అజిత్‌, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి | Ajith Kumar Meet Chiranjeevi In Vishwambhara Sets | Sakshi
Sakshi News home page

చిరంజీవిని కలుసుకున్న అజిత్‌.. ఫోటోలు వైరల్‌

Published Wed, May 29 2024 2:22 PM | Last Updated on Wed, May 29 2024 2:57 PM

Ajith Kumar Meet Chiranjeevi In Vishwambhara Sets

కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్‌ కూడా ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేసింది.  సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న  ‘విశ్వంభర’ చిత్రాన్ని  వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

హైదరాబాద్‌లో జన్మించిన అజిత్‌
సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోలలో అజిత్‌ కూడా ఒకరు. హైదరాబాద్‌లో జన్మించిన అజిత్‌ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవినే లాంచ్‌ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్‌ పెళ్లి చేసుకున్నాడు.

నా చేతుల మీదుగా లాంచ్‌ అయ్యాడు: చిరంజీవి
అయితే, అజిత్‌ విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్‌కి స్టార్ గెస్ట్‌గా వచ్చి అజిత్‌ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్‌ సినిమా కూడా షూటింగ్‌ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్‌ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్‌ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. 

ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్‌ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్‌తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్  స్టార్‌డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement