Jagadeka Veerudu Athiloka Sundari
-
అజిత్, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన అజిత్సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. హైదరాబాద్‌లో జన్మించిన అజిత్ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు.నా చేతుల మీదుగా లాంచ్ అయ్యాడు: చిరంజీవిఅయితే, అజిత్ విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్‌కి స్టార్ గెస్ట్‌గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్‌తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్ అన్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?
'కల్కి' నిర్మాతలు మరోసారి సీరియస్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా విషయంలో నోటీసు ఇచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో మూవీ విషయంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కోసం. ఇలా సడన్‌గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అసలేంటి గొడవ? ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) అసలు ఏమైంది? టాలీవుడ్లో వైజయంతీ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నిర్మాత అశ్వనీదత్ అప్పట్లో సినిమాలు తీశారు. కానీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మూవీస్ తీయలేకపోయారు. నిర్మాణం ఆపేశారు. దీంతో ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారారు. 'మహానటి', 'సీతారామం' లాంటి హిట్ సినిమాలతో మళ్లీ లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టి 'కల్కి' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'కల్కి' నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేసరికి నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబరు 21న ఈ నోటీసు విషయమై ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కాపీరైట్స్ విషయమై ప్రకటనతో పాటు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) ఆ సినిమాపై పరోక్షంగా? ఈ పోస్ట్ ప్రకారం.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటనతో పాటు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇలా సడన్‌గా ఎందుకు సీరియస్ అయ్యారా అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే చిరు 157వ సినిమాని ఉద్దేశిస్తూనే పరోక్షంగానే ఈ నోటీస్ ఇచ్చారా అనేది డౌట్ కొందరికి వస్తోంది. ఎందుకంటే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ఈ సినిమాకు 'ముల్లోకవీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ మూవీ కాన్సెప్ట్.. హీరో, వేరే లోకానికి వెళ్లడం అక్కడ దేవకన్యలని కలవడం ఇలానే ఉండబోతుందని అంటున్నారు. చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పోలికలు కనిపిస్తున్నాయి కదా! అందుకే 'వైజయంతీ' సంస్థ ఎవరు కాపీ కొడుతున్నారు? లేదా కొట్టాలని ట్రై చేస్తున్నారనేది పేరు చెప్పకుండా నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే
మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజును నేడు (ఆగష్టు 22) జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌కు ఇది పండుగరోజు. కానీ ఈ మధ్యే చిరంజీవి కాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరగడం. అదీ కాకుండా చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగలడం వంటి చేదు గుర్తుల నుంచి వారు బయటపడేందుకు మెగస్టార్ పుట్టినరోజు ఒక టానిక్‌లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన కొత్త సినిమా ప్రకటన కూడా ఉండటంతో వారు మరింత జోష్‌లో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోస్ చిరంజీవినే ఇన్స్‌ఫరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిగిలిన హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం చాలా భిన్నంగా ఉంటుంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ,వాల్తేరు వీరయ్య మినహా మిగిలిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోలేదు... సైరా సినిమాలో ఆయన నటన మెప్పించినా కలెక్షన్స్ పరంగా నష్టాలే తెచ్చిందని చెప్పవచ్చు ఒకరకంగా చిరంజీవి 1990 నాటి సమయంలో తన సినీ కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఎలా మళ్లీ నిలదొక్కుకున్నాడంటే... 1990 దశకంలో ఏం జరిగింది 1990 సమయంలో కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమసింహం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ ఒక సునామిలా భారీ కలెక్షన్స్‌తో ఇండస్ట్రీలో దుమ్మురేపాయి. కానీ 1993లో వచ్చిన 'ముఠామేస్త్రి' తర్వాత చిరంజీవి కెరియర్ కొంచెం తటపటాయించింది. ఆ పాట కోసం 500 మంది డ్యాన్సర్లు ఆ సమయంలో 'మెకానిక్ అల్లుడు' సినిమా లాంచ్ అయ్యింది. చిరంజీవిపై అభిమానంతో కనీసం కథ కూడా వినకుండా అక్కినేని నాగేశ్వరావు మెకానిక్ అల్లుడులో చేశారు. అలా వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానులు విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కాగా బి గోపాల్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో 'ఝుమ్మని తుమ్మెద వేట' సాంగ్ కోసం అప్పట్లో రూ.25 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పట్లో అదో రికార్డు. 7 రోజుల షూటింగ్... 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. ఇన్నీ హంగు ఆర్భాటాలు ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ పోలీస్ రియల్ లైఫ్ స్టోరీనే ఈ సినిమా ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ నుంచి తొలి సినిమా 'ముగ్గురు మొనగాళ్లు' వచ్చింది. అందులో చిరంజీవి త్రిపాత్రాభినయం చేశారు. దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, నగ్మా, రోజా వంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆయనకు భారీగా నష్టాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఎస్పీ 'పరుశురాం' సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో ఉండే వాల్టర్ అనే పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం అప్పట్లో బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న శ్రీదేవిని పిలిపించి అందుకు గాను భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి చేపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఆ సినిమా చుట్టూ ఎన్నో విమర్శలు అలా బ్యాక్ టూ బ్యాక్‌గా చిరంజీవికి డిజాస్టర్ సినిమాలు వస్తున్న సమయంలో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో మాస్ మసాలా ఎంటర్టైనర్ 'అల్లుడా మజాకా' వచ్చింది. సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని, సెన్సార్ వాళ్లు దీనిని పూర్తిగా నిషేధించాలని పలువురు కోరారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న చిరంజీవికి ఇది మరో దెబ్బ . అలాంటి సమయంలో చిరంజీవి అభిమానులు చాలా చోట్ల రోడ్డు మీదకి వచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పట్టుబట్టి ఎదోలా సినిమా రిలీజ్ అయ్యేలా చేసుకున్నారు. చిరంజీవి మార్కెట్ ఏంటో గుర్తుచేసిన సినిమా ఇదే మొత్తానికి 'అల్లుడా మజాకా' సినిమా థియేటర్లో పడింది. ఆపై విజయఢంకా మోగించింది. అప్పటి వరకు సుమారు 3 ఏళ్లకు పైగా ప్లాపుల్లో ఉన్న చిరంజీవి సినిమా మార్కెట్‌పై అంచనాలు తగ్గాయి. ఈ సినిమా విడుదలతో ఆయన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో పాటు పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత 1995లో మళ్లీ బిగ్‌బాస్, రిక్షావోడు రెండూ భారీ డిజాస్టర్లే చిరుకు దక్కాయి. తెలుగులో ఫస్ట్ డాల్బీ సిస్టమ్ ఆడియో ఉన్న సినిమా రిక్షావోడు. చిరు కెరీర్లో సినిమాలకు దూరంగా ఈ సినిమాతోనే 'రూప్ తేరా మస్తానా' తెలుగులో మొదటి ర్యాప్ సాంగ్‌ను ఇండస్ట్రీకి చిరంజీవి పరిచయం చేశారు. ఈ సినిమా కోసం డ్యాన్స్, నటన విషయంలో ఎంతో కష్టపడి సినిమా తీస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అప్పట్లో ఈ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం ఊహించలేదని చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే మెగాస్టార్ మొట్టమొదటిసారి తన కెరీర్లో బ్రేక్ తీసుకున్నారు. ఏ సినిమా షూటింగ్‌కు వెళ్లకుండా .. కనీసం కథ కూడా వినకుండా సుమారు సంవత్సరం పాటు ఉన్నారు. ఈ సినిమాతో వెంటనే బ్లాక్‌బస్టర్ కొట్టిన చిరు అప్పటి వరకు సంవత్సరానికి 3 లేదా 4 సినిమాలు తీసే చిరంజీవి 1996లో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆ తర్వాత 1997లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ నుంచి 'హిట్లర్'గా మెగాస్టార్ తిరిగొచ్చారు. ఒకరకంగా ఆయనకు ఇదీ కం బ్యాక్ సినిమా అని చెప్పవచ్చు. 49 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. ఆ వెంటనే రజనీ కాంత్ 'భాషా' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సురేష్ కృష్ణతో చిరంజీవి 'మాస్టర్' సినిమాను ఒప్పుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగులో మొట్టమొదటి డిటిఎస్ సౌండ్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పడిలేచిన కెరటం 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాతో అంజన ప్రొడక్షన్స్ అందుకున్న డిజాస్టర్‌ను చిరంజీవి మరిచిపోలేదు. 1998లో అదే ప్రొడక్షన్లో 'బావగారు బాగున్నారా' సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో 54 సెంటర్లలో 100రోజులు ఆడింది. అలా ఆయన పడిలేచిన కెరటంలా తన జర్నీని కొనసాగించారు. అందుకే చాలామంది యంగ్ హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటామని చెప్తు ఉంటారు. వరుస డిజాస్టర్ల తర్వాత హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా,చూడాలని ఉంది,స్నేహం కోసం,అన్నయ్య వంటి చిత్రాలు వచ్చాయి. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకాధరణ పొందలేదనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో స్టామినా ఉన్న హీరోకు ఒక్క హిట్ సినిమా పడితే చాలు రికార్డులన్నీ గల్లంతు అవుతాయని చెప్పడానికి. రాబోయే రోజుల్లో ఆయన నుంచి అలాంటి హిట్ సినిమా తప్పకుండా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి ఆయన ఎప్పటికీ మెగాస్టారే... -
జగదేకవీరుడు సినిమా ప్రభాస్ కల్కి రిలీజ్ కి లింక్ ఏంటి?
-
హీరోలకు సమానంగా శ్రీదేవి పారితోషికం.. ఆ సినిమాలో ఎంతంటే ?
Chiranjeevi Sridevi Remuneration In Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి నటనలో, అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అందం, అభినయంలో ఎవరికీ వారే సాటి. వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాతోనే శ్రీదేవికి 'అతిలోక సుందరి' అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం సినీ అభిమానులను అబ్బురపరిచింది. ఒక అందమైన లోకంలో విహరించేలా చేసింది. 1990 మే 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి రూ. 15 కోట్లు వసూలు చేసింది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాను ఆ సమయంలో రూ. 9 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మించారట. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అందులో నటీనటుల రెమ్యునరేషన్ గురించి చెబుతూ చిరంజీవికి సుమారు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో శ్రీదేవికి ఫుల్ క్రేజ్ ఉందని, హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేదన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందని, కానీ ఆచరణలోకి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఈ సినిమాలో సుందరం మాస్టారు, ప్రభుదేవా కొరియోగ్రఫీతో పాటు మాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా హైలెట్‌గా నిలిచాయి. -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
104 డిగ్రీల జ్వరంతో ధినక్ తా ధినక్ రో...
స్క్రీన్ మీద మాస్ హీరో చిరంజీవి, అందాల సుందరి శ్రీదేవి ‘ధినక్ తా ధినక్ రో..’ అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్న ప్రేక్షకులకు ఒకటే హుషారు. అభిమానులు కూడా థియేటర్లో స్టెప్పులేశారు. హీరోయిన్లు ఎలానూ పాటల్లో గ్లామరస్‌గా కనిపిస్తారు. హీరోలు కూడా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. ఈ పాటలో చిరంజీవి అలానే కనిపించారు. అయితే ఈ పాట చిత్రీకరించినప్పుడు ఆయన 104 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. నేటితో (మే 9) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 ఏళ్లయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటల గురించి కొన్ని విశేషాలను వైజయంతీ సంస్థ పంచుకుంది. ‘దినక్ తా ధినక్ రో’.. పాటకు వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశాం. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్. రిలీజ్ డేట్ మే 9 అని ప్రకటించాం. చిరంజీవి హై ఫీవర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఒక డాక్టర్ సెట్లో ఉండేట్లు ప్లాన్ చేసుకున్నాం. అనకున్న తేదీకి విడుదల చేయగలిగామంటే చిరంజీవియే కారణం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతదర్శకుడు. ట్యూన్స్ అన్నీ మెలోడీవే. కానీ చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వేటూరి ‘ఇదే ట్యూన్ ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి’ అంటూ ‘అబ్బ నీ తీయనీ దెబ్బ’ అని రాశారు. ఈ పాటని రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్లలో జస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు. కానీ ‘అందాలలో మహోదయం’ పాటకు మాత్రం 11 రోజులు పట్టింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నీ మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విన్సెంట్ గారు, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం, ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన చంటి, పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు.. ఇలా ఎందరో. ఎన్నో రకాలుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ . ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్. -
ఫస్ట్‌లుక్ 5th July 2018