బరువు తగ్గడం అతి పెద్ద టాస్క్‌లా ఉంది. ఎందుకంటే డెస్క్ జాబ్‌లు కావడంతో నూటికి తొంభైతొమ్మిది మంది అధిక బరువు సమస్యతో అల్లాడిపోతున్నారు. తినేది ఏం లేకపోయిన అధిక బరువు భారంగా మారి ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని మంచి ఆహారపు అలవాట్లతో సరైన విధంగా చెక్‌పెట్టొచ్చని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ విధంగా చేసి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి ఓ ఫిట్‌నెస్ ఔత్సాహికుడు చేరిపోయాడు. అతడి వెయిట్ లాస్ జర్నీ చూస్తే నోటమాటరాదు. ఇంత అధిక బరువుని ఎలా తగ్గించుకున్నాడ్రా బాబు అని ఆశ్చర్యపోతారు. మరి అదెలాగో చూద్దామా..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అజార్ హసన్ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీతో నెట్టింట వైరల్‌గా మారాడు. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎంటీవీ రోడిస్ సీజన్20లో కనిపించిన ఈ ఫిట్‌నెస్ ఔత్సాహికుడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియో రూపంలో షేర్ చేయండంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిస్టోరీ సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తిని రగిలించింది.
ఏకంగా అన్ని కిలోలు బరువుని తగ్గించుకోవాలంటే ఎంతో నిబద్ధత అవరం అంటూ అతడిపై ప్రశంసలతో మంచెత్తారు నెటిజన్లు. ఆ వీడియోలో హసన్ తాను ఒకప్పుడు 145 కిలోల అధిక బరువుతో ఎలా ఉండేవాడో చూపించారు. తన శరీర కొవ్వు శాతం సుమారు 55% ఉండేదని చెప్పారు. తన వెయిట్‌లాస్ జర్నీతో దాన్ని దాదాపు 9% వరకు తగ్గించుకోగలిగానని అన్నారు.
ఇప్పుడు 75 కిలోలు బరువు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బరువు తగ్గించే ఈ జర్నీలో తండ్రే తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ఎలాగైన బరువు తగ్గుతానని ఛాలెంజ్ చేసినట్లు చెప్పారు. అలా తాను ఏడు నెలల్లో మొత్తం కొవ్వుని కోల్పోయి..దాదాపు 55 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు.
అయితే తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీని చూడకమునుపే తండ్రి మరణించినట్లు వెల్లడించారు. అంతేగాదు తన తండ్రి శవాన్ని ఖననం చేసే నిమిత్తం సమాధిలోకి దించలేకపోయినట్లు వివరించారు. అప్పుడే తనకు ఈ అధిక బరువుతో చాలా ఇబ్బందులు తప్పవని తెలిసిందన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతలా తాను బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లు తెలిపారు.
(చదవండి: నాజూకు నడుము కోసం ఏకంగా పక్కటెముకలనే..!)
Comments
Please login to add a commentAdd a comment