laiposaksan
-
ఒబేసిటీ కౌన్సెలింగ్
లైపోసక్షన్, బేరియాట్రిక్... ఈ రెండు ఆపరేషన్లు బరువు తగ్గిస్తాయా? ఈ రెండూ ఒకే పని చేసేటప్పుడు రెండు ప్రక్రియలు ఎందుకు? ఒకవేళ తేడా ఉంటే అదేమిటి? కాస్త వివరించండి. - రమణ, కర్నూలు లైపోసక్షన్, బేరియాట్రిక్... ఈ రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఇందులో లైపోసక్షన్ శరీర అందాన్ని మెరుగుపరచుకోడానికి చేసే ప్రక్రియ. అయితే ఇది స్థూలకాయ సమస్యను పరిష్కరించలేదు. ఈ విధానం వల్ల శరీరం తను కొవ్వు సెట్ చేసుకునే పాయింట్లో మార్పు ఉండదు. అందువల్ల లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. అయితే బేరియాట్రిక్ సర్జరీ... తీవ్ర స్థూలకాయ సమస్యతో బాధపడుతున్నవారు శాశ్వతంగా బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్. ఒకసారి తీవ్రమైన స్థూలకాయం వస్తే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారానే బరువు తగ్గడం సాధ్యం కాదు. మొదట్లో కొంచెం బరువు తగ్గినప్పటికీ, శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ను నియంత్రించే హార్మోన్ల ప్రభావం కారణంగా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల లోపల కోల్పోయిన బరువు తిరిగి పెరుగుతారు. లావుగా ఉన్నవారు శాశ్వతంగా బరువు తగ్గడానికి శాస్త్రీయంగా రుజువైన, సురక్షితమైన ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీ. ఇందులో బరువు తగ్గడానికి అసలు కారణం... కొవ్వును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వచ్చి శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గడమే. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి డైవర్షన్ పద్ధతుల తర్వాత గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం, జీఎల్పీ-1, పెప్టైడ్ వైవై మొదలైన హార్మోన్ల ఉత్పత్తి పెరగడం వల్ల శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గుతుంది. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గుతారు. డాక్టర్ వి.అమర్ బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్, నల్లగండ్ల, హైదరాబాద్ -
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
నా బరువు 98 కిలోలు. చాలా లావుగా కనిపిస్తున్నాను. లైపోసక్షన్ సహాయంతో నా బరువు తగ్గించుకోవడం సాధ్యమేనా? ఒక్క సెషన్లోనే అంతా చక్కబడుతుందా? - వెంకటేశ్, వరంగల్ లైపోసక్షన్ సహాయంతో బరువు తగ్గించుకోవడం సాధ్యమే. అయితే ఎత్తును బట్టి చూసినప్పుడు ఉన్న అదనపు బరువునంతా ఒకే సెషన్లో తీసేయడం మంచిది కాదు. ఒక సురక్షితమైన స్థాయి వరకు మాత్రమే కొవ్వును తొలగిస్తారు. అలా మిమ్మల్ని పరీక్షించాక మాత్రమే శరీరంలోని అదనపు బరువును దఫాలవారీగా తొలగించడానికి నిపుణులు తగిన ప్లాన్ నిర్ణయిస్తారు. డాక్టర్ దీపు సీహెచ్ ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్ -
ఒబేసిటీ కౌన్సెలింగ్
నేను 122 కేజీల బరువున్నాను. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. నేను ఇటీవల కూల్ స్కల్ప్టింగ్ విధానం ద్వారా, ఆపరేషన్ అవసరం లేకుండా బరువు తగ్గవచ్చని విన్నాను. దీని వల్ల నాకు ఉపయోగం ఉంటుందా? - చంద్రశేఖర్, విజయవాడ చాలామంది బరువు తగ్గించుకోడానికి లైపోసక్షన్, కూల్స్కల్ప్టింగ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి సాధారణ బరువు లేదా కొంచెం అధిక బరువు ఉండే వ్యక్తులు, శరీరంలోని కొన్ని ప్రాంతాలలో పేరుకు పోయిన కొవ్వును తొలగించుకోడానికీ, బాడీ షేపింగ్కు ఉపయోగపడే కాస్మటిక్ పద్ధతులు ఇవి శరీర కొవ్వు సెట్పాయింట్ను మార్చలేవు అందువల్ల వీటి ద్వారా శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. మొదట్లో కొంచెం కొవ్వు తగ్గినప్పటికీ, ఆర్నెల్ల నుంచి ఐదేళ్లలో కోల్పోయిన కొవ్వు మొత్తం తిరిగి చేరుతుంది. కొవ్వు సెట్పాయింట్ని తగ్గించలేని పద్ధతులేవీ శాశ్వతంగా బరువును తగ్గించలేవు. మీరు తీవ్ర స్థూలకాయ స్థాయిలో ఉన్నారు. కాబట్టి కూల్ స్కల్ప్టింగ్ మీకు ఉపయోగపడదు. నాకు 24 ఏళ్లు. డిగ్రీ పూర్తయ్యింది. బరువు చాలా ఎక్కు ఉండటం వల్ల ఏ పెళ్లి సంబంధాలూ కుదరడం లేదు. బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొమ్మని మా ఫ్యామిలీ డాక్టరు సలహా ఇచ్చారు. ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఈ సర్జరీ ఇబ్బందవుతుందేమోనని భయంగా ఉంది. - ఒక సోదరి, వినుకొండ నిజానికి సన్నగా ఉన్న మహిళలతో పోల్చి చూస్తే లావుగా ఉన్న మహిళలకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువ. శాశ్వతంగా బరువును తగ్గించుకోడానికి శాస్త్రీయంగా రుజువైన, సురక్షితమైన పద్ధతి ఒక్క బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. పిల్లలు లేనివారికి కూడా ఈ ఆపరేషన్ల్ తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు బాగా పెరుగుతాయని శాస్త్రీయంగా రుజువైంది. కాబట్టి మీరు నిర్భయంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. డాక్టర్ వి.అమర్ బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు పుట్టాక నా పొట్ట మీది చర్మం వదులైపోయి జారినట్లుగా ఉంది. లైపోసక్షన్ చేయించుకుంటే బాగుంటుందని నా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుజాత (పేరు మార్చాం), విశాఖపట్నం వదులైన చర్మం బిగుతుగా అయ్యేందుకు కేవలం లైపోసక్షన్ ఒక్కటే సరిపోదు. మీరు లైపో- అబ్డామిన నోప్లాస్టీ అనే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లైపోసక్షన్ ద్వారా ఎక్కువగా ఉన్న కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత వదులుగా అయ్యే చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేయడమే ఈ సర్జరీ ఉపయోగం. దీని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. నా వయసు 28. ఇటీవల నేను గమనించిన విషయం ఏమిటంటే... నా రొమ్ముల సైజు ముందుకంటే చాలా తగ్గింది. నా రొమ్ముల సైజును ఇంతకు ముందులాగే పెంచడం సాధ్యమవుతుందా? ఇది సురక్షితమైనదేనా? - లత (పేరు మార్చాం), హైదరాబాద్ రొమ్ముల పరిమాణం తగ్గినప్పుడు కొందరు స్త్రీలు మానసికంగా కొంత వ్యాకులతకు గురవుతుంటారు. ఇటీవల ఈ సమస్యతో ప్లాస్టిక్ సర్జన్లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవడం అన్నది ప్లాస్టిక్ సర్జరీతో సాధ్యపడుతుంది. ఇలా పెంచుకునే ప్రక్రియను బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ అంటారు. ఈ ప్రక్రియలో మృదువుగా ఉండే సిలికాన్ జెల్‌ను ఉపయోగించి వాస్తవమైనవి అనిపించేలా రొమ్ములను రూపొందించడం సాధ్యమే. ఇది సాధారణ అనస్థీషియా ఇచ్చి చేసే సర్జరీ. ఇది ముగిశాక కనీసం ఆరు గంటల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇది సురక్షితమైన సర్జరీ. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. దీనితో వచ్చే ఫలితాలు శాశ్వతం. డాక్టర్ దీపు సీహెచ్ ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్ -
మీ గుండె అధిక బరువును తట్టుకోగలదు అనుకుంటున్నారా?
మన దేశంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు ముఖ్యంగా గడిచిన దశాబ్దకాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఊబకాయం వల్ల గుండెజబ్బులు, కీళ్లనొప్పులు,హైపర్‌టెన్షన్ (రక్తపోటు) ఆరోగ్యరీత్యా ఇతర అవాంఛిత సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు లైపోసక్షన్ ఒక మార్గంగా మారింది. నాన్-ఇన్వేసివ్ పద్ధతి కావడంతో గత కొద్ది సంవత్సరాలుగా ప్రజలు క్రయోలైపోలైసిస్ వైపు మొగ్గుతున్నారు, లైపోసక్షన్ చికిత్సలో అధునాతనమైన క్రయోలైపోను ఎఫ్డిఏ కూడా ఆమోదించింది. ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. నాన్-ఇన్వేసివ్ లైపోసక్షన్ చికిత్సలో కొవ్వుకణాలను నాశనం చేసేందుకు, శరీరం ద్వారా వాటిని సహజంగా బయటకు పంపేందుకు సాధారణంగా విభిన్నమైన పద్ధతులను ఉపయోగిస్తారు. అలాంటి చికిత్సలు పొందేటప్పుడు లివర్ ఏ స్థాయిలో పని చేస్తుందనే దానిపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. కొత్త నాన్-ఇన్వేసివ్ పద్ధతి అయిన క్రయోలైపోలైసిస్ వీటికంటే మెరుగైనది. ఇతర పద్ధతులతో పోలిస్తే క్రయోలైపోలైసిస్ శరీరం లోని విసర్జక వ్యవస్థ ద్వారా వ్యర్థకణాలను బయటకు పంపిస్తుంది. ఈ ప్రక్రియను ‘‘ఫాగోసైటోసిస్’’ అంటారు. లైపోలైసిస్ ప్రక్రియ పూర్తయిన 2-4 నెలల వ్యవధిలో ఇది జరుగుతుంది. అందు వల్ల ఇది ఊబకాయాన్ని తగ్గించేందుకు సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. క్రయోలైపోలైసిస్కు ప్రజాదరణ ఖండాంతరాల్లో విస్తరిస్తోంది. శరీరమంతా వ్యాపించిన ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ వంటి నాన్-ఇన్వేసివ్ చికిత్సలు చేయించుకోక తప్పదు. ఇలాంటి చికిత్సా సౌకర్యాలు ‘‘హెల్తీకర్వ్స్’’లో మూడేళ్ళుగా అందుబాటులో ఉన్నాయి. సర్జికల్ లైపోసక్షన్ కు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. అయితే ఇందులో కోతలు, కుట్లు ఉండవు, అల్ట్రా సౌండ్ ఉత్పత్తి చేసిన శక్తి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించేస్తుంది. దీని వల్ల చర్మంపైన అదే విధంగా చర్మం దిగువన ఉన్న కణజాలంపై ఎలాంటి దుష్ర్ప భావాలు ఉండవు. కరిగిన కొవ్వు శరీరం నుంచి సహజమైన మార్గాల్లో బయటకు పోతుంది. ఇందులో కొవ్వు కణాలను కరిగించే సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. చికిత్స పొందినవారు సెషన్ పూర్తయ్యాక ఎలాంటి విశ్రాంతి అవసరం లేకుండా తమ రోజువారీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.