today special
-
ఈరోజు స్పెషల్: బ్రదర్స్ డే.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్, మదర్స్ డే, లవర్స్ డే మాదిరి బ్రదర్స్ డేగా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరుడు అంటే అన్నాతమ్ముడు ఎవరైనా కావొచ్చు. మనతో ఆత్మీయంగా స్నేహితుడి మాదిరి ఉండే వ్యక్తి సోదరుడు. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్ చెప్పొచ్చు. ఈ బ్రదర్స్ డే గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి. 2005 నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన శిల్పి, రచయిత సి డేనియర్ రోడ్స్ బ్రదర్స్ డేను తొలిసారిగా చేసుకున్నాడు. అప్పటి నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. మొదట బ్రదర్స్ డేను కేవలం అమెరికాలో చేసుకునేవారు. తర్వాతర్వాత అన్ని దేశాల్లో మొదలైంది. ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైనవి వంటకాలు చేసి కలిసి భుజిస్తారు. బ్రదర్స్ డేకు కొన్ని దేశాల్లో సెలవు దినం (Public Holiday) కూడా ప్రకటించారు. అన్నాదమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే ‘ప్రపంచ సోదరుల దినోత్సవం’. -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
ఏపీ కేబినెట్ కీలక భేటీ నేడు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ ఈ ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఇసుకపై ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ⇒ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ నేడు కొనసాగుతుంది. ⇒ కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద స్థలాన్ని నేడు ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించనుంది. ⇒మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. ⇒ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ తీసుకురావాలన్న పిటిషన్‌పై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది. ⇒ బ్రెజిల్లో నేడు ప్రారంభం కానున్న బ్రిక్ దేశాల 11వ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో నేడు.. ►దత్తోపంత్ రేంగ్డీజీ శతజయంతి ఉద్ఘాటన వేదిక : హరి హర కళా భవన్ సమయం : సాయంత్రం 4 గంటలకు. ►చాడఖై స్పెషల్.. వేదిక : కళింగ కిచెన్ సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు. ►బాలల దినోత్సవం వేదిక : గ్లెన్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్ఎండీఏ లే అవుట్, తెల్లాపూర్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు. ►తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ సమయం : 4.30 గంటలకు. ►వేదిక : సర్దార్ పటేల్ రోడ్డు, మారేడ్‌పల్లి రోషిణి ఆధ్వర్యంలో భరత నాట్యం తరగతులు సమయం : 5.30 గంటలకు. కరాటే శిక్షణ తరగతులు సమయం : రాత్రి 8 గంటలకు. ఉచిత యోగ తరగతులు సమయం : ఉదయం 11 గంటలకు యోగ ఫర్ సీనియర్స్ వర్క్ షాప్ సమయం : 8.30 గంటలకు. ►ఓపెన్ చెస్ టోర్నమెంట్ వేదిక : వైఎంసీఏ ఆఫ్ హైదరాబాద్ సమయం : మధ్యాహ్నం 2 గంటలకు. ►యశ్వంత్ సిన్హా, కరణ్ సింగ్‌ల ఆధ్వర్యంలో ఆల్జీబ్రాలో శిక్షణ వేదిక : సర్వే నెం. 64, హైటెక్ సిటీ, మాదాపూర్ సమయం : రాత్రి 7 గంటలకు ►ఈఎస్ఐ హాస్పిటల్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్ల ధర్నా వేదిక : ఈఎస్ఐ డైరెక్టరేట్ సమయం : ఉదయం 11 గంటలకు. ►కోటి దీపోత్సవం..2019 వేదిక: ఎన్టీఆర్ స్టేడియం సమయం : సాయంత్రం 6 గంటలకు. ►టీవీ ఛానల్ రన్ బై స్కూల్ కిడ్స్ వేదిక : ది హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజీగూడ సమయం : మధ్యాహ్నం 12 గంటలకు. ►అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలు..2019 వేదిక : ఓంకార్భవన్, బాగ్‌లింగంపల్లి. సమయం : ఉదయం 11 గంటలకు. ►ఆది ధ్వని సంగీత వాద్య ప్రదర్శన ముగింపు సభ వేదిక : స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సమయం : 4.30 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు
► జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నేడు అబుల్ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని ప్రతిభావంతులకు విద్యాపురస్కారాలు అందజేస్తారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ► ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 38 వ రోజుకు చేరింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేయడంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక సమర్పించనుంది. ► మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వెనకడుగు వేయడంతో.. రెండో అతిపెద్ద పార్టీకి శివసేనకు అవకాశ దక్కింది. ప్రభుత్వానిన ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి శివసేనను ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం లోపు ప్రభుత్వాన్ని చేయాలని డెడ్‌లైన్ విధించారు. ► నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరుగుతుంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ కార్యక్రమానికి హాజరకానున్నారు. నదు అనుసంధానమే ప్రధాన ఎంజెడగా సదస్సు జరగనుంది. ► నేడు కార్తీక సోమవారం కావడంతో శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. భాగ్యనగరంలో నేడు.. తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి -వేదిక : శ్రీ త్యాగరాయ గాన సభ -సమయం: సాయంత్రం 4 గంటలకు మండే వింటేజ్ నైట్ -వేదిక: 10 డౌన్ స్ట్రీట్, బేగంపేట -సమయం : రాత్రి 8 గంటలకు డిజిటల్ వరల్డ్ ఆధ్వర్యంలో గ్లోబల్ పోలీసింగ్ సమ్మిట్ -వేదిక: హైటెక్స్ -సమయం : ఉదయం 9 గంటలకు. మండే ఈడిఎం నైట్ విత్ డిజే అభిషేక్ -వేదిక: స్పోయిల్ పబ్ -సమయం: రాత్రి 8 గంటలకు శ్రీ చక్ర దీపోత్సవం -వేదిక : ఎల్బీ స్టేడియం -సమయం: రాత్రి 9 గంటలకు. వాలీబాల్, బాస్కెట్ బాల్ సెలక్షన్స్ -వేదిక: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, ఉస్మానియా వర్శిటీ కాలేజీ(టూరిస్టు స్పాట్) -సమయం: ఉదయం 10.30 గంటలకు. తెలంగాణ యువ నిత్యోత్సవం -వేదిక: రవీంద్ర భారతి -సమయం: సాయంత్రం 6 గంటలకు. ఆది ధ్వని.. ఎగ్జిబిషన్ -వేదిక: తెలంగాణ స్టేట్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ -సమయం : ఉదయం 10.30 గంటలకు ఆల్ ఇండియా ఫైడ్-రేటింగ్ చెస్ టోర్నమెంట్ -వేదిక: లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ -సమయం: ఉదయం 8 గంటలకు. ఇంటర్నేషల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ -వేదిక: హెచ్ఐసీసీ -సమయం: ఉదయం 9 గంటలకు -
నేటి విశేషాలు..
► దశాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ► భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా.. రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం ప్రారంభం కానుంది. పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ► నేడు ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామంటూ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నగరంలో నేడు ► ఆర్య జనని: గర్భిణులకు ప్రత్యేక శిక్షణ -వేదిక: రామకృష్ణమఠం, దోమలగూడ -సమయం: ఉ. 9నుంచి 12.30 వరకు ► మాయా బజార్ నాటక ప్రదర్శన -వేదిక: సురభి థియేటర్, పబ్లిక్ గార్డెన్స్, -సమయం: సాయంత్రం 6.30 గంటలకు ► కూచిపూడి డ్యాన్స్ బై వర్మఆర్ట్స్ అకాడమీ -వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్ -సమయం: సాయంత్రం 5 గంటలకు ► ధ్రుపద్ సంధ్య – అశ్లేష షైన్ట్రీ -వేదిక: భాస్కర అడిటోరియం, -బిర్లా సైన్స్ మ్యూజియం ఆవరణ -సమయం: సాయంత్రం 6 గంటలకు ► నవరసాస్ – భరతనాట్యం రెకిటల్ భై జనని సేతునారాయణన్ -వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్ -సమయం: రాత్రి 7–30 గంటలకు ► ఆ పాత సినీ మధుర గీతాలు -వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి -సమయం: సాయంత్రం 5–30 గంటలకు ► కాంటెపరరీ డ్యాన్స్ క్లాసెస్ -సమయం: ఉదయం 11 గంటలకు – లాటిన్ డ్యాన్స్ సల్సా క్లాసెస్ -సమయం: సాయంత్రం 6 గంటలకు ► ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా ‘సత్వర న్యాయం –ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార మార్గాలు’ -వేదిక: రామానుజచారి ఏసీఅడిటోరియం, -మహేశ్వరీ కాంప్లెక్స్, మాసబ్ ట్యాంక్ -సమయం: ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 12–30 వరకు ► ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ -వేదిక: బుక్స్ ఎన్ మోర్ –లైబ్రరీ అండ్ ఆక్టీవిటీ సెంటర్, వెస్ట్ మారేడ్‌పల్లి -సమయం: సాయంత్రం 5 గంటలకు ► స్టాండప్ కామెడీ బై మనోజ్ ప్రభాకర్ -వేదిక: హార్ట్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్ -సమయం: రాత్రి 7–30 గంటలకు ► కార్నాటిక్ ఓకల్ అండ్ కూచిపూడి డ్యాన్స్ బై మంథాస్ రాగాలయ అకాడమీ -వేదిక: శిల్పారామం, ఉప్పల్ -సమయం: రాత్రి 7–30 గంటలకు ► స్టాండప్ కామెడీ బై రాజశేఖర్, సందేశ్ -వేదిక: ఫోనెక్స్ ఎరీనా, గచ్చిబౌలి -సమయం: రాత్రి 7 గంటలకు ► ఆది ధ్వని అపురూపమైన అంతరించిపోతున్న సంగీత వాద్య ప్రదర్శన -వేదిక: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ -సమయం ఈ నెల 9 నుండి 13 వ తేది వరకు సాయంత్రం 4–30 గంటలకు -
నేటి విశేషాలు..
► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు భేటీ కానున్నారు. కడప స్టీల్‌ప్లాంట్, గనుల కేటాయింపుల తదితర అంశాలపై ఈ సదర్భంగా వీరు చర్చించనున్నారు. ► కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు కృష్ణా జిల్లా నాగాయలంకలో పర్యటించనున్నారు. ఓఎన్జీసీలో గ్యాస్ గ్యాదరింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ► తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 36వ రోజుకు చేరింది. నేడు ఆర్టీసీ జేఏసీతో.. ఓయూ జేఏసీ సమావేశం కానుంది. ► ప్రధాని మోదీ ప్రకటించిన.. పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు పూర్తయింది. 2016 నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన మోదీ.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో నేడు ► పరంపర –అమితా దత్ అండ్ ట్రూప్, వేదిక: భారతీయ విద్యా భవన్ ( కల్చరల్ వెన్యూ) , బషీర్‌బాగ్, సమయం: సాయంత్రం 5–30 గంటలకు ► కినార –స్టూడెంట్ ఫిల్మ్ ఫెస్టివెల్, వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్, సమయం: సాయంత్రం 4 గంటలకు ► స్టాండప్ కామెడీ బై సందేశ్ జానీ, వివేక్ అండ్ అనిరుధ్ మల్లాది, వేదిక: లమాకాన్ , బంజారాహీల్స్, సమయం: రాత్రి 8 గంటలకు ► మధుర గీతాలు –సినీ సంగీత విభావరి, వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, సమయం: సాయంత్రం 4–30 గంటలకు ► ఫ్రైడే నైట్ లైవ్ విత్ టైడల్ వేవ్ (బ్యాండ్), వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్, సమయం: రాత్రి 8 గంటలకు ► టెక్జీయాన్ –కంప్యూటర్ క్లాసెస్ ఫర్ ఎల్డర్స్ అండ్ బిగినర్స్, వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, మారేడ్ పల్లి, సమయం: సాయంత్రం 6 గంటలకు ► ఫ్రైడే లేడీస్ నైట్ విత్ డీజే ఆసిప్ ఇక్బాల్, వేదిక:సౌండ్స్అండ్ స్పిరిట్స్, మాదాపూర్, సమయం: రాత్రి 8 గంటలకు ► ఫ్రైడే నైట్ లైవ్ విత్ డీజే లాలిడ్ గీజిలర్, వేదిక: బ్లాక్ 22 పబ్ అండ్ లాంజ్ , హైటెక్ సిటీ, సమయం: రాత్రి 7 గంటలకు ► స్టాండ్ అప్ కామెడీ బై అశోక్ కఠారీ అండ్ యశ్ హబిటాట్, వేదిక: ది కాఫీ కప్, సైనిక్‌పురి, సమయం: రాత్రి 7–45 గంటలకు ► ఫ్రైడే నైట్ లైవ్ విత్ డీజే అమిత్ సక్సేనా, వేదిక: క్లబ్ రోగ్ , గచ్చిబౌలి, సమయం: రాత్రి 8 గంటలకు ► సన్‌బర్న్ ఎరీనా విత్ డిమిత్రి వీగాస్ లైక్ మైక్, వేదిక: జీఎంఆర్ ఎరీనా, శంషాబాద్, సమయం: సాయంత్రం 4 గంటలకు ► చిల్డ్రన్ హాప్ ఈవెన్ –మూవీ స్క్రీనింగ్, వేదిక:ఫోనిక్స్ ఎరీనా , టీఎస్ఐఐసీ పార్క్, సమయం: రాత్రి 7–30 గంటలకు -
నేటి విశేషాలు..
► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. ► రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ► మావోయిస్టులు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వారు ఈ బంద్ ప్రకటించారు. ► తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నేటితో 34వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్లపై నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ► మహారాష్ట్ర బీజేపీ నేతలు నేడు గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలవనున్నారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తెర వెనక మంతనాలు చాలనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ నగరంలో నేడు.. ► సీఐఐ తెలంగాణ హెచ్ఆర్ కాంక్లేవ్, వేదిక: ట్రిడెంట్, మాదాపూర్, సమయం: ఉదయం 9 గంటలకు ► ఆ పాత మధుర గీతాలు, వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, సమయం: సాయంత్రం 6 గంటలకు ► థర్స్ డే నైట్ లైవ్ విత్ గోలిసోడా, వేదిక: ది బ్యాక్ యార్డ్ క్లబ్, ఖైరతాబాద్, సమయం: రాత్రి 8 గంటలకు ► థర్స్ డే నైట్ లైవ్ విత్ కేజే రోగర్, వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్, సమయం: రాత్రి 8 గంటలకు ► థర్స్డే లేడీస్ నైట్ విత్ డీజే టెక్గ్రూ, వేదిక:సౌండ్స్ అండ్ స్పిరిట్స్, మాదాపూర్, సమయం: రాత్రి 8 గంటలకు ► థర్స్ డే లేడీస్ నైట్ విత్ డీజే సీరా, వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్ , గచ్చిబౌలి, సమయం: రాత్రి 8 గంటలకు ► థర్స్డే నైట్ లైవ్ విత్ రాగా ది బ్యాండ్, వేదిక: బ్లాక్ 22 పబ్ అండ్ లాంజ్ , హైటెక్ సిటీ, సమయం: రాత్రి 8 గంటలకు -
నేటి విశేషాలు..
► వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. ► ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ► దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంతకు ముందు విచారణ సందర్భంగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ► హైదరాబాద్‌లో నేటి నుంచి లమకాన్‌లో ఉచిత ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 6న రాత్రి 7 గం. లకు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, 7న 7.30కు- యామ్ ఐ యాన్ ఇండియా?, 8 నుంచి 11వరకు కినారా స్టూడెంట్ ఫిలిం ఫెస్టివల్--’ నిర్వహించనున్నారు. సమాజంలో అణగారిన, బలహీన పక్షాల గొంతుకను ఈ చిత్రాల ద్వారా వినిపించాలనే లక్ష్యంతో మూడు రోజుల చిత్రోత్సవాన్ని కినారా స్వచ్ఛంద సంస్థ లామకాన్‌లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8-11 వరకు పలు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ► తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. నేడు అన్ని డిపోల వద్ద నిరహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ గత అర్ధరాత్రితో ముగిసింది. అయితే అర్ధరాత్రి వరకు 373 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. -
నగరంలో నేడు
నేడు పింక్ క్రూసేడర్ రైడ్ రాయదుర్గం : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపోందించేందుకు గాను శనివారం పింక్ క్రూసేడర్ రైడ్ నిర్వహించనున్నారు. కాంటినెంటల్ కేన్సర్ సెంటర్, జింగిల్ ఫౌల్, డుకాటీ, నోవాటెల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించునున్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి 150 మంది బైకర్లు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వద్దకు ర్యాలీ నిర్వహిస్తారు. ఉదయం 6.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ బైక్ ర్యాలీలో పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 7.30 ర్యాలీ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. క్యాండిల్స్ తయారీపై వర్క్‌షాప్ దీపావళి పండుగలో వెలిగించే దీపాలను స్వయంగా తయారు చేసుకోవాలని ఆశించే వారి కోసం కొండాపూర్‌లోని సిమ్సమ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా ఇది జరుగుతుంది. ఆర్ట్ థెరపీ 3న.. వచ్చే నవంబరు 3న సెరెనిటీ ఆర్ట్ థెరపీ పేరుతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఫౌండేషన్ థియేటర్లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. సంగీతం, కళ, స్పీచ్‌ల ద్వారా మానసిక ఆరోగ్యం అనే అంశంపై దీనిని నిర్వహిస్తున్నారు. దీనిలో సాండిల్య పీసపాటి సంగీతాన్ని, డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్పీచ్, శహిష్ట ఫాతిమా ఆర్ట్ అందించనున్నారు. కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది పెయింట్ అండ్ సిప్ 2న... నచ్చిన పానీయాన్ని సేవిస్తూ వచ్చినట్టు చిత్రాలను గీయాలని కోరుకునే వారి కోసం... మై లిటిల్ థింగ్స్ ఆధ్వర్యంలో పెయింట్ అండ్ సిప్ ఈవెంట్‌ను నవంబరు 2న నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ బార్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. మైక్రో ఆర్ట్ వర్క్‌షాప్ బంజారాహిల్స్‌లోని ఆక్టోస్పేసెస్లో మైక్రో ఆర్ట్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. నవంబరు 3న నిర్వహించే ఈ వర్క్‌షాప్‌కు ఆర్టిస్ట్ నవనీత్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. చాక్ మీద కార్వింగ్స్, పెన్సిల్ లీడ్ మీద కార్వింగ్స్...నేర్పించే ఈ వర్క్‌షాప్ ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతుంది. సాలిడారిటీ ఆర్ట్ ఎగ్జిబిషన్ బంజారాహిల్స్‌లోని డెహ్రా ఆర్ట్ గ్యాలరీలో ‘సాలిడారిటీ’ పేరుతో చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దాదాపు 60 మంది చిత్రకారులు పాల్గొంటున్నారు. శిల్పులు సైతం పాల్గొంటున్న ఈ ప్రదర్శనలో 180 ఆర్ట్ వర్క్స్ కొలువుదీరాయి. ఈ ప్రదర్శన 31 వరకూ కొనసాగుతుంది. మరిన్ని ప్రోగ్రామ్స్ వేదిక: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి ► ‘ఎన్నెన్నోజన్మలబంధం’ సినీ గీతాలు సమయం: సాయంత్రం 5–30 గంటలకు ► ఇండియా డ్యాన్స్ ఫెస్టివెల్ సమయం: సాయంత్రం 5–30 గంటలకు ► థర్స్డే నైట్లైవ్ విత్ ది రింకి శర్మ ట్రియో వేదిక: హార్ట్ రాక్ కేఫ్ హైదరాబాద్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, మారేడ్‌పల్లి ► భరతనాట్యం క్లాసెస్ బై రోషిణి సమయం: సాయంత్రం 5–30 గంటలకు ► మోహినియట్టం క్లాసెస్ సమయం: సాయంత్రం 4–30 గంటలకు ► కరాటే ట్రైనింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం: 6–00 గంటలకు ► థర్స్డే నైట్‌విత్ అరుణ్ అండ్ అనుప్ వేదిక: స్టోన్ వాటర్స్ కిచెన్ అండ్ లాంజ్ , జూబ్లీహీల్స్ సమయం: రాత్రి 7–30 గంటలకు ► మ్యాథ్స్ క్లాసెస్ విత్ మీనా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఎన్ మోర్ లైబ్రరీ యాక్టివిటీ సెంటర్ , వెస్ట్ మారేడ్‌పల్లి సమయం: సాయంత్రం 5 గంటలకు ► ఐఎస్బీ ఫ్యామిలీ బిజినెస్ కాఫీ మీట్ వేదిక: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , గచ్చిబౌలి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఐడబ్ల్యూఎన్ తెలంగాణలీడర్షిప్ కాంక్లేవ్ వేదిక: ట్రైడెంట్ , మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ► థర్స్డే నైట్ లైవ్ విత్ డీజే సన్నీ వేదిక: స్పాయిల్ పబ్ , జూబ్లీహీల్స్ సమయం: రాత్రి 7 గంటలకు ► థర్స్డే బాలీవుడ్ నైట్లైవ్ విత్ అభిజిత్ వేదిక: కార్పెడైం , జూబ్లీహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ► థర్స్డే నైట్ లైవ్ విత్ డీజే రాబ్జ్ వేదిక: ప్రిజం క్లబ్ అండ్ కిచెన్ ,గౌలిదొడ్డి సమయం: రాత్రి 8 గంటలకు ► హరికథ మహోత్సవం –రుక్మిణీ కళ్యాణం: బైకే నాగమణి, బాగవతరణి వేదిక: కళా సుబ్బారావు కళావేదిక , చిక్కడపల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ► థర్స్డే లేడీస్ నైట్ వేదిక: స్నార్ట్ హైటెక్స్ ,ఖానాపేట్ సమయం: రాత్రి 7 గంటలకు . -
వినాయక..నమో నమః
– వాడవాడలా సిద్ధమైన మండపాలు - విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న వీధులు – పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట విఘ్ననాయకుడు చవితికి సిద్ధమయ్యాడు. ఉత్సవాలకు జనం వినాయక చవితి వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉత్సవంలో పాల్గొనే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. పల్లె నుంచి పట్నం దాకా సంబరాలు అంబరాన్నంటుతాయి. అందుకే అందరూ గణేష్ ఉత్సవాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అందరినీ ఒక్కటి చేసే ఈ పండుగ రానే వచ్చింది. ఇలా పండుగ రానే వచ్చింది.నేడు వినాయక చవితి. కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు,,చిన్నాపెద్దా తేడా లేకుండా ‘అనంత’ వాసులంతా ‘జైబోలో గణేశ్ మహారాజ్‌కి...జై’ అంటూ విగ్రహాలను తమ ప్రాంతాలకు తీసుకెళ్లారు. – అనంతపురం కల్చరల్: భాద్రపదమాస బహుళ చవితి నాడు వినాయక చవితి పండుగ వస్తుంది. భక్తులంతా బహురూపాల్లో వినాయకుడి ప్రతిమలు రూపొందించి పూజలు చేస్తారు. పండుగ నేపథ్యంలో గురువారమే జిల్లా వ్యాప్తంగా వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఇక పర్యావరణ హితం కోసం చేపట్టిన మట్టి విగ్రహాల పంపిణీకి విశేష స్పందన లభించింది. అనంతపురం, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరితో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణప్రాంతాలు గురువారం ఉదయం నుంచి విగ్రహాల కొనుగోళ్లతో సందడి మారాయి. ఆటోలు, ట్రాక్టర్లు, భారీ లారీలలో విగ్రహాలను తీసుకెళ్లారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు కూడా పెద్దలతో పాటు విగ్రహాల వద్దకు వచ్చారు. కాషాయరంగు రిబ్బన్లు తలకు ధరించి ‘జైబోలే గణేశ్ మహారాజ్‌కి జై...గణపతిబప్ప మోరియా...అంటూ ఈలలు, కేకలు వేసుకుంటూ విగ్రహాలను తరలించారు. ముస్తాబైన మండపాలు గణనాథుడు కొలువుదీరే మండపాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతపురంలోని వినాయక్‌చౌక్‌లో 13 రోజులుగా మండపం నిర్మాణపనులు సాగాయి. 35 ఏళ్లుగా ఇక్కడ ఖరీదైన మండపాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా పండుగను చేస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుదీపాలు, లైటింగ్బోర్డులు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మండపాలను అలంకరించారు. కిటకిటలాడిన ప్రధాన కూడళ్లు జిల్లాలోని అన్ని పట్టణప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మార్కెట్‌తో పాటు ప్రధాన వీధులన్నీ జనంతో పోటెత్తాయి. నూతన వస్త్రాల కొనుగోళ్లతో షాపింగ్‌మాళ్లు కిటకిటలాడాయి. చెరుకు గడలు, పూలు, గరిక, పండ్లు లాంటి పూజా సామగ్రి, వినాయక ప్రతిమలను ఇంటి తీసుకెళ్లడానికి వచ్చిన జనంతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. అనంతపురం నగరంలోని పండుగ మొత్తం పాతూరుమార్కెట్ వద్దే కన్పించింది. పూల దుకాణాల వద్ద రద్దీతో జనాలు అడుగుతీసి అడుగేయడమే కష్టంగా మారింది. రాష్ట్రంలోనే సం‘చలనం’ వినాయక చవితి వేడుకల్లో భాగంగా జిల్లా వాసులు తొలిసారి విగ్రహాలను కదిలేలా రూపొందించారు. 35 ఏళ్ల కిందట నుంచే వినాయక చవితి పర్వదినానికి సంబంధముండే పురాణేతిహాసాలతో సంగీతంతో మమేకమై సాగే కదలికలు రాష్ట్రంలోనే తొలిసారి నగరంతోనే ప్రారంభమయ్యాయి. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రణతంబోర్ వినాయక ఆలయ నమూనాతో పాటు దాదాపు రూ.30 లక్షల వ్యయంతో సాగుతున్న విగ్రహ కదలికలు జిల్లాకే తల మానికం కానున్నాయి. 10 వేల విగ్రహాలు అనంతపురం నగరంలో అధికారికంగా 510 విగ్రహాలకు అనుమతి తీసుకున్నారు. అనధికారికంగా మరో 500కుపైగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారు. వీటితో పాటు ఇళ్లలో ఏర్పాటు చేసినవి అదనం. ఇలా జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో కలిపి కనీసం 10 వేల విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారని అంచనా. ఈ లెక్కన ఈ పండుగ ఖర్చు కనీసం రూ.50 కోట్ల మేర ఉంటుంది. అనంతపురంలోని మొదటిరోడ్డులోని వినాయక చౌక్, కోర్టురోడ్డు, రాణీనగర్లలో సైతం కదలిక వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అన్ని చోట్లా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.