పెట్టేవాడు. దాని రిజల్ట్ తేడా కొట్టడం వల్లే రెండేళ్లయినా కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు ఇదే బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవిలతో రామాయణాన్ని సినిమాగా తీస్తున్నారు.ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా మొన్నీమధ్య సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకుతో సినిమా చూసిన తర్వాత అతడికి సారీ కూడా చెప్పానని అన్నాడు. అంటే మూవీ ఫ్లాప్ అయిందని స్వయంగా సైఫ్ ఒప్పుకొన్నట్లే. కానీ ఓం రౌత్ మాత్రం 'ఆదిపురుష్' హిట్ అనే భ్రమల్లో ఇంకా బతికేస్తున్నాడేమో?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) #Adipurush was sold for Rs. 120cr in Telugu. Which means so many people watched it - #OmRaut pic.twitter.com/WuWs6gNHqf— $@M (@SAMTHEBESTEST_) May 2, 2025 -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. కొత్త సీజన్ పై ప్రకటన
ఓటీటీలో ఎప్పటికప్పుడు రిలీజయ్యే సినిమాలు చూసే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. కానీ వీటిలోనే ఉంటే వెబ్ సిరీసులు మాత్రం కొందరే చూస్తుంటారు. అయితే లాక్ డౌన్ టైంలో రిలీజై సూపర్ హిట్ అయిన సిరీస్ ల్లో 'పంచాయత్'. ఇదివరకే మూడు సీజన్లు రాగా ఇప్పుడు నాలుగో సీజన్ డేట్ ఫిక్స్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.ఇదివరకు మూడు సీజన్లు స్ట్రీమింగ్ కాగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ని ఈ జూలై 02 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ అంతా కూడా పంచాయతీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్ గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Phulera mein elections ki garma garmi shuru hone wali hai 👀🗳️#PanchayatOnPrime, New Season, July 2 pic.twitter.com/bsVMojSUEk— prime video IN (@PrimeVideoIN) May 3, 2025 -
నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చెల్లి ఖుషీ కపూర్, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బోనీ కపూర్ తల్లి అయిన నిర్మల్ కపూర్ వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.(ఇది చదవండి: శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం)కాగా.. జాన్వీ కపూర్ విషయానికొస్తే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. దేవరతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.#TFNExclusive: Visuals of #JanhviKapoor at her grand mother's last rites in Mumbai!#Janhvi #TeluguFilmNagar pic.twitter.com/3skROCvRXV— Telugu FilmNagar (@telugufilmnagar) May 3, 2025 -
నేను ఒక యాక్సిడెంటల్ నటుడిని.. అప్పుల కోసమే నటించా: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో అభిమానులను అలరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఏ క్షణంలోనైనా సినిమాలను అర్ధాంతరంగా వదిలేయాల్సి రావొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తాను యాక్సిడెంటల్‌గా నటనలోకి వచ్చానని వెల్లడించారు. తన జీవితంలో రేసర్ కావాలని కోరుకున్నానని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కుదరలేదని తెలిపారు. నీకిష్టమైన పనినే చేయాలని తన తండ్రి చెప్పేవారని.. కానీ అప్పులు తీర్చడానికి మోడలింగ్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి నటుడిగా మారి ఉన్న అప్పులన్నీ తీర్చానని వెల్లడించారు. -
కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే
హీరో నాని నుంచి లేటెస్ట్ గా 'హిట్ 3' సినిమా వచ్చింది. మే 01న రిలీజైన ఈ చిత్రానిక రెండు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూవీపై కొందరికి నచ్చనప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నాని రెండు సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు.గత కొన్నాళ్ల నుంచి తన ప్రతి సినిమాతో ఆకట్టుకుంటున్న నాని.. ఓవర్సీస్ అంటే విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. హిట్ 3తో వరసగా 11వ సారి మిలియన్ మార్క్ వసూళ్లు సాధించాడు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సరసన చేరాడు. ఇంతకు ముందు మహేశ్ ఈ ఘనత సాధించాడు.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) మరోవైపు 5 కంటే ఎక్కువగా 1.5 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన హీరోగానూ నాని నిలిచాడు. ఈ లిస్టులో ఇంతకు ముందు మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇప్పుడు నాని కూడా వాళ్లతో చేరిపోయాడు. నాని అందరూ మీడియం రేంజ్ హీరో అంటున్నారు గానీ ఓవర్సీస్ లో వసూళ్లు చూస్తుంటే స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గట్లేదని అనిపిస్తుంది.హిట్ 3 విషయానికొస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే వయలెన్స్ ఎక్కువుందనే టాక్ వస్తోంది. నాని కూడా ఈ విషయం ముందే చెప్పాడు. కాబట్టి ఈ తరహా రక్తపాతం సినిమాలు నచ్చేవాళ్లు హిట్ 3కి వెళ్తున్నారు. దీని తర్వాత అంటే త్వరలో 'ద ప్యారడైజ్' సెట్స్ లో నాని అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం డైరెక్టర్ సుజీత్ తో ఓ మూవీ చేస్తాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
రెండో పెళ్లి.. కాబోయే భర్తను పరిచయం చేసిన జాను లిరి!
ఫోక్ డ్యాన్సర్ జాను లిరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జాను ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి’ అని రాసుకొచ్చింది.కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ సింగర్ దిలీప్ దేవ్గన్ కూడా ఇన్‌స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. ‘అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఓ ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు’ అన్నారు.(ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి)నిన్న ఎమోషనల్.. నేడు గుడ్ న్యూస్ఫోక్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న జాను.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో’ విన్నర్‌గా నిలిచి మరింత ఫేమస్ అయింది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అదే సమయంలో జానుపై ట్రోలింగ్ కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్‌పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలను భరించలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ నిన్న ఓ వీడియోని షేర్ చేసింది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ..అందులో పేర్కొంది. చాలా మంది నెటిజన్స్ జాను ఎమోషనల్ వీడియోపై స్పందిస్తూ..ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక నేడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాననే విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) -
రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి
ఫోక్ వీడియో సాంగ్స్ తో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ అలియాస్ జాను లిరి.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లోనూ పాల్గొని విజేతగా నిలిచింది. రీసెంట్ గా ఆహా ఓటీటీలోనూ డ్యాన్స్ షోలో పాల్గొంది కానీ ఎలిమినేట్ అయిపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్-ఈమెపై చాలా ట్రోలింగ్ నడిచింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనేలా చాలా ట్రోల్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) కొన్నిరోజుల క్రితం ఈ ట్రోలింగ్ పై స్పందించిన శేఖర్ మాస్టర్.. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదని, జాను లిరితో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే నిన్న జాను ఓ వీడియో రిలీజ్ చేసింది.'నన్ను టార్గెట్ చేయడం ఆపండి. నేనేం చేసినా తప్పే అంటున్నారు. ఇన్‌స్టాలో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు?' అని బోరున ఏడుస్తూ వీడియో పెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఇప్పుడు తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. 'ఇకపై ట్రోలింగ్ పట్టించుకోను. అవును నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అందరికీ సమాధానమిస్తాను. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో ఎంతో సంతోషంగా ఉంటాను. అంతే తప్ప ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లను. జీవితంలో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చింది.ఈమె పదో తరగతిలో ఉండగానే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొడుకు కూడా పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేందుకు జాను లిరి సిద్ధమైంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతుంది.(ఇదీ చదవండి: ‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) -
ఫోటోలో కనిపించిన పాప వివరాలు తెలిపిన 'శ్రీలీల'
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొద్దిరోజుల క్రితం ఒక చిన్నపాపతో ఉన్న ఫోటోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చేసిందని క్యాప్షన్ పెట్టడంతో ఆమె మరో బిడ్డను దత్తత తీసుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆమె ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ సమయంలో వారిని దత్తత తీసుకుంది. దీంతో తాజాగా మరో పాపను కూడా శ్రీలీల దత్తత తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఫోటోలోని పాప గురించి చెబుతూ తాజాగా శ్రీలీల మరో పోస్ట్ షేర్ చేసింది.ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే శ్రీలీల కాస్త విరామం దొరకగానే చిన్నపాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ఆ పాప వివరాలు చెప్పాలని చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో శ్రీలీలను కోరడంతో తాజాగా సమాధానం చెప్పింది. ఆ పాప తన సోదరి కూతురు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. నా సోదరి కూతురు వల్ల మా ఇల్లు అంతా కొత్తగా ఉంది. ముఖ్యంగా ఈ పిన్నిలో మరింత జోష్ నింపింది' అని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపింది. పుష్ప2 సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌లో మెప్పించిన శ్రీలీల పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ సమయంలోనే కార్తిక్ - శ్రీలీల మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న తమిళ హీరో అజిత్. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. గత నెలలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారిక తేదీ కూడా ప్రకటించారు.తమిళ హీరోల్లో అజిత్(Ajith Kumar) కాస్త డిఫరెంట్. సినిమాలు, కారు రేసింగ్ అని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అవుతున్నాయి గానీ ఫ్యాన్స్ ఎందుకో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తిగా ఫ్యాన్ మూమెంట్స్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఈ మూవీలో అజిత్ పాత సినిమా పాటలు, వింటేజ్ స్టైల్ తదితర అంశాలు అజిత్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో హిట్ చేసేశారు. నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ ఏమంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో మే 08 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయానికొస్తే.. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అందుకోసం జైలుకి కూడా వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారనే సంగతి తెలుస్తుంది. అలానే డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కున్నాడనే సంగతి తెలుస్తుంది. దీంతో ఏకే మళ్లీ గ్యాంగ్ స్టర్ అవుతాడు? తర్వాత కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో రాబిన్‌హుడ్.. ప్రకటనతో క్లారిటీ)He's done being good. Now he's going to be bad and things are about to get ugly 👀🔥Watch Good Bad Ugly on Netflix, out 8 May in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/HJVKYBxybl— Netflix India (@NetflixIndia) May 3, 2025 -
ఓటీటీలో రాబిన్‌హుడ్.. ప్రకటనతో క్లారిటీ
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాదిలో మార్చి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో నితిన్, శ్రీలీలతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ మెప్పించగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్‌తో కనిపించారు.రాబిన్‌హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, జీ5 ఆప్కమింగ్ సినిమాల విభాగంలో మే 10న ఓటీటీ విడుదల కానుందని ఒక ప్రకటన ఉంది. కొద్దిరోజులుగా జీ నెట్వర్క్ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తోంది. కొత్త సినిమాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్కు ఒకేసారి విడుదల చేస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే ప్లాన్‌ను జీ తెలుగు అమలు చేసింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రం విషయంలోనూ దానిని అమలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మే 10 నుంచి జీ తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఫైనల్ అయింది. సుమారు రూ. 50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేదని టాక్.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు.రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
హిట్ కాంబో రిపీట్ 'స్పిరిట్'లో ప్రభాస్‌కు జోడీగా దీపిక!
-
హిట్3 బ్రేక్ ఈవెన్ మార్క్.. రెండురోజుల్లోనే భారీ కెలెక్షన్స్
'హిట్3: ది థర్డ్ కేస్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రెండోరోజు కూడా హిట్3 మూవీ షాకింగ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా కేవలం రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే రూ. 43 కోట్లు, సెకండ్ డే రూ. 19 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం వీకెండ్ సెలవలు ఉన్నాయి కాబట్టి ఆదివారం పూర్తి అయ్యే సరికి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. దానిని నిజం చేస్తూ.. ఈరోజు, రేపటికి ముందస్తు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఓవర్సీస్లో కూడా 1.5 మిలియన్ల డాలర్స్ దాటింది. ఇప్పటి వరకు నాని నటించిన 11 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా వారంలోపే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత వేగంగా లాభాలను ఆర్జించిన వాటిలో హిట్3 ఒకటి.It is SARKAAR'S HUNT at the box office 💥💥#HIT3 grosses 62+ CRORES WORLDWIDE in 2 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar#AbkiBaarArjunSarkaar pic.twitter.com/YVf89blt27— Wall Poster Cinema (@walpostercinema) May 3, 2025 -
మంజు వారియర్‌పై ఇష్టం వచ్చినట్లు చేతులు.. వీడియో వైరల్
మలయాళ భామ మంజు వారియర్(Manju Warrier)కు ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అప్పటికే కారులో ఉన్న అభిమానుల కోసం మళ్లీ బయటకు వచ్చింది. దీంతో ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆమెపై అసభ్యకరంగా చేతులు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. దానిని గమనించిన ఆమె సున్నితంగానే అక్కడి నుంచి తప్పుకుంది. ఓ వ్యక్తికి సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.లూసిఫర్2 సినిమాతో రీసెంట్గా మంచి విజయాన్ని అందుకున్న మంజు వారియర్‌కు వరసు సినిమా అవకాశాలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఆమెకు భారీగా పాపులారటి పెరిగింది. దీంతో ఆమెకు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కోసం ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బెంగళూరులోని మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసి వెళ్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో కారులోంచి దిగి ఆపై వారిని పలకరించే ప్రయత్నం చేసింది. దీంతో ఓ వ్యక్తి ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మరోకరు ఆమెను టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మంజు వారియర్ కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది.సినిమా వాళ్లు అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేలా చాలామందిలో అభిప్రాయం ఉంటుంది. అందుకే ఇలా ఎగబడిపోతారు. ఆ సమయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేది కనీసం ఆలోచించరు. ఒకవేళ ఫోటోల విషయంలో వారు తిరష్కరిస్తే ఎంత పొగరు అంటూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తారు. ఫ్యాన్సే కదా అని సెల్ఫీలు ఇస్తే ఇలాంటి చెత్త పనులకు రెడీగా ఉంటారు అంటూ కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.People 😡🙏 #ManjuWarrierpic.twitter.com/b2nfTau96B— Prince in Exile || దారి తప్పిన బాటసారి.. .. .. (@ExilePrince_555) May 2, 2025 -
కెమెరా వెనక వాళ్ల అసలు బుద్ధి ఏంటో చూపిస్తారు: హీరోయిన్
నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడే అతి తక్కువ మంది నటీమణుల్లో మాళవికా మోహన్( Malavika Mohanan) ఒకరని చెప్పవచ్చు. మనిషే కాదు ఈమె నటనా చాలా బోల్డ్‌గా ఉంటుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ భామ ఈమె. ఈ తరువాత విజయ్‌కు జతగా మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించి గుర్తింపు పొందారు. ఇటీవల విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న విభిన్న పాత్రలో నటించి, ప్రశంసలు అందుకున్నారు. అదే విధంగా మలయాళం, హిందీ భాషల్లో నటిస్తున మాళవికా మోహన్ తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ' రాజాసాబ్' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీతో కలిసి సర్దార్–2 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక సమావేశంలో మాళవికా మోహన్ నటులపై ఆమె విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ సినిమాలో కొందరు నటులు మహిళలను గౌరవిస్తున్న ముసుగులో మంచి పేరు పొందుతున్నారన్నారు. తాను గత ఐదేళ్లుగా అలాంటి ముసుగు నటులను చాలా మందిని చూశానని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి సమయాల్లో మహిళలపై మంచిగా మాట్లాడాలన్నది వారికి బాగా తెలుసన్నారు. అయితే కెమెరా వెనక వారు ఎలా మారుతున్నారన్నది తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. సినిమా రంగంలో ఆడ, మగ అన్న తారతమ్యం ఇంకా వేళ్లూనుకునే ఉందని, దీనికి అంతం ఎప్పుడన్నది తనకు తెలియడం లేదని నటి మాళవికా మోహన్ పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
బకాసుర రెస్టారెంట్లో వినోదం
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’(Bhakasaura Restaurant). ఈ సినిమా ద్వారా ఎస్జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, ‘కేజీఎఫ్’ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా ‘బకాసుర రెస్టారెంట్’ రూపొందింది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రవీణ్‌లోని మరో కోణాన్ని చూపిస్తుంది’’ అన్నారు. -
ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్‌కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్‌గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్‌ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్‌తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి -
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం
అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం సినిమా రంగంలో ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.కాగా.. మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీతో జో శర్మ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.కాగా.. జో శర్మకు ప్రతిష్టాత్మక వేవ్ల్ సమ్మిట్ -2025కు ఆహ్వానం రావడం ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 'వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్ల ముంబయి లోఖండ్‌వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీరలో ట్రెండింగ్ బ్యూటీ
తల్లి సురేఖావాణి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సుప్రీతచీరలో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేటోపీతో టూర్ లో చిల్ అవుతున్న కాయదు లోహర్ఎర్రటి డ్రస్సులో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్అందాల్ని ఎర వేస్తూ రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మఫ్యామిలీతో కలిసి శ్రియ శరణ్ హ్యాపీ మూమెంట్స్చీరలో చాలా నిండుగా బాలయ్య బ్యూటీ హనీరోజ్ View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Pepper Trail, Wayanad (@peppertrail) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
కొత్త కారు కొన్న 'బిగ్ బాస్ 8' నైనిక.. రేటు ఎంతంటే?
బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటివరకు 8 సీజన్లు జరగ్గా.. కంటెస్టెంట్ వాళ్లలో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ సినిమా అవకాశాలైతే రావట్లేదు గానీ షోలు చేస్తూ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది 8వ సీజన్ లో పాల్గొన్న డ్యాన్సర్ నైనిక ఇప్పుడు కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నైనిక.. ఒకటి రెండు సీజన్లలో పాల్గొంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశం దక్కించుకుంది. కానీ ఎన్ని వారాలు ఉండలేకపోయింది. ఫెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు షోల్లో కనిపించిన నైనిక.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూ సంపాదించుకుంటోంది. ఇప్పుడు అలా దాచుకున్న డబ్బుతో టాటా కారుని కొనుక్కుంది. దీని ధర మార్కెట్ లో రూ.10-15 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) View this post on Instagram A post shared by Nainika Anasuru (@nainika.anasuru26) -
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్‌లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025 -
బలవంతంగానైనా సినిమాలకు గుడ్‌బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్‌ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్‌లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి -
అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') 'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!) -
జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.కాగా.. సింగర్ రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్‌గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్లో రాణిస్తున్నారు. అతని కెరీర్లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్‌బాస్ సీజన్ -14 రన్నరప్‌గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్‌లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!
మీకు మీమ్ లాంగ్వేజ్ తెలుసా? అవును మీరు సరిగానే విన్నారు. అందరూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వచ్చా అని అంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించేవాళ్లకు మీమ్ లాంగ్వేజ్ అని ఒకటుంది. బయటవాళ్లకు అది అర్థం కాదు కానీ ఇన్ స్టా వాడేవాళ్లకు బాగా తెలుసు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అల్లు అర్జున్(Allu Arjun).. మీమ్ లాంగ్వేజ్ ఉన్న ఓ టీ షర్ట్ ధరించాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా' అని ఫేమస్ బ్రహ్మానందం డైలాగ్, ఆయన ఫొటోలతో ఉన్న టీ షర్ట్ తో కనిపించాడు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాడే అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2'(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ దర్శకుడు అట్లీతో(Director Atlee) సినిమాను ప్రకటించాడు. మూవీ ఎలా ఉండబోతుందనే వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రాజెక్ట్ మొదలవకుండానే హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం హీరోయిన్లు, ఇతర క్యాస్టింగ్ ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది. మరికొన్ని నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.మరోవైపు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం మైథలాజికల్ స్టోరీ ఒకటి రెడీ చేశారు. లెక్క ప్రకారం పుష్ప 2 తర్వాత ఇదే మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గురూజీ స్క్రిప్ట్ ని బన్నీ కాస్త పక్కనబెట్టాడు. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుంది. కానీ దీనికి మరో ఏడాది సమయం పట్టొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Look At The Tshirt 😂🤍@AlluArjun #AlluArjun pic.twitter.com/8QyTrPX9OT— C/o.AlluArjun (@CareOfAlluArjun) May 2, 2025 -
అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ'
గత కొన్నాళ్లుగా హిట్ పడక డీలా పడిపోయిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. కింగ్డమ్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మే 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 'హృదయం లోపల' అని చిత్రంలోని తొలి పాటని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander)కి విజయ్ ప్రేమలేఖ రాయడం విశేషం.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) 'మనం పాట రిలీజ్ చేశాం కదా. ఈ సందర్భంగా అనిరుధ్ కి నా చిన్న ప్రేమలేఖ. వీఐపీ, త్రీ సినిమాలు రిలీజైనప్పటి నుంచే నేను అనిరుధ్ కి వీరాభిమానిని. అసలు ఈ కుర్రాడెవరా? నేను యాక్టర్ అయిన తర్వాత అతడు మ్యూజిక్ కి నేను స్క్రీన్ పై కనిపించాలని అనుకునేవాడిని. పదేళ్ల తర్వాత ఇప్పుడు నా 13వ సినిమా రిలీజ్ కి రెడీ. మరో 28 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇది విజయ్ దేవరకొండ-అనిరుధ్ తొలి పాట. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టాడు.'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెలంతా చేస్తూనే ఉంటారు. మరి ఈసారైనా 'కింగ్డమ్' మూవీతో(Kingdom Movie) విజయ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Hey @anirudhofficial ☺️#HridayamLopala from #Kingdom - Today 4.06 PM onwards ❤️@gowtam19 @vamsi84 pic.twitter.com/NoIt6IiXea— Vijay Deverakonda (@TheDeverakonda) May 2, 2025 -
హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్
అప్పట్లో ఆరుఫలకల దేహానికి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్‌లు ట్రై చేసినవారే.. తెలుగుకు ఆ ట్రెండ్‌ను తీసుకొచ్చింది మాత్రం హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అనే చెప్పాలి. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.20 ఏళ్ల కిందట..గురువారం నాడు వేవ్స్ సదస్సు (Waves Summit 2025)కు హాజరైన అల్లు అర్జున్ ఈ ట్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దక్షిణాదిన ఏ నటుడూ చేయని పని నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. నిజానికి నేను ఆరు ఫలకల దేహం కోసం ప్రయత్నించడానికి ఓ హీరోయిన్ ముఖ్య కారణం. తను నాతో ఓ సినిమా కూడా చేసింది. సౌత్‌లో ఎవరూ సిక్స్ ప్యాక్స్ చేయలేరు అని కామెంట్స్ చేసింది. సిక్స్ ప్యాక్ చేసి చూపించా..అది నాకు నచ్చలేదు. ఎందుకు చేయలేరు? అని ప్రశ్నించుకున్నాను. ఛాలెంజ్‌గా తీసుకున్నాను. సిక్స్ ప్యాక్స్ చేసి చూపించాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే? -
చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?
సాధారణంగా హీరోయిన్లు వరసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ హిట్ కొట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో పోలిస్తే కాస్త భిన్నమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. చేసింది తక్కువ సినిమాలే అయినా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 'హిట్ 3'తో మరోసారి సక్సెస్ అందుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడిత ఇంతకీ శ్రీనిధి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తుళువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. యాక్సెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇందులో జాబ్ చేస్తూనే మోడల్ గానూ పనిచేసింది. అలా 2016 మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డ్ గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డ్ కూడా సృష్టించింది.ఇలా మోడల్ గా చాలా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. అనుకోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అలా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. స్వతహాగా ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రీనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది. అలా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది. 2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది.(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)హిట్ 3 కూడా హీరో సెంట్రిక్ యాక్షన్ మూవీ కావడంతో శ్రీనిధి శెట్టికి ఏమంత ప్రాధాన్య ఉండదులే అని చాలామంది అనుకున్నారు. స్టోరీకి అవసరమయ్యే పాత్ర ఈమెకు దక్కడం, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనిధి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది.లెక్క ప్రకారం హిట్ 3 ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కోసం ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అసలు కంటే ఈ సినిమా ముందొచ్చింది. హిట్ కొట్టేసింది.మరోవైపు హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ్'లోనూ శ్రీనిధినే సీతగా ఎంపిక చేశారు. కానీ రావణుడి పాత్ర కోసం యష్ వచ్చేసరికి.. ఈమెకి దక్కిన అవకాశం చేజారిపోయింది. సీత పాత్రలోకి సాయిపల్లవి వచ్చింది. ఏదేమైనా నిదానంగా సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టి.. చేసిన ప్రతి మూవీతోనూ హిట్ అందుకోవడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?) -
అమ్మకు మీ అందరి ఆశీస్సులు కావాలి: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్‌లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025 -
సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?
సూర్య పేరుకే తమిళ హీరో. కానీ తెలుగులోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా హౌస్ ఫుల్స్ పడతాయి. అలాంటిది గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు. సూర్య కోసమని తెలుగు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తున్నారు. కానీ అసంతృప్తితో బయటకు వస్తున్నారు. ఇంతకీ సూర్య ఎందుకిలా చేస్తున్నాడు? (ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)ఈ మధ్య కాలంలో సూర్యకు థియేటర్లలో సరైన హిట్ అన్నదే పడట్లేదు. అదేంటి జై భీమ్, ఆకాశమే హద్దురా సినిమాలు హిట్ అయ్యాయి కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇవి రెండూ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కాబట్టి ఇవి థియేటర్ లెక్కలోకి రావు. 2017లో సింగం 3 రిలీజైన తర్వాత సూర్య నుంచి గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్త్, ఈటీ, కంగువ.. ఇప్పుడు రెట్రో సినిమా థియేటర్లలోకి వచ్చాయి. రెట్రో గురించి కాసేపు పక్కనబెడితే అంతకు ముందు విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు రెట్రో చిత్రానికి కూడా తమిళంలో టాక్ ఓకే గానీ తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేదు. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కష్టమైవడం గ్యారంటీ. తమిళంలో ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)సూర్య యాక్టింగ్, కష్టపడటం ఏమన్నా తక్కువ చేస్తున్నాడా అంటే అస్సలు లేదు. కానీ అతిగా దర్శకుల్ని నమ్మడమే ఇతడికి మైనస్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది వచ్చిన 'కంగువ'పై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో బాహుబలి అవుతుందనుకున్నాడు. డైరెక్టర్ శివని చాలా నమ్మాడు. కట్ చేస్తే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది.ఇప్పుడు రెట్రో విషయంలోనూ చాలామంది ప్రేక్షకులు సూర్యని ఏం అనట్లేదు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడా? సూర్య.. అసలు ఇలాంటి కథని ఎలా ఒప్పుకొన్నాడా అని మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం సూర్య చేతిలో ఆర్జే బాలాజీ తీస్తున్న '45', సార్-లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో తీయబోయే సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు 'వడివాసల్' చిత్రం కూడా ఉంది. వీటితోనైనా హిట్ కొట్టి సూర్య కమ్ బ్యాక్ ఇస్తే అభిమానులకు అదే హ్యాపీ. లేదంటే మాత్రం సూర్య చిత్రాన్ని చూసేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
మే 1న 'హిట్ 3', 'రెట్రో' (Retro Movie) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో నాని హిట్ 3 చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. సూర్య సినిమాకు మాత్రం తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తొలిరోజు కలెక్షన్ రివీల్ చేయగా.. ఇందులో సూర్యని నాని దాటేయడం విశేషం.మొదట నాని హిట్ 3 విషయానికొస్తే.. మొత్తంగా రూ.43 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సూర్య(Suriya) రెట్రో చిత్రానికి ఓవరాల్ పోస్టర్ రిలీజ్ చేయలేదు. తమిళనాడులో రూ.17.75 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, కర్ణాటకలో రూ.3.07 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)తెలుగు, ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం 'రెట్రో' టీమ్ నుంచి రాలేదు. మొత్తంగా చూసుకుంటే (Day 1 Collection) రూ.30 కోట్లకు మించి అయితే సూర్య సినిమాకు రాలేదని అనిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే అటు టాక్ తో పాటు కలెక్షన్స్ విషయంలోనూ సూర్యని నాని దాటేసినట్లే అనిపిస్తుంది.రెట్రో రివ్యూ (Retro Review Telugu) విషయానికొస్తే.. పారివేల్ (సూర్య) చిన్నప్పుడే పుట్టిన ఊరికి దూరమవుతాడు. తిలక్ (జోజూ జార్జ్) అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పెరుగుతాడు. పెద్దయ్యాక గ్యాంగ్ స్టర్ అవుతాడు. ఓ సందర్భంలో రుక్మిణి(పూజా హెగ్డే)ని ప్రేమిస్తాడు. పెళ్లి తర్వాత రౌడీ జీవితాన్ని వదిలేస్తానని అంటాడు. మరి పారివేల్ అనుకున్నట్లు జరిగిందా? సవతి తండ్రి తిలక్ తో ఎందుకు వైరం ఏర్పడింది? చివరకు పారివేల్-రుక్మిణి పెళ్లి చేసుకున్నారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే?సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది. What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8— The Revanth (@Revanth__7) April 26, 2025 చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త -
న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)
-
ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)అమెజాన్ ప్రైమ్ఈఎమ్ఐ - తమిళ మూవీఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రంవలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీస్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమాఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీకరెబెటే - కన్నడ సినిమామాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమాశ్రీ గణేశ - మరాఠీ మూవీనెట్ ఫ్లిక్స్బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్జీఏటీఏఓ - మాండరిన్ మూవీద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమాద క్లీసే - థాయ్ మూవీద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హాట్ స్టార్కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్ 100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)ఆహావేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్వరుణన్ - తమిళ సినిమాజీ5కోస్టాకో - హిందీ మూవీసన్ నెక్స్ట్కాలా పత్తర్ - కన్నడ సినిమాబ్లూ స్టార్ - తమిళ మూవీపరమణ్ - తమిళ సినిమాసోనీ లివ్బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాబ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్) -
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.అది ఆరోగ్యకరం కాదుతాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్‌గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.సైడ్ ఎఫెక్ట్స్ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్‌గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటా..సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్‌కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.చదవండి: చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత -
Hit 3: ఈ సినిమా వాళ్లకు నచ్చదు..
-
సమ్మర్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్‌లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్ -
ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'
-
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్..?
మెగాకపుల్ వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పకోవడం లేదని టాక్. అయితే, ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.వాస్తవానికి 2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. -
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్ సూచన
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ రెగ్యూలర్‌గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్‌కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్‌కు మదురైలో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్‌కు జననాగయం సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్ అభిమానులకు కమిషనర్ లోకనాథన్ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు. తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్‌ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం. -
జోరుగా హుషారుగా...
సమ్మర్ హాలిడేస్ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్ కూల్‌గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.జన్వాడలో ఆటా పాటా హీరో మహేశ్‌బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ ఆయ్యారు. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్‌ని ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడవ షెడ్యూల్లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్‌గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ పాట షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ముచ్చింతల్‌లో జాతర హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని టాక్.ఇటీవల అరకులో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘మాస్ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి. గుహల్లో పరిశోధన హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్‌గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్ వేశారని టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్‌తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సెట్లో స్పెషల్ సాంగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్ తేజ్. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది.ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ పాటలో వరుణ్ తేజ్‌తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్‌చరణ్ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.ముచ్చింతల్‌లో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.తుక్కుగూడలో సంబరాలుహీరో సాయిదుర్గా తేజ్ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్‌గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండి యన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాచుపల్లిలో తెలుసు కదా!‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్‌గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్‌లో సూపర్ యోధబాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ‘హను–మాన్’ వంటి హిట్ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో తేజపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్ ఘట్టమనేని.పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
హిట్ 3తో ప్రేక్షకులు మళ్లీ ఎనర్జీ ఇచ్చారు: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మా ఆశలన్నీ ‘హిట్ 3’ సినిమాపైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ చూసి, జనాలు థియేటర్స్‌కు వస్తున్నారని హ్యాపీ ఫీలయ్యాను. ‘హిట్ 3’ సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్లయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’.ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా ‘దసరా’ ఉంది.ఈ సినిమాను ‘హిట్ 3’ క్రాస్ చేసింది. అలాగే తెలంగాణలో కూడా మేం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘చాలా రిలీజ్లు చూశాను. కానీ ఈ రిలీజ్ వైబ్, సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. ‘హిట్ 3’ సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్’’ అని నాని అన్నారు. ‘‘నానీగారి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు శైలేష్ కొలను. కెమెరామేన్ షాన్ వర్గీస్ మాట్లాడారు. -
భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
‘‘కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘వేవ్స్’లో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఫర్హాన్ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్ కుమార్ రావు, కబీర్ బేడీ, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్ కపూర్ చిత్రాలు పాపులర్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సత్యజిత్ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్ అనగానే ఏఆర్ రెహమాన్, రాజమౌళి (‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్ చక్రవర్తిగారు, స్టంట్స్ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్ ఖాన్, నటి దీపికా పదుకోన్ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్ షారుక్ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్. దీపికా పదుకోన్ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, మ్యూజిక్ డైరెక్టర్ సలీల్ చౌదరిల పోస్టల్ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్ ΄్యాడ్ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్ ΄్యాడ్ వేవ్స్’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
అదిరిపోయే లుక్‌లో నభా నటేశ్.. వేకేషన్లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..వేకేషన్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైశ్వాల్..హిమాచల్ ప్రదేశ్ స్టైల్లో అరియానా గ్లోరీ..విదేశాల్లో ఆదితి గౌతమ్ చిల్..హీరోయిన్ నభా నటేశ్ అదిరిపోయే లుక్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
టాలీవుడ్ యంగ్ హీరో కొత్త చిత్రం.. డప్పులతో ఫస్ట్ లుక్ పోస్టర్
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో అలరించిన యంగ్ స్టార్ ఆశిష్ మరో మూవీతో సిద్ధమైపోయారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇవాళ ఆశిష్ పుట్టిన రోజు కావడంతో టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేత్తడి అనే టైటిల్ ఖరారు చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఆశిష్ ఫుల్ మాస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం సినిమాకు మరింత హైలైట్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు.Gully beat, full heat, and birthday treat 🥁🔥The team of #Dethadi celebrated the birthday of @AshishVoffl in a true dethadi way 🤟🏻#DethadiFirstLook out now❤️🔥Get ready for a pakka Hyderabadi cinema that will resound across borders 💥#HappyBirthdayAshish @AdityaGangasani… pic.twitter.com/fpYvFP3fau— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2025Dethadi... Dethadi... Dethadi....🥁🥁🥁From dhol to dance and cake to crackers, the birthday celebrations of @AshishVoffl by team #Dethadi were a total vibe 🤟🏻Shoot begins soon 💥💥#HappyBirthdayAshish @AdityaGangasani #Dilraju #Shirish #RuthamSamar @SVC_official… pic.twitter.com/NAuQi8Rhub— Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2025 -
'సినిమాల్లో మామయ్యే నాకు ఆదర్శం'.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు హాజరైన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో నాకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమని ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రభావం తనపై ఎప్పటికీ ఉంటుందని బన్నీ అన్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. జవాన్‌తో సూపర్ హిట్ సాధించిన అట్లీతో కలిసి బన్నీ పనిచేయనున్నారు. ఇటీవలే వీరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బన్నీ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈవెంట్లో ప్రస్తావించారు. తప్పకుండా అభిమానులు ఆశించిన స్థాయిలో విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చారు. The MEGASTAR | It's A Brand 🔥😎Finally AA About Our Boss 😎❤️🔥Evaraina Naa Chiranjeevi Tharuvathey@KChiruTweets #Chiranjeevi@alluarjun #AlluArjun #MegastarChiranjeevi pic.twitter.com/YimIk1NXIA— We Love Chiranjeevi (@WeLoveMegastar) May 1, 2025 -
అనుష్క శర్మ బర్త్ డే.. విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన భార్య అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. నా ప్రాణ స్నేహితుడు, నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. నిన్ను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాము అంటూ అనుష్కపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మ డిసెంబర్ 2017లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ ఇటలీలోని టస్కానీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 2021లో తమ కుమార్తె వామిక జన్మించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో బాబు పుట్టగా అకాయ్ అని పేరు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
సొంతంగా ఖరీదైన ప్రైవేట్ జెట్.. అజయ్ దేవగణ్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది.ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. బాలీవుడ్లో మీరు తొలి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్‌లో అజయ్ దేవగణ్ ఐఆర్ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. -
అజిత్ కుమార్ బర్త్ డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గతేడాది సెలబ్రేట్ చేసుకున్న బర్త్ డే వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలాంటి రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోల్లో అజిత్, షాలిని కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్ థీమ్ కూడా ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అంతకుముందు విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్‌కు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేరిన అజిత్.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
‘హిట్ 3’ మూవీ రివ్యూ
హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్ 3’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్’, హిట్ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ)కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో యాక్షన్ థ్రిల్లర్.. కాస్త లవ్ ఎంటర్టైనర్లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్ ఉందన్న విషయాన్ని అర్జున్ కనుక్కునే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్ సర్కార్ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు హిట్ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రతీక్ బబ్బర్ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్ సర్కార్ టీమ్ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)
-
చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు'
సోషల్ మీడియా జనాల సమయాన్నే కాదు ప్రాణాల్ని కూడా కబళిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్.. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఏప్రిల్ 24న ప్రాణాలు తీసుకుంది. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటంపై పలువురూ విచారం వ్యక్తం చేశారు. మిషా ఆత్మహత్యకు గల కారణాన్ని ఆమె కుటుంబసభ్యులు తాజాగా వెల్లడించారు.డిప్రెషన్మిషా.. ఇన్స్టాగ్రామ్.. ఫాలోవర్లే తన ప్రపంచం అనుకుంది. 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ తను అనుకున్నదానికి భిన్నంగా ఫాలోవర్స్ తగ్గుతూ పోవడంతో తను చాలా బాధపడింది. ఏకంగా డిప్రెషన్లోకి వెళ్లింది. తనకసలు విలువే లేదని కుమిలిపోయింది. నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు, నేనేం చేయను, నా కెరీర్ ముగిసిపోయినట్లే అని నన్ను హగ్ చేసుకుని భయపడుతూ ఏడ్చేది. ఇన్‌స్టాగ్రామే సర్వస్వం కాదని, ఏమీ కాదని ఓదార్చేవాళ్లం. న్యాయవిద్య చదివి..ఎల్ఎల్బీ (న్యాయ విద్య) పూర్తి చేశావ్.. పీసీఎస్జేకు ప్రిపేర్ అవుతున్నావు. త్వరలోనే జడ్జివి అవుతాను. కెరీర్ గురించి భయపడాల్సిన పనిలేదని వెన్నుతట్టాం. కానీ, తనకు మా మాటలు వినిపించలేదు. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తుందని అనుకోలేదు అని ఆమె ఫ్యామిలీ మెంబర్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) స్పందించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని చాలాకాలంగా భయపడుతూ వస్తున్నాను. జీవితాన్ని ప్రేమించడానికి బదులు సోషల్ మీడియాలో కనిపించే ఫాలోవర్లు, వచ్చే లైకుల సంఖ్యే ప్రేమనుకుంటున్నారు.వర్చువల్ ప్రేమ కబళించేసిందిఈ వర్చువల్ లవ్.. నిజమైన ప్రేమను కంటికి కనబడకుండా చేస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడదే నిజమైంది. లైక్స్, కామెంట్స్ చూసి తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. మీరు పొందిన డిగ్రీపట్టాలకన్నా కూడా మీకు వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి విలువైనవారిగా పరిగణించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మనసు ముక్కలవుతోంది అని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Misha Agrawal (@themishaagrawalshow)ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు -
కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)
-
పెళ్లి రోజు గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బిందు మాధవి నేచురల్ లుక్!
గ్రీన్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ హోయలు..పెళ్లి రోజును గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ..ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో చాహల్ ప్రియురాలు ఆర్జే మహ్వశ్ సందడి..హీరోయిన్ బిందు మాధవి లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by प्रेrana kambam (@prerana.kambam) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు'
దీక్షిత్‌శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ కీలక పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కేజేక్యూ కింగ్.. జాకీ.. క్వీన్'. ఈ సినిమాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిటీ.. గన్.. రెండు ఒక్కటే.. ఎవరి చేతిలో ఉంటుందో వాడి మాటే వింటుంది అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. 'పెద్దదైనా..చిన్నదైనా రిస్క్ ఒక్కటే.. చేసేదేదో పెద్దదే చేద్దాం' అనే డైలాగ్ వింటే గ్యాంగ్‌స్టర్ కోణంలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. చివర్లో 'రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే.. రామాయణం ఉండేది కాదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతమందిస్తున్నారు. -
ముమైత్ బ్రెయిన్లో ఏడు వైర్లు.. షూ లేస్ కట్టుకున్నా ప్రమాదమే!
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది ముమైత్ ఖాన్ (Mumaith Khan).. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యూటీ తర్వాత సడన్‌గా వెండితెరకు దూరమైంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విలైక్ అనే అకాడమీని స్థాపించింది. దీని ద్వారా మేకప్‌కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు గేమ్ షోలో పాల్గొంది. బ్యాంకాక్‌లో స్టంట్ షో..ఈ సందర్భంగా హోస్ట్ తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు తెలుసు. తన మెదడులో ఏడెనిమిది వైర్లున్నాయి అని పేర్కొంది. అందుకు ముమైత్ మాట్లాడుతూ.. షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదకరం అని డాక్టర్ చెప్పారు. అయినా నేను బ్యాంకాక్‌కు స్టంట్ షో చేయడానికి వచ్చాను. అప్పుడే నేను స్వప్నదత్‌కు చెప్పాను.. రేపు ఉదయం నేను లేవకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమన్నాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. నా హెల్త్ కండీషన్‌ను అర్థం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది అని ముమైత్ చెప్పుకొచ్చింది.ఇంతకీ ఏం జరిగిందంటే?ముమైత్ ఖాన్.. ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది.చదవండి: పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది? -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్‌ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
ప్రముఖ బుల్లితెర నటి షీనా బజాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, నటుడు రోహిత్ పురోహిత్‌తో కలిసి ఈ శుభవార్తను షేర్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇలాంటి సమయంలో మీ అందరి ప్రార్థన, ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు ఈ బుల్లితెర భామకు విషెస్ చెబుతున్నారు.కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ అనే సీరియల్‌తో షీనా బజాజ్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌తో పాటు ఒకట్రెండు సినిమాల్లోనూ నటించింది. 2019లో రోహిత్ పురోహిత్‌ను షీనా బజాజ్ పెళ్లాడింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో జైపూర్‌లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె భర్త రోహిత్ ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్లో నటిస్తున్నారు. మరోవైపు షీనా బజాజ్ చివరిసారిగా వంశజ్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by sheena (@imsheenabajaj) -
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్‌హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.రాబిన్‌హుడ్ కథేంటంటే..'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ మెగాస్టార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.అలా హిమాచల్ ప్రదేశ్‌లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్లో పోస్ట్ చేసింది. While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025 -
అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవాళ్లందరినీ ఉగ్రవాదుల ఖాతాలో వేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేషణ. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సోహైల్ (Syed Sohel Ryan), మెహబూబ్.. ఇలా ఎంతోమందిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై నటుడు, తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని దొరకబట్టడం మానేసి మనదాంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. నేను భారతీయుడినిఎక్కడో జరిగినదానికి నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను టెర్రరిస్టు అయిపోను. నేను భారతీయుడిని. కులమత బేధాలు లేకుండా పెరిగాను. శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతోపాటు నమాజ్ చదివేవాళ్లు. క్రిస్టియన్ ఫ్రెండ్‌తో కలిసి చర్చికి వెళ్లేవాళ్లం. వాడి ప్లాన్ సక్సెస్.. నువ్వు ఫెయిల్మా ఇరుగుపొరుగువారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలు చాలామంది ఉన్నారు. అందులో నేనొకడిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ సక్సెస్ అయినట్లే.. భారతీయుడిగా నువ్వు ఫెయిల్ అయినట్లే!అడుక్కున్నా..మొన్న ఒక మహిళ.. భర్తను ముక్కలుముక్కలుగా నరికేసి డ్రమ్‌లో వేసింది. ఆ క్రూరత్వాన్ని టెర్రరిజం అనాలి. నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఇస్లాంలో రాసుంది. ఆ ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదు. నా తల్లిని పోగొట్టుకుని ఐదారునెలలవుతోంది. ఇంతలో నాపై ఇలాంటి కామెంట్లు వినేసరికి చాలా బాధపడ్డాను. నాపై చేసిన వీడియో డిలీట్ చేయమని ఆ యూట్యూబర్ (నా అన్వేషణ)ను అడుక్కున్నాను. 'మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. మా అమ్మపై బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా!మీ వ్యూస్ కోసం నన్ను తిట్టుకోండినేను కూడా నిన్ను తిరిగి బూతులు అనొచ్చు. కానీ, అనను. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో' అంటూ వీడియో డిలీట్ చేయమని మెసేజ్ చేశాను. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి. మిగతా మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని -
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి స్వల్ప గాయం కావడంతోనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే అజిత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. అదే సమయంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దూసుకు రావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయాలైనట్లు ఆయన టీమ్ వెల్లడించింది.కాగా.. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజిత్ కుమార్.. తిరిగి చెన్నై చేరుకున్నారు. అజిత్ రాకపై సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు పెద్దఎత్తున వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ అజిత్ వైపు దూసుకు రావడంతో ఆయన పాదానికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.(ఇది చదవండి: బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?)అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్ కీలక పాత్రల్లో మెరిశారు. -
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో సౌత్‌లో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది భూత్నీ అనే హారర్ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గ్లామర్ కోసం చాలాసార్లు సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. దాన్ని కవర్ చేసేందుకు తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకుందని నెటిజన్స్ విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ భామ స్పందించింది. ఇలాంటి వారిని చూసినప్పుడు తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. 'నేను అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు.. కొన్నిసార్లు ఏఐ వీడియోలను చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను అలా చూడటం ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ముఖాన్ని ఇతరుల శరీర ఆకృతిపకి జత చేసి వక్రీకరించడం చూస్తే అది చాలా అసహ్యంగా అనిపించింది. ఈ రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? దీంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకంటే మీరు చేస్తున్న దానితో ఎవరికీ ఉపయోగం లేదు. అలా చేస్తున్న వ్యక్తుల మంచిని ఎవరూ కోరుకోరు' అని తెలిపింది."మొదట సోషల్ మీడయాలోకి వచ్చినప్పుడు నా పట్ల చాలామందిలో ద్వేషం కలిగింది. అలాంటి వారి ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అలాంటి వారితి సరైన బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు లైక్‌ల కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల గురించి చెత్తగా రాస్తూ ప్రచారం చేస్తారు. కానీ నా అభిమానుల నుంచి లభించే ప్రేమను ఎప్పటికీ తిరస్కరించలేను' అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. -
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
విడాకులు తీసుకున్న మగవాడిని ఈ సమాజం పట్టించుకోదేమో కానీ ఆడవారిని మాత్రం చులకనగా చూస్తుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటోంది బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa). హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా జియానా అనే పాప కూడా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి పెద్దవి కావడంతో విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. అలా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.నెలకు రూ.1 లక్ష పైనే..ఆ తర్వాత ఆమెకు ముంబైలో ఇల్లు దొరకడం కూడా కష్టమైంది. సింగిల్ పేరెంట్ అని కొందరు, సెలబ్రిటీ అని మరికొందరు ఇల్లు ఇవ్వడానికే ఇష్టపడలేదు. చివరకు ఎలాగోలా సిటీ అంతా జల్లెడపట్టి అద్దెల్లు సంపాదించింది. కానీ చేతిలో సంపాదన లేనప్పుడు నగరంలో జీవించడం అంత ఈజీ కాదు. నెలవారీ ఖర్చులు లక్ష రూపాయల పైనే అవుతుండటంతో సొంతూరుకు వెళ్లిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన పుట్టింట్లో ఉంటోంది. డబ్బెలా వస్తోంది?అక్కడే బట్టల వ్యాపారం ప్రారంభించింది. అలాగే తను కొన్న కొత్తింటిని కూడా వీడియో తీసి చూపించింది. ఆ ఇంటికి ఆమె నెలనెలా ఈఎమ్ఐ కడుతోంది. ఇది చూసిన జనాలు తనకు డబ్బులెలా వస్తున్నాయి? ఈ ఇల్లు ఎలా కొనగలిగింది? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. వాటిపై చారు అసోపా తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించింది. నేను రైల్లో వెళ్లకుండా విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నాను? అని కొందరడిగారు. సింపతీ అక్కర్లేదుఆ ఎయిర్‌లైన్స్ వాళ్లు నన్ను ఆహ్వానించడం వల్లే విమానయానాన్ని ఎంచుకున్నాను. నేను షాపింగ్ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు. కొత్తింటి విషయానికి వస్తే.. నెలనెలా అద్దె కట్టే బదులు అదే ఈఎమ్ఐ కడుతున్నాను. నన్ను విమర్శించడం ఆపండి.. మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేంటంటే.. నేను పేదదాన్ని కాదు. దేవుడి దయ వల్ల నా ఖర్చులు నేను భరించగలను. నాకు ఎవరి సింపతీ అక్కర్లేదు. టీవీ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అందుకే ముంబై వదిలి వచ్చేశాను తప్ప పని లేక కాదు అని నటి వివరణ ఇచ్చింది.సీరియల్స్.. సినిమాచారు అసోపా.. అగ్లే జనం మోహే బిటియా హీ కిజో, యే రిష్తా క్యా కెహ్లాతా హై, బాల్వీర్, దేవోంక్ కె దేవ్.. మహాదేవ్, లవ్ బై ఛాన్స్, ఫిర్ జీనే కీ తమన్నా హై, లాడూ 2, జిజీ మా, కర్ణ్ సంగిని, విక్రమ్ బేతాల్ కీ రహస్య గాథ, కైసా హై యే రిష్తా అజంనా వంటి సీరియల్స్ చేసింది. ఇంపేషెంట్ వివేక్, కాల్ ఫర్ ఫన్, యోక్, జోహ్రి అనే సినిమాల్లోనూ నటించింది.చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు -
హీరోయిన్ గా 'గుప్పెడంత మనసు' జగతి.. గ్లింప్స్ రిలీజ్
తెలుగులో 2020-24 మధ్య 'గుప్పెడంత మనసు' అనే సీరియల్ ప్రసారమైంది గుర్తుందా? ఇందులో జగతి మేడమ్ గా నటించి, ఆకట్టుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈమె చేసిన తెలుగు సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు) గతంలో కన్నడలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఒకటి రెండు మూవీస్ తెలుగులోనే చేస్తోంది. అందులో ఒకటే కిల్లర్. తాజాగా ఈ చిత్ర టీజర్ నే విడుదల చేశారు.వైమానిక శాస్త్రం అని కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. ఇందులో జ్యోతి రాయ్ గ్లామరస్ గా కనిపించింది. అదే టైంలో రోబో తరహా పాత్ర కూడా చేయడం విశేషం. త్వరలో రిలీజ్ సహా ఇతర వివరాలు వెల్లడిస్తారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్.. పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ స్టన్నింగ్ యాక్షన్ చేసింది. మరి ఈ సినిమాకు ముందు మొదలైందో, తర్వాత మొదలైందో గానీ కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించిన పూర్వజ్ తో జ్యోతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరు చివర పూర్వజ్ అని మార్పు చేసుకుంది. గతంలో ఈమెకు పెళ్లవగా ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా హీరోయిన్ కావడం అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ నానితో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగ తిరిగేశారు. వరస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ చాలా కష్టపడ్డారు. ఫలితం ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) హిట్ 3 సినిమాలో హీరోగా చేసిన నానినే.. నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడికి చెందిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడ్జెట్ గురించి రకరకాల నంబర్స్ వినిపించాయి. రూ.60 కోట్లు అని రూ.80 కోట్లు అని కూడా అన్నారు. దీని గురించే ఓ ఇంటర్వ్యూలో నానిని అడగ్గా.. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టాననేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.నిర్మాణ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ టీమ్ ఉందని, వాళ్లు అడిగిన దానికోసం ఖర్చు పెట్టడం తప్పితే బడ్జెట్ గురించి తనకు అస్సలు తెలియదని నాని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'హిట్' ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. ఈసారి విపరీతమైన యాక్షన్ జోడించారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తెలుగులో హిట్ 3 తప్పితే వేరే సినిమాలేం రిలీజ్ కావట్లేదు. మరోవైపు తమిళంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి?హిట్ 3 విడుదలకు సిద్ధం చేసిన నాని.. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది అయిన తర్వాత సుజీత్ తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) #Nani Said I’m the PRODUCER Of #HIT3 Film But I Don’t Know the BUDGET of the Film. pic.twitter.com/GfhSLToShQ— GetsCinema (@GetsCinema) April 30, 2025 -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మిగతా భాషలతో పాటు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో టైమ్ కుదిరినప్పుడల్లా ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండు తెలుగు మూవీస్.. సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. వేటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?గతేడాది అక్టోబరు చివరి వారంలో 'సముద్రుడు' అనే సినిమా రిలీజైంది. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు.. మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు లాంటి అంశాలతో ఈ మూవీ తీశారు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) అలానే 2022లో రిలీజైన 'రుద్రవీణ'.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇదో రొటీన్ యాక్షన్ మూవీ. ఊరిని ఇబ్బంది పెట్టే రౌడీ. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. చివరకు విలన్ ని హీరో ఎలా చంపాడనేదే స్టోరీ.పై రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇవి ఇప్పుడు రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. గత కొన్ని వారాలుగా ఈ ఓటీటీ సంస్థ ఇలానే పలు తెలుగు చిన్న చిత్రాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆసక్తి ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
కేజీఎఫ్ 3లోకి అజిత్ ఎంట్రీ
-
సచిన్ కూతురితో రిలేషన్‌పై గిల్ క్లారిటీ
-
పెళ్లి పత్రిక పై మహేష్ బాబు ఫోటో..!
-
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్.. కొన్నిరోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి మార్క్ కి గాయాలు కాగా కొన్నాళ్ల పాటు అక్కడే చికిత్స అందించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడిందనే అందరూ అనుకున్నారు. కానీ మరో ట్రీట్ మెంట్ కూడా జరుగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్) పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటపెట్టారు.అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అయితే తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నాడని, రాత్రుళ్ల నిద్రలో నుంచి భయపడి లేస్తున్నాడని చెప్పారు.(ఇదీ చదవండి: నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో) బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయినట్లు తన కొడుకు మార్క్ శంకర్ కి కలలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి రెండింటికి పనిచేస్తున్నారు. అవే హరిహర వీరమల్లు, ఓజీ. వీటిలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో దానిబట్టి రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..) -
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
ప్రెగ్నెన్సీతో హీరోయిన్.. కానీ భర్తతో కలిసి ఫారెన్ టూర్ (ఫొటోలు)
-
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?) -
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ అవడంతో.. గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-అట్లీ సినిమాను నిర్మించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో-దర్శకుడు చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.అట్లీ సినిమా అంటే హీరోకు ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కనబెడితే హీరోయిన్లు ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇక బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా ముగ్గురు భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు.దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్.. షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశముంది. మొన్నటివరకు సమంత, దిశా పటానీ పేర్లు కూడా వినిపించాయి కానీ బన్నీ-అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!) -
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. స్వతహాగా తమిళం అయినప్పటికీ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) షారూఖ్ ఖాన్ జవాన్‌లో విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న సేతుపతి.. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్, తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలానే 'కాక్కా ముట్టై' ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సేతుపతి రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా హీరోగా హిట్ లేక డీలా పడిపోయిన విజయ్ సేతుపతికి హిట్ ఇచ్చిన సినిమా మహారాజ. గతేడాది రిలీజైంది. తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం విశేషం. ఇదే సినిమా చైనీష్ లోనూ అనువాదం అయ్యి చైనాలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. కాగా మహారాజా చిత్రానికి సీక్వెల్ చేయాలని విజయ్ సేతుపతి ఆలోచిస్తున్నట్లు, దానికి తగ్గ కథను సిద్ధం చేయమని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మహారాజ 2 మొదలు పెడతారా లేదంటే వాటితో పాటే ప్రారంభించి పూర్తి చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
జూన్‌లో ఫిక్స్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) గురించి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాని 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్ నీల్’.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించింది యూనిట్. అయితే తాజాగా ఆ తేదీకి కాకుండా 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. ‘‘ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మా సినిమా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్లో బాక్సాఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధంకండి. 2026 జూన్ 25న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ మీరు వింటారు. మాస్‌లకే మాస్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజున (మే 20) ప్రత్యేక గ్లింప్స్‌తో వస్తాం’’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్. -
వాటర్‌లో వార్
వెండితెర నీటిమయం కానుంది. ఎందుకంటే నీటిలో వీరోచిత యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. కొందరు నీటి పై... మరి కొందరు నీటి లోపల వాటర్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థులతో ‘వాటర్‌లో వార్’ చేస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.బురదలో ఫైట్ వాటర్‌లో ఫైట్ సీక్వెన్స్‌లను చాలా సినిమాల్లో చేశారు చిరంజీవి. కానీ... తొలిసారిగా కాస్త బురద ఉండే వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను ‘విశ్వంభర’ సినిమా కోసం చేశారాయన. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, ఈ ఫైట్‌ను ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రను చిరంజీవి పోషిస్తున్నారని తెలిసింది.త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ లేదా ఆగస్టులో ‘విశ్వంభర’ విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. పడవలో ఫైట్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్గా పంచమి అనే పాత్రలో నిధీ అగర్వాల్ నటిస్తున్నారు.ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని తెలిసింది. ఈ సీన్ సినిమా ఆరంభంలోనే వస్తుందట. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. పడవల్లో గొడవ పడవ ప్రయాణంలో ప్రత్యర్థులతో గొడవ పడుతున్నారట మహేశ్‌బాబు. ఇది ఏ రేంజ్ గొడవ అనేది థియేటర్స్‌లో చూడాలి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట రాజమౌళి. ఈ చిత్రంలో ప్రధాన తారాగణమైన మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనగా, వీరితో పాటు దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని సమాచారం. ఈ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను ఓ భారీ సెట్లో చిత్రీకరించారట. ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారని భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం.సముద్రంలో దేవర తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి దేవరగా, కొడుకు వరగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మెప్పించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘దేవర’ తొలి భాగంలో సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లను చూశాం. అలాగే ‘దేవర 2’లోనూ ఆ తరహా వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. తొలి భాగంలో సముద్రం అడుగు భాగాన కొన్ని అస్థిపంజరాలు ఉన్నట్లుగా చూపించారు.వీటి వెనక దాగి ఉన్న యాక్షన్ ఎపిసోడ్ ‘దేవర 2’లో ఉంటుందని తెలుస్తోంది. ఇంకా రెండో భాగం షూటింగ్ ఆరంభం కాలేదు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ‘దేవర’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాతలే ‘దేవర 2’ని కూడా నిర్మిస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘దేవర 2’ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది. సాహసాల సూపర్ యోధ సూపర్ యోధగా సాహసాలు చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సాహసాల విజువల్స్ ఆగస్టులో థియేటర్స్‌లో చూడొచ్చు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని భోగట్టా. యాక్షన్‌తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు చెందిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో జరిగింది.ఆ షెడ్యూల్లో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా తీశారని సమాచారం. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. ఇలా వాటర్‌లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఘటనకాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు. -
'అలా చేయకపోతే అస్సలు జీవితమే కాదు'.. గొప్ప మనసు చాటుకున్న బిగ్‌బాస్ బ్యూటీ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.అయితే ఇటీవల తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
'కశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'.. ట్రైలర్ ఈవెంట్లో సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్‌పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.కశ్మీర్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్‌గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది. -
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
బీచ్ ఒడ్డున అందాలన్నీ ఆరబోస్తున్న మలైకా అరోరాకళ్లజోడుతో స్టైలిష్ పోజులిస్తున్న దుషారా విజయన్డ్యాన్స్ డే వీడియోలతో మౌనీ రాయ్, ఆదితీ రావువయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా కసాండ్రాచీరలో అలా నడిచొస్తూ మాయ చేసేస్తున్న అనసూయపాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న ప్రణీతకొండల్లో విహార యాత్రకు వెళ్లిన యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) 1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు) -
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025 -
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఒకడు బెల్లంకొండ శ్రీనివాస్. పదేళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. చివరగా 2023లో ఛత్రపతి చిత్రాని హిందీలో రీమేక్ చేసి ఘోరంగా ఫెయిలయ్యాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా) దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఒకేసారి నాలుగు సినిమాల్ని రెడీ చేస్తున్నాడు. అందులో 'భైరవం' త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'కిష్కిందపురి' అని మరో మూవీ ప్రకటించాడు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.పాడుబడ్డ పెద్ద భవంతి, అందులో హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ 'కిష్కిందపురి' తీసినట్లు అనిపిస్తుంది. గతంలో బెల్లంకొండ హీరోతో 'రాక్షసుడు' సినిమాలో నటించిన అనుపమ.. ఇందులో హీరోయిన్.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తొలిసారి హారర్ జానర్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడు. ఈ వర్షాకాలంలోనే మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. మరి ఈసారైనా బెల్లంకొండ హిట్ కొడతాడా?ఈ గ్లింప్స్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివర్లో హీరో... అహం మృత్యు అని చెప్పిన డైలాగ్, ఆ టైంలో కళ్లు దెయ్యం కళ్లలా ఉండటం చూస్తుంటే ఈసారి ప్రేక్షకుల్ని భయపెడతారనిపిస్తోంది. గతంలో అనుపమతో థ్రిల్లర్ మూవీ చేయగా.. ఇప్పుడు హారర్ చేశాడు శ్రీనివాస్.(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్) -
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కానీ SSMB 29 గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేద. మహేశ్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు.కొన్నిరోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేశ్.. ఇటలీ వెళ్లాడు. కానీ తన ఫొటో గానీ, లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్ పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్లజోడు ఉండటం వల్ల మహేశ్ లుక్ సరిగా రివీల్ కాలేదు.(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్) మరి తాజాగా ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో, పొడవైన జుత్తుతో మహేశ్ కనిపించాడు. గతంలో మహేశ్ హెయిర్ పెంచాడు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.గతంలో ఒడిశాలో షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్ క్లిప్ ఒకటి లీకైంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. మరోవైపు ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర చేస్తోంది. వీళ్ల లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
మరో ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. కేవలం వారి కోసమే!
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. గతేడాది మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. #OmBheemBush, streaming in Telugu, Tamil and Malayalam on Simply South from May 2 worldwide, excluding India., pic.twitter.com/km7om16Zlf— Simply South (@SimplySouthApp) April 29, 2025 -
రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్‌కు ప్రశ్న.. నెటిజన్‌కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025 -
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'(ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం) 'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
యువ నటి ఇంట్లో భారీ దొంగతనం
ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!) ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్.. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అభిమానులకు ఎన్టీఆర్ శుభవార్త చెప్పారు. (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. వచ్చే సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద ఫుల్ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్ఎక్స్ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్‌గా ప్లాన్ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తారక్ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్‌తో షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c— Jr NTR (@tarak9999) April 29, 2025 -
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025 -
కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!
తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రెయిట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగా రావట్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూయర్లదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.(ఇదీ చదవండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి) ఎందుకంటే కంటెంట్ సరిగా ఉండి ఎంటర్ టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గతవారం 'సారంగపాణి' సినిమాతో పాటు జింఖానా, తుడురమ్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు.అదే టైంలో 'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన 'జింఖానా'కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి రూ.2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే 'జింఖానా'పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువ పెట్టి ఉండరుగా!జింఖానా విషయానికొస్తే.. అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్లు.. ఇంటర్ ఫెయిలవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీటు సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగోలా గెలిచేస్తారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
బన్నీ- అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్‌గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. -
హొయలొలికించే అందాలతో ఓదెల బ్యూటీ హెబ్బా పటేల్ (ఫోటోలు)
-
'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి
ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారతీయ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టాప్‌లో ఉంటుంది. అయితే, సీజన్- 3లో నటించిన నటుడు రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సాం గర్భంగ అటవీప్రాంతంలోని జలపాతం వద్దకు రోహిత్ బస్ఫోర్ వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ హత్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కుమారుడితో గొడవ పడ్డారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్‌ను ట్రిప్‌కు వెళ్దాం అంటూ జిమ్ యజమాని అమర్దీప్ ఆహ్వానం మేరకే వెళ్లాడని వారు పోలీసులకు తెలిపారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే తమ కుమారుడిని హత్య చేశారని వారు చెబుతున్నారు. గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపైనే కాకుండా తల, ముఖం ఇతర భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ బస్ఫోర్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ త్వరలో విడుదల కానుంది. -
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్(Sharwanand) కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi) -
సరికొత్తగా...
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనున్నారు. లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా 1960ల కాలం నాటి నేపథ్యంతో ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఉంటుంది.కాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్రకు హీరోయిన్ డింపుల్ హయతిని ఎంపిక చేసినట్లు సోమవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ఆమె సరికొత్తపాత్రలో కనిపిస్తారని, కథలో చాలా ముఖ్యమైనపాత్రను డింపుల్ చేయనున్నారని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
బాహుబలి రిటర్న్స్
వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి.ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నాం.ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ రీ–రిలీజ్ ఉంటుంది. కొన్ని సర్‌ప్రైజ్‌లూ ఉంటాయి. బాహుబలి రిటర్న్స్’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రీ రిలీజ్ విషయాన్ని మేకర్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రీ–రిలీజ్ విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు మేకర్స్. -
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) 1952లో పుట్టిన ఈయన.. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా మారారు. మోహన్ లాల్ తో 'వానప్రస్థం' సినిమా ఈయనకు చాలా పేరు తీసుకొచ్చింది. అలానే పిరవి మూవీతో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. 2011లో ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది.ఈయన తీసిన సినిమాల్లో పిరవి, స్వాహం, వానప్రస్థం, నిషాద్, కుట్టి శృంఖు, స్వప్నం.. ప్రేక్షకుల నుంచి అద్బుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి ఈయన ఇప్పుడు మృతి చెందడంతో సినీ ప్రముఖులు షాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) -
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండడు. సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు. కానీ రీసెంట్ గా ఆదివారం ఇలా గడిచింది అని ఓ రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాతే అకస్మాత్తుగా ఓ రూమర్ బయటకొచ్చింది.గతంలో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబరులో తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) అయితే సడన్ గా శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు ఈ పుకారు ఎవరు ఎందుకు సృష్టించారో గానీ సడన్ గా అంతటా వైరల్ అవుతోంది.శోభిత విషయానికొస్తే గతేడాది మంకీ మ్యాన్, లవ్ సితార అనే సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ గానీ వెబ్ సిరీసులు గానీ చేయట్లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవేమో!(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
మ్యూజికల్ డ్రామా 'నిలవే' టీజర్ విడుదల
అందరూ కొత్త వాళ్లతో తీసిన తెలుగు సినిమా 'నిలవే'. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించారు. అతి పెద్ద మ్యూజికల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అర్జున్ (సౌమిత్ రావు) ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతుంటాడు. అలాంటి అతని జీవితంలోకి శ్రేయాసి ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరం వెళ్లాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) -
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
శుభం మూవీలో మాతాజీగా సమంత.. ఫన్నీ లుక్ప్రియుడితో ట్రిప్ వేసిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిబార్ లో పార్టీ చేసుకుంటున్న హాట్ బ్యూటీ సుప్రీతకల్కి బ్యూటీ అన్నా బెన్ క్యూట్ నెస్ చూడతరమాఇటలీలో తెగ తిరిగేస్తున్న లైగర్ పాప అనన్య పాండేట్రెండింగ్ కనిమా పాటకు మంచు లక్ష్మీ స్టెప్పులుమేకప్ లేని లుక్ లో హీరోయిన్ సంయుక్త View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
-
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ అవార్డులని ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం.. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.తెలుగు హీరో బాలకృష్ణ(Nandamuri Balakrishna), తమిళ హీరో అజిత్.. పద్మ భూషణ్ (Padma Bhushan 2025) అవార్డులని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. బాలయ్య.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించారు. అజిత్(Ajith Kumar).. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) బాలకృష్ణ ప్రస్థానం చూస్తే.. తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. రీసెంట్ టైంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) Nandamuri Balakrishna Receives Prestigious Padma Bhushan from President Droupadi Murmu | TFPC #nandamuribalakrishna #balayya #padmabhushan #padmaawards pic.twitter.com/M63oQSS4Lj— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025Padma Awards 2025: Ajith Kumar's Iconic Moment with President Murmu#ajith #PadmaAwards #PadmabhushanAjithKumar pic.twitter.com/miV0K0x3Px— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025 -
రాజమౌళి చేతుల మీదుగా 'ముత్తయ్య' ట్రైలర్ రిలీజ్
'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ముత్తయ్య'. ఇదివరకే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు కూడా దక్కించుకుంది. ఇప్పుడు దీన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ట్రైలర్ ని రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధాకర్ రెడ్డితో పాటు అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఓ తెలుగు ఓటీటీ యాప్ లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తన ఊరు చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో మంచి ప్రతిభ ఉంది. కుటుంబం, స్నేహితుల నుంచి సరైన ప్రోత్సాహం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ముత్తయ్య నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే
శ్రీ విష్ణు అనగానే మంచి హీరో, ప్రయోగాత్మక, ఫన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తుంటాడు కదా అనే పేరుంది. అదే టైంలో సోషల్ మీడియాలో కుర్రాళ్లని అడిగితే శ్రీ విష్ణు.. ఎంత బాగా సెన్సార్ బోర్డ్ నుంచి తప్పించుకుంటాడనేది చెబుతారు. ఇప్పుడు దాని గురించే మీడియా అడగ్గా.. శ్రీ విష్ణు ఆసక్తికర సమాధానమిచ్చాడు.శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. గతంలో ఇతడు నటించిన బ్రోచెవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాల్లో కొన్ని బూతులా అనిపించే డైలాగ్స్ ఉన్నాయి. కానీ వాటిని శ్రీ విష్ణు చెప్పిన విధానం వల్ల అవి అలాంటివి అని సందేహం రాదు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) తాజాగా రిలీజైన '#సింగిల్' ట్రైలర్ చివర్లోనూ ఓ డైలాగ్ ఉంటుంది. అది కూడా బూతులానే అనిపిస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఈ తరహా డైలాగ్స్ గురించి శ్రీ విష్ణుని మీడియా అడగ్గా.. నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్, లేదంటే సంస్కృతం డైలాగ్స్ చెప్పినా డబుల్ మీనింగ్ అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.తాను మాట్లాడేవి డబుల్ మీనింగ్ బూతులు కాదని, అది సంస్కృతం అని, మీకు ఉన్న ఫలంగా సంస్కృతం నేర్పించలేనని తనదైన శైలిలో కామెడీగా శ్రీ విష్ణు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
కోలీవుడ్ హీరో అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అజిత్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆపై కొద్దిరోజుల క్రితమే అజిత్, అతని భార్య షాలిని తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో నటి హీరా రాజగోపాల్ కూడా తన ప్రేమకథతో పాటు విడిపోవడం గురించి చెబుతూనే తన మాజీ ప్రియుడిపై ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్‌గా ఉండేది. పలు గొడవల వల్ల బ్రేకప్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అజిత్ పేరును ఆమె ప్రస్తావించకుండానే ఒక నటుడు అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేశారు.హీరా రాజగోపాల్ తన బ్లాగులో ఇలా చెప్పుకొచ్చారు.. 'ఒక నటుడు నాకు ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఒకసారి తన వెన్నెముకకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నానని నాకు చెప్పాడు.. ఆ సమయంలో నేను అతనితోనే ఉండి ఎన్నో సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా అబద్ధం చెప్పాడని తర్వాత తెలుసుకున్నాను.' అని హీరా రాసుకొచ్చారు. ఆపై వివాహం గురించి కూడా ఆ నటుడు తనతో చెప్పిన మాటలను ఇలా చెప్పంది 'నేను పనిమనిషిలా కనిపించే స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. అప్పుడు ఎవరూ ఆమెను చూడరు. కానీ, నేను మాత్రం నాకు నచ్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొంటాను' అని హీరాతో ఆ నటుడు చెప్పినట్లు తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్ నడపిన ప్రేమాయణం భారీగా వైరల్ అయింది. కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కానీ, అజిత్‌నే తనను వదిలించుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. కాగా కొన్నేళ్లకు అజిత్.. నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. Actress #Heera has made serious allegations against #AjithKumar, accusing him of betrayal, character assassination and orchestrating violence through fans. She also claimed he staged medical issues for sympathy and bribed media to control narratives. pic.twitter.com/4WBPVNEPTn— Mʀꜱ.Kᴇᴇʀᴛʜɪ (@MrsKeerthi85) April 28, 2025 -
కొంచెం మస్తీ.. శారీలో మీనాక్షి చౌదరీ (ఫోటోలు)
-
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే (ఫొటోలు)
-
శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా
తెలుగు హీరోల్లో శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ అలరిస్తుంటాడు. గతేడాది 'స్వాగ్' అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది జనాలకు నచ్చలేదు. దీంతో తనకు అచ్చొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'సింగిల్'.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) మే 9న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. సింగిల్ గా ఉండే శ్రీ విష్ణు జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. తర్వాత వాళ్లతో ప్రేమ, రొమాన్స్, గొడవలు.. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ బాగుంది. జోకులు బాగానే పేలాయి. చూస్తుంటే శ్రీ విష్ణు మరో హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. రీసెంట్ గా వైరల్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఈ సినిమాలోనూ నటించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించగా.. కార్తీక్ రాజ్ దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?) -
ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?
ఇప్పుడంటే కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సినిమాలు-సిరీస్ లని అని తెగ చూసేశారు. ఆ టైంలో కొన్ని మూవీస్, సిరీసులు.. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటే 'పంచాయత్'. ఇప్పుడు దీన్ని తీసిన మేకర్స్ నుంచి మరో సిరీస్ రాబోతుంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకొంటే.. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు, మారుమూల పల్లెటూరికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఇక్కడ వాతావరణం, మనుషులు, పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే కథ. సున్నితమైన హాస్యం, పల్లె వాతావరణంలో తీసిన ఈ సిరీస్ 2020లో రిలీజై సూపర్ హిట్ అయింది. తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు.. 'గ్రామ చికిత్సాలయ' అనే సిరీస్ ప్రకటించారు. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ వెల్లడించారు. ఓ పల్లెటూరిలో చిన్న హాస్పిటల్, అందులో ఉండే డాక్టర్.. దీని బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తుంది. ఇందులోనూ ఫన్ తగ్గదని తెలుస్తోంది.అయితే పంచాయత్ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. దీన్ని తెలుగులో 'సివరపల్లి' పేరుతోనూ రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు గ్రామ చికిత్సాలయ సిరీస్ తో వస్తున్నారు. మరి ఈసారి కూడా కంటెంట్ తో మ్యాజిక్ చేసి హిట్ కొడతారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) 📢 BHATKANDI jaane ke liye taiyaar ho jaiye 📢#GramChikitsalayOnPrime, New Series, May 9 pic.twitter.com/7L7TeBFoC5— prime video IN (@PrimeVideoIN) April 28, 2025 -
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్‌లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్‌నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్‌గా కోలీవుడ్‌లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
అమాయకపు అమ్మ పాత్రలు, కామెడీ రోల్స్‌తో అందరికీ చేరువైంది నటి ఊర్వశి (Urvashi). చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్గా, అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. దక్షిణాదిలో వందలాది సినిమాలు చేసిన ఈమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. త్వరలోనే కూతురు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని ఇటీవలే వెల్లడించింది.నటిని మాత్రమేఅయితే అంతకన్నా ముందు ఆమె భర్త శివప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎల్. జగదాంబ 7th క్లాస్ బి' అనే సినిమా చేశాడు. ఊర్వశి లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుంది? తాజాగా ఈ సినిమా విషయాలను ఊర్వశి పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెట్స్‌లో అడుగుపెట్టాక నేను నటిని మాత్రమే! దర్శకుడు నా భర్తే కదా అని రిలాక్స్ అయిపోను. కెమెరా ముందు ఆయన చెప్పినట్లు నటించడమే నా పని.నటి ఊర్వశి, కూతురు తేజ లక్ష్మినా పరిస్థితి కూతురికి రాకూడదుఅయితే ఈ సినిమాల వల్ల నేను చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నాను. ముందు తన చదువు పూర్తి చేయమన్నాను. మంచి ఉద్యోగం సంపాదించమన్నాను. ఆ తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఈ ఇండస్ట్రీకి రావాలన్నాను. తన కాళ్లపై తను నిలబడిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించమని చెప్పాను.ఆఫర్స్ వస్తున్నాయ్ఈ మధ్యే నా కూతురి పైచదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు తనకు నచ్చినట్లు చేసుకోనీ.. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తనే స్వయంగా కథ విని, చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు కెరీర్, జీవితం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తను నటనను ఎంచుకుంటే తల్లిగా అది నాకు సంతోషమే అని చెప్పుకొచ్చింది.పర్సనల్ లైఫ్నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను 2000లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు తేజ లక్ష్మి సంతానం. మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడి దగ్గర విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇషాన్ అనే కుమారుడు సంతానం ప్రస్తుతం అతడితోనే కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్‌తో కలిసి ఉంటోంది.చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి -
బ్యాడ్ టైంతో హాట్ బ్యూటీస్
-
తల్లి కొడుకు కూతురు మధ్య నేను మిస్ ఫిట్..
-
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ మరో క్రేజీ సినిమా ప్రారంభం
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో ఒక చిత్రం రానుంది. ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హార్ట్‌టచ్ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ, భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయని తెలిపారు. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి ఈ చిత్రం ద్వారా మంచి కుటుంబ జోనర్ ఉన్న కథను ఎంపిక చేసుకున్నారు.దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఈ బ్యానర్లో తికమక తాండ, కొబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని గుర్తుచేశారు.కొబలి సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన హాట్‌స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యిందన్నారు. అలాంటిది ఈ బ్యానర్లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుందని చెప్పారు. -
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్‌గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.దానివల్లే కోలుకున్నా..త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్‌ను బీర్లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్‌రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్‌గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.సినిమాపరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఐ హోస్టేజ్’ (iHostage)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఉన్నవి రెండుపాత్రలు... వాటికి అనుసంధానంగా అడపా దడపా వచ్చే మరో డజనుపాత్రలు. కథ మొత్తం ఆ రెండుపాత్రల మధ్యే. అయినా ప్రేక్షకుడిని క్షణం కూడా కన్నార్పనీయకుండా కట్టిపడేసే విథంగా థ్రిల్లర్ జోనర్‌తో సినిమా నడపడం డచ్ దర్శకుడైన బాబీ బోర్మెన్స్కి మాత్రమే చెల్లింది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమా. ఆపిల్ స్టోర్... ఐ ఫోన్ నుండి ఐ ప్యాడ్ల వరకు ప్రతి దానికి ఆపిల్ స్టోరే కదా... ఈ సినిమాకి మూలం అదే. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో ఆపిల్ స్టోర్లు ఘనంగా దాదాపు 5 ఫ్లోర్లు పైనే విశాలంగా పెద్ద భవంతిలో ఉంటాయి.అది కూడా నగరానికి మధ్యలోనే ఉంటాయి. కథా పరంగా ఆమ్స్టర్డామ్ నగరం మధ్యలోని ఓ ఆపిల్ స్టోర్ బోలెడంత మంది కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. అప్పుడు ఆ స్టోర్‌లోకి కూరగాయల సంచితో ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి అందరినీ హడలుగొట్టి, ఓ వ్యక్తిని బందీగా తీసుకుంటాడు. అంతేకాదు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించి, తనకు మిలియన్ల డబ్బుతోపాటు అక్కడ నుండి తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫోన్లో చెప్తాడు. ఇక సినిమా మొత్తం దాదాపుగా ఆ ఇద్దరి మధ్యే నడుస్తుంది.సినిమా ఆ ఇద్దరి మీదే నడిచినా మంచి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నారు దర్శకుడు. సినిమా చివర్లో బందీగా తీసుకున్న వ్యక్తితో తను బయటపడగలిగాడా? లేదా? తాను డిమాండ్ చేసిన డబ్బులు అందుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమాని చూసేయండి. ఈ సినిమా ద్వారా మానసికంగా ప్రేక్షకుడికి భయాన్ని పూర్తిగా పరిచయం చేశారు దర్శకుడు.అది కూడా చిన్నపాటి ఘర్షణ లేకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా... మరీ ముఖ్యంగా ఎటువంటి పేలుళ్లు జరగకుండా సైకలాజికల్‌గా సినిమాని తీసుకువెళ్లారు. సినిమా చూసిన తరువాత మాత్రం వామ్మో... ఆపిల్ స్టోరా ఇంక వెళ్లొద్దు బాబు అని కనీసం పది మందిలో సగమైనా అనుకుంటారు. మరి... మీరు కూడా ఆలస్యం కాకుండా ఈ సినిమా చూసేయండి. అయితే ఆపిల్ స్టోర్‌కి మాత్రం వెళ్లడం మానకండి. – హరికృష్ణ ఇంటూరు -
ప్యాషన్‌తో నిర్మించిన పేషన్ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్ కమ్ముల
‘‘కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ ‘పేషన్’ సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సుధీష్, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేషన్’. నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – ‘‘ఆనంద్’ సినిమా నుంచే నాకు అరవింద్ జాషువా పరిచయం. తనలో మంచి స్టోరీ టెల్లింగ్ క్రియేటర్ ఉన్నాడని అప్పుడే అనిపించింది. తను రాసిన పేషన్ నవలను చదివా. చాలా బాగుంది. ఇక అరవింద్ రూపొందించిన ఈ ‘పేషన్’ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. కొత్త నిర్మాతలు ప్యాషన్‌తో ఈ మూవీ తీశారు’’ అన్నారు.‘‘శేఖర్ కమ్ములగారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ‘పేషన్’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ‘‘శేఖర్ కమ్ములగారికి నేను ఏకలవ్య శిష్ణుడ్ని. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యే కథతో ‘పేషన్’ తీశాం. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు అరవింద్ జాషువా. -
ఊరంతా తెలిసిన సీక్రెట్...
హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలోనూ నటించారు సమంత. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘ఆ సీరియల్ టీవీలో వస్తున్నంత సేపు నా పెళ్ళాం చాలా తేడాగా ప్రవర్తించింది రా.., ఇంత జరుగుతుంటే ఊళ్లో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా... అసలు ఒరేయ్... ఊరంతా తెలిసిన సీక్రెట్ రా ఇది... మొత్తం మగవాళ్ళ పరువంతా డేంజర్లో పడింది’ అనే సంభాషణలు ‘శుభం’ ట్రైలర్లో ఉన్నాయి. ఓ ఊర్లో మహిళలందరూ టీవీలో ఓ సీరియల్ చూసి, వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అప్పుడు ఓ మాతాజీలా సమంత వస్తారు. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అనే కథాంశంతో ‘శుభం’ సినిమా రూపొందిందని విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. -
కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి
‘‘కోర్ట్’ తర్వాత ‘సారంగపాణి జాతకం’ చిత్రం నాకు ఓ వరంలా దొరికింది. ఇలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. శనివారం ‘సారంగపాణి జాతకం’ సినిమా సెలబ్రిటీ షో వేశాం. సెలబ్రిటీలు, ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు’’ అని ప్రియదర్శి అన్నారు. ప్రియదర్శి, రూపా కొడవయూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అయింది. ఆదివారం జరిగిన ఈ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రియదర్శి నటించాడు. శివలెంక కృష్ణప్రసాద్గారితో నేను ‘సమ్మోహనం, జెంటిల్‌మ్యాన్’ సినిమాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమా చేశాం. ఈ మూడూ ప్రేక్షకులు పది కాలాలపాటు గుర్తుపెట్టుకునే చిత్రాలు’’ అని తెలిపారు.‘‘మేం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ సినిమాను అందరూ చూసి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘దర్శికి మంచి జడ్జ్మెంట్ ఉంది. అప్పట్లో ఆమిర్ ఖాన్‌గారికి ఇలాంటి జడ్జ్మెంట్ ఉండేది. ఇంద్రగంటిగారితో పనిచేస్తే చాలు... రిజల్ట్‌తో అవసరం లేదు’’ అని చెప్పారు ‘వెన్నెల’ కిశోర్. ‘‘దర్శి ఆల్‌రౌండర్ నటుడు’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ఇంకా నటుడు వైవా హర్ష, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు. -
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత రీ–రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మే 9న ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. అది కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతినివ్వబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా. -
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
గత కొన్నిరోజులుగా 'పాడుతా తీయగా' షో వివాదం నడుస్తోంది. ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు సింగర్స్ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. గీతాకృష్ణ అనే దర్శకుడు కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ని ఇక ఆపమని చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ వీడియో రిలీజ్ చేశారు.'గీతాకృష్ణ.. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేశారు. కె.విశ్వనాథ్ దగ్గర శిష్యరికం కూడా చేశారు.కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువవుతోంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మనందరం ఓ ఫ్యామిలీ. ఇక్కడ తప్పేం జరిగిపోలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది'(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) 'కానీ ఇలా వ్యక్తిగతంగా మనుషులపై కామెంట్స్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న అవాంతరాలు వస్తుంటాయి. నేను చేసిన వాటిలోనూ వచ్చాయి. అక్కడితో మర్చిపోతారు. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి. నాకు బాధేస్తోంది''ప్లీజ్.. ఇక ఈ విషయంలో ఏదీ మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందోనని నాకు భయమేస్తోంది' అని కోటి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
కొన్నిసార్లు ఒక్క సినిమాతో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా కొన్నిరోజుల క్రితం రిలీజైన 'డ్రాగన్'తో కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. (ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) అసోంకు చెందిన కాయదు లోహర్.. 'అల్లూరి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలో ప్రయత్నించగా.. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్'లో అవకాశమొచ్చింది. ఇదే మూవీతో కాయదుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.ఈ క్రమంలోనే తెలుగులో విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో తీస్తున్న 'ఫంకీ'లో కాయదు హీరోయిన్ గా సెలెక్ట్ కాగా.. ఇప్పుడు తమిళ హీరో శింబు సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీస్ కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో కాయదు లైఫ్ సెట్ అయిపోయినట్లే!(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official) -
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫన్నీ పోజులుసితారకు అక్కలా అనిపిస్తున్న తల్లి నమ్రతపట్టుచీరలో ముచ్చటైన నవ్వుతో మీనాక్షి చౌదరిబంధువుల పాపతో శ్రీలీల ముద్దు మురిపెంచీరలో తెగ సిగ్గుపడిపోతున్న పూజా హెగ్డేజలకన్య తరహా డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల జాతరటామ్ బాయ్ లా మారిపోయిన రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by HT City Showstoppers (@htcityshowstoppers) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
బాహుబలి 2 సినిమా చూశారా? అందులో కుంతల రాజ్యానికి అనుష్క అలియాస్ దేవసేన యువరాణిగా ఉంటుంది. ఆమెకు వదినగా చేసిన నటి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. చూస్తే వయసు మళ్లినట్లు కనిపిస్తుంది కానీ ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే. స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?'బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే. కానీ కాస్త పెద్దదానిలా చూపించారు. దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు. అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను. చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు'(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను. ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు. సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే.. పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు' అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె.. బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర చేస్తోంది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
నాగచైతన్య-సమంత బంధం ముగిసిన అధ్యయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతూ పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు.సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య.. గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉండే చైతూ చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు. ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది. తాజాగా చైతన్య.. ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత- పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్.. చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. సామ్ పెంచుకున్న కుక్క.. శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.. 'శుభం' ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
G 20 Review: అమెరికన్ ప్రెసిడెంటా.. మజాకా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం జీ 20 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా దర్శకుని ఊహ అనేది ప్రేక్షకుల ఊహకందకపోతే అప్పుడు ఆ సినిమా పండుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ దర్శకుల ఆలోచనలే వేరు. ఏది అసాధ్యమో, ఏదైతే జరగదు అని ప్రేక్షకులు అనుకుంటారో దాన్నే సినిమాలో చూపిస్తుంటారు హాలీవుడ్ డైరెక్టర్స్. హాలీవుడ్ దర్శకుడు పాట్రిసియా రీగెన్ తీసిన ‘జీ 20’ సినిమా ఆ కోవలోకి చెందినదే. ఒక్కసారి ఊహించండి... ప్రపంచంలోనే ఉత్తమోత్తమ సురక్షితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అనే విషయం మనకు తెలుసు. మరి... ఆ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబంతో పాటు బందీలుగా తీసుకుని ప్రపంచాన్ని శాసిద్దా మనకున్న విలన్‌ను అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఎదుర్కొన్నారో ఈ ‘జీ 20’లో చూడవచ్చు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్‌ను, అతని కుటుంబాన్ని బందీలుగా చేసుకోవడం కూడా చిన్న వేదిక మీదైతే కాదు, దాదాపు అరడజను దేశాధినేతలతో పాటు జీ 20 శిఖరాగ్ర సమావేశంలో హై సెక్యూరిటీ నడుమ ఉండగా అమెరికన్ ప్రెసిడెంట్‌తో పాటు అక్కడున్న మిగతా దేశాధినేతలందరినీ బందీలుగా చేసుకుంటాడు విలన్. ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. బందీలుగా ఉన్న తన కుటుంబాన్ని, ఇతర దేశాధినేతలను కూడా విలన్‌తో పోరాడి విడిపించే బాధ్యత ప్రెసిడెంట్ మీదే పెట్టాడు సదరు సినిమా డైరెక్టర్. ‘జీ 20’ సినిమా మంచి ఉత్కంఠతతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అమెరికన్ ప్రెసిడెంట్ కుంగ్ ఫూ ఫైటర్, గన్ షూటర్, అలాగే హెలికాప్టర్ రైడర్ కూడా. ఇక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సదరు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ సినిమాలో ఓ లేడీ. ఈ పాత్రలో డేనియల్ సట్టన్ సూపర్‌గా నటించారు. పైన చెప్పుకున్నట్టు ఓ లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ తన కుటుంబంతో పాటు ఇతర దేశాధినేతలను సూపర్ ఫైటింగ్ స్కిల్స్‌తో సేవ్ చేయడమనేది మామూలు కాన్సె΄్టా... ఆలోచించండి. దటీజ్ ‘జీ 20’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. అయితే మీ పిల్లలను ఈ సినిమాకి దూరంగా ఉంచి మీరు మాత్రం వాచ్ ఇట్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈమె.. క్రమంగా సినిమాలతో హిట్ కొడుతూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్, లవ్ బ్రేకప్స్ గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) 'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి''బ్రేకప్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్? అని అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. నా వరకు వస్తే నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతున్నానని అర్థం. ఇప్పటికీ నాకు సరైన ప్రేమ దొరకలేదు' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్) 'కెరీర్ ప్రారంభంలో తెలుగులో నా రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. నన్ను చాలా మాటలు అన్నారు. కానీ హీరో సిద్ధార్థ్ ని మాత్రం ఏం అనలేదు. నాకు గబ్బర్ సింగ్ మూవీతో సక్సెస్ వచ్చింది. ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ నా మనసుకు నచ్చిన మూవీస్ చేస్తున్నానని వాళ్లకు తెలీదు' అని శ్రుతి తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఒకరిద్దరు హీరోలతో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
విచారణకు రాలేను.. ఈడీకి మహేశ్‌బాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు.ఎందుకీ విచారణ?సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. ప్రచారకర్తగా మహేశ్ ఉన్నందువల్లే..సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో (#SSMB29) బిజీగా ఉండటంతో మహేశ్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు.చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు -
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్సో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్‌లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అమ్మాయి అనికా సురేంద్రన్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలోనూ వరస చిత్రాలు చేస్తోంది. తాజాగా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించింది.సరే అసలు విషయానికొస్తే ఈమెకు గత రెండు నెలల నుంచి ఓ చిన్న సమస్య ఇబ్బంది పెడుతుందట. ఇన్ స్టాలో తన రీల్స్ కి మ్యూజిక్ జోడిద్దామంటే కుదరట్లేదని చెబుతూ ఫన్నీగా పెట్టిన ఫేస్ ఫొటోని పోస్ట్ చేసింది. తన మిగతా అకౌంట్లకు ఈ ఫీచర్ వర్క్ అవుతుందని కానీ తన అఫీషియల్ అకౌంట్ కి మాత్రం రెండు నెలలుగా అవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు)సరేలే అని బిజినెస్ అకౌంట్ నుంచి క్రియేటర్ అకౌంట్ గా మార్చినప్పటికీ.. మ్యూజిక్ జోడించే ఫీచర్ మాత్రం కావట్లేదని అనికా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు ఎవరైనా కాస్త చేయండని రిక్వెస్ట్ చేసింది. 2010లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన అనిక.. తెలుగులోనూ నాగార్జున 'ద ఘోస్ట్'లో చైల్డ్ ఆర్టిస్టుగా, 'బుట్టబొమ్మ'లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓ తమిళ మూవీలో నటిస్తోంది.(ఇదీ చదవండి: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్) -
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.15 సినిమాల్లో ఒక్కటే హిట్టుకేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్ రిపోర్ట్ (Mollywood: March Box Office Report)ను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2 : ఎంపురాన్ ఒక్కటే సూపర్ హిట్ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.> రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.> రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.కాపాడింది ఈ ఒక్కటే..మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి