medical aid
-
దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
చండీగఢ్: పంజాబ్‌లోని ఖానౌరీ బోర్డర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్‌ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
నారావారి నైవైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత వైద్య సదుపాయాలు మృగ్యమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వైద్యారోగ్యశాఖను నిర్విర్యం చేసింది. పేదల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నారావారి నైవైద్యంగా మలచుకుంది. ప్రభుత్వాస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు సంస్థలకు పందేరం చేసింది. ఈఎస్ఐ మందుల కుంభకోణానికి పాల్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో నెలలు నిండని శిశువును ఎలుకలు కొరికిన వైనం రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు తీరని మచ్చగా మిగిలింది. 2014–19 మధ్య ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యశాఖ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా సకల వసతులూ సమకూరాయి. అర్బన్, విలేజ్ హెల్త్‌క్లినిక్‌లు బలోపేతమయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికీ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యసురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్రను సర్కారు ఆవిష్కరించింది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొ ల్పింది. వైద్యారోగ్యశాఖలో నెలకొన్న నాటి.. నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. చంద్రబాబు హయాంలో.. ఆరోగ్యశ్రీకి పేరుమార్చి తూట్లు నిరుపేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలనే సదుద్దేశంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ‘‘ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ఆపరేషన్ల సౌకర్యం కల్పిస్తాం.’ అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్ల»ొల్లి మాటలతో ప్రజలను వంచించారు. 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం రోగాల సంఖ్యను ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి 1,059కి అంటే కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. 108 ఊపిరి తీశారు 108, 104 సేవలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బాబు పట్టించుకోలేదు. సంచార వైద్యవాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఒక్క కొత్త వాహనమూ కొనుగోలు చేయలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలు ఉంటే కేవలం 336 అంబులెన్సులు (108) మాత్రమే ఉండేవి. అంటే మండలానికి ఒక్క సంచార వాహనం కూడా లేని దుస్థితి ఉండేది. కేవలం 292 ‘104’ మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలు ఉండేవి. తూతూ మంత్రంగా పోస్టుల భర్తీ వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ 2014–19 మధ్య పట్టుమని 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ ఐదేళ్లలో వైద్య శాఖలో కేవలం 4,469 పోస్టులు భర్తీ చేశారు. ఆస్పత్రుల్లో పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేరని సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే అందుబాటులో ఉండేవారు. దీంతో ఆ ఒక్క డాక్టర్ సెలవుపై వెళితే అక్కడ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. మందులు కావాలంటే బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. నిమ్స్ స్థాయి ఆస్పత్రుల ఊసే లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నిమ్స్ స్థాయి) నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎటువంటి చొరవా చూపలేదు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించి తన అనుయాయుల జేబులు నింపడానికి బాబు పెద్ద పీట వేశారు. దీంతో వైద్య విద్యను అభ్యసించాలన్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో.. ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకానికి 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. కేవలం 1,059గా ఉన్న రోగాల సంఖ్యను 3,257కు పెంచింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. చికిత్స వ్యయం పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా క ల్పించింది. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తృతంగా పెంచింది. అన్ని ఆస్పత్రుల్లో చేరిన వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్ తరఫున ఉద్యోగులను నియమించింది. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది. రూ.16,852 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేసింది. నెలకు రెండుసార్లు గ్రామాలకు వైద్యులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన 105 రకాల మందులు ఉచితంగా అందిస్తోంది. సంచార వైద్యానికి ప్రాధాన్యం 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంచార వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి పల్లెకు వైద్య వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. 679 మండలాలు ఉంటే 689 వాహనాలు(108) సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి మొత్తం 910 ( 104) కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లు కొన్నారు. అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు, వీటి నిర్వహణ ఏటా రూ.188 కోట్ల ఖర్చుచేస్తున్నారు. జిల్లాకు ఓ వైద్య కళాశాల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల ఐదు నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులూ ప్రారంభించింది. మరో ఐదు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల బలోపేతం, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
5 లక్షల ప్రమాద బీమా.. 10 లక్షల ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, బాయ్‌లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లినప్పుడు కుక్క తరమడంతో కంగారులో భవనం పైనుంచి పడి మరణించిన ఓ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యాబ్ సంస్థలు నిర్వహిస్తున్న తరహాలో ఓ యాప్‌ను టీ–హబ్ ద్వారా సిద్ధం చేసి అవకాశం ఉన్న వారికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు నవంబర్ 27న కొందరు ఫుడ్ డెలివరీ బాయ్‌లతో భేటీ కావడం తెలిసిందే. అప్పుడు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తిని ఈ మేరకు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఓలా, ఉబర్ ద్వారా పనిచేసే ఆటో డ్రైవర్లతోపాటు క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న బాయ్‌లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆయా సంస్థల్లో పనిచేస్తూ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్తాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంతకంటే మెరుగైన విధంగా చట్టం తయారీకి బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టని సంస్థలపై చర్యలు.. ‘సంస్థలు కూడా లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సిబ్బంది సంక్షేమాన్ని విస్మరించే ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమోనని చూశా. కానీ ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు సీఎం సూచించారు. డిజిటల్, మాన్యువల్ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆటోవాలాలు ఆందోళన పడొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటోవాలాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆటోవాలాలతోనూ త్వరలో చర్చించి వారికి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్యాబ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ఆటోవాలాల ఉపాధి పడిపోదని, బస్సులు దిగాక ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులు మళ్లీ ఆటోలనే కదా ఆశ్రయించాల్సిందని అన్నారు. -
ఉద్దానానికి ఊపిరి
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. గతమంతా పరిశోధనలకే పరిమితం.. నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ♦ 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్‌తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు. ♦ 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది. ♦ 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు. ♦ 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండోమిక్ నెఫ్రోపతి (యూఈఎన్) పేరిట ఓ అధ్యయనం చేసింది. ♦ 2011లో న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అనూప్ గంగూలీ, డాక్టర్ నీల్ ఓలిక్‌ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. ♦ 2011లో హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. ♦ ఆ తర్వాత 2012లో జపాన్ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది. ♦ 2012 అక్టోబరు 1న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతురాజు అనే రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేశారు. ♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్ వివేక్ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది. ♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు. ♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి. ♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా.. తుపానుతో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. డ్రామాలకే పవన్ పరిమితం.. ఇక పవన్‌కళ్యాణ్ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు. కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. – డాక్టర్ ప్రధాన శివాజీ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట వైఎస్ జగన్ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. ♦ సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు. ♦ కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు. ♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ♦ ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. ♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు. ♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు. ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్సు ఉన్నాయి. ♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ♦ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సీఎస్ఎస్ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి ♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు.. ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు.. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు. మరోవైపు.. ఇందులో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్‌రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ మెషిన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు. జీవితంపై ఆశ కలిగింది.. కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన దయవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటారు. – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్‌లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి. – కర్ని సుహాసిని, గృహిణి, అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం -
చిట్టి గుండెకు గట్టి భరోసా
‘‘ముక్కుపచ్చలారని ఏ చిన్నారి కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది’’.. .. అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందించేలా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషిచేశారు. 2003లో ఆయన చెప్పిన ఈ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు. ఇప్పుడాయన వారసుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రినే నిర్మించాలని సంకల్పించారు. మరెక్కడా ఇలాంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి లేకపోవడంతో చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి బీజం వేశారు. అనుకున్నట్లుగానే అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తిరుపతిలో విజయవంతంగా అంకురార్పణ చేశారు. (వడ్డే బాలశేఖర్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నుంచి సాక్షి ప్రతినిధి) వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చీరాగానే సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు పెట్టించారు. పిల్లలకు ప్రభుత్వరంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల బలోపేతంపైనా దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పిల్లల గుండె చికిత్స కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వెళ్లే పనిలేకుండా పోయింది. 1,980 మంది చిన్నారులకు పునర్జన్మ ఇక ఈ రెండేళ్లలో 14,800 ఓపీ సేవలు ఈ ఆస్పత్రిలో నమోదయ్యాయి. వీరిలో పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఓపెన్ హార్ట్, కీ హోల్, వంటి ఇతర సర్జరీలు పెద్దఎత్తున నిర్వహించారు. మరికొందరికి మెడికల్ మేనేజ్మెంట్ చేశారు. ఇలా 1,980 మందికి పైగా చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. వీరిలో మెజారిటీ శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారే. ఆరోగ్యశ్రీ కింద వీరికి పూర్తి ఉచితంగా వైద్యసేవలన్నింటినీ అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కింద 2,052 ప్రొసీజర్లు రెండేళ్లలో నమోదయ్యాయి. చిన్నారులతో పాటు, పెద్దలకు సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను చేపట్టారు. ఇప్పటివరకూ ఏడు గుండె మార్పిడి ఆపరేషన్లు ఇక్కడ నిర్వహించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చుకాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. గుండె మార్పిడి, ఇతర చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కింద కూడా అదనంగా సహాయం అందింది. 75 పడకలున్న ఈ ఆస్పత్రిలో 15 మంది నిష్ణాతులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు. అడ్వాన్స్ క్యాథ్‌ల్యాబ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలతో పాటు, ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రికి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి సులభంగా ఆటోలో వెళ్లొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. బాధితులతో వచ్చే అటెండర్లలో ఒకరు ఇక్కడ ఉండొచ్చు. ఇక ఈ ఆసుపత్రి ఇటీవలే ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్‌గా ఈ అవార్డును ప్రకటించగా తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డా.శ్రీనాథరెడ్డి దానిని అందుకున్నారు. త్వరలో మరో సూపర్ స్పెషాలిటీ.. మరోవైపు.. తిరుపతి జిల్లా అలిపిరి వద్ద శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో, అత్యాధునిక ప్రమాణాలతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. హెమటో ఆంకాలజి, మెడికల్ ఆంకాలజి, సర్జికల్ ఆంకాలజి, న్యూరాలజి, కార్డియాలజీ, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో చిన్నారులకు వైద్యసేవలు, చికిత్సలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇదే తరహాలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోను పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల వైద్యశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఫొటోలోని సుర్ల శివ, పార్వతి దంపతులది పార్వతిపురం మన్యం జిల్లా నర్సిపురం. ఎనిమిది నెలల క్రితం వీరికొక కొడుకు ప్రన్షు పుట్టాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి గుండెలో రంధ్రంతో పాటు.. చెడు, మంచి రక్తం కలుస్తున్నాయని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత ఆ దంపతులకు లేదు. అదే సమయంలో తిరుపతిలో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స గురించి తెలిసిన వాళ్లు చెప్పారు. వెంటనే అక్కడ తీసుకెళ్లగా చిన్నారికి పరీక్షలు చేసి ఒక్కరూపాయి కూడా ఖర్చుకాకుండా ఆరోగ్యశ్రీ కింద స్టెంట్లు వేశారు. చిన్నారి కోలుకుని బరువు పెరిగాక గుండె రంధ్రానికి కూడా ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారు. ‘ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశంలేదు. బాబుకు ఏదైనా జరిగితే ఎలా అని నేను ఏడవని రోజులేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే అది ఒక్క సీఎం జగన్ వల్లే’.. అంటూ పార్వతి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఈ ఫొటోలోని అన్నమయ్య జిల్లా మంగపట్నంకు చెందిన గంగాదేవి వ్యవసాయ కూలీ. మంచం మీద నిద్రపోతున్న చిన్నారి ఈమె కుమారుడు.. పేరు దేవాన్‡్ష. ముగ్గురు ఆడపిల్లల అనంతరం కలిగిన మగ సంతానం. అయితే, పుట్టుకతోనే గుండె సమస్య వచ్చిపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరికి ఆపరేషన్ చేయించే స్థోమతలేదు. గంగాదేవి కుమారుడి ప్రాణాలను ఆరోగ్యశ్రీ, హృదయాలయం రూపంలో ప్రభుత్వం ఆదుకుంది. తాముంటున్న ప్రాంతానికి కొద్దిదూరంలోని తిరుపతిలో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి బాబును ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ సిఫార్సు, చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చులేకుండా చిన్నారికి ఆపరేషన్ పూర్తయింది. ‘కుటుంబ పోషణే భారమైన మాకు కొడుకు ఆరోగ్య సమస్యతో పెద్ద చిక్కొచ్చి పడింది. కానీ, కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించింది’.. అని అంటున్న గంగాదేవి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ..ఈ ఇద్దరు చిన్నారుల తరహాలోనే పుట్టుకతో తీవ్రమైన గుండె సమస్యలున్న వందల మంది చిన్నారులకు శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అక్కున చేర్చుకుని పునర్జన్మను ప్రసాదించింది. 11 అక్టోబరు 2021 అక్టోబరు 11న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానసపుత్రికను ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తూ అభాగ్యుల పాలిట వరంగా నిలుస్తున్న హృదయాలయాన్ని ‘సాక్షి’ పరిశీలించి రోగుల కుటుంబాలను పలకరిస్తే.. ఒకొక్కరిదీ ఓ కన్నీటి గాధ ఆవిష్కృతమైంది. సీఎం జగన్ నాకు పునర్జన్మనిచ్చారు గుంటూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటాను. నాకు గుండె సంబంధిత సమస్యలుండటంతో హైదరాబాద్, గుంటూరు ఇలా చాలాచోట్ల చూపించుకున్నా. గుండె మార్పిడి చేయాలన్నారు. గతనెల 24న గుండె మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్‌కు రూ.10 లక్షల పైనే ఖర్చవుతుందన్నారు. అయితే, నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాలేదు. మొత్తం ప్రభుత్వమే భరించింది. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. – ఎస్. సుమతి, వెల్దుర్తి, పల్నాడు జిల్లా నెలకు 120 సర్జరీలు..మొదట్లో ఇక్కడ నెలకు 30 ఆపరేషన్ల వరకూ చేసేవాళ్లం. ప్రస్తుతం నెలకు 100 నుంచి 120 చేస్తున్నాం. పెద్దల్లో కూడా పుట్టుకతో వచ్చిన స్ట్రక్చరల్ గుండె సమస్యలతో పాటు, గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. 15 మంది నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలున్న ఈ తరహా ఆస్పత్రి ప్రైవేట్‌లో కూడా ఎక్కడా ఉండదు. ఆస్పత్రి నిర్వహణ కోసం టీటీడీ పుష్కలంగా నిధులు అందిస్తోంది. ఇక పేద ప్రజలకు ఉచితంగా చికిత్సలు చేయడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రూపంలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. త్వరలో అలిపిరిలో పీడియాట్రిక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కూడా అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం -
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
‘అన్న’లకు అనారోగ్యం!
ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన ‘అన్న’లకు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తోంది. దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు లెక్క చేయక గడిపిన ఎందరో నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు మారిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. వైద్యం కోసం అడవులు వదిలితే ఎక్కడ పోలీస్ బలగాలకు చిక్కుతామన్న భయంతో తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింతకుంగదీస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే అనారోగ్యంతోనే.. అనారోగ్య కారణాలతోనే మావోయిస్టు అగ్రనాయకులైన ఆర్కే, హరిభూషణ్‌లు సైతం మృతిచెందారు. అలాగే ఇటీవలే మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మావోయిస్టు కేంద్ర కమిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నేతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో అరెస్టయిన మావోయిస్టు నేతలు చెబుతున్నారు. మంచానికే పరిమితమైన గణపతి? మావోయిస్టు ఉద్యమం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటైన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు మాజీ జనరల్ సెక్రెటరీ, ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక నేతగా ఉన్న గణపతి వయస్సు 73కు చేరింది. బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, అల్జీమర్స్‌తో బాధపడుతున్న గణపతి ప్రస్తుతానికి మంచానికే పరిమితమైనట్టు విశ్వసనీయ సమాచారం. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు అయిన గాజర్ల రవి సైతం కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ కమిటీలోని రామచంద్రారెడ్డి, మొడెం బాలకృష్ణ, పోతుల కల్పన, దండాకరణ్యం స్పెషల్ జోన్ కమిటీలోని నూనె నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న వెన్ను నొప్పితో , తెలంగాణ డివిజనల్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ అధిక రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర కీలక నాయకులు సైతం చాలా మంది షుగర్ , బీపీ, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో సతమతవుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి సహకారం తగ్గుతోందా? మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గుతోందనీ, అందుకే సకాలంలో మందుల రవాణా, ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోందన్న చర్చ నడుస్తోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కటకం సుదర్శన్ మృతిపై ప్రకటన జారీ సందర్భంగా మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఇవే ఆరోపణలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వస్తే మేం చూసుకుంటామంటున్న ఖాకీలు పోలీసు అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది..అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంటున్నారు. మావోయిస్టు నాయకులు, కేడర్ లొంగిపోతున్న సందర్భాల్లో, అరెస్టుల సందర్భంగా నిర్వహించే పత్రికా సమావేశాల్లోనూ లొంగిపోతే సరైన వైద్యం అందిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సాయం చేసినా సహించలేరా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాధితులకు సాయం చేసినా ఎల్లో మీడియా సహించలేకపోతోంది! రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా నిత్యం దుష్ప్రచారాలకు తెగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి కాన్వాయ్‌లో వస్తుండగా అచ్చంపేట మండలం ముత్యాల గ్రామవాసి పువ్వాడ సాయి, అతడి తల్లి తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. వారిని చూసిన ముఖ్యమంత్రి తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి పట్టించుకోకుండా బస్సులో ముందుకు వెళ్లిపోయారంటూ ఎల్లో మీడియా అబద్ధాలకు తెగించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి బాధితుల సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించారు. చెయ్యి విరిగిన సాయి చికిత్స కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతోపాటు ఫిజియోథెరపీ అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో అదేరోజు సాయంత్రం పువ్వాడ సాయి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం రూ.లక్ష అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ సమస్యలతో ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన మరో 21 మందికి తక్షణ సాయంగా రూ.32.50 లక్షలు ఆరి్థక సాయం అందించడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిపై బురద చల్లుతూ సామాజిక మాధ్యమాల్లో దు్రష్పచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. -
నేను విన్నాను.. నేనున్నాను.. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్..
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందేలా ఆదేశించారు. నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాయిపండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్ (9) ‘తొసిల్జుమాబ్–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతున్నాడని సీఎంకు చెప్పారు. వైద్య ఖర్చులకు ఇంటిని కూడా అమ్మేశానన్నారు. సీఎం స్పందిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠ్కర్ను ఆదేశించారు. వీరి విషయం ఫాలోఅప్ చేయాలని సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండటెంబురు గ్రామానికి చెందిన అన్నపూర్ణ తన కూతురు రాజశ్రీ పుట్టకతోనే పక్షవాతం బారిన పడిన విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చలించిపోయిన సీఎం జగన్ సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్షల మంజూరు చేశారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామానికి చెందిన అప్పారావు తన కుమారుడు దిలీప్ కుమార్ పుట్టకతోనే దివ్యాంగుడనే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తమ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేని సీఎం జగన్‌కు విన్నవించారు. దీనికి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. 2లక్షల మంజూరు చేశారు సీఎం జగన్. విజయనగరం జిల్లా సారథికి చెందిన వంజరాపు రామ్మూర్తి కుమారుడు రవికుమార్ (33) ఊపిరితిత్తుల వ్యాధి వల్ల ఆక్సిజన్ సిలెండర్ల మీదే బతుకుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ బాధితుని తరఫున సీఎంను కోరారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందివ్వాలని, ప్రతి నెలా రూ.10 వేలు íపింఛన్ మంజూరు చేసేలా విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించాలని సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. బాధితులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్ -
World Piles Day 2022: పైల్స్‌కు స‘మూల’ పరిష్కారం..
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్‌గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కారణమేంటంటే.. మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు. చికిత్స, జాగ్రత్తలు ► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్‌వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు. ► మొలలు సోకిన వారు పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. 90 శాతం మందులతోనే నయం పైల్స్ బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్‌కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు. – షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
మాట మార్చిన సిద్ధూ.. ప్లీజ్ కొంచెం టైమ్ ఇవ్వండి
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1988 నాటి కేసులో కోర్టు ఆయనుకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక్రవారం సిద్ధూ మాట మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీంతో, సిద్ధూ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సింఘ్వీ.. సీజేఐ ఎన్వీ రమణను కలవాలని ఏఎం ఖన్వీల్కర్ సూచించారు. ఇక, కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పాటియాలా పోలీస్‌స్టేషన్‌కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వెంటనే సిద్ధూను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు. Will submit to the majesty of law …. — Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022 ఇది కూడా చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన సీబీఐ -
ప్రవాసాంధ్రుల దాతృత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కట్టడి చర్యలకు ప్రవాసాంధ్రులు సాయం అందించారు. సుమారు రూ.4,28, 08,885 విలువైన వైద్య పరికరాలను ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు అందించారు. సోమవారం తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి, సీఈవో కె.దినేష్‌కుమార్, భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన వైద్య పరికరాల వివరాలను స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వాటిని సేకరించడంలో ఏపీఎన్ఆర్టీఎస్ విశేష కృషి చేస్తోందంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ పనిచేస్తోందని వెంకట్ మేడపాటి అన్నారు. ఏపీకి వైద్య పరికరాలను పంపాలనుకునే వారికి వివిధ దేశాల్లో ఉన్న తమ కోఆర్డినేటర్లు సాయం అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 70 ఏరియా, పెద్దాస్పత్రులకు వైద్య సామగ్రి పంపిణీ జరిగిందన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీలకు చెందిన పూర్వ విద్యార్థి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. చదవండి : ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక బాలుడు అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. చికిత్సకు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో అంత డబ్బు ఎలా తేవాలని, ఎవరిని అడగాలని, తమ చిన్నారిని ఎలా బతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలత చెందారు. అప్పుడు వారిని దేవుడిలా ఆదుకుంది ‘క్రౌడ్‌ఫండింగ్’. దీంతో ఆన్లైన్లో సమకూరిన నిధులతో వారు తమ చిన్నారిని బతికించుకున్నారు. ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం నింపిన ఆ ‘క్రౌడ్‌ఫండింగ్’ అంటే ఏమిటో తెలుసుకుందాం.. సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే.. దాతల సంఖ్య పెరిగింది. ఐటీ సంబంధిత సంస్థల్లో పనిచేసే యువకులు చారిటీ అంటే సై అంటున్నారు. దీంతో ఆపన్నులు–దాతలకు మధ్య వారధిలాంటి మాధ్యమాలు కూడా పెరుగుతున్నాయి. వీటిలో ప్రాచుర్యంలో ఉన్న వారధి ఆన్లైన్ ఫండ్ రైజింగ్ పేజెస్/ క్రౌడ్ ఫండింగ్. అన్ని అవసరాలకూ ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ.. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అధికంగా లబ్ధి చేకూరుతోంది. దీంతో ఖరీదైన చికిత్సలు అవసరమైన అభాగ్యులకు ఇవి వరంలా మారాయి. వ్యక్తిగతంగా చేస్తే సందేహాలు మన వారెవరైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్సకు అవసరమైన డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆన్లైన్ పేజ్‌లు తయారుచేసుకుని దాతల నుంచి విరాళాలు సేకరించవచ్చు. అలా ఓ రోగి తరపున పేజ్ సృష్టించిన వ్యక్తిని క్యాంపెయిన్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తిగతంగా పేజ్ తయారు చేసుకుంటే దాతలు సందేహించొచ్చు కాబట్టి అప్పటికే ఈ తరహా పేజ్‌లకు సపోర్ట్ చేసేందుకు కొన్ని క్రౌడ్ ఫండింగ్ వేదికలు అవతరించాయి. ఇవి కొంత రుసుము తీసుకుని బాధితుడి తరపున చారిటీ క్యాంపెయిన్ నిర్వహిస్తాయి. వాటినే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లంటారు. జాగ్రత్తగా...చేయూత చికిత్స కోసం నిజంగా అవసరమైన వారిని మాత్రమే తమ వేదికను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడం.. మరోవైపు దాతలిచ్చే విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడటం అనే ఈ రెండు బాధ్యతలనూ క్రౌడ్ ఫండింగ్ వేదికలు నిర్వర్తిస్తాయి. దీని కోసం వీరు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరార్థులకు చెందిన ఆధార్, పాన్ తదితర గుర్తింపు కార్డులతోపాటు సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. క్యాంపెయిన్ చేసేవారికీ లబ్ధిదారులతో ఉన్న అనుబంధం, రోగి ఐడీ, వ్యాధి, చికిత్స తాలూకు ధ్రువపత్రాలు, చికిత్సకు అయ్యే అంచనా వ్యయం.. వగైరా వివరాలు కచ్చితంగా సేకరిస్తారు. చికిత్స అందిస్తున్న సంబంధిత ఆసుపత్రి, వైద్యులతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ హైదరాబాద్ సహా పలు నగరాల్లో శాఖలు ఉన్నాయి. సిటీ ఆస్పత్రులతో ఒప్పందాలు మేము హైదరాబాద్ నుంచి వివిధ చికిత్సల కోసం 12 వేల క్యాంపెయిన్స్ నిర్వహించాం. బాధితులకు రూ.105 కోట్లు అందించాం. పుణెకు చెందిన వేదికా షిండా అనే బాలికకు అవసరమైన జీన్ రీప్లేస్మెంట్ థెరపీ కోసం సేకరించిన రూ.14.3 కోట్లే ఇప్పటిదాకా సేకరించిన వాటిలో అత్యధిక మొత్తం. ఇందులో 1.34 లక్షల మంది దాతలు పాల్గొన్నారు. రెయిన్బో, గ్లోబల్, కిమ్స్ తదితర 25 ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాం. మా ద్వారా సాయం కోరాలంటే Milaap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా facebook@milaap.orgకు మెయిల్ చేయాలి. –అనోజ్ విశ్వనాథన్, ప్రెసిడెంట్, మిలాప్ సెకనుకో విరాళం సెకనుకో విరాళం అనే స్థాయిలో విరాళాలు మా వేదిక ద్వారా అందుతున్నాయి. ఇప్పటిదాకా మేం రూ.1,500 కోట్ల ఫండ్ రైజింగ్‌కు తోడ్పడ్డాం. హైదరాబాద్ నుంచి కోవిడ్ సెకండ్ వేవ్‌లో రెండువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. 150 ఆస్పత్రులతో కలిసి పనిచేశాం. తాజాగా హైదరాబాద్‌కి చెందిన మూడేళ్ల బాలిక ఆయాన్ట్ గుప్తాకు అవసరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ టైప్1 చికిత్స కోసం రూ.14.84 కోట్లు సేకరించాం. చికిత్స నిధుల కోసం www.impactguru.com/users/start&fundraiser ను సంప్రదించవచ్చు. –పీయూష్ జైన్, సీఈఓ, ఇంపాక్ట్‌గురు.కామ్ సెలబ్రిటీలూ స్పందించారు.. మా అబ్బాయి ఆయాన్ష్‌కు అయ్యే చికిత్సలో భాగంగా అందించాల్సిన ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అని తెలియగానే అంత మొత్తం ఎలా తేవాలో తెలియక ఆందోళన చెందాం. అయితే ఆస్పత్రి సహకారంతోపాటు ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ చేయూతతో ఖరీదైన ఇంజెక్షన్‌ను మా అబ్బాయికి ఇప్పించగలిగాం. దీని కోసం 62,450 మంది దాతలు స్పందించడం మర్చిపోలేని విషయం. వీరిలో సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నారు. –యోగేష్ గుప్తా చదవండి: ఇదిగో మేమున్నాం.. మీకేం కాదు.. -
covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్‌కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్‌కు చేరాయి. చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు -
భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్‌పై జరుగుతున్న యుద్ధంలో భారత్‌కు బాసటగా నిలుస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. భారత్‌కు గణనీయమైన సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాధార ఔషధాలు, కీలకమైన వైద్య పరికరాలు పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు ఆరు విమానాల్లో ఔషధాలు, పరికరాలు వచ్చాయి. ఇందుకు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) నిధులు సమకూర్చింది. ఔషధాలతోపాటు ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్95 మాస్కులు భారత్‌కు చేరుకున్నాయి. తాను ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు అందజేయాలని మోదీ కోరారని, ఈ మేరకు వాటిని పంపించామని వివరించారు. బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నామని ఉద్ఘాటించారు. జూలై 4 నాటికి అమెరికా వద్ద ఉన్న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్లలో 10 శాతం వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్‌కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్‌కు పంపుతామన్నారు. -
గర్భిణుల వైద్యపరీక్షలకు ఉచిత రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవలకు వెళ్లే గర్భిణులు ఇకపై ఆటో కోసమో, బస్సు కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. వీళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఆపదలో ఉన్న వారి కోసం ఇప్పటికే 108 వాహనాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో మందులివ్వడానికి 104 వాహనాలున్నాయి. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నడుస్తున్నాయి. అయితే.. గర్భిణులు ప్రసవానికి ముందు ఆస్పత్రులకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో 170 వాహనాలు గర్భిణులు 9 నెలల కాలంలో విధిగా నాలుగు దఫాలు వైద్యపరీక్షలకు వెళ్లాలి. దీన్నే యాంటీనేటల్ చెకప్స్ అంటారు. ఈ సమయంలో ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణులకు ఇంటివద్దకే వాహనాలను పంపిస్తారు. గర్భిణి ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో స్థానికంగా ఆశా వర్కర్‌కు, ఏఎన్ఎంకు అవగాహన ఉంటుంది. వీళ్లు ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్‌చేసి, వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి దాన్లో ఆస్పత్రికి పంపిస్తారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేవరకు వాహనం అక్కడే ఉండి తిరిగి ఇంటివద్దకు చేరుస్తుంది. దీనికోసం తొలుత 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యత్నిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. గర్భిణులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే వాహనాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఏఎన్ఎం లేదా ఆశా కార్యకర్త ఎవరైనా డాక్టరుకు ఫోన్ చేయగానే ఆ గర్భిణి ఇంటివద్దకే వాహనాన్ని పంపిస్తారు. గర్భిణి ప్రయాణానికి వీలుగా ఉండేలా తుపాన్ వాహనాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ఏడాదికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి రాష్ట్రంలో ఏటా 7 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో 3 లక్షలమంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. రవాణా సౌకర్యం లేక వైద్యపరీక్షలకు వెనుకాడుతున్నారు. ఉచిత రవాణా కల్పిస్తే ప్రతి ఒక్కరు వైద్యపరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సమస్యలున్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల సుఖప్రసవాలు జరగడమే కాకుండా మాతాశిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. -
తగ్గుతున్న మాతృ మరణాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మాతృ మరణాలు (ప్రసవ సమయంలో తల్లుల మృతి) గణనీయంగా తగ్గుతున్నాయి. సహస్రాబ్ధి లక్ష్యాల్లో భాగంగా జాతీయ స్థాయిలో లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్యను 70కి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజాగా ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) స్పెషల్ బులెటిన్‌లో జాతీయ సగటున ప్రతి లక్ష ప్రసవాలకు 113 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. అయితే జాతీయ సగటు కంటే చాలా రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ భారీగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. 2016–18కి గానూ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో లక్ష ప్రసవాలకు ఏపీలో 65 మాతృ మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడైంది. మాతృ మరణాలకు ప్రధాన కారణాలు ఇవే.. ► ప్రసవానంతరం అధిక రక్తస్రావంతో 38 శాతం మంది.. ► సెప్సిస్ (ప్రసవ సమయంలో విషపూరితం కావడం) కారణంగా ► శాతం మంది.. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) వల్ల 5 శాతం మంది.. ► అబార్షన్లు జరగడం వల్ల 8 శాతం మంది.. ► రకరకాల గర్భకోశ వ్యాధుల వల్ల 5గురు.. ► ఇతర కారణాల వల్ల 34 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏపీలో తల్లులకు భరోసా ఇలా.. ► ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైరిస్కు గర్భిణులను గుర్తించి, ప్రత్యేకంగా ఓ ఆశ కార్యకర్త లేదా ఒక ఏఎన్ఎంను నియమించడం ► ప్రతి పీహెచ్‌సీలోనూ సేఫ్ డెలివరీ కేలండర్ ఏర్పాటు చేయడం. ఆరు రోజుల ముందే వారిని ఆస్పత్రిలో చేర్పించడం ► 108 డ్రైవరు నంబరు ఆమెకు ఇవ్వడం..డ్రైవరుకు గర్భిణి నంబరు ఇచ్చి ఫోన్ చేసి మరీ తీసుకురావడం ► ఎంఎస్ఎస్ యాప్ ద్వారా ప్రతి పీహెచ్సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖప్రసవాలు అయ్యేలా చేయడం ► ప్రతి 15 రోజులకు ఒకసారి మాతృ మరణాలపై కలెక్టర్ల స్థాయి సమీక్ష నిర్వహించడం గణనీయంగా తగ్గించేందుకు కృషి ఆంధ్రప్రదేశ్‌లో మాతృ మరణాలను 74 నుంచి 65కు తగ్గించాం. ఈ సంఖ్య మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మాతృ మరణాలు తగ్గడం మంచి పరిణామం. – డా. గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
టెన్త్ చదివి.. డాక్టర్‌నంటూ వైద్యం
నరసాపురం: పదో తరగతి చదివి కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సునంద శనివారం తనిఖీ చేశారు. డాక్టర్ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్ (35)ను సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని కోరారు. తనకు పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా లేదని, పదో తరగతి వరకు చదివానని సతీష్ చెప్పడంతో వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి అక్కడ ఉన్న హైపవర్ యాంటీ బయోటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న అక్రమ వైద్యం చేస్తున్న పీఎంపీ, ఆర్ఎంపీలు కొందరు తమ వైద్యశాలలు మూసేసి పరారయ్యారు. -
నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు మందులు
సాక్షి, అమరావతి: పేద రోగులకు అందించే మందులను ముందుగా పరిశీలించి.. వాటి నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలకు కావాల్సిన అన్ని మందులను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికనుగుణంగా అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో తూతూమంత్రంగా ర్యాండం పద్ధతిలో సరఫరా అయ్యే మందుల్లో కొన్నిటికి మాత్రమే పరీక్షలు చేసేవారు. నాణ్యతను నిర్ధారించి, నాసిరకం అని తేల్చేసరికే రోగులు మందులను వాడుతుండేవారు. దీంతో ఉన్న జబ్బులు నయం కాకపోవడంతోపాటు కొత్త జబ్బుల బారిన పడేవారు. ఇప్పుడలా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకూ ప్రతి మందునూ నాణ్యత నిర్ధారించాకే సరఫరా చేయాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మందులకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) గుర్తింపు ఉన్న లేబొరేటరీల్లో నిర్ధారించి ఆస్పత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మూడు లేబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా.. వీటి సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. సగటున నెలకు 300 బ్యాచ్‌లకు సంబంధించిన మందుల నాణ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. ఏడాదికి 3600 బ్యాచ్‌లకు సంబంధించిన మందులకు పరీక్షలు చేశాకే ప్రజల్లోకి పంపిస్తారు. అదేవిధంగా సగటున 400 రకాల మందులు ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అవుతుండగా.. ఈ సంఖ్య మరికొద్ది రోజుల్లో 600కు చేరనుంది. ఈ నేపథ్యంలోనే లేబొరేటరీల సంఖ్యను పెంచుతున్నారు. మందులు లేబొరేటరీకి చేరిన 26 రోజులలోగా నాణ్యతను నిర్ధారించి.. సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి మందుకూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు ఇకపై ర్యాండం పద్ధతిలో మందుల నాణ్యత నిర్ధారణ జరగడానికి వీల్లేదు. ప్రతి మందుకూ నాణ్యత పరీక్షలు చేశాకే సరఫరా చేస్తాం. దీనికోసం పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పేద రోగికి నాణ్యమైన మందులు అందించడమే మా సంస్థ లక్ష్యం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. – విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
పాప వైద్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, సూర్యాపేట: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న సూర్యాపేటకు చెందిన చిన్నారికి వైద్య ఖర్చులకోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భరోసా ఇచ్చారు. సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వల్ధాసు ఉపేందర్ ఎనిమిది సంవత్సరాల కూతురు భూమిక కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. దాంతో సూర్యాపేటలోని హాస్పిటల్లో చికిత్స నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో హైదరాబాద్ తీసుకెళ్లడంతో బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. వైద్య ఖర్చులకు రూ.ఎనిమిది లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ట్రైలర్ వృత్తే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న పాప తల్లిదండ్రులు విషయం తెలిసి రోదిస్తున్నారు. ఆర్థికసాయం అందించాలని దాతలను వేడుకోవడంతో సూర్యాపేటకు చెందిన వారి మిత్రుడు శైలేంద్రాచారి పాప పరిస్థితిని ట్విట్టర్లో కేటీఆర్‌కు తెలిపారు. దాంతో ఆయన వెంటనే స్పందించారు. పాపకు సంబంధించినవారిని వెంటనే తన ఆఫీస్‌కు రమ్మని ఆహ్వానించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్‌లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్‌కు ఇన్చార్జి కమిషనర్‌గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
రోగుల సహాయకులకూ ఉచిత భోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్పేషెంట్లుగా చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆహారం (డైట్) అందిస్తున్నా వారి సహాయకులు మాత్రం భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అవస్థలు తొలగించేందుకు ఇన్‌పేషెంట్ల సహాయకులకు కూడా ఉచితంగా భోజనం సమకూర్చనున్నారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఉచితంగా భోజనం అందించేందుకు వైద్య విద్య సంచాలకులు కసరత్తు ప్రారంభించారు. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్)తో చర్చించి రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆర్థిక భారం నుంచి ఉపశమనం.. ఇస్కాన్ ఇప్పటికే హైదరాబాద్‌లోని నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం సమకూరుస్తోంది. అదే తరహాలో ఏపీలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వైద్య విద్య సంచాలకులను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి ఆదేశించారు. రోగులతో పాటు వారి సహాయకులకు కూడా ఆహారం అందచేయడం ద్వారా వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఉచితంగా భోజనం సమకూరుస్తుండగా కాకినాడలోని రంగరాయ బోధనాసుపత్రిలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆహారాన్ని అందిస్తోంది. ఇలా కొన్ని ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం అందిస్తున్నా అన్ని చోట్లా ఈ సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భోజనం సమకూరుస్తున్న సంస్థలను అలాగే కొనసాగిస్తూ మిగతా ఆస్పత్రులకు భోజనం అందించడం లేదంటే అన్నీ ఒకరికే అప్పగించాలా? అనే అంశాన్ని ఇస్కాన్‌తో చర్చించిన అనంతరం నిర్ణయించనున్నట్టు వైద్య విద్య అధికారులు తెలిపారు. రోజూ 10 వేల మందికిపైగా ప్రయోజనం రాష్ట్రవ్యాప్తంగా 11 బోధనాసుపత్రుల్లో సుమారు 12 వేల వరకు పడకలున్నాయి. సగటున రోజూ 11,500 మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. వారి కోసం సహాయకులు కూడా వస్తుంటారు. ఉచిత భోజనం సమకూర్చడం వల్ల నిత్యం 10 వేల మందికిపైగా రోగుల సహాయకులకు మేలు జరుగుతుంది. రోగి సహాయకులు పాస్ చూపిస్తే డిస్చార్జి అయ్యే వరకు రెండు పూటలా భోజనం అందిస్తారు. వీలైనంత త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బోధనాసుపత్రుల తరువాత ఈ సేవలను 14 జిల్లా ఆస్పత్రులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
తయారీరంగంలో ఇది మన మార్కు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. వైద్య ఉపకరణాల తయారీ రంగానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలకు భూకేటాయింపులు కూడా జరిగాయి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. పార్కు నిర్మాణానికి వీలుగా సుల్తాన్పూర్ పరిధిలోని 174, 70 సర్వే నంబర్ల పరిధిలో 557.32 ఎకరాలను కేటాయించింది. ఔటర్‌రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను టీఎస్ఐఐసీ చేపట్టింది. 2017 జూన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పార్కును రెండు దశల్లో ఏ, బీ బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పార్కు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రూ.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.35 కోట్ల మేర ఖర్చు చేసింది. రూ.20 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొండలను పిండి చేసి.. పార్కు ఆవరణలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తుండటంతో 272 ఎకరాల్లో మెడికల్ డివైజెస్, 226 ఎకరాల్లో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేలా డీపీఆర్‌లో అధికారులు మార్పులు చేశారు. మరో 47 ఎకరాలను మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్’కు కేటాయించారు. వంద, 60 అడుగుల వెడల్పుతో 5.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, హై టెన్షన్ విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ట్రాన్స్‌కో విభాగం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయిం చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ఐఐసీ ప్రతి పాదనలు సమర్పించింది. పార్కుకు కేటాయించిన ప్రాంతంలో 150 ఎకరాలు మాత్రమే చదునుగా ఉండగా, మిగతా భూమి కొండలు, గుట్టలతో నిండి ఉంది. దీంతో కొండలను పిండి చేయాల్సి రావ డంతో ఖర్చు కూడా పెరుగుతున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. రెండంకెల వృద్ధి రేటు లక్ష్యంగా... దేశంలో వైద్య ఉపకరణాల తయారీ రంగం శైశవదశలో ఉన్న నేపథ్యంలో బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. దేశంలో మూడు బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు జరుగుతుండగా రెండంకెల వృద్ధి రేటుతో 2023 నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో స్థానికంగా వైద్య ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ సైన్సెస్ పాలసీ 2015–2020’లో భాగంగా మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇప్పటివరకు మెడికల్ డివైజెస్ పార్కులో 14 వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా రూ.3,631.97 కోట్ల పెట్టుబడులతోపాటు 1,588 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2019 చివరిలోగా భూ కేటాయింపు పొందిన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించే భఃవిధంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. క్రషర్ల తొలగింపునకు నోటీసులు మెడికల్ డివైజెస్ పార్కుకు కేటాయించిన సర్వే నంబరు 174లో గతంలో నాలుగు మైనింగ్ కంపెనీలకు క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నా, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఖాళీ చేసేందుకు క్రషర్ల యజమానులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రెండు యూనిట్లను మూసివేయించిన టీఎస్ఐఐసీ.. మరో రెండు యూనిట్ల మూసివేతకు కూడా నోటీసులు జారీ చేసింది. -
సచివాలయంలోనే మందుల్లేవ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి. సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు. ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు.