నేరేడు తింటే...మధుమేహం... బహుదూరం!
డయాబెటిస్‌ను చాలా ప్రభావపూర్వకంగా నియంత్రించగల శక్తిమంతమైనదీ పండు. దాంతో ఇటీవల నేరేడు పండ్ల ధర కూడా బాగా పెరిగింది. నేరేడు అతిమూత్రవ్యాధికి మంచి మందు. అనేక రకాల చర్మవ్యాధులను నిరోధిస్తుంది ఈ పండు. ఒంటిపైన వచ్చే గడ్డలు, చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది. నేరేడు పండ్లు అనేక రకాల నోటి సమస్యలనూ తగ్గిస్తాయి. ఇది నోటిలో వచ్చే కురుపులు, పుండ్ల పాలిట సమర్థమైన ఔషధం. అంతేకాదు నేరేడు దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండ్లు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తాయి.
ఎముకల రుగ్మతలైన రుమాటిక్ నొప్పులు, గౌట్ బాధలు నేరేడు తినడం వల్ల దూరమవుతాయి. కడుపు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను నేరేడు ప్రభావపూర్వకంగా తగ్గిస్తుంది. మలబద్దకం, నీళ్లవిరేచనాలు వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
వాంతులు, వికారం వంటి సమస్యలకు నేరేడు మంచి విరుగుడు.
గుడ్‌ఫుడ్