మీ గుండె అధిక బరువును తట్టుకోగలదు అనుకుంటున్నారా?
మన దేశంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు ముఖ్యంగా గడిచిన దశాబ్దకాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఊబకాయం వల్ల గుండెజబ్బులు, కీళ్లనొప్పులు,హైపర్‌టెన్షన్ (రక్తపోటు) ఆరోగ్యరీత్యా ఇతర అవాంఛిత సమస్యలు తలెత్తుతాయి.
ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు లైపోసక్షన్ ఒక మార్గంగా మారింది. నాన్-ఇన్వేసివ్ పద్ధతి కావడంతో గత కొద్ది సంవత్సరాలుగా ప్రజలు క్రయోలైపోలైసిస్ వైపు మొగ్గుతున్నారు, లైపోసక్షన్ చికిత్సలో అధునాతనమైన క్రయోలైపోను ఎఫ్‌డిఏ కూడా ఆమోదించింది. ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చింది.
నాన్-ఇన్వేసివ్ లైపోసక్షన్ చికిత్సలో కొవ్వుకణాలను నాశనం చేసేందుకు, శరీరం ద్వారా వాటిని సహజంగా బయటకు పంపేందుకు సాధారణంగా విభిన్నమైన పద్ధతులను ఉపయోగిస్తారు. అలాంటి చికిత్సలు పొందేటప్పుడు లివర్ ఏ స్థాయిలో పని చేస్తుందనే దానిపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. కొత్త నాన్-ఇన్వేసివ్ పద్ధతి అయిన క్రయోలైపోలైసిస్ వీటికంటే మెరుగైనది. ఇతర పద్ధతులతో పోలిస్తే క్రయోలైపోలైసిస్ శరీరం లోని విసర్జక వ్యవస్థ ద్వారా వ్యర్థకణాలను బయటకు పంపిస్తుంది.
ఈ ప్రక్రియను ‘‘ఫాగోసైటోసిస్’’ అంటారు. లైపోలైసిస్ ప్రక్రియ పూర్తయిన 2-4 నెలల వ్యవధిలో ఇది జరుగుతుంది. అందు వల్ల ఇది ఊబకాయాన్ని తగ్గించేందుకు సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. క్రయోలైపోలైసిస్‌కు ప్రజాదరణ ఖండాంతరాల్లో విస్తరిస్తోంది. శరీరమంతా వ్యాపించిన ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ వంటి నాన్-ఇన్వేసివ్ చికిత్సలు చేయించుకోక తప్పదు. ఇలాంటి చికిత్సా సౌకర్యాలు ‘‘హెల్తీకర్వ్స్’’లో మూడేళ్ళుగా అందుబాటులో ఉన్నాయి.
సర్జికల్ లైపోసక్షన్ కు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. అయితే ఇందులో కోతలు, కుట్లు ఉండవు, అల్ట్రా సౌండ్ ఉత్పత్తి చేసిన శక్తి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించేస్తుంది. దీని వల్ల చర్మంపైన అదే విధంగా చర్మం దిగువన ఉన్న కణజాలంపై ఎలాంటి దుష్ర్ప భావాలు ఉండవు. కరిగిన కొవ్వు శరీరం నుంచి సహజమైన మార్గాల్లో బయటకు పోతుంది. ఇందులో కొవ్వు కణాలను కరిగించే సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. చికిత్స పొందినవారు సెషన్ పూర్తయ్యాక ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండా తమ రోజువారీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.