అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ ఈ ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఇసుకపై ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
⇒ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ నేడు కొనసాగుతుంది.
⇒ కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద స్థలాన్ని నేడు ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించనుంది.
⇒మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.
⇒ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ తీసుకురావాలన్న పిటిషన్‌పై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది.
⇒ బ్రెజిల్‌లో నేడు ప్రారంభం కానున్న బ్రిక్ దేశాల 11వ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో నేడు..
►దత్తోపంత్ రేంగ్డీజీ శతజయంతి ఉద్ఘాటన
వేదిక : హరి హర కళా భవన్
సమయం : సాయంత్రం 4 గంటలకు.
►చాడఖై స్పెషల్..
వేదిక : కళింగ కిచెన్
సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు.
►బాలల దినోత్సవం
వేదిక : గ్లెన్‌డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్‌ఎండీఏ లే అవుట్, తెల్లాపూర్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు.
►తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి
వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ
సమయం : 4.30 గంటలకు.
►వేదిక : సర్దార్ పటేల్ రోడ్డు, మారేడ్‌పల్లి
రోషిణి ఆధ్వర్యంలో భరత నాట్యం తరగతులు
సమయం : 5.30 గంటలకు.
కరాటే శిక్షణ తరగతులు
సమయం : రాత్రి 8 గంటలకు.
ఉచిత యోగ తరగతులు
సమయం : ఉదయం 11 గంటలకు
యోగ ఫర్ సీనియర్స్ వర్క్ షాప్
సమయం : 8.30 గంటలకు.
►ఓపెన్ చెస్ టోర్నమెంట్
వేదిక : వైఎంసీఏ ఆఫ్ హైదరాబాద్
సమయం : మధ్యాహ్నం 2 గంటలకు.
►యశ్వంత్ సిన్హా, కరణ్ సింగ్‌ల ఆధ్వర్యంలో ఆల్‌జీబ్రాలో శిక్షణ
వేదిక : సర్వే నెం. 64, హైటెక్ సిటీ, మాదాపూర్
సమయం : రాత్రి 7 గంటలకు
►ఈఎస్‌ఐ హాస్పిటల్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్ల ధర్నా
వేదిక : ఈఎస్‌ఐ డైరెక్టరేట్
సమయం : ఉదయం 11 గంటలకు.
►కోటి దీపోత్సవం..2019
వేదిక: ఎన్‌టీఆర్ స్టేడియం
సమయం : సాయంత్రం 6 గంటలకు.
►టీవీ ఛానల్ రన్ బై స్కూల్ కిడ్స్
వేదిక : ది హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజీగూడ
సమయం : మధ్యాహ్నం 12 గంటలకు.
►అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసమాఖ్య రాష్ట్ర ద్వితీయ మహాసభలు..2019
వేదిక : ఓంకార్‌భవన్, బాగ్‌లింగంపల్లి.
సమయం : ఉదయం 11 గంటలకు.
►ఆది ధ్వని సంగీత వాద్య ప్రదర్శన ముగింపు సభ
వేదిక : స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
సమయం : 4.30 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment