EAMCET exam
-
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా
-
ఎంసెట్‌కు నాన్‌లోకల్ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది టీఎస్ ఎంసెట్‌కు హాజరయ్యే వీలుందని చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, హాస్టళ్లు తెరవడంతో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించాయి. గత రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్‌కు దరఖాస్తు చేసినా పరీక్ష రాసే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిందని, ఇంజనీరింగ్‌లో చేరే వారి సంఖ్య కూడా 45 శాతం పడిపోయినట్టు ప్రైవేటు కాలే జీలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఈ సమస్య లేకపోవడంతో ప్రమాణాలున్న కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లో సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడే వీలుందని చెబుతున్నారు. ఎంసెట్, జేఈఈ కోసం శిక్షణ పొందే వారు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఇక్కడ చదువుతూనే ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారి పిల్లలు సైతం హైదరాబాద్‌లోని కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముం దు మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఏపీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఓ కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. 15 శాతం కోటాలో పోటీ...: తెలంగాణవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే అందులో 70 వేల వరకు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో 15 శాతం నాన్–లోకల్ కోటా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోటాలోనే పోటీ పడాల్సి ఉం టుంది. దీంతో ఈసారి పోటీ ఎక్కువ ఉండే వీలుందని ఎంసెట్ వర్గాలు అంటు న్నాయి. కొన్ని కోర్సులకు నాన్‌లోకల్స్ పోటీ వల్ల మేనేజ్మెంట్ కోటా విషయంలో యాజమాన్యాలు భారీగా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కరోనా వల్ల రెండేళ్ళుగా ఈసీఈ సహా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడలేదు. టాప్ టెన్ కాలేజీల్లోనూ ఈ సీట్లకు పెద్దగా డిమాండ్ కనిపించ లేదు. ఈసారి కూడా కంప్యూటర్ కోర్సులనే ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు. దీంతో ఏపీ నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లలో కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం ఉండే వీలుందని భావిస్తున్నారు. 2021 లో జరిగిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94, 550 మంది అర్హత సాధించారు. -
మే మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఈనెల 24న మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో సెట్స్ తేదీలను ఖరారు చేయనున్నారు. 2020 మే మొదటి వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర పరీక్షలను ఈ సారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. -
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు
-
‘ఎంసెట్’కు విద్యుత్ ఇబ్బందులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యుత్ అంతరాయంతో పలు కేంద్రాల్లో అధికారులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం జిల్లాలోని పలు కేంద్రాల్లో విద్యుత్ లేకపోవడంతో పరీక్ష 10 నిమిషాలు ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం నాటి గాలి కారణంగా అధికారులు నిర్వహణ కోసం సరఫరాను నిలిపివేశారు. దీంతో పలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. చివరకు ఎంసెట్ కమిటీ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను ప్రారంభించాల్సి వచ్చింది. హైదరాబాద్ శివారులోని మరో కేంద్రంలో (నోమా ఫంక్షన్ హాల్) విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది కలిగింది. అయితే అధికారులు జనరేటర్ల ఏర్పాటుతో పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. 44,445 మంది హాజరు.. బుధవారం నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షకు 48,551 మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టగా, 44,445 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలోని 67 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జరిగిన మొదటి సెషన్‌కు 23,808 మందికి 21,774 మంది (91.46 శాతం) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 24,743 మందికి ఏర్పాట్లు చేయగా, 22,671 మంది (91.63 శాతం) హాజరయ్యారు. ఆన్లైన్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తదితరులు పర్యవేక్షించారు. సులువైన ప్రశ్నలు.. ఇక ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు సులువుగానే వచ్చాయని విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష రాయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 3న కూడా అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష జరుగనుంది. 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. వేర్వేరు సెషన్లలో వేర్వేరు ప్రశ్నలు వస్తాయి కనుక చివరకు అన్నింటిని నార్మలైజ్ చేసి మార్కులను కేటాయిస్తారు. వాటికి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు. -
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
-
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
⇒ అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహణ ⇒ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలన్నీ ఆన్లైన్లో (కంప్యూటర్ ఆధారితంగా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జి.విజయరాజు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.నరసింహారావు, సెట్ల ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రఘునాథ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేశామని, కొన్నిటి నోటిఫికేషన్లు విడుదల య్యాయన్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందన్నారు. ఎంసెట్ పరీక్ష 5 రోజులు జరగనున్నందున నార్మలైజేషన్ చేసి ప్రశ్నలు ఇవ్వనున్నామన్నారు. విద్యార్థి పరీక్ష సమాధానాలను ఎన్నిసార్లయినా ఆలోచించుకొని మార్పులు చేసుకోవచ్చన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఆయా సమాధానాలు ఆటో మేటిగ్గా సబ్మిట్ అవుతాయన్నారు. కరెక్టు కీ సమాధానాలను వారి ఈ మెయిళ్లకు పంపించడంతో పాటు వెబ్‌సైట్‌లోకూడా పెడతామని చెప్పారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుందని చెప్పారు. సెట్ల షెడ్యూళ్లను వెబ్సైట్ల వివరాలను చైర్మన్ వెల్లడించారు. -
మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచండి
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియకు మరో నెల రోజులు గడువు పెంచాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినందున ప్రభుత్వం మరికొంత గడువు కోరింది. తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైతే తమపై ప్రభావం చూపుతుందని, తమకూ కొంత సమయం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్ హెల్త్ వ ర్సిటీ, ప్రైవేటు కళాశాలలు పిటిషన్లు దాఖలు చేశాయి. బుధవారం పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
-
'ఎంసెట్-2 ను రద్దు చేయవద్దు'
హైదరాబాద్: ఎంసెట్ - 2 ను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసెట్-2 పరీక్షను మళ్లీ రాయడం చాలా కష్టమని మొరపెట్టుకున్నారు. గురువారం తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో ఎంసెట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు. సమస్యను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు నాయిని హామీ ఇచ్చారు. -
ఒక్కనిమిషం నిబంధనతో విద్యార్ధుల అవస్ధలు
-
నేడు ఎంసెట్..
నల్లగొండ టూ టౌన్ : జిల్లాలోని నల్లగొండ, కొదాడ పట్టణాల్లో ఆదివారం నిర్వహించే ఎంసెట్‌కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్నీ పరీక్ష కేంద్రాల్లోని సెంటర్లలో విద్యార్థులకు నెంబర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండాముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఎంసెట్ కోసం జిల్లా కేంద్రంలో 15 సెంటర్లు, కోదాడలో 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష హాల్లోనే ఉండాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్లు రావుల నాగేదంర్‌రెడ్డి, ధర్మానాయక్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో ఏర్పాట్లపై ఆరా తీశారు. -
ఆల్ ది బెస్ట్
♦ నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ♦ వికారాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలు ♦ హైదరాబాద్‌లోనే రాయనున్న శివారు విద్యార్థులు విభాగం పరీక్ష సమయం ♦ ఇంజినీరింగ్ ఉ.10 గం. నుంచి ఒంటిగంట ♦ అగ్రికల్చర్, మెడికల్ మ.2.30గం. నుంచి సా.5.30 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎంసెట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రాలపై కొంతకాలంగా నెలకొన్న అస్పష్టతతో పరీక్ష ఇప్పటికే ఒకసారి వాయిదాపడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. తాజాగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేస్తూ.. ఈనెల 15న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఎంసెట్ పరీక్షలకు అధికారులు అన్నివిధాలా సన్నద్ధమయ్యారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లోని శ్రీ అనంత పద్మనాభస్వామి కళాశాల, సెయింట్ జ్యూడ్స్ పాఠశాలలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో 2,442 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు 1,358 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ విభాగం పరీక్షకు 1,084 మంది హాజరుకానున్నారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎస్ఏపీ కాలేజీ వరకు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు. హైదరాబాద్ డివిజన్లలో.. ఇదిలావుండగా.. నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ డివిజన్లకు సంబంధించిన విద్యార్థులకు నగరంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధితోపాటు జిల్లాలో ని పశ్చిమ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా 8 రీజియన్లుగా విభజించి దరఖాస్తులు స్వీకరించిన అధికారు లు.. ఆ మేరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఎనిమిది రీజియన్ల పరిధిలో 146 పరీక్షా కేంద్రాలను గుర్తించగా.. ఇందులో ఇంజినీరింగ్‌కు సంబంధించి 94, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 52 సెంటర్లున్నాయి. నగరంలో ఎంసెట్ రాసేం దుకు రెండు విభాగాల నుంచి 93,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 60,731, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 32,319 దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండు విభాగాల పరీక్షలకు హాజరయ్యేందుకు మరో 468 అందాయి. నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు జాగ్రత్తగా మెలగాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంసెట్ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. -
నేడు ఎంసెట్, టెట్ షెడ్యూల్ ఖరారు!
కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగే సమీక్షలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల వాయిదా వేసిన ఎంసెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తేదీలను విద్యా శాఖ సోమవారం అధికారికంగా ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద జరిగే సమీక్ష సమావేశంలో ఈ పరీక్షల తేదీలను నిర్ణయించనున్నారు. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు చేపట్టిన బంద్ నేపథ ్యంలో మే 1న జరగాల్సిన టెట్, 2న జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20లోగా ఈ రెండు పరీక్షలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా శాఖలు పరీక్షల నిర్వహణకు వివిధ తేదీలతో సిద్ధమయ్యాయి. సోమవారం చర్చించి ఆ తేదీలను కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఎంసెట్‌ను ఈ నెల 15న నిర్వహించే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే నిర్వహించే వీలుంటే 13వ తేదీనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక టెట్‌ను ఈ నెల 14న లేదా 21-22 తేదీల్లో నిర్వహించేందుకు ఖరారు చేసే అవకాశం ఉంది. -
'భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు'
కాకినాడ : రేపు (ఏప్రిల్ 29) జరుగనున్న ఏపీ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గురువారం 'సాక్షి'కి వివరించారు. పరీక్ష కేంద్రంలోకి గంట ముందే అనుమతి ఇస్తారని, నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులో ఎలాంటి పరీక్ష రాయకుండా వేటు వేస్తామని సాయిబాబా హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి సాంకేతిక పరికలరాలకు అనుమతి లేదన్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2 గంటలకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఏపీలో 494 పరీక్షా కేంద్రాలను, తెలంగాణలో 52 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 2,92,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కాగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది. -
ఎంసెట్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
విజయవాడ : రాష్ట్రంలో ఈ నెల 29న జరుగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించేలా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలను ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఆర్టీసీ రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక (స్పెషల్) సర్వీసులను నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ పరీక్షా కేంద్రానికి వెళుతున్నదీ వివరాలతో బస్సులకు ప్రత్యేక డిస్ప్లే బోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి వారు వెళ్లాల్సిన పరీక్షా కేంద్రం వైపు వెళ్లే బస్సు ఎక్కి ఎంసెట్ హాల్ టికెట్ చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 29న ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ కోర్సు విద్యార్థుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అదే మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉదయం 11గంటల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతామని తెలిపారు. ఆర్టీసీ అందిస్తున్న ప్రయాణ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
ఎంసెట్ రాస్తున్నారా... నిబంధనలు తెలుసుకోండి..!
విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎంసెట్ పరీక్ష సమయం తరుముకొస్తోంది. ఈ నెల 29వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్ష బాగా రాసి కలలను నెరవేర్చుకోవాలని భావిస్తున్న సరస్వతీ పుత్రులంతా ముందుగా నిబంధనలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి కొన్ని మార్పులు..చేర్పులు చేపట్టినందున వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించని విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం.. విలువైన సమయం మళ్లీ రావనే సత్యాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. - ఎచ్చెర్ల * పరీక్ష నిర్వహణకు చకచకా ఏర్పాట్లు * ‘నిమిషం’ నిబంధనపై విద్యార్థులకు అప్రమతం అవసరం * ఇంజినీరింగ్‌కు 11, మెడిసన్‌కు ఐదు కేంద్రాల కేటాయింపు ఎచ్చెర్ల: ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్‌కు సంబంధించి 8049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 5,918, మెడిసన్‌కు 2131 మంది ఉన్నారు. * ఇంజినీరింగ్‌కు సంబంధించి 11 కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మెడిసన్ సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. * విద్యార్థులను గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. * ఈసారి పరీక్ష కేంద్రాల్లో జా మర్లు అమర్చుతున్నందున ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు పని చేయవు. * ఈసారి చేతి గడియారాలను సైతం పరీక్ష కేంద్రంలోకి అను తించరు. * పరీక్ష కేంద్రంలో గోడ గడియారాలను విద్యార్థులు సమయం తెలుసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఫోన్లు, వాచీలు, క్యాలిక్లేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధించారు. * విద్యార్థుల హాల్ టిక్కెట్, బ్లాక్, బ్లూల్ బా ల్ పాయింట్ పెన్, కుల ధ్రువీకరణ పత్రం నక లు పరిశీలకులకు అంద జేయాలి. * ఆన్లైన్ దరఖాస్తుపై ఫొటో అంటించి ఎటస్టేషన్ చేయించిన కాపీని విద్యార్థి పట్టుకుని వెళ్లాలి. * నిమిషం ఆలసమైన పరీక్షకు అనుమతించ ని నిబంధన కచ్చి తంగా అమలవుతుంది. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. * విద్యార్థి వేలి ముద్రను సైతం ఈసారి తీసుకుంటారు. కవలలు ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాస్తున్న సంఘటనలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు వేలి ముద్రలు సేకరించాలని అధికారు లు ఈసారి నిర్ణయించారు. ఈ నిబంధన ఇప్పటికే జేఈఈ వంటి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నారు. * దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమ యం, సహాయకుల కేటాయింపు ఉంటుంది. ఇన్విజిలేటర్ అంజేసిన ఓఎంఆర్ సీట్లో విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఆంధ్రా యూనివర్సిటీ, బుక్లెట్ నంబర్, కోడ్, సక్రమంగా నింపాలి. * పర్యవేక్షకుడి సమక్షంలో మాత్రమే సంత కం చేయాలి, వేలిముద్ర వేయాలి. * ప్రశ్నపత్రం అందజేసిన వెంటనే ముందు గా ప్రింటును సరిచూసు కోవాలి. ప్రింట్ సమ స్య ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలి. ప్రతి పేజీ క్షణ్ణంగా పరిశీలించాలి. సహాయం కోసం సహాయం కోసం ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతుంది. సమస్యలు, సందేహాలు ఈ కాల్స్ ద్వా రా నివృత్తి చేస్తారు. 18004256755, 0884-2340535, 0884-2356255, 0884-23405459, జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబూరావు 9440931686 నంబర్లను విద్యార్థులు సంప్రదించవచ్చు. పక్కాగా నిబంధనలు అమలు కన్వీనర్ ప్రకటించిన నిబంధనలు పక్కాగాపాటిస్తాం. విద్యార్థులు కూడా నిబంధనలపై అవగాహనతో ఉం డాలి. ఇంజినీరింగ్‌కు 11, మెడిషన్‌కు ఐదు కేంద్రాలను కేటాయించి.. ఏర్పాట్లు చేస్తున్నాం. అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంచుకున్నాం. ‘నిమిషం’ నిబంధన పట్ల విద్యార్థులు అప్రమతంగా ఉండా లి. కనీసం గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా జాగ్రత్త పడాలి. - డాక్టర్ బాబూరావు, జిల్లా కో ఆర్డినేటర్, ఎంసెట్-2016 -
వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో ఎంసెట్: గంటా
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో 13 జిల్లాల ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. -
ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు
వెల్లడించిన సెట్ కన్వీనర్ సాయిబాబు సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సకల చర్యలు ఎంసెట్ నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంసెట్ ఈమెయిల్ (apeamcet2k16@ gmail.com)కు ఈనెల 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ సంక్షిప్త సమాచారం అందించామన్నారు. హాల్ టికెట్ నంబర్‌ను సరిచేయించుకోకపోతే వారు ఎంసెట్ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోలేరని వివరించారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం ఆన్లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు. -
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా కళాశాలల ఎంపికకు ఆదివారం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో తొలిరోజు 240 మంది విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 1,264 మంది హాజరయ్యారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 322, వెబ్ కౌన్సెలింగ్‌కు 87 మంది హాజరయ్యారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 312, వెబ్ కౌన్సెలింగ్‌కు 20, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 305, వెబ్ కౌన్సెలింగ్‌కు 88, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 325, వెబ్ కౌన్సెలింగ్‌కు 45 మంది హాజరయ్యారు. నేటి కౌన్సెలింగ్ సోమవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకూ, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకూ హాజరుకావాలి. -
మైనారిటీ వైద్య సీట్ల ఫీజులు భారీగా పెంపు
♦ యాజమాన్య సీట్లకు నెల దాటకుండానే రెండోసారి సవరణ ♦ బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 9 లక్షల నుంచి రూ. 11 లక్షలు.. సీ కేటగిరీ ఫీజు రూ. 11 లక్షల నుంచి రూ. 13.25 లక్షలకు పెంపు ♦ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ యాజమాన్య వైద్య సీట్ల ఫీజును భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా గత నెల 20 న ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు నెల రోజులు గడవకుండానే మళ్లీ పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల మైనారిటీ వైద్య యాజమాన్య కోటాలోని బీ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు ఫీజులు పెంచింది. ఆ ఫీజును ఇప్పుడు రూ. 11 లక్షలకు పెంచింది. అలాగే సీ కేటగిరీ సీట్ల ఫీజును గత నెల రూ. 11 లక్షలకు సవరించి ఇప్పుడు ఏకంగా రూ. 13.25 లక్షలకు పెంచింది. అలాగే, సీట్ల కేటగిరీల్లో తాజాగా మార్పులు చేసింది. మైనారిటీ వైద్య కళాశాలల్లో గతంలో 60 శాతం సీట్లు ఏ కేటగిరీలో ఉండేవి. వాటిని ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారానే కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. అయితే గత నెల విడుదల చేసిన ఉత్తర్వుల్లో అందులోని 10 శాతం సీట్లను యాజమాన్య కోటాలోకి చేర్చారు. దీంతో కన్వీనర్ కోటా సీట్లు 50 శాతానికి తగ్గాయి. తాజా ఉత్తర్వుల్లో మళ్లీ పాత పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ 10 శాతం సీట్లను తిరిగి కన్వీనర్ కోటాలోకి మార్పు చేశారు. దీంతో తిరిగి కన్వీనర్ కోటా సీట్లు 60 శాతానికి చేరినట్లయింది. ఇది పేద విద్యార్థులకు కాస్తంత ఊరటనిచ్చే అంశమే. కానీ, ఈ కళాశాలల్లో సీట్లన్నింటినీ మైనారిటీ విద్యార్థులతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. వారి ద్వారా భర్తీ కాకుంటే ఇతరులతో భర్తీ చేసుకోవచ్చు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫీజు అంశాలకు సంబంధించి కొన్ని సవరణలు కోరారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇక నుంచి మూడు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు... యాజమాన్య కోటా సీట్లకు ఇక నుంచి మూడు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ఒకటి కాగా... నాన్ మైనారిటీ కళాశాలల్లోని యాజమాన్య సీట్లకు మరో పరీక్షకు సర్కారు ఈ ఏడాది అనుమతించింది. ఆ ప్రకారం వాటికి ఈ ఏడాది ప్రత్యేక పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నుంచి మైనారిటీ వైద్య కళాశాలలు కూడా సొంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మైనారిటీలోని 25 శాతం సీట్లకు మాత్రమే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం సాధారణ ఎంసెట్ పరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేస్తారు. -
ప్రశాంతంగా ఎంసెట్
నల్లగొండ: జిల్లాలో ఎంసెట్-2015 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నల్లగొండ, కోదాడ పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 10,330 మంది విద్యార్థులకుగాను 9,506 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 90 శాతం హాజరు నమోదయింది. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో మొత్తం 15 సెంటర్లలో 7,051 మంది విద్యార్థులకు గాను 6,501 మంది హాజరయ్యారు. ఈ విభాగంలో 92.5 శాతం హాజరు నమోదయింది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ, నీలగిరి డిగ్రీ, పీజీ కాలేజీ సెంటర్లలో ఎంసెట్ నిర్వహణను కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏజేసీ నిరంజన్, ఎంసెట్ కో - ఆర్డినేటర్ రావుల నాగేందర్‌రెడ్డి తదితరులున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఇంజనీరింగ్ పరీక్షకు జిల్లా కేంద్రంలో ఒక విద్యార్థి, కోదాడలో ఇద్దరు విద్యార్థులు నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాలేకపోయారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఈ ముగ్గురిని అధికారులు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. మొత్తంమీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎంసెట్ సజావుగా ముగిసింది. పట్టణాల వారీగా... జిల్లా కేంద్రమైన నల్లగొండలో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం 15 సెంటర్లను ఏరా్పాటు చేశారు. ఆయా సెంటర్లలో మొత్తం 7,195 మంది విద్యార్థులు అలాట్‌కాగా 6,835 మంది హాజరయ్యారు. 356 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,135 మంది విద్యార్థులకు గాను 2,671 మంది హాజరుకాగా 464 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వర కు మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం నల్లగొండలో 9 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా 4,767 మంది విద్యార్థులు అలాట్ అయ్యారు. అందులో 4,494 మంది హాజరుకాగా 273 మం ది గైర్హాజరయ్యారు. కోదాడలో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,284 మంది విద్యార్థులకుగాను 2,087 మంది మంది విద్యార్థులు హాజరయ్యారు. 197 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 92.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఆ.. ముగ్గురు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి నిమిషం నిబంధన కారణంగా ఇంజనీరింగ్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. నిడమనూరు మండలం భోజ్యాతండాకు చెందిన ధనావత్ శ్రీహరి అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు అతడిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. తనకు వాహనాలు సకాలంలో అందనందున రాలేకపోయానని విద్యార్థి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అధికారులు అనుమతించకపోవడంతో అతను నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ తన ఊరి నుంచి మిర్యాలగూడ వచ్చేందుకు ఆటోలు సమయానికి రాలేదని, అందుకే ఆలస్యం అయిందన్నాడు. కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల సెంటర్లో నిమిషం ఆల స్యంగా రావడంతో నూతనకల్ మండలం చిల్పకుంట్లకు చెందిన కట్టా ఉపేందర్‌రెడ్డిని, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మునగాల మండలం జగన్నాథపురానికి చెందిన రెడ్డిబోయిన ఉమలను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. కిటకిటలాడిన రోడ్లు... ఎంసెట్ రాసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహాయకులు జిల్లాకేంద్రమైన నల్లగొండతో పాటు కోదాడకు తరలిరావడంతో రెండు పట్టణాలు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వేచి ఉన్నారు. ఉదయం నుంచే పలు గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే బస్సులు ఎంసెట్‌కు వచ్చే వారితో కిటకిటలాడాయి. పరీక్షా సమయాలకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా భోజనాలు చేయాల్సి రావడంతో రెండు పట్టణాల్లోని హోటళ్లలో సందడి నెలకొంది. సరిగ్గా ఎంసెట్ జరిగే రోజుకు ఆర్టీసీకార్మికులు సమ్మె విరమించడంతో పా టు ఎంసెట్ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దూరంగా ఉన్న రెండు సెంటర్లతో ఇబ్బంది కోదాడ టౌన్ :కోదాడ పట్టణానికి దాదాపు 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న మిట్స్ కళాశాలను, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాగ్ కళాశాలలను సెంటర్‌గా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. మిట్స్ కళాశాల చిలుకూరు మండలంలో ఉండడంతో పలువురు కోదాడకు వచ్చి సెంటర్ విషయమై ఆరా తీయడం కనిపించింది. ఈ సెంటర్ చిలుకూరు మండలంలో ఉందని తెలుసుకొని ఉరుకులు,పరుగులు పెట్టారు. -
ఎంసెట్ విద్యార్ధులకు సమ్మె కష్టాలు
-
సమ్మె ప్రశాంతం
ఎంసెట్ పరీక్షతో ర్యాలీ, ధర్నాలకే పరిమితం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీపై అదనపు భారం జిల్లాలో రోడ్డెక్కిన 403 బస్సులు ఇబ్బందులుపడ్డ దూర ప్రాంత ప్రయాణికులు నెల్లూరు (రవాణా): జిల్లాలో శుక్రవారం విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రశాంతంగా నిర్వహించారు. కేవలం ర్యాలీలు, ధర్నాలకే పరిమితమయ్యారు. నగర, రూరల్ ప్రాంతాల్లోని 20 సెంటర్లలో 16 వేల మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సడ లింపు ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఆయా డిపోల నుంచి పోలీసుల సహకారంతో 403 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ అధికారులు దూరప్రాంతాలకు బస్సులను పంపకుండా కేవలం జిల్లాలోనే తిప్పారు. మొత్తం 707 బస్సులుకు గాను 294 ఆర్టీసీ, 109 అద్దె బస్సులును తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దూరప్రాంతాలు చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. ట్రావెల్స్, ప్రైవేటువాహనాలు చార్జీలను రెట్టింపు చేశారు. అధికచార్జీలను నియంత్రించడం లో అటు పోలీసు, రవాణా, అర్టీసీ అధికారులు విఫలమయ్యా రు. ఇంకెన్నాళ్లు ఈ అవస్ధలు పడాలో తెలియడం లేదని పలువురు ప్రయాణికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ప్రైవేటు డ్రైవర్లు, కం డక్టర్లతో తిప్పడంతో ఆర్టీసీపై అదనపుభారం పడింది. ర్యాలీ, ధర్నాలకే పరిమితం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని సమ్మెబాట పట్టిన ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు శుక్రవారం ర్యాలీ, ధర్నాలకే పరిమతమయ్యారు. ఆర్టీసీలోని అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపోల ఎదుట ముందు ధర్నా నిర్వహించారు.ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ కూడా సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. అర్టీసీపై అదనపు భారం శుక్రవారం మొత్తం 403 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం డ్రైవర్లు 294 మంది, కండక్టర్లు 403 మందిని కొత్తగా నియమించారు. డ్రైవర్‌కు రూ. 1000లు, కండక్టర్‌కు రూ. 800లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన డ్రైవర్లుకు రోజుకు రూ. 2.94 లక్షలు, కండక్టర్లకు రూ. 3.22 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం కలిపి రూ. 6.16 లక్షలు చెల్లించాల్సి ఉంది. పీక్ సీజన్ పేరుతో పక్కన బెట్టిన కొంతమంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరైనట్లు తెలిసింది. ఇబ్బందుల పడ్డ ప్రయాణికులు ఎంసెట్ పరీక్ష ఉండటంతో ఎక్కువ బస్సులను విద్యార్థులకు కేటాయించారు. దీంతో ఆయా ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, టాటాఏసీలను ఆశ్రయించారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం వాహనాల కోసం ఎదురుచూశారు. చెన్నై, తిరుపతి, బెంగూళూరు, హైదరాబాద్‌లకు ప్రవేటు బస్సులు ఛార్జీలను రెట్టింపు చేశారు. కొంత మంది కార్లును అద్దెకు తీసుకుని వెళ్లగా మరికొంతమంది రైళ్లును ఆశ్రయించారు. ఎంసెట్‌కు 253 బస్సులు ఎంసెట్ పరీక్షకు మొత్తం 253 బస్సులన తిప్పినట్లు అధికారులు చెబుతున్నారు. 137 బస్సులను ఆర్టీసీ, 116 బస్సులను రవాణాశాఖ అందజేశారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అద్దె వాహనాలు తీసుకుని ఎంసెట్ పరీక్షకు హజరైనట్లు తెలిసింది. దూర ప్రాంతాల విద్యార్థులు మాత్రం ముందు రోజే నెల్లూరు నగరానికి చేరుకున్నట్లు సమాచారం. వరుసగా 3రోజులు టెట్, డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సడలింపు ఇస్తారా లేక మరింత ఉధృతం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఆర్టీసి కార్మికులు మాత్రం శనివారం నుంచి సమ్మెను ఉధృతం చేయునున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాహనాలు- ఎన్.శివరాంప్రసాద్, రవాణా ఉపకమిషనర్ విద్యార్థులకు మూడు రోజులు వరుస పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు లేకుండా వాహనాలను తిప్పుతున్నాం. ఎంసెట్‌కు రవాణాశాఖ నుంచి 116 వాహనాలను ఏర్పాటు చేశాం, మిగిలిన పరీక్షలకు కూడా వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం 115 మంది డ్రైవర్లును అర్టీసీకి పంపాం.