నా వయసు 30 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లు పుట్టాక నా పొట్ట మీది చర్మం వదులైపోయి జారినట్లుగా ఉంది. లైపోసక్షన్ చేయించుకుంటే బాగుంటుందని నా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు. నాకు తగిన సలహా ఇవ్వండి.
- సుజాత (పేరు మార్చాం), విశాఖపట్నం
వదులైన చర్మం బిగుతుగా అయ్యేందుకు కేవలం లైపోసక్షన్ ఒక్కటే సరిపోదు. మీరు లైపో- అబ్డామిన నోప్లాస్టీ అనే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. లైపోసక్షన్ ద్వారా ఎక్కువగా ఉన్న కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత వదులుగా అయ్యే చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేయడమే ఈ సర్జరీ ఉపయోగం. దీని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి.
నా వయసు 28. ఇటీవల నేను గమనించిన విషయం ఏమిటంటే... నా రొమ్ముల సైజు ముందుకంటే చాలా తగ్గింది. నా రొమ్ముల సైజును ఇంతకు ముందులాగే పెంచడం సాధ్యమవుతుందా? ఇది సురక్షితమైనదేనా?
- లత (పేరు మార్చాం), హైదరాబాద్
రొమ్ముల పరిమాణం తగ్గినప్పుడు కొందరు స్త్రీలు మానసికంగా కొంత వ్యాకులతకు గురవుతుంటారు. ఇటీవల ఈ సమస్యతో ప్లాస్టిక్ సర్జన్‌లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవడం అన్నది ప్లాస్టిక్ సర్జరీతో సాధ్యపడుతుంది. ఇలా పెంచుకునే ప్రక్రియను బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ అంటారు. ఈ ప్రక్రియలో మృదువుగా ఉండే సిలికాన్ జెల్‌ను ఉపయోగించి వాస్తవమైనవి అనిపించేలా రొమ్ములను రూపొందించడం సాధ్యమే. ఇది సాధారణ అనస్థీషియా ఇచ్చి చేసే సర్జరీ. ఇది ముగిశాక కనీసం ఆరు గంటల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇది సురక్షితమైన సర్జరీ. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. దీనితో వచ్చే ఫలితాలు శాశ్వతం.
డాక్టర్ దీపు సీహెచ్
ప్లాస్టిక్ సర్జన్, ఒలివా కాస్మటిక్ సర్జరీ సెంటర్, హైదరాబాద్
ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్
Published Wed, May 6 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement