
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత రీ–రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మే 9న ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది.
అది కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతినివ్వబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా.