బరువు తగ్గించే సర్జరీతో ఉబకాయులలో మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
లండన్: బరువు తగ్గించే సర్జరీతో ఉబకాయులలో మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గోథెన్‌బర్గ్ వర్సిటీ పరిశోధకులు 18 నుంచి 74 ఏళ్ల వయసున్న 48 వేల మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరిలో 22వేల మంది బేరియాట్రిక్(బరువు తగ్గింపు) సర్జరీ చేయించుకోగా, 26 వేల మంది సర్జరీ చేయించుకోలేదు. సర్జరీ చేయించుకున్న వారిలో మరణాల రేటు 1.1 శాతం, చేయించుకోని వారిలో 4.2 శాతంగా నమోదైంది. సర్జరీ చేయించుకోని వారిలో అధికంగా హృద్రోగాలు, క్యాన్సర్‌తో చనిపోతున్నట్లు తేలింది.