రోగుల సౌలభ్యం కోసం కాంటినెంటల్ ఆస్పత్రి ప్రయోగం.. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో..
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకూ మధుమేహం సమస్య పెరుగుతోందని, అదే విధంగా ఈ వ్యాధిపై అపోహలు కూడా పెరుగుతున్నాయని కాంటినెంటల్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అపోహలను దూరం చేసేందుకు, డయాబెటిస్‌పై అవగాహన కలి్పంచేందుకు.. కాంటినెంటల్ ఆస్పత్రి దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ప్రత్యేక చానల్ రూపొందించినట్టు తెలిపారు. గురువారం ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా ఈ చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చానల్ ద్వారా వ్యక్తిగతంగా పౌష్టికాహార చిట్కాలు, నిపుణుల సూచనలు, డయాబెటిస్ కేర్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని గురు ఎన్ రెడ్డి చెప్పారు.
30 ఏళ్ల క్రితం మహిళల్లో 12 శాతం ఉన్న డయాబెటిస్ ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని, పురుషుల్లో 11 శాతం ఉండగా 23 శాతానికి పెరిగిందని వివరించారు. చాలామందికి కనీసం డయాబెటిస్ వచి్చనట్టు (సైలెంట్ డయాబెటిస్) తెలియట్లేదని వెల్లడించారు. దీన్ని సరిగ్గా అంచనా వేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే ఆరోగ్యకరమైన జీవన విధానంతో దీనిని అధిగమించవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చని గురు ఎన్ రెడ్డి చెప్పారు. వాట్సాప్ చానల్‌లో డయాబెటాలజిస్టుతో పాటు న్యూట్రిషనిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు సహా అనేక మంది వైద్య నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment