చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ సినిమా రీరిలీజ్‌.. ఇక థియేటర్లో పూనకాలే! | Chiranjeevi's Shankar Dada MBBS Movie Re-Release On 4th November 2023 | Sakshi
Sakshi News home page

Chiranjeevi: రీరిలీజ్‌కు రెడీ అవుతున్న శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. విడుదల ఎప్పుడంటే?

Published Sun, Oct 15 2023 6:41 PM | Last Updated on Mon, Oct 16 2023 8:38 AM

Chiranjeevi Shankar Dada MBBS Movie Re Release on 4th November 2023 - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. 2004లో వచ్చిన ఈ చిత్రం అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేమికులు సైతం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు ఫిదా అయ్యారు.

అసలే ఇప్పుడు టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అలనాటి కల్ట్ క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్దమైంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పెద్ద అసెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లో పాటలు వస్తే.. జనాలు పూనకంతో ఊగిపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి అప్పటి వింటేజ్ చిరుని చూపించేందుకు, ఆ గ్రేస్, మాస్‌ ఎరాలోకి తీసుకెళ్లేందుకు శంకర్ దాదా మళ్లీ వస్తున్నాడు.

చదవండి: మ్యాచ్‌ చూసేందుకు వెళ్లి గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement