diabetes
-
ఇన్సులిన్ మీరే కొనుక్కోండి
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం కకావికలం చేసింది. కనీసం బీపీ, షుగర్ రోగులకు సాంత్వన చేకూర్చలేని దీనావస్థలోకి ప్రభుత్వాస్పత్రులను నెట్టేసింది. బోధనాస్పత్రుల్లో వందకు పైగా రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. నాలుగైదు నెలలుగా ఆస్పత్రుల్లో మధుమేహ బాధితులను ఇన్సులిన్ కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వంలో రోగులు ఇంటివద్దే ఇన్సులిన్ తీసుకోవడానికి వీలుగా ఆస్పత్రుల్లో వెయిల్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరిన వారికి కూడా ఇన్సులిన్ వెయిల్స్ అందుబాటులో ఉండటం లేదు. బయట కొని తెచ్చుకోండని స్లిప్‌లు రాసిస్తున్న అధ్వాన్న పరిస్థితులు దాపురించాయని బాధితులు మండిపడుతున్నారు. టైప్–1 షుగర్ బాధితులతో పాటు, టైప్–2 బాధితుల్లో సమస్య తీవ్రంగా ఉన్న వారికి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో హ్యూమన్ యాక్టాపిడ్, హ్యూమన్ మిక్స్‌టార్డ్ 70/30 ఇన్సులిన్ కొరత ఉంటోంది. ముఖ్యంగా హ్యూమన్ మిక్స్‌టార్డ్ రకం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచే సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. పేద రోగులపై ఆర్థిక భారం ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు లక్ష వరకూ హ్యూమన్ మిక్స్‌టార్డ్ ఇన్సులిన్ వెయిల్స్ అవసరం అవుతాయని అంచనా. కొద్ది నెలలుగా ఆస్పత్రులకు ఈ రకం ఇన్సులిన్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల ఆస్పత్రులు పెట్టిన ఇండెంట్లో నామమాత్రంగానే సరఫరా అవుతోంది. దీంతో కొన్ని బోధనాస్పత్రులు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఇన్పేòÙంట్ల కోసం స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అవుట్ పేషెంట్లకు ఇన్సులిన్ వెయిల్స్ ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపిశారు. షుగర్ మోతాదు 300, 400పైగా ఉండే రోగులకు నెలకు 3 నుంచి 5 వెయిల్స్ అవసరం అవుతుండగా కర్నూలు జీజీహెచ్‌లో నెలకు ఒక వెయిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ వెయిల్ అయిపోయాక నెలలో రెండోసారి వెళితే ఇవ్వడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కాకినాడ జీజీహెచ్‌లలో ఓపీలో రోగుల నెలవారీ అవసరాలకు అనుగుణంగా వెయిల్స్ ఇవ్వడం లేదు. పీహెచ్‌సీలకు రెండో క్వార్టర్లో పెట్టిన ఇండెంట్ మేరకే ఇన్సులిన్ సరఫరా లేదని మెడికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్ట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదిగో అదిగో అనే సమాధానాలే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఇన్సులిన్ లేక మెటార్ఫిన్, జిమ్ ఫ్రైడ్ వంటి మాత్రలు ఇస్తుంటే.. షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని రోగులు తమపై గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వెయిల్ ధర రూ.170కు పైగా ఉంటోంది. 300 నుంచి 350 మధ్య షుగర్ మోతాదు ఉండే బాధితులకు నెలకు నాలుగు వెయిల్స్ నిమిత్తం రూ.700 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల వారికి ఇంత సొమ్ము వెచ్చిoచడం తలకు మించిన భారంగా మారుతోంది. చాలామంది ఇన్సులిన్ కొనుగోలు చేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్టాక్ లేదంటున్నారు కొన్నేళ్లుగా షుగర్ సమస్యతో బాధపడుతున్నాను. నాకు నెలకు నాలుగు వెయిల్స్ వరకూ అవసరం అవుతాయి. గతంలో పెద్దాస్పత్రిలో నెలకు సరిపడా వెయిల్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఒక వెయిల్ మాత్రమే ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అది కూడా లేదంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆస్పత్రిలో స్టాక్ లేదని చెబుతున్నారు. నెలనెలా ఇన్సులిన్ కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. – వెంకటేశ్వర్లు, మధుమేహ బాధితుడు, కర్నూలు -
అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!
ఈ రోజుల్లో మధుమేహం (డయాబెటిస్) చాలా సాధారణం. మామూలుగానే నియంత్రణలేని డయాబెటిస్ ఆరోగ్యపరంగా ఎన్నోఅనర్థాలు తెచ్చిపెడుతుంది. అదే ఒకవేళ గర్భిణిలో ఆ సమస్య ఉండి, వాళ్లకు చక్కెర నియంత్రణలో లేకపోతే అదికాబోయే తల్లికీ, కడుపులోనిబిడ్డకూ చేటు తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. మామూలుగా కొందరు మహిళలకు గర్భధారణకు ముందునుంచే డయాబెటిస్ ఉండి ఉండవచ్చు. మరికొందరికి గర్భం వచ్చాక కనిపించవచ్చు. దీన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రక్తంలోచక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికీ, అటు బిడ్డకూ...అలాగే ఇటు కాన్పు సమయంలో, అటు కాన్పు తర్వాతా... ఇలా ఎవరిలోనైనా, ఏ దశలోనైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆ సమస్యలేమిటీ, వాటి పరిష్కారాలేమిటి వంటి అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.మహిళకు... తనకు గర్భం రాకముందునుంచే డయాబెటిస్ ఉండి, గర్భం వచ్చాక రక్తంలోని చక్కెర నియంత్రణలో లేకుండా తీవ్రత ఎక్కువైతే దాన్ని ‘ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. మళ్లీ ఇందులోనూ ఆమెకు ‘టైప్–1 డయాబెటిస్’, ‘టైప్–2 డయాబెటిస్’ అనే రెండు రకాల డయాబెటిస్‌లలో ఏదో ఒకటి ఉండే అవకాశముంది.‘టైప్–1 డయాబెటిస్’ చిన్నవయసులోనే వస్తుంది. ఇందులో సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రాంక్రియాస్ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల, ఆ గ్రంథిలోంచి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ స్రవించడం ఆగిపోవడం వల్ల వచ్చేదే టైప్–1 డయాబెటిస్. దీని ప్రభావం ఇతర అవయవాలపైనా ఉంటుంది. ఇక ‘టైప్–2 డయాబెటిస్’ అనేది పెద్దయ్యాక వచ్చే మధుమేహం. మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో; సాధారణంగా 35 ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ఇన్సులిన్ ప్రభావానికిలోనై శరీరంలోని కణాలు స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర నియంత్రణ జరగదు. దాంతో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తుంది. ఇది చాలామందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక జెస్టేషనల్ డయాబెటిస్ అంటే... ఈ కండిషన్ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే కనిపించి, కాన్పు తర్వాత డయాబెటిస్ కనిపించకుండా పోతుంది. (అయితే ఇలాంటి కొందరిలో ఆ తర్వాత కొంతకాలానికి డయాబెటిస్ కనిపించే అవకాశాలుంటాయి.) డయాబెటిస్‌కు కారణాలుప్రాంక్రియాస్ గ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోను... రక్తంలోని చక్కెరను నియంత్రిస్తూ అవసరమైనప్పుడు శక్తి కోసం చక్కెర విడుదలయ్యేలా, అవసరం లేనప్పుడు తగ్గి΄ోయేలా... ఎప్పుడూ ఓ నార్మల్ విలువ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. ఇలా జరగనప్పుడు డయాబెటిస్ కనిపిస్తుంది. ఆ కారణాలేమిటంటే... ∙గర్భిణుల్లో విడుదలయ్యే కార్టిసా ప్రొజెస్టరాన్, ప్రోలాక్టిన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజెన్ లాంటి హార్మోన్లు ఇన్సులిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ∙కొందరు గర్భిణుల్లో బరువు ఎక్కువగా పెరిగేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు, శరీర తత్వాన్ని బట్టి నెలలు నిండే కొద్దీ ఒక్కోసారి ఇన్సులిన్ పని తీరు క్రమంగా తగ్గుతుండటం వల్ల, రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలో లేక΄ోవడంతో డయాబెటిస్ కనిపిస్తుంది. కాన్పు తర్వాత మళ్లీ హార్మోన్లు సాధారణ స్థాయికి రావడంతో ఇన్సులిన్ పనితీరు మళ్లీ మునుపటిలాగానే ఉండి, చక్కెరను నియంత్రిస్తుండటం వల్ల కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గుతుంది. గర్భవతి కాకముందునుంచే డయాబెటిస్ ఉండేవారిలో గర్భంతో ఉన్నప్పుడు చక్కెర మోతాదులు పెరుగుతాయి. కాన్పు తర్వాత ఆ చక్కెర మోతాదులు మళ్లీ గర్భంరాకముందు ఉన్న స్థాయికి పడిపోతాయి. గర్భిణుల్లో డయాబెటిస్ముప్పు ఎవరిలో ఎక్కువంటే... గర్భధారణ 30 ఏళ్లు పైబడిన తర్వాత జరిగిన వారిలో తమ ఎత్తుకంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉన్న చరిత్ర ఉన్నవారిలో. ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో క్రితం కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉన్నవారిలో ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉన్న సందర్భాల్లో.నిర్ధారణ...ఇక్కడ చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్‌కు తమకు సంబంధించిన ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా విషయాలను దాపరికం లేకుండా చెప్పి, రక్తంలో చక్కెర మోతాదు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో మళ్లీ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. మొదట రాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకోవాలి. అందులో విలువలు 150 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్ విలువలు 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) చేయించాలి. ఇందులో తిండితో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్ తాగిస్తారు. ఒక గంట తర్వాత రక్తంలో షుగర్ మోతాదులు ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్ అవకాశాలు ఎక్కువ అని అర్థం. వ్యాధి పూర్తి నిర్ధారణ కోసం ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) చేయించాలి. ఇందులో ఏమీ తినకుండా ఒకసారి, మొదట 100 గ్రా. గ్లూకోజ్ తాగించి గంట తర్వాత ఒకసారీ, రెండు గంటల తర్వాత మరోసారీ, మూడు గంటల తర్వాత ఇంకోసారీ... ఇలా నాలుగుసార్లు రక్తపరీక్ష చేస్తారు. ఈ కొలతలు 95, 180, 155, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. డయాబెటిస్ ఉన్నప్పుడు వచ్చే సమస్యలివి...తల్లిలో...గర్భస్రావాలు : ముందునుంచే డయాబెటిస్ ఉన్నవారిలో, చక్కెర అదుపులో లేనివాళ్లలో అబార్షన్లు అయ్యే అవకాశాలెక్కువ. హైబీపీ : డయాబెటిస్ ఉన్న గర్భిణుల్లో సాధారణ గర్భిణుల కంటే హైబీపీకి అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి నెలలు నిండకముందే కాన్పు చేయాల్సి రావచ్చు. గర్భిణుల్లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, ఉమ్మనీరు ఎక్కువగా ఊరుతుంది. ఉమ్మనీరు అధికంగా ఉండటం వల్ల పొట్ట పెద్దగా కనిపిస్తూ, తల్లికి ఆయాసంగా ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు ΄ోవడం, నెలలు నిండకముందే కాన్పు అయ్యే ప్రమాదాలు ఉండవచ్చు వీళ్లలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలెక్కువ ∙గర్భిణులూ ఎక్కువ బరువుండటం, అలాగే కడుపులో బిడ్డకూడా అధిక బరువు ఉండటం వల్ల ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాల్సి రావచ్చు ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారిలో కొన్నిసార్లు చక్కెర మరీ అధికం అయి΄ోయి కీటో ఎసిడోసిస్ అనే కండిషన్‌కు వెళ్లవచ్చు కొంతమందిలో డయాబెటిస్ కోసం తీసుకునే మందుల మోతాదు ఎక్కువై, చక్కెర మరీ తగ్గడం వల్ల కళ్లు తిరిగి పడి΄ోవచ్చు ∙రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తసరఫరా సరిగా జరగక΄ోవడంతో కళ్లు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. గర్భంలోని శిశువుకి... అవయవ లోపాలు : గర్భధారణలోని మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రైమిస్టర్లో) తల్లిలో చక్కెర ఎక్కువగా ఉండటం, చక్కెర మోతాదులు అదుపులో లేనప్పుడు అవి గర్భంలోని పిండంలోకి ప్రవేశించి, శిశువులో అవయవలో΄ాలు (ముఖ్యంగా వెన్నుపూస, గుండెకు సంబంధించినవి) కలిగించే ముప్పు.బిడ్డ సైజు విషయంలో అనర్థాలు... తల్లిలో ఎక్కువగా ఉండే ఆ గ్లూకోజ్ మోతాదులు మాయ (ప్లాసెంటా) ద్వారా బిడ్డకు చేరుతాయి. దాంతో బిడ్డలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. బిడ్డ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడం వల్ల బిడ్డ నార్మల్ కంటే పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల పుట్టబోయే చిన్నారులు నార్మల్ కంటే పెద్దగా, ఎక్కువ బరువుతో నీరుపట్టినట్లుగా, ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. తల్లికీ ప్రసవం కష్టమయ్యే అవకాశాలెక్కువ. గర్భంలో చనిపోవడం : బిడ్డ మరీ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఎనిమిది, తొమ్మిది నెలల్లో బిడ్డకు సరిపడ ఆక్సిజన్ అందక కడుపులోనే చనిపోయే అవకాశం.జాగ్రత్తలు / చికిత్సలుడయాబెటిస్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత గర్భిణులు తమ గైనకాలజిస్ట్, ఫిజీషియన్ లేదా డయాబెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ వంటి నిపుణుల పర్యవేక్షణలో వారు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. తల్లి రక్తంలో చక్కెరను తరచూ గమనించుకుంటూ / పరీక్షిస్తూ ఉండాలి. శిశువు ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. డాక్టర్లు సూచించిన విధంగా సరైన సమయంలో ప్రసవం చేయించాలి. బిడ్డ పుట్టాక... చిన్నారిని కొద్ది రోజులపాటు పిల్లల డాక్టర్ (పీడియాట్రీషన్) పర్యవేక్షణలో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండాలి. పుట్టిన బిడ్డకు గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ (ప్లాసెంటా) నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోతాయి. ఫలితంగా బిడ్డ కండరాలలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోవడం, చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలెక్కువ. కొన్నిసార్లు నెలలు నిండకుండా అయ్యే కాన్పు వల్ల బిడ్డకి ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందక΄ోవడం, దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటి పిల్లల్లో క్యాల్షియమ్, మెగ్నిషియం వంటివి తక్కువ మోతాదులో ఉండటం వల్ల కండరాలు బలహీనత రావచ్చు ఇలాంటి పిల్లలకు కామెర్లు వచ్చే అవకాశాలెక్కువ ∙బిడ్డ గుండె గోడలు అవసరమైనదానికంటే ఎక్కువగా పెరగవచ్చు. (కార్డియోమయోపతి) ∙బిడ్డ పెద్దయ్యాక స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశాలెక్కువ. డయాబెటిస్ లేని గర్భవతితో పోలిస్తే... ఈ సమస్య ఉన్న గర్భిణికి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 2–5 శాతం ఎక్కువ.మరికొన్ని వైద్య పరీక్షలుగర్భిణికి వ్యాధి నిర్ధారణ జరిగాక, షుగర్ మోతాదులను బట్టి వారానికోసారి లేదా రెండు వారాలకొకసారి, తినకుండా ఒకసారి, భోజనం చేశాక, రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇందులో మొదటిది 105 ఎండీడీఎల్. కంటే తక్కువగానూ, రెండోది 120 ఎంజీడీఎల్ కంటే తక్కువగానూ ఉందేమో చూసుకుంటూ ఉండాలి. అలా ఉండేలా డాక్టర్లు ప్లాన్ చేస్తారు. మూత్రపరీక్ష : గర్భిణుల్లో సాధారణంగా కిడ్నీ పనితీరులో మార్పు వల్ల మూత్రంలో చక్కెర పోతూ ఉంటుంది. దీన్నిబట్టి డయాబెటిస్ ఉందని నిర్ధారణకు రావడం సరికాదు. ఇది చాలా సాధారణం. ఇంకా ఈ పరీక్షలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, ప్రోటీన్లు ఏమైనాపోతున్నాయేమో తెలుసుకొని, ఆ సమస్యలకు చికిత్స అందించాల్సి రావచ్చు. హెచ్‌బీఏ1సీ: ఈ పరీక్ష ద్వారా మూడు నెలల సగటు చక్కెర మోతాదులు తెలుస్తాయి. దీంతో గత మూడు నెలల వ్యవధిలో చక్కెర నియంత్రణలో ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంగర్భిణుల రక్తంలో చక్కెర మోతాదులు కొద్దిగానే ఎక్కువ ఉంటే, డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుని షుగర్ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలతో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాక΄ోయినా లేదా షుగర్ మరీ ఎక్కువగా ఉన్నా... మందులు, లేదా ఇన్సులిన్ ద్వారా చికిత్స అందించాలి. డయాబెటిస్ ఉన్నప్పుడు... గర్భిణుల బరువును బట్టి, వారు చేసే పనిని బట్టి, వారి రక్తంలోని షుగర్ మోతాదులను బట్టి ఎన్ని క్యాలరీల ఆహారం, ఎలా తీసుకోవాలనే విషయాలను వారి ఫిజీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ నిర్ణయిస్తారు. వీరు ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి.చక్కెర మోతాదులు తక్కువగానూ, కొవ్వు తక్కువగానూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే అన్నం తక్కువగా తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంతవరకు చక్కెర, తేనె, బెల్లం, స్వీట్స్, బేకరీ ఫుడ్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, పనస, నెయ్యి, డ్రైఫ్రూట్స్, నూనె వస్తువులు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మిగతా పండ్లను కూడా జ్యూస్‌గా కంటే పండ్ల రూపంలోనే కొరికి తింటుండటం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తీసుకున్నా, అందులో చక్కెర కలుపుకోకుండా తాగడం మేలు. వ్యాయామాలు : గర్భిణులు అంతగా శ్రమ కలిగించని, నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండటం వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. దాంతో చక్కెర కారణంగా కనిపించే దుష్పరిణామాలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉపయోగం ఎప్పుడంటే... ఆహార నియమాలు, వ్యాయామాలతో రక్తంలో చక్కెర మోతాదులు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ద్వారా చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. ఇది ఇంజెక్షన్ ద్వారా చర్మం కిందనుండే కొవ్వు పొరల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఇన్సులిన్ నేరుగా రక్తంలో కలిసి వృథా అయి΄ోకుండా, మెల్లమెల్లగా రక్తంలో కలుస్తూ, అందులోని చక్కెర మోతాదులను ఓ క్రమపద్ధతిలో నియంత్రిస్తుంది. ఈ ఇన్సులిన్ ఎంత మోతాదులో, ఎన్నిసార్లు ఇవ్వాలన్నది వైద్యనిపుణులు నిర్ధారణ చేస్తారు. మెట్ఫార్మిన్ మాత్రలు : ఇటీవలి కొన్ని పరిశోధనలలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బదులు మెట్ఫార్మిన్ మాత్రలు గర్భిణుల్లో సురక్షితంగా వాడవచ్చని తేలింది.గర్భం దాల్చిన రెండు మూడు నెలల్లో స్కానింగ్ చేయించడం వల్ల గర్భంలో ఒకే శిశువు ఉందా, లేదా రెండు ఉన్నాయా, పిండానికి ఎన్ని వారాల వయసు, గుండె స్పందనలు సరిగా ఉన్నాయా వంటి విషయాలు తెలుస్తాయి ఐదు, ఆరు నెలల మధ్యన టిఫా స్కానింగ్, అవసరముంటే ఫీటల్ టూ–డీ ఎకో పరీక్ష చేయించడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది ఏడో నెల తర్వాత అవసరాన్ని బట్టి నెలనెలా చేయిస్తే, బిడ్డ సైజు మరీ ఎక్కువగా ఉందా, ఉమ్మనీరు మరీ ఎక్కువగా ఉందా... వంటి విషయాలు తెలుస్తాయి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉండేవాళ్లు మధ్యమధ్య కంటి రెటీనా పరీక్ష, కిడ్నీ పనితీరు (క్రియాటినిన్) పరీక్ష చేయించుకోవాలి. కాన్పు సమయంకాన్పు ఎప్పుడు, ఎలా చేయాలి అనే అంశాలను... డయాబెటిస్ ఎంత నియంత్రణలో ఉంది, తల్లిలో, బిడ్డలో ఏవైనా అనర్థాలు కనిపిస్తున్నాయా లాంటి అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. చక్కెర నియంత్రణలోకి రాకపోయినా, గర్భధారణను కొనసాగించడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే కాన్పు చేయాల్సి రావచ్చు సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, నొప్పుల వల్ల తల్లిలోని షుగర్ మోతాదులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ, అవసరాన్ని బట్టి ఇన్సులిన్ మోతాదును సెలైన్లలో వేసి ఎక్కిస్తూ కాన్పును జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ చేయాల్సి ఉంటుంది. లేకపోతే గర్భంలోని శిశువుకు అపాయం కలిగే అవకాశాలక్కువ. సిజేరియన్ : సాధారణ కాన్పు ప్రయత్నం విఫలమైనా, కడుపులోని బిడ్డ సైజు 3.5 కేజీల నుంచి 4 కేజీల కంటే ఎక్కువ బరువున్నా, డయాబెటిస్ నియంత్రణలో లేకపోయినా, బీపీ బాగా పెరుగుతూ ఉన్నా, మునుపు గర్భధారణలో శిశువు చనిపోయిన సందర్భాలున్నా... తల్లికి సిజేరియన్ చేయాల్సి రావచ్చు. కాన్పు తర్వాతపుట్టిన వెంటనే బిడ్డ పరిస్థితిని బట్టి తల్లి పాలను పట్టించాలి. కడుపులో ఉన్నంత కాలం బిడ్డకు చక్కెర ఎక్కువగా అందుతూ, కాన్పు అయిన వెంటనే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది పరీక్ష చేసి, అవసరమైతే బయటి పాలు లేదా సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఎక్కించాలి కాన్పు తర్వాత నాలుగు గంటలకు ఒకసారి చొప్పున 48 గంటల పాటు షుగర్ మోతాదులను పరీక్షిస్తూ ఉండాలి. తల్లికి జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు కాన్పు తర్వాత చక్కెర మోతాదులు మామూలు స్థాయికి వస్తాయి. కాబట్టి తల్లికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే తల్లికి ప్రీ–జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే కాన్పుకు ముందు తల్లికి ఉన్న స్థాయికి చక్కెరపాళ్లు వస్తాయి. ఈఅంశాలను బట్టి ఇన్సులిన్‌ను గర్భం రాకముందు ఇస్తున్న మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు మధుమేహం (జెస్టీషనల్ డయాబెటిస్) వచ్చిన మహిళలు... ఆ టైమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం లేదా బరువు ఎక్కువగా పెరగడం వంటివి జరిగితే... వాళ్లకు 15–20 ఏళ్ల తర్వాత మళ్లీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా మహిళలతో ΄ోలిస్తే వాళ్లలో ఈ ముప్పు ఎక్కువ. గర్భం రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... డయాబెటిస్ ఉన్నవాళ్లు తమకు గర్భం రాకముందే... అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే సమయంలోనే తాము వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. ముందునుంచే తమ రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాల పరిస్థితి ఎలా ఉందో వైద్యపరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఉండాల్సిన దానికంటే తాము ఎక్కువ బరువు ఉంటే... తమ ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.వీలైతే బరువు తగ్గాకే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించడం మంచిది. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత గర్భధారణకు మూడు నెలల ముందునుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం వల్ల బిడ్డలో స్పైనా బైఫిడా వంటి వెన్నెముక సరిగా పెరగక΄ోవడం లాంటి చాలా రకాల వైకల్యాలను నివారించవచ్చు. డాక్టర్ శ్రీనిత్య పున్నంరాజు సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ (చదవండి: Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!) -
తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
చలికాలం మొదలు కాగానే మార్కెట్టులో విరివిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాలలో గేగులు అని అంటారు. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఇప్పుడైనా వీటిని తినేందుకు త్వరపడతారు. తేగల్లో పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పోషకాల లోపాన్నీ తగ్గిస్తాయి. తేగలతో ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా? తేగలను ఉడికించి మిరియాలు, ఉప్పు అద్దుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. తేగలు తింటే బరువు తగ్గడంతోపాటు కాన్సర్ కూడా దూరం అవుతుంది. అలాగే తేగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరి పాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.తేగలపిండితో రొట్టెలు చేసుకుని తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్ద పేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో తెల్ల కణాలను వృద్ధి చేస్తుంది. శరీరానికి చలువనిచ్చి, నోటిపూతను తగ్గిస్తుంది. తేగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా రాసుకుంటే చర్మం మిలమిల లాడుతంంది.తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్‌గా వీటిని పెడితే ఎముకల ఎదుగుదలకు దోహద పడుతుంది. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్నవారు ఈ సీజన్లో వచ్చే తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలకు మూలం తాటిచెట్టే. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తాటి ముంజులు మార్కెట్లోకి వస్తాయి. అవి ముదిరి తాటికాయలుగా తయారై పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా తాటి తాండ్ర, తాటి రొట్టెలు మొదలైనవి. ఈ తాటి కాయల టెంకలతో పాటు,కాయలను కూడా ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. వీటిని మొలకలు రాకముందే తీసి, కుండల్లో ప్రత్యేకంగా అమర్చి నిప్పుల్లో కాల్చతారు. ఇవి తినడానికి కమ్మగా ఉంటాయి. వీటి మార్కెట్లో విక్రయంచి రైతులు ఉపాధి పొందుతారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఇవీ చదవండి :ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ నోట్: మంచిది కదా అని అతిగా తింటే మాత్రం చెరుపు చేస్తుంది. -
గ్రామాల్లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో వచి్చన మార్పులు, ఒత్తిళ్ల నేపథ్యంలో గ్రామాల్లో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఎన్సీడీ వ్యాధులపై ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు. 30 సంవత్సరాల వయస్సు దాటిన 1.66 కోట్ల మందికి పరీక్షలు జరపగా, 22.94 లక్షల మందికి రక్తపోటు, 11.9 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో గురువారం మంత్రి రాజనర్సింహతో జరిగిన ఈ సమావేశంలో సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేసిన ఎన్సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్సీడీ క్లినిక్‌లలో అందుతున్న వైద్య సేవలపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ సర్వేను కొనసాగించాలని ఆయన సూచించారు. -
Manmohan Singh: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్తు దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను గుర్తించేసుకుంటూ..ప్రముఖలు, రాజకీయనేతలు నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన తొలి సిక్కుగా ఘనత దక్కించుకున్నా మన్మోహన్ వ్యక్తిగత అలవాట్లు గురించి పెద్దగా ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే మితభాషిగా ఉండే ఆయన వ్యవహారశైలినే కారణమని చెప్పొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడూ..అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఇష్టపడే వంటకాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అవేంటో చూద్దామా.ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతావనిగా రూపు ఇచ్చి.. యావత్ ప్రపంచం మనవైపు చూసేలా చేసిన దార్శనికుడు. పాలన, దౌత్యపరంగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. రాజీయ చతురత, వినయపూర్వకమైన ప్రవర్తనకు తగ్గటుగానే ఆయన అభిరుచులు ఉండేవని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆయన ఆహారపు అలవాట్లు ఓ సాధారణ వ్యక్తి ఇష్టపడేవే. ఎందుకంటే ఆయన అమితంగా ఇష్టపడేది పెరుగు అన్నమే. దానిమ్మ, ఊరగాయలు అంటే మహా ఇష్టం. ఉత్తర భారతదేశంలో కధీ చావల్గా పిలిచే పెరుగన్నం(Curd Rice) మన్మోహన్ మెచ్చే వంటకమని చెబుతుంటారు సన్నిహితులు. ఇది శరీరానికి చలువ చేస్తుంది, పైగా మనసును ప్రశాంతంగా ఉంచే రెసిపీ అని అంటుంటారట మన్మోహన్. అయితే మధుమేహం(Diabetes) కారణంగా స్వీట్స్‌కి దూరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవారట. చెప్పాలంటే ఇక్కడ మన్మోహన్ పూర్తి శాకాహారి(Vegetarian). అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఆ శాకాహార నియమాన్ని ఉల్లంఘించే గమ్మతైన ఘటన జరిగిందంటే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేరుగాంచిన డిష్ బెంగాలీ హిల్సా ఫిష్ కర్రీ. ఈ రెసిపీలో చేపకు ఆవపిండిని పట్టించి అరటి ఆకుల్లో ప్యాక్ చేసి ఆవిరిపై వండుతారట. ఈ వంటకం రుచి గురించి తెలుసుకుని మరీ తెప్పించుకుని ఆస్వాదించారట మన్మోహన్. పైగా దీని రుచికి ఫిదా అయ్యి శాకాహార నియమాన్ని ఉల్లంఘించక తప్పలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారట. ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన విశిష్ట వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన జీవితం తాలుకా జ్ఞాపకాలు సదా నిలిచే ఉంటాయి. (చదవండి: మన్మోహన్ సింగ్ ఆ డ్రైస్సింగ్ స్టైల్‌నే ఎంచుకోవడానికి రీజన్ ఇదే..!) -
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
చాపకింద నీరులా మధుమేహ ముప్పు
సాక్షి, అమరావతి: దేశంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. 2045 నాటికి 12 కోట్లకు చేరతారని అంచనాలున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టు ప్రముఖ డయాగ్నోస్టిక్ ప్రివెంటివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ సంస్థ థైరోకేర్ అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది దేశవ్యాప్తంగా 19.66 లక్షల మంది హెచ్‌బీఏ1సీ ఫలితాలను థైరోకేర్ సంస్థ విశ్లేíÙంచింది. వ్యాధి వ్యాప్తిలో భయంకరమైన పోకడలను గుర్తించినట్టు స్పష్టం చేసింది.కలవరపెడుతున్న అసాధారణ గ్లూకోజ్ స్థాయి 19.66 లక్షల మంది ఫలితాలను విశ్లేషించగా అందులో 49.43 శాతం మంది రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. 22.25 శాతం మంది ప్రీడయాబెటిక్ దశలో ఉండగా, 27.18 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆహారంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు మధుమేహం, ప్రీడయాబెటిస్ ముప్పు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. గోధుమ ఆధారిత ఆహారాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తక్కువ ప్రాబల్యం రేటును ఉన్నట్టు వివరించారు. యువకుల్లో అధికంగా ప్రీ డయాబెటిక్ 18–35 ఏళ్ల యువతలో ప్రీ డయాబెటిక్ ప్రాబల్యం అధికంగా ఉండగా, 36–65 సంవత్సరాల వారిలో వ్యాధి ప్రభావం వృద్ధి చెందుతోంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు నిర్వహించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లైతే వ్యాధిని నివారించవచ్చని థైరోకేర్ సూచించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడంతో పాటు, తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.‘హాని’కరమైన ఆహార అలవాట్లు ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ ఉండటానికి హానికరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ గతంలో స్పష్టం చేసింది. సమోసా, పకోడీ, చిప్స్, నూడిల్స్ ఇలా మార్కెట్లో లభించే అ్రల్టాప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మధుమేహం ప్రమాదం పెరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ పదార్థాల్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుందని, దీంతో ఈ ఆహారం తిసుకునే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగి తొందరగా మధుమేహం బారినపడతారని పేర్కొంది. -
నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..!
శరీరంలోని చక్కెర స్థాయి తెలుసుకోవాలంటే, నెత్తురు చిందించక తప్పదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం మేరకు చక్కెర స్థాయి తెలుసుకోవడానికి కనీసం ఒక్క చుక్క నెత్తురైనా అవసరం. ఇంట్లో గ్లూకో మీటర్ ద్వారా చక్కెర స్థాయి తెలుసుకోవాలన్నా, సూదితో వేలిని పొడిచి నెత్తురు చిందించక తప్పదు. అయితే, అమెరికన్ కంపెనీ ‘నో లాబ్స్’ రూపొందించిన ఈ పరికరం ఉంటే, ఒక్క చుక్కయినా నెత్తురు చిందించకుండానే శరీరంలోని చక్కెర స్థాయిని వెంటనే తెలుసుకోవచ్చు. ‘నో యూ’ పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని జిగురు ఉన్న స్టిక్కర్ ద్వారా లేదా, బిగుతుగా పట్టే రబ్బర్ స్ట్రాప్ ద్వారా జబ్బకు, లేదా ముంజేతికి కట్టుకుంటే చాలు. క్షణాల్లోనే శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఈ పరికరం పనితీరును ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్‌డీఏ’ పరీక్షిస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లయితే, ఈ పరికరం అందరికీ అందుబాటులోకి వస్తుంది. (చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!) -
డార్క్ చాక్లెట్ టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదే పదే నొక్కి చెప్పేవారు. కానీ మోతాదుకి మించొద్దు అని సూచించేవారు. అయితే ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదా..? అనే విషయంపై పరిశోధనలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా హార్వర్డ్‌కి చెందిన యూఎస్, చైనీస్ శాస్త్రవేత్తలు అది నిజమేనని నిర్థారించారు. మిల్క్ చాక్లెట్లు తిన్న వారికంటే డార్క్ చాక్లెట్లు తిన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చి చెప్పారు. అలాగే ఈ చాక్లెట్లు తినడం వల్ల బరువుపై ప్రభావం చూపదని కూడా నిర్థారించారు. అందుకోసం మహిళా నర్సులపై పరిశోధన చేశారు.దాదాపు 1986-2018 వరకు వారి హెల్త్ డాటాను ట్రాక్ చేశారు. అలాగే పురుష ఆరోగ్య నిపుణలపై కూడా 1986 నుంచి 2020 వరకు హెల్త్ డేటాను పరిశీలించారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలున్న వారిని మినహా మిగతా అందరి జీవనశైలి వారి తీసుకునే డార్క్ చాక్లెట్ మోతాదుని పరిశీలించారు. వీరిలో మిల్క్ చాక్లెట్ తిన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. అయితే కేవలం డార్క్ చాక్లెట్‌ని తిన్న వారిలో కోకో ఉత్పత్తులు జీవక్రియను మెరుగుపరిచిందన్నారు. ఇది రక్తపోటులో గణనీయమైన తగ్గుదల తోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచిందని వెల్లడించారు. అంతేగాదు అధిక బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులలో కూడా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచిందన్నారు. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడేలా టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21% మేర తగ్గిస్తుందని నిర్ధారించారు పరిశోధకులు. ఒత్తిడిని కూడా నివారిస్తుందని చెప్పారు. అయితే ఈ సత్ఫలితాలు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని వారు త్వరితగతిన పొందగలరని అన్నారు. మిగతా వారికి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలవ్వుతుందని అన్నారు.(చదవండి: కూర్చోవడం ధూమపానం లాంటిదా? కేన్సర్‌కి దారితీస్తుందా..?) -
డేంజర్ బెల్స్.. 2040లో మన పాలిట శాపాలివే..
మానవ జీవన శైలి కారణంగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. రోజురోజుకు మారిపోతున్న టెక్నాలజీలు, కొత్తగా అందుబాటులోకి వైద్య చికిత్సలు ఒకవైపు.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం వంటివి మనుషుల మరణం తీరును మార్చేస్తున్నాయి.భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాద మరణాలు, టీబీ, ఎయిడ్స్ వంటివాటితో జరిగే మరణాలు బాగా తగ్గిపోతే.. అల్జీమర్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ కారణంగా మరణాలు పెరిగిపోతాయని ఓ అధ్యయనం తేల్చింది. 2016లో నమోదైన మరణాలకు (సహజ మరణాలు కాకుండా..) కారణాలను పరిశీలించడంతోపాటు 2040లో మరణాలకు కారణమయ్యే 20 ప్రధాన అంశాలను అంచనా వేసింది.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం, వివిధ రకాల కేన్సర్లు పెరుగుతాయని.. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ ముప్పును తప్పించుకోవచ్చని పేర్కొంది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రచురితమైంది. -
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించిందా? క్యాన్సర్ రిస్క్ ఎంత?
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం మామూలే. కానీ రుతుస్రావాలు ఆగిపోయి... ఏడాది కాలం దాటాక మళ్లీ తిరిగి రక్తస్రావం కనిపిస్తుందంటే అదో ప్రమాద సూచన కావచ్చు. అది ఎందుకుజరుగుతోంది, దానికి కారణాలు కనుగొని... తగిన చికిత్స తప్పక చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాతకూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం.ఓ మహిళకు మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు ఆస్కారముంది. అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.చేయించాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తే... అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ వంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో ఎండోమెట్రియం ΄÷ర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అప్పుడు మరికొన్ని పరీక్షలూ చేయించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి, ఇతర వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపించడానికి బదులు అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉండటం జరిగితే అసహజమని గుర్తించాలి. అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించక΄ోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ చేయాల్సి రావచ్చు.ఇతరత్రా కారణాలుండవచ్చు... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన అక్కర్లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే వైద్యులు ముందు ప్రైవేట్ పార్ట్స్ చుట్టుపక్కల ఉండే అవయవాలను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్ ఉన్నా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే...?సాధారణ ఆరోగ్యవంతులైన మహిళల కంటే అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. కుటుంబంలో అనువంశికంగా, తమ ఆరోగ్య చరిత్రలో క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లోని మహిళలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర వివరాలు తెలుసుకోవాలి. చికిత్స అవసరమయ్యేదెప్పుడంటే...ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితంలో ఏమీ లేదని తెలిసినప్పుడూ రక్తస్రావం కనిపించినప్పటికీ భయం అక్కర్లేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే చాలు.బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటే... దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొరమందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు లేదా హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. -
చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంటే ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయా..?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. (చదవండి: పొంచే ఉంది.. కొంచెం జాగ్రత్త!) -
చిన్నప్పటి నుంచి ఉంది ప్లానింగ్ ఎలా?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. -
కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?
డయాబెటిస్ ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటుంటే చక్కెర అదుపులో ఉంటుందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే ఇందులో కాస్తంత పాక్షిక సత్యమూ లేకపోలేదు. కాకరలో ‘కరాటిన్’, ‘మమోర్డిసిస్’ అనే పోషకాలు ప్రధానంగా ఉంటాయి. వాటికి కొంతవరకు చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇక కాకర గింజల్లోనూ పాలీపెపెప్టైడ్–పీ’ అనే ఇన్సులిన్‌ను పోలిన ఫైటోకెమికల్ ఉంటుంది. దీనికి కూడా కొంతవరకు ఇన్సులిన్‌లాగా పనిచేసే గుణం ఉండటంతో అది కొంతవరకు చక్కెరను అదుపు చేస్తుంది. కానీ కాకరకాయతో చేసే వంటలతోనే చక్కెర పూర్తిగా అదుపులో ఉండటమన్నది అసాధ్యం. వాళ్లు డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సిందే. ఉపయోగపడే పోషకాలెన్నెన్నో... అయితే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు కాకరలో ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకు కాకరలో విటమిన్ బి1, బి2, బి3, సి ల తోపాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. ‘సి’ విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (కేన్సర్ కారక కణాలు) తొలగి΄ోయి... కేన్సర్లు నివారితమవుతాయి. కాకర గింజలకు కొవ్వును కరిగించే గుణం ఉండటంతో గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో పీచు చాలా ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని రాకుండా చూస్తూ ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
డయాబెటిస్ వాట్సాప్ చానల్
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ మధుమేహం సమస్య పెరుగుతోందని, అదే విధంగా ఈ వ్యాధిపై అపోహలు కూడా పెరుగుతున్నాయని కాంటినెంటల్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అపోహలను దూరం చేసేందుకు, డయాబెటిస్‌పై అవగాహన కలి్పంచేందుకు.. కాంటినెంటల్ ఆస్పత్రి దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ప్రత్యేక చానల్ రూపొందించినట్టు తెలిపారు. గురువారం ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా ఈ చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చానల్ ద్వారా వ్యక్తిగతంగా పౌష్టికాహార చిట్కాలు, నిపుణుల సూచనలు, డయాబెటిస్ కేర్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని గురు ఎన్ రెడ్డి చెప్పారు.30 ఏళ్ల క్రితం మహిళల్లో 12 శాతం ఉన్న డయాబెటిస్ ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని, పురుషుల్లో 11 శాతం ఉండగా 23 శాతానికి పెరిగిందని వివరించారు. చాలామందికి కనీసం డయాబెటిస్ వచి్చనట్టు (సైలెంట్ డయాబెటిస్) తెలియట్లేదని వెల్లడించారు. దీన్ని సరిగ్గా అంచనా వేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవన విధానంతో దీనిని అధిగమించవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చని గురు ఎన్ రెడ్డి చెప్పారు. వాట్సాప్ చానల్లో డయాబెటాలజిస్టుతో పాటు న్యూట్రిషనిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు సహా అనేక మంది వైద్య నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. -
పాదాలకే కాదు..ప్రాణాలకూ ప్రమాదమే
ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు డయాబెటిక్ బారిన పడుతున్నారని ఒక అంచనా. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) ప్రకారం, 2023 నాటికి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 53.7 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ఆధునిక జీవనశైలి, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వృద్ధుల జనాభా ఆధారంగా 2045 నాటికి ఈ సంఖ్య 70 కోట్లకు పెరుగు తుందని ఓ అంచనా. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ బాధితులు అత్యధికంగా ఉన్నా దేశాల్లో భారతదేశం ఒకటి. సుమారు 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు, 2045 నాటికి 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ గణాంకాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత మధుమేహం ప్రభావిత దేశంగా మారే అవకాశాలు లేకపోలేదు. – సాక్షి, హైదరాబాద్‌ప్రతి నలుగురిలో ఇద్దరికీ ఈ సమస్య సాధారణంగా డయాబెటిస్ బాధితులకు దృష్టిలోపానికి సంబంధించి రెటినోపతి, నరాల బలహీనతకు న్యూరోపతి, కిడ్నీ సమస్యలకు నెఫ్రోపతి సమస్యలపైనే అవగాహన ఉంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య ఫుట్అల్సర్స్ కూడా. అంటే మధుమేహ వ్యాధి రోగులకు కాలి అడుగుభాగంలో ఏర్పడే పుండు. డయాబెటిక్ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన ఈ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఉన్న వారిలో సగటున 15 శాతం నుంచి 25 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో డయాబెటిక్ ఫుట్అల్సర్స్ అంటే పాదాలపై పుండ్ల బారిన పడుతున్నారు. ఆంప్యుటేషన్స్ లేకుండా నయం చేయవచ్చు..డయాబెటిస్ బాధితుల్లో ఇటీవల కాలంలో డయాబెటిక్ ఫుట్అల్సర్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ రోగుల్లో పాదాల సంరక్షణపై అవగాహన లేదు. అందుకే డయాబెటిస్ బాధితులు షుగర్ నియంత్రణతోపాటు పాదాల్ని సంరక్షించుకోవాలి. చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డయాబెటిక్ ఫుట్అల్సర్స్కు ఆంప్యుటేషన్ చేయకుండానే పూర్తిగా నయం చేసే అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. ఫుట్అల్సర్స్తోపాటు, గ్యాంగ్రీన్, సెల్యూలైటిస్, కాలిన గాయాలకు కూడా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నయం చేస్తున్నాం. – డాక్టర్. భరత్‌కుమార్, చైర్మన్ కేబీకే మలీ్టస్పెషాలిటీ హాస్పిటల్స్చక్కర శాతం పెరగడంతో..డయాబెటిక్ ఫుట్అల్సర్కు ప్రధాన కారణం రక్తంలో చక్కర (గ్లూకోజ్) శాతం పెరిగిపోవడం. సాధారణంగా షుగర్ నియంత్రణ లేనివారికి రక్తం చిక్కబడుతుంది. రక్తనాళాల్లో షుగర్ పేరుకుపోయి కాలు చివరి భాగాల్లోకి బ్లడ్ సర్యు్కలేషన్ తగ్గిపోతుంది. తద్వారా పాదం స్పర్శ కోల్పోతుంది. కొంత కాలానికి ఫుట్అల్సర్స్గా మారుతాయి. చివరికి అదే గ్యాంగ్రీన్కి కూడా దారి తీస్తుంది. ఇతర డయాబెటిక్ సమస్యల కంటే ఎక్కువగా ఆస్పత్రిలో చేరడానికి ఈ డయాబెటిస్ ఫుట్అల్సర్స్ కారణమవుతున్నాయి. మనదేశంలోని మధుమేహ బాధితుల్లో సుమారు 10 శాతం మందికి డయాబెటిక్ ఫుట్అల్సర్ (డీఎఫ్యు) వచ్చే అవకాశం ఉంది. అంటే దేశంలో ఏటా 70 లక్షల మంది ప్రజలు ఈ ఫుట్అల్సర్స్ బారిన పడుతున్నారు. ప్రాణాంతకం కూడా.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఫుట్అల్సర్స్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. అల్సర్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరించి గ్యాంగ్రీన్గా మారితే మెజారిటీ కేసుల్లో ఆయా భాగాలను తొలగించడం (ఆంపుటేషన్) తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఫుట్అల్సర్స్ వల్ల చాలామందిలో కాలు తీసేయాల్సి వస్తోంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ కారణంగా 3 ఏళ్లలోనే రెండో కాలు కూడా తొలగించాల్సిన ముప్పు 30 నుంచి 40 శాతానికి పెరుగుతోంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. డయాబెటిక్ ఫుట్అల్సర్ల నుంచి వచ్చే సమస్యల ఫలితంగా మన దేశంలో ఏటా లక్ష ఆంప్యుటేషన్స్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. ఆంప్యుటేషన్స్తో పాటు ప్రాణాలు తీస్తున్న డయాబెటిక్ ఫుట్అల్సర్స్కు అప్రమత్తతే శ్రీరామరక్ష. డయాబెటిస్ ఉన్నవారు తమ పాదాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. సరైన పాదరక్షలు ధరించడం, తరచూ పాదాలను పరీక్షించుకోవడం, ఏదైనా గాయం అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల అల్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కూడా కీలకం. ఆరోగ్య సంరక్షణ నిపుణులు డయాబెటిస్ బాధితుల్లో పాదాల సంరక్షణకు సంబంధించి అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. -
ఆయన పుట్టినరోజు నాడు.. వరల్డ్ డయాబెటిస్ డే
మధుమేహం (డయాబెటిస్) బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తోంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే.మధుమేహ సమస్య గ్లోబల్ సమస్య. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ఆవిష్కర్తలలో ఒకరైన సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ (వరల్డ్ డయాబెటిస్ డే)గా ప్రకటించింది. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గి పోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవన సరళిలో వచ్చిన అసంగత మార్పులు... మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రులలో ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7% మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం.మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాలినడక తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలామందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగి పోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిక మయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బీఎంఐ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్థుల శరీరం బరువు 7 శాతం తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమి షాలైనా నడక, అవకాశం ఉన్నవారు ఈదటం, పరుగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి నాలుగు అడుగులు వేయడం మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రజారోగ్యం పైన, ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపే మధుమేహం నిరోధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా వ్యహరించాలి.– డాక్టర్ టి. సేవకుమార్ ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ వ్యవస్థాపకులు(నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే) -
ప్రొటీన్ పవర్‌హౌస్ బెండకాయ జిగురుతో మహిమలెన్నో!
బెండకాయతో బెనిఫిట్స్ జుట్టు, చర్మం, మోకాళ్ల నొప్పులు ఇంకా ఎన్నో బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రావు అనే సామెతవిన్నవారికి, దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు, జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని రక్షించడంలో కాపాడటంలో ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందాం ఈ కథనంలో.బెండకాయ, భేండీ, లేడీ ఫింగర్ పేరు ఏదైనా లాభాలు మాత్రం మెండు. బెండకాయ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బెండకాయ తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పిల్లలకి బెండకాయ ఎక్కువగా పెడుతూ ఉంటారు. బెండకాయలో పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయతో బోలెడన్ని రెసిపీలు చేసుకోవడం మాత్రమే కాదు, అలాగే మోకాళ్ల నొప్పులుతో బాధపడేవారు, వీర్యకణాలు తక్కువగా ఉండేవారు బెండకాయలను తీసుకోవాలని చెబుతారు. కెరటిన్ కూడా ఎక్కువే. అందుకే ఆరోగ్యకరమైన జుట్టుకు చర్మం సంరక్షణలో కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. బెండకాయ బాగా పనిచేస్తుంది. ప్రకృతి సహజంగా లభించే కెరటిన్‌తో జుట్టు సిల్కీగా, హెల్దీగా ఎదుగుతుంది.బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ కే2సీ, ఏ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.పురాతన ఈజిప్టులోని స్త్రీలు బ్యూటీకోసం వాడేవారట. ఉపయోగించారు. బెండకాయలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌తో చర్మం మెరిసిపోతుంది. యాంటీ ఏజింగ్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. వీటిల్లోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , రీ-హైడ్రేటింగ్ లక్షణాల మొఖం మీద మొటిమలను విజయవంతంగా నిర్మూలిస్తుంది. బెండకాయ నీరుబెండకాయను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే, సుగర్వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సల్యూబుల్ ఫైబర్, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీర్యపుష్టికి పనిచేస్తుంది.బెండకాయలో ఉండే అధిక ఫైబర్ శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి, మలబద్దకానికి మంచి మందులాగా కూడా పనిచేస్తుంది. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్ధం గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలకుచెక్ పెబుతుంది. ఓక్రా పౌడర్‌తో ప్యాక్మెరిసే చర్మం కావాలంటే ఫేస్ ప్యాక్‌ను వాడవచ్చు. దీనికి కావాల్సిందల్లా రసాయన ఎరువులు వాడకుండా, సేంద్రీయంగా పండించిన బెండకాయలు. వీడిని ఎండబెట్ట పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.బెండకాయలు ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. ఇందులో కొద్దిగా యోగర్ట్, ఆలివ్ నూనె కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ముఖానికి రాసుకొని ,15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ను ఒక వారం పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.ప్రొటీన్ల పవర్‌హౌస్ లేడీఫింగర్‌తో చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దురదలు, జుట్టు పొడిబారడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్రింజీగా ఉండే గిరిజాల జుట్టును మృదువుగా మారుస్తుంది. ఏం చేయాలంటే! కట్ చేసిన బెండకాయలను కాసేపు నీళ్లలో ఉడికించాలి. దీన్ని చల్లారేదాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ వాటర్‌ను ఒక గాజు సీసాలోకి వడ బోసుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీళ్లను జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి ఎలాంటి జిట్ట జుట్టునైనా మృదువుగా మార్చేస్తుంది. -
కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!
ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్ విడుదల కావడం.. రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. అన్నం తింటే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’లోనూ ఆర్టికల్ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా ‘షుగర్ ఫ్రీ రైస్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో భారీగా వ్యాపారం తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. షుగర్ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్లైన్లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్ కంట్రోల్ వైట్ రైస్, డయాబెటిక్ కేర్ రైస్, షుగర్ కంట్రోల్ రైస్, డెక్కన్ ముద్ర లో జీఐ, గ్రెయిన్ స్పేస్ తెలంగాణ సోనా రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్’తదితర పేర్లతో ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి? దానితో సమస్యేమిటి? మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదని పేర్కొంది. ఓ మోతాదు మేరకు తినొచ్చుసాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ బాధితులకు తెలంగాణ సోనాతో మేలు తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగవు. షుగర్ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఆర్.జగదీశ్వర్, రిటైర్డ్ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. – డాక్టర్ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, రైస్బ్రీడర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం– సాక్షి, హైదరాబాద్Suh -
సమోసా, చిప్స్ తింటున్నారా!
సమోసా.. పకోడీ.. ఫ్రైడ్ చికెన్.. చిప్స్.. బిస్కెట్లు.. కేక్స్.. రెడీమేడ్ మీల్స్.. మయోనైజ్, గ్రిల్డ్ చికెన్.. డ్రై నట్స్.. వేయించిన వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు డయాబెటిస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలో వెల్లడైంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన తాజా క్లినికల్ ట్రయల్ రన్‌లోనూ మధుమేహం ముప్పునకు పైన పేర్కొన్న ఆహార పదార్థాలే కారణమని స్పష్టమైంది. – సాక్షి, అమరావతిఏజీఈ అధికంగా ఉండటం వల్లే..సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, నూడిల్స్, సూప్‌లు, ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలను పిల్లల నుంచి పెద్దలు ఇష్టంగా తింటున్నారు. ఈ తరహా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) దేశంలో మధుమేహం ముప్పును రోజురోజుకూ పెంచుతోంది. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానికి ఉండటానికి హానికరమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు రక్తంలో చక్కెరను పెంచుతున్నాయని తేలింది.అధునాతన గ్లైకేషన్ ముగింపు ఉత్పత్తులు (ఏజీఈ) హానికరమైన సమ్మేళనాలు. గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లు లేదా కొవ్వులు చక్కెరలతో సంకర్షణ చెందుతున్నప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు, అందులో ఏజీఈలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం ఊబకాయాన్ని పెంచుతోందని.. ఇది మధుమేహానికి ప్రధాన కారణమవుతోందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురించబడింది.ఆయుర్దాయంపై ప్రభావం టైప్–2 డయాబెటిస్ మనిషి ఆయుర్దాయంపైనా ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ వర్గానికి చెందిన 19 దేశాల్లో 15 లక్షల మంది జనాభా ఆరోగ్య రికార్డులపై అధ్యయనానికి సంబంధించిన అంశాలను ఇటీవల ది లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీలో ప్రచురించారు. 30 ఏళ్లలో టైప్–2 బారినపడిన వ్యక్తి సగటు ఆయుర్దాయం 14 ఏళ్లు క్షీణిస్తుందని, 40 ఏళ్ల వయసులో సమస్య తలెత్తితే పదేళ్లు, 50 ఏళ్లకు కనిష్టంగా ఆరేళ్ల చొప్పున ఆయుర్దాయం తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.38 మందిపై.. 12 వారాల పరీక్ష పరిశోధన నిమిత్తం ఎంపిక చేసిన 38 మందిపై 12 వారాలపాటు పరీక్షలు నిర్వహించారు. మధుమేహం లేనివారిని రెండు సమూహాలుగా విభజించారు. 12 వారాల పాటు ఒక సమూహానికి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్డ్స్ (ఏజీఈ) తక్కువగా ఉండే ఆహారం, మరో సమూహానికి ఏజీఈ అధికంగా ఉండే ఆహారాన్ని అందించారు. 12 వారాల అనంతరం పరిశీలిస్తే అధిక ఏజీఈ ఆహారం తిన్న సమూహంతో పోలిస్తే తక్కువ ఏజీఈ ఆహారం తిన్న సమూహంలోని వ్యక్తుల్లో టైప్–2 మధుమేహం ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. వీరిలో ఇన్సులిన్ నిరోధకతæ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. కేకులు, కుక్కీలు వంటి కాల్చిన ఆహారాల్లో ఏజీఈలు ఎక్కువగా ఉంటాయి.చిప్స్, సమోసాలు, పకోడీలు, వేయించిన చికెన్ వంటి వాటిలో పెద్ద పరిమాణంలో ఏజీఈ ఉంటోంది. అలాగే రెడీమేడ్ ఆహార పదార్థాల రూపంలో వచ్చే వనస్పతి, మయోనైస్ కూడా చక్కెరను పెంచుతాయి. కాల్చిన మాంసాలు, కాల్చిన గింజలలో ఏజీఈలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ స్థానంలో తక్కువ ఏజీఈ డైట్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఏమిటీ అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ఫ్రై, రోస్ట్ (బాగా వేడి) చేసిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) ఆహారాన్ని తిన్నప్పుడు కార్పొహైడ్రేట్స్ శరీరంలో నేరుగా ప్రొటీన్స్, కొవ్వులతో కలిసి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్(ఏజీఈ)లుగా రూపాంతరం చెందుతాయి. వీటివల్ల శరీరంలో హానికరమైన మాలిక్యుల్స్ తయారవుతాయి. ఇవి ఎక్కువ కావడంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది. శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్‌ను అందించడంలో ఇన్సులిన్ తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఏజీఈ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో తిన్న ఆహారంలోని చక్కెర పదార్థాలు కణాలకు అందకుండా రక్తంలోని ఉండిపోయి టైప్–2 మధుమేహానికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏజీఈ అధికంగా ఉండే బేకరీ, హోటల్స్‌లో తయారు చేసే కేక్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, ఇంట్లో డీప్ ఫ్రై, ఫ్రై ఆహార పదార్థాలు తినడం తగ్గించాలని పరిశోధకులు స్పష్టం చేశారు.మిలమిలలాడే ఆహార పదార్థాలను వినియోగించొద్దు పూరీ్వకులు పాలిష్ చేయని దంపుడు బియ్యం, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, ఉప్పు ఇలా ప్రతీది తెల్లగా మిలమిలలాడేలా పాలిష్ చేస్తున్నారు. ఈ పాలిష్ ఆహార పదార్థాలను విడనాడాలి. – పి.శ్రీనివాసులు, హెచ్‌వోడీ ఎండోక్రినాలజీ విభాగం, కర్నూలు మెడికల్ కాలేజీ జీవన శైలిలో మార్పు రావాలి టైప్–2 మధుమేహం అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా వస్తుంది. దీనికి తోడు హానికరమైన ఆహారపు అలవాట్లు తోడై పిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయతి్నంచాలి. మధుమేహం అని తేలాక అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ వెంకట సందీప్, ఎండోక్రినాలజిస్ట్, గుంటూరు -
కత్రినా కైఫ్ చేతికి నల్లటి ప్యాచ్ .. బాలీవుడ్ బ్యూటీకి ఏమైంది?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి ఏమైంది? ఆమె చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ ఏంటి? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చీరకట్టులో ఇటీవల ఎయిర్ పోర్టులో కనిపించిన కత్రినాని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. వారి ఉత్సాహం చూసిన ఆమె కూడా ఫొటోలకు తనదైన శైలిలో పోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కుడి చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.ఆమె చేతికున్న ప్యాచ్‌పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్రినా ఆరోగ్యానికి ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి ఉపయోగించే డయాబెటిస్ ప్యాచ్ అయి ఉంటుందని తెలుస్తోంది. నిరంతర గ్లూకోజ్ మానిటర్లు అని కూడా పిలిచే ఇలాంటి ప్యాచ్‌లను మధుమేహం (షుగర్) ఉండే వ్యక్తులు పెట్టుకుంటారట. ఇది పెట్టడం వల్ల చేతి వేలును సూదితో గుచ్చి రక్త పరీక్ష చేసుకునే అవసరం ఉండదనీ, రోజంతా గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయడంలో ఈ ప్యాచ్ ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ఆ బ్లాక్ ప్యాచ్ ఆల్ట్రాహుమాన్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ కావచ్చు.. ఇది బ్లడ్ షుగర్, హార్ట్ బీట్ రేటు, నిద్ర విధానాలను కూడా పర్యవేక్షిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి.. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి ప్యాచ్ ఎందుకు? అనేది ఆమె చెబితేనే తెలుస్తుంది. -
Diabetes: ఎలాంటి డైట్‌తో అదుపులో ఉంచొచ్చు
నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.– శిరీష, మెదక్గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి. బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు. మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధంచాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
మధుమేహం ముప్పు : ‘కళ్లు’ చెబుతాయి!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్‌ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్‌కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశదృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టిదృష్టిలో హెచ్చుతగ్గులు నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టుచూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు. నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్‌స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి. -
అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?
సైలెంట్ కిల్లర్లాంటి డయాబెటీస్ వ్యాధులకు సంబంధించి టైప్ 1, టైప్ 2 గురించి విన్నాం. కానీ ఇందులో మరొకటి కూడా ఉంది. అదే డయాబెటిస్ టైప్ 1.5. ఈ వ్యాధితోనే అమెరికన్ గాయకుడు బాధపడుతున్నాడు. ఒకరకంగా అతని కారణంగానే ఈ డయాబెటిస్ టైప్ 1.5 వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ వ్యాధి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..అమెరికన్ గాయకుడు నర్తకి లాన్స్ బాస్ తొలుత టైప్ 2తో బాధపడుతున్నట్లుగా వైద్యులు తప్పుగా గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించిన చికిత్సే కొన్నేళ్లు తీసుకున్నాడు. చివరికీ అతడు డయాబెటస్ టైప్ 1.5 అనే మరో రకం మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంతకీ ఏంటీ డయాబెస్ టైప్ 1.5 అంటే..టైప్ 1.5 డయాబెటిస్ అంటే..దీన్ని లాడా లేదా లాటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ పోలిన లక్షణాలనే చూపిస్తుంది. ఇద యుక్త వయసులో వచ్చే వ్యాధిగా పేర్కొన్నారు. ఇది అచ్చం టైప్ 2 వలే ఉండి క్రమంగా లాడా మాదిరి స్వయం ప్రతి రక్షక పరిస్థితిని కలుగజేస్తుంది. ఇది ఆహారం, జీవనశైలి మార్పులతో సరి అయ్యేది కాదు. దీని ప్రకారం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాల కష్టంగా ఉంటుంది. ఎప్పుడూ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేని స్థితి అని చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు మధుమేహం ఉన్నవారిలో దాదాపు 10% మందికి లాడా ఉందని అన్నారు. ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్న రోగి గ్లూకోజ్ మానిటర్ని ధరించాల్సి ఉంటుంది. ఇది ప్రతి కొన్ని నిమిషాలకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రీడింగ్‌లను నమోదు చేస్తుంటుంది. ఒకవేళ అందులో మార్పులు జరిగితే హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. లక్షణాలు..తరచుగా దాహంఅధిక మూత్రవిసర్జనవివరించలేని బరువు తగ్గడంఅస్పష్టమైన దృష్టి, నరాలు జలదరింపుచికిత్స చేయకుండా వదిలేస్తే, టైప్ 1.5 డయాబెటిస్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారి తీస్తుంది, ఇది ఇన్సులిన్ లేకపోవడం, కొవ్వును కరిగించడం వంటి వాటికి దారితీసి చివరికి గ్లూకోజ్‌ను ఇంధనంగా ఉపయోగించలేకపోతుంది. తద్వారా శరీరంలో విషపూరితమైన కీటోన్లను ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది.ఎందువల్ల వస్తుందంటే..ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా ప్రతిరోధకాల నుంచి ప్యాంక్రియాస్‌కు నష్టం జరగడం వల్ల టైప్ 1.5 వస్తుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో, స్వయం ప్రతిరక్షక పరిస్థితుల కుటుంబ చరిత్ర వంటి జన్యుపరమైన అంశాలు కూడా ఉంటాయి. టైప్ 1.5 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు టైప్ 1 మాదిరిగా శరీరం ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేస్తుంది. ఈ టైప్ 1.5 మధుమేహం ఉన్న వ్యక్తి ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే ఇన్సులిన్ నిరోధకత కూడా ఉండే అవకాశం ఉటుందని అన్నారు వైద్యులు.చికిత్సకు శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల టైప్ 1.5 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే టైప్ 2 డయాబెటిస్ మాదిరిగా నోటి ద్వారా తీసుకునే మందులతో నయం చేయొచ్చు. అలా కాకుండా చాలా ఆలస్యంగా గుర్తించితే మాత్రం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ వ్యాధి చికిత్సలో చాలా వరకు ఇన్సులిన్ ఇవ్వడమే జరుగుతుంది. అదికూడా రోజువారీ మోతాదు మారుతు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: శారీరక మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకోవాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్‌కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్‌కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు. -
నోరూరించే నేరేడు పళ్లు: ఈ ప్రయోజనాలు తెలుసా?
మార్కెట్లో ఎక్కడ చూసినా అల్ల నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. నల్లగా నిగ నిగ లాడుతూ నోరు ఊరిస్తున్నాయి. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినడం అలవాటు చేసు కోవాలని పెద్దలు చెబుతారు. అసలు అల్ల నేరేడు పళ్లు తింటే లభించే ఔషధ ప్రయోజనాల గురించి తెలుసా? తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు.ఇండియన్ బ్లాక్‌బెర్రీ, జామూన్, లేదా జావా ప్లం ఈ పేరుతో పిలిచినా.. రుచి మాత్రం వగరు, తీపి కలయికతో గమ్మత్తుగా ఉంటుంది. మార్కెట్‌నుంచి తీసుకొచ్చిన కాయలను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత తినాలి. అల్ల నేరేడు పోషకాల గని. ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు. అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.అల్ల నేరేడు- లాభాలు అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. డయాబెటిక్ రోగులకు నేరేడు పళ్లు చాలా మేలు చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దాహం వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ పండులో జాంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నిరోధించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.వీటిల్లోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఫలితంగా చర్మం మెరుస్తుంది. అంతేకాదు చాలాకాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు విస్తర్జిస్తుంది. పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉందని పెద్దలు చెబుతారు. పిండిపదార్థం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు. ఇందులోని అంతేకాదు ఫైబర్ కంటెంట్ సరైన జీర్ణక్రియకు దోహదపడి, అనవసరమైన కొవ్వు పెరగకుండా అడ్డుపడుతుంది. -
బార్లీ నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? షుగర్ అదుపులో ఉంటుందా?
మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిల్లో అద్భుతమైన తృణధాన్యం బార్లీని ఒకటిగా చెప్పుకోవచ్చు. బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.బీ విటమిన్, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ, ఆల్కహాలిక్ పానీయాల్లో కూడా వాడతారు. ముఖ్యంగా బీర్మాల్ట్ మూలంగా కూడా పనిచేస్తుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడితే, వారికి ఎదుగుదలకి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. బరువు నియంత్రణలోబార్లీ వాటర్‌లో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు బార్లీ నీళ్లు తాగితే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.షుగర్ వ్యాధిగ్రస్తులకుబార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిల నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది. అంతేకాదు బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా. -
బియ్యం నానబెట్టి వండుకుంటే షుగర్ పేషెంట్లకు మంచిదేనా?
భారతీయుల ఆహారంలో ప్రధానమైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. ఇండియాలో ఎక్కువగా పండించేది, భారత ప్రజలు ఎక్కువగా తినేది బియ్యమే. ప్రతి సంవత్సరం సగటున 125.038 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారతదేశం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైస్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది ప్రచారంలో ఉంది. అయితే బియ్యాన్ని ఉడికించే ముందునీటిలో నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో బియ్యాన్ని నానబెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.అనేక అధ్యయనాల ప్రకారం ఏదైనా గింజల్ని నానబెట్టినపుడు వాటిల్లోని పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బియ్యం నానబెట్టడం దాని గ్లైసెమిక్ సూచిక (GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు సాధారణంగా అన్నం తినకూడదని సలహా ఇస్తారు. అయితే బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే జీఐని తగ్గిస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ చేసి జీఐని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టడం వల్ల సెరోటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.బియ్యాన్ని నానబెట్టడం వల్ల అదనపు పిండిపదార్థాలు తొలగిపోతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపయోగపడుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుందిబియ్యం నానబెట్టడం వల్ల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యంలో ఉండే ఫైటోకెమికల్స్, టానిన్లను విచ్ఛిన్నం చేయవచ్చు. అలాగే విటమిన్లు. ఖనిజాల జీవ లభ్యత పెరుగుతుంది.ఇది అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది.ఉడికించే ముందు బియ్యాన్ని నానబెట్టిడం ద్వారా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరగా మార్చడానికి సహాయ పడుతుంది. శరీరంలో ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.వంట సమయాన్ని తగ్గిస్తుందిఅంతేకాదు బియ్యాన్ని నీటితో నానబెట్టడం వల్ల వండే సమయం కూడా తగ్గుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజలు మెత్తబడి సులభంగా ఉడుకుతాయి. దీంతో వంట ఖర్చు కూడా ఆదా అవుతుంది.నోట్: ఇది అవగాహనా సమాచారం మాత్రమే. షుగర్ వ్యాధి జీవనశైలితోపాటు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
డయాబెటిక్ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్‌కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్‌లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్‌లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్‌తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్‌గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు. -
షుగర్ కంట్రోల్ కావడం లేదా? అద్భుతమైన ప్రొటీన్-రిచ్ బ్రేక్‌ఫాస్ట్
శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి అల్పాహారం. నిద్ర లేచిన తరువాత శరీరానికి చురుకుదనానికి, గ్లూకోజ్‌ను అందిస్తుంది ఇది. ఆధునిక కాలంలో ప్రొటీన్-రిచ్ఆహారంపై శ్రద్ధపెరిగింది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఉదయమే ఏం తినాలి అనేది పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఐకానిక్ సౌత్ ఇండియన్ టిఫిన్ గురించి తెలుసుకుందామా.ముఖ్యంగా దోసెలంటే ఇష్టముండే వారికి, ప్రొటీన్లు, ఫౌబర్ పుష్కలంగా లభించే అడై దోసె. ఇది కూడా దోసె ఫామిలీకి చెందిందే. సాధారణ దోస కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. దీంతో ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. అదే అడై దోసె. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సింపుల్ రెసిపీతమిళనాడులో ఎక్కువగా పాపులర్ అయిన అడై దోసె. ఇది రుచికర మైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. పైగా పులియబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.పప్పులు, బియ్యం కలయికతో, కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చుకోవాలని చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.తయారీ విధానంబియ్యం , పప్పు (మినప పప్పు, ఉరద్ పప్పు, శనగ పప్పు) శుభ్రంగా కడిగిన తరువాత, 4-6 గంటలు నీటిలో నానబెట్టాలి.తరువాత వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, సోపు గింజలు, ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, తరిగిన కొత్తిమీర , ఉల్లిపాయ ముక్కలను కలుపుకోవాలి. పిండి మరీ జారుగా, మరీ గట్టిగా గాకుండా కలుపుకోవాలి.పెనంపై రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి చక్కగాదోసెలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే అడైదోసె రడీ. దీనికి జతగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ లేదా సాంబార్తోగానీ వేడి వేడిగా అడై దోసను ఆస్వాదించడమే. -
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. -
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మధుమేహం, లేదా షుగర్వ్యాధి వచ్చిందంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతతాయి. ఒత్తిడి లేని జీవితం, జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నిబంధనలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ అదుపులో ఉండేలా ఒక చిన్న చిట్కాను తెలుసుకుందాం.శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.మధుమేహాన్ని వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే మధుమేహం లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఏడోఅతిపెద్ద కిల్లర్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.శరీరంలో పాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వ చేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ దీని పని. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడుతున్నారు.కారణాలుసరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, ఇంకా ముందు తరం నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు. మెంతుల వాటర్ ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.లేదంటే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. నానబెట్టిన మెంతి వాటర్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుందిమెంతి సౌందర్య పోషణలోనూ బాగా ఉపయోగడుతుంది. మెంతి గింజలు పీరియడ్స్ సమస్యలకు కూడా మంచి చిట్కా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి కూరను ఆకుకూరగా వాడుకోవచ్చు. నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. సరియైన సమాచారం, చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం -
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
మండే ఎండలు X మధుమేహం!
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు. ఎన్నో సమస్యలకు చాన్స్.. ∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు. ∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్‌కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. ∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి. -
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. -
అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?
లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే డైట్లో మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్ న్యాయవాది మాత్రం డాక్టర్ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..? నిజానికి అరవింద్ కేజ్రీవాల్ టైప్2 డయాబెటిస్ పేషెంట్. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్లు తినోచ్చా అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సీ, ఫైబర్, కాపర్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్మన్ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు. అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే.. మామిడి పండును డయాబెటిక్ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు.. ముందుగా డైట్‌ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్ ఫైబర్ అందేలా ఫుడ్స్‌ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్ పేషెంట్లు తిన్నా ఏం కాదు. (చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
మసాలాతో షుగర్ అదుపు, ఎలాగో తెలుసా?
షుగర్, బీపీ వంటి జీవనశైలికి సంబంధించిన రుగ్మతలు వస్తే జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. ఆహారంలో ఉప్పు, చక్కెరలు తగ్గించి తీసుకోవడంతోబాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటితోపాటు మన వంటింట్లో దొరికే కొన్ని రకాల మసాలా దినుసులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. అవేమిటో తెలుసుకుందాం. అధికంగా దాహం వేయడం, ఆకలి, తరచు మూత్రవిసర్జన చేయవలసి రావడం, బరువు తగ్గడం, చూపు మసకబారడం, చేతులు, కాళ్ళు తిమ్మిరిగా ఉండడం, గాయాలైనప్పుడు త్వరగా మానకపోవడం వంటి కొన్ని లక్షణాలను బట్టి షుగర్‌ను గుర్తించవచ్చు. ఇది అదుపులో ఉండకపోతే కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, కంటికి సంబంధించిన సమస్యలొస్తాయి. అయితే, బ్లడ్ షుగర్‌ని నియంత్రణలో ఉంచే కొన్ని మసాలా దినుసులున్నాయి. వాటిని సక్రమంగా వాడటం వల్ల ఎటువంటి ఇతర దుష్ఫలితాలూ లేకుండా షుగర్‌ను అదుపులో ఉంచవచ్చు. దాల్చిన చెక్క ఆహార పదార్థాలకు సువాసనను, రుచిని ఇచ్చే దాల్చిన చెక్క జీవక్రియల వేగాన్ని పెంచడానికి దోహద పడుతుంది. కొన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడతారు. దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీనిని కషాయంలా చేసుకుని తాగడం మంచిది. మిరియాలు మిరియాలు, వాటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తం లో ఇన్సులిన్ సీరమ్‌ని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అదుపు చేయడంలో సహకరిస్తాయి. వీటిని ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కుదరని పక్షంలో మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు. మెంతులు మధుమేహాన్ని అదుపు చేసి, బరువు తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం జుట్టుకి కూడా మంచిది. ఉదయాన్నే పరగడపున మెంతులు నానబెట్టిన నీటిని తాగితే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇందులోని పీచుపదార్థం, కర్కుమిన్లు రక్తంలో చక్కెరస్థాయులను తగ్గిస్తాయి. యాలకులు పరమాన్నానికి, ఇతర రకాల స్వీట్లకు యాలకుల పొడిని జత చేస్తే వచ్చే రుచే వేరు. పచ్చి యాలకులని మనం బిర్యానీ, టీలో కలిపి తాగొచ్చు. ఇందులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకులని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. ఇది లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జీలకర్ర డయాబెటిస్ లక్షణాలను, ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది. యాంటీడయాబెటిక్ ఔషధాల్లో కూడా దీనిని వినియోగిస్తారు. ఇన్సులిన్‌కు మీ శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తే యూరియా స్థాయిని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి నార్మల్ రేంజ్లో ఉండేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల ఆహారం లో జీలకర్రను విరివిగా ఉపయోగించాలి. రోజూ ఒక స్పూను జీలకర్రను గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగడం మధుమేహులకు మంచి మందులా పని చేస్తుంది. లవంగాలు షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలను వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు లవంగం నూనెను పై పూతగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్న వారు రోజు విడిచి రోజు లవంగాలతో చేసిన టీ తాగడం సత్ఫలితాలనిస్తుంది. పైన చెప్పుకున్న మసాలా దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకండా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్‌లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్‌వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్‌లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్‌లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా?
పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా . డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్లో షేర్ చేసిన వివరాలు ►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. ► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. ► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. ► భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది. ► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ► కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. -
శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్ సెంటర్ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది. దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శాకాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు. మాంసాహారంలో అధికంగా ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. -
టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
అధిక సంఖ్యలో ప్రజలు టైప్ 2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లుకు ఓ నిర్ధిష్ట ఏజ్ వచ్చేటప్పటికీ మధుమేహం అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది వైద్యులకు కూడా తెలియలేదు. ఎందువల్ల ఇన్సులిన్ వ్యవస్థ పనిచేయడం అగిపోతుంది. తగిన స్థాయిలో ఎందుకు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోతుందనేది వైద్యులకు ఇప్పటికీ అర్థం కానీ ఓ మిస్టరీ. పైగా ఇది దీర్థకాలిక వ్యాధి, దీనికి నివారణ ఉండదు, కేవలం నియంత్రణ మాత్రమే. అలాంటి ఈ టైప్ 2 డయాబెటిస్ ఎందువల్ల వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. అంతేగాదు ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్కెపెట్టేందుకు మార్గం సుగమం చేసిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఇది ఎందువల్ల వస్తుందంటే..? సాధారణంగా టైప్ 2 మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం ఆపివేయడంతో ప్రారంభమై, చివరికి ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది శాస్త్రవేత్తలకు అర్థం కానీ చిక్కు ప్రశ్న. అందుకోసం మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషులపై అధ్యయనాలు కూడా నిర్వహించారు కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇలా ఇన్నులిన్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక ఎంజైమ్‌ని గుర్తించారు. దీన్ని స్కాన్(SCAN) అని పిలుస్తారు. ఈ ఎంజైమ్ ఇన్సులిన్ చర్యలకు గ్రాహకంగా పనిచేసే నైట్రిక్ ఆక్సైడ్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ కీలకమైన రసాయనం. ఇది ఇన్సులిన్‌తో సహా హార్మోన్లను నియంత్రిస్తుంది. కాగా, శాస్త్రవేత్తలు మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషుల్లో ఈ స్కాన్(SCAN) కార్యచరణను గుర్తించారు. అలాగే ఈ ఎంజైమ్లేని ఎలుకల్లో మధుమేహం రాకుండా ఎలా సేఫ్‌గా ఉన్నాయో కనుగొన్నారు. ఈ ఎంజైమ్ ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించొచ్చని తెలిపారు. ఇక ఈ ఎంజైమ్‌ని నిరోధించడంపై పలు పరిశోధనలు చేయాల్సి ఉంది. అంతేగాదు ఈ నైట్రిక్ ఆక్సైడ్‌ని జోడించి ఉండే ఎంజైమ్‌లు వివిధ రకాల వ్యాధులకు దారితీస్తాయని శాస్త్రవేత్త జోనాథన్ తెలిపారు. అధిక స్థాయి నైటిక్ ఆక్సైడ్ కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అయితే ఇది రియాక్టివ్ మాలిక్యూల్ కావడం వల్ల నేరుగా దీన్నే లక్ష్యం చేసుకుని తొలగించడం కష్టమని చెప్పారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. దీన్నే షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా అంటాం. ఇది ఒక్కసారి అటాక్ అయ్యిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇకపై షుగర్ పేషెంట్స్ ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది (10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది.వయసుతో సంబంధం లేకుండా ఏటా భారత్‌లో డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్యకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే డైట్ పరంగానూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేలా అనేక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజూ తప్పకుండా మందులు వాడాల్సిందే. ఈ క్రమంలో డయాబెటిస్ ట్రీట్మెంట్కు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు హైడ్రోజెల్ ఆధారిత ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మొదట ఎలుకలపై ప్రయోగించారు. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్‌ను ఇంజెక్ట్ చేసి పరిశీలించగా వాటి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌తో పాటు బరువు కూడా కంట్రోల్లో ఉన్నట్లు తేలింది. ఎలుకల్లో 42 రోజుల దినచర్య అంటే మనుషుల్లో ఇది నాలుగు నెలలకు సమానమని సైంటిస్టుల బృందం తెలిపింది. తర్వాతి పరీక్షలు పందులపై ప్రయోగిస్తారు, ఎందుకంటే ఇవి మనుషుల్లాంటి చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అనంతరం 18 నెలల నుంచి రెండేళ్ల లోపు మనుషులపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని సైంటిస్టులు తెలిపారు. -
మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!
మధుమేహం అని భయపడొద్దు. చక్కటి చిట్కాలతో మదుమేహన్ని అదుపులో పెట్టుకోవడమే గాదు రాకుండా చూసుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవి, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా డయాబెటిస్‌కి చెక్పెట్టోచ్చు. ముఖ్యంగా మనం వంటలో నిత్యం ఉపయోగించే సుగంధద్రవ్యాలు, ఫైబర్‌తో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే.. మదుమేహాన్ని నియంత్రించే సుగంధ ద్రవ్యాలు.. పసుపు భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించేది పసుపు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది డయాబెటిక్‌కి సంబంధించిన అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క దీన్ని మనం కొన్ని రకాల రెసిపీల్లో ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఇది టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. వెల్లులి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలస్ట్రాయల్ స్థాయిలను తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధం. లవంగాలు ఇవి క్రిమి నాశక, క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారించడం తోపాటు గాయాలను త్వరితగతిన నయం చేస్తాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఫైబర్‌తో కూడిన ఆహారపదార్థాలంటే.. బీన్స్, బఠానీలు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు బీన్స్, బఠానీళ్లలో సుమారు 15 గ్రాముల ప్రోటీన్, 15గ్రాముల ఫైబర్ ఉంటుంది. నట్స్, గుమ్మడి లేదా పుచ్చకాయ విత్తనాలు వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సలాడ్లు, వోట్మీల్, పెరుగు వంటి వాటిలో కూడా చేర్చుకుని తినొచ్చు. వీటిలో సుమారు 5 నుంచి 10 గ్రాములు ప్రోటీన్, మూడు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. సోయా లేదా గోధుమ ఆధారిత ఉత్పత్తులు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. వీటిలో 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్, రెండు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. క్వినోవా, వోట్స్, బార్లీ మరియు ఇతర తృణధాన్యాలు ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ల తోపాటు వివిధ ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు వండిన క్వినోవా, ఓట్స్, బార్లీ లేదా ఇతర తృణధాన్యాల్లో సుమారు 6 నుంచి 10 గ్రాముల ప్రోటీన్, 4 నుంచి 8 గ్రాముల ఫైబర్లు ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్లు, ఫైబర్లతో కూడిన పదార్థాలు, సుగంధ ద్రవ్యాలను డయాబెటిస్ రోగుల తమ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందడమే గాక జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ సమృద్ధిగా పెరిగి ఎటువంటి రుగ్మతలు దరిదాపుల్లోకి రావు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మదుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
డయాబెటిస్‌కి నిలయంగా భారత్?!
దీర్థకాలిక వ్యాధి అయిన డయాబెటిస్(మధుమేహం.. షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అది కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారినపడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నట్లుగానే వ్యాధుల పరంగానూ తగ్గేదేలే! అన్నట్లు తొందరగా ఈ వ్యాధి బారినపడిపోతున్నారు. ఎందువల్ల?.. ఇంతలా అన్ని వనరులు అందుబాటులో ఉండి, ముఖ్యంగా చదువుకున్నవాళ్లే ఈ అనారోగ్యం బారినపడటానకి కారణం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోలేమా? లేదా రాకుండా చూసుకోలేమా తదితరాల గురించే ఈ కథనం!. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) నిర్వహించిన అధ్యయనంలో భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది(10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దేశ జనాభాలో సుమారు 11.4%. అంతేగాదు గతేడాది 2019 నుంచి 2021 మధ్యలోనే సుమారు 31 మిలియన్ల(మూడు కోట్ల) మధుమేహ కేసులు నమోదయ్యాయి. కానీ, ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 మిలియన్లదాక(ఎనిమిది కోట్ల) కేసులు నమోదు అయినట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొంది. ఆ సంఖ్య కాస్తా 2045 నాటికి 135(పదమూడున్నర కోట్లకు) మిలియన్లకుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డయాబెటిస్ కేసుల పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారత్ డయాబెటిస్‌కి నిలయంగా మారుతుందా అనేంతగా కేసులు వేగవంతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లోనే ఎందుకు అధికం.. ప్రపంచ జనాభాలో భారతీయులు మధుమేహ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువ. పలు అధ్యయనాలు ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. వారి ప్రత్యేకమైన శరరీ కూర్పు కూడా ఇందుకు కారణమని పరిశోధనలు తెలిపాయి. పొత్తికడుపు పెద్దగా ఉండి కొవ్వు పేరుకుపోవడం, తక్కువ కండర ద్రవ్యరాశి తదితరాలు మధుమేహ సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నట్ల పేర్కొన్నాయి అధ్యయనాలు. దీనికి తోడు భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి వంటివి శారీరక శ్రమ స్థాయిల్లో మార్పులకు దారితీసింది. అంతేగాక మనవాళ్లు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సంతృప్త కొవ్వులు ఎక్కువుగా తీసుకుంటారు. ఇవి రక్తంలో గ్లూకోజ్, కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. పట్టణీకరణ నేపథ్యంలో భారతీయుల చేసే ఉద్యోగాలన్నీ నిశ్చలంగా ఒకే చోట కూర్చొని చేసేవే అయ్యిపోయాయి. మరోవైపు పచ్చని ప్రదేశాలు కూడా కనుమరగయ్యాయి. వీటన్నిట్లకి తగ్గట్టుగానే ఇంకోవైపు నుంచి పర్యావరణ కాలుష్యం, వాయు, జల కాలుష్యాలు భారత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉందో తెలిసిందే. ఇవన్ని భారతీయ ప్రజల్లో రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమేగాక ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే అవయమైన ప్యాంక్రియాస్ పనితీరును దారుణంగా దెబ్బతీస్తోంది. అందువల్లే ఈ మదుమేహ వ్యాధి భారత్‌లోనే అధికంగా ఉంటోంది. ప్రజలు కూడా సరైన జీవనశైలిని పాటించకపోవడంతో చాలా ఈజీగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ సందర్భంగా పై ప్రత్యేక కథనం (చదవండి: డయాబెటిస్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? నియంత్రించాలంటే..?) -
ఆ రోజే ఎందుకు డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం?
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!. చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం. ఆ రోజు ఎందుకంటే.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు. ఈ ఏడాది థీమ్ "మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే.. ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కప్పు 'టీ'తో మధుమేహాన్ని నియంత్రించొచ్చా?
ప్రస్తుత రోజుల్లో మధుమేహం చాలా సర్వసాధారణమైపోయింది. ప్రతి ఇంటిలోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధే తప్ప తగ్గేది కాదు. షుగర్‌కి సంబంధించినవి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుని అదుపులో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి డయాబెటిస్ వ్యాధి ఓ కప్పు టీతో క్యూరో అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆయా పరిశోధనల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కప్పు టీతో ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోవడమే గాక ఒక్కసారిగా ఈ విషయం చాలా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎలా గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తెలుసుకుందాం!. చైనాలో ప్రత్యేకంగా తయారు చేసే..పులియబెట్టిన టీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇతర టీల అన్నింటిలో విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో ఈ అంశం ఓ నూతన ఉత్తేజాన్ని ఇచ్చి పలు అధ్యయనాలకు పురిగొల్పింది. ఇది ఎంత వరకు నిజం? అనే దిశగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, చైనాల సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించేందుకు దారితీసింది. వారు నిర్వహించిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం చైనాలో వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు. వారిలో డయాబెటిస్ లేనివారు, డయాబెటిస్ ఉన్న వ్యక్తుల ఉన్నారు. ఐతే వారి ఆహారపు అలవాట్లను తెలుసుకుని మరీ ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ టీ తాగిని వారి యూరిన్‌లో గ్యూకోజ్ స్థాయిలు పరీక్షించగా తక్కువగా ఉండటమే కాకుండా కొందరికి ఫీల్టర్ అయ్యి యూరిన్ నుంచి గ్లూకోజ్ వెళ్లడం లేదని గమనించారు. నిజానికి టీ తాగితే మూత్రంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కానీ ఈ డార్క్టీ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. ఈ టీని సేవించని వారితో పోలిస్తే ఆయా వ్యక్తుల్లో ప్రీ డయాబెటిస్ వచ్చే ప్రమాదం సుమారు 15% తగ్గగా, టైప్2 మధుమేహం వచ్చే అవకాశం దాదాపు 28% తగ్గిందన్నారు. ఈ మేరకు అడిలైడ్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ టోంగ్జి మాట్లాడుతూ..ఈ టీపై నిర్వహించిన పరిశోధనలు ఆశ్చర్యకరమైన రీతీలో ఫలితాలిచ్చాయన్నారు. ఈ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించిందన్నారు. బహుశ ఆ టీ తయరీలో ఉపయోగించే కిణ్వన ప్రక్రియ ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చన్నారు. చైనాలో ఉన్న ఆరు ప్రధాన రకాల టీల్లో ఈ డార్క్ టీ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఇందులో ప్రధానంగా సూక్ష్మజీవుల కిణ్వన ప్రక్రియ ఉంటుంది. అదే ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ టీలో ఉన్న శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సూలిన్ తీరును మెరుగుపరిచి గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. శరీరంలో సోడియం, గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్(ఎస్జీఎల్టీ)-2 ఇన్హిబిటర్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తత్ఫలితంగా మూత్రపిండాలు మరింతగా గ్లూకోజ్‌ను విసర్జించేలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గుండె, మూత్రపిండాల తీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది ఈ డార్క్ టీ. మన పాత కాల సంప్రదాయ పానీయమైన డార్క్ టీ గొప్పతనాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించాయన్నారు. ప్రజలు ప్రతిరోజు డార్క్ టీ తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవడమే గాక శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోగలుగుతారని నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? షుగర్ వ్యాధి వస్తుందట
ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
షుగర్ పేషెంట్స్.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీ డైట్లో తప్పకుండా ఫైబర్ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్(సర్వే ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ పాన్ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గింది ►HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది ► సుమారు 82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది. ► సప్లిమెంట్ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. దీని ప్రకారం..ఫైబర్ రిచ్ సప్లిమెంట్ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు తమ డైట్లో రిచ్ ఫైబర్(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి 25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. మధుమేహం నియంత్రణలో సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే.. ►పచ్చి కూరగాయలు, పండ్లు ► గోధుమలు, ఓట్స్ ► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ ► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ ► బీన్స్, ధాన్యాలు ► అవిసె గింజలు ► బ్రకోలి,యాపిల్ ► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు ► అరటి పండు, అవకాడో మొదలైనవి. -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
దీర్ఘకాలికంగా డయాబెటిస్ మందులు వాడుతున్నారా?
దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాక తీసుకువెళ్తాయి. యూఎస్‌లోని ఓ మహిళ అలాంటి ఘోర అనుభవమే ఎదుర్కొంది. డయాబిటిస్ కోసం వాడే మందులు ఇంతటి చేటు తెచ్చిపెడతాయిన అస్సలు ఊహిచలేదని వాపోయింది. వివరాల్లోకెళ్తే..టెక్సాస్‌కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టైప్ 2 డయాబెటిస్‌కి డ్రగ్ ఓజెంపిక్ మందులను వాడుతుంది. దీని వల్ల ఆమె విపరీతమైన దుష్పరిణామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి. జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్ర విజర్జనకు వెళ్తున్న ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తాళలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున విలపించింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు. ఆ మందుని వాడటం ఆపేసినప్పటికీ ఇంకా ఆ డ్రగ్ తాలుకా దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెబుతోంది. ఇంతకీ ఓజెంపిక్ దుష్పరిణామాలను ఎందుకు కలిగిస్తుందంటే.. సెమాగ్లుటైడ్ అని పిలిచే ఓజెంపిక్ ఊబకాయం, ఇతర బరువు సంబంధిత వైద్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ దీని సిఫార్సు చేయమని ఆమోదించింది. ఇది గ్లూకాగాన్లాంటి పెప్టైడ్-1 లేదా జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్లను సక్రియం చేసి సహజంగా సంభవించే హర్మోన్ జీఎల్పీ-1 ప్రభావాన్ని పెంచుతుంది. ఈ జీఎల్పీ -1 శరీరంలో బహుళ విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే హార్మోన్ అయిన గ్లూకాగాన్ విడుదలను తగ్గిస్తుంది. జీఎల్పీ-1 గ్రాహకం మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. కడుపు ఖాళీ అయ్యే రేటును పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికను ఇచ్చింది. ఐతే ఈ ఔషధం మానవులలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబసభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్థ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియ¯న్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్ధ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. నానాటికీ పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియ¯న్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పన్నులు విధించాలి..పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, ప్రీ ప్యాకేజ్డ్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీ ఉత్పత్తులు, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం గమనార్హం. కాగా వీటి వినియోగాన్ని నియంత్రించేలా, నిరుత్సాహ పరిచేలా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
‘లుపిన్’ రెండు మధుమేహ ఔషధాల కొనుగోలు
న్యూఢిల్లీ: మధుమేహ చికిత్సలో వినియోగించే రెండు ఔషధాలను బోరింగర్ ఇంగల్‌హామ్ నుంచి కొనుగోలు చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ శుక్రవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేసిందన్నది వెల్లడించలేదు. ‘ఆండెరో’ (లినాగ్లిప్టిన్), ‘ఆండెరో మెట్’(లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్)ను ట్రేడ్‌మార్క్ హక్కులు సహా కొనుగోలు చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ రెండు ఔషధాలను 2015 నుంచి లుపిన్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందుకుగాను బోరింగర్ ఇంగెల్హామ్తో కోమార్కెటింగ్ ఒప్పందం కలిగి ఉంది. ఈ ఔషధాల కొనుగోలుతో యాంటీ డయాబెటిక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా తమ స్థానం మరింత బలపడుతుందని లుపిన్ తెలిపింది. అలాగే మధుమేహంతో వచ్చే సమస్యలను అధిగమించేందుకు మెరుగైన చికిత్సా అవకాశాలు కలి్పంచాలన్న తమ అంకిత భావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది. మన దేశంలో 18 ఏళ్లకు పైన వయసున్న ప్రజల్లో 7.7 కోట్ల మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతుండడం గమనార్హం. 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్ (మధుమేహం ముందస్తు) దశలో ఉన్నారు. -
కిడ్నీలపై.. జంట భూతాల ప్రభావం
శరీరంలో అత్యంత కీలకమైన కిడ్నీలను రెండు జీవనశైలి వ్యాధులు భూతాల్లా పట్టుకున్నాయి. వాటి బారిన పడి కిడ్నీలు దెబ్బతిని ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఆ భూతాలే మధుమేహం, రక్తపోటు. ఈ రెండూ అదుపులో లేకపోవడంతో వాటి ప్రభావం కిడ్నీలపై పడుతోంది. క్రమంగా అవి చెడిపోతున్నాయి. కిడ్నీ వ్యాధులకు మిగతా కొన్ని కారణాలు కూడా ఉన్నప్పటికీ, 85 శాతం వ్యాధిగ్రస్తుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులే ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ వ్యాధుల నియంత్రణకు తోడ్పడుతోంది. వైద్యులు గ్రామాలకు వెళ్లిన సమయంలో ప్రజలో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణ ప్రాంతాల వారికి వరంలా మారింది. – లబ్బీపేట (విజయవాడ తూర్పు) అవగాహన లేకనే.. అవగాహన లేమి, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వినియోగం కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే చివరకు డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. ఇదంతా అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందువల్ల ముందు జాగ్రత్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల్లో కొందరిలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే డయాలసిస్ అవసరం అయ్యేంత పరిస్థితికి దారితీస్తున్నాయి. కిడ్నీ వ్యాధులకు గురయ్యే వారిలో 45 శాతం మందికి మధుమేహం కారణం కాగా, మరో 55 శాతం మందికి అధిక రక్తపోటు, ఇతర కారణాలుగా చెబుతున్నారు. యూరిన్ ఆల్బుమిన్, సీరమ్ క్రియాటిన్, స్కానింగ్ వంటి చిన్నపాటి పరీక్షలతో కిడ్నీ పని తీరును తెలుసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. అక్యుట్ ఫెయిల్యూర్, క్రానిక్ ఫెయిల్యూర్. అక్యుట్ ఫెయిల్యూర్‌ను సరైన చికిత్సతో సాధారణ స్థితికి తేవచ్చు. క్రానిక్లో అలా చేయలేం. ఫ్యామిలీ డాక్టర్ ఓ వరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణులకు వరంలా మారింది. నెలలో రెండు రోజులు గ్రామాలకే వెళ్లి పరీక్షలు చేయడంతో కిడ్నీ వ్యాధుల లక్షణాలను ముందుగానే గుర్తించగలుగుతున్నారు. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు సందేహం ఉన్న వారికి పీహెచ్‌సీలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు గుర్తించినా ఫెయిల్యూర్‌కు దారితీయకుండా కాపాడుకోగలుగుతున్నారు. నిపుణుల వద్దకు వెళ్లి మెరుగైన వైద్యం పొందుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణాలు ♦ అదుపులో లేని మధుమేహం, రక్తపోటు ♦ గ్లొమెరుల్లోనెఫ్రిటిస్ ♦ ఎడిపికెడి–పొలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఇది వంశపారంపర్యంగా వస్తుంది) ♦ ఆటో ఇమ్యూన్ జబ్బులు ♦ ఊబకాయం, ధూమపానం ♦ విచ్చలవిడిగా నొప్పి నివారణ మాత్రలు వాడటం.. దీర్ఘకాలం పాటు గ్యాస్ మాత్రల వినియోగం ♦ దీర్ఘకాలంలో గుండె, ఇతర జబ్బులు ♦ మాంసాహార ప్రొటీన్ అధికంగా తీసుకోవడం కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు.. ♦ ఆయాసం, అలసట ♦ కాళ్ల వాపులు, ముఖం వాపు ♦ మూత్రం తగ్గిపోవడం ♦ ఎముకలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి ♦ కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా డయాలసిస్ స్టేజ్‌కి చేరవచ్చు నిర్ధారణ ఇలా: కిడ్నీ వ్యాధులను సీరమ్ క్రియాటిన్, యూరిన్ ఆల్బూమిన్, పొట్ట అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు -
కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!
కొంబుచా అనేది టీ, ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో కలిసి తయారు చేసే పానీయం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్తరకం డ్రింక్. మధుమేహం వ్యక్తులకు ఇది చక్కటి దివ్యౌషధం. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూసి పరిశోధకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ కొంబుచా అంటే ఏమిటి? దీన్ని ఎవరూ తయారు చేశారు?..అంటే.. ఈ డ్రింక్ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జపాన్, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. ఇందులో ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింట్ల మిశ్రమాన్ని ఒక వారం పాటు నిల్వ ఉంచగా పులియబెట్టిన ఒక ఆమ్లం తయారవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వణ ప్రక్రియ అంటారు. డ్రింక్ ఎలా తయారు చేస్తారంటే.. కొంబుచా టీని వివిధ మార్గాల్లో తయారు చేస్తారు, అయితే కొంబుచా తయారీలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులియబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్, బ్యాక్టీరియా కొన్ని రకాలు ఆమ్లాలు విడుదల అయ్యి పైన ఒక పొరలాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కకు ఉంచి అందులో ఉన్న పానీయాన్ని సేవిస్తారు. ఈ పొరనే కొంబుచా అంటారు దీన్ని పక్కకు ఉంచుకుని దీని సాయంతో డ్రింక్ తయారు చేసుకుంటారు. ఇది తియ్యటి ఆల్కహాల్ మాదిరి ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువుగా ఉంటుంది. డైలీ డ్రింక్ తయారీ విధానం: పెద్ద గాజు సీసా తీసుకోండి. ఒకటిన్నర కప్పుల చక్కెరను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక రెండు టేబుల స్పూన్ల బ్లాక్ టీ వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఆఫ్ కప్ వెనిగర్ వేయాలి. ఈ నీటిని మనం పైన చెప్పనట్లుగా తయారు చేసకుని పక్కకు పెట్టుకున్న కొంబుచా పొరలో వేసేసి అలా సుమారు 15 నుంచి 20 రోజు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. దీన్ని ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అంత తియ్యగా రుచిగా ఉండే కొంబుచా డ్రింక్ తయారవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. టైప్2 డయాబెటీస్ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కొంబుచా డ్రింక్ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పులియబెట్టిన డ్రింక్ కావడం చేత క్యాన్సని క్యూర్ అయ్యేలా చేస్తుంది అలాగే ఎయిడ్స్ పేషంట్లకు వ్యాధి నియంత్రణలో ఉండి మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడటమేగాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగు సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అలాగే జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం జరిపిన క్లినకల్ ట్రయల్స్‌లో ఈ కొంబుచా డ్రింక్‌ని సేవించిని నాలుగు వారాల తర్వాత ఆయ వ్యక్తుల రక్తంలో సగటున ఉండే గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కు 164 నుంచి 116 మిల్లీగ్రాములకు తగ్గినట్లు వెల్లడైంది. ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైందని అందువల్ల ఇది శరీరానికి తక్షణ రోగ నిరోధక శక్తి అందించడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధంగా పేర్కొన్నారు. ఐతే కొందరూ మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యప్రయోజనాలను అందించగలదని నిరూపితమవ్వలేదంటూ వాదించడం గమనార్హం. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రదాన కారణమా! వెలుగులోకి విస్తూపోయే నిజాలు!) -
Lancet Study: 2050 కల్లా మధుమేహ బాధితులు 130 కోట్లు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మంది వరకు మధుమేహం బారినపడే అవకాశం ఉన్నట్లు లాన్సెట్ చేపట్టిన ఓ అధ్యయనం తేల్చింది. 1990–2021 మధ్య కాలంలో 204 దేశాలు, ప్రాంతాల్లో మరణాలు, అశక్తత, డయాబెటిస్ వ్యాప్తి వంటి అంశాలకు సంబంధించి 27 వేలకు పైగా రకాల గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టినట్లు లాన్సెట్ తెలిపింది. 2050 నాటికి మధుమేహం వ్యాప్తి సామాజిక, భౌగోళిక అంశాలు, ఒబేసిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోడల్‌ను అనుసరించినట్లు వివరించింది. ప్రజలు తమ ఆరోగ్య విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపింది. ఎక్కువ మందికి టైప్–2నే టైప్–1, టైప్–2 డయాబెటిస్‌లలో వచ్చే మూడు దశాబ్దాల్లో టైప్–2 బాధితులే ఎక్కుమంది ఉంటారని సర్వేలో వెల్లడైంది. టైప్–1 అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి, దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. టైప్–2 డయాబెటిస్తో ఇన్సులిన్ నిరోధకత క్రమంగా పెరుగుతుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా పెద్దల్లో కనిపిస్తుంది. ముందుగానే గుర్తించి, దీనిని నివారించవచ్చు. అప్రమత్తతే ఆయుధం డయాబెటిస్తో సంబంధం ఉన్న అనేక సమస్యల కారణంగా ఈ సర్వేలో తేలిన వివరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మధుమేహ బాధితులు గుండెజబ్బు, గుండెపోటు, కంటి చూపు కోల్పోవడం, పాదాలకు అల్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్యల బారిన పడతారు. మధుమేహం ప్రమాదాన్ని పెంచేవి సాధారణంగా వయస్సు, ఊబకాయం. ఎక్కువ బీఎంఐకి అధిక–క్యాలరీ ఉత్పత్తులు, అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారం, కొవ్వు, చక్కెర, జంతు ఉత్పత్తుల వినియోగం. వీటితోపాటు తగ్గిన శారీరక శ్రమ డయాబెటిస్‌కు కారణాలుగా ఉన్నాయి. జన్యు సంబంధమైన కారణాలతోపాటు అనారోగ్యకర జీవన శైలితో కూడా మధుమేహం బారినపడే ప్రమాదముంది. జాగ్రత్తలు మేలు.. ► ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి. ► ఎక్కువ రిస్క్ ఉన్న వారు ఫైబర్ ఎక్కువగా ఉండే, తృణ ధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ► ఒకే చోట గంటల కొద్దీ కూర్చోరాదు. అప్పుడప్పుడు నడక వంటి వాటితో శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి. ► రోజులో కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి. బరువు పెరక్కుండా జాగ్రత్తపడాలి. ► దాహం అతిగా అవుతున్నా, నీరసంగా ఉన్నా, తెలియకుండానే బరువు కోల్పోతున్నా, కంటి చూపు మందగించినా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన వైద్య చికిత్సలు తీసుకోవాలి. -
డయాబెటిస్ రావడానికి అసలు కారణం ఇదే...
-
ఇన్సులిన్ కొనడానికి డబ్బులు లేక ..
-
Diabetes: పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నట్లే..
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటీస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. ఇది వస్తే పేషెంట్లు ఎలా ఉంటారనే దాని గురించి అందరికి తెలిసిందే. దీనికి పూర్తిగా నివారణ లేదు గానీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడమే గాక సులభంగా బయటపడవచ్చు. ఐతే ఈ డయాబెటిస్ పేషెంట్లకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందున కొన్ని రకాల అంటువ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల వచ్చాయి అంటే మీరు డేంజర్లో ఉన్నట్లు అర్థం. సత్వరమే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ రోగులుకు సాధారణంగా వచ్చే అంటువ్యాధులు నేషనల్ లైబ్రెరీ ఆప్ మెడిసినల్ అధ్యయనాల ప్రకారం..పేషెంట్లో ఆరు శాతం మంది ఇన్ఫెక్షన్ల సంబంధింత వ్యాధుల కారణంగా ఆస్పత్రుల చేరి మరణాల వరకు సంభవించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఇన్ఫక్షన్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పాదాలలో చలనం తగ్గి గాయమైన తెలయకపోవడం. ఆ తర్వాత క్రమంగా అది పెద్దదిగా మారి దాని నుంచి శరీరమంతా ఇన్ఫక్షన్ వ్యాపించి ప్రాణాంతకంగ మారిని కేసులు ఎక్కువే. ఆయా రోగులకు అంత్యభాగంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఏదైన వ్యాధి వస్తే ఈజీగా ఇన్షక్షనే అయ్యే ప్రమాదం ఎక్కువ. రకరకాల చర్మ సమస్యలు వచ్చినా మధుమేహం ఎక్కువగా ఉంది అనడానికి ప్రధమ సంకేతం గోరుచుట్టు, యూరినరీ ఇన్ఫక్షన్లు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి, ముక్కు, గొంతు ఇన్ఫక్షన్లు వచ్చిన సాధారణంగా భావించొద్దు. అలాగే స్త్రీలల్లో జననేంద్రియాలలో ఏదైన ఇన్ఫక్షన్ల వచ్చిన తేలికగా తీసుకోవద్దు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల మాదిరిగా ఉంటాయి. అందువల్లే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాడం ఉత్తమం. (చదవండి: కొబ్బరినీళ్లతో ఇన్ని ప్రయోజనాలా?.. మరి డయాబెటిక్ పేషెంట్స్ తాగొచ్చా?) -
షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అనేక అనారోగ్య సమస్యలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం ఇది. అందుకే ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొబ్బరిబోండం తాగమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.శరీరంలోని వేడిని తగ్గించి, డీహైడ్రేట్ అయ్యేలా కాపాడుతుంది. ఆరోగ్యపరంగానే కాకుండానే అందం రెట్టింపు అయ్యేందుకు కూడా కొబ్బరిబోండం సహాయపడుతుంది. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి ఎన్నో ఖనిజ లవణాలు కలిగిన కొబ్బరినీళ్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయా? షుగుర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుంది. కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది ► కిడ్నీ సమస్యలలో ఎఫెక్టివ్: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ► బరువు తగ్గిపోతున్నామని బావించేవాళ్లు ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగాలి. ఇందులోని తక్కువ కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది. షుగర్ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగొచ్చా? ♦ డయాబెటీస్ పేషెంట్స్ కొబ్బరినీళ్తు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయనే అపోహ ఉంటుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తాగడం వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. ♦ ఇది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముదిరిన కొబ్బరి నీటిని కాకుండా లేత కొబ్బరి నీటిని తాగడం మంచిది. ఎందుకంటే ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరిలో చక్కెర శాతం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ♦ అయితే ఈమధ్య కాలంలో ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ప్రిజర్వేటీస్, చక్కెరలు డయాబెటిస్ పేషెంట్స్‌కి మంచిది కాదని, వాళ్లు మాత్రం సహజంగా దొరికే కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమమని పేర్కొంటున్నారు. -
ప్యాంక్రియాటైటిస్ వస్తే?
దేహంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి)ది కీలక పాత్ర. దీని నుంచి అవసరమైనప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవసరమైనప్పుడు శక్తిని తీసుకునేందుకు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వల్లనే డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సొమాటోస్టాటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఓ చిన్న గొట్టం ద్వారా జీర్ణప్రక్రియకు అవసరమైన క్లోమరసం కూడా వచ్చి చిన్నపేగుల దగ్గర కలుస్తుంది. ఏవైనా కారణాల వల్ల ఈ క్లోమరసం తాలూకు స్రావాల్లోని ప్రోటీన్లు ఉండల్లాగా మారి, క్లోమరసాన్ని తీసుకెళ్లే గొట్టానికి అడ్డుపడ్డప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ గ్రంథిలోనే రాళ్లలా ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘ప్యాంక్రియాటైటిస్’ అంటారు. నిజానికి ఇది అంత ప్రాణాంతకం కానప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే దీనికి చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు : ► తిన్నది జీర్ణం కాకపోవడం ► ఏదైనా తిన్నవెంటనే కడుపులో తీవ్రమైన మంట, నొప్పి ► స్వల్పంగా జ్వరం ► పొట్టభాగం ఎడమవైపున పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి మొదలై కొన్ని సందర్భాల్లో అది వీపుకు వైపునకు పాకుతుండటం ► కామెర్లు ఠీ పొట్ట ఉబ్బరం ఠీ వాంతి అవుతున్నట్లు అనిపిస్తుండం (వికారం) ► కొందరిలో విరేచనాలు కావడం ► కడుపుపైన తాకితే భరించలేనంత బాధ (టెండర్నెస్) ► కొందరిలో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కారణాలు : ఏ కారణం లేకుండానే పాంక్రియాస్లో రాళ్ల వంటివి రావడం జరుగుతుంది. అయితే కొందరిలో మితిమీరిన మద్యపానం చాలావరకు పాంక్రియాటైటిస్‌కు కారణమవుతుంది. నిర్ధారణ పరీక్షలు : బాధితులకు కొన్ని రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేసి, పాంక్రియాస్ నుంచి వచ్చే నాళం ఎంత దెబ్బతిన్నదీ, ఆ గ్రంథి ఏ మేరకు ఉబ్బి ఉంది అన్న విషయాలు తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స : పాంక్రియాటైటిస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటే కొన్ని రకాల మందులతో దాన్ని తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. మందులతో తగ్గనప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ల్యాపరోస్కోపిక్ / కీహోల్ శస్త్రచికిత్సలతో కడుపుపై కత్తితో కోయకుండానే, చిన్నపాటి గాట్లతోనే శస్త్రచికిత్స చేసి, ప్యాంక్రియాస్ గ్రంథిలోని దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన సమయం, ఇతర ఇన్ఫెక్షన్లు, సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు బాగా తగ్గిపోతాయి. -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం! పరగడుపున ఒక చెంచా రసం తాగితే
కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనానికై ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న చిట్కాలివి. 1.అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. 2.నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి 3. ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. 4.వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి. స్థూలకాయం తగ్గి 5. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 6. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు. తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు మేలు 7.అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాలతో కలిపి పుచ్చుకుంటే నరాలకు మేలు చేస్తాయి. 8.కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. కడుపు నొప్పి ఉంటే 9.రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది. 10.తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. పేను కొరుకుడు వేధిస్తోందా 11.దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న వాళ్లకి తక్షణం పనిచేస్తుంది. 12.ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. చుండ్రు నివారణకు 13.మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది. 14.కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. మడమ నొప్పి తగ్గాలంటే 15.చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. 16.జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉంటే 17.శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 18.రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం 19.మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. 20.ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం. పార్శ్వపు నొప్పి తగ్గటానికి 21.పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది. 22. తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్య నిపుణులు నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
కరోనాతో డయాబెటిస్ ముప్పు..!
లండన్: కరోనా సోకిన వారికి డయాబెటిస్ ముప్పు అధికమని బ్రిటిష్ కొలంబియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వేన్‌కవర్‌లోని సెయింట్ పాల్ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడైంది. 20లో ఒక డయాబెటిస్ కేసుకు కరోనా కారణమని తేలింది. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న 6,29,935 మందిని తర్వాత కాలంలో వచి్చన వ్యాధులపై అధ్యయనం చేశారు. కరోనా కారణంగా చక్కెర వ్యాధిగ్రస్తులు 3 నుంచి 5% పెరుగుతున్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ప్రతీ 100 మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 3–5% కేసులకు కరోనాతో సంబంధముందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నవీడ్ జన్జువా చెప్పారు. -
షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే
సాక్షి,ముంబై: విషపూరిత జీవుల్లో ఒకటి తేలు. తేలు కుడితే వచ్చే బాధ వర్ణనా తం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి తేలు విషం ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌గా నిలుస్తుండటం విశేషం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. మార్కెట్లో దీని విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. దాదాపు లీటరుకు వందకోట్ల రూపాయలకు పై మాటే. అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్ తేలు విషం భారీ ఖరీదు పలుకుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం డెత్‌స్టాకర్ అనే తేలు విషంలో మనుషులకి ప్రాణాంతకం కాదు గానీ, అంతకుమించిన మంచి గుణాలున్నాయి. 2021 నాటికి విషం చుక్క ధర 130 డాలర్లు. 4 లీటర్ల డెత్ స్టాకర్ జాతికి చెందిన తేలు విషం ధర 320 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక తేలు ఒకసారి రెండు మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. బ్రిటానికా డాట్ కాం ప్రకారం, డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం గ్యాలన్ ధర 39 మిలియన్ల డాలర్లు. గ్యాలన్ విషంకోసం 2.64 మిలియన్ల సార్లు విషం తీయాలి లేదంటే 27 లక్షల తేళ్లనుండి విషాన్ని సేకరిస్తే ఒక గాలన్ నిండుతుందన్నమాట. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు డెత్‌స్టాకర్ తేళ్లు నార్త్ ఆఫ్రికానుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్, థార్ సెంట్రల్, సెంట్రల్ ఏషియా ఎడార్లు జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్, క్లారోటాక్సిన్స్.. క్యారిబ్డోట్యాక్సిన్స్, సిల్లాటాక్సిన్స్, ఏజిటాక్సిన్స్ ఉంటాయి. అంతేకాదు ఈ విషాన్ని సేకరించిందేందుకు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తారు. తేళ్ల కొండిలకు పరికరం ద్వారా విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పుడు వాటంతట అవే విడుదల చేసే విషాన్ని సేకరిస్తారు. ప్రాణం పోసే విషం! ఎందులో వాడతారంటే? ఈ తేలు విషాన్ని క్యాన్సర్ కణితులను గుర్తించడంలోనూ, మలేరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారట. అందుకే దీనికి ఇంత డిమాండ్. అలాగే మెదడు కణితుల చికిత్సల, డయాబెటీస్ నివారణలోనూ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెత్‌స్టాకర్ స్కార్పియన్స్ విషంలో ఉండే క్లోరోటాక్సిన్ని కొన్నిరకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్ గడ్డలుఎక్కడ, ఏపరిమాణంలో ఉన్నాయో గుర్తించవచ్చట. అయితే డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం ప్రాణాంతకమైంది కాదు. ఇది కుడితే భయంకరమైన నొప్పి ఉంటుంది తప్పితే ఆరోగ్యకరమైన వయోజనులను చంపేంత విషపూరితమైంది కాదని స్వయంగా పరిశోధకులు వెల్లడించారు. కానీ పిల్లలు, వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ప్రాంతాన్నిబట్టి ప్లాన్
‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్ బెటర్..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్ చార్ట్ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్ (కావలసిన విధంగా) డైట్ చార్ట్ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్ చార్ట్ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గోరిథం (టీడీఎన్ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. ఈ టీడీఎన్ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్ఏ అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా.. వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్ఏ. ఈ ఆల్గోరిథమ్‌ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమట. ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్ చార్ట్ (టీడీఎన్ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది. అందరూ చేయాల్సిందిదే.. చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. – డాక్టర్ ఇర్ఫాన్ షేక్, మెడికల్ అఫైర్స్ హెడ్, అబాట్ న్యూట్రిషన్ మన దగ్గర రైస్ వినియోగమే సమస్య డయాబెటిస్ నియంత్రణలో డైట్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్ ప్లాన్‌ను ఇస్తుంటాం. ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్ తురుము, రాజ్ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్‌ని పెంచడానికి ప్రయతి్నస్తాం. – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్ నియంత్రణే ముఖ్యం.. మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది – డాక్టర్ ఒసామా హమ్డీ, మెడికల్ డైరెక్టర్ జోస్లిన్ డయాబెటిస్ సెంటర్ -
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలని గుర్తించండి ఇలా...
ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకుంటున్నా, మీకు బీపీ పెరుగుతోందా? కాళ్లూ చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయా? గోళ్ల రంగు మారుతోందా? ఇవన్నీ వ్యాధి లక్షణాలే. అయితే భయపడవద్దు. అది ఏమంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, తేలిగ్గా కూడా తీసుకోకూడదు. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి నిదర్శనం అది. కొలెస్ట్రాల్ దానంతట అది ప్రమాదకరమైనది కాదు కానీ, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేయద్దు. అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ లక్షణాలుంటాయో అవగాహన కోసం. సాధారణంగా కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. మంచి కొలస్ట్రాల్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించాలి. కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి... 1. అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది. 2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పాదాలు మొద్దుబారడం: కాళ్లు చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ΄ాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. 3. గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్న వాళ్లు మూడు నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో΄ాటు కొలెస్ట్రాల్ ΄ాళ్లను తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకుని దానిని అదుపు చేసేందుకు తగిన మందులు తీసుకోవాలి. -
ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి!
తరచూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? ఆలస్యం వద్దు తెల్లముల్లంగితో వండిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే... ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు తేలిగ్గా నివారితమవుతాయి. దీనికి ఓ కారణం ఉంది. రెఫానస్ సెటైవస్ యాంటీఫంగల్ పెటైడ్ డ్–2 (సంక్షిప్తంగా ఆర్ఎస్ఏఎఫ్పీ–2) అనే ఓ ప్రోటీన్ కారణంగా తెల్లముల్లంగి ఫంగల్ వ్యాధుల్ని తేలిగ్గా నివారించగలుగుతుంది. అంతేకాదు... ఇది మంచి డీ–టాక్సిఫైయర్ కావడంతో దేహంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. కామెర్లతో బాధపడిన వాళ్లలో ఎర్రరక్తకణాలు నాశనం కాకుండా కా పాడుతుంది. వాటిని కా పాడటమంటే పోషకాలు, ఆక్సిజన్ అందేలా చూసి ప్రతి కణాన్నీ కా పాడినట్టే. మామూలుగానైతే డయాబెటిస్తో బాధపడేవారు దుంపకూరల్ని తినకూడదంటారు. కానీ ముల్లంగిలోని పీచు చక్కెరను చాలా నెమ్మదిగా వెలువడేలా చేస్తుంది కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేసే దుంపగా పేరుతెచ్చుకుంది. -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి?
ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. అసలు డయాబెటిస్ ఎన్ని రకాలు.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. డయాబెటిస్ రెండు రకాలు.. మొదటి రకం (టైపు -1) ఇది.. పిల్లల్లో వచ్చేది . శరీరానికి రక్షణ కల్పించాల్సిన ఇమ్మ్యూనిటి వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంపైనే దాడి చేస్తుంది. పెద్దల్లో కనిపించే టైపు - 2 డయాబెటిస్‌కు కారణాలివే.. ►ఒంటికి సూర్య రశ్మి తగలక పోవడం - దీని వల్ల కలిగే డి విటమిన్ లోపం ►అధిక బరువు - ఊబకాయం - శారీరిక శ్రమ లోపించడం, అధిక తిండి ►జన్యు వారసత్వం (తల్లి తండ్రి లో ఒకరికి ఉన్నా వచ్చే అవకాశముంది) ►టెన్షన్ - స్ట్రెస్ ►భోజనంలో పిండిపదార్థాలు ఎక్కువ కావడం - ప్రోటీన్ , పీచు లాంటివి బాగా తక్కువ కావడం రాకుండా ఎలా కాపాడుకోవాలి ? ►చిన్నపటి నుంచి పిల్లలని, బుసబుస పొంగే కూల్ డ్రింక్స్ , పిజ్జా , బర్గెర్ , పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. ఆయా కాలాల్లో దొరికే పళ్ళు బాగా తినాలి. పిల్లలు ఆటలాడాలి ►ఒకప్పుడు నలబై యాభై లలో డయాబెటిస్ వచ్చేది . ఇప్పుడు ముప్పై వయసులోనే కొంతమందిలో ఇరవై లోనే టైపు 2 చక్కర వ్యాధి వచ్చేస్తోంది . గతం తో పోలిస్తే ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది ►క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం , రక్తం లో ఇన్సులిన్ ఉన్నా అది సరిగా స్పందించకపోవడం - ఈ కారణంచేత రక్తం లో షుగర్ లేదా గ్లూకోస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి . ఇదే చక్కర వ్యాధి రక్తం లో గ్లూకోస్ లెవెల్ ఎంత ఉండాలి? ►ఇంట్లో accu చెక్ లాంటి పరికరంతో రక్తం లో గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు ►అన్నం తిన్నాక గంటన్నర కు చెక్ చేసుకోవాలి . రీడింగ్ 140 ఉంటే సమస్యే లేదు . 180 దాక ఉన్నా పెద్దగా సమస్య కాదు . 300 దాటితే మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్టు ►500 దాటితే ఆపాయ స్థితి సహజ పద్ధతిలో డయాబెటిస్‌ను ఎలా జయించాలి ? ►రోజుకు కనీసం 30 నిముషాలు ఎండలో { ఉదయం లేదా సాయంకాలం} వేగంగా నడవాలి . అప్పుడు డి విటమిన్ అందుతుంది . శారీరిక శ్రమ వల్ల ఇన్సులిన్ ఉత్త్పత్తి పెరుగుతుంది/దాని పని తీరు మెరుగు పడుతుంది. బరువు కూడా తగ్గడం దీనికి మరింత దోహద పడుతుంది . ►మానసిక ఒత్తడికి దూరం కావాలి . అనారోగ్యం గా వున్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు . అది పెద్ద సమస్య కాదు. టెన్షన్ ఉన్నప్పుడు కూడా ►ఆధునిక జీవనం టెన్షన్ ల మయం. కొద్దిపాటి లేదా కాసేపు టెన్షన్ సరే అనుకోవచ్చు . రోజుల తరబడి టెన్షన్ పడితే డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగి పోతుంది . యోగ , పాటలు వినడం, NLP .. ఏ పద్దతి అయినా ఫరవాలేదు. ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి . తగిన విశ్రాంతి , నిద్ర , సంతోషం , తృప్తి.. ఇవన్నీ అవసరం . ►ఎలాంటి మందులు లేకుండా చక్కర వ్యాధి ని దూరం చేయాలంటే ఆహార నియమాలు తప్పని సరి . పిండి పదార్థాలు అంటే బియ్యం గోధుమలు లాంటి వాటితో చేసిన వంటకాలు - బాగా తగ్గించాలి. ►తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మెరుగు, దాని కన్నా బాసుమతి మెరుగు . దాని కన్నా సిరి ధాన్యాలు మెరుగు . మీ కంచం లో పిండి పదహార్థాలనిచ్చే బియ్యం తో చేసినవి గోధుమలతో చేసినవి బాగా తక్కువ ఉండాలి. ►ఆరు పాళ్లల్లో కేవలం ఒక పాలు మాత్రం ఇవి కావాలి . మిగతావి అయిదు రెట్లు ఉండాలి . అంటే అన్నం ఒక కప్పు అయితే ఆకుకూరలు , కాయగూరలు , మాంసాహారులైతే చికెన్, మటన్, చేపలు, గుడ్డు, శాకాహారులైతే పన్నీర్, పప్పు , వేరుశనగ గింజలు, బ్రాన్ చన, పుట్ట గొడుగులు ఇవి అయిదు పాళ్లు కావాలి. ప్రతిదీ ప్రతి రోజూ తినాలని కాదు. వీలు బట్టి .. అవకాశాన్ని బట్టి.. ►ఆకు కూరలు కాయగూరలు మాత్రం ప్రతి రోజు .. ఆ మాటకు వస్తే ప్రతి పూట ఉండేలా చూసుకోవాలి. కాయగూరల్ని కొన్ని పచ్చివిగా తినొచ్చు . ఉదాహరణ కీర.. మిగతావి మీ టేస్ట్ బట్టి కుక్ చేసి ►కాయగూరల్లో బంగాళాదుంప లాంటివి బియ్యం తో సమానం. అంటే వీటిలో పిండి పదార్థాలు అధికం. కాబట్టి వాటిని తక్కువగా వాడాలి. మీ బ్లడ్ గ్లూకోస్ ఎక్కువ స్థాయిలో ఉంటే అసలు తినకూడదు . ►చికెన్, మటన్, పనీర్ లాంటివి ప్రోటీన్ ను అందిస్తాయి . ఇవి ఎంతో అవసరం . ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీ లు పాడైపోతాయి అనుకోవడం అపోహ. మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే మీకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది వరకే కిడ్నీ సమస్య ఉన్నవారు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవద్దు. ►ఒకటి -రెండు నెలలుప్రతి రోజు .. మీ గ్లూకోస్ లెవెల్ చెక్ చేసుకోండి . రెండు కప్పుల తెల్లన్నం తిన్నా , మీ రీడింగ్ 140 దాటడం లేదంటే మీకు షుగర్ సమస్య లేనట్టే . అలాగని ఎక్కువ తెల్లనం తింటే ఊబకాయం వచ్చి భవిషత్తులో షుగర్ సమస్య రావొచ్చు . మీ రీడింగ్ 250 లోపు ఉంటే , మరుసటి పూట అన్నం తగ్గించండి . ఖీర, చికెన్ లాంటివి పెంచండి. ►ఇలా ఒక నెల రోజులు ప్రతి రోజూ మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటుంటే మీ శరీర తత్త్వం మీకే అవగాహన అయిపోతుంది. ఎలాంటి ఫుడ్ తింటే మీ రీడింగ్ 140 లోపే వుందని అర్థం చేసుకొంటారు ►వీలైనంత వరకు 140 లోపు ఉంచేలా ప్రయత్నించండి . 180 దాక అయినా ఫరవాలేదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మీ రీడింగ్ ను 140 దాటకుండా చూసుకొంటే ఎప్పుడో ఒక సారి జిహ్వచాపల్యం తట్టుకోలేక స్వీట్స్ లాంటివి తిని రీడింగ్ కాసేపు 250 టచ్ చేసినా ఏమీ కాదు. అర గంటలో తగ్గిపోతుంది. ►ఇలా మీరు ఆహార నియమాన్ని పాటిస్తూ మీ రీడింగ్‌ను 140 దాటకుండా రెండు -మూడు నెలలు చూసుకోగలిగితే , అప్పుడు సాయంకాలం ఒక పండు తినొచ్చు . బాగా తీయగా వుండే మామిడి, ద్రాక్ష, అరటి కాకుండా మిగతా పళ్లు.. దీని వల్ల మీ క్లోమం బలపడుతుంది. షుగర్ సమస్య దూరం అయిపోతుంది . ►రెండు మూడు నెలలు రీడింగ్ చూసుకొంటే ఆ తరువాత మీకే ఐడియా వస్తుంది. ఏ ఫుడ్ తినాలి ? ఎంత తినాలి ? ఎంత తింటే రీడింగ్ ఎంత ఉంటుంది? అని. అప్పుడు మీకు మీరే న్యూట్రిషనిస్ట్. ఇలా శాశ్వతంగా డయాబెటిస్‌ను జయించవచ్చు . మీ రెడింగ్ 300 దాటితే మీకు ఇన్సులిన్ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వాడుతున్న మెట్ఫార్మిన్ లాంటివి ఒక్క సరిగా మానేస్తే షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి పోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కిడ్నీ లు దెబ్బ తిని ఉంటే ఎక్కువ ప్రోటీన్ డైట్ మంచిది కాదు . అలాంటాప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఆచి తూచి రిస్క్ లేని రీతిలో నెమ్మదిగా పాటించొచ్చు -వాసిరెడ్డి అమర్నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు -
Health: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే..
Health Tips In Telugu- Constipation (Malabaddakam): మలబద్ధకం అన్నది ఉదయాన్నే చాలామందిని బాధపెడుతుంది. సాఫీగా విరేచనం జరగకపోతే పొద్దున్నే లేచింది మొదలు రోజంతా ఇబ్బందికరంగానే గడుస్తుంది. అయితే మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటుంటే మల బద్ధకం సమస్య చాలా సులువుగానే దూరమవుతుంది. అయితే ఈ మార్గాలతో కేవలం మలబద్ధకం నివారణ మాత్రమే కాకుండా అనేక అదనపు ప్రయోజనాలూ ఒనగూరతాయి. జీర్ణాశయం మార్గం శుభ్రంగా పీచు మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య దరిచేరదన్న విషయం తెలిసిందే. ఆ ఆహారాలు కేవలం మలబద్ధకాన్ని నివారించడం మాత్రమే కాదు... పూర్తి జీర్ణాశయం మార్గాన్నీ శుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం భోజనంలో ఎక్కువమొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి. చక్కెర మోతాదులు నియంత్రణలో వీటితో పాటు పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. వీటితో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే... అవి తేలిగ్గా విరేచనమయ్యేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెర మోతాదుల్ని నియంత్రణలో ఉంచడానికీ తోడ్పడతాయి. సలాడ్స్ రూపంలో.. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ దోహదపడతాయి. అలాగే వాటిలోని పీచుపదార్థాలూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. క్యారట్, బీట్రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి అవి కూరలుగా అంతగా నచ్చకపోవచ్చు. అలాంటివారు సలాడ్స్ రూపంలో లేదా సూప్‌గానూ తీసుకోవచ్చు. చర్మ నిగారింపునకై పీచుపదార్థాలుండే ఆహారాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ మార్గమూ శుభ్రపడుతుంది. దేహం హైడ్రేటెడ్‌గానూ ఉంటుంది. ఫలితంగా మలబద్ధక నివారణే కాదు చర్మానికి మంచి నిగారింపుతో కూడిన మెరుపును ఇవ్వడంతో పాటు మరెన్నో జబ్బుల నివారణకూ ఈ అంశం తోడ్పడుతుంది మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇక్కడ పేర్కొన్న మార్గాలు కేవలం మలబద్ధకం నివారణ కోసం మాత్రమే కాకుండా... దాదాపు ప్రతి ఒక్కటి మన వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థలోని పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌ను) రక్తంలోకి ఆలస్యంగా వెలువడేలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం, మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం వంటి పనులూ చేస్తాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. -
తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఖాళీ కడుపుతో నమిలితే
Health Tips In Telugu: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. తులసిలో ఆల్సోలిక్ యాసిడ్, యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అందువల్ల మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే తులసి మీకు ఉత్తమమైనది. ఖాళీ కడుపుతో ఆకులు నములితే.. చక్కెర వ్యాధిగ్రస్తులకు తులసి దివ్యౌషధం. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగేసెయ్యండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగితే తులసిలో విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చు. చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? Veganuary: చర్మానికి మంచి నిగారింపు.. ఆరోగ్యమూ బాగుంటుంది: నటి -
Health: బ్లాక్ సాల్ట్‌ను నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకుంటే..
Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ►కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ►ఎముకలు దృఢంగా మారుతాయి. ►నిద్ర చక్కగా పడుతుంది. ►మానసిక ప్రశాంతత లభిస్తుంది. ►అధిక బరువు తగ్గుతారు. ►కొవ్వు కరిగి పోతుంది. ►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ►చర్మం కాంతివంతంగా మారుతుంది. ►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..
సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీకి చెందిన యువరాజ్ (35) పాన్‌విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సోమవారం యువరాజ్ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్‌విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి. సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. -
డయాబెటీస్ ఉన్న వాళ్లు ఇవి తిన్నా ముప్పే!
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీసే ప్రధాన కారకాల్లో చక్కెర ఒకటి. అందుకే మధుమేహులు తాము తినే ఆహారాల్లో ఎంత చక్కెర ఉందని చెక్ చేస్తుంటారు. అయితే ఒక్క చక్కెర మాత్రమే కాదు.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగేందుకు దారి తీసే పదార్థాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే ఈ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ప్యాక్ చేసిన స్నాక్స్: ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా డయాబెటీస్‌కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిని శుద్ధి చేసిన పిండితో తయారు చేయడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుతాయి. అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా ఉండటం మేలు. అంతగా తినాలనిపిస్తే.. వీటికి బదులుగా గింజలు లేదా మొలకలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్: పండ్లలో ఎక్కువ మొత్తంలో తీపి ఉంటుంది. ఎండిన పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో 115 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది మామూలు ద్రాక్షలో కంటే చాలా ఎక్కువ. ఒకవేళ ఎండు పండ్లను తినాలనుకుంటే చక్కెర తక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. ఆల్కహాల్ పానీయాలు: ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెరతోపాటు పిండిపదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు బీర్, వైన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణుల సలహా. మధుమేహులు ఆల్కహాలిక్ పానీయాలు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి. పండ్ల రసం: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా. పండ్ల రసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పండ్ల రసాలలో బయటినుంచి కలిపే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. అందువల్ల పండ్లరసాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..వీటిని తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది. వేపుళ్లు: వేయించిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అలాగే కొవ్వులు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైంపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు: వైట్బ్రెడ్, పాస్తా, మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ధి చేసిన పిండితో తయారు చేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. పోషకాలు అసలే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తినడం చాలా మంచిది.