May
-
హిమాచల్‌లో అకాల ఎండలు.. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సిమ్లా: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం వేడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే, జూన్ నాటి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.మరికొద్ది రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనెల 15 తర్వాత హిమాచల్‌లో రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. మనాలి, కిన్నౌర్, లాహౌల్ స్పితి తదితర ప్రాంతాల్లోని పర్వతాలపై మంచు కురిసింది. అయితే గడచిన కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిమ్లా, మనాలిలో ప్రస్తుతం ఏర్పడిన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటాలోని వివరాల ప్రకారం ఈ నెల 23, 24 తేదీల్లో సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం. 1994లో సెప్టెంబర్ 30న సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెంట్రీగ్రేడ్గా నమోదయ్యింది. అదేవిధంగా మనాలిలో కూడా సెప్టెంబర్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ 23న 27.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.మరోవైపు సెప్టెంబర్ నెలలో కాంగ్రాలో ఆల్ టైమ్ ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైంది. ఈ నెలలో ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 35 డిగ్రీలకు చేరుకోలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 24న ఇక్కడ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత వేడిగా ఉండే హిమాచల్ జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. సెప్టెంబర్‌లో ఉనాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇది కూడా చదవండి: నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు -
ఈపీఎఫ్‌వో రికార్డ్.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్‌లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.మే నెలలో ఈపీఎఫ్‌వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది. -
మేలో ఈక్విటీ ఫండ్స్ హవా..!
న్యూఢిల్లీ: గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికంకాగా.. అప్పుడప్పుడూ మార్కెట్లో నమోదైన దిద్దుబాట్లు ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశాలను కలి్పంచాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా థిమాటిక్ ఫండ్స్‌పట్ల ఆకర్షితులైనట్లు దేశీ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) పేర్కొంది. ఈ బాటలో క్రమబద్ధ పెట్టుబడి పథకాల(సిప్)కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది. ఇది కూడా సరికొత్త రికార్డ్‌కావడం గమనార్హం! హెచ్చుతగ్గుల్లోనూ ఇటీవల మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగినప్పటికీ ఇన్వెస్టర్లు ఈక్విటీలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు భారీ పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. వెరసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వరుసగా 39వ నెలలోనూ నికరంగా పెట్టుబడులు ప్రవేశించాయి. ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు రూ. 20,371 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో వరుసగా రెండో నెలలోనూ సిప్‌లో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌లో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఇక మొత్తంగా ఎంఎఫ్ పరిశ్రమకు మే నెలలో రూ. 1.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌లో ఇవి రూ. 2.4 లక్షల కోట్లుకావడం గమనార్హం! ఫలితంగా ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఏప్రిల్‌లో నమోదైన రూ. 57.26 లక్షల కోట్ల నుంచి మే చివరికల్లా రూ. 58.91 లక్షల కోట్లకు బలపడింది. స్మాల్ క్యాప్స్ జోరు చిన్న షేర్ల(స్మాల్ క్యాప్స్) విభాగం మే నెలలో 23 శాతం వృద్ధితో రూ. 2,724 కోట్ల పెట్టుబడులను అందుకుంది. అయితే లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు రూ. 663 కోట్లు మాత్రమే లభించాయి. అంటే ప్రత్యేకించిన, అధిక రిటర్నులు అందించే అవకాశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతుండటంతో మధ్యమధ్యలో వస్తున్న దిద్దుబాట్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశాలుగా వినియోగించుకుంటున్నట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. కొటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ నేషనల్ హెడ్ మనీష్ మెహతా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టనుందన్న అంచనాలు మార్కెట్లలో మరింత ర్యాలీకి కారణమవుతుందన్న ఆలోచన కొనుగోళ్లకు దారి చూపుతున్నట్లు వివరించారు. దేశ ఆర్థిక వృద్ధిపట్ల విశ్వాసంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కడుతున్నట్లు ఫైయర్స్ వైస్‌ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. ఇక ఈక్విటీలుకాకుండా రుణ పథకాల విభాగంలోనూ రూ. 42,495 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై ఆసక్తి చూపడం ప్రభావం చూపింది. అయితే ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.9 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడులు 78 శాతం క్షీణించాయి. రుణ పథకాలలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ. 25,873 కోట్లు ఆకట్టుకుని రికార్డ్ నెలకొల్పాయి. ఈఎల్ఎస్ఎస్ మినహా ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ. 25 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 25.39 లక్షల కోట్లకు చేరాయి. ఇది చరిత్రాత్మక గరిష్టమని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలియజేశారు. ఫోకస్డ్, ఈక్విటీ లింక్డ్ పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్) విభాగాలను మినహాయించి చూస్తే ఇతర విభాగాలకు నికరంగా పెట్టుబడులు తరలి వచి్చనట్లు పేర్కొన్నారు. సెక్టార్, థిమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో మే నెలలో రూ. 19,213 కోట్లు లభించాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ నుంచి వెలువడిన కొత్త ఆఫరింగ్(ఎన్ఎఫ్వో) రూ. 9,563 కోట్లు అందుకోవడం ఇందుకు సహకరించింది. -
ఎకానమీకి వాణిజ్యలోటు పోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేలో 9 శాతం (2023 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువలో 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులుసైతం సమీక్షా నెల్లో 7.7 శాతం పెరిగి 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా 7 నెలల గరిష్ట స్థాయిలో 23.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత భారీ వాణిజ్యలోటు ఎకానమీకి ఒక్కింత ఆందోళన కలిగించే అంశం. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. → అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, జౌళి, ప్లాస్టిక్స్ వంటి రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. → మొత్తం దిగుమతుల్లో చమురు విభాగంలో 28 % పెరుగుదలను నమోదుచేసుకుని విలువలో 20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. → పసిడి దిగుమతులు మాత్రం స్వల్పంగా తగ్గి 3.69 బిలియన్ డాలర్ల నుంచి 3.33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్– మే నెలల్లో వృద్ధి 5.1 శాతం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు–ఏప్రిల్, మేలలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8.89 శాతం పెరిగి 116 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 42.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ నెలల్లో ఒక్క చమురు దిగుమతుల విలువ 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్ డాలర్లకు చేరింది. సేవలూ బాగున్నాయ్... సేవల రంగం ఎగుమతులు మేలో 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తొలి అంచనా. 2023 మేలో ఈ విలువ 26.99 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ ఇదే కాలంలో 15.88 బిలియన్ డాలర్ల నుంచి 17.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు డౌన్ మరోవైపు రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి ఒక ప్రకటన చేస్తూ, మేనెల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లుగా నమోదయినట్లు పేర్కొంది. 2023 ఇదే నెల్లో ఈ విలువ రూ.21,795.65 కోట్లు (2,647 మిలియన్ డాలర్లు). -
ఆహార ధరలు దారుణం.. పరిశ్రమ పేలవం..
న్యూఢిల్లీ: భారత తాజా కీలక ఆర్థిక గణాంకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.75 శాతంగా నమోదయ్యింది. ఇది ఏడాది కనిష్టం అయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. 2024 ఏప్రిల్‌లో ఈ రేటు 4.83 శాతంకాగా, 2023 మేనెల్లో ఈ రేటు 4.31 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రకారం 6 శాతం వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అయితే తమ లక్ష్యం ఎప్పుడూ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి అని ఆర్బీఐ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యా లయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రిటైల్ ద్ర వ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల్లో పట్టణ ప్రాంతాల్లో 4.15% ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. పరిశ్రమ పేలవంమరోవైపు పరిశ్రమల పురోగతికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల ఏప్రిల్‌లో 5 శాతంగా నమోదయ్యింది. గత 3 నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4%. పారిశ్రామిక రంగం వాటా 28.3 %. సేవల రంగం వాటా 53.3%. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70%.ఇంధన డిమాండ్‌కు భారత్ దన్ను న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్ చోదకంగా ఉండగలదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)నివేదిక తెలిపింది. 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉందని ఆయిల్ 2024 రిపోర్టులో పేర్కొంది. 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఐఈఏ వివరించింది. 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదని ఐఈఏ తెలిపింది. -
వాహన పరిశ్రమ నెమ్మది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికలు. వెరసి దేశవ్యాప్తంగా మే నెలలో వాహన పరిశ్రమపై ఈ రెండు అంశాలు ప్రభావం చూపాయి. షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్య గత నెలలో 18 శాతం తగ్గినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు మే నెలలో 5.28 శాతం క్షీణించాయి. 2023 మే నెలతో పోలిస్తే గత నెల విక్రయాల్లో 2.61% వృద్ధి నమోదైంది. మే నెలలో మొత్తం 20,89,603 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.61% తగ్గి 15,34,856 యూనిట్లకు చేరాయి. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది. -
ప్యాసింజర్ వాహనాలు.. స్లో
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెల(మే)లో మందగించాయి. కంపెనీల నుంచి డీలర్లకు సగటున వాహన పంపిణీ(హోల్‌సేల్) 4 శాతమే పుంజుకుంది. మొత్తం 3,50,257 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితం(2023) ఇదే నెలలో హోల్‌సేల్ అమ్మకాలు 3,35,436 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ నీరసించడం, అంతక్రితం అధిక వృద్ధి నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్) కారణమయ్యాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీ అమ్మకాలు నామమాత్రంగా పెరిగి 1,44,002 యూనిట్లను తాకాయి. గతేడాది మే నెలలో 1,43,708 వాహనాలు విక్రయించింది. ఎంట్రీలెవల్(చిన్న కార్లు), కాంపాక్ట్ కార్ల అమ్మకాలు వెనకడుగు వేశాయి. వీటి అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902కు తగ్గాయి. అయితే యుటిలిటీ వాహనాలు బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎరి్టగా, ఎస్‌క్రాస్, ఎక్స్ఎల్6 విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204కు ఎగశాయి. చిన్నకార్ల విభాగానికి దన్నునిచ్చేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెస్సో, సెలెరియో మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధో బెనర్జీ పేర్కొన్నారు. ఇతర దిగ్గజాల తీరిలా..⇥ హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 49,151 వాహనాలకు చేరింది. 2023 మే నెలలో 48,601 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల మందగమనం కొనసాగవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ అంచనా వేశారు. ⇥ ఎలక్ట్రిక్ వాహనాలుసహా ఇతర ప్యాసిజంర్ వాహన అమ్మకాలు దేశీయంగా 2 శాతం బలపడి 47,705కు చేరినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. గతంలో 45,984 యూనిట్లు విక్రయించింది. ⇥ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 31 శాతం జంప్‌చేశాయి. 43,218 యూ నిట్లను తాకాయి. 2023 మే నెలలో 32,886 వాహనాలు మాత్రమే డీలర్లకు పంపిణీ చేసింది. ⇥ టయోటా కిర్లోస్కర్ సైతం గత నెలలో హోల్‌సేల్‌గా 24 శాతం వృద్ధితో మొత్తం 25,273 వాహన విక్రయాలను సాధించింది. ⇥ కియా ఇండియా 4 శాతం అధికంగా 19,500 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసింది. గతేడాది మే నెలలో 18,766 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది పోటీకి అనుగుణంగా పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ సీనియర్ వీపీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. ⇥ ఎంజీ మోటార్ ఇండియా వాహన హోల్‌సేల్ అమ్మకాలు గత నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2023 మే నెలలో డీలర్లకు 5,006 వాహనాలు పంపిణీ చేసింది. -
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..? -
మే 19కల్లా అండమాన్‌కు రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మే19కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం(మే13) తెలిపింది. నిజానికి దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది.అయితే రెండు రోజుల ముందే రుతుపవనాలు అక్కడికి చేరుకోనున్నాయని తెలిపింది. కేరళకు రుతుపవనాలు జూన్1న రానున్నట్లు వెల్లడించింది. కేరళ నుంచి ముందుకు కదలి దేశవ్యాప్తంగా జులై 15వ తేదీ కల్లా రుతుపవనాలు వ్యాపించనున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ఐఎండీ మే చివరి వారంలో ఇవ్వనుంది. -
మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు
సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకునే రోజే మదర్స్ డే. మే నెల రెండోఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మాతృమూర్తుల త్యాగాలను, కష్టాలను గుర్తించడం, తిరిగి ప్రేమను అందించడమే ఈ మదర్స్ డే లక్ష్యం.అంతులేని త్యాగానికి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం. ఆ దేవదేవుడికైనా, సామాన్య మానవుడికైనా అమ్మే ఆది దైవం, గురువు అన్నీ.ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా , అమెరికాలలో మే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. 1908వ సంవత్సరంలో అమెరికాకు చెందిన కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లిని గౌరవించేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని ప్రారంభించింది. ఆ తరువాత తల్లి కష్టాలను గుర్తించే రోజుగా మదర్స్‌డేగా ప్రాచుర్యంలోకి వచ్చింది.మదర్స్ డే చరిత్రనిజానికి మదర్స్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది. పురాతన గ్రీకు నాగరికతలో వసంత వేడుకలా దీన్ని జరుపుకునేవారు. రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. అదే 1872 లో అయితే జూలియ వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని నిర్వహించారు.అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. 1914 నుంచి అధికారికంగా జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మేనెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో మదర్స్ డే జరుపుకుంటారు.ఏడాదికి రెండు సార్లు మదర్స్ డే?కొన్ని దేశాల్లో మార్చిలో కూడా జరుపుకుంటారు. యూకే, కోస్టారికా, జార్జియా, సమోవా , థాయిలాండ్‌లలో ఈస్టర్ ఆదివారం కంటే మూడు వారాల ముందు మదర్స్ డే జరుపుకుంటారు.మదర్స్ డే వెనుక ఇంత కథ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి. అమ్మ ప్రేమని ఈ కేవలం ఒక్కరోజు స్మరించుకుంటే సరిపోతుందా? ఒక గులాబీ పువ్వో, లేదా ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక హగ్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఎంతమాత్రం కానే కాదు. కల్మషం ఎరుగని అమ్మ సేవలకు విలువ కట్టలేం. కానీ కన్నబిడ్డగా ఆమె రుణం తీర్చుకోవచ్చు. అమ్మకు అమ్మంత ప్రేమను తిరిగి ఇచ్చేయండి. అమ్మకు అండగా నిలవండి. ఈ సంవత్సరం మదర్స్ డే రోజు అమ్మకు ఇంతకంటే అద్భుతమైన బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. -
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మే నెలలో మారుతున్న రూల్స్
ఏప్రిల్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మాదిరిగానే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.యస్ బ్యాంక్ రూల్స్యస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్ / ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు, మరిన్నింటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుండి అమలులోకి వస్తాయి.డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 ఉండనున్నాయి. చెక్ బుక్ విషయానికి వస్తే 25 లీఫ్స్ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆపైన ఒక్క చెక్ లీఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రీవ్యాలిడేషన్‌ను చార్జీలను రూ.100లుగా బ్యాంక్ సవరించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న "హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్డీ" గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. 5 - 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.బ్యాంక్‌లకు సెలవులువచ్చే మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. -
Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం
లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్‌ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్, ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్ సెక్రటరీ అథార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్‌ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్‌కు అందజేయగా, బోర్డ్ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు అప్పగించింది. -
మే నెలలో కొత్తగా 8.83 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో 8.83 లక్షల మంది కొత్త వారికి ఉపాధి లభించింది. వీరంతా ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చి చేరారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మే నెలలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన సభ్యుల సంఖ్య 16.30 లక్షలుగా ఉంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను గురువారం విడుదల చేసింది. కొత్తగా 3,673 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ సంస్థలు అన్నీ కూడా మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో ఎక్కువ సభ్యుల చేరిక మేలోనే నమోదైంది. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 56 శాతంగా ఉన్నారు. సంఘటిత రంగంలో యువత గణనీయ స్థాయిలో ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్య పూర్తయిన తర్వాత ఈ వయసు వారే ఉద్యోగాన్వేషణ చేస్తుంటారని తెలిసిందే. కొత్త సభ్యుల్లో 2.21 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద మే నెలలో చేరిన మహిళా సభ్యుల 3.15 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు అధికంగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచే 57.85 శాతం మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చి చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 19.32 శాతం మంది సభ్యులయ్యారు. బిల్డింగ్, నిర్మాణం, వ్రస్తాల తయారీ, ఎల్రక్టానిక్ మీడియా, టెక్స్టైల్స్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. మొత్తం సభ్యుల్లో 42 శాతం మేర నైపుణ్య సేవల విభాగం కిందే ఉన్నారు. -
12 శాతం అధికంగా నియామకాలు
ముంబై: దేశంలో ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో (జనవరి–మే) 12 శాతం పెరిగినట్టు ఆల్‌సెక్ టెక్నాలజీస్ ప్రకటించింది. నైపుణ్య సేవలు, తయారీరంగం, బీఎఫ్ఎస్ఐ, ఈ కామర్స్, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా కంపెనీలు కఠిన విధానాలను అవలంబిస్తున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం నియామకాలు గతేడాదితో పోలిస్తే మెరుగుపడ్డాయి. 2023 జనవరి–మే మధ్య నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 12 శాతం పెరిగాయి. భారత కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతులను అధిగమించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్ పెట్టుబడులు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది రానున్న సంవత్సరాల్లో ఉపాధికి ఊతమిస్తుంది’’అని ఆల్‌సెక్ టెక్నాలజీస్ సీఈవో నాజర్ దలాల్ తెలిపారు. భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. నిపుణులకు డిమాండ్ నైపుణ్య సేవల రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు రెట్టింపయ్యాయి. ట్యాక్సేషన్, బిజినెస్ కన్సలి్టంగ్, రిస్క్ అడ్వైజరీ, డీల్ అడ్వైజరీ, టెక్నాలజీ సేవలు, పర్యావరణం, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ) సేవల్లో నియామకాల జోరు కనిపించింది. తయారీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూడగా 50 శాతం వృద్ధి కనిపించింది. భారత ఉత్పత్తులకు స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుండడం సానుకూలంగా ఈ నివేదిక తెలిపింది. ఫలితంగా ఇది ఉపాధికి మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ, ఈ–కామర్స్ రంగాల్లోనూ నియామకాలు 16 శాతం అధికంగా జరిగాయి. బ్యాంక్‌లు పనితీరు మెరుగుపడడం, రుణాలకు డిమాండ్ పెరగడం వంటి అంశాలను నివేదిక ప్రస్తావించింది. ఇంటర్నెట్ విస్తరణ ఈ కామర్స్ రంగానికి అనుకూలమని తెలిపింది. వ్యాపారానికి మరింత అనుకూలమైన వాతావరణం, భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా చేయాలని కేంద్రం భావిస్తుండడం భవిష్యత్తులో మరింతగా ఉపాధి కల్పనకు దారితీస్తుందని విశ్లేశించింది. -
రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన
అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు పింక్ నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) మార్చి 31, 2023న రూ. 3.62 లక్షల కోట్లకు చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం మే 19న ప్రకటన తర్వాత 2023 జూన్ 30 వరకు చెలామణి నుండి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 2.72 లక్షల కోట్లు. తత్ఫలితంగా, జూన్ 30న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ.84,000గా ఉన్నాయనీ మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 76శాతం తిరిగి వచ్చాయని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ. 2,000 మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి రెండు వేల నోట్ల మార్పిడికి ముగియనున్న సంగతి తెలిసిందే. కనుక ప్రజలు తమవద్ద ఉన్న రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి /లేదా మార్చుకోవడానికి వచ్చే మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.(Tata Motors Price Hike: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్!) కాగా చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు తరువాత నవంబర్ 2016లో రూ. 2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. అయితే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
మేలో తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీఏఈపీసీ) ఈ వివరాలు వెల్లడించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 12 శాతానికి పైగా తగ్గాయి. వీటి విలువ రూ.14,190 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ రూ.16,154 కోట్లుగా ఉండడం గమనార్హం. ల్యాబ్‌లో తయారైన వజ్రాల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం తగ్గి రూ.1,986 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో వీటి ఎగుమతుల విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. మే నెలకు సంబంధించి బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 7 శాతానికి పైగా పెరిగి రూ.5,705 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.5,318 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో రూ.1,173 కోట్లు విలువ చేసే వెండి ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.3,729 కోట్లతో పోలిస్తే 68 శాతం క్షీణించాయి. -
టోకు ధరలు దిగివచ్చాయ్..!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెల్లో పెరుగుదల లేకపోగా 3.48 శాతం (క్షీణత) తగ్గింది. గడచిన ఏడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో మైనస్ 3.7 శాతం) ఈ స్థాయిలో టోకు ధరలు నమోదుకావడం ఇదే తొలిసారి. హైబేస్ ఎఫెక్ట్‌తోపాటు (గత ఏడాది మే నెల్లో భారీ టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం) సూచీలో మూడు ప్రధాన విభాగాలైన– ఆహార, తయారీ, ఇంధన ధరలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. 2022లో మే నెలలో 16.63 శాతం టోకు ద్రవ్యోల్బణం (హై బేస్) నమోదుకావడం ఇక్కడ గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేనెల్లో 25 నెలల కనిష్టం 4.25 శాతంగా నమోదయిన సానుకూల ఫలితం నేపథ్యంలోనే టోకు ధరలకు సంబంధించి కూడా ఎకానమీకి ఊరటనిచ్చే తాజా ఫలితం వెలువడింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే... ► ఏప్రిల్‌లో ఫుడ్ ఆర్టికల్స్ ధరల 3.54 శాతం తగ్గితే (వార్షికంగా పోల్చి) తాజా సమీక్షా నెల్లో తగ్గుదల 1.51 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 20.12 శాతం తగ్గాయి. ఆలూ ధరలు 18.71%, ఉల్లిధరలు 7.25% తగ్గాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం 5.76 % ఎగశాయి. గోధుమలకు సంబంధించి ద్రవ్యోల్బణం కూడా 6.15%గా ఉంది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం మేలో 9.17 శాతం (మైనస్) తగ్గింది. ఏప్రిల్ నెలలో 0.93 శాతంగా ఉంది. ► తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌లో మైనస్ 2.42 శాతంగా ఉంటే, మేలో మైనస్ 2.97 శాతంగా నమోదయ్యింది. ప్రతి ద్రవ్యోల్బణం... వరుసగా రెండో నెల ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్లడాన్ని... సాంకేతికంగా ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఈ ప్రాతిపదికన ప్రతి ద్రవ్యోల్బణం నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 1.51%గా నమోదయ్యింది. రానున్న నెలల్లో కూడా ఇదే ధోరణి కొనసాగితే, బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో 2023లో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2022 మే తర్వాత 2.50% పెరుగుదలతో 6.5 శాతానికి చేరిన రెపో రేటును గత రెండు ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడమే దీనికి కారణం. -
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు రూ.2,400 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది. ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌లోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్‌కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి. ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్‌పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్‌పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్‌కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు గుర్తు చేశారు. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుముఖం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో.. నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఇది గడిచిన ఆరు నెలల కాలంలో నెలవారీ అత్యంత కనిష్ట స్థాయి ఈక్విటీ పెట్టుబడులు కావడం గమనించొచ్చు. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 27వ నెలలోనూ నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.6,480 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. అంతకుముందు నెల మార్చిలోనూ రూ.20,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) మే నెలకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన నికర పెట్టుబడులు రూ.57,420 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.1.21 లక్షల కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా తగ్గాయి. 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తులు రూ.43.2 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్ చివరికి ఇవి రూ.41.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి సిప్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు మే నెలలో వచ్చాయి. ఇది నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనించొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.13,728 కోట్లుగా ఉన్నాయి. అనిశ్చితుల్లోనూ పరిశ్రమ మంచి పనితీరు చూపించినట్టు యాంఫి సీఈవో ఎన్ వెంకటేశ్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్లు పెరగడంతో లాభాల స్వీకరణకు తోడు, వేసవి విహార పర్యటనలు, విద్యా సంబంధిత ఖర్చులు మే నెలలో పెట్టుబడులు తగ్గడానికి కారణమై ఉండొచ్చు’’అని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ డిజిటల్ బిజినెస్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. లాభాల స్వీకరణకు తోడు, అమెరికా డెట్ సీలింగ్ పెంచడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళనతో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఉండొచ్చని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా అభిప్రాయపడ్డారు. విభాగాల వారీగా.. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,362 కోట్లను ఆకర్షించాయి. ► ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.944 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.504 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ పథకాలు రూ.46,000 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.45,234 కోట్లు రాగా, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.6,093 కోట్లు వచ్చాయి. ► ఓవర్‌నైట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.18,910 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.6,694 కోట్లు వచ్చాయి. ► బ్యాలన్స్డ్ హైబ్రిడ్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాల నుంచి రూ.997 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేటెడ్ ఫండ్స్‌లోకి రూ.103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే విలువల పరంగా తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్‌లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో కలిపి 2023 మే నెలలో 20,19,414 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, ట్రాక్టర్లకు విపరీత డిమాండ్ ఉండడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 9 శాతం పెరిగి 14,93,234 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7 శాతం అధికమై 77,135 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 79 శాతం ఎగసి 79,433 యూనిట్లు, ట్రాక్టర్లు 10 శాతం దూసుకెళ్లి 70,739 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్‌కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడో నెల మేలో కూడా రూ. 1.50 లక్షల కోట్లు దాటాయి. సమీక్షా నెల్లో (2022 మే నెలతో పోల్చి) 12 శాతం వృద్ధితో రూ. 1.57 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదయినట్లు గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నట్లు ఈ ఫలితాలు పేర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చిలో వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో (2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఎన్నడూ లేనంతగా) రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఇక రూ.1.4 లక్షలకోట్ల పైన వసూళ్లు వరుసగా 14వ నెల. తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► మొత్తం వసూళ్లు రూ.1,57,090 కోట్లు. ► సెంట్రల్ జీఎస్టీ రూ.28,411 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.35,828 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.81,363 కోట్లు. ► సెస్ రూ.11,489 కోట్లు. -
మేలో ‘తయారీ’ పటిష్టం
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పురోగతిని కనబరిచినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ధ్ (పీఎంఐ) స్పష్టం చేసింది. సూచీ 31 నెలల గరిష్ట స్థాయిలో 58.7కు చేరినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సూచీ 57.2 వద్ద ఉంది. నిజానికి సూచీ 50పైన వుంటే వృద్ధి ధోరణిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50 పైన కొనసాగడం వరుసగా 23వ నెల కావడం గమనార్హం. -
ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(2–19) నికరంగా రూ. 30,945 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇందుకు ప్రధానంగా దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, వడ్డీ రేట్లు వెనకడుగు వేయనున్న అంచనాలు, సానుకూల కార్పొరేట్ ఫలితాలు, స్టాక్స్ విలువలు దిగివస్తుండటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం మే నెల పెట్టుబడులను కలుపుకుంటే ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 16,365 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో రూ. 11,630 కోట్లు, మార్చిలో రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినప్పటికీ.. జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ నెలలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదీ చదవండి: Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్‌లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
ఎండ ప్రచండమే
సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేడి వార్త మోసుకొచ్చింది. మే నెలలో తీవ్రమైన వేడిని వెదజల్లే వాతావరణం నెలకొంటుందని బాంబు పేల్చింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వేసవి మొత్తమ్మీద మే నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోయాయి. మే నెలను తలపించే ఎండలు, వడగాడ్పులు రాష్ట్రంలో అనేకచోట్ల కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో మే నెలలో వేసవి తాపం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అందుకు అనుగుణంగానే మే నెలలో ఎండలు, వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఎండీ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన మే నెల ముందస్తు అంచనాల నివేదికలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. సాధారణంగా మే నెలలో ఆరేడు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయి. అయితే ఐఎండీ అంచనాలను బట్టి ఈసారి మరో ఆరేడు రోజులు అధికంగా వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.సెల్లా తెలిపారు. కోస్తాంధ్ర కుతకుత ఐఎండీ అంచనాల ప్రకారం మే నెలలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో ఉష్ణతీవ్రతతో పాటు వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణతాపం కొనసాగుతుంది. అయితే, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలతో పోల్చుకుంటే రాయలసీమలో వేసవి తీవ్రత ఒకింత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఫలితంగా సీమ ప్రాంతానికి ఉపశమనం కలగనుంది. మరోవైపు మే నెలలో రాష్ట్రంలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. దీని ఫలితంగా పగలంతా సెగలు పుట్టించినా రాత్రి వేళ మాత్రం కాస్త వాతావరణం ఊరట కలిగించనుంది. ఈదురు గాలులు, పిడుగుల ప్రతాపం! కాగా, మే నెలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురవనున్నాయి. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. అయితే, రాష్ట్రంలో మే నెలలో కురిసే సాధారణ వర్షపాతం కంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉష్ణతీవ్రత, వడగాడ్పులు, ఈదురుగాలులు, పిడుగులు సంభవించే వాతావరణం నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.. జీఎస్టీ కొత్త రూల్ జీఎస్టీ ఇన్వాయిస్ల అప్‌లోడ్‌కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్వాయిస్ అప్‌లోడ్‌కు ఎలాంటి కాల పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు. పీఎన్బీ ఏటీఎం చార్జీలు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు! -
మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే..
ఫేవరెట్ కార్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న కస్టమర్లకు వాహన సంస్థలు శుభవార్త చెప్పాయి. మే నెలలో పలు ప్రముఖ కార్లు లాంచ్ అవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్ఎక్స్ వంటి కొన్ని కార్లు ఏప్రిల్ నెలలోనే విడదలయ్యాయి. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు! చాలా కాలంగా ఊరిస్తున్న జిమ్నీని మే నెలలో విడుదల చేయడానికి మారుతి సుజికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన సీఎన్జీ లైనప్‌ను రెండు కొత్త మోడళ్లతో విస్తరిస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా రెండు మోడళ్లను లాంచ్ చేస్తోంది. కొన్ని కార్లకు ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మారుతీ సుజుకి జిమ్నీ మారుతీ సుజుకి జిమ్నీ (Jimny) కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. మారుతి జిప్సీకి వారసత్వంగా ఇది వచ్చేస్తోంది. భారత్ కోసం ప్రత్యేకంగా ఐదు-డోర్ల బాడీ స్టైల్‌తో దీన్ని రూపొందించారు. దీని నో-నాన్సెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నిచ్చెన-ఫ్రేమ్ చట్రం, తక్కువ-శ్రేణి 4x4 ఫీచర్లతో లైఫ్ వాహనంగా గుర్తింపు పొందుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా . బీఎండబ్ల్యూ ఎం2 బీఎండబ్ల్యూ రెండవ తరం M2 (G87)ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి కానుంది. టాప్-రంగ్ కాంపిటీషన్ రూపంలో వచ్చే ఈ లగ్జరీ కార్ అంతకుముందున్న కార్ మాదిరిగా కాకుండా కొత్త M2 ప్రామాణిక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ 460 హార్స్ పవర్‌ను, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో ఇన్లైన్ సిక్స్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్‌గా 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. M2 ఎక్స్-షోరూమ్ అంచనా ధర సుమారు రూ. 1 కోటి. టాటా ఆల్ట్రోజ్ CNG దేశంలో సీఎన్జీ అత్యంత ఆదరణ పొందడంతో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNGని విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తున్న దేశంలోని మూడవ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అవుతుంది. ఆల్ట్రోజ్ CNG కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తం రూ. 21,000. మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఇదివరకే ప్రకటించింది. CNG కిట్ ఆల్ట్రోజ్ XE, XM+, XZ, XZ+ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో AC, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో ఈ కార్ నడుస్తుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 77 హార్స్ పవర్, 97Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. బీఎండబ్ల్యూ X3 M40i బీఎండబ్ల్యూ X3 M40i అనేది X3 కార్లలో హై పర్ఫార్మెన్స్ వేరియంట్. ఇది BMW M340i సెడాన్‌తో దాని పవర్‌ట్రెయిన్‌ను పంచుకుంటుంది. ఇది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 360 హార్స్ పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. X3 M40i M స్పోర్ట్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్‌లు, M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్ వంటి హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! -
మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్!
2023 మే నెల బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. శని, ఆదివారాలతో సహా పండుగలు, ఇతర సందర్భాల కారణంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ బ్యాంకు సెలవుల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. సెలవుల జాబితా ఇలా.. మే 1న మహారాష్ట్ర డే/ మేడే కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులకు సెలవు. మే 5న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా , శ్రీనగర్‌లో బ్యాంకుల బంద్. మే 7న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు. మే 13న రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు. మే 14న ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు. మే 16న సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్టంలో బ్యాంకుల మూత. మే 21న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు మే 22న మహారాణా ప్రతాప్ జయంతి నేపథ్యంలో సిమ్లాలో బ్యాంకుల బంద్. మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు. మే 27న నాల్గవ శనివారం సాధారణ సెలవు. మే 28న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు రోజు సెలవు రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు సెలవు దినాల్లో, బ్యాంకులు మూతపడినప్పుడు మొబైల్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. డబ్బును బదిలీ చేయడానికి UPIని కూడా ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు. ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్.. -
విద్యాశాఖ కార్యాచరణ.. మే మొదటి వారంలో పది ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021–22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022–23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాల సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వచ్చేది. దీంతో భారీ ఎత్తున టీచర్లు అవసరమయ్యేవారు. అలాగే ఫలితాల వెల్లడిలోనూ ఆలస్యమయ్యేది. కేంద్రాల పెంపు వల్ల మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 22న రంజాన్ ఉండటంతో ఆ రోజు మూల్యాంకనం నుంచి ముస్లిం సిబ్బందికి మినహాయింపు ఇవ్వనున్నారు. మూల్యాంకనాన్ని 26న ముగించాక రెండు వారాల్లో వాటిని కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం.. కాగా పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. -
వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వెలుడుతున్నాయి. దీనికి తోడు తగ్గుతున్న చమురు ధరలు ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి. (షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?) వంట గ్యాస్‌ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా సీఎన్జీ, ఎల్పీసీ గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉందని అంచనా. గత కొంత కాలంగా కోవిడ్ మహమ్మారి, ఇటీవలి భౌగోళిక రాజకీయ సంక్షోభం గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరల నియంత్రణకు సెప్టెంబరులో ఏర్పాటైన కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని కమిటీ నవంబర్ 29న ప్యానెల్ సభ్యులు తమ సిఫార్సులను సమర్పించనున్నారు. ఈ అంచనాలు నిజమైతే సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. (ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ) కాగా ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం తెలిసిన సంగతే. గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించిన సంగతి తెలిసిందే. -
పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... ♦ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. ♦ విద్యుత్ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. ♦ మైనింగ్ రంగంలో పురోగతి 10.9 శాతం, ♦ పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. ♦ రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మరోవైపు 2022 ఏప్రిల్ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది. రూపాయి : 79.59 ముంబై: సెంట్రల్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్ మారకంలో మరో కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది. -
వాట్సాప్ యూజర్లకు షాక్: లక్షల ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మే నెలలో భారత్‌కు చెందిన 19.10 లక్షల ఖాతాలను నిషేధించింది. ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి ఏర్పాటు చేసిన సొంత యంత్రాంగంతోపాటు వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో 18.05 లక్షలు, ఏప్రిల్‌లో 16 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గతేడాది అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న పెద్ద డిజిటల్ వేదికలు ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. -
మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్‌లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్‌లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి. ► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది. ఆర్బీఐ అంచనాలు ఇలా... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. -
చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే..
కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి వందల కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దీంతో పాటు సరుకు రవాణాలోనూ దుమ్ము రేపుతూ వేల కోట్ల ఆదాయం సొంతం చేసుకుంది. పూర్తిగా విభజించని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మన్మాడ్, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో పాటు అతి స్వల్పంగా తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. ఈ ఆరు డివిజన్లకు సంబంధించి 2022 మేలో రైల్వే శాఖకు టికెట్ల అమ్మకం ద్వారా రికార్డు స్థాయిలో 423.98 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఒక్క మేలో 1.14 లక్షల మంది దక్షిణ మధ్య పరిధిలో రైళ్లలో ప్రయాణించారు. వీరి కోసం సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులో ఉంచారు. సరుకు రవాణాలోనూ దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. కేవలం సరుకు రవాణా ద్వారానే మేలో రూ.1067 కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దక్షిణ మధ్య రైల్లే పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో సిమెంటు పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికి అవసరమైన బొగ్గును రవాణా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్రణాళిక అమలు చేసింది. ఫలితంగా రికార్డు స్థాయి లాభాలు వచ్చాయి. చదవండి: గుడ్‌న్యూస్! రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు -
ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో అదరగొట్టిన ఏథర్
సాక్షి,ముంబై: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్, ఏథర్ ఎనర్జీ బంపర్ సేల్స్ సాధించింది. 2022 , మే నెలలో ఇండియాలో 3,787 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ మేరకు సంస్థ సేల్స్ వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో గత నెలలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేయడం విశేషం. అయితే ఏప్రిల్ 2022లో 3,779 యూనిట్లతో పోలిస్తే ఏథెర్ అమ్మకాలలో కేవలం 0.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. 450ఎక్స్, 450 ప్లస్ స్కూటర్‌కు మంచి ఆదరణ లభించిందని పైథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, రవ్నీత్ ఎస్ ఫోకెలా తెలిపారు. అలాగే దిగ్గజ సంస్థ హీరో మోటో కార్ప్‌తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 128 మిలియన్ డాలర్లను సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా దేశంమొత్తంమీద ఈవీ ఛార్జింగ్ గ్రిడ్ల ఏర్పాటుకు Magentaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం 35 నగరాల్లో దాదాపు 330కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ పాయింట్లను ఇన్స్టాల్ చేసింది. రాబోయే మూడేళ్లలో 5వేల పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని యోచిస్తోంది. -
భారత్‌కు వాణిజ్యలోటు గుబులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేనెల్లో 15.46 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు విలువ 56.14 శాతం ఎగసి 60.62 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 23.33 బిలియన్ డాలర్లగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఎగుమతులు ఇలా... ► ఎగుమతులకు సంబంధించి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల వంటి రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ►ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 7.84 శాతం పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లు విషయంలో ఈ రేటు 52.71 శాతం పెరిగి 8.11 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గత ఏడాది మేలో 2.96 బిలియన్ డాలర్లు ఉంటే, తాజా సమీక్షా నెల్లో 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 12 శాతం పెరిగి విలువలో 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఫార్మా ఎగుమతులు 5.78 శాతం ఎగసి 1.98 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 23% పురోగ తితో 1.36 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతుల తీరిది... ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు మే నెల్లో 91.6 శాతం పెరిగి 18.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు మే 2 బిలియన్ డాలర్ల (2021 మేలో) నుండి 5.33 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుంచి భారీగా 5.82 బిలియన్ డాలర్లకు ఎగశాయి. తొలి రెండు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ఎగుమతులు 22.26 శాతం పెరిగి 77.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు ఇదే కాలంలో 42.35 శాతం ఎగసి 120.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చితే 21.82 బిలియన్ డాలర్ల నుంచి 43.73 బిలియన్ డాలర్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. భారత్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు (దాదాపు 600 బిలియన్ డాలర్లు) దాదాపు 12 నెలల దిగుమతులుకు సరిపోతాయన్నది అంచనా. అయితే వాణిజ్యలోటు పెరుగుదల కొంత ఇబ్బందికరమైన పరిణామం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారానికీ ఇది దారితీస్తుంది. 2022–23లో క్యాడ్ 2 శాతం దాటుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2021–22ను అధిగమిస్తాం ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
మేలో టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సమగ్ర వివరాలతో కూడిన జాబితాలను రూపొందించి వీలైనంత త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖాధికారులకు పంపాలని ఆదేశించారు. త్వరగా టెన్త్ సిలబస్ పూర్తిచేసి రివిజన్ చేపట్టాలని, పరీక్షల కోణంలో విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. కోవిడ్ కేసుల తగ్గుముఖంతో.. వాస్తవానికి టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేయడం ఆనవాయితీ. అయితే కోవిడ్ మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్ చేశారు. ఈసారి కూడా కోవిడ్ మూడోవేవ్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా? లేదా? అనే డోలాయమానంలో ఇప్పటివరకు విద్యాశాఖ ఉంది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్షలకు అవసరమైన బందోబస్తు సమస్య తలెత్తకుండా ఇంటర్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాల సమాచారం. మే 5వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. వారం రోజుల్లో విద్యార్థులపై స్పష్టత మరో వారం రోజుల్లో పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతారు? ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఎంతమంది అనే డేటా సేకరించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 5.20 లక్షల మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే వీలుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా పరీక్ష కేంద్రాల ఎంపిక చేసేందుకు మార్చి మొదటి వారంలో చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన వేగవంతం టెన్త్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. కానీ ఈసారి అంత సమయం లేకపోవడంతో వేగంగా వీటిని తయారు చేయాలని భావిస్తున్నారు. సీనియర్ అధ్యాపకుల చేత కొన్ని ప్రశ్నపత్రాల సెట్లను ఇప్పటికే సిద్ధం చేయించినట్టు పరీక్షల విభాగం అధికారి ఒకరు తెలిపారు. వీటిల్లో కొన్నింటిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించారు. అయితే అత్యంత రహస్యంగా జరిగే ఈ ప్రక్రియకు కొంతమంది అధికారులను నియమించినట్టు తెలిసింది. కోవిడ్ మూలంగా అరకొరగా బోధన జరిగిన విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని, వీలైనంత వరకూ చాయిస్ ఎక్కువ ఉండేలా ప్రశ్నపత్రాలు రూపొందించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
మేలో విదేశీ పెట్టుబడుల హైజంప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2021) మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా ఎగసినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 203 శాతం జంప్‌చేసి 12.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,980 కోట్లు) లభించినట్లు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ఎఫ్‌డీఐలు 10 శాతం వృద్ధితో 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ప్రోత్సాహంపై విభిన్న పరిశ్రమల సమాఖ్యలతో సమావేశం సందర్భంగా గోయల్ ఈ విషయాలు వెల్లడించారు. -
ఆదాయం లాక్‘డౌన్’: రాబడి తగ్గి.. అప్పులు పెరిగి
సాక్షి, హైదరాబాద్: ఖజానాపై కరోనా దెబ్బ పడింది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఆదాయానికి గండికొట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి మాసమైన ఏప్రిల్‌లో ఆశించినంత ఆదాయం వచ్చినా, లాక్డౌన్ ప్రభావానికి గురైన మే నెలలో మాత్రం రాబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయాలు తగ్గిపోగా, అమ్మకపు పన్ను రాబడి మాత్రమే ఏప్రిల్ నెలతో పోలిస్తే కొంచెం అటూ ఇటూగా వచ్చింది. అప్పులు అనివార్యం కావడంతో ఒక్క మే నెలలోనే రూ.6,600 కోట్లకు పైగా నిధులను రుణాల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఇక జూన్ నెలలో కూడా 20 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉన్నందున, ఆ నెలలో కూడా ప్రభుత్వ రాబడులపై ప్రభావం ఉంటుందని, మే నెలలో రూ.2 వేల కోట్ల వరకు తగ్గిన ఆదాయం.. జూన్‌లో రూ.1,500 కోట్ల వరకు తగ్గవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద 2021-22 తొలి త్రైమాసికం నిరాశాజనకంగానే ముగియనుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కేంద్రం నుంచి ఊరట కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్డౌన్ మే మాసమంతా అమల్లో ఉంది. ఉదయం 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఆదాయ శాఖలు పని చేయలేదు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గడంతో పాటు జన సంచారం లేని కారణంగా వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పన్ను రాబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.3,019 కోట్లు వస్తే, మే నెలలో అది రూ.1,737 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు రూ.1,300 కోట్లు తగ్గుదల కనిపించింది. ఇక, మద్యం షాపులు కూడా ఉదయం 10 గంటల వరకే ఉండడంతో ఏప్రిల్‌తో పోలిస్తే రూ.250 కోట్ల వరకు తక్కువ విక్రయాలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం అయితే ఏకంగా రూ.500 కోట్లు తగ్గిపోయింది. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, జీఎస్టీ పరిధిలోనికి రాని ఇతర వస్తువుల విక్రయాలపై వచ్చే అమ్మకపు పన్ను మాత్రం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు సమానంగా వచ్చింది. దీంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.500 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.500 కోట్ల రాబడి వచ్చింది. అయినప్పటికీ అప్పులు అనివార్యమై మే నెలలో రూ.6,600 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవడంతో, ఈ ఏడాది రెండు నెలల్లోనే అప్పుల చిట్టా రూ.8 వేల కోట్లు దాటింది. -
పరిశ్రమలకు ‘లో బేస్’ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తిపై మే నెల్లో ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 29.3 శాతం పురోగమించింది. గణాంకాల ప్రకారం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సూచీలు మహమ్మారి ముందస్తు స్థాయికన్నా ఇంకా దిగువనే ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 90.2 పాయింట్లకు పడిపోయింది. 2021 మేలో (తాజా సమీక్షా నెల్లో 116.6 పాయింట్లకు ఎగసింది. అంటే పెరుగుదల 29.3 శాతం. ఇక కరోనా ముందు 2019 మే నెల్లో సూచీ 135. 4 పాయింట్లుగా ఉంది. అంటే 2019 మే ఐఐపీతో పోల్చితే 2020 మేలో సూచీ వృద్ధి లేకపోగా 33.5 శాతం క్షీణించిందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన కీలక విభాగాల లెక్కల తీరు క్లుప్తంగా.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం కలిగిన ఈ విభాగం వృద్ధి 34.5 శాతం. 2020లో 37.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► మైనింగ్: వృద్ధి 23.3 శాతం (2020 మేలో 20.4 శాతం క్షీణత) ► విద్యుత్: 2020 మేలో 14.9 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో 7.5 శాతం పురోగతి సాధించింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులు, భారీ యంత్ర సామగ్రి ఉత్పత్తికి సంకేతమైన ఈ విభాగంలో 65.9 శాతం క్షీణత.. 2021 మేలో 85.3 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి ఈ ఉత్పత్తుల విభాగం 70.3 శాతం క్షీణత నుంచి బయటపడి 98.2 శాతం పురోగమించింది ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, ఫేస్ క్రీమ్స్, పౌడర్ల వంటి ఉత్పత్తులకు సంబంధించిన ఈ ఎఫ్ఎంసీజీ విభాగం 9.7% క్షీణత నుంచి బయటపడి స్వల్పంగా 0.8% పెరిగింది. 2020 మార్చి నుంచీ ఒడిదుడుకులు.. కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (–0.6 శాతం)జారిపోయింది. ధరలు తగ్గినా.. ఆర్బీఐ లక్ష్యానికి ఎగువనే..! జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ముందు నెల మేతో పోల్చితే స్వల్పంగా ఉపశమించింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యంకన్నా ఎగువన 6.26 శాతంగా నమోదయ్యింది. మే నెల్లో ఇది 6.3%. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకా ప్రకారం వార్షికంగా చూస్తే (2020 జూన్‌తో పోల్చి) ఆహార ద్రవ్యోల్బణం 5.15%గా ఉంది (మేలో 5.01%) ఇక చమురు, వెన్న పదార్థాల ధరలు ఏకంగా 34.78% ఎగశాయి. పండ్ల ధరలు 11.82 శాతం పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 0.7% తగ్గాయి. విద్యుత్, లైట్ విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 12.68%. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా 6.16%, 6.37%గా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఎస్ఓ సిబ్బంది వ్యక్తిగతంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణ మండీల నుంచి వారంవారీగా గణాంకాల సేకరించి నెలవారీ ద్రవ్యోల్బణాన్ని మదింపుచేస్తారు. ఆర్బీఐ కీలక పాలసీ రేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి పరపతి విధాన కమిటీ యథాతథంగా 4%గా కొనసాగిస్తోంది. -
జియో సంచలనం: 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో టాప్
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులకు సంబంధించి డౌన్లోడ్ వేగంలో రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్ (ఎంబీపీఎస్) డౌన్లోడ్ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. అప్లోడ్ స్పీడ్ విభాగంలో వొడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ వేగంతో నంబర్ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్వర్క్ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ.. సమీప ప్రత్యర్థి సంస్థ వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది. వొడాఫోన్ ఐడియా సగటు డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడ్ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను, అప్లోడ్ స్పీడ్ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్లోడ్ స్పీడ్ విషయంలో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం లో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్), ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్ డేటాలో వెల్లడి కాలేదు. -
రికార్డు స్థాయికి డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకుధరల సూచీ మే నెలలో రికార్డు స్థాయికి చేరింది. మండుతున్న ధరల నేపథ్యంలో మే నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 12.49 శాతం పెరిగి ఆల్‌టైం హై నమోదు చేసింది. వరుసగా ఐదో నెలలో కూడా పైకి ఎగబాకింది. ఏప్రిల్ లో ఈ సూచీ 10.49 శాతం పెరిగింది. ఇక గత ఏడాది మేలో డబ్ల్యూపీఐ మైనస్ 3.37 శాతంగా నమోదైంది. ఇంధన, విద్యుత్ బుట్టలో ద్రవ్యోల్బణం మే నెలలో 37.61 శాతానికి పెరిగింది, ఏప్రిల్‌లో ఇది 20.94 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల, ద్రవ్యోల్బణం మే నెలలో 10.83 శాతంగా ఉంది, అంతకుముందు నెలలో ఇది 9.01 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు పెరిగినప్పటికీ, మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.31 శాతానికి తగ్గింది. మే నెలలో ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 23.24 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో (-) 19.72 శాతంగా ఉంది. ముడిచమురు ధరలు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫర్నేస్ వంటి మినరల్ ఆయిల్స్ తో పాటు తయారీ వస్తువుల ధరలు పెరగడంతో మే నెలలో డబ్ల్యూపీఐ రికార్డుస్థాయికి చేరిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
మే నెల రికార్డు: వేసవి చేసిన మేలు
ప్రతి యేటా మండుటెండలు, తీవ్ర వడగాడ్పులతో దడ పుట్టించే మే నెల ఈ సారి మాత్రం ప్రతాపం చూపించలేదు. మే లో దాదాపు 25 రోజుల పాటు సాధారణం, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవడంతో వడగాడ్పుల ప్రభావం కనిపించలేదు. మే ఆఖరులో ఒకింత ఉష్ణోగ్రతలు పెరిగినా అదుపు తప్పకపోవడంతో తీవ్ర వడగాడ్పులు వీయలేదు. ఫలితంగా ఈ ఏడాది ఒక్క వడదెబ్బ మరణం కూడా నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది వడగాడ్పులు ఒక నెల ముందుగా ఏప్రిల్ ఆరంభం నుంచే మొదలై 7 రోజుల పాటు ప్రభావం చూపాయి. ఇలా ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా కురిచేడు, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుల్లోను, కృష్ణా జిల్లాలో కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 5–8 డీగ్రీలు అధికం కావడంతో కొన్నిచోట్ల వడగాడ్పులు, అక్కడక్కడా తీవ్ర వడగాడ్పులు వీచాయి. దీంతో మే లో ఉష్ణతీవ్రత ఇంకెంత ఉధృతం అవుతుందోనని ఆందోళన వ్యక్తమైంది. కానీ, మే మొదటి 3 వారాలూ రాష్ట్రంలో పలుచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే నాలుగో వారం ఆఖరులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికం. ఇలా మే లో ఏపీలోని 670 మండలాల్లో 32 మండలాలకే వడగాడ్పులు పరిమితమయ్యాయి. సాధారణం కంటే 6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతేనే తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ఈ మే లో ఒక్కరోజూ తీవ్ర వడగాడ్పులు నమోదు కాలేదు. రాష్ట్రంలో యేటా మే లో సాధారణం కంటే గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాడ్పులు వీచి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. అప్పుడప్పుడూ చల్లదనం.. ఏపీలో 2014–2019 మధ్య కాలంలో వడగాడ్పులు వీచాయి. గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించలేదు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పైగా ఈ ఏడాది మే లో రుతుపవనాల ముందస్తు సీజను ప్రభావంతో మధ్యమధ్యలో వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో అప్పుడప్పుడూ చల్లదనమూ పరచుకుంది. ఇలా మే నెల మండుటెండలు, వడగాడ్పులు లేకుండా ఊరటనిచ్చింది. గత కొన్నేళ్లలో మే లో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ ఆటంకాల వల్లే.. మే నెలలో వడగాడ్పుల తీవ్రత లేకపోవడానికి ఉత్తర భారత్‌లో పశ్చిమ ఆటంకాలే (వెస్టర్న్ డిస్టర్బెన్స్–పశ్చిమం నుంచి తూర్పు దిశగా వీచే గాలుల) కారణం. వీటి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. సాధారణంగా ఇవి ఫిబ్రవరి, మార్చితో తగ్గుముఖం పడతాయి. కానీ ఏప్రిల్, మే వరకూ అక్కడ కొనసాగాయి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. అందుకే మే నెలలో రాష్ట్రం వైపు రాజస్థాన్, ఉత్తరాది నుంచి వేడి/వడగాలులు ఈసారి రాలేదు. మే నెలలో ఇలాంటి పరిస్థితి అరుదు. – రాళ్లపల్లి మురళీకృష్ణ, ఐఎండీ రిటైర్డ్ అధికారి -
GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు
వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలోనూ కేంద్రానికి దండిగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో మే నెలలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ద్వారా లక్షా రెండు వేల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది మేలో వచ్చిన జీఎస్టీ ఆదాయంతో పోల్చితే ఇది 65 శాతం అధికం. జీఎస్టీ పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. వరుసగా ఎనిమిదో సారి కరోనా సెకండ్ సంక్షోభం గడిచిన మూడు నెలలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్నా జీఎస్టీ వసూళ్లకు ఢోకా రాలేదు. గత ఎనిమిది నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లను దాటుతున్నాయి. ఫస్ట్‌వేవ్ ముగిసిన తర్వాత పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయి. అక్టోబరు నుంచి మే వరకు ఇలా వరుసగా ఎనిమిది నెలల పాటు ప్రతీ నెల లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. లాక్డౌన్ ప్రభావం కరోనా సెకండ్ వేవ్ మార్చిలో మొదలైతే ఏప్రిల్‌లో దేశం మొత్తాన్ని చుట్టేసింది. దీంతో మే నెలలలో దాదాపు దేశంమంతటా లాక్డౌన్ అమలైంది. దీని ప్రభావం పన్ను వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్‌లో జీఎస్టీ ద్వారా 1.41 లక్షల కోట్ల ఆదాయం రాగా మే నెలలో దాదాపు 41 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయి రూ. 1.02 లక్షల కోట్ల ఆదాయమే వచ్చింది. అయితే 2020 మేతో పోల్చితే ఆర్థిక వ్యవస్థపై కరోనా , లాక్డౌన్ ప్రభావం తగ్గింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పస్టం చేస్తున్నాయి. -
సరికొత్త రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ
కరోనా మహమ్మరి కాలంలో భారతీయ రైల్వే మరో రికార్డు సృష్టించింది. మే నెల మొత్తంలో అత్యధికంగా సరుకుల రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2021 మేలో భారత రైల్వే అత్యధికంగా 114.8 మెట్రిక్ టన్నుల(ఎమ్‌టి) సరుకులను రవాణా చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో సుమారు 54.52 మిలియన్ టన్నుల బొగ్గు, 15.12 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 5.36 మిలియన్ టన్నుల సిమెంట్(క్లింకర్ మినహా), 3.68 మిలియన్ టన్నుల ఎరువులు, 3.18 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్ రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఫలితంగా గత నెలలో 11,604 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మే 2019లో 104.6 టన్నుల సరుకు రవాణా చేసింది. ఇప్పటి వరకు అదే అత్యధికం ఉండేది, ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. 2019 మేతో పోలిస్తే ఇది 9.7 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వేకు గత నెలలో ఆదాయం, సరుకు రవాణా ఎక్కువగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మే నెలలో వేగన్ టర్న్ అరౌండ్ టైమ్ 26 శాతం మెరుగైందని రైల్వే పేర్కొంది. గత 18 నెలల్లో సరుకు రవాణా రైళ్ల వేగం రెట్టింపు కావడంతో పాటు, రాయితీలు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల గత నెలలో అత్యధికంగా సరుకు రవాణా చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2021లో సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 45.6 కిలోమీటర్లుగా నమోదైంది, అదే సమయంలో ఇది గత ఏడాది 36.19 కిలోమీటర్ల వేగంతో పోలిస్తే 26 శాతం ఎక్కువ" అని రైల్వే శాఖ వెల్లడించింది. చదవండి: మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం -
మేలో దేశాన్ని వణికించిన కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో ఏప్రిల్‌నాటి కోవిడ్ సంక్షోభ రికార్డులను తిరగరాస్తూ కరోనా మే నెలలో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. నెల ప్రారంభంలో విజృంభించిన కరోనా నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టింది. కేవలం మే నెలలో దేశంలో 90,10,075 పాజిటివ్ కేసులు, 1,20,042 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య, కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువకు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మార్చి 1వ తేదీన దేశంలో 12,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా విస్తృతి విపరీతంగా పెరిగి ఏప్రిల్ 6వ తేదీన 1.15 లక్షల కొత్త కేసులొచ్చాయి. తర్వాత కరోనా సంక్రమణ వేగం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మేలో రోజువారీ కొత్త కేసులు 4 లక్షల మార్క్‌ను దాటేశాయి. మార్చి 1తో పోలిస్తే 67 రోజుల తర్వాత మే 6 న ఈ సంఖ్య 34 రెట్లు పెరిగి 4.14 లక్షలు దాటింది. గత 24 రోజుల్లో 63% తగ్గిన పాజిటివ్ కేసులు మే 6 తర్వాత దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత 24 రోజుల్లో రోజు వారీ పాజిటివ్ కేసులు 63% తగ్గి నెలాఖరున 1,27,510 కేసులు నమోదయ్యాయి. 26 రెట్లు పెరిగిన కరోనా మరణాలు దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య భయపెడుతోంది. మార్చి 1న దేశంలో 92 మరణాలు సంభవించగా, మే 18వ తేదీన దేశంలో అత్యధికంగా 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో సగటున రోజువారీ మరణాల సంఖ్య 3523గా నమోదవుతోంది. మార్చి నెలలో 5,766, ఏప్రిల్ నెలలో 48,926, మే నెలలో 1,20,042 కరోనా మరణాలు సంభవించాయి. గత 54 రోజుల్లోనే అతి తక్కువ కేసులు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1,27,510 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ కేసులు రావడం గత 54 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు పెరిగింది. గత 24 గంటల్లో 2,795 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. ఇంత తక్కువ మరణాలు నమోదవడం గత 35 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో గత 24 గంటల్లో 2,55,287 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,47,629కు పెరిగింది. రికవరీ రేటు 92.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,95,520కు చేరుకుంది. 43 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షల దిగువన నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 6.62%గా నమోదైంది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. -
మేలో మరణమృదంగం
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్‌వేవ్‌లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం కేసుల్లో 31.67 శాతం కొత్త కేసులు ఒక్క మే నెలలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల్లో తేలింది. 2.8 కోట్లకు మించిన కేసుల్లో 31.67 శాతం అంటే 88.82 లక్షల కొత్త కేసులు మే నెలలో నమోదయ్యాయని గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో ఇప్పటిదాకా 3,29,100 మంది కోవిడ్‌తో ప్రాణాలుకోల్పోగా ఒక్క మే నెలలోనే 1,17,247 మంది చనిపోయారు. అంటే మొత్తం మరణాల్లో 35.63 శాతం మరణాలు ఒక్క మే నెలలోనే సంభవించాయి. రోజువారీగా నమోదైన కొత్త కరోనా కేసుల సంఖ్య సైతం మే నెలలోనే నమోదైంది. మే 7వ తేదీన దేశంలోనే రికార్డుస్థాయిలో 4,14,188 కొత్త కేసులొచ్చాయి. ఒక్కరోజులో అధిక కోవిడ్ బాధితుల మరణాలు సైతం మే నెలలోనే సంభవించాయి. మే 19వ తేదీన ఏకంగా 4,529 మంది కోవిడ్‌కు బలయ్యారు. మే 10న యాక్టివ్ కేసుల సంఖ్య సైతం గరిష్టస్థాయిలో 37,45,237గా నమోదైంది. -
Covid Deaths: కరోనా మరణాల్లో తగ్గుదల ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా.. రోజువారీ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత మే నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో 13 రోజులు... 4వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 4,157 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో వరుసగా గత పది రోజులుగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2,08,714 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. గత 24 గంటల్లో 4,157 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,11,388కు పెరిగింది. వరుసగా 13వరోజూ కొత్త కరోనా కేసుల సంఖ్య కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.42 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు పెరిగింది. దీంతో రికవరీ రేటు 89.66 శాతానికి పెరగడం విశేషం. మరణాల రేటు 1.15 శాతంగా నమోదైంది. ఐసీఎంఆర్ తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 33,48,11,496 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో మంగళవారం 22,17,320 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో టెస్ట్‌లు చేయడం ఇదే ప్రథమం. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.42%కి చేరింది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 20 కోట్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం 20,06,62,456 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. అందులో మంగళవారం ఒక్కరోజే 20,39,087 డోస్‌లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 22,00,59,880 కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. ఇందులో వృథానూ కలుపుకుని రాష్ట్రాలు, యూటీలు మొత్తంగా 20,13,74,636 డోస్‌లను వినియోగించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1,77,52,594 డోసులు అందుబాటులో ఉన్నాయి. మరో లక్ష వ్యాక్సిన్ డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపనుంది. మేలో 4వేలకుపైగా మరణాలు నమోదైన తేదీలు తేదీ మరణాలు మే 7 4,233 మే 8 4,092 మే 11 4,198 మే 12 4,128 మే 13 4,000 మే 15 4,077 మే 16 4,098 మే 17 4,334 మే 18 4,339 మే 20 4,209 మే 21 4,194 మే 23 4,454 మే 25 4,159 -
Cyclone Yaas: బంగాళాఖాతంలో పురుడుపోసుకోనున్న ‘యాస్’
న్యూఢిల్లీ: పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. యాస్‌గా నామకరణం ఈ అల్పపీడనం తుపానుగా బలపడితే 'యాస్' గా నామకరణం చేశారు. ఇది తుపానుగా మారితే ఈస్ట్‌కోస్ట్ పై అధికంగా ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని బంగాళఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ అన్నారు. ఇది పశ్చిమ బెంగాల్ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోరున గాలివాన: యముడు లీవ్‌లో ఉన్నాడేమో, లేదంటే! -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
మే నాటికే దేశంలో 65 లక్షల మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ‘సెరో సర్వే’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. గత మే 11 నుంచి జూన్ 4 మధ్య కాలంలో 28 వేల మందిపై జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహించింది. వీరి రక్త నమూనాలు సేకరించి కోవిడ్ కవచ్ ఎలీసా టెస్ట్ కిట్ ద్వారా వారి రక్తంలో ఐజీజీ యాంటీబాడీస్‌ను పరీక్షించారు. ‘సెరో ప్రివలెన్స్’తక్కువగా ఉన్నట్లు.. మే నెల మధ్యకల్లా జనాభాలో ఒక శాతం కంటే తక్కువ జనాభా మాత్రమే దీంతో ప్రభావితమైనట్లు ఈ సర్వేలో వెల్లడైంది. దేశంలోని అధిక జిల్లాల్లో ఇది తక్కువగా వ్యాప్తి చెందడాన్ని బట్టి కోవిడ్ మహమ్మారి ఇంకా ప్రారంభ దశలో ఉందని, ముందు ముందు మెజారిటీ ప్రజలు ఇంకా వైరస్ బారిన పడే అవకాశాలున్నట్టుగా ఈ సర్వే నివేదిక నొక్కి చెబుతోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు రిపోర్ట్ కాని లేదా స్వల్పసంఖ్యలో నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో అనుమానిత కేసుల వెలికితీతకు మరింత నిఘాతో పాటు టెస్టింగ్‌ల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ఐసీఎంఆర్ సర్వేతో స్పష్టం చేసింది. కాగా, తొలిసారిగా జాతీయస్థాయిలో ఐసీఎంఆర్ నిర్వహించిన సెరో సర్వేలో వెల్లడైన అంశాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. ప్రతీ నిర్ధారణ కేసుకు 82–130 కోవిడ్ ఇన్ఫెక్షన్లు... ‘సెరో ప్రివలెన్స్’0.73 శాతంతో రిపోర్ట్ అయిన కోవిడ్ కేసులను మొత్తంగా సర్దుబాటు చేసినపుడు (ఒవరాల్ అడ్జస్టెట్ సెరో ప్రివలెన్స్) ఆర్టీ–పీసీఆర్ టెస్ట్‌తో నిర్ధారణ అయిన ప్రతీ కేసుకు దేశంలో 82–130 కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లోని 30,283 కుటుంబాలను కలుసుకోగా, ఇందులో పాల్గొనేందుకు 28వేల మంది అంగీకరించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగస్వాములైన వారిలో 48.5 శాతం మంది 18 నుంచి 45 ఏళ్లలోపువారు. వీరిలో 51.5 శాతం మంది మహిళలు. లేబొరేటరీలు అందుబాటులో లేకపోవడం లేదా తక్కువ స్థాయిలో పరీక్షల కారణంగా కొన్ని జిల్లాల్లో కేసుల డిటెన్షన్ తక్కువ ఉండొచ్చునని సర్వే చెబుతోంది. జీరో కేస్ జిల్లాల్లో 8.56 లక్షల కేసులు మే నెలలో సర్వే నిర్వహించేనాటికి జీరో కేస్ భావిస్తున్న 233 జిల్లాల్లో అత్యధికంగా 8.56 లక్షల కేసులున్నట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో తొలి కరోనా కేసు రిపోర్ట్ అయిన 2 నెలల తర్వాత మొత్తం కేసుల్లో 13 శాతం ఈ జిల్లాల్లోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాప్తి తక్కువగా ఉందని భావిస్తున్న జిల్లాల్లో 18.17 లక్షల కేసులు, మధ్యస్థం అనుకుంటున్న జిల్లాల్లో 15.18 లక్షల కేసులు, అత్యధికం అని భావిస్తున్న జిల్లాల్లో 22.76 లక్షల కేసులున్నట్లు ఈ సర్వే పేర్కొంది. 18–45 ఏళ్ల మధ్యలో అత్యధికం సెరో పాజిటివిటీ 18–45 ఏళ్ల మధ్యలోనున్న వారిలో అధికంగా 43.3 శాతం, 46–60 ఏళ్ల మధ్యనున్న వారిలో 39.5 శాతం, అత్యల్పంగా 60 ఏళ్లకు పైబడిన వారిలో 17.2 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అంటే 60 ఏళ్లలోపు 82.3 శాతం మందిలో సెరో పాజిటివిటీ ఉన్నట్టు వెల్లడైంది. రాబోయే రోజుల్లో పరిస్థితి చేయి దాటకుండా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రత్యేక కంటైన్మెంట్ల ఏర్పాటుతో పాటు లక్షణాలున్న వారందరికీ పరీక్షల నిర్వహించాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేయడం, హైరిస్ట్ కాంటాక్ట్‌ల ట్రేసింగ్ వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. -
మేలో కూడా ‘కనీస’ వసూలే..
సాక్షి, హైదరాబాద్: గత ఏప్రిల్ తరహాలోనే ప్రస్తుత మే నెలలో కూడా గృహాలు (ఎల్టీ–1), వీధి దీపాలు (ఎల్టీ–6ఏ), తాగునీటి సరఫరా (ఎల్టీ–6బీ) కేటగిరీల విషయంలో మీటర్ రీడింగ్ తీయకుండా ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్నారు. 2019 మే నెలలో వసూలు చేసిన విద్యుత్ బిల్లులకు సమానమైన బిల్లును ప్రస్తుత మే నెలలో ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. గృహేతర/వాణిజ్య సముదాయా లు (ఎల్టీ–2) , సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎల్టీ–3), కుటీర పరిశ్రమలు (ఎల్టీ–4), సాధారణ (ఎల్టీ–7), తాత్కాలిక (ఎల్టీ–8) కేటగిరీల వినియోగదారులకు మే నెల విద్యుత్ బిల్లు ల చెల్లింపు విషయంలో కాస్త ఊరట లభించనుంది. మే 7 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తే ఈ కేటగిరీల వినియోగదారుల నుంచి కనీస బిల్లులు మాత్రమే వసూలు చేయనున్నారు. లాక్డౌన్ పొడిగించకపోతే మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులు చెల్లించాల్సి ఉం టుంది. ఈ మేరకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ ముగిసే వరకు ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశముంది. లాక్డౌన్ ముగిసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి తాత్కాలిక విధానంలో చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిదిద్దనున్నారు. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, డిస్కంల వెబ్సైట్ల ద్వారా వినియోగదారులందరికీ వారికి సంబంధించిన మే నెల బిల్లుల వివరాల ను తెలియజేయాలని ఈఆర్సీ కోరిం ది. లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం మీటర్ రీడింగ్ సేకరించకుండా ప్రత్యామ్నాయ పద్ధతి లోనే విద్యుత్ బిల్లులు వసూ లు చేసే అవకాశముంది. భారీ పరిశ్రమలకు వాస్తవ బిల్లింగ్.. హైటెన్షన్ కేటగిరీ (హెచ్‌టీ) పరిధిలోకి వచ్చే భారీ పరిశ్రమల నుంచి మీటర్ రీడింగ్ సేకరించి దాని ఆధారంగానే బిల్లులను జారీ చేస్తున్నారు. ప్రస్తుత మే నెలలో సైతం మీటర్ రీడింగ్ తీసి బిల్లులు చేయనున్నారు. అయితే, లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నష్టపోయిన నేపథ్యంలో ఫిక్స్డ్ చార్జీల వసూళ్లను ప్రస్తుతానికి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కేవలం ఎనర్జీ చార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోనుంది. ఎవరూ నష్టపోకుండా చర్యలు.. లాక్డౌన్ కాలంలో మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా సగటున నెలకు ఎన్ని యూనిట్లు వినియోగించి ఉంటారని లెక్కించి ప్రత్యామ్నాయ విధానంలో వసూలు చేసిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులను సరిచేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే అధికంగా బిల్లులు చెల్లించిన వారికి తదుపరి బిల్లులను ఈ మేరకు తగ్గించి సర్దుబాటు చేయనున్నారు. వాస్తవ వినియోగంతో పోల్చితే ఎవరైనా తక్కువ బిల్లులు చెల్లిస్తే తదుపరి కాలానికి సంబంధించిన బిల్లులను ఆ మేరకు పెంచి డిస్కంలు నష్టపోకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని డిస్కంలు తయారు చేసి ఈఆర్సీ నుంచి అనుమతి తీసుకోనున్నాయి. -
మే మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఈనెల 24న మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. 2020 మే మొదటి వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర పరీక్షలను ఈ సారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. -
22 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం 22నెలల కనిష్టానికి దిగి వచ్చింది. మే నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధనం, విద్యుత్ వస్తువుల ధరలు పడిపోవడంతో ద్రవ్యోల్బణం మే నెలలో 2.45 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ నెలలో 3.07 శాతంగా నమోదైంది. గత ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 6.99 శాతంగా ఉంది, ఏప్రిల్‌లో ఇది 7.37 శాతంగా ఉంది. అయితే ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 15.89 శాతంగా నమోదైంది. కూరగాయల ద్రవ్యోల్బణం మే నెలలో 33.15 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 40.65 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.84 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం మే నెలలో 1.28 శాతంగా నమోదైంది. గత నెలలో 1.72 శాతం నమోదైంది. మరోవైపు మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.05శాతం వద్ద 7 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. -
వరుసగా మూడోసారి రూ. లక్ష కోట్లు దాటేశాయి
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడవ నెలలో కూడా లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ జీఎస్టీ వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో మే నెలలో రూ. 100289 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వసూళ్లు, 6.67 శాతం పుంజుకోగా, ఆదాయం 2.21శాతం పెరిగి 94,016 కోట్ల రూపాయలుగా ఉంది. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ మొత్తం రు. 1,13,865 కోట్లగా ఉండగా, మార్చిలో రూ. 1,06,577 కోట్లుగా నమోదయ్యాయి. శనివారం ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ .17,811 కోట్లు, ఎస్జీఎస్టీ రూ 24,462 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఆదాయం. రూ 49,891 కోట్లు. చెస్ వసూళ్లు రూ .8,125 కోట్లు. 2019 మే నెలలో 3,108 రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
క్షీణించిన మారుతి విక్రయాలు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కారు మేకర్ మారుతి సుజుకి మే నెల అమ్మకాల్లో చతికిల బడింది. అమ్మకాలు 22 శాతం క్షీణించి 1,34,641 యూనిట్లు విక్రయించింది. ఈ మేరకు శనివారం గణాంకాలను మారుతి విడుదల చేసింది. మే నెలలో 1,72,512 యూనిట్లు విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ అమ్మకాలు 23.1 శాతం క్షీణించి 1,25,552 యూనిట్లు విక్రయించగా .. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 1,63,200 యూనిట్లు విక్రయించింది. ఆల్టో, వ్యాగన్ ఆర్ లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 16,394 యూనిట్లుగా నమోదయ్యాయి. మే నెలలో 37,864 యూనిట్లు విక్రయించగా, ఇవి 56.7 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్లతో సహా 9.2 శాతం క్షీణించి 77,263 యూనిట్ల నుంచి 70,135 గా ఉన్నాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ 3,592 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 4,024 యూనిట్లను విక్రయించింది. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా వినియోగ వాహనాల అమ్మకాలు 25.3 శాతం తగ్గి 19,152 కి చేరుకున్నాయి. అంతకు ముందు నెల 25,629 యూనిట్లు విక్రయించింది. ఎగుమతులు మే నెలలో 2.4 శాతం తగ్గి 9,089 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 9,312 యూనిట్లు ఎగుమతులు జరిగాయి. -
కష్ట‘మే’
జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలు బయటకు రావాలంటే కష్టతర‘మే’ అవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దుపోయినా సెగ తగ్గడం లేదు. ఉక్కపోత ఊపిరాడనీయడం లేదు. వడగాల్పుల ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. చిన్నాపెద్దా తేడాలేకుండా వడదెబ్బబారిన పడుతున్నారు. సరైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవి తాపానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి తుడా: జిల్లా అగ్నిగుండంలా మారింది. ఉదయం నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. 46 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గత ఏడాది మేలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి ఇప్పటికే 46.3 డిగ్రీలు దాటేసింది. పెరుగుతున్న ఎండలతో రాత్రి, పగలు తేడాలేకుండా సెగలు కక్కుతున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాల్పులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల చివరి కల్లా జిల్లాలో మరింతగా ఎండలు పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా తరుపతి, తిరుపతి రూరల్ రామచంద్రాపురం, చంద్రగిరి తదితర తూర్పు మండలాల్లోనే కనిపిస్తోంది. పిట్టల్లా రాలుతున్న జనం ఎండవేడిమి, సెగల కారణంగా పలువురు వడదెబ్బబారిన పడుతున్నారు. సరైన చికిత్స అందక పిట్టల్లా రాలిపోతున్నారు. ఏప్రిల్, మేలో ఇప్పటివరకు 83 మంది వడదెబ్బతో మృతిచెందినట్లు అధి కారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉండవచ్చని అంచనా. దడ పుట్టిస్తున్న ఎండ ఈ ఏడాది ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచే సెగలు కక్కుతోంది. మార్చిలో 40 డిగ్రీలు దాటేసింది. ఏప్రిల్‌లో 42 డిగ్రీలు నమోదయ్యింది. మే 11న 46.3 డిగ్రీలకు చేరింది. ఇన్నేళ్లలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కావడం విశేషం. బంగాళాఖాతం నుంచి వచ్చే వేడిగాలుల కారణంగా జిల్లాలో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటోంది. దీనికితోడు ఇటీవల భయపెట్టిన ఫొని తుపాను కారణంగా గాలిలో తేమశాతం తగ్గిపోయింది. ఫలితంగా ఎండ వేడిమి పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మాడిపోతున్న జనం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. సెగకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. పేదలు, కూలీలు ఎండబారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పలువురు రోగాలబారినపడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే మిట్టమధ్యాహ్నాన్ని తలపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఎండమావులతో రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మండే ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకు సాహించడం లేదు. రాత్రి వేళల్లోనూ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. తీవ్ర ఉక్కపోతతలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వెంటాడుతున్న క్షామం జిల్లాలోని వృక్ష సంపద ఎండలతో మలమలా మాడిపోతోంది. 12 ఏళ్ల నాటి పరిస్థితులు జిల్లాలో మళ్లీ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. అడవులు, నిమ్మ, మామిడి తోటలు వాడుముఖం పడుతున్నాయి. పడమటి మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూర్భ జలాలు రికార్డు స్థాయికి అడుగంటాయి. తాగడానికీ నీళ్లు కరువవుతున్నాయి. గుక్కెడు నీటికోసం మూగజీవాలు పడరాని పాట్లు పడుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. -
పారిశ్రామికం నేల చూపు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం– ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్ రంగాల పేలవ పనితీరును ప్రదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలను చూస్తే (ఏప్రిల్, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. విద్యుత్: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. మైనింగ్: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలను కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది. ఎఫ్ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా – 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం. కన్జూమర్ గూడ్స్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధిలేకపోగా –2.6 క్షీణత నెలకొంది. -
‘బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్’
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్‌గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. 40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు. -
‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసుకు, ఆ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డికి మే నెలతో వివాదాస్పద అనుబంధం ఉందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన కుట్ర మొత్తం మే నెలలోనే సాగినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది 2015, మే 30వ తేదీనే. ఈ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ మూడేళ్ల తర్వాత.. అంటే 2018 మే నెలలోనే మళ్లీ తెరపైకి వచ్చింది. స్టీఫెన్‌సన్‌తో సాగి న సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఈ నెలలోనే ఏసీబీకి చేరింది. అటు ఏసీబీ కూడా ఈ నెలలోనే తుది చార్జిషీటు దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తంగా ‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో మే నెల కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన రేవంత్‌రెడ్డికి కూడా మే నెల అచ్చివచ్చి నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయంగా 2015 మే 30న తీరని దెబ్బ పడింది. ఇప్పుడదే నెలలో ఆయన ఏకంగా సీఎం అవడం తన లక్ష్యమం టూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన రాజకీయ భవిష్యత్‌ను ఎటువైపునకు తీసుకెళుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం. -
సింగపూర్‌లో తెలుగు సమాజం మేడే వేడుకలు
-
ఘనంగా మేడే వేడుకలు
మోత్కూరు : ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా మేడే వేడుకలను నిర్వహించా రు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మెంట సురేష్ ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గుండ గోని రామచంద్రు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అన్నెపు పద్మ, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు అవిశెట్టి సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందుల సురేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ గుండు శ్రీను, ఎంపీటీసీలు జయశ్రీ, కురిమిళ్ల ప్రమీళ, నాయకులు పురుగుల నర్సింహ, ఎల్.రఘువర్దన్, గంజి మంగమ్మ, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో... మండలంలోని పాలడుగు, బుజిలాపురం, పొడిచేడు, దత్తప్పగూడెం, పాటిమట్ల, కొండగడప గ్రామాల్లో సీపీ ఐ ఆధ్వర్యంలో, పాలడుగులో సీపీఎం ఆధ్వర్యంలో బు ధవారం మేడే ఉత్సవాలు నిర్వహించారు. పాలడుగు లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి దడిపెల్లి సుదర్శన్, దత్తప్పగూడెంలో సీపీఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, పొడిచేడులో జిట్ట రాములు ఎర్రజెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం మండల మాజీ కార్యదర్శి గుండు వెంకటనర్సు, నాయకులు బరిగల నారాయణ, పుట్టల చంద్రయ్య, దడిపెల్లి శ్రీనివాస్, సోమరాజు, సైదులు, ప్రభాకర్, సీపీఐ నాయకులు కొంపెల్లి రవి, వల్లపు అంతయ్య, చేతరాశి సత్తయ్య, గుగ్గిల ఎల్లయ్య, జిట్ట కృష్ణ, దొండ ఎల్లయ్య, బోడ చంద్రయ్య, పులకరం మల్లేశం, లక్ష్మీనర్సయ్య, బోడ శ్రీను, కడమంచి వీర స్వామి తదితరులు పాల్గొన్నారు. -
లోటస్‌పాండ్‌లో మే డే
జోగిపేట(అందోల్) : హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మే డే కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేసారన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను గుర్తించి వారిని సన్మానించారు. ఇందులో రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మనందరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ గుప్త, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
నెహ్రూసెంటర్(మహబూబాబాద్) : కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. మంగళవారం మానుకోట జిల్లా కేంద్రంలో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవమైన మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఎర్ర చొక్కాలు, చీరలు ధరించిన వందలాది మందితో పట్టణంలోని గాంధీపార్కు నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో కార్మికులు, మహిళలు నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి సీపీఐ పార్టీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ నిర్వహించిన ఉమ్మడి సభ సీపీఐ పట్టణ అధ్యక్షుడు పెరుగు కుమార్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా బి.విజయసారథి పాల్గొని మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారని తెలిపారు. అదే స్ఫూర్తి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కార్మికుల హక్కులు సాధించుకునేందుకు చేసే పోరాటాలే మేడే అని అన్నారు. కార్మికులు హక్కులను హరిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజలపై దాడులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కట్లోజు పాండురంగాచారి, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నాయకులు చింతకుంట్ల యాకాంబ్రం, నర్రా శావణ్, వెలుగు శ్రావణ్, కేసుదాసు రమేష్, దాస్యం రామ్మూర్తి, ఎండీ.ఫాతిమా, మంద శంకర్, జక్కరయ్య, హల్య, సోమయ్య, భావాని, శ్రీను, శంకర్, కిష్టయ్య, పాల్, మహిమూద్, విజయలక్ష్మి, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు. -
రెపరెపలాడిన ఎర్రజెండాలు
సిరిసిల్లటౌన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించా రు. వివిధ కార్మిక, శ్రామిక, రాజకీయ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో వాడవాడనా ఎర్రజెండాల రెపరెపలాడాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కరీంనగర్ పార్లమెంటుసభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొని జెండా ఎగురవేశారు. ఈకార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక భవన్లో జరిగిన వేడుకల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, కార్మిక నాయకులు ఎలిగేటి రాజశేఖర్, బూర శ్రీనివాస్, నల్ల చంద్రమౌళి పాల్గొన్నారు. గాంధీనగర్ లేబర్ అడ్డా వద్ద జరిగిన వేడులు మిన్నంటాయి. ‘సెస్’ ఆఫీస్ ముందు వేడుకలు జరిగాయి. 104 యూనియన్ నాయకులు మహేందర్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ జెండా ఎగురవేశారు. జిల్లా ఆస్పత్రిలో కార్మికులు ఎర్ర జెండాలను ఎగురవేశారు. చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో డైయింగ్ కార్మిక సంఘం వేడుకలు నిర్వహించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు జెగ్గాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులను సన్మానించారు. నాయకులు మూషం రమేశ్, పంతం రవి, మోర అజయ్ పాల్గొన్నారు. ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో నాయకులు భూతం వీరన్న, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు ఆవునూరి రమాకాంత్‌రావు, డిపో అధ్యక్షుడు ఎల్పీ రాం, ప్రధాన కార్యదర్శి సీహెచ్ బాణయ్య పాల్గొన్నారు. నవోదయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్లరూరల్ : తంగళ్లపల్లి, సిరిసిల్ల అర్బన్ మండలాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూర్, రాజీవ్‌నగర్, చంద్రంపేటలో హమాలీ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. జెండావిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పూర్మాణి లింగారెడ్డి జెండా ఆవిష్కరించారు. టెక్స్‌టైల్‌పార్క్‌లో సీఐటీయూ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. తంగళ్లపల్లి, మండెపల్లి, జిల్లెల్ల, బద్దెనపల్లి, చీర్లవంచ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండి దేవదాసు, రాములు, అంజయ్య, మధు, రాకం రమేశ్, పెద్దూర్ సింగిల్ విండో చైర్మన్ ఉలిసె తిరుపతి, రెడ్డి నా యక్, వెంకటరమణారావ్, అలీ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట : కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానపురం లక్ష్మణ్ అన్నారు. రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రంగంపేటలో మంగళవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. సీఐటీయూ అధ్యక్షుడు సాన ప్రతాప్, కోనేటి ఎల్లయ్య, మల్లయ్య, మేగి లచ్చయ్య, మేగి శ్రీనివాస్, నర్సయ్య, కనకరాజు, పి. శంకరయ్య, కర్తిలాల్, దేవరాజు, దేవ్‌సింగ్, మోహన్ పాల్గొన్నారు. ముస్తాబాద్ : కార్మికుల దినోత్సం నిర్వహించారు. తాపీ మేస్త్రీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ముస్తాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. మొర్రాయిపల్లి, నామాపూర్, పోత్గల్, గూడెం గ్రామాల్లో మేడే ఉత్సవాలను నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఎగురవేశారు. మొర్రాయిపల్లిలో జరిగిన వేడుకల్లో ఎస్సై రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. సర్పంచులు నల్ల నర్సయ్య, సందుపట్ల పద్మ, కొమ్ము పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాల య్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు. కార్మిక సంఘాల నాయకులు నర్సయ్య, ఎల్లం, రంగ య్య, అంజిరెడ్డి, రాజు, చంద్రం పాల్గొన్నారు. గంభీరావుపేట : మండలంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం, హమాలీ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జెండావిష్కరణలు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు బాలమల్లయ్య, ముద్రకోల ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, సర్పంచ్ పాపగారి భూలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగదండి స్వామి, ఎంపీటీసీ హమీదోద్దీన్, అడ్వయ్య పాల్గొన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ జెండా ఎగురవేస్తున్న ఈయూ గౌరవ అధ్యక్షుడు రమాకాంత్‌రావు -
గాంధీభవన్‌లో ఘనంగా మేడే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు మంగళవా రం ఘనంగా జరిగాయి. మేడే సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక హక్కులకు కాంగ్రెస్ పార్టీ రక్షణగా నిలిచిందని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కార్మికులు సుఖంగా జీవించారని నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను చూస్తే అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోన్న టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం కోసం పలు చట్టాలను అమలు చేసిన ఏకైక సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, కార్మికు లకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సింగరేణిలోని కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల కార్మికులు, కార్మికుల పిల్లలు నష్టపోతున్నారని అన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి సంక్షేమం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం కార్మికులకు అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అమలుకాని కార్మిక చట్టాలు పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని, అసంఘటిత కార్మికుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, హక్కుల అమలు కోసం వారి పక్షాన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని అన్నారు. అనంతరం గట్టు, ఓబుల్ రెడ్డి వివిధ విభాగాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందిస్తున్న రాజారెడ్డి, శ్రావణ్ కుమార్, సి.చంద్రశేఖర్ రెడ్డి, నారాయణమ్మ, ధనలక్ష్మి, రాజేందర్‌లకు మేడే కార్మిక అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ప్రఫుల్లా రెడ్డి, మతీన్, బి.సంజీవరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, అందు కోసం అహర్నిశలు పని చేస్తుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. యాజ మాన్యం– కార్మికుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడితే ఆర్థిక వృద్ధిని సాధిం చవచ్చన్నారు. మంగళవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని రవీంద్రభారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రూ. 10 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులు చనిపోతే రూ. 2 లక్షలే ఇచ్చేవారని, ప్రస్తుతం రూ. 6 లక్షలు ఇస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయెల్ అన్నారు. కార్మికులకు న్యాయం జరగాలన్న తలంపుతో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగం, వేతనం, సామాజిక భద్రత విషయంలో కార్మికులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 2020 నాటికి భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొలుత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం 8 మందికి అత్యుత్తమ యాజమాన్య అవార్డులు, 30 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ కె.వై.నాయక్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, మినిమం వేజస్ చైర్మన్ జేసీఎల్ చంద్రశేఖర్ గంగాధర్ పాల్గొన్నారు. అవార్డులు అందుకుంది వీరే: జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కాఫీ లిమిటెడ్, యశోద హాస్పిటల్, ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మైలాన్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్. -
మేడే వేడుకల్లో పాల్గొన్న పొన్నం
సాక్షి, రాజన్నసిరిసిల్ల : రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్ల బివైనగర్‌లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో ఉన్న కార్మిక చట్టాలను , సంక్షేమాలను మరించ మెరుగు పరిచి కార్మికులకు అందేవిధంగా కృషిచేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సిరిసిల్ల కార్మికులకు ఏం ప్రయోజనం కలుగుతుందని ఊహించామో, అదంతా ఇపుడు శూన్యమన్నారు. రాబోయే కాలంలో నేత కార్మికులకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉండే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందిస్తామని తెలిపారు. -
తెలుగు తెరపై వెలిగిపోయిన ఎర్ర సినిమాలు
-
నా పేరు కార్మికుడు.. నా ఇల్లు పరిశ్రమ..
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కాదేది కవిత్వంకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. మరి ఆ అగ్గిపుల్లను, సబ్బుబిల్లను తయారు చేసే కార్మికుడు కవిత్వం కంటే గొప్పవాడు కావచ్చు. తానుంటేనే నేనుంటానంటది ఫ్యాక్టరీ.. తానుంటేనే నేను నిలబడతానంటది దేశం.. తానుంటేనే నేనని ఒకటి ఉంటుందంటది వస్తువు...తానే నేను..నేనే తానంటది యంత్రం... తనెవరో కాదు కష్టాన్ని ఖార్ఖానాలో, జీవితాన్ని యంత్రంతో ముడివేసుకున్నవాడు...అందరివాడు..మనందరివాడు...అతడే ఒక కార్మికుడు. నా పేరు కార్మికుడు.. నా ఇల్లు పరిశ్రమ..నా పరిశ్రమే నా పరిశ్రమకు ఊతం.. ఇది నాకు గర్వం.. నేడు మేడే సందర్భంగా దేశం మొత్తం తన కష్టాన్ని గుర్తు చేసుకుంటుంది.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా మేడే వేడుకులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో... విజయవాడ: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, శివరామకృష్ణ పాల్గొన్నారు. అనంతపురం : జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అనంతపురం అర్భన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీంఅహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల శ్రమను గుర్తించాలని, వారిని నిర్లక్ష్యం చేస్తే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ప్రకాశం : ఒంగోలు వైస్సార్సీపీ కార్యాలయంలో వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కేవీ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి , రాష్ట్ర వైస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వేమూరి బుజ్జి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు వామపక్ష ,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్మికుల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మేయర్ సురేష్ బాబు, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణలో.. హైదరాబాద్: నగరంలో మే డే వేడుకలను టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలతోపాటు అన్ని పార్టీలు నిర్వహించాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మే డే సందర్భంగా ఎండా ఎగురవేసి.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారావు ప్రభుత్వం తరఫున మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు. వైయస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు భూమి రెడ్డి ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ టీయూసీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్మిక రంగంలో విశిష్ట సేవలందించిన వారికి వారి సేవలను గుర్తించి వైయస్సార్టీయూసీ మెమెంటోలు అందజేసారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ గారు కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్టీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కామారెడ్డి : బాన్సువాడ మండలంలో ఘనంగా మేడే వేడుకలు జరిపారు. కార్యక్రమంలో జెండాను ఎగురవేశారు. కార్మికులు, సీపీఐ, సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ : నాగార్జున సాగర్‌లో మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నాగార్జున సాగర్ టిఆర్ఎస్ ఇంచార్జ్ నోముల నరసింహయ్య, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ : జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి లో సహకార సంఘం ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్ పెట్రోల్ బంకును ప్రారంభించారు. -
మేడేను విజయవంతం చేయండి
వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే మే డే కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నందిమల్ల రామస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ రోడ్ సత్యనారాయణ రైస్‌మిల్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బి.రాములు, పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, కౌన్సిలర్ నందిమల్ల శారద, రైస్‌మిల్ అధ్యక్షులు మన్యం, హమాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న, ఆటో యూనియన్ అధ్యక్షులు ఖలీల్, గంధం రాజు, మన్యం పాల్గొన్నారు. -
శ్రామిక జన కేతనం ‘మే డే’
ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత ఏనాడో అమెరికాలో జరిగింది. ‘‘కమ్యూనిస్టు భూతాన్ని’’ నిర్మూలించటానికి కంకణం కట్టుకున్న అమెరికాలోనే ప్ర పంచ కార్మిక విజయాలకు అంకురార్పణ జరగటమే ఆ వింత. పారిశ్రామిక విప్లవం ఆవిర్భావంతో పెట్టుబడిదారీ వర్గం–కార్మిక వర్గం అనే రెండు ప్రత్యర్ధి వర్గాలు ఏర్పడ్డాయి. కార్మికులను బానిసల్లా చూసేవారు. రోజుకు 16 నుంచి 20 గంటల దాకా పనిచేయాల్సిన దుస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. 10 గంటలే పని చేస్తామనే డిమాండ్‌తో ఆందోళనలు , సమ్మెలు చేయటం ప్రారంభమైంది. దీంతో అమెరికాలో 1827లో తొలిసారిగా 10 గంటల పనిదినాన్ని ఆమోదిస్తూ శాసనం చేశారు. 1884లో అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఎనిమిది గంటల పనిదినానికి తీర్మానించింది. ఈ డిమాండ్‌ను సాధించడానికి 1886 మే 1న ఉద్యమించాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన చికాగో నగర కార్మికులు మే 1న సమ్మె ప్రారంభించారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు కాల్పులు జరగ్గా ఆరుగురు కార్మికులు మరణించారు. కాల్పులకు నిరసనగా హే మార్కెట్లో జరిపిన సభపై మళ్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు కార్మికులు, ఏడుగురు పోలీసులు చనిపోయారు. ఈ ఘర్షణ సాకుగా చూపి ఒక తప్పుడు కేసు బనాయించి నలుగురు కార్మిక నాయకుల్ని 11–11.1887న ఉరితీశారు. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ దమనకాండ కొనసాగింది. 1890లో మొదటి మేడే జరిగింది. ఇన్ని బలిదానాలో సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు మరింత మెరుగు పడాల్సిన ఆధునిక యుగంలో ముఖ్యంగా మనదేశంలో ఇవి రోజు రోజుకూ మృగ్యమవుతున్నాయి. విద్యావంతులే అధికంగా పనిచేసే అనేక కార్పొరెట్ రంగాల్లో 10–12 గంటలు పని చేయిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉంది. సెజ్ లోనే కాక అనేక పరిశ్రమల్లో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. అసంఘటిత రంగంలో ఆధునిక బానిస వ్యవస్థ యధేచ్చగా కొనసాగుతోంది. బాలకార్మికుల్ని గూర్చి చెప్పుకోకపోవటమే ఉత్తమం. పని ప్రదేశాల్లో మహిళ పరిస్థితి మరీ దారుణం.చికాగోలో ఉరితీసిన కార్మిక వీరుడు స్విస్ ‘‘మమ్మల్ని ఉరితీయటం ద్వారా కార్మికుల్ని ఆపలేరు, మీరు రగిలించిన నిప్పురవ్వ జ్వాలలై లేస్తాయి. దాన్ని మీరు ఆపలేరు’’ అన్న మాటల్ని కార్మికులు నిజం చేయాలి. (నేడు మేడే సందర్భంగా) చెరుకూరి సత్యనారాయణ, న్యాయవాది, గుంటూరు మొబైల్ ః 98486 64587