May 9: List Of Block Buster Tollywood Movies Released On This Day - Sakshi
Sakshi News home page

మే9న రిలీజైన సూపర్‌ హిట్‌ చిత్రాలివే..

Published Mon, May 10 2021 2:03 PM | Last Updated on Mon, May 10 2021 5:47 PM

May 9 Special :Tollywood Movies Which Released Today - Sakshi

మే9..టాలీవుడ్‌లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్‌ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్‌లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్‌ చిత్రాలేంటో చూసేద్దామా?


జగదేకవీరుడు అతిలోకసుందరి
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది.

గ్యాంగ్‌ లీడర్‌
విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్‌ లీడర్‌. 1991లో  విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్‌ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్‌ ఉందో.. రఫాడిస్తా అనే పవర్‌ ఫల్‌ డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు.  

ప్రేమించుకుందాం రా
వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసింది ఈ చిత్రం.  

సంతోషం
నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్‌, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్‌ పరంగానూ సూపర్‌ హిట్‌ అయ్యింది.  సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్‌లోనే బెస్ట్‌ క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. 

మహానటి
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్‌ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు.

మహర్షి
మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement