హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఎంసెట్) శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌కు ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిర్దేశించిన సమయంలోగా ఎంసెట్ పరీక్షకు హాజరవ్వడం దూరప్రాంతాల విద్యార్థులకు సమస్యగా మారటంతో ఎంసెట్ పరీక్షలో ఒక్క నిమిషం నిబంధనను సడలించారు. ఈ విషయాన్ని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష పత్రం కోడ్ను మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఇక మెడిసిన్ పరీక్ష పత్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాకినాడలోని జేఎన్‌టీయూకేలో ఎంపిక చేస్తారు.
ఏపీ ఎంసెట్ పరీక్ష ప్రారంభం
Published Fri, May 8 2015 10:00 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement