weight
-
మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! కనీసం తండ్రి శవాన్ని..!
బరువు తగ్గడం అతి పెద్ద టాస్క్‌లా ఉంది. ఎందుకంటే డెస్క్ జాబ్‌లు కావడంతో నూటికి తొంభైతొమ్మిది మంది అధిక బరువు సమస్యతో అల్లాడిపోతున్నారు. తినేది ఏం లేకపోయిన అధిక బరువు భారంగా మారి ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని మంచి ఆహారపు అలవాట్లతో సరైన విధంగా చెక్‌పెట్టొచ్చని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ విధంగా చేసి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు చేరిపోయాడు. అతడి వెయిట్ లాస్ జర్నీ చూస్తే నోటమాటరాదు. ఇంత అధిక బరువుని ఎలా తగ్గించుకున్నాడ్రా బాబు అని ఆశ్చర్యపోతారు. మరి అదెలాగో చూద్దామా..ఇన్స్టాగ్రామ్ యూజర్ అజార్ హసన్ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీతో నెట్టింట వైరల్‌గా మారాడు. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎంటీవీ రోడిస్ సీజన్20లో కనిపించిన ఈ ఫిట్నెస్ ఔత్సాహికుడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియో రూపంలో షేర్ చేయండంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిస్టోరీ సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తిని రగిలించింది. ఏకంగా అన్ని కిలోలు బరువుని తగ్గించుకోవాలంటే ఎంతో నిబద్ధత అవరం అంటూ అతడిపై ప్రశంసలతో మంచెత్తారు నెటిజన్లు. ఆ వీడియోలో హసన్ తాను ఒకప్పుడు 145 కిలోల అధిక బరువుతో ఎలా ఉండేవాడో చూపించారు. తన శరీర కొవ్వు శాతం సుమారు 55% ఉండేదని చెప్పారు. తన వెయిట్‌లాస్ జర్నీతో దాన్ని దాదాపు 9% వరకు తగ్గించుకోగలిగానని అన్నారు. ఇప్పుడు 75 కిలోలు బరువు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బరువు తగ్గించే ఈ జర్నీలో తండ్రే తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ఎలాగైన బరువు తగ్గుతానని ఛాలెంజ్ చేసినట్లు చెప్పారు. అలా తాను ఏడు నెలల్లో మొత్తం కొవ్వుని కోల్పోయి..దాదాపు 55 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీని చూడకమునుపే తండ్రి మరణించినట్లు వెల్లడించారు. అంతేగాదు తన తండ్రి శవాన్ని ఖననం చేసే నిమిత్తం సమాధిలోకి దించలేకపోయినట్లు వివరించారు. అప్పుడే తనకు ఈ అధిక బరువుతో చాలా ఇబ్బందులు తప్పవని తెలిసిందన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతలా తాను బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Azhar hassan (@fitflashh) (చదవండి: నాజూకు నడుము కోసం ఏకంగా పక్కటెముకలనే..!) -
బ్యాగ్ బరువు తగ్గేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం రోజైనా.. చిన్నారుల భవితవ్యంపై చర్చ జరగాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. కంప్యూటర్ల కాలంలోనూ బ్యాగ్‌ల బరువు మోత తప్పడం లేదంటున్నారు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్నిచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికీ దూరమవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇదీ మన చిన్నారుల పరిస్థితి.. కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం..70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయసులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వసాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తు భవనాల్లో ప్రైవేట్ స్కూళ్లుంటున్నాయి. బరువు వేసుకొని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి. ఏవీ ఆ రూల్స్...? పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలంది. ఇలాంటి పరిస్థితి మరే దేశంలోనూ లేదని బరువులపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువుల వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కేలేదు. భుజాలు నొప్పిగా ఉంటాయి రోజూ 40 పుస్తకాలను స్కూలుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఉంటాయి. లంచ్ బాక్స్, నీళ్లబాటిల్ అన్నీ బ్యాగులో ఉంటాయి. మూడు అంతస్తులు బరువు వేసు కొని ఎక్కాలి. భుజాలు నొప్పిగా ఉంటాయి. –సుంకర నవీన్, ఐదవ తరగతి కూకట్పల్లి మానసికోల్లాసం ముఖ్యం చదువుతో పాటు చిన్నారుల్లో మానసిక ఉల్లాసం పెంచాలి. అప్పుడే వారిలో ఆలోచన శక్తి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ పుస్తకాలతో బోధన ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం పుస్తకాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇలా చెబితేనే మంచి విద్య అని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. – పణితి రామనాథం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బరువు తగ్గించాల్సిందే పుస్తకాల బరువు వల్ల అనారోగ్య వాతావరణం కనిపిస్తోంది. బోధన విధానంలో ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అధిక బరువుల మోతను అరికట్టే యంత్రాంగం ఉండాలి. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల మానసిక వ్యథపై ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు -
వీపు ‘మోత’ మోగుతోంది
దాదర్: విద్యార్ధులు మోస్తున్న బరువైన స్కూలు బ్యాగుల వల్ల వారికి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆర్థోపెడిక్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలా సందర్భాల్లో విద్యార్ధుల కంటే వారి సంచీ బరువే ఎక్కువగా ఉంటోందని ఇది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్, స్పైన్ సర్జన్ డాక్టర్ సమీర్ రూపరేల్ పేర్కొన్నారు. పది మంది విద్యార్ధుల్లో ఎనిమిది మంది భుజం, వెన్ను, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, ప్రతీరోజు అన్ని సబ్జెక్టుల అచ్చు, నోటు పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఓ అధ్యయనంలో తేలిందని, కాబట్టి సాధ్యమైనంత వరకు సంచీ బరువు తగ్గించే ప్రయత్నం చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు... విద్యార్ధుల బ్యాగుల బరువు తగ్గించే విషయంపై అనేక సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి. స్కూలు సంచీల బరువు మోయలేక విద్యార్ధుల వెన్ను వెనక్కు వాలిపోతోంది. వెన్ను నొప్పితో సతమతమవుతూ చికిత్స చేయాల్సిన పరిస్థితులు కూడా చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. బ్యాగు బరువు తగ్గించే విషయంపై అన్ని పాఠశాలల యాజమాన్యాలు స్పందించాలని సూచించింది. టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని హోంవర్క్ మినహా ఇతర నోటు పుస్తకాలు తరగతి గదిలోనే భద్రపరచుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ అన్ని తరగతి గదుల్లో ర్యాక్‌లు నిరి్మంచడం లేదా అందుబాటులో ఉండేలా చూడాల్సిరావడం ఒకింత భారం కావడంతో అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అటకెక్కించాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్ధులు అన్ని నోటు, అచ్చు పుస్తకాలను మోసుకెళ్లడంవల్ల బ్యాగు బరువు ఎక్కువవుతోంది. దీనికి తోడు ఒక్కో సబ్జెక్టుకు ఒక అచ్చు పుస్తకం, రెండు నోటు పుస్తకాలు, ఒక వ్యాసం లేదా గ్రామర్ పుస్తకం, ఇలా కనీసం నాలుగైదు పుస్తకాలుంటున్నాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి సుమారు 20–25 పుస్తకాలను రోజూ మోయాల్సి రావడం వల్ల విద్యార్ధులు వెన్ను, నడుం భుజాల నొప్పితో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువుకంటే 15 శాతం తక్కువగా ఉండాలి. ఒకటి, రెండో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు కేజీ, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధుల బరువు మూడు నుంచి నాలుగు కేజీల మధ్య ఉండాలి. ఇక తొమ్మిది, పదో తరగతి విద్యార్ధుల బ్యాగు బరువు సుమారు ఐదు కేజీల కంటే ఎక్కువ ఉండరాదని సమీర్ రూపరేల్ తెలిపారు. కానీ అనేక కారణాల వల్ల పరిమితిని మించి విద్యార్థులు స్కూ లు బ్యాగుల బరువును మోస్తున్నారని దీనివల్ల వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విపరీతమైన బరువు కారణంగా విద్యార్ధులు పూర్తిగా ఎదగలేక పోతున్నారని ఈ కారణంగా వారు నిలుచునే భంగిమలో కూడా మార్పు వస్తోందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో వారికి మరింత ఇబ్బంది కలిగే ప్రమాదముందని రూపరేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!
నిజ జీవితంలో బరువు తగ్గి చూపించిన వ్యక్తుల స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబ్బా ఎంతలా అంకుంఠిత దీక్షతో బరువు తగ్గారు అనే ఫీల్ వస్తుంది. గ్రేట్ అనిపిస్తుంది కూడా. బరువు తగ్గాలనేకునే వాళ్లు ముఖ్యంగా డైట్లో షుగర్‌కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు తగ్గాడు. అదెలా అనే కదా..!. అలా ఎలా సాధ్యమయ్యింది? నిజంగానే ఐస్‌క్రీం తింటూనే బరువు తగ్గాడా అంటే..?.ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైటింగ్ స్లైల్ ఉంటుంది. ఇక్కడ మిట్ సునాయ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరిలో తాను అధిక బరువు ఉన్నట్ల గుర్తించినట్లు తెలిపాడు. అలాగే వైద్యపరీక్షల్లో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని తెలియడంతో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకోసం సరైన జీవనశైలిని పాటిచడం తోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పాడు. రెగ్యులర్‌గా వ్యాయామం, అన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకునేలా మనసును సిద్ధం చేసుకుని డైట్ ప్రారంభించినట్లు తెలిపాడు. అయితే తన బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడింది నడక అని చెబుతున్నాడు. తాను రోజూ పదివేల అడుగులు వేసేలా చూసుకునే వాడట. అలా అన్ని స్టెప్లు నడిస్తేనే.. ఐస్‌క్రీం తినాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు వివరించారు. అలా అందుకోసమైన ఏ రోజు స్కిప్ చేయకుండా చేయగలిగానని చెబుతున్నాడు సునాయ్. ఆ విధంగా దాదాపు 150 రోజుల్లో అంటే.. ఐదు నెలల్లో సుమారు 16 కిలోలు పైనే బరువు తగ్గగలిగానంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే డైట్లో ముఖ్యంగా తాను ఇష్టపడే దాల్, రోటీ, అన్నం, పండ్లు, పిజ్జా, పాస్తా, పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, శాండ్విచ్లు, స్మూతీస్ వంటివి అన్ని మితంగా తీసుకునేవాడనని అన్నాడు. ఇక్కడ మనకిష్టమైన ఫుడ్‌ని దూరం చేయకుండానే అవి తింటునే వర్కౌట్లతో కెలరీలు తగ్గించుకుంటూ బరువు తగ్గొచ్చని చెబుతున్నాడు మిట్ సినాయ్. బరువు తగ్గడం అంటే నోరు కట్టేసుకోవాల్సిందే అని భయపడే వాళ్లకు సునాయ్ వెయిట్ లాస్ స్టోరీ ఓ ఉదహరణ.(చదవండి: కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఇలా..!) -
ఆరునెలల్లోనే 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు..ఏం చేశాడంటే..?
ప్రపంచంలోనే అత్యంత బరువుగా ఉన్న రెండో వ్యక్తిగా ఖలీద్ బిన్ మొహసేన్ షరీ అనుహ్యంగా కిలోల కొద్ది బరువు తగ్గాడు. అదికూడా స్వలం కాలంలోనే అన్ని కిలోలు బరువు తగ్గి ఆశ్యర్యపరిచాడు. అంతలా బరువు తగ్గినందుకు గానూ ఖలీద్ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసి తన బరువుని తగ్గించుకున్నాడు. అందుకు సౌదీ అరేబియా రాజు ఎలాంటి సాయం అందించాడు తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఒకప్పుడూ సజీవంగా ఉన్న అత్యంత బరువైన రెండో వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్ సుమారు 546 కిలోల బరువు తగ్గాడు. 2013 వరకు ఖలీద్ బరువు 610 కేజీలు ఉండేవాడు. ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధారపడే స్థాయికి అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్ దుస్థితిని చూసి చలించిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్లిఫ్ట్ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ని ఉపయోగించి రియాద్‌లోని షహద్ మెడికల్ సిటీకి తీసుకొచ్చారు.కఠినమైనమైన ఆహార నియమావళితో చికిత్సను ప్రారంభించారు. దీన్ని అమలు చేసేలా సుమారు 30 మంది వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. అంతేగాదు ఖలీద్ చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్సైజ్ ప్లాన్, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్లు వంటివి అందించారు. ప్రముఖ నిపుణులు సాయంతో ఖలీద్ బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూశాడు. అంతేగాదు ఖలీద్ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం బరువును కోల్పోయాడు. చెప్పాలంటే 2023 నాటికి 542 కేజీలు తగ్గి ఆరోగ్యకరంగా 63.5 కిలోలకు తగ్గాడు. ఇక్కడ ఖలీద్ అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది. ఎందుకంటే కొత్త శరీర ఆకృతికి అనుగుణంగా చర్మం ఉండదు. అంతేగాదు ఖలీద్‌ని వైద్యులు "ది స్మైలింగ్ మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు.(చదవండి: ఫుడ్ మెమొరీస్.. విభజన టైంలో ఈ వృద్ధుల ‘చేదు’ అనుభవాలు!) -
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం. ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆ పాత్ర కోసం కేజీఎఫ్ హీరో సాహసం.. అదేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం. -
జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!. ఇన్సులిన్ నిర్వహణ: ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు.. రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది. ద్రవాలను కోల్పోతుంది.. రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ ప్రభావం దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం. (చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్) -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో బరువు తగ్గలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినపుడు 65 కేజీల బరువు ఉండగా ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు. రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని, షుగర్ లెవెల్స్ మాత్రం హెచ్చుతగ్గులకు గురవతున్నాయని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయిన మార్చ్ 22 నుంచి బుధవారం(ఏప్రిల్ 3) వరకు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బరువులో ఎలాంటి మార్పు లేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి.. అవమానించేందుకే అరెస్టు చేశారు -
దీర్ఘకాలికంగా డయాబెటిస్ మందులు వాడుతున్నారా?
దీర్ఘకాలికి వ్యాధుల కోసం వాడే మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాడక తప్పదు. కొన్ని వ్యాధులైతే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓ పట్టాన తగ్గవు. అలా వాడటంతో ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వ్యాధులకు వాడిన మందులు మాత్రం విపరీతమైన దుష్పరిణామాలు చూపించి మనిషిని చావు అంచులదాక తీసుకువెళ్తాయి. యూఎస్‌లోని ఓ మహిళ అలాంటి ఘోర అనుభవమే ఎదుర్కొంది. డయాబిటిస్ కోసం వాడే మందులు ఇంతటి చేటు తెచ్చిపెడతాయిన అస్సలు ఊహిచలేదని వాపోయింది. వివరాల్లోకెళ్తే..టెక్సాస్‌కు చెందిన అమెరికన్ ప్రొఫెసర్ టైప్ 2 డయాబెటిస్‌కి డ్రగ్ ఓజెంపిక్ మందులను వాడుతుంది. దీని వల్ల ఆమె విపరీతమైన దుష్పరిణామాలను ఎదుర్కొంది. ఒక్కసారిగా ఆకలిని తగ్గించేసింది. దీంతో బరువు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె బాడీలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయాయి. జీర్ణక్రియను నెమ్మదించడంతో ఇతరత్ర దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇదికాస్త డిప్రెషన్ యాంగ్జయిటీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా ఆమె చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమైంది. మూత్ర విజర్జనకు వెళ్తున్న ప్రతిసారి విపరీతమైన నొప్పి బాధ తాళలేకపోయింది. ఇంతలా ఈ మందు నా శరీరంపై ప్రభావం చూపిస్తుందని అనుకోలేదని బోరున విలపించింది. దీంతో ఆమె వైద్యుడు ఆ మందులను సిఫార్సు చేయడం ఆపేశాడు. ఆ మందుని వాడటం ఆపేసినప్పటికీ ఇంకా ఆ డ్రగ్ తాలుకా దురద, మూత్ర విసర్జన నొప్పి ఇంకా పోలేదని చెబుతోంది. ఇంతకీ ఓజెంపిక్ దుష్పరిణామాలను ఎందుకు కలిగిస్తుందంటే.. సెమాగ్లుటైడ్ అని పిలిచే ఓజెంపిక్ ఊబకాయం, ఇతర బరువు సంబంధిత వైద్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ దీని సిఫార్సు చేయమని ఆమోదించింది. ఇది గ్లూకాగాన్లాంటి పెప్టైడ్-1 లేదా జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్లను సక్రియం చేసి సహజంగా సంభవించే హర్మోన్ జీఎల్పీ-1 ప్రభావాన్ని పెంచుతుంది. ఈ జీఎల్పీ -1 శరీరంలో బహుళ విధులను నిర్వర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే హార్మోన్ అయిన గ్లూకాగాన్ విడుదలను తగ్గిస్తుంది. జీఎల్పీ-1 గ్రాహకం మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికను తగ్గిస్తుంది. కడుపు ఖాళీ అయ్యే రేటును పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. జంతువులలో ఈ డ్రగ్‌ని ప్రయోగిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికను ఇచ్చింది. ఐతే ఈ ఔషధం మానవులలో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ మాత్రం అరుదైన జన్యు పరిస్థితి ఉన్నవారు, లేదా కుటుంబసభ్యులకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు ఈ మందుని సిఫార్సు చేయకూడదని పేర్కొంది. (చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..) -
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..!
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..! -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
సమీరా ఆ సమస్యతోనే బాధపడింది..అదేదో జన్మహక్కు అన్నట్లు..
తెలుగు తమిళ, బాలీవుడ్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సమీరా రెడ్డి సైతం ఆ సమస్యతో బాధపడిందట. జనాలంతా అదేదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తూ ఆ సమస్య గురించి తెగ మాట్లాడతారని మండిపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా ఆ సమస్యను ధైర్యంగా ఫేస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలో చూద్దాం! ఇంతకీ సమీరా ఏ సమస్యతో బాధపడిందంట?..అధిక బరువు. ఆమె ప్రసవానంతరం బయటకి రావడానికే ఇబ్బంది పడిందట. అనుకోకుండా ఓ రోజు తన బాబుతో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లితే అక్కడ సెక్యూరిటీ గార్డు ఆమె ఆధార్ కార్డుని తనిఖీ చేస్తూ చేసిన కామెంట్‌ని తానస్సలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటి మేడం మరీ ఇంత లావయ్యి పోయారు అంటూ జాలిగా చూసిన చూపు గుర్తొస్తే ఒళ్ల మండిపోతుందంటూ వాపోయింది. మహిళ శరీరాల గురించి కొందరూ అదెదో తమ జన్మహక్కు అన్నట్లు కామెంట్లు చేస్తారు. ఇది ప్రకృతిసహజంగా జరిగే మార్పులు కొన్ని ఉంటాయని అర్థం చేసుకోరు, తెలుసుకోరు అని తిట్టిపోసింది. ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటివి మరి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇలాంటప్పుడూ మన ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వాటన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. జన్మనిచ్చే తల్లుల పట్ల గౌరవం లేకపోయిన పర్లేదు కానీ సహజంగా స్త్రీ తల్లి అయ్యాక వచ్చే శరీర మార్పులను ఎగతాళి చేయొద్దని చెబుతోంది. అదేసమయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరూ తల్లి అయ్యాక కూడా స్లిమ్‌గా ఉండొచ్చు కానీ అలా అందరికీ సాధ్యం కాదని, అందరీ శరీర నిర్మాణాలు ఒకే రీతిలో ఉండవని గుర్తించాలని చెప్పింది. సమీరా 2014లో అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఈ జంటకు 2015లో కొడుకు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. ఇక ఇలాంటి సమస్యలు సమీరా లాంటి సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఫేస్ చేసేదే. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే.. మన అమ్మమ్మ, నానమ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చు. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు.. సాధారణంగా ప్రసవించిన మహిళలు సాధారణంగా లావుగా కనిపిస్తారు. తగ్గడం కూడా అంత ఈజీగా ఉండదు. ఓ పక్క పిల్లలను చూసుకోవడంతో బిజీగా ఉండటంతో శరీరంపై దృష్టిపెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు ఒళ్లు తగ్గించుకోవాలంటే వాము నీళ్లే చక్కటి పరిష్కారం. గర్భధారణ సమయంలో కూడా వీటిని తాగొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యల్ని అధిగమిస్తుంది. అతిసారం, మలబద్దకాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో ఏర్పడిన అదనపు కొవ్వుని కరిగించడంలో సాయం చేస్తుంది. ప్రతిరోజు మీ డైట్ లో వామ్ము నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే నాజూకైన అందం మీ సొంతం అవుతుంది. ఈ నీళ్ళు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక కప్పు పాలల్లో పావు టీస్పూన్ జాజికాయ పొడి కలిపి మరిగించి, గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేస్తే చాలా సులభంగా ప్రసవానంతరం వచ్చిన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!
ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదని అందరికీ తెలిసిందే. పైగా మలబద్దకం ఉండదని తేలిగ్గా ఆహారం జీర్ణం అవుతుందని ఉదయాన్నే గోరువెచ్చగానో లేదా చల్లగానో నీళ్లు తాగుతున్నారు. ఐతే ఆ నీళ్లనే ఔషధ గుణం గల నీళ్లుగా తయారు చేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఔషధం గుణాలు గల నీళ్లు అంటే ఏమిటి? ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం!. ఎలా ఔషధ గుణాలు గల నీళ్లుగా మార్చాలి? తెల్లవారుజామునే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇది అద్భుత ఔషధ గుణాలను అందిస్తుంది. పాన్‌లో ఒక గ్లాసు నీటిని పోసి వేడి చేసి దానికి ఒక అంగుళం బెల్లం వేసి కరిగాక చల్లార్చి వకట్టి త్రాగాలి. లేదా బెల్లం ముక్క ప్లేస్‌లో బెల్ల పొడిని కూడా ఉపయోగించొచ్చు. ఇలా నీళ్లను ఔషధ గణాల గల నీరుగా మార్చుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. బెల్లం జీవక్రియలను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. షుగర్ వల్ల బరువు పెరిగితే బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉండి శరీరం ఫిట్‌గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లం కండరాల బలానికి ఉపయోగపడుతుంది. మనం నిత్య జీవితంలో వినియోగించే బెల్లంతో కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ రీత్యా అంతా షుగర్‌నే ఎక్కువగా వాడేస్తున్నారు. అదీకాగా షుగర్ అయితే ఈజీగా నీటిలో కరిగిపోతుంది. దీంతో అందరూ దాన్నే ఉపయోగిస్తున్నారు. నిజానికి బెల్లం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమీ చక్కెరలో ఉండవు. బెల్లంలో ఉండే పోషక ప్రయోజనాలతో మరొకటి పోటీపడలేదంటే అతిశయోక్తి కాదేమో!. బెల్లంలోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల అనేక వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు) -
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్‌వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్‌లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
ఉపాసన బరువు పెరగకపోవడానికి కారణం..?
-
పెళ్లి అయితే బరువు పెరుగుతారా?
పెళ్లి తర్వాత బరువు పెరుగుతుంటారు చాలా మంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కనిపించేది కాదని, మానవ సమాజాల్లో ఎక్కడైనా పెళ్లి తర్వాత బరువు పెరగడం చాలా సాధారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత బరువు పెరగడం అనేది మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలో కొంచెం ఎక్కువ అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 8000 మందిపై జరిపిన పరిశోధన ప్రకారం పెళ్లైన ఐదేళ్ల తర్వాత ఆడవాళ్లు సరాసరిన 11 కిలోలు బరువు పెరగగా, పెళ్లి కాని ఆడవారు ఐదేళ్లలో సరాసరిన 7 కిలోలు మాత్రమే బరువు పెరిగారు. ఇదే సమయంలో పెళ్లైన మగవారు దాదాపు 7–8 కిలోలు మేర బరువు పెరిగినట్లు తెలిసింది. పైగా పెళ్లైన జంటలో ఒకరు బరువు పెరిగితే మరొకరు బరువు పెరిగే అవకాశాలు 37 శాతం అధికమని తేలింది. ఇందుకు కారణం జంటలో ఒకరి అలవాట్లు మరొకరికి తొందరగా సోకడమే. అంటే ఒకరికి ఎక్కువ తినే అలవాటుంటే వారి భాగస్వామిలో కూడా తినే అలవాటు బాగా పెరుగు తుందన్నమాట. అలాగే పెళ్లి తర్వాత బంధువుల ఇళ్లలో విందులు, సొంతింట్లో కొసరి కొసరి తినిపించుకోవడాలు.. ఇలా తెలియకుండానే జంట బరువు పెరుగుతారు. పెళ్లి కానంత వరకు శరీర సౌందర్యం పై శ్రద్ధ పెట్టిన వాళ్లు జంటగా మారిన తర్వాత ఇద్దరిలోనూ పెరిగే భద్రతా భావం కారణంగా శరీరంపై కొంతమేర అశ్రద్ధ వహించడం జరుగుతుంది, దీనితోపాటు పైన చెప్పినట్లు తినడం పెరగడం వల్ల కూడా క్రమంగా లావవుతారు. ఈ ప్రక్రియను అడ్డుకోవాలంటే కలిసి తిన్నట్లే కలిసి ఎక్సర్సైజులు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
చాలా చాలా పెద్ద గ్రాములు: క్వెట్టా అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు, మరి రొన్నా అంటే..
భూమి బరువు ఆరు రొన్నా గ్రాములు... గురుగ్రహం బరువు రెండు క్వెట్టా గ్రాములు ..ఇదేంటి అంతంత పెద్ద గ్రహాల బరువులు గ్రాముల్లోనా? అనిపిస్తోందా.. అవి ఉత్త గ్రాములు కాదు.. ‘చాలా చాలా పెద్ద గ్రాములు’.. మరీ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్ల సంఖ్యల్లో ఏం చెప్తాంలే అన్న ఉద్దేశంతో.. శాస్త్రవేత్తలు ఇలా కొత్త ప్రామాణిక సంఖ్యల పేర్లను సిద్ధం చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అతిపెద్ద సంఖ్యల అవసరంతో.. ఇంటర్నెట్ డేటా గానీ.. వాతావరణం, అంతరిక్ష విశేషాలుగానీ.. కంప్యూటర్లు చేసే లెక్కల లెక్కగానీ అతి పెద్దవి. ఏవైనా కోట్ల కోట్లలో చెప్పుకోవాల్సినవి. ఇలా చెప్పుకోవడం కష్టం. అతిపెద్ద డేటా పెరిగిపోతుండటంతో సులువుగా పిలవడం, లెక్కగట్టడం కోసం శాస్త్రవేత్తలు అతిపెద్ద సంఖ్యలకు పేర్లు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ‘ప్రపంచ వెయిట్స్ అండ్ మెజర్స్’ జనరల్ కాన్ఫరెన్స్‌లో రెండు అతిపెద్ద, మరో రెండు అతిచిన్న సంఖ్యలకు పేర్లను ఆమోదించారు. ‘బేస్’ కొలతలకు అదనంగా.. దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న మెట్రిక్ విధానంలో కొన్ని ప్రధాన కొలతలు ఉన్నాయి. బరువుకు గ్రాములు, దూరానికి మీటర్లు, సమయానికి సెకన్లు, ఉష్ణోగ్రతకు కెల్విన్, వెలుగు తీవ్రతకు క్యాండెలా వంటివి ‘బేసిక్’ కొలతలు. వీటికి అదనపు సంఖ్యా పదాలను జోడించి వినియోగిస్తుంటారు. ఉదాహరణకు వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అన్నమాట. అతిపెద్దవి.. అతి చిన్నవి.. ప్రస్తుతం కొత్తగా అమల్లోకి తెచ్చిన అతిపెద్ద సంఖ్యల పేర్లు రొన్నా, క్వెట్టా.. అతి చిన్న సంఖ్యల పేర్లు రొంటో, క్వెక్టో.. ►రొన్నా అంటే ఒకటి పక్కన 27 సున్నాలు. అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు. ►క్వెట్టా అంటే ఒకటి పక్కన 30 సున్నాలు. అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు. ►రొంటో అంటే పాయింట్ పక్కన 26 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో పది లక్షల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట. ►క్వెక్టో అంటే పాయింట్ పక్కన 29 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట) ►ఇప్పటివరకు ప్రత్యేకమైన పేరు పెట్టి వినియోగిస్తున్న అతిపెద్ద సంఖ్య యొట్టా (ఒకటి పక్కన 24 సున్నాలు – అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లు).. అతి చిన్న సంఖ్య యొక్టో (పాయింట్ పక్కన 23 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య – అంటే ఒకటిలో.. వెయ్యి కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట). ఈ సంఖ్యల పేర్లను చివరిసారిగా 1991లో ఖరారు చేశారు. తాజాగా దీనికన్నా పెద్దవాటిని ఓకే చేశారు. ఈ సంఖ్యలతో వేటిని కొలుస్తారు? ఉదాహరణకు అణువులు, పరమాణువులు, వాటిలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వంటి వాటి బరువు గ్రాములో కోట్ల కోట్ల వంతు ఉంటుంది. మరోరకంగా చెప్పాలంటే కొన్ని లక్షలకోట్ల కోట్ల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలిపినా ఒక గ్రాము బరువు ఉండవు. మరి వాటిలో ఒకదాని బరువును చెప్పేందుకు వీలయ్యేవే అతి చిన్న సంఖ్యలు. ఇక గ్రహాలు, నక్షత్రాల బరువులు, ఖగోళ దూరాలు వంటి అత్యంత భారీ కొలతల కోసం పెద్ద సంఖ్యలను వాడుతారు. ఉదాహరణకు.. ►ఒక హైడ్రోజన్ పరమాణువు బరువు సుమారు రెండు యొక్టో గ్రాములు ►ఒక ఎలక్ట్రాన్ బరువు రొంటోగ్రాము కంటే కూడా కాస్త తక్కువ. ►అదే సూర్యుడి బరువు సుమారు 20 లక్షల రొన్నా గ్రాములు. లేదా రెండు వేల క్వెట్టా గ్రాములు అన్నమాట. (3.3 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అవుతాడు మరి) -
మేం ఎంత మంది ఉన్నామో చూశారా..
భూమ్మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. వాటినెలా లెక్కేస్తాం? అని ఎదురు ప్రశ్నిస్తారు. మరి భూమ్మీద ఎన్ని చీమలున్నాయని అడిగితే మీ సమాధానం? మళ్లీ ఇంకో పిచ్చి ప్రశ్న అని తీసిపారేయవద్దు. ఎందుకంటే... జర్మనీలోని జులియస్ మాక్స్మిలియన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమల సంఖ్యను మాత్రమే కాదు.. వాటన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే ఎంత బరువు ఉంటాయో కూడా లెక్కలేసి తేల్చేశారు మరి!! కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. భూమ్మీద మొత్తం చీమల సంఖ్యపై ఇప్పటి వరకూ సరైన అంచనా ఏదీ లేకపోవడంతో జర్మనీ శాస్త్రవేత్తలు లెక్కలేసేందుకు నడుం బిగించారు. అంతేకాదు.. చీమల సంఖ్య అడవుల్లో ఎంత ఉంటుంది? ఎడారుల్లోనైతే ఎంత? తేమ ఉన్నచోట?... నగరాల్లో? ఇలా రకరకాల జీవావరణ వ్యవస్థల్లో చీమల ఉనికి ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు వీరు అందుబాటులో ఉన్న పరిశోధన వ్యాసాలన్నింటినీ జల్లెడ పట్టారు. ఈ అంశంపై ఇప్పటివరకూ ప్రచురితమైన సుమారు 489 అధ్యయనాల సారాంశాన్ని వడపోసి ‘‘ఈ భూమ్మీద మొత్తం 20 క్వాడ్రిలియన్ల చీమలున్నాయి’’ అని తేల్చారు! అంటే 20 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట(200 కోట్ల కోట్లు). దీన్నే మరోలా చెప్పాలంటే విశ్వం మొత్తమ్మీద ఉన్న నక్షత్రాలకు 2 వేల రెట్ల ఎక్కువ సంఖ్యలో చీమలున్నాయట! అక్కడ ఒక్క చీమా లేదు! ఎన్ని ఉన్నాయో తెలిసింది! బరువెంతో కూడా స్పష్టమైంది. మరి.. ఏ ప్రాంతంలో ఎక్కువ చీమలు ఉన్నాయి? ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఈ ప్రశ్నలకూ జర్మనీ శాస్త్రవేత్తలు సమాధానాలు కనుగొన్నారు లెండి. భూమధ్య రేఖకు 10 డిగ్రీలు పైన, కింద ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో చీమలు పుట్టలు పుట్టలుగా ఉంటే.. నగర ప్రాంతాల్లో అతితక్కువగా ఉన్నాయట. ధ్రువ ప్రాంతాల్లో ఒక్క చీమ కూడా లేదట. అధ్యయనం ఎందుకంటే.. చీమల లెక్కలేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు శ్రమ పడ్డారన్న సందేహం వచ్చిందా? అయితే ఇవి చేసే పనులు తెలిస్తే శాస్త్రవేత్తలు సరైన పనే చేశారని మీరే అంటారు. ఎందుకంటే.. ఒక్కో హెక్టారు నేల నుంచి చీమలు ఏటా 13 టన్నుల మట్టిని అటూఇటు మారుస్తుంటాయట! నేల లోపలి పోషకాలను పైపొరల్లోకి చేర్చడం ద్వారా పంట దిగుబడులను ప్రభావితం చేస్తూంటాయట!! అలాగే విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకు చేర్చడంలోనూ చీమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్యాట్రిక్ షూల్థెసిస్ వివరించారు. బరువు అతి భారీగానే.. గండుచీమ, నల్లచీమ, ఎర్ర చీమలన్నింటి సంఖ్యపై ఓ స్పష్టత సాధించిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఆ తరువాత వాటి మొత్తం బరువును అంచనా వేశారు. వేర్వేరు ప్రాంతాలు, జీవావరణ వ్యవస్థల్లోని చీమల రకాలను.. వాటి సగటు బరువులను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. వాటి మొత్తం బరువు కోటీ ఇరవై లక్షల టన్నులని తేలింది! భూమ్మీద ఉన్న అన్ని పక్షులు, మానవులను మినహాయించి మిగిలిన క్షీరదాల మొత్తం బరువు కంటే చీమల బరువే ఎక్కువ కావడం గమనార్హం. -
‘బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు’
భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ...తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా ఆయన బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి... ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ...సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
Online Classes: నాన్నా.. ఓ చిప్స్ ప్యాకెట్.. అడ్డూ అదుపూ లేకుండా తింటే...
‘ఏమైనా చేసి పెట్టనా?’ ఆన్లైన్ క్లాసుల పేరుతో కంప్యూటర్‌కో, టీవీలకో అతుక్కుపోయిన పిల్లలను తల్లులు అడిగే ప్రశ్న ఇది. ‘ఆన్లైన్ క్లాసప్పుడు తినడానికి కాస్తా చిప్స్ ప్యాకెట్ తీసుకురా డాడీ..’ ఇదీ.. బయటకెళ్ళే తండ్రి వద్ద పిల్లల గారాబం. రెండూ కాదనుకుంటే ఆన్లైన్ తిండి ఎలాగూ ఉంది. ఆకలితో సంబంధం లేకుండా టైమ్ పాస్ కోసం అన్నట్టుగా ఫోన్లోనే ఏ ఫుడ్ డెలివరీ సంస్థలోనో నూడుల్సో, పిజ్జానో, బర్గరో ఆర్డర్ ఇచ్చేయడమే. అడ్డూఅదుపూ లేకుండా తీసుకునే ఆహారం వల్ల భవిష్యత్‌లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ (కొవ్వుతో కూడిన కాలేయం), మధుమేహం వంటి సమస్యలతో పాటు బాలికల్లో హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. మొత్తం మీద ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు చిరుతిళ్లు పెరుగుతున్నాయి. స్కూలుకు పంపేప్పుడు లంచ్ బాక్స్ కట్టిస్తే సరిపోయేది... ఇప్పుడు అస్తమానం ఏదో ఒకటి చెయ్యక లేక కొనివ్వక తప్పడం లేదని తల్లులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌కి ఇవి అదనం అన్నమాట. వరసబెట్టి తీసుకునే ఈ అదనపు తిండి పూర్తిగా అనవసరం అని ఆహార నిపుణులు చెబుతున్నారు. పైగా చిప్స్, నూడుల్స్ వంటి మసాలా జంక్ ఫుడ్స్ దీర్ఘకాలంలో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. పాఠశాలలకు వెళ్లే సాధారణ రోజుల్లో మితాహారం తీసుకునే విద్యార్థి, ఇంటి దగ్గర ఆన్లైన్ చదువప్పుడు అవసరానికి మించి తినేస్తున్నాడని, అదీ జంక్ పుడ్ కావడం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. జీర్ణకోశం జర జాగ్రత్త.. సాధారణంగా రోజూ తీసుకునే ఆహారం కన్నా... ఆన్లైన్ క్లాసుల సమయంలో విద్యార్థులు రెండు రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన న్యూట్రిషనిస్టు శ్రావణి తెలిపారు. తన దగ్గరకొచ్చిన పిల్లల నుంచి ఈ వివరాలు సేకరించినట్టు ఆమె చెప్పారు. ఇందులో ఎక్కువ ఆయిల్‌తో ఆహారం, జంక్ ఫుడ్స్ ఉంటున్నాయని తెలిపారు. దీనివల్ల తక్షణ జీర్ణ సమస్యలే కాదు... దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ►విద్యార్థులు తీసుకునే ఆయిల్, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల స్వల్ప కాలంలోనే ఎసిడిటీ బారినపడుతున్నారు. రసాయనాలతో నిల్వ ఉంచిన చిప్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలకు లోనవుతున్నారు. ►దినచర్యలో మార్పులు రావడం, ఆలస్యంగా నిద్రలేవడం, హడావిడిగా ఆన్లైన్ క్లాసుల కోసం కంప్యూటర్లకు అతుక్కుపోవడం వల్ల పీచు ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీని బదులు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవన్నీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు దారి తీస్తున్నాయి. ►మసాలాలు తినడం వల్ల పేగుల్లో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నిద్ర పోవడానికి ఉపయోగపడే రసాయనాల ఉత్పత్తిని మందగింపజేస్తాయి. ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ మంట, తొందరగా అలసిపోవడం దీనివల్లేనని అంటున్నారు. ►5 ఏళ్లలోపు పిల్లల్లో నడవడిక (బిహేవియర్) సంబంధమైన సమస్యలుంటున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, సామాజిక వ్యవస్థతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని మానసిక వైద్య నిపుణులు తెలిపారు. నిద్రలేకపోవడం, సెల్‌ఫోన్‌తో ఆడుకోవాలన్పించడం, ఏ చిన్నదానికైనా చికాకు పడటం కన్పిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. ఆకలేసినప్పుడే ఆహారం ఇవ్వాలి పిల్లలకు ఆకలేస్తుందనుకున్నప్పుడే ఆహారం ఇవ్వాలి. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే తాజా పండ్లు అలవాటు చేయడంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటు చిన్నచిన్న శారీరక శ్రమ కల్గించే ఆటలు ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఆన్లైన్ పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్స్ వస్తుల ముందే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి టీవీ చూడకుండా చేయాలి. షటిల్, క్యారమ్స్ వంటి మానసిక ఉల్లాసం కల్గించే ఆటలపై దృష్టి మళ్లించాలి – డాక్టర్ ఉపేందర్ షావా (పిల్లల జీర్ణకోశ వ్యాధుల నిపుణులు) చేసి పెట్టక తప్పట్లేదు మా పాప ఆన్లైన్ క్లాసులప్పుడు ఏదో ఒక చిరు తిండి కావాలంటుంది. రోజుకు రెండు మూడుసార్లు ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందే. లేదంటే కొనివ్వాల్సిందే. మంచిది కాదని తెలిసినా తçప్పడం లేదు. స్కూలుకు పంపితే లంచ్‌తో సరిపెట్టేవాళ్ళం. కాకపోతే అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేవాళ్ళం. – ఎం.శ్వేత (9వతరగతి విద్యార్థిని తల్లి, ఖమ్మం) -సాక్షి, హైదరాబాద్ చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట!
Govt Reduced to LPG Cylinder Weight: గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఇది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు అంశం కాదండోయ్. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ బరువుగా ఉండటంతో వాటిని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి జరపాలని అనుకున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతకు ముందు, భారీ సిలిండర్ బరువు కారణంగా మహిళలకు కలిగే అసౌకర్యం గురించి ఒక సభ్యుడు ప్రస్తావించారు. "మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బందిపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. దాని బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నామని" కేంద్రమంత్రి తెలిపారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును ఐదు కిలోలకు తగ్గించడం లేదా మరేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. (చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు!) -
మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?
మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్‌తో మరోసారి కొలవండి. ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. -
పొట్టు తీయని ధాన్యంతో బరువు పెరుగుతారా?
పొట్టు తీయని ధాన్యాలను (హోల్ గ్రేయిన్స్‌ను) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న విషయం తెలిసిందే. ఇక ఇదే అంశం ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిధకులు. పొట్టు ఉన్న కారణంగా హోల్ గ్రెయిన్స్ జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి. ఫలితంగా ఇన్సులిన్ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు పెరగకుండా ఉండే మరో ప్రయోజనమూ ఉంటుందట. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నిరూపితమైన ఈ అధ్యయన ఫలితాలను ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. చదవండి: ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే! -
5 ఏళ్ల బాలుడికి రోజురోజుకూ పెరుగుతున్న 'తల'
ఇందూరు: నిరుపేద కుటుంబంతో విధి ఆటలాడుతోంది. ఐదేళ్ల బాలుడికి ‘తల’కు మించిన భారం తెచ్చి పెట్టింది. అనుకోని వ్యాధి అతడ్ని రాకాసిలా పట్టి పీడిస్తోంది. తమకు కలిగిన సంతాన్ని చూసి ఆనందించాల్సిన తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. పిల్లాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీకాంత్, హారిక 2016 మార్చి 1న ఇద్దరు కవల పిల్లలు జని్మంచారు. అయితే, నెలలు నిండక ముందే జని్మంచిన ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక 41 రోజులకు కన్నుమూశాడు. మిగిలిన ఒక్క బాబునైనా ప్రేమగా చూసుకోవాలని తపించిన తల్లిదండ్రులకు అనుకోని ఆపద వచ్చి పడింది. ముద్దుగా శివయ్య (శివ) అని పేరు పెట్టుకున్న బాలుడికి ఐదో నెల నుంచే తల భాగం అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. వైద్యం చేయడానికి ఏ డాక్టరూ ముందుకు రాలేదు. కొన్ని చోట్ల స్కానింగ్‌లు తీయించారు. ఏవో రాసిచ్చిన కొన్ని మందులు కూడా వాడారు. అయినా ఫలితం కనిపించ లేదు. రోజు రోజుకు నీరు చేరి తల భాగం మాత్రం పెరుగుతోంది. తల భారంగా మారడంతో బాలుడికి అవస్థ కూడా ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. పిల్లాడ్ని కాపాడాలని అక్కడి వైద్యులను ప్రాధేయపడ్డారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయడం వీలు కాదని, చేసినా ప్రయోజనం ఉండదని, ఉన్నన్ని రోజులు బాగా చూసు కోండని చెప్పి పంపించి వేశారు. ఏం జరిగినా ఫర్వాలేదని, ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా వైద్యులు ఒప్పుకోలేదు. శివయ్యకు ఎన్ని సమస్యలో.. ఐదేళ్ల బాలుడు శివయ్యకు తల భారంతో పాటు కళ్లు సరిగ్గా కనిపించవు. కాళ్లు, చేతులు కూడా సక్రమంగా పని చేయవు. నిలబెట్టే అవకాశం లేకపోవడంతో బాబుని ఎత్తుకోవడం, పడుకోబెట్టడం చేస్తున్నారు. ఆహారం కూడా ఏదీ తినడు. ద్రవ రూపంలో ఆహారం అందిస్తేనే జీర్ణం అవుతోంది. ఇందుకు కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని తినిపిస్తున్నారు. ఇదే ప్రతి రోజూ ఆహారంగా మారింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ డాక్టరు వైద్యం అందించడం లేదని, కనీసం మందులు కూడా రాసివ్వడం లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటి వరకు రూ.8 లక్షల పైనే ఖర్చు.. బాలుడి పరిస్థితిని చూసి అమ్మమ్మ అతడికి సపర్యలు చేస్తోంది. శ్రీకాంత్, హారిక దంపతులకు మరో సంతానం కలిగింది. మూడేళ్ల ఆ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, శివయ్యకు వచ్చిన వ్యాధిని నయం చేయించడానికి అప్పులు చేసి, బంగారం అమ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. రూ.8 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆదుకోవాలని దాతలను కోరుతున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం వచ్చి... శివయ్యకు ప్రభుత్వం అందించే దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని తండ్రి శ్రీకాంత్‌తో పాటు అమ్మమ్మ లక్ష్మి ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చారు. వీరిని ‘సాక్షి’ కదిలించగా తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరం సరి్టఫికెట్ కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న సదరం సెక్షన్ అధికారిని కలిశామని, సరి్టఫికెట్ ఇప్పించి పింఛన్ మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన అధికారులు సదరం సరి్టఫికెట్ ఇప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 75691 44233 చదవండి : (ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో కట్టేసి చిత్రహింసలు) (భూకంపం అనుకొని.. రోడ్లపైకి పరుగులు) -
ప్రెగ్నెన్సీకి ఎంత వెయిట్ ఉండాలి?
మేడం! నా వయసు 21 ఏళ్లు. ఎత్తు 5.5, బరువు 95 కిలోలు. నాకు ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. మా వాళ్లు నన్ను చాలా ప్రెషర్ చేస్తున్నారు. నేను, మావారు ప్రెగ్నెన్సీకి అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. అయినా ఫలితం కనిపించడం లేదు. నేను ఎక్కువ వెయిట్ ఉండటం వల్లనే ప్రెగ్నెన్సీ రావడం లేదా? ప్రెగ్నెన్సీకి ఎంత వెయిట్ ఉండాలో చెప్పండి.. ప్లీజ్. – అంజు సీపాన (ఈ–మెయిల్) నీ ఎత్తుకి, నువ్వు 57–61 కేజీల మధ్య బరువు ఉండాలి. కాని నువ్వు 95 కేజీలు ఉన్నావు అంటే నువ్వు దాదాపుగా 35కేజీల అధిక బరువు ఉన్నావు. నీకు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా? రావట్లేదా అనేది తెలియజేయలేదు. నీ వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాలు మాత్రమే. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ప్రెగ్నెన్సీ కంటే ఆరోగ్యంగా ఉండటానికి, ప్రెగ్నెన్సీ రావాలన్నా, అందులో కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలన్నా బరువు తగ్గడమే ప్రధానం. అధిక బరువు వల్ల హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అండం సరిగ్గా పెరగకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవచ్చు. మొదట నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అధిక బరువు వల్ల థైరాయిడ్ వంటి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకుని కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, గర్భాశయంలో సమస్యలు, అండాశయంలో సిస్ట్లు, నీటి బుడగలు (పీసీఓడీ) వంటి సమస్యలు, అండం పెరుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకోవడం మంచిది. ఆహారంలో అన్నం వంటి కార్బోహైడ్రేట్లు, స్వీట్లు, నూనె వస్తువులు, జంక్‌ఫుడ్‌లు బాగా తగ్గించి వీలైతే న్యూట్రీషనిస్ట్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు సక్రమంగా కొన్ని నెలల పాటు చేయడం వల్ల బరువు తగ్గి, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి చికిత్స తీసుకుని, తర్వాత గర్భం గురించి ఆలోచించడం మంచిది. బరువు తగ్గడం వల్ల హార్మోన్లు సక్రమంగా విడుదల అయ్యి, అండం పెరిగి, ఎటువంటి చికిత్స లేకుండానే 80–90 శాతం మందిలో ప్రెగ్నెన్సీ వస్తుంది. మిగతా 10–20శాతం మందిలో మందులతో ప్రెగ్నెన్సీ రావడానికి చికిత్స అవసరం పడవచ్చు. కాబట్టి నువ్వు ఉన్న 35కేజీలు అధిక బరువును తగ్గించడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో కనీసం 25కేజీల బరువన్నా తగ్గితే, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అధికబరువు మీద గర్భం వచ్చినా, చాలామందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గర్భం సమయంలో ఇంకా బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్ పెరిగి వాటివల్ల కాంప్లికేషన్స్ పెరగడం, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, కాన్పు సమయంలో సమస్యలు, తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నీ వయసు చాలా చిన్నదే, ప్రెగ్నెన్సీ కంటే ముందు బరువు తగ్గడం పైన శ్రద్ధ పెట్టడం మంచిది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
బరువులెత్తగలనే!
బరువులెత్తగలవా.. ఓ నారీ బరువులెత్తగలవా? అంటే.. బరువులెత్తగలనే అంటారు దిశా పటానీ. ఏంటీ.. ‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి..’ పాట గుర్తొస్తోందా? ఆ పాట గురించి పక్కన పెట్టి, దిశా గురించి చెప్పుకుందాం. ఈ బాలీవుడ్ బ్యూటీకి ఫిట్నెస్ మీద శ్రద్ధ ఎక్కువ. ఆమె సోషల్ మీడియాలో దాదాపు అన్నీ ఫిట్నెస్ పోస్ట్‌లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కువ బరువులు మోస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డ్‌ను తానే దాటేస్తుంటారు. తాజాగా 75 కేజీల బరువును ఎత్తారామె. ఆ వీడియోను పంచుకుంటూ, ఇదంతా నాకు ‘జస్ట్ పీస్ ఆఫ్ కేక్’ (ఇవన్నీ నాకు కేక్ వాక్ లాంటివి అనే ఉద్దేశంలో) అన్నారామె. ఇటీవలే సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు దిశా పటానీ. ప్రస్తుతం ‘కేటీనా’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
తినండి... బరువు తగ్గండి!
రంగు రంగుల్లో మెరిసే కూరగాయలకు మనిషి బరువును తగ్గించే శక్తి ఉంటుందట. పచ్చివే తినదగ్గ ఈ కూరగాయలు అదనపు కొవ్వులను తగ్గించి సన్నబరుస్తాయని అంటున్నాయి వివిధ అధ్యయనాలు. టమోటాలు, వివిధ రంగుల్లో లభించే బెల్ పెప్పర్, తాజా ఆకుకూరలకు బరువును తగ్గించే గుణాలుంటాయి. బఠానీలు, ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, కీరా, గుమ్మడికాయలు.. ఇలా మెరిసే రంగుల్లో ఉండేవి కూడా శరీర బరువును నియంత్రణలో ఉంచాలనుకొనే వారికి నేస్తాలు. అలాగే మిరపకు కూడా బరువును తగ్గించే గుణం ఉంటుందట! వివిధ రంగుల్లో లభిస్తున్న మిరపకాయల్లో బరువును తగ్గించే రసాయనా లుంటాయని గుర్తించారట. -
బరువు పెరిగితే రిస్కే
సాక్షి, అమరావతి: తాజా పరిస్థితుల్లో శరీర బరువు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాయామం చేసి శ్రమించడం వల్ల శరీరం అలసట నుంచి బయటపడాలి. కానీ.. మోయలేని భారంతో శరీరం ఎప్పుడూ శ్రమకు గురి కాకూడదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉంది. ఎత్తుకు మించి బరువు పెరిగితే ఆహార నియమాలు లేదా వ్యాయామం పాటించి జాగ్రత్త వహించాలి. తాజాగా కరోనా వచ్చే హై రిస్క్ కారణాల్లో ఊబకాయం ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ► తాజా గణాంకాల ప్రకారం మధుమేహం, హైపర్ టెన్షన్ తర్వాత ఊబకాయం హైరిస్క్ కేటగిరీలో ఉంది.బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం 25 కంటే తక్కువగా ఉంటే సరైన బరువున్నట్టు లెక్క. ► 30 కంటే ఎక్కువగా ఉంటే మెల్లిగా రిస్కులోకి వెళుతున్నట్టు సూచన. ► 35కు మించి ఉంటే బాగా రిస్కులో ఉన్నామని గమనించాలి. ► ప్రస్తుతం కోలుకుంటున్న వారిని పరిశీలిస్తే.. డయాబెటిక్, హైపర్ టెన్షన్, అధిక బరువు ఉన్న వారు కోలుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఊబకాయం ఉన్న వారిలో అవయవాలు (ఆర్గాన్స్) పరిమితంగా (రిజర్వుడుగా) పనిచేస్తాయి. -
లాక్‌డౌన్‌తో లావెక్కిన యువత
లండన్ : ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ప్రపంచ వైద్య నిపుణలు హెచ్చరించడం తెల్సిందే. కరోనా వైరస్ బారిన పడిన వారిలో సాధారణ ప్రజలకన్నా ముఖ్యంగా స్థూలకాయులు 40 శాతం ఎక్కువగా మరణించే అవకాశం ఉందని బ్రిటన్ ఎన్హెచ్ఎస్ కూడా హెచ్చరించింది. అయితే బ్రిటన్‌లో కరోనాను కట్టడి చేయడం కోసం విధించిన ఎనిమిది వారాల లాక్డౌన్ సమయంలో మూడొంతుల మంది బ్రిటిషర్లు లావెక్కారట. కనీసంగా మూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు బరువు పెరిగారని అంచనాలు తెలియజేస్తున్నాయి. (కరోనా కన్నా లాక్డౌన్ మరణాలే ఎక్కువ!) 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు పౌండ్లకొద్దీ బరువెక్కగా, 65 ఏళ్లు దాటిన వృద్ధులు వారిలో సగం బరువు ఎక్కారట. రెండు నెలల క్రితం కన్నా లాక్డౌన్ విధించాక తాము లావెక్కామని 60 శాతం మహిళలు, 57 శాతం మగవాళ్లు ఓ సర్వేకు తెలియజేశారు. వారిలో తాము సుష్ఠుగా భోజనం చేయడమే లావుకు కారణమని ప్రతి ముగ్గిరిలో ఒకరు తెలియజేయగా, మిగతా వారు శరీరానికి వ్యాయామం లేకపోవడమని చెప్పారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారిలో 37 శాతం మంది స్థూలకాయులు కాగా, 29 శాతం మంది గుండెపోటుతో బాధపడుతున్న వారు, 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?) -
జిమ్‌కు వెళ్లండి... మతిమరపును దూరం చేసుకోండి
మీరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి అక్కడ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాల వల్ల మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్‌మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి పెద్దవయసులోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వందలాది మంది పెద్దవయసు వారిపై చాలాకాలంపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. -
గర్భవతులు బరువు పెరుగుతుంటే?
ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం సాధారణంగా జరిగేదే. గర్భధారణ సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల బరువు వరకు పెరుగుతారు. అయితే ఎవరెవరు ఏ మేరకు, ఎంతెంత బరువు పెరగడం ఆరోగ్యకరం అన్నది... గర్భం దాల్చక ముందు వారెంత బరువున్నారన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు ఎంత బరువున్నారు, అది ఆరోగ్యకరమైన పరిమితేనా అన్నది... వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) మీద ఆధారపడి ఉంటుంది. బరువును కేజీల్లో తీసుకుని, దాన్ని మీటర్లలో వారి ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్యను ‘బీఎంఐ’ అంటారు. (కిలోగ్రామ్స్/ మీటర్స్ స్కే్కర్). ఇలా లెక్కవేయగా వచ్చిన ఈ సంఖ్య 18 కంటే తక్కువగా ఉంటే... వారిని తక్కువ బరువువారిగా(అండర్‌వెయిట్‌గా) వర్గీకరించవచ్చు. అలాగే ఈ సంఖ్య 18.5 నుంచి 24.9 వరకు ఉంటే వారిని సాధారణ బరువు ఉన్నవారిగా చెప్పవచ్చు. అదే 25 నుంచి 29.9 వరకు ఉంటే వారిని ఎక్కువ బరువు ఉన్నవారిగానూ (ఓవర్ వెయిట్), 30 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయులుగానూ (ఓబేస్గా) చెప్పవచ్చు. వీరిలో బరువు తక్కువగా ఉన్నవారు ప్రెగ్నెన్సీ టైమ్‌లో 15 కిలోల వరకు పెరిగినా పర్లేదు. కానీ స్థూలకాయులు మాత్రం తమ బరువు పెరుగుదలను 5 నుంచి 9 కిలలో లోపే పరిమితం చేసుకోవడం మంచిది. సగటున చూస్తే గర్భంతో ఉన్నప్పుడు మహిళలు సాధారణంగా వారానికి 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు. ఇక వేవిళ్లతో బాధపడుతూ తరచూ వాంతులు చేసుకునేవారు 20 వారాలలోపు ఒక్కోసారి అసలు బరువే పెరగకపోవచ్చు.ఇలా బరువు పెరగకపోవడం కూడా వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకూ (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు. శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గర్భవతులు ఇద్దరికోసం తినాలంటూ చాలామంది వారిని ఒత్తిడి చేస్తుంటారు. నిజానికి కడుపులోని బిడ్డ తన ఆహారాన్ని తల్లినుంచి ఎలాగైనా గ్రహిస్తుంటాడు. కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. అంటే బరువు తక్కువగా ఉన్నవారు మినహా మిగతా వారంతా ఇద్దరి కోసం తినడం అన్నది సరికాదని గ్రహించాలి. ఇది బరువును పెంచి, ముప్పునూ పెంచుతుంది. -
బరువు తగ్గించే అలోవెరా
అలోవెరా సౌందర్య సాధనంగానే కాదు, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దానికి మరికొన్ని ఇతర పదార్థాలు జతకూడితే మరింత బాగా పని చేస్తుంది. అవేమిటో చూద్దాం. గ్రీన్ టీలో ఒక స్పూన్ అలోవెరా జ్యూస్ కలపాలి. అవసరమనుకుంటే దీనికి చెంచా తేనె, నిమ్మరసం చేర్చవచ్చు. దీనిని రోజూ పరగడుపున ఒక కప్పు, పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగుతుండాలి. ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండుస్పూన్ల అలోవెరా జ్యూస్ కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే శరీరం బరువు తగ్గడం ప్రారంభిస్తుంది. -
సాహో సగ్గుబియ్యమా...
సాగో అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి సగ్గుబియ్యం. వీటిని కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారు చేస్తారు. సగ్గుబియ్యాన్ని పాయసంగా, ఉప్మాగా తయారు చేసుకుని తింటారు. జావగా కాచుకుని కూడా తాగుతారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం. ఇందులో పిండిపదార్థం శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని సహజమైన తీపి గుణం ఉండటం వల్ల చాలమంది సగ్గు బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. కండరాల పెరుగుదలకి సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. వీటిలో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే సత్తువ వస్తుంది. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచి.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ కె మెదడుకి మంచిది. -
ఈ సమయంలో బరువు పెరగొచ్చా?
నా వయసు 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. బాగా సన్నగా ఉంటాను. బరువు పెరగాలనుకుంటున్నాను. ఈ సమయంలో బరువు పెరగవచ్చా? ‘యావరేజ్ వెయిట్’ ఎంత ఉండాలి? ‘మార్నింగ్ సిక్నెస్’తో బాధపడుతున్నాను. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? – కె.శ్రీదేవి, రాజంపేట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం దాల్చినప్పుడు ఉండే బరువును బట్టి నెల నెలా ఎంత పెరగాలనేది సూచించడం జరుగుతుంది. సాధారణ బరువు ఉన్నవాళ్లకి నెలకు రెండు కిలోల వరకు బరువు పెరగవచ్చని చెప్పడం జరుగుతుంది. మీరు మరీ సన్నగా ఉన్నారంటున్నారు కాబట్టి నెలకు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు బరువు పెరగవచ్చు. మొత్తం మీద తొమ్మిది నెలల వ్యవధిలో ఏవరేజ్‌గా పన్నెండు కిలోల వరకు పెరగవచ్చు. మీరైతే పదిహేను కిలోల వరకు పెరగవచ్చు. మొదటి మూడు నెలలు వాంతులు, వికారం వల్ల కొంతమంది సరిగా తినకపోవడం వల్ల కొందరు బరువు తగ్గిపోతారు కూడా. మార్నింగ్ సిక్నెస్ అంటే గర్భిణిలలో మొదటి మూడు నెలలో ఎక్కువగా విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్ వల్ల పొద్దున్నే లేచిన వెంటనే వికారం, నీరసం, వాంతులు, తలతిప్పడం వంటివి ఉండటం. వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మజ్జిగ, పెరుగు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో డాక్సినేట్, జన్డాన్సెట్రాన్ వంటి మాత్రలు వాడుకోవచ్చు. అవసరమైతే సెలైన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది. మెనోపాజ్ నలభై ఏళ్ల కంటే ముందు కూడా వచ్చే అవకాశం ఉందని విన్నాను. ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు. – బి.సునీత, సంగారెడ్డి సాధారణంగా మెనోపాజ్ 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు. కొందరిలో 40 ఏళ్ల లోపే రావచ్చు. దీనిని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. జన్యుపరమైన కారణాల వల్ల, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, పిల్లల కోసం ఎక్కువగా మందులు వాడటం, అండాశయాలపై ఆపరేషన్లు, కడుపులో కణితులకు, క్యాన్సర్‌కు రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి చికిత్సలు తీసుకోవడం, ఇంకా ఎన్నో తెలియని ఇతర కారణాల వల్ల ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రావచ్చు. ఇది రాకుండా ఉండటానికి మనం ఏమీ చెయ్యలేం. కాకపోతే మరీ 40 సంవత్సరాలకే మెనోపాజ్ రావడం అంటే, అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవడం, క్యాల్షియం తగ్గిపోయి ఒళ్లు, నడుము, మోకాళ్ల నొప్పులు, కలయిక మీద ఆసక్తి లేకపోవడం, మూత్ర సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనికి ఆహారంలో ఎక్కువగా సోయాబీన్స్, ఆకుకూరలు, పండ్లు, పాలు, వాటి ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, గైనకాలజిస్టును సంప్రదించి ఫైటో ఈస్ట్రోజెన్ మాత్రలు, క్యాల్షియం, అవసరమైతే హార్మన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది. నా వయసు 27 సంవత్సరాలు. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి లేజర్ చికిత్స చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ టైమ్‌లో మంచిది కాదు అంటున్నారు. వ్యాక్సింగ్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. అయితే వ్యాక్సింగ్ కూడా మంచిది కాదని కొందరు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? మెడ, పొట్ట భాగం నల్లగా మారకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – విబీ, హైదరాబాద్ అవాంఛిత రోమాలను తొలగించుకునే ముందే అవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తున్నాయా, లేక పీసీఓడీ, అడ్రినల్ ట్యూమర్స్, ఒవేరియన్ ట్యూమర్స్ వంటి ఇతరేతర కారణాల వల్ల వస్తున్నాయా అనే విషయాన్ని పరీక్షలు చేయించుకుని కారణం తెలుసుకోవడం మంచిది. కారణం తెలుసుకోకుండా లేజర్ తీసుకున్నా, లోపల ఉన్న సమస్య వల్ల చికిత్సకు ఎక్కువ సిటింగ్స్ పట్టడం, కొంతకాలం తర్వాత మళ్లీ అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. వ్యాక్సింగ్ కేవలం తాత్కాలికమైనది. వ్యాక్సింగ్‌తో పోలిస్తే, లేజర్‌తో ప్రయోజనాలు ఎక్కువ. సమస్యకు తగిన చికిత్స తీసుకుంటూ లేజర్ చేయించుకోవడం మంచిది. మెడ మీద, పొట్ట మీద నలుపు చాలావరకు పీసీఓడీ సమస్యలో ఉంటుంది. దీనికి సంబంధించి డెర్మటాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. వీటిలో ముఖ్యంగా బరువు తగ్గడం, జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆహార మార్పులు ముఖ్యమైనవి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
మధురం శివమంత్రం... మరువకే ఓ మనసా!
‘‘కాశయ్యా...కాశయ్యా’’ అనే పిలువు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు కాశయ్య. అక్కడొక పండు వృద్ధుడు.‘‘ఏమిటయ్యా...బొడ్డు కోసి పేరు పెట్టినట్లు పిలుస్తున్నావు. నా పేరు నీకెలా తెలుసు?’’ఆశ్చర్యంగా అడిగాడు కాశయ్య.‘‘నీ తాత ముత్తాతలందరూ నాకు తెలుసు కాశయ్యా. తిన్నయ్య ఇల్లు తెలుసా నీకు?’’‘‘ఏ తిన్నయ్య?’’‘‘బోయ తిన్నయ్య. అతనికి నేను బంటుని’’ అన్నాడు ఆ వృద్ధుడు.‘‘బాగుంది బాగుంది...మూరెడు మనిషికి బారెడు బంటు. బోయవాడంటావు...వాడికి నువ్వు బంటునంటావు. భలే గమ్మత్తుగా ఉంది’’ అని వెటకారం చేశాడు కాశయ్య.‘‘అతని సేవకునిగా ఉండాలనినాకు బుద్ధి పుట్టింది. ఉంటాను. ఇందులో తప్పేముంది?’’ అని అడిగాడు వృద్ధుడు.‘‘అడవిలో అవి ఇవి కొట్టుకొని తినేవాడు నీకేం ఇవ్వగలడు తాతా?’’ అడిగాడు కాశయ్య.‘‘తనువు, మనసు అన్నీఇస్తాడు. అతనిలాగా కోట్ల మంది ఉన్నా...వాళ్లకు నేను సేవ చేస్తాను’’ వివరించాడు వృద్ధుడు.‘‘ధనం లేకుండా మనసు, తనువు ఉన్నా ఏం చేసుకుంటావు తాతయ్యా? కూర వండుకుంటావా?’’వెటకారంగా నవ్వాడు కాశయ్య. ‘‘ధనం ఎందుకు కాశయ్యా...అది ఇవ్వాళ ఉంటుంది. రేపు వెళ్లిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను...అయితే అతని ఇల్లు ఎక్కడ ఉందో తెలియదా? ఎవర్నైనా కనుక్కొని వెళతానులే...’’ అంటూ రెండడుగులు వేసి తుళ్లిపడబోయాడు తాతయ్య.‘‘అయ్యో పాపం ఈ వయసులో నీకు ఈ కష్టం ఏమిటి తాతయ్యా. ఏది అది నాచేతికివ్వు’’ అని తాతయ్య నెత్తి మీద ఉన్న మూటను తీసుకోబోతుంటే...‘‘వద్దు బాబూ...వద్దు. ఎవరి బరువు వారే మోయాలి. ఒకరి బరువు ఇంకొకరు మోయడం సాధ్యమవుతుందా’’ అంటూ వారించబోయాడు తాతయ్య.కాశయ్య వింటేగా!‘‘ఫరవాలేదు, ఇవ్వు తాతయ్యా’’ అని తాతయ్య నెత్తి మీది మూటను తీసుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు.అంతే...బరువు భరించలేక ‘‘చచ్చాన్రోయ్’’ అని అరిచాడు. మూటను తిరిగి తాతయ్యకు ఇచ్చి...‘‘ఇదేమిటి! కైలాసపర్వతం ఎత్తిన రావణుడి పరిస్థితి అయింది నాకు. గుడ్లు ఊడి వచ్చాయి. చేతులు నొప్పెడుతున్నాయి’’ అన్నాడు బాధగా కాశయ్య.ఆ తరువాత...‘ఇంత బరువు ఉంది.ఏమిటున్నాయి ఇందులో?’’ అని అడిగాడు.‘‘బట్ట, పాత, ధనం, ధాన్యం, పాపం, పుణ్యం...ఇంకా ఏవేవో ఉన్నాయి. అందుకే వద్దని చెప్పాను’’ అన్నాడు ఆ పెద్దాయన.‘‘పాపం, పుణ్యమా!’’ ఆశ్చర్యపోయాడు కాశయ్య.‘‘నువ్వు చూస్తే మనిషి మాత్రుడిలా లేవు. నీపేరేమిటి తాతయ్యా?’’ అని అడిగాడు కాశయ్య.‘‘ఈ పేదవాడి పేరుతో విలువ ఏముందయ్యా...ఈ లోకంలో చుట్టాలు,స్నేహితులు, నచ్చిన వాళ్లు నచ్చని వాళ్లు అందరూ...శివయ్య...శంకరయ్య...రుద్రయ్య అని పిలుచుకుంటారు. పాపం చేతులు నొప్పెడుతున్నట్లున్నాయి. పోతాయిలే’’ అంటూ బయలుదేరాడు తాతయ్య.‘‘ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది’’ అని ఆశ్చర్యపడేలోపే కాశయ్య చెయ్యినొప్పి క్షణాల్లో మాయమైపోయింది.‘‘శివయ్య...శంకరయ్య...రుద్రయ్య...ఏమీ అర్థం కాకుండా ఉంది’’ అన్నాడు అయోమయంలో నుంచి వచ్చిన ఆనందంతో! ‘‘అమ్మా...అమ్మా...’’‘‘ఎవరయ్యా?’’‘‘ఈ మూటను మీకు ఇవ్వమని పంపాడు మీ ఆయన. ఇందులో వడ్లు, ధాన్యం, బట్టలు, పండ్లు ఉన్నాయి. నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది. నేను వచ్చేసరికి కొత్త కోక కట్టుకోమని పదేపదే చెప్పాడు’’ అని చెప్పాడు తాతయ్య.‘‘గాలివానలో మా బావ ఏమయ్యాడో తెలియక అల్లాడుతున్న నా ఆరాటాన్ని తగ్గించావు. నువ్వు ఎవరు తాతయ్య?’’ అని అడిగింది ఆ ఇల్లాలు.‘‘మీ బావకు నేను బంటునమ్మా’’ అని చెప్పాడు తాతయ్య.‘‘బంటువా!’’ పెద్దగా ఆశ్చర్యపోయింది ఆమె!!‘‘కాశయ్యా...కాశయ్యా’’ అని అరుచుకుంటూ వస్తున్నాడు తిన్నడు. ‘‘బాబోయ్ భూతం’’ అని జడుసుకున్నాడు కాశయ్య.‘‘నేను భూతాన్ని కాదయ్యా...నిన్న నీ బోధనలు విని కండ్లు తెరిచినవాడిని. ఈ పామరుడికి ఈశ్వర మహిమ చూపించావు. జ్ఞానభిక్ష పెట్టావు. నువ్వు చెప్పినట్లే ప్రార్థించాను. రెండు కుందేళ్లు దొరికాయి. ఒక కుందేలు మాంసం కాల్చి ఈశ్వరుడికి పెట్టాను’’ అన్నాడు భక్తి నిండిన కళ్లతో తిన్నడు.‘‘అన్నట్లు నీ పేరేమిటి?’’ అడిగాడు కాశయ్య.‘‘తిన్నడు’’‘‘కోయతిన్నడా...నీకు ఆ శివయ్య సేవకుడిగా ఉన్నాడా?’’‘‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడా కాశయ్యా...అసలే నేను ఒక కటిక దరిద్రుడిని. నాకు సేవకుడు కూడానా! అతనే ఈశ్వరుడు. భిక్షగాడిలా నాకు రెండుసార్లు కనిపించాడు! పేరేమిటి? అని అడిగితే శివయ్య అని చెప్పాడు. నేను తెలుసుకోలేకపోయాను. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్లాం దగ్గరకు వచ్చి నా సేవకుడినని చెప్పినా పెళ్లానికి దర్శనం ఇచ్చి వెళ్లాడు’’ తన్మయంగా చెబుతున్నాడు తిన్నడు.‘‘మహానుభావా, నువ్వు చాలా ధన్యాత్ముడివి. కాశీ...నేనే ఈశ్వరుడినని చెప్పి ఉంటే నీ పాదాల దగ్గర పడి ఉందునే. నా మనసు తెలుసుకోలేకపోయావా’’ తనకు తారసపడ్డ తాతను గుర్తుచేసుకుంటూ అన్నాడు కాశయ్య.‘‘కాశయ్యా, విచారించకు. రా...గుడికి వెళదాం. అతనితో స్వయంగా మాట్లాడదాం. అతని కోసం చాలా చోట్ల వెదికాను. ఎక్కడా కనిపించలేదు. కాశయ్య ఈరోజు నుంచి నువ్వే నా గురువు’’ అన్నాడు తిన్నయ్య.‘‘మహానుభావా, పరమపాపాత్ముడైన కైలాసశాస్త్రి కొడుకుని. నేను నీకు గురువా?’’ బెరుగ్గా అన్నాడు కాశయ్య.ఆ తరువాత....‘‘దా...గుడికి వెళదాం. మహేశ్వరుడిని ప్రార్థిద్దాం.ఈరోజు నుంచి నువ్వే నేను. నేనే నువ్వు’’ అన్నాడు.శివాలయంలో..తిన్నడు పాడుతున్నాడు.... ‘మధురం శివమంత్రం...మరువకే ఓ మనసా’ -
బరువుకు.. బ్రేక్‌ఫాస్ట్‌కూ లింక్!
రోజులో అతిముఖ్యమైన ఆహారం ఉదయాన్నే తీసుకునే ఉపాహారమని చెబుతూంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇదేమంత మంచి సూత్రం కాదంటున్నారు మొనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఉపాహారం తినకపోతే ఆ తరువాత ఆకలి ఎక్కువై అవసరానికి మించి తింటారన్న గత అంచనాల్లో ఏమాత్రం నిజం లేదు. అలాగే ఆరోగ్యకరమైన బరువు ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్ అవసరమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయని.. తాము జరిపిన తాజా అధ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే జరిగిన 13 అధ్యయనాల వివరాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. వీటికి అదనంగా తాము అమెరికా, యూకేలకు చెందిన కొంతమందిపై కొన్ని పరిశోధనలు చేశామని బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారు మిగిలిన వారితో పోలిస్తే తేలికగా ఉన్నట్లు తెలిసింది. -
బడి బ్యాగుల భారం ఇక తేలిక!
వెన్నెముక విరిగేలా పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న బడి పిల్లలకు శుభవార్త! ఇక నుంచి అన్ని పుస్తకాలు, అంత బరువు మోయాల్సిన పనిలేదని, బరువును వెంటనే తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. స్కూలు పిల్లల తరగతుల వారీగా ఎంతెంత బరువుండాలో మార్గదర్శకాలు రూపొందించింది. సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: బడి పిల్లలకు పుస్తకాల బ్యాగుల బరువు భారం తగ్గనుంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏ తరగతి చదివే పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఎంత బరువు ఉండాలో నిర్ధారిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్కూల్స్‌లో నిర్ధారించిన బరువు కన్నా ఎక్కువ బరువు గల బ్యాగులను అనుమతించరాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధలు బేఖాతరు నిబంధనల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఆ విద్యార్థి శరీర బరువులో పదో వంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తున్న పాఠశాలలు తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యా శాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2006 చట్టం ఏం చెబుతోంది? పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2006లోనే చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఎలాంటి బరువులతో కూడిన పుస్తకాల సంచులను మోయకూడదు పై తరగతులకు చెందిన విద్యార్థులు తమ శరీర బరువులో పుస్తకాల సంచి బరువు పది శాతానికి మించకూడాదు రోజూ పాఠశాలకు తీసుకెళ్లాల్సిన పుస్తకాలపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు అవగాహనతో ముందుకెళ్లాలి ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను భద్రపరచడానికి ఏర్పాట్లు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా పుస్తకాలు ఉంచడానికి అరలు ఉండాలి. ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయని ప్రైవేటు పాఠశాలలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. రూ.3 లక్షలు అపరాధ రుసుము విధించవచ్చు. ఆదేశాలు పాటించకుంటే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయవచ్చు. బరువు సంచితో నష్టాలు పుస్తకాల సంచి భారంతో వంగి నడుస్తూ తరచూ తలెత్తి చూడడం వల్ల మెడనరాలపై భారం పడి నొప్పి వస్తుంది అధిక బరువు వల్ల సంచి భుజాలపై నుంచి కిందకి లాగేటట్లు వేలాడుతోంది. దీని వల్ల భుజాల నొప్పి వస్తుంది వంగి నడవడం వల్ల నడుము, దానికి కింది భాగం, వెన్నెముక దెబ్బతింటుంది మోకాలి నొప్పుల వల్ల రాత్రి వేళ సరిగా నిద్రపట్టదు. నరాలు లాగేసినట్లు అనిపిస్తుంది. తిమ్మిరి వచ్చి పట్టు కోల్పోతారు. బరువు సంచి మోయడం వల్ల పిల్లలు తొందరగా అలిసి పోతారు. దీని వల్ల చదువు పై ఏకాగ్రత పెట్టలేరు. ఆదేశాలివీ.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతుల పిల్లలకు పాఠశాలల్లో సంబంధిత భాష, గణితం మాత్రమే ఉండాలి. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వీటితోపాటు పరిసరాల విజ్ఞానం మాత్రమే ఉండాలి. విద్యార్థులను ఎలాంటి అదనపు పుస్తకాలను తెచ్చుకోవాలని చెప్పకూడదు. ఎన్సీఈఆర్టీ నిర్ధారించిన సబ్జెక్టులను మాత్రమే మూడు నుంచి ఐదో తరగతి పిల్లలకు బోధించాలి. కేంద్రం ఆదేశాల ప్రకారం పుస్తకాల సంచి బరువు ఇలా ఉండాలి.. తరగతి బరువు(కిలోలు) 1-2 1.5 3-5 2.3 6 -7 4 8-9 4.5 10 5 -
కండ కలిగితే కొవ్వు ఉండదోయ్
బరువుకు కరువు ఏర్పడాలంటే ఒళ్లు వొంచక తప్పదు. తినే ఆహారం, చేసే శ్రమ... ఇవే మన శరీరాన్ని అదుపులోనూ ఆరోగ్యంగానూ ఉంచుతాయి. అంతేకాదు మన మెటబాలిజం (జీవక్రియలు) కూడా చురుగ్గా ఉండాలి. వయసు పెరిగే కొద్ది మెటబాలిజం మందకొడిగా మారుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం వస్తుంది. వ్యాయామం ద్వారా జీవక్రియలను కూడా చురుగ్గా ఉంచి బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... జీవక్రియలు జరగాలంటే ఆహారంతో అందే శక్తి కావాలి. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... మనం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా శరీరంలో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఒంట్లోని కొవ్వులు దహించుకుపోతుంటాయి. దాన్నే రెస్టింగ్ మెటబాలిజమ్ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ విశ్రాంతిగా ఉన్నప్పుడు దహించుకుపోయే కొవ్వులు తగ్గుతుంటాయి. అందుకే ఓ వయసు తర్వాత బరువు పెరగడం మొదలవుతుంది. వ్యాయామంతో రెస్టింగ్ మెటబాలిజమ్‌లో చురుకుదనం పెరుగుతుంది. వయసుతో పాటు తగ్గాల్సిన రెస్టింగ్ మెటబాలిజమ్‌ను వ్యాయామం అలా స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఫలితంగా కొవ్వుల దహనమూ కొనసాగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వు పేరుకోవడం, కొవ్వులు పెరగడం జరగదు. దాంతో బరువు పెరగకపోవడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుంది.ఇలా వ్యాయామాలు బరువును తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి దోహదపడతాయన్నమాట. ఇన్ని రకాల వ్యాయామాలు ఎందుకు? ఇష్టం కదా అంటూ ఆహారంలో వరుసగా మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు లేదా ఏ పిండిపదార్థాలు తీసుకుంటూ ఉంటే బరువు పెరగడం ఖాయం. ఆహారాన్ని ఎలాగైతే భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే ప్రయోజనమో వ్యాయామాన్ని కూడా భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టే వ్యాయామాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కలిగించే ప్రధాన ప్రయోజనాల ఆధారంగా వ్యాయామాలను రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, కోర్ ఎక్సర్సైజెస్... ఇవన్నీ ఉన్నాయి. వీటిని మార్చి మార్చి చేస్తూ ఉంటే వ్యాయామాల్లోనూ సమతౌల్యత సాధించవచ్చు. ఎప్పటికీ బరువు పెరగకుండా ఒకేలా ఆరోగ్యంగా, ఫిట్‌గా, చురుగ్గా, ఆకర్షణీయంగా ఉండవచ్చు. ఇన్ని రీతులూ... ఎలా చేయాలి? వ్యాయామాలను గరిష్ట ప్రయోజనం కోసం మార్చి మార్చి చేయడాన్ని ‘ట్రైనింగ్ రెజీమ్’గా చెప్పవచ్చు. మొదట ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలను కనీసం 10, 15 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత డైనమిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్లోనే మధ్య మధ్య ఏరోబిక్ ప్రక్రియల్లో ముఖ్యమైన జాగింగ్‌ను కొనసాగించాలి. ఇలా చేయడం ద్వారా మీ వ్యాయామం సెషన్లో మీ గుండె వేగాన్ని పెంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా 72 సార్లు స్పందించే గుండె వేగాన్ని కనీసం 150 సార్లకు పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గుండె సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతాయి. (అయితే ఇందుకోసం క్రమంగా వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. గుండెకు కూడా ఇది మంచిది). కాస్త స్ట్రెచింగ్, ఆ తర్వాత ఏరోబిక్ చేసి, స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేస్తూనే మధ్య మధ్య ఏరోబిక్ వ్యాయామంగా జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలను కొద్ది నిమిషాలు కొనసాగిస్తూ... దాన్నే విశ్రాంతిగా పరిగణిస్తూ మీ మొత్తం అవిశ్రాంత వ్యాయామాన్ని కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు చేయాలి. తొలుత 30 నిమిషాలు చేస్తూ ఆ సమయాన్ని క్రమంగా 60 నిమిషాలకు పెంచవచ్చు. ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తిచేసేలా ఒంటికి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. మీరు జిమ్‌లోనే చేస్తున్నప్పుడు స్థలాభావం వంటివి ఉంటే స్ట్రెంగ్త్ వ్యాయామ రీతుల మధ్యన ప్రతిసారీ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఉన్నచోటే పరుగు పెట్టవచ్చు. సర్క్యూట్ ట్రైనింగ్‌కు డబ్బు ఖర్చవుతుందా? ఖర్చు : జిమ్‌లో చేరడం లేదా ఉపకరణాలు కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది. అంతగా ఖర్చు చేయలేమని అనుకున్నప్పుడు మీ సొంత శరీర బరువును ఉపయోగించి చేసే పుష్–అప్స్, సిటప్స్, పుల్–అప్స్తోనూ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. పరుగెత్తడానికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు కదా. సర్క్యుట్ ట్రైనింగ్ ఎలా మీకు అనువైన, సంతృప్తికరమైన రీతిలో ఉండే సర్క్యూట్‌ను మీరే రూపొందించుకోవచ్చు. కాస్త అనుభవం తర్వాత దేని తర్వాత ఏది చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందో మీరే నిర్ణయించుకొని దాన్ని కొనసాగించుకోవచ్చు. ఔట్డోర్స్లోమీకు జిమ్‌కు వెళ్లే అవకాశం లేదా స్తోమత లేకపోతే ఏదైనా స్కూల్ గ్రౌండ్ లేదా కాలేజీ గ్రౌండ్ లేదా స్థలం ఉంటే మీ ఇంటి పెరట్లోనూ మీరు వ్యాయామాలు చేయవచ్చు.వ్యాయామం చేయాలనే మనసుండాలేగానీ మార్గం ఉంటుంది. బరువూ తగ్గుతుంది. మెడికల్ ఖర్చులకు, మందులకు అయ్యే ఖర్చూ తగ్గుతుంది. కావాల్సిందల్లా కొంచెం సమయాన్ని మాత్రం ఖర్చు చేయడం. (మరికొన్ని వ్యాయామాలు వచ్చే వారం) ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు వీటినే స్ట్రెచింగ్ వ్యాయామాలు అని కూడా అంటారు. యోగాలోని ప్రాథమిక ఆసనాలన్నీ శరీరాన్ని స్ట్రెచ్ చేసే వ్యాయామంగా ఉపయోగపడతాయి. కాళ్లు చేతులు వేగంగా కదలడానికి, చేతులు చురుగ్గా ఉండటానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు దోహదపడతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి అవి వేగంగా ప్రతిస్పందించేలా చేస్తాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయకుండా అంటే సాగదీయకుండా అదేపనిగా బరువులెత్తే వ్యాయామాలు చేస్తే శరీరాకృతి కొంత ఆకర్షణీయం అవుతుందేమో కాని చురుకుదనం కలగకపోవచ్చు. తగినంత చురుకుదనంతో ఏ పనినైనా తేలిగ్గా, సులువుగా చేయగలిగితేనే కదా మనం చేసే ఆ పనికి విలువ. అందుకే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రధాన వ్యాయామాలకు ముందు కనీసం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామం సెషన్ పూర్తయ్యాక కూడా ఇవే వ్యాయామాలు కామ్డౌట్ వ్యాయామాలుగా చేయడం మరింత మంచిది. యోగా ప్రక్రియలు ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలుగా ఎంతగానో ఉపకరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు ఒంట్లో ఒత్తిడినీ, ఉద్విగ్నతనూ (స్ట్రెస్ అండ్ టెన్షన్‌ను) దూరం చేస్తాయి. అయితే కొంతమంది వీటిపై అంతగా దృష్టి పెట్టరు. పైగా చిన్నచూపు చూస్తారు. బ్యాలెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు సరిగ్గా సాగాలంటే శరీరం బ్యాలెన్స్‌లో ఉండాలి. కనుక శరీరాన్ని బ్యాలెన్స్ చేసే వ్యాయామాలు కూడా ముఖ్యం. ఒక కాలు ముడిచి ఒకే కాలిపై నిలబడటం, ఒంటి కాలిపై చేసే యోగాభ్యాసాలు, ఆసనాలు ఇందుకు ఉపకరిస్తాయి. ఇక ఒంటిని నియమబద్ధంగా ఒంచుతూ చేసే ‘టాయ్ చీ’ కూడా శరీరం బ్యాలెన్స్ తప్పకుండా చేస్తుంది. ఏరోబిక్ ఫిట్నెస్ వీటినే కార్డియో వ్యాయామాలు అనీ, ఎండ్యూరెన్స్ వ్యాయామాలు అని అంటారు. వీటిలో మనం శ్వాస తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నిండే గాలి పెరుగుతుంది. శరీరం తీసుకునే ఆక్సిజన్ పెరుగుతుంది. గుండె వేగం పెరిగి కణకణానికీ ఆక్సిజన్ అంది మనిషి స్టామినా పెరుగుతుంది. కాబట్టి చాలాసేపు పనిచేసినా అలసట రాని తత్వం అలవడుతుంది. సామర్థ్యం ఉంటేనే కదా ఏదైనా సాధించగలిగేది. సాధారణ వ్యాయామంతో మీరు 50 కిలోల బరువును ఎత్తగలరు. కానీ ఆ బరువును అలా ఎత్తి, ఇలా వదిలేస్తే లాభం ఏముంది? దానిని అరగంట పాటైనా మోసుకుంటూ రాగల సామర్థ్యాలు ఈ వ్యాయామాలతోనే సమకూరతాయి. కాళ్లూ చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్లాగా, డ్రిల్ తరహాలో చేయదగిన ఉత్సాహవంతమైన వ్యాయామాలు ఇవి. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, వాటర్ ఏరోబిక్స్ అన్నీ ఏరోబిక్ ప్రక్రియలే. కోర్ ఎక్సర్సైజెస్ నడుము ప్రాంతంలో అంటే పొట్ట, వీపు కింది భాగం (లోయర్బ్యాక్)లో ఉండే కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే రీతులను కోర్ ఎక్సర్సైజెస్ అంటారు. శరీరం పై భాగానికీ, కింది భాగానికీ మధ్య అనుసంధానంగా ఉండే భాగాలలోని ఉండే కండరాలను బలంగా చేసే వ్యాయామాలు ఇవి. ఈ కోర్ వ్యాయామాలను బ్రిడ్జెస్, ప్లాంక్స్, ఫిట్నెస్బాల్ వంటి ఉపకరణాలతో మరింత తేలిగ్గా చేయవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ రెజీమ్‌లో అందరికీ ఆసక్తి ఉండి, అందరూ చేయాలనుకునే ప్రధాన వ్యాయామ రీతులు ఇవే అని చెప్పవచ్చు. వీటి వల్ల మన ప్రధాన కండరాలు అయిన వీపు భాగంలోని ట్రెపీజ్, లాటిసిమస్ డార్సీ, ఛాతీ భాగంలో బలానికి సూచనగా కనిపించే పెక్టోరాలిస్ మేజర్, చేతుల కండలను చూపించే బైసెప్స్, సిక్స్‌ప్యాక్‌లో కనిపించే రెక్టస్ అబ్డామినిస్, తొడల్లో బలంగా కనిపించే క్వాడ్రసెప్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్... ఇవన్నీ శక్తిమంతం అయ్యి మంచి షేప్‌లో కనిపిస్తాయి. దాంతో మనిషి ఆకర్షణీయంగా ఆరోగ్యంగా అనిపిస్తాడు. బరువు తగ్గించడంతో పాటు మనిషిని అందమైన సౌష్టవానికి తెచ్చే వ్యాయామలు ఇవి. ఈ వ్యాయామాల్లో బరువులు, ఉపకరణాలు ఉపయోగిస్తారు. నియమబద్ధంగా, నిర్ణీతంగా చేస్తుంటారు. మరికొందరు జిమ్‌లో చేరి చేస్తారు. ఇంకొందరు పిచ్చిగా ఆకర్షితమై వీటికే కట్టుబడతారు. ఒంటి బరువునే ఆధారంగా చేసుకొని పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామ రీతులతోనూ వీటిని చేయవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్‌కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు.oobacolumn@gmail.com -
కదలండి.. తగ్గుదాం
కదలకపోవడం జడత్వం.కదలడం చైతన్యం.ఊబకాయం ప్రమాదకరమైన శారీరక అవస్థ.అదుపు తప్పిన బరువు అన్ని రుగ్మతలకు హేతువు.కాని ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంట్లోనూ బయటా డబ్బు ఖర్చు కాని పద్ధతిలో వ్యాయామం చేసి బరువు తగ్గవచ్చు.ఉత్సాహకరమైన శరీరమే ఉజ్వలమై భవిష్యత్తు.ఊబగా ఉన్న ఈ గతాన్ని వదిలేయండి.వెలుతురు నిండిన భవిష్యత్తు వైపు అడుగు వేయండి.కదలండి. బరువు తగ్గండి. ప్రమాదకరమైన వ్యాధులనగానే గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ అనుకుంటాం. కాని ఊబకాయం కూడా ప్రమాదకరమైన వ్యాధిలాంటిదే. ఈ వ్యాధికి విరుగుడు బరువు తగ్గడం. అందుకు సరైన మందు వ్యాయామం. దీని కోసం జిమ్‌లు, వ్యాయామశాలల్లో చేరనక్కర్లేదు. ఇంట్లో ఉంటూ బయట నడుస్తూ కూడా వ్యాయామాన్ని పూర్తి చేయవచ్చు. ఫలితంగా బరువు తగ్గవచ్చు. మేలు చేసే వ్యాయామం ► సమతుల ఆహారం తింటూ, సరైన వ్యాయామాలు చేస్తూ ఉంటే బరువు పెరుగుతుందనే భయమే ఉండదు. క్యాలరీల పట్ల మరీ అప్రమత్తంగా ఉండాల్సిన బాధ ఉండదు. రాబోయే వ్యాధులకు అడ్డుకట్ట వేసే శక్తి వ్యాయామానికి ఉంది. బీపీ, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలో ఉంచి గుండెపోటు రాకుండా నివారిస్తుంది వ్యాయామం. దీని వల్ల దేహం ఆరోగ్యవంతమై వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యాయామం ఎప్పుడు చేస్తామో అప్పుడు బరువు పెరగకుండా ఉంటుంది. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లు. ► వ్యాయామం చేయడం వల్ల జరిగే మేలైన ప్రయోజనం ఆత్మస్థైర్యం పెరగడం. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామానికి అనువుగా ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది. ► బరువు తగ్గేందుకే కాదు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా వ్యాయామం ఉపయోగపడుతుంది. జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. 30 నిమిషాలు తప్పనిసరి బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు సులువుగా చేయదగిన ఎరోబిక్ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి.. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివి. వీటిని వారంలో కనీసం మూడుసార్లు 30 నిమిషాల చొప్పున చేయాలి. బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం 30 నిమిషాల కన్నా అదనంగా చేస్తేనే అధిక బరువు తగ్గడం ప్రారంభిస్తారు. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు మోడరేట్ ఎక్సర్‌సైజులతో (ఆధునిక జీవనశైలిలో మార్చుకునేవి) బాడీని వార్మ్అప్ చేయాలి లేదా ఓ పదిహేను నిమిషాలు రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. దీని వల్ల 100 అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఆపై 30 నిమిషాల పాటు చేసే ఎరోబిక్ వ్యాయామాల వల్ల 700 క్యాలరీలు ఖర్చు అయ్యి, ఏడాది మొత్తంలో 5 కిలోల అదనపు బరువు తగ్గుతారు. గుండెవేగాన్ని లెక్కించాలి ఒకసారి వ్యాయామానికి అలవాటుçపడ్డాక ఆరోగ్యం బాగుంది అనే భావన కలిగి ఉత్సాహం వస్తుంది. దీంతో ఇంకాస్త అధిక తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకుంటారు. అవి ఎంత కష్టమైనవైనా చేయగలుగుతారు. మీ గుండెవేగాన్ని క్రమంగా పెంచుతూ తిరిగి నార్మల్ చేస్తూ వ్యాయం చేస్తే బరువు తగ్గుతారు. ఒక వ్యక్తి తన గుండె వేగాన్ని ఎంత వరకు పెంచాలో ఎలా తెలుస్తుంది?సులభం. మీ వయసును 220 నుండి తీసేసి, ఆ సంఖ్యను 70 శాతంతో లెక్కిస్తే ఎంత సంఖ్య వస్తుందో అంత సంఖ్యకు గుండె వేగాన్ని పెంచాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి 126 సార్లు గుండె వేగంగా కొట్టుకునే స్థాయికి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం వల్ల కలిగే ఫలితాలను మన శరీరం పొందాలంటే వ్యాయామంలో ఒక వేగం పాటించడం అవసరం. ఈ వేగం ద్వారా మన గుండె వేగాన్ని కూడా 135 – 150 స్పందనలకు పెంచాలి. ఆ హార్ట్‌బీట్‌ను కనీసం 40 నిమిషాల సేపు కొనసాగనివ్వాలి. ఒకే వ్యాయామ రీతిని 40 నిమిషాలపాటు కొనసాగినివ్వాలంటే విసుగ్గా అనిపించినప్పుడు వాకింగ్, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్.. ఇలా మార్చి మార్చి కూడా చేసుకోవచ్చు. బోర్ కొట్టకపోతే ఒకే వ్యాయామరీతిని కొనసాగించవచ్చు. వైద్యులను సంప్రదించాలా? మీకు బలమైన గాయాలు, మధుమేహం లేదా గుండె సమస్యలు ఉంటే వ్యాయామాలు ప్రారంభించడానికి ముందు జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని వివరించి, వారి సాయం తీసుకోవడం అవసరం. లేదా వారి సూచన ప్రకారం నిపుణులైన ఫిజియోథెరపిస్ట్ లేదా సర్టిఫైడ్ ఫిట్నెస్ నిపుణులను సంప్రదిస్తే మీకు సరైన వర్కవుట్స్‌ను నిర్ణయిస్తారు. ప్రతి ఇబ్బందికీ ఆల్టర్నేట్ వ్యాయామాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని చేయాలి. ఉత్సాహంగా చేస్తున్నారా? ఏ పనైనా ఇష్టంగా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నాక మీరు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ‘ఎస్’ అనే సమాధానం వస్తే మీరు ఎక్సర్‌సైజ్‌లను రోజూ చేయవచ్చు. ఎరోబిక్స్ ఎందుకంటే! చాలామంది రెగ్యులర్ జిమ్ వ్యాయామాల కంటే ఎరోబిక్స్ని ఇష్టపడతారు. కారణం దీంట్లో కష్టం అనిపించకపోవడం. పైగా, ఏ వ్యాయామాన్ని చేయాలనే నిబంధన ఎరోబిక్ ఎక్సర్‌సైజుల్లో ఉండదు. ► ఎరోబిక్ ఎక్సర్సైజులు మీ గుండెకు రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. ► వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివన్నీ చేసినంత ఫలితం ఎరోబిక్ ఎక్సర్‌సైజుల్లో కలుగుతుంది. అంతేకాదు– వర్కవుట్స్‌కి ట్రెడ్మిల్, ఎలిప్టికల్, స్టెయిర్ స్టెప్పెర్ వంటì ఫిట్నెస్ మిషనరీని ఉపయోగించినంత ప్రయోజనమూ చేకూరుతుంది. బరువుకు తగిన శిక్షణ అధిక కొవ్వును తొలగించడానికి, కండరాల వృద్ధికి పెద్ద ప్రయోజనం చేకూర్చేవి వర్కవుట్స్. అందుకు సుశిక్షితులైన నిపుణుల సాయం అవసరం. వీటిని వారానికి మూడుసార్లు చేయడం వల్ల ప్రధాన కండరాల సముదాయం బలపడుతుంది. అవి ఏంటంటే.. ► ఉదరం ► వీపు ► పిరుదులు ► మణికట్టు ► ఛాతీ ► ముంజేతులు ► మోకాలు ► తొడ ► భుజాలు ► బాహువులు ఆరోగ్యకర జీవన అలవాట్లు ► నడవడం లేదా ౖసైకిల్ తొక్కడం లేదా పని చేయడం లేదా పరిగెత్తడం ► లిఫ్ట్ లేదా ఎలివేటర్‌ని ఉపయోగించడానికి బదులు మెట్లు ఎక్కడం ► మీరు చేరుకోవాల్సిన చోటుకు నడవగలిగినంత దూరంలోని పార్కింగ్ ఏరియాలో మీ వాహనాన్ని పార్క్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లడం. రోజులో ఎన్ని క్యాలరీలు కావాలి? పురుషుడికైతే 2,200 క్యాలరీలు రోజుకు అవసరం. అదే మహిళకు 1,800 క్యాలరీలు అవసరం. ఇక కేలరీల ఖర్చు విషయానికొస్తే ఆడ–మగ ఇద్దరి పనులలో తేడాలు ఉంటాయి. అలాగే, ఒక గంటకు క్యాలరీ ఖర్చులో తేడాలుంటాయి. రోజూ చేసే పనుల వల్ల ఖర్చయ్యే క్యాలరీలు: ► బాడ్మింటన్ ఆడటం లేదా ఇంటిని శుభ్రపరచడం వల్ల గంటకు: 240 – 300 క్యాలరీలు ఖర్చు చేస్తారు. ► బ్రిస్క్ వాకింగ్ (12 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన), సైక్లింగ్, డ్యాన్సింగ్ (గంటకు) : 370 – 460 క్యాలరీలు ► ఫుట్‌బాల్ ఆడటం, జాగింగ్ (9 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన) లేదా స్విమ్మింగ్ : 580 – 730 క్యాలరీలు ► రన్నింగ్ (7 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన గంటకు) : 740 – 920 క్యాలరీలు ఇంటిని శుభ్రపరచడం ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఆ పనిలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కనుక హృదయ స్పందన వేగం పెరగదు. అందుచేత క్యాలరీల ఖర్చు తక్కువ ఉంటుంది. అదేవిధంగా, చాలా మంది ఒక సాధారణ నడకతో ఎక్కువ దూరం ప్రయాణించినప్పటికీ అవసరమైన తీవ్రత లేక హృదయ స్పందన రేటును చేరుకోక బరువు తగ్గరు. కాబట్టి, వ్యాయామం చేసే సమయంలో గుండె వేగం పర్యవేక్షించడం ముఖ్యం. ఎందుకంటే అధిక బరువు తగ్గాలంటే ఒక క్రమ తీవ్రతలో వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్‌లో ► అధికబరువు ఉన్నవాళ్లు ధూమపానం, మద్యపానం వెంటనే మానేయాలి. ► మీరు ఓ కొత్త వ్యాయామాన్ని ప్రారంభించినప్పుడు మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాలపట్ల శ్రద్ధ చూపడం ముఖ్యం. మీ ఫిట్నెస్ స్థాయి మెరుగుపరచడానికి మీతో మీరు ఢీకొనాలి. అయితే వ్యాయామ స్థాయిలను పెంచుతూ పోవడం వల్ల ఒక్కోసారి గాయపడవచ్చు. అందుకని నొప్పి, శ్వాసలో తేడాలు వచ్చినప్పుడు వ్యాయామం చేయడం ఆపేయాలి. ఇలాంటప్పుడు వ్యాయామం మరో ఎంపిక తీసుకోవచ్చు. ట్రెడ్మిల్, స్టెప్పర్స్, ఎల్లిప్టికల్స్ ఈ తరహా మెషిన్లు మంచి ఎరోబిక్ వ్యాయామాన్ని అందిస్తాయి. అయితే వీటిలో కూడా సత్ఫలితాలు దుష్ఫలితాలు ఉన్నాయి. ఈ మెషిన్లపై వ్యాయామం అత్యంత చురుగ్గా ఉంటుంది ఆనందాన్ని కూడా అందిస్తుంది. వ్యాయామ ప్రారంభంలో ఉన్నవారికి, అలాగే తక్కువ ఫిట్నెస్ స్థాయిలు ఉన్నవారికి ఇవి సరైన ఎంపిక. వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలకు తగ్గట్టుగా వీటిలో సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉండడం మరొక ఉపయుక్తమైన అంశం. మన సామర్ధ్యానికి తగ్గట్టుగా ఇది నప్పుతుందా లేదా అని తేల్చుకోవడానికి స్టోర్ లేదా ఫిట్నెస్ సెంటర్లో ట్రయల్ రన్‌కు ప్రయత్నించవచ్చు. ఈ మెషిన్ల వల్ల ఉన్న మరో ప్రధాన ఉపయోగం ఏమిటంటే... వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చేయదగ్గ ఇండోర్ యాక్టివిటీని ఇవి అందిస్తాయి. కాని మోకాలి సమస్య లేదా పిరుదుల సమస్య ఉన్న వ్యక్తులు స్టెయిర్ క్లైంబర్స్, స్టెప్పర్స్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ మెషిన్లు కీళ్లపై అదనపు భారాన్ని మోపుతాయి. వాకింగ్ మీ ఫిట్నెస్ స్థాయిని, సామర్థ్యాన్ని నడక పెంచుతుంది. ఇతరత్రా ఫిట్నెస్ పరికరాలు దీనికి అవసరం లేదు. ఇంట్లోనూ, బయట ఎప్పుడైనా, ఎక్కడైనా నడవ్వచ్చు. మాల్స్, ఇండోర్ ట్రాక్స్ లేదా ట్రెడ్మిల్.. ఏదైనా నడవడం ప్రధానం. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 10,000 అడుగులు వేయాలి. మీరు అదనపు బరువు కోల్పోవాలనుకుంటే 12,000 అడుగులు వేయాలి. రోజుకు వేసే అడుగుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకోవాలంటే పెడోమీటర్ పర్యవేక్షణతో తెలుసుకోవచ్చు. 10,000 అడుగులు అంటే ఉజ్జాయింపుగా 8 కిలోమీటర్లు. యోగా అమెరికాలోని ‘ఫ్రెడ్ హాచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్’ పరిశోధకులు బరువు తగ్గేందుకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే సంగతి గురించి ఓ అధ్యయనం చేశారు. యోగా ఇతర రకాల వ్యాయామాల మాదిరిగా బరువు తగ్గించడంలో తీక్షణంగా పని చేయకపోయినా దానిని నిత్యం సాధన చేయండం వల్ల ఆహారం, అలవాట్లకు సంబంధించి ఆరోగ్యకరమైన నియమావళి ఏర్పడి ఊబకాయం తగ్గడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందని తేల్చారు. స్విమ్మింగ్: ఇది ఒక అద్భుతమైన ఎరోబిక్ వ్యాయమం. అయితే ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. తక్కువ శక్తి–సామర్ధ్యం కలిగిన వారికి గతంలో స్విమ్మింగ్ చేయని వారికి నిర్ణీత 30 నుంచి 60 నిమిషాల పాటు ఈత కష్టం కావచ్చు. అందుకే క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. మొలలోతు నీళ్లలో అటూ ఇటూ నడవడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు స్విమ్మింగ్‌కు ముందు తమ ఫిజిషియన్ని సంప్రదించడం మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి వాటర్ ఎరోబిక్స్ మంచి ప్రత్యామ్నాయం. నీటికి ఉన్న తేల్చే గుణం కారణంగా కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో రెయిలింగ్ పట్టుకొని పెడలింగ్ చేసినట్టుగా కాళ్లు ఆడించినా స్విమ్మింగ్‌తో ప్రయోజనాలే కలుగుతాయి. సైక్లింగ్ : రోజూ ఇంటికి ఏదో ఒక చిన్న చిన్న కిరాణ సామగ్రి అవసరం పడుతుంది. ప్రతీదానికి బైక్ కాకుండా సైకిల్ వేసుకొని వెళ్లండి. ఎముకలు పెళుసుబారడం, కీళ్లవాతం, కీళ్లనొప్పులు.. వంటి సమస్యలు ఉంటే నడకను ఎంచుకోండి. వాకింగ్, సైక్లింగ్ రెండూ హృదయనాళ వ్యవస్థకు మేలైన ప్రయోజనాలు ఇస్తాయి. అధికబరువు గలవారికి సైక్లింగ్ సరైన ఎంపిక. యాంత్రిక జీవనంలోని స్ట్రెస్ నుంచి గుండెకు రిలీఫ్ లభిస్తుంది. వెన్ను, పిరుదులు, మోకాళ్లు, మడమలలోని ఒత్తిడి కూడా నడక వల్ల రిలీజ్ అవుతుంది. -
మెదడు... మెథడు
బరువు తగ్గడానికి డైట్ ప్లాన్స్ చూశారు. ఆ ప్లాన్స్‌తో పాటు ఇంకో కొత్త ప్లాన్ కూడా ఉంది. అదే లైఫ్‌స్టైల్ ప్లాన్. మీ రోజువారీ లైఫ్‌ని కాస్తంత మార్చుకుంటే కంట్రోల్ చేసుకుంటే, హద్దులు విధించుకుంటే బరువు తగ్గచ్చు. బరువు తగ్గాలంటే శరీరం కంటే ముందు మెదడు అదుపులోకి రావాలి. ఆ మెథడ్ ఏంటో తెలుసుకొని ఆచరించండి. స్లిమ్ అవ్వాలి. ఎలా? రేపట్నించి వ్యాయామం మొదలుపెడదాం!’ అని ఓ నిర్ణయానికి వచ్చేసి రేపటికి వాయిదా వేస్తూనే ఉండి ఉంటారు. తినే ఆహారం ద్వారా ఒంట్లో అదనంగా క్యాలరీలు చేరుతూనే ఉంటాయి. టీవీలో వచ్చే షోస్‌ని గంటల తరబడి చూస్తూ కూర్చునే ఉంటారు. కంప్యూటర్ల ముందు కీ బోర్డ్ నొక్కుతూ పని చేశామనుకుంటారు. కానీ, కాలు కదపక, ఒళ్లు కదలక శరీరంలో చేరిన క్యాలరీలు ఖర్చు కావు. ఫలితం మరింత బరువు. ‘ఈ మధ్య ఒళ్లు చేసినట్టున్నారు..’ అనే సన్నిహితుల మాటలు నిరాశ కల్గిస్తుంటాయి. ‘ఎలాగైనా సరే బరువు తగ్గాల్సిందే అనే లక్ష్యం మీదైతే ఇది మీకోసమే! వ్యాయామం చేయకుండానే అదనపు బరువును తగ్గించుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా.. మీ రోజువారీ జీవనశైలి ఏవిధంగా ఉందో పరిశీలించాలి. ఓ రకంగా మీకు మీరే పరిశోధకులు. మీ జీవనప్రయాణం ఎలా ఉందో చిన్న చిన్న గమనింపులు చేసుకుంటూ, కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ కొనసాగించండి. మీబరువు మీ అధీనంలో ఉంటుంది. మీ ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టండి. అందుకు ఇది ఒక చిన్న అడుగే కావచ్చు. కానీ, రేపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వేసే అడుగులకు దారులను సుగమం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడేవి నిర్ధారించి, ఫలితం పొందిన సులువైన మార్గాలు 15 ఉన్నాయి. అవి, ఎక్కువగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, తక్కువ తినడం, మిమ్మల్ని మీరు చూసుకున్న ప్రతీసారి మెరుగైన ఫలితం పొందామన్న అనుభూతిని పొందడం. ఈ రోజువారీ జీవనశైలి మార్పులను కేవలం ఒకటి – రెండు వారాలు పాటించండి. దాదాపు 3 అంగుళాల మేరకు మీ నడుము వెడల్పు తగ్గుతుంది. కొన్నినెలల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ విధానం మెరుగైన, ఆరోగ్యకరమైన అలవాట్లు మీ జీవితకాలం ప్రయోజనాన్ని పొందేలా చేస్తుంది. వాణిజ్య ప్రకటనల సమయం టీవీలో మీకిష్టమైన షో చూస్తున్న సందర్భంలోనూ ఒకేచోట కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ చూడండి. వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో బయటవరకు వెళ్లడం, కొన్ని మెట్లు ఎక్కి దిగి రావడం, ఉన్న చోట నుంచి ఒక చిన్న పరుగులాంటి నడకతో మరో చోటుకి వెళ్లడం... వంటివి చేస్తూ ఉండండి. వీటివల్ల మీ గుండె వేగం, శ్వాస వేగం పెరగాలి. రోజూ రాత్రి సమయంలో రెండు గంటలపాటు టీవీ చూస్తూ ఉన్నారనుకోండి ప్రతి 2 నిమిషాలకోసారి విరామం తీసుకోండి. దీనివల్ల అదనంగా 270 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఏడాదిలో 8 కిలోల బరువు తగ్గవచ్చు. కొవ్వు పదార్థాలు– పరిమితులు అధికం మీకు బాగా నచ్చే ఆహారపదార్థాలలో కొవ్వు అధికంగా ఉండే .. కుకీస్, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్, చిప్స్, వేపుళ్లు..వంటివి ఉన్నాయనుకోండి. వీటిని క్రమంగా తగ్గిస్తూ పోండి. అంటే, కొవ్వు పదార్థాలలో వారానికి ఆరు రకాలవి తీసుకుంటున్నట్లయితే ఆ సంఖ్య 5కు పరిమితం చేయండి. ఆ తర్వాత 4. ఇలా వారానికి ఒకటి చొప్పున తగ్గిస్తూ పోతే మీరే ఆ మరుసటి వారానికి రెండు కొవ్వుపదార్థాలను తీసుకోవడం మానేస్తారు.వీటికి బదులుగా క్యారెట్స్, ఆరెంజ్‌లు.. వంటి ఇతర తాజాపండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి వార్తలు ఫిట్నెస్, ఆహారనియమాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ను 16 వారాల పాటు చదువుతూ ఉంటే శారీరక చురుకుదనానికి కావల్సిన మార్పులను తమకు తామే చేసుకోవడానికి సిద్ధం అవుతారని ఒక నివేదికలో తేలింది. ఇలా బరువుకు సంబంధించి హెల్త్ ఆర్టికల్స్ చదివే వారు కొవ్వు పదార్థాలు తగ్గించి తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం పెరిగింది. ఇవే అలవాట్లు ఎవరైనా 16 వారాల పాటు కొనసాగిస్తే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడినట్టే. అధిక బరువుకు చెక్‌పెట్టినట్టే! బేసిక్‌గా బాడీ వెయిట్ ఎక్సర్సైజులు జిమ్‌లో చేసేవి స్క్వాట్స్, పుషు–అప్స్ వంటి ప్రా«థమిక వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఇంట్లోనూ చేయవచ్చు. నీళ్లు నింపిన బాటిళ్లు, కూరగాయల సంచులు పైకి లేపడం, నెమ్మదిగా వాటిని కిందకుదించడం.. వంటివి చేయవచ్చు. పరిశీలిస్తే ఇంటి వాతావరణంలోనే ప్రాథమిక వ్యాయామాలు చేయడానికి అనువైనవి ఎన్నో ఉన్నాయి. వీటివల్ల నిమిషాల్లో మెటబాలిజం–రివైవింగ్ అయ్యి కండరాల బలం పెరుగుతుంది. దీంతోపాటే ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. మెట్లు ఎక్కడం రోజులో 2 – 3 నిమిషాలైనా మెట్లు ఎక్కాలి. కనీసం 3 నుంచి 5 అంతస్తులు ఎక్కాలి. దీనివల్ల ఏడాదిలో పెరిగిన బరువులో 2 కేజీల బరువును తగ్గించుకోవచ్చు. ఇది తగ్గిన మీ నడుము చుట్టుకొలతనే చెబుతుంది. మహిళలకన్నా మగవారు వారంలో 70కి పైగా మెట్లు ఎక్కి వారానికి 20 చొప్పున పెంచుతూ పోవాలి. మెట్లెక్కడం వల్ల 18 శాతం మరణాల రేటు తగ్గినట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది.అందుకని ఈ రోజే మెట్లను అధిరోహించడం ప్రారంభించండి. రోజూ 3 మెట్లు అదనంగా ఎక్కుతూ మీ ట్రెక్కింగ్‌ను ఇప్పుడే మొదలుపెట్టండి. ఇలా చేస్తే బరువు తగ్గింపులో మీరు ఎన్నోమెట్లు ఎక్కినట్టే. మరింత అదనం మీరు ఒక ఏడాది కాలంలో వేలాది క్యాలరీలు డబ్బును పొదుపు చేస్తున్నట్టుగా ఒంట్లో సేవ్ చేస్తూ ఉంటారు. అదెలాగో చూద్దాం.. వారాంతంలో రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ 610 క్యాలరీలు గల ఒక చికెన్ బర్గర్‌ను తిన్నారు. దీంట్లో 40 శాతం కొవ్వు, 1,440 మిల్లీ గ్రాముల సోడియం ఉంటాయి. అదే, మీరు సొంతంగా ఇంట్లోనే చికెన్ బర్గర్‌ని తయారుచేసుకుంటే 230 క్యాలరీలకు మించదు. అంటే, కనీసం దీనివల్ల 400 క్యాలరీలు, 520 మిల్లీగ్రాములు సోడియం కటాఫ్ చేస్తున్నారన్నమాటే. అందుకని మీరు తినే భోజనాన్ని హోటల్స్ వారికి ఆర్డర్ ఇవ్వకుండా మీరే సిద్ధం చేసుకోవడం ఉత్తమం. అలాగే, తినే ఆహారంలో పంచదార, ఉప్పు, కొవ్వులను తగ్గిస్తూ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పినవన్నీ రెస్టారెంట్ ఫుడ్‌లో ఎక్కువ శాతం ఉంటాయి. కిలోమీటర్ అనే విధానం కచ్చితం చేయాలి మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలుండే అన్ని ప్రయాణాలకు 89 శాతం వాహనాల మీదే వెళుతుంటారు చాలామంది. డ్రైవింగ్‌కి ఖర్చుకు చేసే ప్రతి అదనపు గంటకు బరువు 6 శాతం పెరుగుతుంది.క్యాలరీలను ఖర్చు చేయాలంటే తప్పనిసరి రూల్ పాటించాలి. మీరు వెళ్లాల్సిన చోటు కిలోమీటర్ కన్నా తక్కువ దూరం ఉంటే డ్రైవింగ్‌కి బదులు చురుకుగా నడవాలని ప్రతిజ్ఞ చేసుకోండి. తక్కువ దూరానికి కూడా మీ కారులో ప్రతీసారి వెళ్తూ పార్కింగ్ కోసం టైమ్ వృ«థా చేయకుండా నడక ద్వారా అనేక పనులు సులువుగా చేసుకోవచ్చు అని మీకు మీరే చెప్పుకోండి. ఈ రూల్‌ని మీరు ఇప్పుడు మెదలుపెడితే వచ్చే ఏడాది వరకు కనీసం 6 నుంచి 7 కిలోలు బరువు తేలికగా తగ్గిపోతారు. రోజులో 10 సార్లు కాళ్లు, చేతులే కాదు నోటి కదలికలకు కూడా పని చెబుతూ ఉండాలి. అంటే, ఒకే మొత్తాన్ని ఒకేసారి భుజించడం కాకుండా రోజులో ఎక్కువసార్లు తినాలనే రూల్ పెట్టుకోండి. దీంట్లో మీరు తినబోయే పదార్థాన్ని నిమిషం సేపు గమనించడం, వాసన చూడటం, దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆలోచించడం వంటివి చేయండి. ఆ తర్వాత చాలా కొద్దిగా మాత్రం నోట్లో పెట్టుకోండి. దాన్ని నెమ్మదిగా, బాగా నమలాలి. ఎంతగా అంటే ఆ పదార్థం నోరంతా తిరగాలి. రుచిని ఆస్వాదించాలి. లాలాజలం ఊరాలి. ఆ తర్వాత మరొక ముద్ద తినాలి. దీనివల్ల ఆహారం తీసుకోవడంలో ఒక సంతృప్తి భావన కలుగుతుంది. మీకు ఇంకా తిన్న అనుభూతి కలగాలంటే మరో 20 సార్లు నమలడం పెంచండి. దీనిని ఈటింగ్ ఎక్సర్సైజ్ అనవచ్చు. 10 నిమిషాల్లో తినడం ముగించండి. నెమ్మదిగా తినడం వల్ల మైండ్ కూడా ఫుల్ అయ్యిన భావన కలుగుతుంది. పండ్లు తినండి తాగద్దు పండ్లను తినడం వల్ల శరీరానికి తగినంత పీచు అందుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. అదే ఒక యాపిల్‌తో చేసిన జ్యూస్ తాగితే పీచు కాకుండా క్యాలరీలే శరీరానికి అందుతాయి(ఒక యాపిల్‌లో 3.5 గ్రాముల పీచు ఉంటే, అదే జ్యూస్‌లో 0.5 గ్రాములు ఉంటుంది). కార్బోహైడ్రేట్స్ ఉండే జ్యూస్‌ల కన్నా ఫైబర్ ఉన్న పండ్ల వల్ల ఎక్కువ సంతృప్తి, ఆరోగ్యం లభిస్తుందని సుదీర్ఘపరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఆహారం అంటేనే నమిలి తినాలి. అది మీ లాలాజలంతో కలవాలి. అప్పుడే మైండ్ సంతృప్తి చెందుతుంది. అదే పండును జ్యూస్ చేసి తాగితే ఆ భావన మైండ్‌కు చేరదు. పైగా తీపి కోసం వేసే పంచదార వంటివి యాపిల్ పండు కన్నా 48 శాతం క్యాలరీలను జ్యూస్ చేర్చుతుంది. సహాయం పొందండి వ్యాయామం చేయడానికి ఫ్రెండ్‌ను మించిన ఉత్సాహభరితమైన సపోర్ట్ మరోటి ఉండదు. మీ వీధి చివరన ఉండే ఫ్రెండ్‌ను కలవడానికి కాలినడకన వెళ్లచ్చు. చేసే వర్కవుట్స్ గురించి ముఖాముఖిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మధ్య భేషజాలు ఉండవు. మహిళలు నలుగురిలో కలిసి ఉండి, చర్చించుకునే గ్రూప్స్ మన సమాజంలో ఎక్కువ. ఇలా ఒకరికి ఒకరు వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో చర్చించుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ 300 క్యాలరీలు ఆహారంలో తగ్గిస్తూ, నడకను మైలు దూరం కన్నా పెంచుకుంటూ ఉంటే 9 నెలల్లో 6 కిలోల అదనపు బరువు తగ్గుతారు. కప్పు కాఫీ పెంచే బరువు రోజూ 3,000 కప్పులు అమ్మే 115 కాఫీషాప్లను సందర్శించి నిపుణులు ఓ నివేదికను అందించారు. ఎలాగంటే రోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ ద్వారా (పాలు + పంచదారతో కలిపి) సగటున 239 క్యాలరీలు సగటున సేవిస్తున్నారు. 2–3 నుంచి కప్పుల కాఫీ లేదా టీ సేవించినా రోజులో ఒక్కొక్కరు సగటున 630 క్యాలరీలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ అలవాటును మానుకుంటే ఏడాదిలో 6 కేజీల అదనపు బరువును తగ్గించవచ్చు. పెన్ను తీసుకోండి దాంతో పాటే ఒక చిన్న నోట్ బుక్ తీసుకోండి. దీని మీద ఫుడ్ డెయిరీ లేదా ఫుడ్ లాగ్స్ అని పేరు రాయండి. ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుంచే రోజులో ఏమేం తింటున్నారో ప్రతి అరగంటకోసారి రాస్తూ ఉండండి. అంతేకాదు, ఆ ఆహారంలో ఉండే క్యాలరీలు కూడా ఇంచుమించుగా నోట్ చేస్తూ ఉండండి. ఈ ఫుడ్ డెయిరీ మీరు తీసుకునే అదనపు క్యాలరీలను తీసుకోకుండా మీ నోటికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇటీవల పరిశోధనలో తేలిందేమంటే.. ఫుడ్ డెయిరీలో ఆహారం తీసుకునే సమయాలు, క్యాలరీలు నోట్ చేసుకున్నవారు త్వరగా బరువు తగ్గడం గమనించారు. ఫుడ్ డెయిరీని రోజూ రాయడం అలవాటు చేసుకున్నవాళ్లు మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి ప్లాన్ చేసుకోవడం..వంటివి ప్రారంభించారు. ఈ విధానాన్ని పాటించినవాళ్లు దాదాపు 6 నెలల సమయంలో 7 కిలోల బరువు తగ్గారు. ఫుడ్ డెయిరీ వల్ల ఆహారపు అలవాట్లు మీలోని అంతర్దృష్టిని మేల్కొలిపి, అవగాహన ³రిచేలా చేస్తుంది. అంటే పెన్ మీ అధిక క్యాలరీలను కాల్చేసే గన్లా ఉపయోగపడుతుందన్నమాట. అదనంగా 5 నిమిషాలు శారీరక శ్రమలో భాగంగా నడకకు రోజూ ఓ 5 నిమిషాల సమయం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తుంటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాలుగు నెలల్లో మీ నడుము చుట్టుకొలత 2 1/2 ఇంచులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మీ లక్ష్యం 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వాకింగ్ చేయడం అనుకోండి. రోజూ మరో 5 నిమిషాలు అదనంగా వాకింగ్ చేస్తూ ఉండండి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేస్తుంటే 120 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రతో తగ్గే బరువు బరువు తగ్గడానికి ఒక అతిముఖ్యమైన పాయింట్ హాయిగొలిపే నిద్ర. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిద్రలేమి తక్షణ బరువుకు దారి తీస్తుందని తేల్చారు. 5 రాత్రుల్లో కనీసం 4 రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినవారు కిలో బరువు తగ్గినట్టు గుర్తించారు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఒళ్లు పెరిగితే.. మానసిక సమస్యలు...
మీరు చదివింది నిజమే. బ్రిస్టల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తెలుసుకున్నారీ విషయాన్ని. బాడీ మాస్ ఇండెక్స్.. అదేనండి..మన ఎత్తుకు, బరువుకు ఉన్న నిష్పత్తి ఎక్కువైతే మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి అని వీరు అంటున్నారు. ఊబకాయంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువన్న విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం శరీరం బరువు, గుండె ఆరోగ్యం, రక్తపోటు వంటి అంశాలకు మానసిక సమస్యలకూ సంబంధం ఉంది. అయితే ఆరోగ్య సమస్యలతో మానసిక సమస్యలు వస్తాయా? లేదా మానసిక సమస్యలు వచ్చిన తరువాత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా బాడీ మాస్ ఇండెక్స్ విషయంలో మాత్రం మానసిక సమస్యలు వస్తాయని తమ అధ్యయనంలో తేలిందని రాబిన్ వుట్టన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్లో దాదాపు మూడు లక్షల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఊబకాయంతో ఉన్న వారు ఆత్మనూన్యతతో బాధపడుతూండటం ఇందుక కారణం కావచ్చునని చెప్పారు. -
బరువును విసిరి కొట్టండి!
బరువు తగ్గడానికి ప్రపంచంలో ఉన్న ?డైట్ ప్లాన్స్ అన్నీ వివరించాం.కాని అసలైన డైట్ మన వాకిలి ముంగిటే ఉంది.మన చేలలోనే ఉంది.పంట పొలాల్లోనే పండుతోంది. సిరి ధాన్యాలతో ఒంటి మీద పేరుకున్న అదనపు సిరిని వదిలించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. తరిమికొట్టవచ్చు.అరికలు, సామలు, ఊదలు, కొర్రలు... ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాదు బరువును అదుపు చేస్తాయి. భారాన్ని తగ్గిస్తాయి. సిరిధాన్యాలతో బరువును విసిరికొట్టండి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. అనువంశికత కారణం కాదు. ఊబకాయానికి, మధుమేహానికి కూడా ముఖ కారణాలు ఇవే. గతంలో ఊబకాయుల సంఖ్య తక్కువ ఎందుకని? పూర్వం ఊబకాయంతో బాధపడే ప్రజలు దాదాపుగా లేరు. క్రీ.శ.1900 వరకు ఊబకాయ సమస్య పహిల్వానులు వంటి వాళ్లలో తప్ప సాధారణ ప్రజానీకంలో చాలా అరుదుగా ఉండేది. ఎందుకనంటే, అప్పట్లో గ్లూకోజ్ నిదానంగా రక్తంలో కలిసేందుకు అనువైన ఆహారం మనం తింటూ ఉండేవాళ్లం. అదీకాకుండా, ప్రజలంతా రోజూ చాలా సేపు నడిచేవారు. అంటే, ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్ ఖర్చు అయ్యేది. ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవుతూ, పేరుకుంటూ వస్తున్నదో అప్పుడు గ్లైకోజన్ గాను, కొవ్వు గాను, మాంసం గాను మార్చే వ్యవస్థ తయారవుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మొదలవుతాయన్నమాట. వీటికితోడు కాలక్రమంలో పంచదార ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగింది. చక్కెర ఉత్పత్తి క్రీ.శ. 1846 నుంచే ప్రారంభమైంది. గడచిన 70 సంవత్సరాల్లో వరిబియ్యం, గోధుమలతోపాటు పంచదార వినియోగం బాగా పెరిగింది. వరి, గోధుమల్లో పీచుపదార్థం అతి తక్కువగా ఉంది. పంచదార ద్వారా తీసుకునే గ్లూకోజ్‌ను ఖర్చు చేసే వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతోంది. సూటిగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. ఆహారంలో వచ్చిన మార్పు వల్ల, వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం వచ్చింది. సరైన ఆహారం తినాలి. సరిగ్గా వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి సంపూర్ణ స్థితి నెలకొంటుంది. అంటే ఊబకాయులు తమ శరీరంలో అతిగా పెరిగిన మాంసం, కొవ్వు పదార్థం, గ్లైకోజెన్ కరిగించుకునేలా ఆహార విహారాలను నియమబద్ధంగా మార్చుకోవాలి. అంటే, ఎక్కువగా నడవాలి. గ్లూకోజ్‌ను రోజూ నడక ద్వారా ఖర్చు చేయాలి. అదే సమయంలో.. ఆహారం ద్వారా గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి వచ్చేలా చూడాలి. సిరిధాన్యాలను ఎప్పుడో ఒక సారి కాకుండా రోజువారీగా ముఖ్య ఆహారంగా తింటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గుర్తించాలి. స్టెరాయిడ్స్ వల్ల ఊబకాయం.. ఆహారం వల్ల సహజంగా ఊబకాయం తయారవటం ఒకటైతే వైద్యచికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం కూడా ఊబకాయానికి మరో ముఖ్య కారణం. రోగాలకు చికిత్సలో భాగంగా ఈ మధ్యకాలంలో డాక్టర్లు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఆడవాళ్లలో హార్మోన్ అసమతుల్యతకు, ఆస్తమా, నొప్పి మందులుగా వాడుతున్నారు. సాధారణంగా ఆహార విహారాలలో మార్పుల వల్ల కన్నా స్టెరాయిడ్స్ వాడే వారికి మరింత వేగంగా ఊబకాయం వస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఆకలి ఎక్కువ కావటం వల్ల ఎక్కువగా తినటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా కొందరు ఊబకాయులుగా మారుతున్నారు. మాంసం, కోడిగుడ్లను తక్కువ రోజుల్లో అధికోత్పత్తి సాధించే క్రమంలో పశువులకు, కోళ్లకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అలా ఉత్పత్తయిన మాంసం, కోడిగుడ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా ఈ స్టెరాయిడ్స్ ప్రభావం ఉంటుంది. వీళ్లు కూడా ఎక్కువ తినటం మొదలు పెట్టి ఊబకాయులుగా మారిపోతున్నారు. మాంసాహారం తినటం అంతకంతకూ ఎక్కువై పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తోంది. జంతువుల పాలు మనిషి ఆరోగ్యానికి సరిపడవు. పాలు, టీ, కాఫీలు తాగటం వల్ల హార్మోన్ అసమతుల్యత మనుషుల ఆరోగ్యాన్ని అస్థవ్యస్థం చేస్తోంది. పాలను తోడు వేస్తే ఈ అలసమతుల్యత సమసి పోతుంది. కాబట్టి, పెరుగు, మజ్జిగ పర్వాలేదు. మొత్తంగా ప్రపంచం ఇప్పుడు తింటున్న ఆహారం పర్యావరణానికి కూడా పెనుముప్పుగా మారాయి. సిరిధాన్యాలతో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా భూతాపాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మెట్ట రైతులనూ బతికించుకోవచ్చు. నెమ్మదిగానైనా రోజూ నడవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం గంట, సాయంత్రం గంట నడవాలి. అధికబరువు ఉన్న వారు నడవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే, ఈ రోగానికి కారణభూతాలైన ఆహారం తినటం మాని, సిరిధాన్యాలు తినటం, కషాయాలు తాగటం మొదలు పెడితే వారికి నడిచే శక్తి వస్తుంది. కీళ్ల నొప్పులు, సంధివాతం కొర్రలతోనే బాగువుతుంది. అందుకే ఐదు ధాన్యాలూ తినాలి. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తింటూ మిగతా 3 ధాన్యాలూ తక్కువ రోజులు తినాలి. ఊబకాయులు వేగంగా నడవనక్కర లేదు. నెమ్మదిగా నడిచినా చాలు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చేతనైనంత వేగంతో నడవవచ్చు. రోజులు గడిచేకొద్దీ వారు బాగా నడవగలుగుతారు. వేగంగా తగ్గటం మంచిది కాదు.. ఆహారంలో, శారీరక వ్యాయామంలో వచ్చిన మార్పు వల్ల ఊబకాయం మరీ వేగంగా పెరగదు. కొన్ని ఏళ్లపాటు, నిదానంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి, తగ్గేటప్పుడు కూడా ఆహారంలో మార్పు చేసుకొని, నడక వంటి వ్యాయామం క్రమబద్ధంగా చేస్తూ నిదానంగానే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. సిరిధాన్యాలు తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలో వయసు, ఎత్తుకు తగిన బరువును సంతరించుకోవటంతోపాటు.. ఏ వయస్కులైనా, ఏయే జబ్బులున్న వారైనా, ఆడవారైనా, మగవారైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. 6 నెలల్లో 10–25 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరీ ఎక్కువ బరువున్న వారు కొంచెం వేగంగా, మధ్యస్థంగా అధిక బరువున్న వారు కొంచెం నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఉదాహరణకు 100 కిలోల బరువున్న మనిషి ఆహార విహారాలను మార్చుకుంటే ఆరునెలల్లో 12 కిలోల వరకు తగ్గొచ్చు. 80–90 కిలోలున్న వారు అదే ఆరునెలల్లో 10 కిలోలు తగ్గొచ్చు. చిన్న వయస్కులైన ఊబకాయులు 50 ఏళ్లు దాటిన ఊబకాయులకన్నా కొంచెం వేగంగా బరువు తగ్గుతారు. ఇంతకన్నా వేగంగా బరువును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవి ప్రమాదకరం.మరీ వేగంగా బరువు తగ్గటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి. హానికరమైన ఆహారాన్ని తినటం మానేసి చిరుధాన్యాలను (కనీసం 2–4 గంటలు నానబెట్టుకొని వంట చేసుకోవటం విధిగా పాటించవలసిన చాలా ముఖ్యమైన నియమం) తింటూ, కషాయాలు తాగుతూ, క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎంతటి రోగాలున్న వారైనా (అవసరాన్ని బట్టి హోమియో/ఆయుర్వేద మందులను తీసుకోవాలి) ఆయా రోగాల పీడ నుంచి పూర్తిగా బయటపడటమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నా దగ్గరకు వచ్చిన వేలాది మంది సాక్షిగా బల్లగుద్ది చెప్పగలను. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తినాలి.. ఏ కారణంగా ఊబకాయం వచ్చినా.. ఊబకాయాన్ని ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవాలనుకునే వారు మొదట ఆహారం మార్చుకోవాలి. గ్లూకోజ్‌ను అసమతుల్యంగా, తక్కువ సమయంలోనే రక్తంలోకి పంపించే వరి బియ్యం, గోధుమలు, మైదాతో చేసిన ఆహారాన్ని తినటం మానేయాలి. గ్లూకోజ్‌ను సమతుల్యంగా, కొన్ని గంటల పాటు నెమ్మదిగా రక్తంలోకి వదిలే సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తినాలి. వరుసగా మూడు రోజులు అరికెలు, మరో మూడు రోజులు సామెలు రోజువారీ ముఖ్య ఆహారంగా తినాలి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలను వరుసగా ఒక్కోరోజు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. సిరిధాన్యాలు తింటే ఏమవుతుంది? కాలేయం, క్లోమం.. ఇవన్నీ తమ పనులను సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధంగా ఉండాలి. రక్తం పలచగా, తేలిగ్గా ఉండి, ఇమ్యునో బాగ్యులన్స్ అన్నీ సరిగ్గా ఉంటేనే నిర్ణాల గ్రంథులన్నీ(ఎండోక్రైన్ గ్లాండ్స్) సరిగ్గా పనిచేసేది. రక్తం శుద్ధ కావటానికి, నిర్ణాల గ్రంధులు సరిగ్గా పనిచేయటానికి ఈత ఆకు కషాయం పని చేస్తుంది. దీనికి తోడు సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తినాలి. ఇలా చేస్తే దేహంలో పేరుకున్న కొవ్వు, మాంసం క్రమంగా కరగటం ప్రారంభమవుతుంది. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి సిరిధాన్యాలు తినటంతోపాటు.. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి. వీటిల్లో వారానికి ఒక రకంæచొప్పున తాగాలి. ఉదయం, సాయంత్రం తాగాలి. దీనిలో కొంచెం ఈతబెల్లం లేదా తాటిబెల్లం పాకాన్ని రెండు చుక్కలు కలుపుకుంటే.. కషాయం రుచిగానూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈతబెల్లం జనాన్ని సన్నగా ఉంచుతుంది. ఈతాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల మజ్జలో పనిచేస్తుంది. ఎముకల మజ్జ శుభ్రం అయితేనే ఊబకాయం తగ్గుతుంది. – డా. ఖాదర్ వలి, స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు, మైసూరు -
ఫ్యాట్కిన్స్ డైట్
1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్ ఆట్కిన్ అనే ఆయన ‘ఆట్కిన్స్ డైట్’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి... ఫ్యాట్‌తో ఫ్యాట్‌ని కిల్ చేసే ఈ డైట్‌ని పరిశీలించి చూడండి. బరువు తగ్గడానికి సమర్థంగా సహకరించే డైట్ ప్రక్రియల్లో ఆట్కిన్స్ డైట్ ఒకటి. ఇది తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న డైట్ ప్రక్రియ. డాక్టర్ రాబర్ట్ సి. ఆట్కిన్ అనే ఫిజీషియన్ 1972లో రాసిన ఒక పుస్తకంలో దీన్ని పొందుపరచాడు. ఆ పుస్తకం ఆనాటి బెస్ట్ సెల్లర్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ఆహార ప్రక్రియలను అంతో ఇంతో తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా, అనువుగా మార్చుకుని ప్రయోజనం పొందారు. ఈ ఆహార ప్రక్రియలోని ప్రధాన ప్రిన్సిపుల్ స్వాభావికమైన కొవ్వులైన నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను ఎంతైనా తీసుకోమని చెప్పడం. ఎందుకంటే అవి అంత హానికరం కాదు. మార్కెట్ లో దొరికే లో–ఫ్యాట్ డైట్స్ కంటే ఇలాంటి శాచ్యురేటెడ్ కొవ్వులే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, చెడు కొలెస్ట్రాల్‌ను పరిమితం చేయడం ద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. బరువును తగ్గిస్తాయి. ఈ ఆహార విధానంలోని మరో ముఖ్యాంశం పిండిపదార్థాలను తగ్గించడం. దీని వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పిండిపదార్థా లతో ఎంతోసేపటికి గానీ తృప్తి కలగదు. అదే ప్రొటీన్లు తినడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ప్రొటీన్లను ఒంటికి అవసరమైనంతే తినడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు. ఆట్కిన్స్ ౖడైట్ అనుసరించేవారు నాలుగు దశల్లో దీన్ని అమలు పరచవచ్చు. అవి... ►మొదటి దశలో (దీన్ని ఇండక్షన్ దశ అంటారు): రోజుకు కేవలం 20 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలను (అంటే ఆకుకూరలు, కాయ గూరలను) మాత్రమే తీసుకుంటూ రెండు వారాలు కొనసాగించాలి. ఈ సమయంలో ఎక్కువ ప్రొటీన్, ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాలు రోజుకు మూడుపూటలా తీసు కోవచ్చు. ►రెండో దశలో (దీన్ని బ్యాలెన్సింగ్ దశ అంటారు) : ఇప్పుడు రెండువారాలుగా తీసుకునే ఆహారానికి మెల్లగా నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని జతచేయవచ్చు. ఇలా మరో రెండు వారాలు కొనసాగించాలి. ►మూడో దశలో (దీన్ని ఫైన్–ట్యూనింగ్ దశ అంటారు) : ఇందులో మీరు కోరుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ చాలావరకు బరువు తగ్గుతారు. అప్పుడు మీ ఆహారానికి మరికొన్ని కార్బో హైడ్రేట్లను చేర్చవచ్చు. ►నాలుగో దశలో (దీన్ని నిర్వహణ దశ లేదా మెయింటెనెన్స్ దశ అంటారు): ఇక ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి పైన పేర్కొన్న మూడు దశల్లోని హై–ప్రొటీన్లు, ఎక్కువ కొవ్వులు తీసుకుంటున్నా బరువు పెరగకుండా స్థిరంగా ఉంటారు. ఒక సూచన : ఇక్కడ పేర్కొన్న దశలు పాటించడానికి కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. అందుకే కొంతమంది ఇండక్షన్ దశలోకి వెళ్లకుండానే నేరుగా రెండో దశ నుంచి ప్రారంభిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంతకూ ఇండక్షన్ దశలోనే ఉండిపోతారు. ఈ ఆట్కిన్స్ డైట్ ప్రభావవంతంగా పనిచేసే ప్రక్రియే. ఇది ఇంచుమించూ కాస్త కీటోజెనిక్ డైట్ ప్రక్రియకు దగ్గరగా ఉంటుంది. ఆట్కిన్స్ ప్రక్రియలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు : ►చక్కెరలు : శీతల పానీయాలు, పళ్లరసాలు, కేకులు, క్యాండీలు, ఐస్‌క్రీములు. ► ధాన్యాలు : గోధుమలు, రే, బార్లీ, వరి. ► వెజిటెబుల్ ఆయిల్స్ : సోయా నూనె, మొక్కజొన్న నూనె, పత్తిగింజల నుంచి తీసిన నూనె (కాటన్ సీడ్ ఆయిల్)... ఇలాంటివే మరికొన్ని. ► కొవ్వులు / ట్రాన్స్‌ఫ్యాట్స్ : హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని పిలిచే ప్రాసెస్ చేసిన నూనెల నుంచి దూరంగా ఉండాలి. ► కార్బ్ డైట్ : ఎక్కువ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్ డైట్. ► హై–కార్బ్ వెజిటెబుల్స్ : క్యారెట్లు, టర్నిప్లకు దూరంగా ఉండాలి. ► హై–కార్బ్ పండ్లు : అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ, పియర్స్, ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి. ► పిండి పదార్థాలు (స్టార్చ్) : బంగాళదుంప (ఆలూ), చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) ► లెగ్యూమ్‌లు : చిక్కుళ్లు, బీన్స్, చిక్పీస్ వంటివాటికి దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్ దశలో మాత్రమే తీసుకోవచ్చు) తీసుకోదగిన ఆహారాలు : ఆట్కిన్స్ డైట్లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవచ్చు. ►మాంసాహారాలు : వేట మాంసం, చికెన్ ►చేపలు / సీఫుడ్ : సాల్మన్, సార్డిన్ చేపలు. ► గుడ్లు : ఒమెగా 3– ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అన్ని ఆరోగ్యకరమైన గుడ్లు. ►తక్కువ పిండిపదార్థాలు ఉండే కూరగాయలు / ఆకుకూరలు : పాలకూర, బ్రాకలీ, అస్పారగాస్ వంటివి. ► కొవ్వులు ఎక్కువగా ఉండేవి: వెన్న, చీజ్, మీగడ, కొవ్వులు తీయని పెరుగు. ►ఎండుఫలాలు / నట్స్ : బాదం, మాకడామియా నట్స్, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజలు... మొదలైనవి. ►ఆరోగ్యకరమైన నూనెలు : ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, అవకాడో నూనె. మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగానూ, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నట్స్ ఎక్కువ గానూ ఉన్నంతకాలం మీరు బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు. తీసుకోదగిన పానీయాలు : ఆట్కిన్స్ డైట్ తీసుకుంటున్నప్పుడు తీసుకో దగిన పానీయాలు ఇవి. ►నీళ్లు: మీరు ఎప్పుడు తాగినట్టుగానే నీళ్లు తాగవచ్చు. ►కాఫీ : కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీలో ఆరోగ్యాన్నిచ్చే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు. ►గ్రీన్ టీ : ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం. మొత్తం మీద ఇలా ఆట్కిన్స్ డైట్ అన్నది బరువు తగ్గడానికి ఒక నమ్మకమైన ప్రక్రియ అనీ, అది చాలావరకు నిరాశ పరచదన్నది నిపుణుల మాట. ఆట్కిన్స్ డైట్లో తీసుకోదగ్గ కూరలతో తమకు ఇష్టమైన రీతిలోనూ తమ సౌలభ్యాన్నీ, తినుబండారాల లభ్యతను బట్టి ఆయా వ్యక్తులు తమ డైట్ తీసుకోవచ్చు. లేదా నిపుణులతో చర్చించి తమకు అనువైన వ్యక్తిగతమైన డైట్‌ను రూపొందించుకోవచ్చు. అలా చేయలేనప్పుడు ఈ కింద పేర్కొన్న సాధారణ డైట్ ప్లాన్‌ను అనుసరించవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వారం రోజుల పాటు తీసుకోవాల్సిన డైట్ ఇలా... శాకాహారులకు డైట్ – డైట్ ప్లాన్ ఇక శాకాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారా లను తమ డైట్ ప్లాన్‌గా చేసుకోవచ్చు. వీటిని లంచ్ / డిన్నర్ ఆప్షన్‌గా లేదా ఏ కాంబినేషన్లతో నైనా, ఎలాగైనా ఎంచుకొని మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవి... ► రాజ్మా టొమాటో కర్రీ/దీనికి చాలా రకాల ఆకు కూరలు కలుపుకొని సలాడ్‌గా తీసుకో వచ్చు. ► ఉడికించిన శనగలు / చిక్ పీస్‌ను రాగి రొట్టెలు లేదా రాగి జావతో తీసుకోవచ్చు. ► ఆలివ్‌నూనెలో టొమాటోలతో పాటు కాస్తంత వేపిన మొలకెత్తిన పెసర్లు ►అన్ని రకాల గింజల మొలకలను రుబ్బుకొని దోశలా వేసుకోవచ్చు. ఈ దోశను కొబ్బరినూనె లేదా వెన్నలో వేసుకోవచ్చు. ► శనగపిండిలో పాలకూర కలుపుకొని వెన్నలో తేలిగ్గా వేపుకోవచ్చు. ► సజ్జరొట్టె / జొన్నరొట్టెలను సోయాబీన్ టొమాటో కర్రీతో పాటు తీసుకోవచ్చు. ► పనీర్ బుర్జీ ► పాలకూరతో పాటు పెసరతో చేసిన చట్నీ లేదా పెసర పప్పు ► శనగపప్పు + పాలకూర ► పనీర్ టిక్కా (ఇంట్లో చేసుకున్నది) డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శాకచక్యంగా తగ్గండి
ఫుడ్డు విషయంలో ప్రపంచంబాగా ఫాస్ట్ అయిపోయింది!అదృష్టం.. మనిమింకా స్లోగా మూవ్ అవుతున్నాం.ఫాస్ట్ అంటే యన్వీ. స్లో అంటే వెజ్. వెజ్ మన ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గడానికీ పనికొస్తుంది.ఎలాగంటారా?! శాకల్ని కాస్త చాకచక్యంగా తినాలంతే. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాల్లో ‘వెజిటేరియన్ డైట్’ ఒకటి. మాంసాహారంలో ప్రొటీన్లు ఉన్నా దానివల్ల కొవ్వులు పేరుకుంటాయని రెడ్‌మీట్ వంటి వాటివల్ల బరువు పెరుగుతుందని, అందుకే శాకాహారమే మంచిదని, దాని వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం శాకాహారం తినడం సాంస్కృతిక జీవనశైలిగా మారింది. సాటి జీవులను చంపే అధికారం, హింసించే హక్కు లేదంటూ చాలామంది పూర్తిగా శాకాహారానికి మారిపోతున్నారు. మాంసాహరం తామస గుణాన్ని పెంపొందిస్తుందనీ, అదే శాకాహారం అమృతాహారమని చాలామంది పేర్కొంటుంటారు. ‘వెజిటేరియనిజమ్’ను పాటించే మరికొందరైతే జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, పెరుగులను కూడా నిరసిస్తూ ఉంటారు. ఇలాంటి వారినే ‘వేగన్స్’ అని, వారు ఆచరించే శాకాహార ప్రియత్వాన్ని వేగనిజమ్ అని వ్యవహరిస్తుంటారు. ఈ ధోరణి ఎలా ఉన్నా బరువు తగ్గించడానికి శాకాహారం బాగా ఉపయోగపడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. శాకాహారులలో రకాలు శాకాహారం తినేవాళ్లలో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ల ధోరణిని బట్టి వీళ్లకు పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... లాక్టో–వెజిటేరియన్స్: వీరు మాంసం, చేపలు, చికెన్, గుడ్లు వంటి వాటిని మాత్రమే మాంసాహారంగా పరిగణిస్తుంటారు. జంతువుల నుంచి వచ్చే ఉత్పాదనలైన పాలు, వెన్న, పెరుగు వంటి వాటిని శాకాహారంగా పరిగణిస్తుంటారు. లాక్టో–ఓవో వెజిటేరియన్స్: వీరు పాలను శాకాహారంగా పరిగణిస్తారు. ఓవో–వెజిటేరియన్స్: వీరు గుడ్లను శాకాహారంగా పేర్కొంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న గుడ్లలో పిండం ఉండదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణిస్తారు. గుడ్లలోని ల్యూటిన్తోబరువు తగ్గుతుందన్నది తెలిసిందే. వేగన్స్: వీరు జంతువుల నుంచి లభించే ఎలాంటి ఉత్పాదననైనా మాంసాహారంగానే పరిగణిస్తారు. మాంసం, చేపలు, గుడ్లను మాత్రమేగాక పాలు, పెరుగు వంటి వాటిని కూడా మాంసాహారంగానే చూస్తారు. వాటిని ముట్టుకోరు. ఫ్లెక్సిటేరియన్స్: వీరు వీలైనంత వరకు జంతువులను చంపకుండా, హింసించకుండా లభ్యమయ్యే జంతు ఉత్పాదనలను మాత్రం తీసుకుంటూ, వాటికి హాని చేకూర్చడం వల్ల లభ్యమయ్యే ఆహారాన్ని పూర్తిగా పరిహరిస్తున్నారు. వీరికి శాకాహార ప్రియత్వం ఉన్నా వీలును బట్టి జంతువుల నుంచి లభ్యమయ్యే ఉత్పాదనలను తింటారు కాబట్టి తమను తాము ఫ్లెక్సిటేరియన్స్గా పేర్కొంటున్నారు. వీరిలో కొందరు చేపలను శాకాహారంగానే పరిగణిస్తారు. చేపల్లో ఉండే తక్కువ కొవ్వుతో పాటు ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ బరువు పెరగకుండా తోడ్పడతాయి. శాకాహారం బరువును ఎలా తగ్గిస్తుందంటే... కాయగూరల్లో (ఉదాహరణకు సొరకాయ, బీరకాయ వంటివి) నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పీచు పాళ్లు ఎక్కువ. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం త్వరగా కడుపు నిండిపోతుంది. నీరు ఎక్కువగా ఉండటం వల్ల, తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం వల్ల చాలా ఎక్కువగా తిన్నా కొద్ది క్యాలరీలు మాత్రమే ఒంటిలోకి చేరతాయి. మాంసాహారాన్ని తినాలంటే ఎంతో కొద్దిపాళ్లలో మసాలాలు (స్పైసెస్) వాడాల్సిందే. మసాలాల కారణంగా కడుపు నిండాక కూడా ఇంకాస్త తినాలని అనిపిస్తుంటుంది. శాకాహారం అలా కాదు. తిన్న వెంటనే సంతృప్తభావన వచ్చేస్తుంది. ఇలా పీచు, నీటి పాళ్లతో పాటు, మసాలాలు తక్కువ అనే అంశాల కారణంగా శాకాహారాన్ని తక్కువే తింటాం. పైగా మాంసాహారంలోలా శాకాహారంలో కొవ్వులు ఉండనే ఉండవు. ఫలితంగా తిన్న క్యాలరీలను ఖర్చు చేయగలిగితే శాకాహారంతో అసలు స్థూలకాయం వచ్చే అవకాశమే దాదాపుగా ఉండదు. ఖనిజాలూ బరువు తగ్గిస్తాయి: మాంసాహారాలతో పోలిస్తే శాకాహారంలో ఖనిజాలు, లవణాలు ఎక్కువ. ఈ ఖనిజ లవణాలూ బరువు తగ్గించడానికి తోడ్పడతాయి. ఎలాగంటే...శాకాహారంలోని ఖనిజాలు, లవణాలు, విటమిన్లు సమతులంగా అందడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. చురుకైన జీవక్రియల వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉండదు. శాకాహరంలోని ఖనిజాలన్నింటిలోనూ బరువు తగ్గించడంలో క్రోమియం భూమిక అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అది రక్తంలోని చక్కెరలను సమతౌల్యం చేస్తుంది. ఇన్సులిన్‌ను తగిన పాళ్లలో విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ఆరోగ్య అంశాల ద్వారా అది బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. నట్స్, గింజలు, అన్ని ఆకుకూరలు, కాయగూరల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఉపయోగపడే ఖనిజాల్లో క్రోమియం తర్వాతి స్థానం మెగ్నీషియమ్ది. ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, రక్తంలోని చక్కెర సమతౌల్యంగా ఉండేలా చూడటం, ఎముకలను పటిష్టపరచడం, వాటి ఆరోగ్యం బాగుండేలా చూడటంతో పాటు జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేలా, జీర్ణక్రియ వేగవంతమయ్యేలా చూస్తూ క్యాలరీలను త్వరగా దహనమయ్యేలా చేస్తుంది. ఈ మెగ్నీషియమ్ ముదురాకుపచ్చ ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పెరుగు, ఇతర పాల ఉత్పాదనల్లో ఎక్కువగా ఉంటుంది. జింక్ హార్మోన్ల సమతౌల్యతకు తోడ్పడటంలో భాగంగా బరువును నియంత్రిస్తుంది. జింక్ కూడా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్‌తో పాటు పుట్టగొడుగులు, చిక్కుళ్లలో ఎక్కువ. ఐరన్ రక్తప్రవాహాన్ని సాఫీగా జరపడం, జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది నట్స్, పాలకూర, డార్క్ చాకొలేట్స్, సబ్జా గింజలు (చియా సీడ్స్),, స్పిరులినాలో ఎక్కువ. లవణాల విషయానికి వస్తే పొటాషియమ్ అనేక జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ఇది ఆకుకూరలు, కాయగూరలతో పాటు పెరుగు, సబ్జాగింజలు, పొట్టుధాన్యాలు, కొబ్బరినీళ్లు, బాదాం వంటి నట్స్‌లో ఎక్కువ. క్యాల్షియమ్ కూడా జీవక్రియలను మెరుగుపరుస్తూ బరువును నియంత్రిస్తుంది. ఇది పాలు, పాల ఉత్పాదనలతో పాటు బాదాం, సబ్జాగింజలలో ఉంటుంది. ఇవే గాక సల్ఫర్, సెలీనియమ్, చాలా కొద్ది పరిమితిలో సోడియమ్ కూడా అవసరమవుతాయి. బరువు తగ్గడానికి థెర్మోజెనిక్ శాకాహారాలు: ఒంట్లో వేడిని మరింత పెంచే శాకాహారాలను థెర్మోజెనిక్ శాకాహారాలు అనవచ్చు. థెర్మోజెనిక్ శాకాహారాలతో బరువు తగ్గడం మరింత సులువు. ఇవి తీసుకోవడం వల్ల మన ఆహారాల్లోని క్యాలరీలు మరింత వేగంగా దహనం అవుతాయి. ఆ వివరాలు:మిరియాలు (రెడ్ హాట్ పెప్పర్స్ / బ్లాక్ పెప్పర్) ఒంట్లో వేడిని పెంచి (థెర్మోజెనెసిస్ ద్వారా) క్యాలరీలను త్వరగా దహనం చేస్తాయి. గ్రీన్ టీలోని క్యాటెచిన్, పాలీఫీనాల్స్లో థెర్మోజెనిక్ గుణాలు ఉన్నాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్–టీ ఒక వరప్రదాయిని. పసుపులోని కార్క్యుమిన్ స్థూలకాయం నివారించడమే కాదు... స్థూలకాయ సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తుంది. కాలీఫ్లవర్, బ్రాకోలీ, క్యారెట్లు, దోస వంటి వెజిటబుల్స్ కూడా తమ థెర్మిక్ గుణంతో బరువును నియంత్రిస్తాయి. శాకాహారంతో ఇతర ప్రయోజనాలివే... ఇటీవలి పరిశోధనలు మాంసాహారం కంటే శాకాహారం ఎన్నో రకాల ప్రయోజనకారి అని తెలుపుతున్నాయి. ఉదాహరణకు... శాకాహారంలో ఎలాంటి కొవ్వులూ ఉండవు. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టు తీయని ధాన్యాల్లోనూ అంతే. ఇవి బరువు తగ్గడానికి గణనీయంగా తోడ్పడతాయి. మాంసాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండెజబ్బులు, పక్షవాతం, కంటి జబ్బులు, హైబీపీకి దారితీస్తున్నాయి. మాంసాహారం తిన్నప్పుడు చాలాసేపు మనిషి మందకొడిగా మారతాడు. శాకాహారంలో కొవ్వులు లేకపోవడం అన్న ప్రయోజనం బరువు పెరగకుండా ఉండటానికి, బరువును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శాకాహారం మనలో పేరుకున్న చాలా విష పదార్థాలను స్వాభావికంగా తొలగిస్తుంది. అందుకే దీన్ని స్వాభావికమైన డిటాక్స్ (విష–హరిణి)గా చెప్పవచ్చు. వెజిటేరియన్ డైట్లో పీచు ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ డీటాక్సిఫైయింగ్ కూడా బరువు తగ్గడానికి చాలావరకు తోడ్పడుతుంది. రంగుల మిలమిలలు: మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఇంపుగా ఉండకపోవచ్చు. శాకాహారంలోని రకరకాల పదార్థాలు అనేక రకాల రంగులీనుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్వాభావికమైన అనేక రంగుల ఆహారపదార్థాలతో ఆరోగ్యం బాగుంటుంది. చాలా రకాల పోషకాలు సమకూరడం కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలిగ్గా జీర్ణం: శాకాహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది. ఆకుకూరలతో మేలు అంతా ఇంతా కాదు: ఆకుకూరలతో ఆరోగ్యానికి ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు నియంత్రణలో ఉండటం, బీపీ నియంత్రణలో ఉండటం, గుండెజబ్బులకు ఆస్కారం లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆకుకూరలు, పండ్లలో కాపర్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. కొవ్వుల్లోనూ ఒమెగా 3, మ్యూఫా, ప్యూఫా వంటి ఆరోగ్యవంతమైన కొవ్వులు లభ్యమవుతాయి. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవాళ్లలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చేందుకు అవకాశాలు తక్కువ. అదే మాంసాహారం ఎక్కువ తినేవారిలో స్థూలకాయం వస్తుంది. ఈ స్థూలకాయం మళ్లీ మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇక శాకాహార ఆకుకూరలు తినేవాళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మానికి ఎప్పటికప్పుడు మంచి పోషణ, విటమిన్స్ లభిస్తాయి కాబట్టి వాళ్లలో మేని మెరుపు చాలా బాగుంటుంది. శాకాహారం పరిమితులు: బరువు తగ్గించుకోడానికి శాకాహారాన్ని ఒక మార్గంగా అనుసరించే వారు కొన్ని పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శాకాహారం ఆరోగ్యానికి మంచిదే అయినా కేవలం అది మాత్రమే పూర్తి పోషకాలను అందించలేదు. ఉదాహరణకు ప్రొటీన్ల లభ్యత. ప్రొటీన్లు కావాలంటే: ప్రొటీన్లు శాకాహారం కంటే మాంసాహారంలోనే ఎక్కువ. అయితే శాకాహారంతోనే ప్రొటీన్లు లభ్యం కావాలంటే పప్పులు, చిక్కుళ్లు, సోయా ఉత్పాదనలైన... సోయా బీన్స్, సోయా చీజ్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహార పదార్థాలపై ఆధారపడాలి. క్యాల్షియం కోసం: యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల యువకుడు మొదలుకొని 50 ఏళ్ల వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ 1000 ఎం.జీ. క్యాల్షియం అవసరం. ఇది డెయిరీ ఉత్పాదనల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. అయితే వేగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా మిల్స్ ఉత్పాదనల వంటి వాటిపై ఆధారపడాలి. వాటిని రోజూ తీసుకోవాలి. వెజిటేరియనిజమ్ పేరిట పాలను పరిహరించి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు నష్టం వాటిల్లుతుంది. విటమిన్ డి: మన శరీరంలోకి క్యాల్షియం చక్కగా ఇంకిపోవాలంటే విటమిన్–డి అవసరం. ఇది పాల ఉత్పాదనలో, సూర్యకాంతిలో లభ్యమవుతుంది. సాధారణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) విటమిన్–డి అవసరం. జంతువుల నుంచి కాకుండా వెజిటేరియన్ ఉత్పాదనల ద్వారానే అది లభ్యం కావాలంటే సోయా మిల్క్ ఉత్పాదనలపై ఆధారపడాలి. ఐరన్: మనలో రక్తహీనత రాకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు (పాలకూర, బ్రకోలీ), డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది. విటమిన్ బి12: ఇది మాంసాహారంలోనే పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత పాలలో అధికంగా ఉంటుంది. శాకాహారం నుంచే దీన్ని తీసుకోవాలంటే సోయామిల్ వంటి వాటిపై ఆధారపడాలి. దీని లోపం వల్ల మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలో తగినంతగా తిరగకుండా ఇన్‌డోర్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు ఇటీవల చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి. పైన పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఆచరిస్తూ, శాకాహారం వైపు మళ్లితే అది బరువు తగ్గడానికి బాగా తోడ్పడటంతో పాటు... ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఆకుకూరలు /కాయగూరలపై రకరకాల పురుగుమందులు, మట్టి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున వాటిని శుభ్రంగా కడగాలి. అన్ని కూరగాయలు / ఆకుకూరలను ధారగా పడే నీళ్లలో కడగాలి. పలుచటి చర్మం ఉన్న కూరగాయలను కాస్తంత వైట్ వెనిగర్ కలిపిన నీళ్లలో కడుక్కోవడం మంచిది. ఆకుకూరలను ముందుగా కోసి ఆ తర్వాత కడగటం కంటే బాగా శుభ్రంగా కడిగాక మాత్రమే కోయాలి. నేలనుంచి తీసే వెజిటబుల్స్‌ను మట్టి అంతా శుభ్రమయ్యేలా బాగా కడగాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
కొవ్వుతోనే కొవ్వుకు కోత
వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలట. ఉష్ణాన్ని చల్లబరచడం ఉష్ణానికే సాధ్యమట. తెలుగులో తరచూ వాడే రెండు సామెతలివి. కీటో డైట్ కూడా పై సామెతల్లాగే పనిచేస్తుందేమో!?బరువు పెరగడం అంటే కొవ్వు పెరగడమే కదా. కొవ్వు పేరుకుంటేనే కదా ఊబకాయం వచ్చేది! కీటోజెనిక్ ఫుడ్‌ను తీసుకుంటే...కొవ్వును కొవ్వే కోసేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ట్రై చేసి చూడండి.బరువు తగ్గడానికి ఉన్న ఆహార ప్రక్రియల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న వాటిల్లో కీటోజెనిక్ డైట్ చాలా ప్రధానమైనది. దీన్నే సంక్షిప్తంగా ‘కీటో’ డైట్ అని కూడా అంటుంటారు. ఒక్క బరువు తగ్గడం మాత్రమే గాక... బరువుతో వచ్చే అనర్థాలకు అంటే... డయాబెటిస్, క్యాన్సర్ వంటివాటికీ ఇది సమర్థంగా పనిచేస్తుందని కొందరి నమ్మిక. అదేంకాదు... ఎపిలెప్సీ, అల్జిమర్స్ వ్యాధుల నివారణకూ ఇది తోడ్పడుతుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. కీటోజెనిక్ డైట్ అంటే... ఇందులో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా తక్కువ. కొవ్వులు చాలా ఎక్కువ. మనకు కార్బోహైడ్రేట్ల నుంచి తక్షణ శక్తి సమకూరుతుందన్న విషయం తెలిసిందే కదా. అయితే కీటో డైట్లో ఈ శక్తిని కొవ్వుల నుంచి పొందుతాం అన్నమాట. ఇలా కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వుల నుంచి శక్తి పొందే జీవక్రియను ‘కీటోసిస్’ అంటారు. ఇలా తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు అందుబాటులో లేక కేవలం కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి తమకు అవసరమైన శక్తిని పొందుతుంది. (ప్రోటీన్, కార్బోహైడ్రేట్... ఈ రెండు పోషకాల్లో 1 గ్రాము నుంచి 4 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే 1 గ్రాము కొవ్వునుంచి 9 క్యాలరీల శక్తి ఆవిర్భవిస్తుంది). ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోను అనే రసాయనాలు వెలువడుతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్లు పుడుతుంటాయి కాబట్టి దీన్ని కీటోజెనిక్ డైట్ అంటారు. ఈ ఆహారంలో రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఇలా చక్కెర తగ్గడం, కీటోన్లు పెరగడం అనేది చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి ఈ డైట్ చాలా ప్రాచుర్యం పొందింది. కీటోజెనిక్ డైట్స్లోని రకాలు : కీటోజెనిక్ డైట్‌లోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్కేడీ) : ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా చాలా తక్కువ. ప్రోటీన్లు ఒక మోస్తరు. ఇక కొవ్వుల విషయానికి వస్తే వాటి మోతాదు చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇందులో కొవ్వులు 75శాతం, ప్రోటీన్లు 20శాతం, కార్బోహైడ్రేట్లు 5 శాతం మాత్రమే ఉంటాయి. సైక్లికల్ కీటోజెనిక్ డైట్ (సీకేడీ) ఇందులో ఒక పీరియాడిసిటీ ఉంటుంది. అంటే... వారంలోని ఐదు రోజులు పైన పేర్కొన్న ఎస్కేడీ డైట్ ఇస్తూ... మిగతా రెండు రోజులు మాత్రం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవచ్చు. టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్ (టీకేడీ) ఈ తరహా కీటోజెనిక్ డైట్లో సాధారణంగా స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ తీసుకుంటూ... బాగా వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చు. హై–ప్రోటీన్ కీటోజెనిక్ డైట్ ఇది కూడా మామూలుగా స్టాండర్డ్ కీటో–డైట్‌ను పోలి ఉన్నప్పటికీ ఇందులో ప్రోటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే కొవ్వులు 60 శాతం, ప్రోటీన్లు 35 శాతం, కార్బోహైడ్రేట్లు కేవలం 5 శాతం మాత్రమే ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఏమైనప్పటికీ కీటో డైట్‌లోని ఒకే ఒక సాధారణ అంశం ఏమిటంటే... అది ఏ తరహా కీటో–డైట్ అయినప్పటికీ కార్బోహైడ్రేట్లు 5శాతం కంటే ఎక్కువగా ఉండబోవని గుర్తుంచుకుంటే చాలు. కీటోజెనిక్ డైట్లో తీసుకోకూడని ఆహారాలు ముందుగా చెప్పినట్లు కీటో–డైట్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి కదా. అందుకే ఈ కింద పేర్కొన్న పిండిపదార్థాలను కలిగి ఉన్న ఆహారాలను కీటో–డైట్లో భాగంగా తీసుకోరు. చక్కెరలు ఎక్కువగా ఉండేవి సోడాలు, పండ్ల రసాలు, స్మూదీస్, కేక్‌లు, ఐస్‌క్రీమ్, క్యాండీలు. ధాన్యాలు వరి, గోధుమ, తృణధాన్యాలు (సిరియల్స్) వంటివి. పండ్లు అన్ని రకాల పండ్లూ తినకూడదు. అయితే నేరేడు జాతికి చెందిన బెర్రీలు, స్ట్రాబెర్రీలకు మాత్రం మినహాయింపు ఉంది. బీన్స్ జాతి గింజలు వేరుశెనగలు, కిడ్నీబీన్స్, బీన్స్, శెనగలు (చిక్పీస్) వంటివి. దుంపజాతికి చెందినవి బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప (మోరంగడ్డ/గెణుసుగడ్డ), క్యారట్ వంటివి. తక్కువ కొవ్వులు ఉండేవి కొన్ని బాగా పొట్టుతీసిన పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లో–ఫ్యాట్ పదార్థాలను తీసుకోకూడదు. అనారోగ్యకరమైన కొవ్వులు కీటో–డైట్లో కొవ్వులు ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఆ కొవ్వుల్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వులనే తీసుకోవాలి. కొన్ని కొవ్వులు ఉదాహరణకు ప్రాసెస్ చేసిన వంటనూనెలు, మయోన్నెయిజ్ వంటివి తీసుకోకూడదు. ఆల్కహాల్ : చాలా ఆల్కహాల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. అవి కీటోసిస్ ప్రక్రియను అడ్డుకుంటాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాలు కీటో–డైట్లో భాగంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి... వేటమాంసం, చికెన్, టర్కీ కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు (ఫ్యాటీ ఫిష్) సాల్మన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల మాగా/బుడతమాగ అంటారు) ట్యూనా (టూనా చేప) మాకెరల్ (దీన్ని తెలుగులో కొన్ని చోట్ల కన్నగడతలు అంటారు), సార్డిన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల కవలు/నూనా కవలు అంటారు) వంటి చేపలు తీసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన కొర్రమీను ఈ డైట్లో చాలా మంచిది. గుడ్లు పాçశ్చరైజ్ చేసి ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుడ్లు. వెన్న, క్రీమ్ గడ్డి మేసే జంతువుల పాల నుంచి తీసిన వెన్న, మీగడలు. నట్స్, గింజలు బాదాం, వాల్నట్, అవిశె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్. ఆరోగ్యకరమైన నూనెలు వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో నూనె, కెనోలా నూనె, పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరినూనె. (ఇటీవల హార్వర్డ్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ కొబ్బరి నూనె అంత శ్రేష్టమైనది కాదని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించాకే నూనెలు వాడాలి).కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండే వెజిటబుల్స్: ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, టొమాటో, ఉల్లి వంటివి. వీటితో పాటు కాప్సికమ్ అని పిలిచే బెల్పెప్పర్ను వాడుకోవచ్చు. ఇవి పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరుకుతుంటాయి. పరిమితులు ఒంట్లోని జీవక్రియల వేగం పెంచడం అంటే మెటబాలిక్ హెల్త్‌ను మెరుగుపరడం ద్వారా కీటో–డైట్ అన్నది వ్యక్తుల బరువు తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపు చేయడంలో చాలా అద్భుతాలే చేస్తుంది. అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా తీవ్రమైన వ్యాయామం అవసరమైన అథ్లెట్లు వంటి వారికీ, కండరాల పెరుగుదలను కోరుకునే వారికి కేవలం ఈ డైట్ మాత్రమే సరిపోదు. ఇక మీరు ఏ ఆహార ప్రక్రియను అవలంబిస్తున్నప్పటికీ... సుదీర్ఘకాలం దాన్నే అనుసరిస్తూ ఉంటే తప్ప అది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వదు. ఇదే అంశం కీటో–డైట్కూ వర్తిస్తుంది. ఇవి మినహా కీటో–డైట్ మిగతా అన్ని సందర్భాల్లోనూ మంచి ఫలితాలే ఇస్తుందన్నది నిపుణుల మాట. కీటోజెనిక్ ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒంట్లోని నీరు, ఖనిజలవణాల బ్యాలెన్స్ కూడా మారుతుంది. అందుకే కీటో–డైట్లో ఉన్నప్పుడు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అవసరం. లవణాల్లో భాగంగా రోజుకు 3,000 – 4,000 ఎంజీ సోడియమ్, 1,000 ఎంజీ పొటాషియమ్, 300 ఎంజీ మెగ్నీషియమ్ తీసుకోవడం మంచిది. కీటో డైట్ తీసుకునే మొదటిరోజుల్లో... మిగతా ఆహారాలవైపునకు (అదనపు క్యాలరీల వైపునకు) మనసు పోకుండా ఉండేందుకు కడుపునిండా తింటూ ఉండటం మంచిది. కీటో–ఫ్లూ ఉన్నప్పుడు ఒంటికి అంతగా శక్తి సమకూరినట్లుగా అనిపించదు. మెదడుకు అవసరమైన శక్తి అందదు. దాంతో ఎప్పుడూ ఆకలిగా ఉన్నట్లు అనిపించడం, నీరసం, నిద్రవస్తున్నట్లుగా ఉండటం, వికారం, జీర్ణవ్యవస్థలో (కడుపులో) ఇబ్బంది (స్టమక్ డిస్కంఫర్ట్), మునుపటిలా వ్యాయామం చేయలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేవరకు మొదట్లో ఒకటి రెండు వారాలు చాలా తక్కువ మోతాదుల్లో కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉంటే మంచిది. అలా వాటిని తగ్గిస్తూ క్రమంగా ఒంట్లోని కార్బోహైడ్రేట్లకు బదులు కొవ్వులను ఖర్చు చేసేలా ఒంటిని అలవాటు చేయాలి. కీటో–డైట్‌తో ఏర్పడే సైడ్ఎఫెక్ట్స్, వాటిని తగ్గించడం ఎలా: చాలావరకు కీటో–డైట్ అనేది మంచి ఆరోగ్యకరమైనదే. అయితే శరీరం దానికి అలవాటు పడే ముందు కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. డైట్ ప్రారంభదశల్లో కనిపించే ఈ దుష్ప్రభావాలూ, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను ‘కీటో–ఫ్లూ’ అంటారు. అయితే కొన్నాళ్లలోనే ఈ కీటో–ఫ్లూ తగ్గిపోతుంది. డైట్ ప్లాన్ ఇలా... (కీటోజెనిక్ డైట్ తీసుకోవాలనుకున్నవారికి ఉజ్జాయింపుగా ఒక డైట్–ప్లాన్) పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా... వెన్నలో గార్నిష్ చేసిన చేపలనో లేదా వేటమాంసాన్నో పకోడాగా వేయించిన శ్నాక్. (దీన్ని పల్లీనూనెతో లేదా కొబ్బరినూనెతో తయారు చేసుకోవచ్చు). (లేదా) గుడ్డును ఆమ్లెట్‌గా వేసి తినవచ్చు (అయితే ఈ ఆమ్లెట్నూ మంచి వెన్నతో లేదా ఆలివ్‌నూనెతో వేసుకోవచ్చు) లేదా వివిధ రంగుల్లో ఉండే కాప్సికమ్‌ను పుష్కలంగా వేసి, గుడ్డు పొరటును చేసుకొని తినవచ్చు. (దీన్ని తయారు చేయడానికి ఆలివ్‌నూనె లేదా ఎక్కువ వెన్నను ఉపయోగించాలి). మధ్యాహ్న భోజనం (లంచ్)గా : లంచ్‌లో భాగంగా సలాడ్స్‌గా పాలకూర, పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరికే కాప్సికమ్, పుట్టగొడుగులు (మష్రూమ్స్)ను ఆలివ్‌నూనె లేదా వెన్నలో కాస్తంత దోరగా వేపి తినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఈ సలాడ్‌తో పాటు వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, వెన్నలో కాస్తంత దోరగా కాల్చిన ఉడకబెట్టిన గుడ్లు కూడా తీసుకోవచ్చు. వెన్న టాపింగ్‌తో ఈ సలాడ్‌ను తీసుకోవాలి. చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. ఆలివ్‌నూనె, పల్లీనూనె లేదా కొబ్బరినూనె పోసి వండిని కాలీఫ్లవర్ కూరను పైన పేర్కొన్న చేప, మటన్, చికెన్ పకోడాతో పాటు తీసుకోవచ్చు. రాత్రి భోజనంగా (డిన్నర్లో) : మీగడతో గార్నిష్ చేసిన పాలకూరను వెన్నలో వేయించి తీసుకోవచ్చు. లెమన్ చికెన్ సూప్ చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. (ఫ్రైడ్ పనీర్ పకోడా) కైమా లాగా కొట్టిన మటన్‌ను పైన పేర్కొన్న నూనెలతో వండి తీసుకోవచ్చు. కొబ్బరినూనె / ఆలివ్‌నూనె / పల్లీనూనెలో దోరగా వేయించి క్యాబేజీ సలాడ్.వారమంతా పైన పేర్కొన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను, మీ ఛాయిస్‌ను బట్టి మార్చి మార్చి వాడుకోవచ్చు. గమనిక : బరువు తగ్గడానికి కీటో డైట్‌ను ఫాలో అవ్వాలనుకున్నవారు తప్పనిసరిగా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొవ్వులకు చెక్‌పెట్టే కొర్రలు
ఇటీవల చాలామంది ఆరోగ్యం కోసం కొర్రలను వాడుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఇవ్వడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోడానికి కొర్రలు బాగా ఉపయోగపడతున్నందువల్ల వాటితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొర్రల్లో తక్కువ కార్బోహైడ్రేట్లతో పాటు ఎక్కువగా పీచు ఉండటం వల్ల అవి శరీరంలోకి తేలిగ్గా ఇంకడంతో పాటు చక్కెరను చాలా తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా డయాబెటిస్ రాకుండా నివారిస్తాయి. అంతేకాదు... ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారు వాటిని వాడినా చక్కెర చాలా ఆలస్యంగా వెలువడతుంది కాబట్టి కొర్రలు వారికి మంచి ఆహారం. వీటిల్లోని పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రలలో కొవ్వులు చాలా తక్కువ కావడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. కొర్రలు స్థూలకాయాన్ని నివారిస్తాయి. బరువును తగ్గించేందుకు తోడ్పడతాయి. కొర్రలలోని అమైనో యాసిడ్స్ దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి, వాటిని మళ్లీ పుంజుకునేలా చేస్తాయి. చర్మంతో పాటు ఇతర కణాలను మళ్లీ ఆరోగ్యవంతం చేసే ఈ గుణం కారణంగా ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి తోడ్పడతాయి. పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే మరిన్ని పాలు పడేలా చేస్తాయి. కొర్రల్లో బి1, బి2, బి5, బి6, విటమిన్–ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్ ఎక్కువ కావడంతో ఎముకలను బలంగా ఉంచుతాయి. పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి. మెగ్నీషియమ్, ఐరన్, జింక్ కారణంగా జుట్టుతో పాటు పాటు చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. -
బరువు సన్నమార్గాలు
ముందు ‘అన్న’ మార్గాలు చెబుతున్నాం అంటే అన్నం మితంగా తినమని చెబుతున్నాం. ఆ తర్వాత ‘ఉన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే జీవనశైలిలో పాటించడానికి ఉన్న మార్గాలివి. ఆ తర్వాత ‘భిన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే... తగ్గడానికి ఉన్నభిన్న భిన్న మార్గాలన్న మాట. ఈ మార్గాల్లో వీలును బట్టి ఏదైనా అనుసరించవచ్చు. ఎందుకంటే... సన్నబడే మార్గాలన్నీ సన్మార్గాలే! మెరుపుతీగలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధారణం శరీరాకృతితో ఉండటం సగం విజయం అని చెప్పుకోవచ్చు. కాని అధిక బరువుకు శరీరం చేరుకుంటే, కాయం ఊబకాయంగా మారితే జీవితం మందగిస్తుంది. సమస్యలు సంకెలలుగా మారతాయి. కదలికలకు నిరోధం పడుతుంది. నాణ్యమైన జీవితం అనుభవించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలంటే జీవనశైలి మార్చుకోవడం, లో–కార్బ్ డైట్, వాటర్ థెరపీ, లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ వంటి మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉండాల్సిన బరువు కంటే లావు ఉన్నవారికి లేదా స్థూలకాయులుగా ఉన్నవారికి. కాని అపాయకర రీతిలో ఊబకాయం ఉన్నవారు అంటే మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారు ఈ మార్గాలన్నింటినీ గాక బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సా పద్ధతులను అవలబించే వీలుంది. ఈ బరువు తగ్గే మార్గాలన్నింటి గురించి ఒక పరిచయం ఇది. ముందుగా సర్జికల్ మార్గాలు చూద్దాం. శస్త్రచికిత్సల ప్రక్రియలివి... మీ బరువు ప్రమాదకరమైన స్థాయి దాటితే... సాధారణ జీవనశైలిలో మార్పులు, ఆహారం, వ్యాయామం వంటి స్వాభావిక ప్రక్రియల ద్వారానే సన్నబడటం చాలా కష్టం. పైగా అత్యధిక బరువు ఉన్నవారు తమ బరువు కారణంగానే ప్రాణాపాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివారు బరువు తగ్గడానికి కొన్నిసార్లు కొన్ని శస్త్రచికిత్సలను అనుసరించాల్సి రావచ్చు. అలా చేయకపోతే వారి బరువే వారిని కబళించవచ్చు. ఆ శస్త్రచికిత్సలను బేరియాట్రిక్ సర్జన్స్ / సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు చేస్తారు. ఆ ప్రక్రియల గురించి స్థూలంగా... లాపరోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మనం తినే ఆహారం అన్నకోశం (స్టమక్)లోకి వెళ్తుంది. ఇది ఒక సంచిలా ఉంటుంది. మన పొట్ట నిండగానే తృప్తి (సేషియేషన్) కలుగుతుంది. నడుముకు బెల్ట్లాంటిదాన్ని పెట్టినట్లుగానే... ఒక శస్త్రచికిత్స ద్వారా అన్నకోశం (స్టమక్)కు కూడా బెల్ట్ వంటి దాన్ని అమర్చుతారు. మనిషి లావును బట్టి ఎంత మోతాదు ఆహారం అవసరమో నిర్ణయించి, దాన్ని బట్టి ఒక బ్యాండ్‌ను అమర్చుతారు. అందుకే దీన్ని అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటారు. దాని కారణంగా స్టమక్ సైజ్ తగ్గుతుంది. ఫలితంగా కొంత తినగానే పొట్టనిండినట్లయి తృప్తి కలుగుతుంది. అనుకూలతలు/ప్రతికూలతలు: కేవలం గ్యాస్ట్రిక్ బ్యాండ్ అమర్చడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఎలాగూ బ్యాండ్ అమర్చుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రొసిజర్ తర్వాత నిపుణులు సూచించిన విధంగా ఆహార నియమాలు పాటించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అలా చేయకపోతే దీనివల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. అన్నకోశం తొలగింపు బరువు విపరీతంగా పెరిగి అది ప్రాణాపాయంగా పరిణమించినప్పుడు శస్త్రచికిత్సతో 85శాతం మేరకు అన్నకోశాన్ని (స్టమక్‌ను) తొలగిస్తారు. దాంతో అన్నకోశం కాస్తా ఒక పేగు ఆకృతికి మారుతుంది. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి ఇది చాలా ప్రభావవంతమైన శస్త్రచికిత్స. అయితే అన్నకోశాన్ని తొలగించాక మళ్లీ మునుపటిలాగే తినడం వల్ల అన్నకోశం మళ్లీ మామూలుగా సంచిలా సాగిపోయే అవకాశం ఉంది కాబట్టి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలతో పాటు ఆహార మార్గదర్శకాలన్నీ తప్పకుండా పాటించాలి. ల్యాపరోస్కోపిక్ రూ–ఎన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్... ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై–పాస్ చేస్తూ... నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచిని రూపొందించేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియనే అనాస్టమోసిస్ అంటారు. అనుకూలతలు / ప్రతికూలతలు: అన్నకోశాన్ని పూర్తిగా బైపాస్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత విటమిన్ లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కనిపించేందుకు అవకాశం ఉంది. నీరసంగా అనిపించడం, జుట్టురాలడం, విటమిన్లోపాల కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కనిపించవచ్చు. కాబట్టి ఆ మేరకు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాపరోస్కోపిక్ బిలియో–ప్యాంక్రియాటిక్ డైవర్షన్ (+/– డియోడోనల్ స్విచ్) ఇందులో అన్నకోశంతో పాటు కొంతమేర చిన్న పేగులను కూడా తొలగిస్తారు. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుంది. అలాగే జీర్ణమయ్యే ఆహారమూ గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో కొంతమేర పేగులను తొలగించి ఆహారమార్గాన్ని కుదిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా జీర్ణస్రావాలు పొట్టలోకి కాకుండా నేరుగా పేగుల్లోకి వచ్చేలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు. లైపోసక్షన్ శరీరంలో కొవ్వు పేరుకోవడం అన్నది ఆయా వ్యక్తుల జన్యువుల ఆధారంగా కొన్ని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో జరుగుతుంటుంది. ఉదాహరణకు కొందరికి పొట్ట, మరికొందరికి తొడలు, పిరుదులు వంటి భాగాల్లో ఇలా కొవ్వు పేరుకుంటుంటుంది. వ్యక్తుల్లో వారి వారి వ్యక్తిగత శరీర నిర్మాణాన్ని అనుసరించి, చాలా ఎక్కువగా కొవ్వు పేరుకున్న ప్రదేశం నుంచి కొవ్వును సక్షన్ ప్రక్రియ ద్వారా లాగేయడాన్ని లైపోసక్షన్ అంటారు. అనుకూలతలు/ప్రతికూలతలు: ఈ ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. వ్యక్తుల బరువును బట్టి, వారిలో కొవ్వు పేరుకున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మోతాదుకు మించి ఒకేసారి ఎక్కువ కొవ్వును తొలగించడం అన్నది కొందరిలో తీవ్రమైన ప్రాణాపాయం కలిగించవచ్చు. కొవ్వు తొలగించాక కొంతకాలం ఒంటి నొప్పులు కొనసాగుతాయి. (అయితే కొంతకాలం తర్వాత తగ్గిపోతాయి.) మరో ప్రతికూల అంశం ఏమిటంటే... ఒకసారి కొవ్వును తొలగించాక వదులైన శరీర భాగాలు సంచుల్లాగా వేలాడుతుంటాయి. అవి మామూలుగా శరీరాన్ని అంటుకుని ఉండేలా చేయడానికి మూడు నెలలకు పైగా బాగా బిగుతైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఒకసారి కొవ్వు తొలగించాక బరువు తగ్గినప్పటికీ, ఒకవేళ ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించకుండా, క్రమశిక్షణ లేకుండా మళ్లీ ఎప్పటిలాగే ఆహారపు అలవాట్లు కొనసాగించడమూ, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తుంటే... మళ్లీ మునపటిలాగే బరువు పెరిగిపోతారు. అంటే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదన్నమాట. ఇంతవరకు చెప్పినవన్నీ ప్రమాదకరమైన స్థితిలో బరువు పెరిగినప్పుడు పాటించే పద్ధతులు. అయితే అసలు అంతవరకు రాకుండా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. ఆ పద్ధతులూ చూద్దాం. జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ టెక్నిక్స్) జీవనశైలి మార్చుకొని బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపునిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. ఇది దాదాపు నిరపాయకరమైన పద్ధతి. క్రమశిక్షణ ఉన్నవారు క్రమం తప్పకుండా పాటిస్తే చాలావరకు మేలు జరుగుతుంది. అంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లపై ఆధారపడటం, అన్ని పోషకాలు అందేలా తక్కువ క్యాలరీలు ఉండే సమతులాహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలా తిన్న ఆహారంతో సమకూరే అదనపు క్యాలరీలను లెక్కించడం, తగ్గించడం అవసరం. అలా తగ్గించడానికి వ్యాయామంతో క్యాలరీలను దహించడం, కొవ్వును కరిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, కాయగూరల్లో పోషకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. వాటిని భుజించాలి. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే కాయగూరలు తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీరు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండి తృప్తి కలుగుతుంది తృప్తి కలగడం వల్ల ఎంత ఆహారం కావాలో అంతే తింటారు. బరువు తగ్గడంలో భాగంగా గుడ్డు తినడం కూడా మంచిదే. గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. శాకాహారం విషయానికి వస్తే గుమ్మడిగింజలు, వేరుశెనగల్లో ల్యూసిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చేపలు తినడం చాలా మంచిది. చేప మాంసంలో కొవ్వులు దాదాపు సున్నా (జీరో). మసాలాలను తగ్గించాలి. ఇక పండ్లలో తక్కువ చక్కెర ఉండే పండ్లు మంచివి. ఇక వ్యాయామంలో భాగంగా ఒళ్లు పూర్తిగా బడలిక చెందనివిధంగా, నీరసపడిపోకుండా మీరు భరించగలిగే పరిమితిలో నడక (బ్రిస్క్ వాక్) చేయడం అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం. నెమ్మదిగా పరుగు (స్లో జాగింగ్) వంటి వ్యాయామాలు చేయడం చాలా మేలు చేసే అంశమే. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గడానికి అనుసరించే వాటిల్లో ఈ పద్ధతులు చాలా ఆరోగ్యకరం. ప్రతికూలతలు చాలా తక్కువ. ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు శరీర భారం ఫీలవ్వని ఈత లేదా మోకాళ్లపై భారం పడని సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. లో కార్బ్ డైట్ ఇందులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసి, చాలా తక్కువ మోతాదులో శక్తిని వెలువరించే పిండిపదార్థాలను తీసుకుంటారు. అంటే రిఫైన్ చేసిన పిండిపదార్థాలకు బదులుగా, అంతగా పాలిష్ చేయని పొట్టు ఉన్న గింజలను తీసుకోవడం, కొన్నిసార్లు కార్బోహైడ్రేట్లను దాదాపుగా తగ్గించడం వంటివి అన్నమాట. అయితే దీన్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇందులోనూ అనేక డైట్ ప్రక్రియలు ఉన్నాయి. ప్రతికూలతలు: ఒక్కోసారి శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించడం వల్ల చక్కెర పాళ్లు పడిపోయి సదరు స్థూలకాయుడిని ప్రమాదకరమైన పరిస్థితిలోకి (హైపోగ్లైసీమియా స్థితికి) తీసుకెళ్లవచ్చు. దాన్ని తప్పించాక... ఒకసారి స్థూలకాయులు మళ్లీ మామూలు స్థితికి వచ్చాక మళ్లీ మొదటిలాగే సాధారణ ఆహారపు అలవాట్లను కొసాగించే అవకాశాలు ఉంటాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికే రావచ్చు. వాటర్ థెరపీ ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందుగా... పూటకు అరలీటరు నీళ్లు తాగితే జీవక్రియల వేగం (మెటబాలిజం రేటు) 30 శాతం పెరుగుతుంది. ఈ అధ్యయానం ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే వైద్యవిజ్ఞాన జర్నల్‌లో ప్రచురితమైంది. దీన్నిబట్టి ఒక వ్యక్తి తాను తీసుకోవలసిన దాని కంటే ఒక రోజులో 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తాగితే అతడు క్యాలరీలను ఎక్కువగా ఖర్చుచేయగలడు. ఇలా చేస్తే ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. అనుకూలతలు / ప్రతికూలతలు : ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. బరువు పెరగకుండా ఉండటానికి ఈ అంశం దోహదపడుతుంది. ఇదొక్కటే అనుకూలత. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ఇది నమ్మకమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే... నీళ్లు కొవ్వులను నేరుగా కరిగించలేవు. అందువల్ల కొవ్వు పేరుకోవడంతో పెరిగే బరువు అన్నది వాటర్ థెరపీతో తగ్గేందుకు అవకాశమే లేదు. ఇవీ స్థూలంగా బరువు తగ్గడానికి ఉన్న కొన్ని మార్గాలు, వాటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు. ఇవన్నీ కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే. వీటిని కొన్నింటిని నేరుగా ఆచరించడం ప్రమాదకరం కావచ్చు కూడా. ఉదాహరణకు విచక్షణ రహితంగా చేసే డైటింగ్, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం వంటివి. ఇక బరువు తగ్గడానికి కొందరు కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ట్యాబ్లెట్లు, మూలికలు, హెర్బ్స్ కూడా ఇస్తుంటారు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గమనిక: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తప్పనిసరిగా మొదట ఫిజీషియన్‌ను సంప్రదించాలి. ఇక బరువు అన్నది ప్రాణాంతకంగా మారినప్పుడే (మార్బిడిటీకి దారితీసినప్పుడే) బేరియాట్రిక్ సర్జన్లు బరువు తగ్గే శస్త్రచికిత్సలను చేస్తారు. అంతే తప్ప బరువు తగ్గాలనుకునే ప్రతివారికీ అవే మార్గాలు కావని గుర్తుంచుకోవాలి. పాఠకులకు మనవి: ఈ కథనంలో విపులంగా చర్చించని కొన్ని అంశాలతో పాటు అనేక ఆహార విధానాలను రాబోయే వారాలలో విపులంగా ఇవే పేజీలలో చూడవచ్చు. కూల్స్కల్ప్టింగ్ కొన్ని చోట్ల ఉన్న కొవ్వు ఎంతగా ప్రయత్నించినా కరగదు. దాన్ని ఎంతకూ లొంగని కఠినమైన కొవ్వుగా పేర్కొంటారు. అలాంటి కొవ్వు కణాలను చాలా ఎక్కువగా చల్లబరచడం ద్వారా చనిపోయేలా చేస్తారు. ఇలా కొవ్వును నియంత్రితమైన రీతిలో (కంట్రోల్డ్‌గా) ఘనీభవించేంతగా చల్లబరచడం ద్వారా లాగేసే నాన్ సర్జికల్ ప్రక్రియే కూల్స్కల్ప్టింగ్. ఇలా చేయడం వల్ల అక్కడి కొవ్వు కణాలు నిర్వీర్యమై అచేతనమవుతాయి. దాంతో అవి ముడుచుకుపోతాయి. ఈ దశలో ఈ కొవ్వుకణాలు సహజ ప్రక్రియలో భాగంగా బయటకు విసర్జితమవుతాయి. ఇలా చేసేందుకు ప్రత్యేకమైన కూల్ స్కల్ప్టింగ్ యంత్రాన్ని వాడతారు. ప్రతికూలతలు: ఇది చాలా సుఖవంతమైన ప్రక్రియలా అనిపించినా కొవ్వు తొలగించిన ప్రాంతంలో బాగా లాగినట్లుగా అనిపించడం, నొప్పి, తాత్కాలికంగా ఆ ప్రదేశం ఎర్రబారడం, కొన్నిసార్లు చిన్న గాయంలా అనిపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొవ్వుకణాలు అంతమైపోవడం వల్ల చాలా సందర్భాల్లో మళ్లీ కొవ్వు పేరుకోకపోవచ్చు. ఒక్క టీకాతో ఊబకాయం పోతుందా? వినడానికి కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది. ఊబకాయాన్ని తగ్గించడం చిటికెలో పని అంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొందరు. ఆరోగ్యకరమైన బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో అడినోవైరస్ – 36 అనే వైరస్ నాలుగు రెట్లు ఎక్కువగా కనిపిస్తోందని.. ఈ వైరస్‌ను తొలగిస్తే బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునన్నది వీరి వాదన. ఎలుకల్లో తాము కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు పెరిగిన ఒళ్లు బరువులో 15 శాతానికి అడినోవైరస్ – 36 కారణమని తెలిసినట్లు వీరు చెబుతున్నారు. కొవ్వు కణాలను చీకాకుపెట్టి అవి వాచిపోయేలా చేయడం.. చనిపోకుండా అడ్డుకోవడం అనే రెండు పనుల ద్వారా ఈ వైరస్ ఒళ్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ మసాచూసెట్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. విన్కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ అట్కిన్సన్ ఇప్పటికే ఓ వ్యాక్సిన్‌కు పేటెంట్ కూడా సంపాదించగా.. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తమదైన వ్యాక్సిన్‌తో జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి కూడా. యువకులకు ఈ వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా వాళ్లు బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునని తద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్‌ను వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ముందుగానే మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని... వైరస్ ద్వారానే ఒళ్లు పెరుగుతున్నట్లు రూఢి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక అపోహ: తల్లిపాలు పుష్కలంగా తాగిన పిల్లలు పెద్దయ్యాక ఊబకాయులు కారు ఒక వాస్తవం: కొంత కాలం క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ మాట ప్రకటించడంతో అందరూ ఇది వాస్తవమే అనుకున్నారు. అయితే తరువాతి కాలంలో ఇదే సంస్థ తమ ప్రకటనలో వాస్తవం కొంతేనని, అధ్యయనం జరిగిన తీరులో లోపం కారణంగా ఫలితం అలా వచ్చిందని స్పష్టం చేసింది. తల్లిపాలకు, ఊబకాయానికి మధ్య స్పష్టమైన సంబంధం ఏదీ ఇప్పటివరకూ కనిపించలేదని ఇంకో విస్తృత అధ్యయనం ఆధారంగా తేల్చింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఊబకాయులు కాకుండా నిరోధిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు మాత్రం బోలెడు. అన్ని లాభాలు ఏకరవు పెట్టాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని వారు అంటున్నారు. డాక్టర్ వి.సుధాకర్ ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్, కాస్మటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
పిల్లలు/ పెద్దలు పాముకాటుకు గురైతే...?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మాది పల్లెటూరు. దాదాపు పొలాల పక్కనే మా ఇళ్లు ఉంటాయి. స్కూలైపోగానే పిల్లలెప్పుడూ ఆ పొలాల్లోనే ఆడుతుంటారు. పాములేవైనా కాటేస్తాయేమోనని మాకు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. పాము కాటేసినప్పుడు ఎలాంటి ప్రథమచికిత్స చేయాలి? ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పండి. – ఆర్. విజయలక్ష్మి, పోతవరం ఎవరినైనా పాము కాటు వేసినప్పుడు ముందుగా వారు ఆందోళన పడకుండా చూడాలి. అలాగే మనం కూడా కంగారు పడకూడదు. పాముకాటుకు గురయ్యామన్న భావనే చాలామందికి తీవ్ర ఆందోళన గొలుపుతుంది. కానీ పాముల్లో చాలావరకు విషసర్పాలు కావని గుర్తించాలి. విషసర్పం అయితే కాటువేసిన చోట రెండుగానీ లేదా ఒకటిగానీ గాట్లు ఉంటాయి. ముందుగా పాము కాటేసిన చోట సబ్బుతోనూ, నీళ్లతోనూ శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైనవారి తల వైపు ఎత్తు ఉండేలా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే విషం పైకి పాకే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత ఎలాస్టిక్ బ్యాండేజీ అంచులు ఒకదానిపై ఒకటి ఎక్కేలా (ఓవర్ల్యాపింగ్స్)తో అవయవం చుట్టూ ర్యాప్ చేస్తున్నట్టుగా కట్టాలి. ఇలా ఆ అవయవం పొడవునా... అంటే చేతికైతే భుజం వరకు, కాలికి అయితే పిక్కల వరకు కట్టాలి. మరీ బిగుతుగా కాకుండా చుట్టాలి. మరీ బిగుతుగా కడితే... ఆ కట్టిన అవయవానికి రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ వదులుగా చుడితే విషం పైకి ఎక్కకుండా ఆపడం కష్టం. కాబట్టి కట్టుకూ, చర్మానికి మధ్య మన చిటికెన వేలు పట్టేంత బిగుతుగా మాత్రమే ఆ కట్టు ఉండాలి. ఒకవేళ ఆ భాగంలో తిమ్మిరెక్కిట్లుగా ఉన్నా లేదా మొద్దుబారినట్లుగా ఉన్నా లేదా రంగు మారినట్లుగా అనిపించినా కట్టు మరీ బిగువైనట్టు అనుకోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా వదులు చేయాలి. ఎలాస్టిక్ బ్యాండేజీ లేని పక్షంలో రోలర్ బ్యాండేజీ వాడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కాటుకు గురైన అవయవం కదలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాము కాటుకు గురయ్యే అవయవం కాలు. ఇలాంటప్పుడు చీలమండలు, పాదాలు ఈ రెండింటినీ ఒక బట్టతో కట్టవచ్చు. కాళ్లు ఎక్కువగా కదిపితే విషయం పైకి వేగంగా ఎక్కే ఆస్కారం ఉంటుంది. కదలకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం.ఈ విధంగా కట్టాక చిన్నారిని / బాధితులను వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి. పాము ఫొటోను గాని, పామును చంపితే... ఆ చచ్చిన పామును వైద్యులకు చూపించగలిగితే వారు దానికి సరైన యాంటీ స్నేక్ వీనం (విషానికి సరైన విరుగుడు మందు) ఇవ్వలా లేదంటే అది విషరహితమైనా పామా అన్నది నిర్ధారణ చేయడం సులభమవుతుంది. యాంటీస్నేక్ వీనం వల్ల కొంతమందికి రియాక్షన్ వచ్చి ప్రాణానికే ప్రమాదం అవ్వవచ్చు. అందువల్ల కాటేసింది విషసర్పమైతే తప్ప వైద్యులు ప్రతి పాముకాటుకూ యాంటీవీనం ఇవ్వరు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకునేందుకు అవకాశమున్న సూచనలను, పరీక్షలను బట్టి వైద్యులు యాంటీ స్నేక్ వీనమ్ ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. అవసరమైతే బాధితుడిని ఐసీయూలో ఉంచి చాలా జాగ్రత్తగా గమనిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సినిమాల్లో చూపినట్లుగా కొన్ని పనులు చేయడం ఏమాత్రం సరికాదు. ఉదాహరణకు పాము కాటు గాయానికి మరింత పెద్ద గాటు పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విషాన్ని నోటితో పీల్చడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల పీల్చేవారికీ విషం ఎక్కి వారి ప్రాణానికీ ప్రమాదం జరగవచ్చు. గాయం దగ్గర ఐస్ పెట్టవద్దు. ఆసుపత్రికి తరలించే సమయంలో దారిపొడవునా బాధితుడిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. స్పృహకోల్పోతే పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. శ్వాస ఆగిపోతే గుండెను పునరుత్తేజితం చేయడంతో పాటు శ్వాస ఆడేటట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) ప్రక్రియను ప్రారంభించాలి. (ఇలా చేయడం తెలిస్తే). ముందుగానే ఆసుపత్రికి ఫోన్ చేసి, పరిస్థితి వివరించాలి. ఇందువల్ల తగిన సలహా తీసుకోవడంతో పాటు... రోగి హాస్పిటల్‌కు చేరగానే అత్యవసర చికిత్స జరిగే ఏర్పాట్లను ముందుగానే చేయడానికి వీలవుతుంది. పిల్లల గొంతులో చేపముల్లు గుచ్చుకుంటే? మాకు తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు చేపలను ఇష్టంగా తింటారు. అయితే ఒకసారి చేపముల్లు గుచ్చుకున్నట్లుగా ఉందని అన్నా... ఆ తర్వాత మళ్లీ మామూలైపోయారు. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఒకవేళ పిల్లల గొంతుల్లో నిజంగానే చేపముల్లు గుచ్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం జరిగితే ఏం చేయాలో సూచించండి. – రేష్మీ, నెల్లూరు పిల్లల గొంతులో చేపముల్లు గుర్చుకోవడం లేదా ఇరుక్కుపోవడం అన్నది ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల ఒక్కోసారి గొంతు బాగా వాచి, గాలిపీల్చుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా గాలి అందని పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. ఇలా పిల్లల గొంతులో గుచ్చుకున్న ముల్లును ఈఎన్టీ వైద్యులు చాల జాగ్రత్తగా తొలగిస్తారు. పిల్లల్ని వైద్యుల వరకు చేర్చేవరకు దారిపొడవునా పిల్లలతో ఐస్ చప్పరింపజేస్తూ ఉండాలి. ఈ చల్లదనం వల్ల వాపు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలా గొంతు వాపు రాకుండా, శ్వాసకి అడ్డం పడకుండా ఇలా కాస్తంత ముందుజాగ్రత్త తీసుకుంటే, గొంతులో ఉన్న ముల్లును తీయడం ఈఎన్టీ వైద్యులకు కూడా సులువవుతుంది. పాప పాలు తాగగానే వాంతి చేసుకుంటోంది మా పాపకు మూడు నెలలు. మా పాప పాలు తాగిన కొద్దిసేపటికే వాంతి చేసుకుంటోంది. ఇదేమైనా ఇబ్బందా? దీనికి పరిష్కారం ఏదైనా ఉందా? – ఎల్. ప్రసూన, వైరా చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి కొద్దిగా పాలను బయటకు తియ్యడం మామూలే. పాలు తాగే పిల్లల్లో ఇది చాలా సాధారణం. దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలుగానీ, నెమ్ము రావడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ పెరిగే కొద్దీ లేదా ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టాక ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాకగ కనీసం అరగంట సేపు తలవైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లుగా బిడ్డను ఎత్తుకుంటే చాలు... ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. పాలు తాగించాక తేన్పు తెప్పించడం కూడా ముఖ్యమే. అయితే కొంతమంది చంటిపిల్లలు ఎక్కువగా వాంతులు చేసుకుంటారు. దాంతో బరువు సరిగా పెరగరు. కొంతమంది పిల్లల్లో ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించి, తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. అరుదుగా ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. కొంతమంది చంటిపిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలవ్వవచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లుగా పెద్ద పెద్ద వాంతులు చేస్తారు. వారు బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్ స్టెనోసిస్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్ తప్పనిసరి. సమస్య ఏమైనప్పటికీ పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం ఒకసారి పిల్లల వైద్యనిపుణులను సంప్రదించడం అవసరం. డా‘‘ శివరంజని సంతోష్ సీనియర్ పీడియాట్రీషియన్,రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
హలో..నేనండీ.. చిట్టిపొట్టి చీమను..
ఆ రాజుగారి ఏడుగురు కొడుకులు వేట కెళ్లిన కథలో.. పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్న చీమను నేనే.. అంతేకాదు.. చిన్నప్పుడు మీ పుస్తకాల్లో కష్టజీవి, సంఘజీవి అంటూ పొగడ్తల వర్షం కురిపించిన చీమను కూడా నేనే.. మీకు తెలుసుగా.. మేము మా బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువును మోయగలమని.. అయితే.. అలా మోసినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఇప్పుడు చూసేయండి. మావోడు ఇచ్చిన స్టిల్ చూస్తుంటే.. బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన మాక్రో ఫొటోగ్రాఫర్ ఎకో అడియాంటో తీశారు. ఆయన సూక్ష్మ చిత్రాలు తీయడంలో ప్రసిద్ధుడు. మా కండబలాన్ని ప్రదర్శిస్తూ.. మాకంటే ఎంతో బరువైన పండును నెత్తిన బాలెన్సింగ్ చేస్తూ.. తీసుకొస్తున్న చిత్రాలను ఆయన భలేగా తీశారు. ఎలాగూ వచ్చాను కాబట్టి.. మా గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పి పోతాను. మా అంత బలం మనుషులకుంటే.. వారు ఏకంగా 4 వేల కిలోల బరువును ఎత్తేయగలరు. చీమలు మీకంటే ముందు నుంచే అంటే.. ఈ భూమ్మీద 13 కోట్ల ఏళ్ల నుంచీ ఉన్నాయి.. అంతేకాదు.. ఈ భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు.. 700 కోట్ల మంది మనుషుల బరువుతో సమానం. అంటార్కిటికా.. గ్రీన్లాండ్.. కొన్ని సుదూర ద్వీపాల్లో తప్పిస్తే.. మేం అన్నిచోట్లా ఉన్నాం. మాకు రెండు పొట్టలు ఉంటాయి.. ఒకటి మేం తిన్నది జీర్ణం చేసుకోవడానికి.. మరొకటి ఆహారాన్ని నిల్వ చేయడానికి.. మాకు ఊపిరితిత్తులు ఉండవు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్ మా శరీరంలోకి వెళ్తుంది. మాలో కొన్ని చీమల జాతులు కొన్నివారాల పాటు బతికితే.. మా రాణులు 30 ఏళ్ల వరకూ బతుకుతాయి. చెప్పింది చాలు.. చాలా పనుంది.. ఇక ఉంటా మరి.. -
ఇన్సులిన్ మాత్రలు వచ్చేస్తున్నాయి..
మధుమేహులకు.. మరీ ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్న వారికి ఓ శుభవార్త. సూది మందు బాధలు త్వరలో తొలగిపోనున్నాయి. ఎలాగంటారా? సూదులకు బదులుగా మాత్రల ద్వారా ఇన్సులిన్‌ను అందించేందుకు రంగం సిద్ధమవుతోంది కాబట్టి! నోటి ద్వారా ఇన్సులిన్‌ను అందించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రొటీన్ కడుపులోని ఆమ్లాల ధాటికి తట్టుకోలేకపోవడం, పేగుల నుంచి శరీరానికి తగినంత స్థాయిలో శోషణ జరగకపోవడం కారణంగా ఇవి విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ జాన్ ఎ.పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఇన్సులిన్‌ను నేరుగా కాకుండా అయానిక్ ద్రవం రూపంలో అందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తించారు. కోలీన్, జెరానిక్ యాసిడ్లతో కలిపిన అయానిక్ ఇన్సులిన్‌ను యాసిడ్లను తట్టుకోగల పదార్థంతో తయారైన క్యాప్సూల్‌లో ఉంచి ఇవ్వడం వీరు అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి. ఈ రకమైన మాత్రల తయారీ సులువుగానే జరిగిపోతుందని, రెండు నెలల వరకూ నిల్వ ఉంచేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిత్రాగోత్రి తెలిపారు. కడుపులోని ఆమ్లాలను తట్టుకుని పేగుల్లోకి ప్రవేశించే ఈ మాత్ర అక్కడ మాత్రం కొన్ని ఎంజైమ్‌ల కారణంగా కరిగిపోతుందని వివరించారు. జెరానిక్ యాసిడ్ల కారణంగా పేగుల్లోంచి రక్తంలోకి చేరడం సులువవుతుందని చెప్పారు. -
5 రోజులుగా నిరాహార దీక్ష : మంత్రి బరువు పెరిగారు!
న్యూఢిల్లీ : ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే.. ఎవరైనా తమ శక్తినంతా కోల్పోయి, బరువు తగ్గిపోతుంటారు. కానీ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చేస్తున్న నిరాహార దీక్షలో మాత్రం ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదో రోజులుగా దీక్ష చేపడుతున్నప్పటికీ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ బరువు పెరిగారట. ఆయన 1.5 కిలోల బరువు పెరిగినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. సత్యేంద్ర బరువు పెరగడంతో పాటు, సిసోడియా కూడా ఫిట్‌గా ఉన్నారని తెలిసింది. దీంతో పార్టీ నేతలపై ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా విరుచుకుపడ్డారు. తన ట్విటర్ అకౌంట్లో సిసోడియా, జైన్, కేజ్రీవాల్ దీక్షపై కామెంట్లు చేశారు. రుచికరమైన ఆహార పదార్థాలను వారు తింటున్నారని ఆరోపించారు. నకిలీ నిరసనతో ప్రజల్ని మోసం చేయొద్దన్నారు. సత్యేంద్ర జైన్ అకస్మాత్తుగా బరువు ఎలా పెరిగారని ప్రశ్నించిన మిశ్రా, వారు దీక్ష చేస్తున్న గదిలో సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేయాలని అనిల్ బైజాల్‌ను కోరారు. సత్యేంద్ర జైన్ బరువు గురువారం 80 కేజీలు కాగ, ఆ అనంతరం 81.5 కేజీలకు పెరిగినట్టు పేర్కొన్నారు. సత్యేంద్ర జైన్ మెడికల్ చెకప్‌ను నిరాకరించారని, నిరాహార దీక్షలో కూర్చుని ఆయన ఆహారాన్ని తీసుకుంటున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. మనీష్ సిసోడియా కూడా ఫిట్‌గా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్, మంత్రులు ఈ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆప్ నేతలు చేస్తున్న డిమాండ్ల కంటే కూడా ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ బరువుపైనే ప్రతి ఒక్కరూ దృష్టిసారించారు. మంత్రి బరువు పెరిగారనే విషయంపై ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. -
మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
లండన్ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు స్లిమ్‌గా ఉండటంతో పాటు మున్ముందు బరువు పెరగకుండా ఉంటారని తాజా అథ్యయనం వెల్లడించింది. కేలరీలను తగ్గించుకునేందుకు, నాజూకుగా ఉండేందుకు పలువురు అల్పాహారం తీసుకోవడాన్ని విస్మరిస్తుంటారని, ఇది సరైంది కాదని మయో క్లినిక్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే 350 మందిని పరిశీలించగా వారి నడుము భాగం సాధారణంగా ఉన్నట్టు గుర్తించామని, పదేళ్ల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని తెలిపింది. రోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకున్నవారు పదేళ్లలో కేవలం మూడు పౌండ్ల బరువు మాత్రమే పెరిగారని పరిశోధకులు వెల్లడించారు. బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోనివారు సరైన మోతాదులో సమతుల ఆహారాన్ని పొందలేకపోవడం వల్లే వారిలో కొవ్వు పేరుకుపోతున్నట్టు తేలింది. బ్రేక్‌ఫాస్ట్‌ను తరచూ తీసుకోనివారితో పోలిస్తే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని తమ పరిశోధనలో వెల్లడైందని మయో క్లినిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వీరెంద్ సోమర్స్ చెప్పారు. అల్పాహారం తీసుకోని వారిలో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ కొవ్వు టాక్సిన్లను విడుదల చేయడం ద్వారా రక్త నాళాలకు విఘాతం కలుగుతుందన్నారు. తాజా పండ్లు, ధాన్యాలు, గింజలతో కూడిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలని సూచించారు. -
తూనిక యంత్రం... తూతూ మంత్రం...
మనిషి వయసుకు తగ్గ ఎత్తు... అందుకు తగ్గ బరువు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. దీనికోసం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశాక ఏ వయసువారు ఎంత ఎత్తు ఉండాలి... ఎంత బరువు ఉండాలనేది నిర్థారించారు. పుట్టబోయే బిడ్డలనుంచి... పుట్టిన తరువాత పూర్తిస్థాయిలో ఎదుగుదల వచ్చేంతవరకూ ఆ లెక్కల ప్రకారమే ఉండాలంటే ఏమేరకు పౌష్టికాహారం అందివ్వాలో కూడా నిర్ణయించారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాలను వేదికగా చేశారు. అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతల బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పౌష్టికాహారం ఇవ్వాలని నిర్దేశించారు.కానీ వారి బరువు తెలుసుకునే తూనిక యంత్రాలు మాత్రం నాణ్యమైనవి కాకపోవడంతో అవన్నీ అటకెక్కాయి. పార్వతీపురం : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్వాడీ కేంద్రాలను కీలకంగా నిర్ణయించారు. అందులోని నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు నిర్దేశిత బరువు కలిగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు రెండు రకాల తూనికల యంత్రాలను సరఫరా చేశారు. వీటిని జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద కొనుగోలు చేసి ఈ కేం«ద్రాలకు సరఫరా చేశారు. వీటిని ఉపయోగించి బరువు నమోదు చేసి రికార్డుల్లో పొందుపరుస్తూ అందుకు అనుగుణంగా వారికి పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. చిన్నపిల్లలను ఒక ఓ బ్యాగ్‌లో వేసి తూసే త్రాసును సాల్టర్ స్కేల్ అని, నిల్చుని తూసే యంత్రాన్ని అడల్ట్ స్కేల్ అని పిలుస్తారు. వీటి ద్వారా బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వారికి పౌష్టికాహారం సరఫరా చేయాలి. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన ఈ యంత్రాలను వినియోగించి ప్రతీ నెలా తూనికలు కొలిచి ఆ వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి. కానీ చాలా కేంద్రాల్లో తూనికల యంత్రాలు పూర్తిగా పనిచేయడంలేదు. కొన్ని చోట్ల యంత్రాలు తప్పుడు రిపోర్టులు చూపిస్తున్నాయి. మెషీన్లో ఏది చూపెడితే ఆ సంఖ్యనే రికార్డుల్లో నమోదు చేసి అంగన్వాడీ కార్యకర్తలు చేతులు దులుపుకోవడం తప్ప అవి వాస్తవాలా కావా అని ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. అన్నీ కాకమ్మ లెక్కలే... అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ నెలా చిన్నపిల్లలను, గర్భిణులను తూకం వేసి న్యూట్రీషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం ద్వారా వివరాలను కార్యకర్త నమోదు చేయాలి. కాని చాలా కేంద్రాల్లో ఈ తూనికల యంత్రాలు లేవు. కొన్ని చోట్ల పనిచేయడంలేదు. దీనివల్ల గత నెలలో వచ్చిన గణాంకాలకు కాస్త అటు ఇటుగా కలిపేసి రికార్డుల్లో చూపిస్తూ నివేదికలు పంపించేస్తున్నారు. ఒక వేళ ఎత్తుకు తగ్గ బరువుని పిల్లలున్నా ఆ వివరాలను రికార్డుల్లో చూపించడంలేదు. బరువు తక్కువగా ఉన్నట్టయితే ఆ పిల్లలను జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్సీకి తల్లి, బిడ్డను పంపించాలి. వారిని ఆ కేంద్రానికి పంపించేందుకు వారిని ఒప్పించడం చాలా కష్టం. అందుకని తక్కువ బరువు ఉన్నప్పటికీ అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నమోదు చేసేసి తప్పించుకుంటున్నారు. లెక్కింపు ఇలా... తక్కువ బరువున్నవారిని వేర్వేరు నివేదికల్లో పొందుపరచాలి. శాం(సివియర్ ఎక్యూర్ మాల్ నిరస్ట్), మేమ్లో(మోడరేట్ ఎక్యూర్ మాల్ నరిస్ట్) చూపిస్తారు. శాం అంటే అతి తక్కువ బరువు ఉన్నపిల్లలు, మేమ్ అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు. శాంలో ఉన్న పిల్లలను ఎన్ఆర్సీకి పంపించాల్సి ఉంటుందని తెలిసి వారిని మేమ్లో చూపించి అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంచి వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంతేగాకుండా తూనిక యంత్రాలు పనిచేయని కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో లోపభూయిష్టంగా గణాంకాలు నమోదౌతున్నాయి. ఐటీడీఏ సబ్ ప్లాన్మండలాల్లో గల కురుపాం ప్రాజెక్టు పరిధిలో 316 తూనిక యంత్రాలు అవసరం కాగా కేవలం 72 ఉన్నాయి. భద్రగిరి ప్రాజెక్టు పరిధిలో 186 అవసరం కాగా చిన్న పిల్లల బరువును నమోదు చేసే స్ప్రింగు తూనిక పరికరాలు 22 మాత్రమే పనిచేస్తున్నాయి. పార్వతీపురంలో 317 పరికరాలు అవసరం ఉన్నా 185 మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాచిపెంటలో 235కు 80 పరికరాలు, సాలూరు ప్రాజెక్టులో 237కు 78 పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల అంశాలపై తిరుపతికి చెందిన పద్మావతి విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానం విభాగం చేత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు తదితర కొన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. ఈ సర్వేలో ఐసీడీఎస్ ప్రతీ నెలా అందిస్తు న్న గణాంకాలకు ,క్షేత్ర స్థాయిలో వారు చేసిన పరిశీలనలో తెలుసుకున్న గణాం కాలకుచాల వ్యత్యాసాలు ఉన్నట్టు రూఢి అయ్యింది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్న కోణంలో పరశీలన జరపగా తూనిక యం త్రాల పనితీరు విష యం వెలుగులోకి వచ్చిం ది. దీనిని దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో ఉన్న పరిస్థితులు, మూలకు చేరిన తూనిక యంత్రాల బూజు దులిపే పనిలో ఆ శాఖాధికారులు తలమునకలయ్యారు. అసలు జిల్లాల్లో ఎన్ని తూనిక యంత్రాలున్నాయి. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి. ఎన్ని పనిచేయలేదు. అనే విషయాలపై పీడీ రాబర్ట్స్ ఆరా తీస్తున్నారు. పనిచేయని చోట అంగన్ వాడీ కార్యకర్తలు నివేదికలు ఎలా పంపిస్తున్నారు. అనే వాస్తవాలను ఐసీడీఎస్ సీడీపీఓల ద్వారా తెపించుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో సమగ్ర సర్వేపై పీఓ దృష్టి ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపంతో కూడిన శిశువులు నమోదౌతుంటారు. ఇలాంటి చోట్ల తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేయకపోతే మాతా, శిశువుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న తూనిక యంత్రాల వివరాల సేకరణపై పీఓ డాక్టర్ జి.లక్ష్మిశ దృష్టిసారించారు. అవసరమైతే ఐటీడీఏ నిధులతో కొత్తవాటిని కొనుగోలు చేయడం, పాత వాటిని వీలైనంత వరకు మరమ్మతు చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి పీఓ ముందుకు వచ్చారు. పనిచేయని వాటిని మరమ్మతు చేయిస్తున్నాం... అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని చోట్ల తూనిక యంత్రాలు పనిచేయడంలేదు. అలాంటి చోట్ల పక్క కేంద్రాలనుంచి తూనిక యంత్రాలను తెప్పించుకుని పిల్లల బరువులను తూయిస్తున్నాం. నెలలో ఒకసారి తూయాలి కాబట్టి పొరుగు కేం«ద్రాలనుంచి యంత్రాలను తెప్పించి రిపోర్టు చేస్తున్నారు. త్వరలో అన్ని మెషిన్లు రిపేరు చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఐటీడీఏ సహకారంతో గిరిజన ప్రాంతంలో అన్ని కేంద్రాల్లో తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపడుతున్నాం. – విజయగౌరి, సీడీపీఓ, పార్వతీపురం -
సకాలంలో బరువు తగ్గితే మధుమేహం దూరం?
పిల్లలు బొద్దుగా లేదంటే ఊబకాయంతో ఉంటే చాలామంది ముచ్చటపడతారుగానీ.. వీరు సకాలంలో బరువు తగ్గించుకోవడం ద్వారా పెద్దయ్యాక మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. కచ్చితంగా చెప్పాలంటే పదమూడేళ్ల వయసు వచ్చేనాటికి పిల్లలు ఊబకాయులుగా లేకపోతే వారు పెద్దయ్యాక మధుమేహం బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం చెబుతోంది. డెన్మార్క్‌లోని దాదాపు 62 వేల మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఆ దేశంలో తప్పనిసరి మిలటరీ సర్వీసు నిబంధన ఉన్న విషయం తెలిసిందే. పాఠశాలతోపాటు ఈ సర్వీసు సమయంలో నమోదు చేసిన వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీరి ఆరోగ్యంపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించుకోగలిగారు. ఆ తరువాత జాతీయ ఆరోగ్య సమాచారం కింద వీరిలో ఎవరికైనా మధుమేహం వచ్చిందా? అన్నదాన్ని పరిశీలించారు. రెండింటినీ పోల్చి చూడటం ద్వారా సకాలంలో బరువు తగ్గిన పిల్లలకు పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. పిల్లలు బొద్దుగా అందంగా కనిపిస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోవచ్చుగానీ.. వారు సకాలంలో పెరిగిన ఒంటిని తగ్గించుకుంటే మేలన్న విషయం తమ అధ్యయనం చెబుతోందని స్టీవెన్ గోర్ట్మేకర్ అంటున్నారు. -
ఎప్పుడు తినాలో తెలిస్తేనే.. బరువు తగ్గుతారు!
వేళాపాళా లేని ఆహారంతో ఒళ్లు పెరిగిపోవడమే కాకుండా అనేకానేక చిక్కులు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఒళ్లు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నది ముఖ్యమవుతుందని అంటున్నారు కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడు చాలామంది అర్ధరాత్రి వరకూ మేలుకుని ఉండటం, అదే సమయంలో చిరుతిళ్లను ఎక్కువగా తీసుకోవడం చేస్తూంటారని.. ఈ అలవాట్లు రెండూ ఒళ్లు తగ్గించుకునే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వీరు హెచ్చరిస్తున్నారు. రెండు గుంపుల ఎలుకలకు వేర్వేరు సమయాల్లో ఆహారం అందించడం ద్వారా వాటిలో వచ్చిన మార్పులను తాము పరిశీలించామని, కొంత కాలం తరువాత పరిశీలించగా.. రోజుకు ఎనిమిది గంటలపాటు మాత్రమే ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రోజంతా ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా లావెక్కిపోయాయని వివరించారు. దీన్నిబట్టి రోజులో వీలైనంత తక్కువ సమయంలో ఆహారం తీసుకోవాలని తమ అధ్యయనం చెబుతోందంటున్నారు. -
బరువు తగ్గేందుకు ప్రోబయోటిక్స్
బరువు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేసుంటారు.. చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి కసరత్తులు లేకుండానే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నార్వేలోని వెస్ట్‌ఫోల్డ్ హాస్పిటల్ ట్రస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కొద్దికాలం పాటు ప్రోబయోటిక్స్ (మేలు చేసే బ్యాక్టీరియాతో కూడిన ఆహార, పానీయాలు)ను తీసుకోవడం ద్వారా బరువు, బాడీమాస్ ఇండెక్స్‌ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన దాదాపు 16 అధ్యయనాలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని హెడీ బోర్గెరాస్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. 3 వారాల నుంచి 12 వారాల పాటు ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా శరీర బరువు తగ్గినట్లు గుర్తించారు. అయితే ఈ మార్పు కొంచెం తక్కువగానే ఉన్నా మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనల ద్వారా ప్రోబయోటిక్స్ ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయగలమని అంటున్నారు. ఇంకో విషయమేంటంటే పెరుగు.. ఊరగాయలు కూడా ప్రోబయోటిక్సే. తగిన మోతాదులో తింటే వీటి ద్వారా బరువు తగ్గొచ్చన్న మాట. -
అమ్మా! నేను లావు అయిపోయా!
పిల్లలు... మరీ లావయిపోతున్నారు? ఇదేమీ సంపన్నుల ఇళ్ల చుట్టూ తిరిగిన అధ్యయనం కాదు. పేద... మధ్య తరగతి ఇళ్ల చుట్టూ తిరిగిన అధ్యయనమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో ఈ సంగతి బయటపడింది. ఆటల్లేక లావయిపోతున్నారు. అందుకే... పిల్లలను ఆడుకోనిద్దాం... ఆరోగ్యంగా పెరగనిద్దాం! ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, కౌమార వయస్కులు అవసరానికి మించి బరువు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లు సంయుక్తంగా జరిపినఅధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. వరల్డ్ ఒబేసిటీ డే (అక్టోబరు 11వ తేదీ) సందర్భంగా ప్రఖ్యాత వైద్యశాస్త్ర పరిశోధన మ్యాగజైన్ ద లాన్సెట్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలుప్రచురితమయ్యాయి. దాదాపు వెయ్యిమంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొనగా.. 13 కోట్ల మంది (5– 19 మధ్య వయసు వారు) ఎత్తు, బరువులను పరిశీలించారు. ఈ వివరాలఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించగా.. 1975లో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు, కౌమార వయసు వారి సంఖ్య కోటీ పది లక్షలు మాత్రమే ఉంటే.. 2016నాటికి ఇది 12.4 కోట్లకు పెరిగిపోయినట్లు స్పష్టమైంది. ఇంకోలా చెప్పాలంటే 40 ఏళ్లలో ఊబకాయులు పదిరెట్లు పెరిగారు. అంతేకాకుండా ఇంకో 2.13 కోట్ల మంది అవసరానికి మించిఎక్కువ బరువు ఉన్నా.. వారిని ఊబకాయులుగా పరిగణించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2022 నాటికల్లా అవసరమైనదాని కంటే తక్కువ బరువున్న పిల్లల కంటే ఊబకాయులే ఎక్కువగా ఉంటారని ఈ అధ్యయనం హెచ్చరించింది. 2016 నాటికి ఊబకాయులైన పిల్లల్లో 5 కోట్ల మంది బాలికలు కాగా, 7.4 కోట్ల మంది బాలురని.. ఇదే సమయంలో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువున్న వారిలో బాలురు, బాలికల సంఖ్య 7.5, 11.7 కోట్ల వరకూ వరకూ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ ఫియానా బుల్ తెలిపారు. ఊబకాయం సమస్య పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదని, కాకపోతే వీరిలో పెరుగుదల గత 40 ఏళ్లలో ఆరు రెట్లు మాత్రమే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చెబుతోంది. 1975లో ఊబకాయుల సంఖ్య పది కోట్ల వరకూ ఉంటే.. 2016కు ఇది 67 కోట్లకు పెరిగింది. అలాగే అవసరానికి మంచి బరువున్నా.. ఊబకాయులుగా చెప్పలేని వారు ఇంకో 130 కోట్ల మంది తేలింది. భారత దేశం విషయానికొస్తే.. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ అంచనాల ప్రకారం 2025 నాటికి దాదాపు 4.83 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతూంటారు. ధనిక దేశాల్లో తగ్గుముఖం... ఊబకాయం సమస్య 1975 నుంచి, మధ్య, అల్పాదాయ దేశాల్లో ఎక్కువవుతూ వస్తూండగా.. చాలా వరకూ ధనికదేశాల్లో ఊబకాయుల సంఖ్య తగ్గిపోతోంది లేదంటే.. స్థిరంగా ఉంటోందని ఈఅధ్యయనం చెబుతోంది. తూర్పు ఆసియా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కుటుంబాల ఆదాయాలు పెరగడం వల్ల కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎక్కువైందని..ఫలితంగా పిల్లలు తొందరగా ఊబకాయం బారిన పడుతూండటంతోపాటు.. అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ అధ్యయనం చెబుతోంది. శారీరక శ్రమ కల్పించాలి.. ఊబకాయం సమస్య పిల్లల్లోనూ ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసే ప్రయత్నాల్లో ఉంది. ‘ఎండింగ్ ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీఇంప్లిమెంటేషన్ ప్లాన్‘ పేరిట జారీ కానున్న ఈ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలకు శారీరక శ్రమ కల్పించే ఆటలు, వ్యాయామాన్ని అన్ని దేశాలు ప్రోత్సహించాలి. అదే సమయంలో అధికకేలరీలు మాత్రమే అందిస్తూ.. ఇతర పోషకాల మోతాదు తక్కువగా ఉన్న ఆహారం విషయంలో.. అంటే జంక్‌ఫుడ్ తినడాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ బీఎంఐ లెక్కించేదిలా.. మీ శరీర బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువును ఎత్తు తాలూకూ ఘనంతో భాగిస్తే బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది. ఉదాహరణకు మీ ఎత్తు, 5.8 అడుగులు లేదా1.76 మీటర్లు అనుకుందాం. బరువు 68 కిలోలైతే.. మీ బీఎంఐ 68/1.76 ఇంటూ 1.76 = 22.0 అవుతుంది. బీఎంఐ 19 వరకూ ఉంటే బరువు తక్కువ ఉన్నారని, 19 – 24.9 మధ్య బీఎంఐఉంటే ఆరోగ్యకరమైన బరువు ఉన్నారని అర్థం. బీఎంఐ 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే అధిక బరువు ఉన్నారని.. 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయమని అర్థం. ఈ లెక్కలు 19 ఏళ్లకుమించిన వారికి మాత్రమే వర్తిస్తాయి. పిల్లల్లో బీఎంఐ లెక్కింపునకు ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు. ఊబకాయం తగ్గాలంటే... ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఊబకాయం సమస్యను కొంత వరకూ అధిగమించవచ్చు. ►మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన శక్తి నిలకడగా.. ఎక్కువ సమయం అందడంతోపాటు అత్యవసరమైన ఇతరపోషకాలూ అందుతాయి. ►ఆయా కాలాల్లో దొరికే పండ్లు, కాయగూరలు రోజూ తీసుకోవాలి. కనీసం రోజూ రెండు రకాల పండ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీయాక్సిడెంట్లు లభిస్తాయి. ► కందిపప్పు, పెసరపప్పులతోపాటు శనగలు, సోయా, రాజ్మా వంటి పప్పుధాన్యాలను కూడా వాడాలి. వీటి ద్వారా అందే ప్రొటీన్లు శరీర బరువును నియంత్రణలో ఉంచడం మాత్రమే కాకుండాకడుపు నిండుగా ఉన్న అనుభూతిని కల్పిస్తాయి. ► శరీరానికి అవసరమైన మొత్తం కేలరీల్లో చక్కెరల ద్వారా అందేది పదిశాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది ఐదు శాతం కంటే తక్కువ ఉంటే మరీ మేలు. ఎంత తక్కువ వాడితే అంత మంచిదన్నమాట. ► కొవ్వులు శరీరానికి అవసరమే కానీ ఇది మొత్తం కేలరీల్లో 15 శాతం వరకూ ఉండేలా చూసుకోవాలి. వంట నూనెలు మార్చి మార్చి వాడటం వల్ల అన్ని రకాల పోషకాలూ అందుతాయి. -
అమ్మ కడుపే చల్లగా..!
సందర్భం నాక్కొంచెం గడువివ్వండి అమ్మకు నచ్చజెప్పుకుంటా ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా ఉమ్మనీరు మింగను పేగు మెడకు మెలేసుకోను అల్లరి చేయను... అడ్డం తిరగను నాక్కొంచెం గడువివ్వండి ఒక పూట పస్తుంటా ఒకలెక్క పడుకుంటా బరువు పెరగను... బాధపెట్టను నాక్కొంచెం గడువివ్వండి గోరఖ్‌పూర్ ఘోరం విన్నాను నాబోటివాళ్ల ప్రాణాలు గాలి అందక గాల్లో కలిసిపోయాయి గుంటూరులో గుండెకోత గుర్తుంది ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన శిశువు రక్తమోడుతూ ప్రాణం విడిచింది మీ దవాఖానాల్లో ఆక్సిజన్ నింపండి ప్రసూతి వార్డుల్లో ఎలుకల్ని తరమండి పందికొక్కలపై కొరడా ఝుళిపించండి డాక్టర్లను డ్యూటీలో పెట్టండి ఏలేవారి మెదడువాపుకి మందేయండి అప్పటివరకూ... నాక్కొంచెం గడువివ్వండి అమ్మకు నచ్చజెప్పుకుంటా ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా గర్భంలో..! – పూడి శ్రీనివాసరావు -
హన్మకొండలో చోటాభీమ్
5.3 కిలోల బరువుతో జన్మించిన శిశువు హన్మకొండ చౌరస్తా: హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ తల్లి 5.3 కిలోల పండంటి పాపకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కె.మంజులకు వైద్యులు సోమవారం ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. ఆమెకు 5.3 కిలోల బరువుతో శిశువు జన్మించింది. పాప ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. మంజులకు ఇది మూడో కాన్పని, ఇదివరకు ఇద్దరు కుమారులు ఉన్నారని ఆమె బంధువులు తెలిపారు. -
టీనేజీలో పెరిగే బరువు... పెద్దయ్యాక తేవచ్చు పక్షవాతం ముప్పు!
పరిపరిశోధన టీనేజీలోపే... అంటే ఎనిమిది నుంచి 20 ఏళ్ల వయసులోపు ఉన్న చిన్నారులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరుగుతున్నారా? ఆ పెరుగుదల ఆందోళనకరం అంటున్నారు స్వీడన్ శాస్త్రవేత్తలు. ఎనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయసులో పిల్లలు ఎంత ఎక్కువ బరువు పెరుగుతుంటే... పెద్దయ్యాక వాళ్లలో పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌కు చెందిన అధ్యయనవేత్తలు. వాళ్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)లో ప్రతి రెండు పాయింట్ల పెరుగుదలతో పక్షవాతం వచ్చే రిస్క్ 20 శాతం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అంత ఎక్కువగా పెరిగిన బరువు కారణంగా... అలాంటి పిల్లల్లో ఆ ఊబకాయానికంతా రక్తం అందించలేక, రక్తనాళాల సామర్థ్యం తగ్గుతుందనీ, దాంతో పెద్దయ్యాక వారిలో మెదడుకు సరిగా రక్తం అందక పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది వారి విశ్లేషణ. అందుకే టీనేజీలో పిల్లలు బరువు పెరుగుతుంటే, దాన్ని నియంత్రించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని వారు చెబుతున్నారు. -
బడి సంచులా.. బస్తాలా?
సాక్షి, హైదరాబాద్: ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాల్యం పుస్తకాల బరువుతో భారంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో చిన్నారులు అల్లాడిపోతున్నారు. తమ సామర్థ్యానికి మించిన బరువును మోయలేక వారి నడుములు ఒంగిపోతున్నాయి. ఇక రెండు, మూడు అంతస్తుల్లోని తరగతి గదుల్లోకి వెళ్లాలంటే విద్యార్థులకు నరకమే. పుస్తక భారంతో విద్యార్థి శారీరక ఎదుగుదల ప్రమాదంలో పడుతున్నా ప్రభుత్వాలకు మాత్రం పట్టడం లేదు. పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్–2006 చెబుతున్నా.. రెట్టింపు (100 శాతానికిపైగా) బరువుతో విద్యార్థుల నడ్డివిరిగిపోతోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు అసలు పుస్తకాలే మోయవద్దని చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. బరువే బరువు.. భారంగా చదువు రాష్ట్రంలోని 11 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో రెండు, మూడు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న స్కూళ్లే అత్యధికం. అసలే బ్యాగు బరువు.. పైగా రెండు, మూడు అంతస్తుల్లో తరగతి.. దీంతో విద్యార్థులు తంటాలు పడాల్సివస్తోంది. పాఠశాల విద్యా శాఖ నిర్వహించిన సర్వేలో విద్యార్థుల వద్ద ఉన్న పుస్తకాలు తూచారు. ఎల్బీ నగర్‌లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి బ్యాగ్‌లో 15 కిలోల బరువున్న 38 పుస్తకాలు, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ బడిలో 1వ తరగతి విద్యార్థి వద్ద 7 కిలోల బరువున్న 26 పుస్తకాలు, సూర్యాపేటలోని ఓ కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి వద్ద 25 కిలోల బరువున్న 32 పుస్తకాలు ఉన్నట్టు గుర్తించారు. అదే సూర్యాపేట మండలం చివమ్ములలో మూడు ప్రాథమిక, మూడు ఉన్నత పాఠశాలల్లో పరిశీలిస్తే పుస్తకాల సంచి బరువు 1.5 కిలోల నుంచి 8.5 కిలోలకు మించలేదని తేల్చారు. ప్రస్తుతం యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. అతని స్కూల్ బ్యాగ్ బరువే 3.5 కిలోలకు పైగా ఉంటోందని విద్యాశాఖ అంచనా వేసింది. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువే 8 కిలోలకుపైగా ఉంటోంది. ఇక 35 కిలోల బరువు ఉండే ఏడో తరగతి విద్యార్థి పుస్తకాల బరువు 10 కిలోలకు పైగా ఉంటోంది. చట్టం ఏం చెబుతోదంటే.. – నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్ బ్యాగ్ మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు. – స్కూల్ బ్యాగ్ బరువు, రోజువారీగా తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు తల్లిదండ్రులకు మార్గదర్శకాలివ్వాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. – ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు(రోజు అవసరం లేనివి ఇంటికి తీసుకెళ్లి మోసుకు రావడం తగ్గించేందుకు) ప్రతి విద్యార్థికీ లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే గుర్తింపును రద్దు చేయవచ్చు. బ్యాగు బరువుతో ఆరోగ్యానికి దెబ్బ.. ‘‘విద్యార్థి బ్యాగు బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగులపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, కింది భాగం దెబ్బతిని వెన్నునొప్పి వస్తుంది. భుజాలు ముందుకు ఒంగిపోవడంతో పాటు కిందకు ఒంగిపోతాయి. వెన్నుముక ఒంగిపోవడమే కాక దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. ఆయాసం పెరుగుతుంది’’అని వైద్యులు చెపుతున్నారు. తరగతుల వారీగా ఉండాల్సిన పుస్తకాలు, బరువు(కిలోల్లో) తరగతి పుస్తకాలు బరువు 1 మాతృభాష, ఇంగ్లిషు, గణితం 0.85 2 మాతృభాష, ఇంగ్లిషు, గణితం 0.81 3 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.1 4 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.2 5 మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1.3 6 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ 2.6 7 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ 2.2 8 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 2.8 9 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 2.9 10 మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్ (ఫిజికల్, బయలాజికల్), సోషల్ 3.5 కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల బ్యాగులో పుస్తకాలు, వాటి సంఖ్య, బరువు తరగతి పుస్తకాలు, నోటు బుక్కుల సంఖ్య బరువు 1 16 5.5 2 21 7.5 3 22 8.5 4 23 8.7 5 25 9.5 6 26 9.7 7 27 10 8 30 12 9 34 14.5 10 38 16 -
హీరోయిన్ బరువు పెంచేందుకు తంటాలు
చెన్నై: ‘నేను శైలజా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కీర్తి సురేష్‌కు... ఆమె ఫిజిక్ ఇప్పుడు సమస్యగా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సావిత్రి మాదిరి గెటప్ వేయించి కీర్తి సురేష్‌తో చిత్రీకరణ కూడా మొదలెట్టారు. అయితే ఈ గెటప్ చిత్రాలు లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో సావిత్రిలా... కీర్తి సురేష్‌కు గెటప్ నప్పలేదే, ఇంకా లావైతే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతల్ని హీరోయిన్ బరువు సమస్య ఆలోచనలో పడేసిందని సమాచారం. కీర్తి సురేష్‌ను బరువు పెంచాలని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పినప్పుడు సరేనన్న ఈ బ్యూటీ ఆ తరువాత అది కష్టం అని చేతులెత్తేసిందట. ఆమెకు అనుష్క బాధలు గుర్తు కొచ్చాయో ఏమో..? ఓ సినిమా కోసం సుమారు 80 కిలోల బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి పడని తంటాలు లేవు. బాహుబలి–2 చిత్ర నిర్మాతలకు తన బరువు విషయంలో భారీ ఖర్చునే పెట్టించారనే ప్రచారం హల్చల్ చేసింది. చివరిగా గ్రాఫిక్స్‌తో అనుష్క బరువును తగ్గించారు. కాగా, మహానది చిత్రంలో కీర్తిసురేష్ బరువు ఇదే తీరున పెంచాలన్న నిర్ణయానికి ఆ చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్ర షోషిస్తుండగా, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కేజీ బరువు తగ్గితే రూ.969 బహుమానం!
వాంగ్ క్సేబో.. చైనాలోని క్జియన్ నగరంలో ఇన్వెస్టింగ్ కన్సల్టింగ్ కంపెనీకి యజమాని. ఇటీవల కాలంలో వాంగ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. అతని కంపెనీ విపరీతమైన లాభాల్లోకి రావడంతో వాంగ్ ఫేమస్ అయిపోలేదు.. తన కంపెనీలో అమలు చేసిన ఒక కార్యక్రమం వల్ల వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతను చేసిన ఆ కార్యక్రమం ఏంటంటే ఎవరైతే బరువు తగ్గుతారో వారికి నగదును బహూకరించడం. ప్రతి ఒక కేజీ బరువు తగ్గినందుకు గాను 15 డాలర్లు (సుమారు రూ. 969) ఇస్తానని వాంగ్ తన ఉద్యోగులకు ప్రకటించాడు. డ్యూటీకి రాగానే డెస్క్ నుంచి ఎవరూ ఎక్కువగా కదలకుండా అలాగే పనిచేస్తున్నారని, అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని తద్వారా వాళ్లంతా ఊబకాయులుగా మారిపోతున్నారని ఆయన ఈ పనికి పూనుకొన్నాడు. ఈ బరువు తగ్గించే కార్యక్రమం వల్ల చక్కని సంస్కృతిని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించవచ్చని వాంగ్ తెలిపాడు. మార్చిలో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగులు బరువు తగ్గారు. కొవ్వు పదార్థాలను తినడం మానేసి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. మరికొందరైతే ఎక్కువ డబ్బులు పొందాలని జిమ్‌కు సైతం వెళుతున్నారు. జోవై అనే మహిళా ఉద్యోగి గత రెండు నెలల్లో 20 కేజీలు తగ్గిందంటే వారు దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇప్పటివరకు 300 డాలర్లను గెలుపొందింది. తాను రోజూ జిమ్‌కు వెళ్లడంతోపాటు చక్కని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
బాడీ బరువు కరిగించండి
- పోలీసులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచన - పోలీస్ స్టేషన్లలో వ్యాయామం తప్పనిసరి - సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్‌పై అవగాహన కల్పించాలి.. - ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ తనిఖీ ఓర్వకల్లు : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అత్యంత చురుగ్గా పని చేయాల్సి ఉంటుందని, అలాంటి వారికి బాడీ పెరిగితే ఇబ్బందిగా మారుతుందని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శారీరక బరువును తగ్గించుకోవాలని సూచించారు. ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపుల వద్ద ఏర్పాటు చేసిన వైట్ మార్కులను పరిశీలించారు. అనంతరం ఏడాది కాలంగా స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, మృతుల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది బాగోగులు, వారి సమస్యలపై విచారించారు. పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. తర్వాత సిబ్బందితో పాటు ఎస్పీ కూడా పోలీస్ స్టేషన్లో 30సార్లు డిప్స్ తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మే నెల నుంచి తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. పోలీసుల్లో చురుకుదనం పెంచేందుకు పోలీస్ స్టేషన్లలో వ్యాయామం తప్పనిసరి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు విడుదల చేసిన గుడ్ సమార్తిన్ అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించాలని ఎస్ఐలకు సూచించారు. ఆయన వెంట ఎస్ఐ చంద్రబాబు నాయుడు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
డీలర్లకు తూకం సరకులు
–జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ కర్నూలు(అగ్రికల్చర్): పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ పాయింట్లలో డీలర్లకు సరుకులు విధిగా కాటా వేసి ఇవ్వాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ ఇన్‌చార్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ... తాను ఇటీవలనే జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. వచ్చిన వెంటనే డీలర్లకు సరుకులను తూకం వేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 2,423 చౌక ధరల దుకాణాలు ఉండగా ఏప్రిల్ నెలకు సంబందించి 90 శాతం షాపులకు సరుకులు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన షాపులకు 30వ తేదీ సాయంత్రానికి చేరుతాయన్నారు. చక్కెర కొంత ఆలస్యమైనా.. అన్ని కార్డులకు విడుదల అయిందని వివరించారు. చౌకదుకానికి సరుకులు చేరినట్లు డీలర్లు..ఈ–పాస్ మిషన్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. -
ఆ నటి బరువు 108: ఇంకా బరువు పెరగాలట!
ఆమె బరువు 108 కిలోలు.. అయినా, తమ టీవీషో కోసం మరింత బరువు పెరుగాలని నిర్వాహకులు సూచించారు. వారికి ఆమె సింపుల్ గా నో చెప్పింది. ఇది అంజలీ ఆనంద్‌కు ఎదురైన అనుభవం. ప్రముఖ చానెల్ స్టార్‌ప్లస్‌లో త్వరలో ప్రసారమయ్యే ’డాయి కిలో ప్రేమ్’ అనే టీవీ షోతో ఆమె తొలిసారి ప్రేక్షకులను పలుకరించబోతున్నది. అధిక బరువున్న అమ్మాయిగా ఈ షోలో నటిస్తున్నది. ఇప్పటికే ఆమె 108 కిలోల బరువు ఉండగా.. నిర్వాహకులు మరింత బరువు పెరగాలని, అప్పుడే షో కోసం బాగుంటుందని కోరారు. అయితే, వారి అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ‘నేను ఇప్పటివరకు ఎంతో చురుగ్గా జీవించాను. నాకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ఇష్టం. నిలకడైన బరువును పాటించాను. ఇప్పుడు ఒక్కసారిగా బరువు పెరగమంటే నేను గట్టిగా నో అనే చెప్తాను. నేను ప్రస్తుతం 108 కిలోల బరువు ఉన్నాను. ఇంకా బరువు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది. డాయి కిలో ప్రేమ్’ ఏప్రిల్ 3 నుంచి స్టార్ ప్లస్ లో ప్రసారం కానుంది. ఈ షోలో అంజలి సరసన నటిస్తున్న మెహెర్జాన్ మజ్దా కూడా 16 కిలోల బరువు పెరిగాడు. -
వచ్చే పదేళ్లలో ఇండియాకు కొత్త సవాళ్లు!
గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్–2017 బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇలాంటి విచిత్ర పరిస్థితినే వచ్చే పదేళ్లలో మనదేశం ఎదుర్కొనబోతోందట. అందుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇంతకీ ఆ విచిత్ర పరిస్థితేంటో మరే చదవండి... డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆకర్షణీయ నగరాలు, మెట్రో రైళ్లు వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఫలితంగా వచ్చే పదేళ్లలో దేశ పట్టణ జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇలా పెరిగే పట్టణ జనాభాతో దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొనుందట. ‘గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్–2017’ పేరుతో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా పట్టణాలకు వలస రావడంతో ఇక గ్రామాల్లో ఉండేవారి పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారికి కనీసస్థాయి పోషకాహరం కూడా అందని దుస్థితి నెలకొంటుందని తెలిపింది. ఇక పట్టణాల్లోకి వచ్చేవారిలో 17 శాతం మంది మురికివాడల్లోనే నివసించాల్సి వస్తుందని, ఇటువంటి వారికి కూడా సరిపడ స్థాయిలో పోషకాహారం అందే పరిస్థితి ఉండదని తెలిపింది. దాదాపు 78 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తారని, చాలీచాలని జీతం, అధిక పనిగంటలు, విశ్రాంతి కూడా తీసుకోని పరిస్థితులు, కాలుష్యపూరిత వాతావరణంలో నివసించడం వంటివి పట్టణ జనాభాలో 78 శాతం మందిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాలు అమలు చేసే ఉపాధి కూలీ, మధ్యాహ్న భోజనం, రేషన్ బియ్యంతోనే నెట్టుకొచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. ఇందుకు భిన్నంగా... ఒకవైపు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పనిలేని పరిస్థితులుంటే మరోవైపు అధిక పోషకాహారం కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య కూడా భారత్‌లో పెరుగుతోందని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే ఐదేళ్లలోపు చిన్నారుల్లో 38.5 మంది అవసరమైన దానికంటే ఎక్కువ బరువున్నారని, రానున్న పదేళ్లలో వీరిసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిపింది. మధుమేహం, ఊబకాయం, అధిక బరువు, జీవనశైలిలో శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో అనారోగ్యంబారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందని వెల్లడించింది. రెండూ సమస్యలే... ఆహార కొరతను అధిగమించేందుకు అవకాశమున్నప్పటికీ నివాస సదుపాయాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది ఇబ్బంది పడక తప్పదని, ఇది దేశానికి తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని హెచ్చరించింది. మరోవైపు అవసరానికి మించి పోషకాహారం, సుఖమైన జీవన విధానం కారణంగా అనారోగ్య సమస్యలనెదుర్కొనేవారి సంఖ్య కూడా దేశానికి ఇబ్బందికరంగానే మారే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ రెండింటిని పరిష్కరించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరముందని సర్వే సంస్థ అభిప్రాయపడింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఏదైనా మన మంచికే!!
వాషింగ్టన్: ఆ మధ్య ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ బాగా పాపులర్ అయ్యింది. దాని పేరు పొకెమన్. ఫోన్లో ఈ గేమ్ ఆడడం కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగాయి. దీంతో చాలా దేశాలు ఆ గేమ్‌ను నిషేధించాయి కూడా.ఈ గేమ్ ఆడుతూ దేశాలు సరిహద్దులును కూడా దాటిపోయి కటకటాలపాలైన సందర్భాలున్నాయి. అయితే ఈ గేమ్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం తాజా పరిశోధనలో తేలింది. పోకెమన్ గేమ్ ఆడినవారు తమకు తెలికుండానే చాలా బరువు తగ్గారట. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసే జనం.. రూపాయి ఖర్చు చేయకుండానే కేవలం పొకెమన్ ఆడడం వల్ల బరువు తగ్గినట్లు గుర్తించారట. కారణం... ఈ గేమ్‌లో పొకెమన్ బొమ్మల కోసం ఫోన్‌ను చేతిలో పట్టుకొని దానిని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా తమకు తెలియకుండానే రోజువారీ నడక పెరిగిందని, శారీరక శ్రమ కూడా పెరిగిందని, ఫలితంగా బరువు తగ్గామని చెబుతున్నారు. ఈ గేమ్ ఆడేవారు రోజుకు సగటున 10వేల అడుగులు వేస్తున్నారంటే వారికి ఎంతగా మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ఎత్తు పెరగడం ఆగిందా?
పిల్లల్లో ఏదైనా వైద్యపరమైన సమస్య తర్వాత హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు ఎనిమిదేళ్లు. బరువు పెరగడం లేదు. అలాగే ఎత్తు కూడా పెరగడం లేదు. వాడి వయసులో ఉన్న తోటి పిల్లలతో పోలిస్తే వాడి ఎత్తు చాలా తక్కువ. డాక్టర్ సలహా మేరకు ఎక్స్–రే, స్కల్, చేతుల పొడవు, థైరాయిడ్ పరీక్షలు చేయించాం. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఎత్తు పెరగకపోవడానికి కారణం ఏమిటి? హోమియోలో ఎత్తు పెంచే మందులు ఉన్నాయా? – సుధాకర్‌రావు, కోదాడ ఒక వ్యక్తి తాను ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉండటాన్ని ‘షార్ట్ సాచ్యుర్’ కండిషన్ అంటారు. ఈ సమస్యతో పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు ఎక్కువగా బాధపడుతుంటారు. తల్లిదండ్రుల జన్యువుల ప్రకారం ఆరోగ్యకరమైన ఎదుగుదల కలిగి ఉండి, వారు తమ తోటి పిల్లల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉంటే అది వారి సాధారణ ఎత్తుగానే భావించాలి. అయితే ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా ఎదగాల్సిన ఎత్తుకు పెరగకపోవడం అన్న విషయాన్ని సమస్యగా పరిగణించాలి. కారణాలు ►పుట్టుకతో సంభవించే గుండెవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, ఆస్తమా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు. ►పెరుగుదల నెమ్మదిగా ఉండటం ►యుక్తవయసు (ప్యూబర్టీ) నెమ్మదిగా రావడం. ► ౖహె పోథైరాయిడ్ సమస్య పుట్టుకకు ముందు నుంచే ఉండటం ► పౌష్టికాహారలోపం ► పెరుగుదలకు కారణమయ్యే హార్మోన్ స్రావం తగ్గడం జాగ్రత్తలు ► సాధారణంగానే తల్లిదండ్రుల ఎత్తు మామూలు ఎత్తు కంటే తక్కువగా ఉండే, వారి జన్యువుల ప్రకారం పిల్లల ఎత్తు కూడా తక్కువగానే ఉంటే దాన్ని సాధారణ ఎత్తుగానే పరిగణించాలి. వారి విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోనవసరం లేదు. అలా కాకుండా... ► పిల్లలు తమ వయసులో ఉన్న ఇతరుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నా లేదా పెరగడం ఆగిపోయినా డాక్టర్‌ను సంప్రదించాలి. ►పిల్లల ఎత్తు, బరువు, కాళ్లు, చేతుల నిడివి వంటి కొలతలతో ఏదైనా తేడా ఉండటం, వాటిలో పెరుగుదల సరిగా లేకపోవడం వంటివి జరిగాయని అనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. నిర్ధారణ పరీక్షలు ఎక్స్–రే, సీబీపీ – రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా అని పరిశీలించాల్సి ఉంటుంది. చికిత్స ఈ సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఎత్తును, బరువును పరిశీలిస్తే బెరైటా కార్బానికా, తుజా ఆక్సిడెంటాలిస్, కాల్కేరియా ఫాస్ఫారికా మొదలైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ లో ఈ మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఇంప్లాంట్‌ను తొలగించాల్సిందే..! అర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను బైక్‌పై నుంచి కింద పడ్డాను. అప్పుడు నా మోకాలు కొద్దిగా వాచింది. చాలా నొప్పిగా ఉంది. ఆ కాలిపై ఎంతమాత్రమూ భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీశారు. ఫ్రాక్చర్ కాలేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుకుమార్, విజయవాడ ఫ్రాక్చర్ లేనప్పటికీ నొప్పి తగ్గలేదంటున్నారు, అంటే... మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు కొన్నిసార్లు ఎక్స్–రేలో కనిపించకపోవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. నా వయసు 24. కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. అప్పుడు శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? ఆ మెటల్ స్క్రూలను అలాగే ఉంచేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఎందుకంటే మళ్లీ ఆపరేషన్ అంటే భయంగా ఉంది. – నవీన్‌కుమార్, నిజామాబాద్ మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో ఇలా రెండు ఆపరేషన్లు చేయక తప్పదు. లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించడమే మేలు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. వృద్ధులలో... ‘శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉండవచ్చు’ అనిపించినప్పుడు మాత్రమే మొదటి ఆపరేషన్‌లో అమర్చిన మెటల్ భాగాలను అలాగే వదిలేస్తాం. ఇలాంటి పరిస్థితి అతి కొద్దిమందిలో మాత్రమే ఎదురవుతుంటుంది. ఇక యువకులలో చేతుల పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే వాటిని అలాగే వదిలేయాల్సి ఉంటుంది. మీరు ముంజేయి అంటున్నారు... కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. అలా తొలగించకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనపడుతుంది. ఆ స్థితిలో ఆ చేతి మీద ఏ మాత్రం బరువు పడినా విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. ధైర్యంగా సర్జరీకి సిద్ధంకండి. డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఈ బాహుబలి ఏం తింటాడో తెలుసా?
-
పాకిస్తాన్ పహిల్వాన్
ఖాన్ బాబా ఇతని పేరు అర్బాబ్ ఖైసర్ హయత్. వయసు కేవలం 25 ఏళ్లు. కాని వెయిట్ ఎంతో తెలుసా? 436 కిలోలు. రోజుకు 36 గుడ్లు తింటాడు. నాలుగు కోళ్లు పంటి కింద వేసి నమిలేస్తాడు. ఐదు లీటర్ల పాలు గుటగుటమని చప్పరించేస్తాడు. పాకిస్తాన్ నేల మొత్తానికి ఇంతకు మించి బల సంపన్నుడు లేడని ఆ దేశం దాదాపుగా తీర్మానించింది. అర్బాబ్ సొంత ప్రాంతమైన ‘మర్దాన్’లో ఇతణ్ణి అందరూ ముద్దుగా ‘ఖాన్ బాబా’ అని పిలుచుకుంటూ ఉంటారు. ‘పద్దెనిమిదేళ్ల వయసు నుంచి నేను బరువు పెరగడం మొదలుపెట్టాను. దానిని గమనించి నేనే ఎక్కువ తినడం ప్రారంభించాను’ అంటాడు అర్బాబ్. ఇతని ఛాతీని కొలవడానికి టేప్ చాలదు. ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉంటాడు. ఏ మామూలు కారులో కూడా పట్టడు. ‘అందుకే నేను నా సొంతానికి ఒక పెద్ద వెహికిల్ ఏర్పాటు చేసుకున్నాను’ అంటాడు ఖాన్బాబా. ఖాన్‌కి బలం ఎక్కువ. ఒక ట్రాక్టర్‌కు తాడు కట్టి చేత పట్టుకున్నాడంటే ఆ ట్రాక్టర్ కదలను కూడా కదలదు. రెండు కార్లను ఏక కాలంలో తాళ్లు కట్టి ఆపగలడు. ఒక మనిషిని సునాయాసంగా గాల్లో లేపగలడు. ‘నేను ఏదో అరుదైన జబ్బు వల్ల ఈ ఆకారం దాల్చలేదు. ఆరోగ్యంగా ఉంటూనే సాధించాను. నాకు రోజువారి పనుల్లో ఏ ఇబ్బందీ లేదు’ అంటాడు ఖాన్బాబా. ఖాన్ బాబాకు వెయిట్ లిఫ్టర్ కావాలని ఉంది కాని పాకిస్తాన్లో వెయిట్ లిఫ్టింగ్ లేదు. డబ్లు్యడబ్లు్యఎఫ్లో పాల్గొనాలని ఉంది కాని దానికి కూడా మార్గం సుగమం కాలేదు ఇంకా. ‘రెజ్లింగ్‌లో నాకు రికార్డులు సాధించాలని ఉంది’ అంటాడు ఖాన్బాబా. రోజూ తినడం అభిమానులతో సెల్ఫీలు దిగడం తప్ప ఇతనికి ప్రస్తుతానికి పనేం లేదు. అతను కోరుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మనం ఇతణ్ణి డబ్లు్యడబ్లు్యఎఫ్ రింగ్‌లో చూస్తాం. కాని ఇతని బలం ముందు ఎవరైనా నిలుస్తారా అనేదే ప్రశ్న. -
ఈ గుడ్డు బరువు అర తులమే!
తాటిపాడు(జూపాడుబంగ్లా): గుడ్డేంది.. అర తులం బరువేంది.. అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. తాటిపాడుకు చెందిన చాకలి శివన్న కోడిపెట్ట రెండురోజుల క్రితం అర తులం(5 గ్రాములు) బరువైన గుడ్డును పెట్టింది. సాధారణంగా నాటుకోడి 40 నుంచి 50 గ్రాములు, బ్రాయిలర్ కోడి 55 నుంచి 60 గ్రాముల బరువైన గుడ్డును పెడుతుంటాయి. శివన్న కోడిపెట్ట గుడ్డు అతి చిన్నదిగా ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాటాపై గుడ్డును ఉంచగా తూకం చూపలేదు. దీంతో 55 గ్రాములున్న గుడ్డుతో కలిపిఉంచడంతో 60 గ్రాములున్నట్లు చూపించింది. జన్యుపరమైన లోపాలతో కోళ్లు ఇలాంటి గుడ్లు పెడుతుంటాయని పశువైద్యాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. -
వెయిట్ చేయకండి!
► స్థూలకాయం మీద వెంటనే యుద్ధం ప్రకటించండి. ► బరువు పెరిగితే జీవితం కరువే! ► లేటు చేస్తే... వేటు తప్పదు! ► ఆరోగ్యకరమైన జీవితానికి వెంటనే ఓటు వేయండి. స్థూలకాయం అంటే...? ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారడం, బరువు పెరగడం జరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలత ప్రమాణంగా ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి దానితో ఆ వ్యక్తి తాలూకు బరువును (కిలోల్లో) భాగించాలి. ఆ వచ్చినదే – బీఎంఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలై, అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ. ్ఠ 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను బీఎంఐకు ఉన్న రకరకాల ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు, స్థూలకాయం వల్ల కలిగే అనర్థం ఎలాంటిది అనే వివరాల పట్ల ఒక అంచనాకు వస్తారు నిపుణులు. ఆ వర్గీకరణ ఇలా... స్థూలకాయానికి కారణాలు జన్యుపరమైనవి: కొందరిలో జన్యుపరమైన కారణాలతోనే హార్మోన్ల పనితీరు అధికమై దేహం అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది. ఇలా తీసుకున్న క్యాలరీలు మండించకపోవడం వల్ల కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం: తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆహారం ద్వారా దేహానికి అందిన క్యాలరీలు నిల్వ చేరిపోతాయి. కూర్చుని పని చేసే వృత్తుల్లోని వారికి క్యాలరీలు నిత్యం నిల్వ చేరుతూ ఉంటాయి. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఈ రోజుల్లో చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం... వంటివి. గర్భధారణ: సాధారణంగా గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు మహిళలు బిడ్డ పుట్టాక కూడా పెరిగిన బరువును కోల్పోరు. ఈ బరువు శాశ్వతంగా ఉండిపోతుంటుంది. ఇది అనర్థాలకు కారణం కావచ్చు. నిద్రలేమి: సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడుతుంటారు. అది బరువు పెరగడానికి కారణమవుతుంటుంది. కొన్ని రకాల మందులు: కొందరిలో మరేదో అనారోగ్యానికి వాడుతున్న మందులు స్థూలకాయానికి కారణమవుతుంటాయి. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ మందులు, మానసిక వ్యాధులకు మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ వాడేవారిలో స్థూలకాయం రావచ్చు. కొన్ని రకాల వ్యాధులు: ప్రెడర్–విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణమవుతుంటాయి. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్: జీవనశైలి మార్పుతో చాలా మందిలో స్థూలకాయం అదుపులోకి వస్తుంది. కొందరిలో ఈ మార్పు సాధ్యం కాకపోవచ్చు. స్థూలకాయానికి కారణం మరేదైనా అనారోగ్యం, వాటికి వాడుతున్న మందులు అయినప్పుడు పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, వైద్య ప్రక్రియల ద్వారా బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అందులో... ⇒ ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం. ⇒ఈటింగ్ డిజార్డర్ ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. స్థూలకాయాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సే ఎప్పుడు తప్పదంటే... స్థూలకాయం ప్రాణాపాయానికి దారితీసే స్థాయికి చేరినప్పుడు... శస్త్రచికిత్స ద్వారా బరువు తగ్గించడమే ప్రత్యామ్నాయం అవుతుంటుంది. అయితే ఇది అందరి విషయంలో జరగదు. ⇒ రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం. ⇒ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... (పురుషుడైతే సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే 45 కిలోలు ఎక్కువ ఉండటం / స్త్రీ అయితే సాధారణ బరువు కంటే 35 కిలోలు) అధికంగా ఉండటం. ⇒బీఎంఐ విలువ 35 – 40 మధ్యన ఉండి, స్థూలకాయం వల్ల వచ్చే టైప్–2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం... ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స కొంత ఉపశమనం కలగవచ్చు. బిఎంఐ 40 దాటితే ఇతర అనారోగ్యాలేవీ లేకపోయినా సరే స్థూలకాయం కారణంగా వచ్చే అనర్థాలను నివారించడానికి బేరియాట్రిక్ వంటి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. మెడికల్ మేనేజ్మెంట్ బరువు తగ్గడానికి వ్యాయామం, ఆహార నియంత్రణతోపాటు మందులతో వైద్య చికిత్స చేయడమూ అవసరమే. ఇది స్థూలకాయం స్థాయిని బట్టి ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో ఎంజైమ్ థెరపీ ద్వారా జీర్ణక్రియకు దోహదం చేసే ఎంజైమ్‌ల పని తీరును నియంత్రించడం, మెదడుకు అందే సంకేతాలను క్రమబద్ధీకరించడం వంటివి ఉంటాయి. స్థూలకాయంతో పాటు డయాబెటిస్ ఉన్న వారికి బరువు తగ్గడానికి కొన్ని ఇంజక్షన్లు కూడా మంచి ఫలితాన్నిస్తాయి. బరువు తగ్గడానికి అనువైన మార్గాలు ఆరోగ్యకరమైన జీవన శైలి: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వేళ తప్పకుండా భోజనం చేయడం, వ్యాయామం వంటి మార్గాలతో సహజంగా బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. ఇందులో భాగంగా డాక్టర్ సూచనలు, సలహాలను తప్పక పాటిస్తుండటం చాలా అవసరం. దేహం మీద అవగాహనను పెంచుకుంటూ తమ గురించి తాము తెలుసుకుంటుండాలి. సామాజిక సంబంధాలను కొనసాగించడానికి విందు ఆహ్వానాలను మన్నించాల్సిందే. అయితే ఆహారం తీసుకునే మోతాదులో విచక్షణ పాటిస్తూ, మంచి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు వివరాలను నమోదు చేసుకోవాలి. అనర్థాలు స్థూలకాయం పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల వచ్చే అనర్థాలెన్నో. మొదటి ఇబ్బంది నడకతోనే మొదలు. నడుస్తున్నప్పుడుæదేహభారాన్ని మోయడం దేహానికే కష్టమవుతుంది. అధిక బరువు వల్ల శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం దీర్ఘకాలంగా కొనసాగితే డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దారి తీయవచ్చు. బరువు పెరగనివ్వని ఆహారం తీసుకోవాల్సిన ఆహారం బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపు నిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. బరువు తగ్గడం అంటే నోరు కట్టుకోవడం కాదు... నోటికి రుచికరమైన ఆహారం తింటూనే స్థూలకాయం రాకుండా చూసుకోవడం. ఈసారి కాస్త తెలివినీ... ఆ తర్వాత నోటినీ ఉపయోగించండి... మీరు ఊబకాయానికి దూరం. అదెలాగో తెలుసుకోండి! శాకాహారం: ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, ఇతర కాయగూరల్లో పోషకాలూ ఎక్కువ పాళ్లలో ఉంటాయి. అలాగే కాయగూరల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండేవి తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీటి పాళ్లు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండిపోవడం, దాంతో తృప్తి వెంటనే కలగడం జరుగుతాయి. అదే మసాలాలతో నిండి ఉండే మాంసాహారాల విషయంలో మసాలా రుచులతో మరింత ఆహారం కడుపులోకి వెళ్లేలా ఆ రుచులు ప్రేరేపిస్తాయి. అందుకే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయల వంటి శాకాహారం బరువు తగ్గడానికీ, ఒంటిని తేలిక పరచుకోడానికీ ఉపకరిస్తుంది. కోడిగుడ్లు: ఉడికించిన కోడిగుడ్లు తినండి. మీకు తెలుసా... ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది మొదటి ప్రయోజనం. ఇక రెండోది... గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలనూ మీరు క్యాష్ చేసుకోవాలి. క్యాష్ బరువు మీ దగ్గరే. కొవ్వు బరువే పరార్. న్యూట్రిషనిస్టులు కోడిగుడ్డు అన్నారు కదా అని ఆమ్లెట్ జోలికి మాత్రం పోకండి. వైట్ మీట్: మాంసాహారం మీకు ఇష్టమా? తింటే బరువు పెరుగుతారని భయమా? మాంసాహారం తినండి. బరువు తగ్గండి. దీనికి చేయాల్సిందల్లా చేపలు తినడమే. చేప మాంసంలో క్యాలరీలు తక్కువ. రుచి ఎక్కువ. కొవ్వులు దాదాపు జీరో. పరిశోధనలు చెబుతున్నదేమిటంటే... వైట్‌మీట్ అంటే చేపలు తినేవారు చాలాకాలం ఆరోగ్యంగా బతుకుతారు. అందుకే వారంలో కనీసం నాలుగుసార్లు చేపలు తినాలన్నది న్యూట్రిషనిస్టుల సిఫార్సు. అయితే చేపలను ఉడికించి తినాలి. వేపుడుగా కాదు. ఆలివ్ నూనె: ఎవ్వరైనా ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు సూచించేది ఒకటే. ఆయిల్ తక్కువగా తినమని. మీరు ఎలాగోలా ఆలివ్ ఆయిల్ అలవాటు చేసుకున్నారనుకోండి. ఇక ఆయిల్ గురించి బుర్ర స్పాయిల్ చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాంతో గుండె పదిలం. ∙దానిమ్మ: దానిమ్మ గింజల వల్ల శరీరంలో కొవ్వును నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికి తోడు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తనాళాల్లోని అడ్డును తొలగిస్తాయి. పండులో ఉన్న పీచు వల్ల కాసిన్ని గింజలు తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. ఈ అంశాలన్నీ కలిసి దీన్ని కాస్త ఎక్కువే తిన్నా బరువు పెరగనివ్వవు. గుండె ఆరోగ్యాన్ని తరగనివ్వవు. పెరిగేదల్లా ఆరోగ్యమే. సూప్: సూప్ తాగే అలవాటు మనందరిలో ఇటీవల పెరిగింది. ఇటీవల పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ప్రధాన ఆహారం ముందుగా సూప్ తాగితే... వారు ఏడాదిలో పెరగాల్సిన బరువులో ఏడు కిలోలు కోల్పోతారట. అందుకే సూప్ తాగండి. అయితే టొమాటో లాంటి వెజిటబుల్ సూప్ అయితే బెటర్ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. డైలీ రొటీన్ ఇలా! ఏ టైమ్‌లో ఏం చేయాలంటే..? అగ్రస్థానం భాగ్యనగరానిదే!! హైదరాబాద్ నగరంలో మహిళల్లో పెరుగుతున్న బరువు మీద ఒక సర్వే నిర్వహించారు. ఇందుకోసం 830 మంది మహిళలను ఒక శాంపిల్‌గా స్వీకరించారు. ఇందులో 47.9% మంది మహిళలు స్థూలకాయులని తేలింది. భారతదేశంలోని మెట్రోమహానగరాలన్నింటిలోనూ స్థూలకాయం ఉన్న మహిళల సంఖ్యలో హైదరాబాద్ మొదటిది. దాదాపు సగం మంది మహిళలు స్థూలకాయంతో ఉండటం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. స్థూలకాయాన్ని నియంత్రించి సాధారణ బరువుకు రావాలంటే రోజుకు 800 కిలో కేలరీలు అందే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డైటీషియన్లు సూచిస్తున్న ఈ డైట్ ప్లాన్‌ను ఇతర అనారోగ్యాలేవీ లేకుండా స్థూలకాయం మాత్రమే ఉన్నవాళ్లు పాటించవచ్చు. అయితే హై బీపీ, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఎవరికి తగిన డైట్ ప్లాన్‌ను వాళ్లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ డైట్ ప్లాన్‌ను పాటించినప్పటికీ దేహానికి వ్యాయామం లేకపోతే స్థూలకాయం అదుపులోకి రావడం కష్టమేనంటారు వ్యాయామ నిపుణులు. కాబట్టి నడకతోపాటు వెయిట్‌లిఫ్ట్ వంటి వ్యాయామాలు చేసినప్పుడే దేహం బరువూ తగ్గుతుంది. కండరాలూ శక్తిమంతంగా ఉంటాయి. డా.ఎమ్. గోవర్థన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
చలికాలం అమ్మోకీళ్లు
కంట్లో నీళ్లు ఆరంభం నుంచీ వ్యాయామం లేకపోవడం, సరైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి అధికమవ్వడం, అధిక బరువు / స్థూలకాయం, మహిళల్లో అయితే హార్మోన్ల ప్రభావం... ఈ అంశాలన్నీ కీళ్ల ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేసేవేనని చెప్పుకోవచ్చు. కీళ్ల సమస్యలు... వందలాది రకాలు! నొప్పితో బయటపడే కీళ్ల వ్యాధులలో ప్రధానంగా కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయి. అయితే కీళ్లకు సంబంధించి ప్రధానంగా... కీళ్ల అరుగుదల, కీళ్ల వాతం వంటివి మనం తరచూ చూసే సమస్యలు. ఇవి నిత్యం మన సమాజంలో కనిపిస్తుంటాయి. కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్) అనే సమస్య సాధారణంగా వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఎవరిలోనైనా కనిపించే సమస్య. అయితే ముఖ్యంగా స్త్రీలలో ఇటీవల చిన్న వయసులోనే ఇది బయటపడుతుంది. ఇక వయసు పైబడుతున్న కొద్దీ, ఆహారపుటలవాట్లు మారుతున్న కొద్దీ, సొరియాసిస్ వంటి చర్మ సంబంధమైన వ్యాధులు సోకినప్పుడు, మహిళల్లో హార్మోన్లకు సంబంధించిన తేడాలు వచ్చినప్పుడు... అవన్నీ కీళ్ల మీద ప్రభావం చూపుతాయి. రకరకాల కీళ్ల సమస్యలకూ, కీళ్లనొప్పులకు కారణమవుతాయి. ఉదాహరణకు గౌటీ ఆర్థరైటిస్ అన్నది మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా జరిగితే అనుమానించాల్సిందే..! శరీరంలోని ఏ కీలు అయినా కొన్ని నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపెడుతూ, అక్కడి కదలికలు కష్టంగా మారినప్పుడు... కాలం గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రతరమవుతున్నప్పుడు కీళ్లకు సంబంధించిన సమస్య ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. కీళ్ల అరుగుదల వల్ల మన శరీర బరువును మోసే పెద్ద జాయింట్స్‌పై ప్రభావం చూపుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇక సమస్య వల్ల చిన్న కీళ్లు ప్రభావితమైతే క్రమంగా ఆ దుష్ప్రభావం పెద్దకీళ్లకు విస్తరిస్తుంది. ఈ సమస్యను ‘రుమాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. దీన్నే ‘కీళ్ల వాతం’గా పేర్కొనవచ్చు. సమస్య నిర్ధారణ ఇలా... రోగి వయసు, వారిలో కనిపిస్తున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకొని అది ఏ రకమైన కీళ్ల సమస్య కావచ్చు అన్న అంశాన్ని నిపుణులు నిర్ధారిస్తారు. కొన్ని కండిషన్స్‌ను అనుమానిస్తారు. వాటి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. కీళ్ల అరుగుదల సమస్య నిర్ధారణ కోసం ఎక్స్–రే తీయించడం, అలాగే కీళ్ల వాతం లేదా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌తో తలెత్తే జాయింట్ పెయిన్స్‌ను నిర్ధారణ చేయడానికి ఆర్.ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ (సీ–రియాక్టివ్ ప్రోటీన్), ఏఎన్ఏ, హెచ్ఎల్యే–బి27 వంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి. నివారణలు – జాగ్రత్తలు కీళ్లనొప్పులు తొలి దశలో ఉండి... అవి మరింత ముదరకుండా చూసుకోవాలన్నా లేదా కీళ్లనొప్పులను సాధ్యమైనంత ఆలస్యం చేయాలనుకున్నా... మోకాళ్లు మడిచి బాసింపట్టు వేయకుండా ఉండటం, చక్లంముక్లం వేసుకోకుండా ఉండటం, కింద కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్ టాయ్‌లెట్‌ను వాడటం, కుదిరినంతవరకు టైబుల్పైనే భోజనం చేయడం, చిన్న చిన్న నొప్పులను తగ్గించుకునే విధంగా ఫిజియోథెరపీ చేయడం, కొన్ని మందులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. నయం చేసుకోవచ్చు. పెరగకుండా చూసుకోవచ్చు. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు, రోజ్‌హిప్ టాబ్లెట్లు వాడితే మరికొన్ని కీళ్ల సంబంధమైన సమస్యలకు మంచి ఉపశమనం దొరుకుతుంది. నొప్పి తీవ్రతను బట్టి పెయిన్ కిల్లర్స్, జాయింట్లలో సైనో వియల్ ఫ్లూయిడ్ సప్లిమెంట్స్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం అవసరం పడవచ్చు. కీళ్లనొప్పులు, కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం (జాయింట్ స్టిఫ్నెస్) వంటి సమస్య ఎక్కువవుతూ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే... వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రతించాలి. అప్పుడు వారు తగిన పరీక్షలు చేసి, ఇక చివర ప్రత్యామ్నాయంగా... కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు (జాయింట్ రీ–ప్లేస్మెంట్ సర్జరీ)లను సూచిస్తారు. ఇది మరీ ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా సర్జరీని ఆలస్యం చేయడం వల్ల ఒక్కోసారి ఆ కీళ్లు మరింతగా అరిగిపోయి రీ–ప్లేస్మెంట్ ప్రక్రియ క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది. చలికాలంలో కీళ్లనొప్పులను తగ్గించుకునేదెలా? చలికాలంలో మన కండరాలు బిగుసుకుపోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రక్తసరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా కీళ్ల ఇంకా ఎక్కువగా నొప్పి కలుగుతుంది. ఈ తీవ్రతను తగ్గించడం కోసం ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాలి. దాని వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ► కీళ్లను వెచ్చగా ఉంచేందుకు వార్మ్ క్లోతింగ్‌తో పాటు చేతులకు గ్లోవ్స్, మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి ‘నీ క్యాప్’ వేసుకోవడం మంచిది. ► వింటర్లో నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దాంతో డీ హైడ్రేషన్ కారణంగా నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్లో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ► కాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లతో పాటు, వాపుని తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. ► తరచూ ఒంటిని సాగదీస్తున్నట్లుగా ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్) చేస్తుండటం వల్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, అవసరమైతే నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు (కళ్ళుప్పు) వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ► చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి క్రాస్ ట్రైనర్, స్టేషనరీ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ► జాయింట్స్ దగ్గర వాపు ఉంటే ఐస్ ప్యాక్ పెట్టడం మంచి ఉపశమనాన్నిస్తుంది. ► కండరాలు రిలాక్స్ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్ చేసుకోవడం కూడా మంచి ఉపశమనాన్నిస్తుంది. ► బరువు పెరగకుండా ఉండేందుకు ఒంటికి అవసరమైన అన్ని పోషకాలూ అందేలా సమతుల ఆహారం తీసుకోవడం అన్నది కీళ్లకూ మేలు చేస్తుంది. ► అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఏఐడీ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండేవారికి చలికాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ భయాలు అధికమవుతాయి.æవారి సమస్యలు చలిపెరిగే కొద్ది తీవ్రమవుతుంటాయి కాబట్టే వారికి ఆ ఆందోళన. కీళ్లనొప్పులతో బాధపడేవారు చలికాలంలో లేదా చల్లటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు శారీరక, కీళ్ల కదలికలతో వచ్చే నొప్పుల వల్ల తాము అనుకున్నవిధంగా ప్రకృతిని ఆస్వాదించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు 70 ఏళ్లకు పైబడిన వారికి జాయింట్ పెయిన్స్ కారణంగా బాధలకు గురయ్యేవారు. అయితే ఇటీవల కేవలం నలభై ఏళ్ళ వయసులోనే నాలుగు అడుగులు వేయలేక బాధపడేవారినీ చాలా మందినే చూస్తుంటాం. అలాంటి వారంతా ఈ సీజన్లో వచ్చే తమ కీళ్ల నొప్పులకు కారణాలనూ, తగ్గించుకునేందుకు మార్గాలనూ తెలుసుకోవడం కోసమే ఈ కథనం. డాక్టర్ దశరథ రామారెడ్డి తేతలి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
హైపో థైరాయిడిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? – శకుంతల, రాజమండ్రి మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్ తప్పదా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను నెల రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. – ఉష, కొత్తగూడెం మీరు చెప్పినదాని ప్రకారం మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్బ్లాడ్ర్లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారిలో నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – మనోహరరావు, కోదాడ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 43 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. మూడు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – దామోదర్‌రావు, కాకినాడ మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎక్సర్సైజ్కు టైం లేదు. బరువు తగ్గేదెలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను గృహిణిని. వ్యాయామాలు చేయడానికి టైమ్ ఉండదు. ఈమధ్య బాగా బరువు పెరుగుతున్నాను. వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు చెప్పండి. - కృష్ణవేణి, చోడవరం చాలామంది గృహిణులు మీరు చెబుతున్న సమస్యలనే ప్రస్తావిస్తుంటారు. ఇంటిపనుల్లో బిజీగా ఉండి, వేళకు తినకపోవడం, పైగా అన్నం వృథా కాకూడదంటూ మిగిలిపోయినవి తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. మీరు బరువు పెరగకుండా అదుపు చేసుకునేందుకు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. కొద్దిగా తినే షాపింగ్‌కు వెళ్లకండి... ఏదైనా కొనాల్సిన సమయంలో వచ్చాక తినవచ్చు అనే ఫీలింగ్‌తో ఖాళీ కడుపుతోనే షాపింగ్‌కు చాలా మంది గృహిణులు చేస్తుంటారు. మీరు అలా తినకుండా షాపింగ్‌కు వెళ్లకండి. అలాంటప్పుడు ఆకలి పెరిగి, అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా బయటి తిండి ఆరోగ్యంగా ఉండదు. షాపింగ్ చేసే సమయంలో వేగంగా నడవడం వల్ల మీరు చురుగ్గా ఉండటంతో పాటు జీవక్రియల వేగం పెరిగి మీకు అనుకోకుండానే వ్యాయామం చేకూరుతుంది. ఎక్కువసార్లు తినండి: తక్కువ మోతాదులో ప్రతి మూడు గంటలోకొకసారి తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం తక్కువ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మోతాదుకు మించి ఆహారం తీసుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ తీవ్రంగా ఆకలయ్యే వరకు ఆగవద్దు. ఉదయం వేళ టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్)ను ఎప్పుడూ మిస్ చేయకండి. మెల్లగా తినండి: ఆహారాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందుగా ఒక కప్పు సలాడ్స్‌తో పాటు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిపోయి తక్కువగా తింటారు. పగటి నిద్ర వద్దు: మధ్యానం పూట అస్సలు నిద్రపోవద్దు. ఇది కూడా తిన్న తర్వాత అస్సలే నిద్రపోవద్దు. అయితే రాత్రివేళ కంటికి నిండుగా కనీసం 7-8 గంటలు నిద్రపోండి. అవకాశం ఉన్నప్పుడల్లా నడవండి: ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా అటూఇటూ నడుస్తూ మాట్లాడండి. కానీ అదే సమయంలో నిర్లక్ష్యంగా చూసుకోకుండా, మెట్లపైకి వెళ్లడం చేయకండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి వయసు 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - రాధారమణి, శ్రీకాళహస్తి రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యార్ (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. అనియంత్రితంగా ఇలా రక్తకణాలు పెరిగిపోవడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. నియంత్రణ లేకుండా పెరిగిన ఈ కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా పేషెంట్స్ రోగనిరోధక శక్తి కోల్పోతారు. లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పిత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు రావడం కనిపిస్తుంది. వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరకణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బుల్లోనూ ఆ లక్షణాలు ఉండవచ్చు. అందుకే ఆ లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాలి. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్ బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్