దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాక తీసుకువెళ్తాయి. యూఎస్‌లోని ఓ మహిళ అలాంటి ఘోర అనుభవమే ఎదుర్కొంది. డయాబిటిస్ కోసం వాడే మందులు ఇంతటి చేటు తెచ్చిపెడతాయిన అస్సలు ఊహిచలేదని వాపోయింది.
వివరాల్లోకెళ్‌తే..టెక్సాస్‌కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టైప్ 2 డయాబెటిస్‌కి డ్రగ్ ఓజెంపిక్ మందులను వాడుతుంది. దీని వల్ల ఆమె విపరీతమైన దుష్పరిణామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి. జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది.
ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్ర విజర్జనకు వెళ్తున్న ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తాళలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున విలపించింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు. ఆ మందుని వాడటం ఆపేసినప్పటికీ ఇంకా ఆ డ్రగ్ తాలుకా దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెబుతోంది.
ఇంతకీ ఓజెంపిక్ దుష్పరిణామాలను ఎందుకు కలిగిస్తుందంటే..
సెమాగ్లుటైడ్ అని పిలిచే ఓజెంపిక్ ఊబకాయం, ఇతర బరువు సంబంధిత వైద్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ దీని సిఫార్సు చేయమని ఆమోదించింది. ఇది గ్లూకాగాన్‌లాంటి పెప్టైడ్-1 లేదా జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్‌లను సక్రియం చేసి సహజంగా సంభవించే హర్మోన్ జీఎల్‌పీ-1 ప్రభావాన్ని పెంచుతుంది. ఈ జీఎల్‌పీ -1 శరీరంలో బహుళ విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే హార్మోన్ అయిన గ్లూకాగాన్ విడుదలను తగ్గిస్తుంది. జీఎల్‌పీ-1 గ్రాహకం మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. కడుపు ఖాళీ అయ్యే రేటును పెంచి బరువు తగ్గేలా చేస్తుంది.
ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికను ఇచ్చింది. ఐతే ఈ ఔషధం మానవులలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబసభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది.
(చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..)
Comments
Please login to add a commentAdd a comment