
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఈనెల 24న మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. 2020 మే మొదటి వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర పరీక్షలను ఈ సారి కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment