Plastic Surgery
-
నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!
అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్ సర్జరీ అవసరమే లేదని తెలిపింది. ‘ఇది నిజమైన గేమ్ ఛేంజర్. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్ ఔట్ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్. -
ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన నయనతార
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ అనగానే అందరూ నయనతార పేరు చెబుతారు. అందుకు తగ్గట్లే ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చింది. యాక్టింగ్ గురించి వంక పెట్టడానికి ఏం లేదు గానీ కెరీర్ ప్రారంభంలోనే ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై వివరణ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజమేంటో చెప్పేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)'నాకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎంతో సమయాన్ని దానికోసం పెడతాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రజలు అలా అనుకుంటున్నారు. అయితే వాళ్లు మాట్లాడుకునేది నిజం కాదు. డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు' అని నయనతార చెప్పింది.గతేడాది మూడు సినిమాలు చేసిన నయనతార.. ప్రస్తుతం ఐదు మూవీస్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఇద్దరు కొడుకులకు ఎప్పటికప్పుడూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) -
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
ఆ అవసరం ఇంకా రాలేదన్న చిరంజీవి హీరోయిన్.. రూమర్స్‌పై స్పందించిన నటి!
బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) -
నటుడికి ప్లాస్టిక్ సర్జరీ? ఏడేళ్ల క్రితమే..
సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఫిల్మీదునియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా ఈ రూమర్స్ తప్పవు. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు కూడా తన దవడకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని ఈ మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సదరు నటుడు స్పందిస్తూ.. తను ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని ఊహాగానాలకు ముగింపు పలికాడు. మేకప్ లేకపోవడం వల్ల.. గతంలో తన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు చిన్‌పై ఫిల్లర్స్ మాత్రమే వేయించుకున్నానన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. 'ఆ ఫోటో అస్సలు బాలేదు. మేకప్ లేనందువల్ల మీకలా అనిపించిందంతే! నాక్కూడా ఆ లుక్ కాస్త వింతగానే అనిపించింది. దాన్ని కెమెరాల్లో బంధించి వైరల్ చేసేశారు. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం నా పర్సనల్ డాక్టర్ చెప్పినదాని ప్రకారం.. మరింత కాన్ఫిడెంట్‌గా కనిపించేందుకు ఫిల్లర్ ట్రై చేశాను. మేము కెమెరాముందు అందంగా కనిపించాలి. ప్లాస్టిక్ సర్జరీ చాలా కాస్ట్లీ కాబట్టి ఇది తప్పేం కాదు. మన ఆత్మస్థైరాన్ని మరింత పెంపొందిస్తుందనేవాటికి ఎందుకు నో చెప్పడం? నేను ఏదైనా ఓపెన్‌గా చెప్పేస్తుంటాను. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఖరీదైన వైద్యం.. ఎంతో టైం పడుతుంది కూడా! నేను దాని జోలికి వెళ్లలేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావు అంధుడు శ్రీకాంత్ బొల్ల బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. చదవండి: 'ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..' అక్కర్లేదంటూ సందీప్ కౌంటర్ -
హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..
అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు చాలమంది. ఇలా అందం కోసం చేయించుకున్న సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటో రెండో సర్జరీలు అయితే ఓకే. కానీ ఇక్కడొక అమ్మాయి తనకు నచ్చిన హీరోయిన్లా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకుందో వింటే కంగుతింటారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఝూ చునా జస్ట్ 13 ఏళ్ల వయసుకే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలనుకుంది. తనకు ఇష్టమైన నటి ఎస్తేర్ యులా ఉండాలని కోరుకుంది. ఇలా ఈ ఏజ్‌లోనే ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకోవాడానికి ప్రధాన కారణం..ఆమె స్నేహితులు, బంధువులు తన తల్లి కంటే అందంగా లేవని చెప్పడం తట్టుకోలేకపోయింది. అదీగాక తన తోటి విద్యార్థులు కూడా అందంగా ఉండటం వల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నారని నమ్మింది. ఇవన్నీ కలగలసి చునాని ఆత్మనూన్యత భావంలోకి నెట్టి..తన రూపాన్ని మార్చుకోవాలనే చర్యకు ప్రేరేపించాయి. అలా చునా 13 ఏళ్ల నుంచి ప్లాస్టిక్ సర్జరీల చేయించుకోవడం ప్రారంభంచింది. అయితే ఆమె తల్లి తొలి ఆపరేషన్‌కి సపోర్ట్ చేసి డబుల్ కనురెప్పల ప్రక్రియకు అనుమతించింది. ఆ తర్వాత నుంచి చునా ఒక్కొక్కటిగా రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమైపోయింది. అలా పాఠశాల విద్యకు కూడా దూరమయ్యింది. ఇలా ఆమె దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలను దాదాపు వందకు పైగా చేయించుకుంది. వాటిలో రినోప్లాస్టి, బోన్ షేవింగ్ వంటి క్రిటికల్ ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉన్నాయి. డాక్టర్లు తన కళ్లను పెద్దవి చేసే పని చేయడం కుదరదని హెచ్చరించారు. అయినా సరే లెక్కచేయక వేరే డాక్టర్ని సంప్రదించి చేయించుకుంది. ఆ సర్జరీల్లో అత్యంత పెయిన్‌తో కూడిన సర్జరీ బోన్ షేవింగ్. దీన్ని ఏకంగా పది గంటలపాటు చేస్తారు వైద్యులు. దీని కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా.. ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపకపోవడం కొసమెరుపు. ఇక్కడ ఏ వైద్యుడు ఆమెకు ఒక్కసారి ప్లాస్టిక్ సర్జరీ చేశాక మరో సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు. అయినా ఆ తిరస్కరణలు కూడా పట్టించుకోకుండా ఇంకో డాక్టర్ ..ఇంకో డాక్టర్ అంటూ సంప్రదిస్తూ ఆపరేషన్ చేయించుకుంది. ఇలా ఆమె వందకు పైగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేసిందట. అయితే ఇన్ని ఆపరేషన్లకు చునా తల్లి కూడా సపోర్ట్ చేయలేదు. ఇక ఆమె తండ్రి చునా కొత్త రూపాన్ని అస్సలు అంగీకరించ లేదు. అలాగే ఆమె స్నేహితులు సైతం ఆమె కొత్త రూపాన్ని చూసి చునా అని గుర్తుపట్టులేకపోయారు. ఏదీఏమైతేనే చునా అనుకున్నది సాధించి అన్ని బాధకరమైన సర్జరీ ప్రక్రియలను చేయించుకుని మరీ తనకు ఇష్టమైన హీరోయిన్లా మారాలనే కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం చునాకి 18 ఏళ్లు. ఇక తన శస్త్రచికిత్సా ప్రయత్నాలను కూడా ముగించినట్లు ప్రకటించింది. మరీ ఇంతలా అందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే వెర్రీ మనుషులు ఉంటారా? అనిపిస్తుంది కదూ!.. (చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Alla Dakshayani: దిద్దుబాటు
జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం. ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే... క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది. అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు. ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది. ► ఇద్దరు వైద్యుల చొరవ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్ భవానీ ప్రసాద్ అనస్థీషియనిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్‌లోని మహావీర్, మెడ్విన్ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్‌బాగ్‌లో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్‌ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్ వాళ్లు రెండు ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్‌ను సిద్ధం చేశారు. యూఎస్‌లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్‌కి కేటాయిస్తున్నారు. యూఎస్‌లోని మెర్సీ మిషన్ వేదికగా వారందిస్తున్న సర్వీస్‌కి హైదరాబాద్‌లో ‘లయన్స్ క్లబ్ – గ్రీన్‌ల్యాండ్స్’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్‌కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే. ► ఇది సమష్టి దిద్దుబాటు ఈ సర్వీస్ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్‌లో పాల్గొంటారు. ఈ హెల్త్ సర్వీస్‌ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి, లయన్స్ క్లబ్ విద్యాభూషణ్ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్ సర్జరీలు ఈ క్యాంప్‌లో చేపట్టడం లేదు. మా సర్వీస్ గురించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి. ముఖం మీద ఒత్తైన జుత్తు హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్ ట్రైకోసిస్... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్ నుంచి కంప్లయింట్స్ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామూలైంది. ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ మెర్సీ మిషన్స్∙యూఎస్ఏ, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్– గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్, ఓల్డ్ మల్లేపల్లి, సీతారామ్‌బాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో వైద్యసహాయం అందిస్తున్నాం. – ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్ ట్రస్టీ, రామ్కీ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్‌వేగస్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్‌వేగస్‌లోని ప్లాస్టిక్‌సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్‌కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్‌కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్‌కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్‌కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్‌లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్‌వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న కృతిశెట్టి ఓవర్నెట్లో స్టార్డమ్ దక్కించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్‌తో రాకెట్లా దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఫ్లాపులు కృతిని వెంటాడుతున్నాయి. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట చివరగా ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోవడంతో కృతి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతికి మరోవైపు ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందిస్తూ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్ అయ్యింది. చదవండి: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్ -
ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్, స్క్రిక్ట్ డైట్..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి ఉన్న అందం పోగోట్టుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్‌ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్ రోల్‌కు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్ వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. -
ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్‌కు గుండెపోటు..
చాలామందికి సెలబ్రిటీ అవ్వాలని కోరికగా ఉంటుంది. కానీ కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ మృతి చెందిన విషయం తెలిసిందే! తాజాగా అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్‌లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మోడల్ క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ(34) అచ్చం కిమ్ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్‌కు జిరాక్స్ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు ఏప్రిల్ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఏప్రిల్ 20.. ఉదయం 4.31 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఒకరు.. అస్తెన్ చనిపోయిందని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ విషాద వార్తను చేరవేశారు. ఆ ఫోన్ కాల్ మా జీవితాలనే కుదిపేసింది. దురదృష్టవశాత్తూ అస్తెన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తను తీసుకున్న చికిత్స వల్లే ఇంతటి ఘోరం జరిగి ఉండవచ్చు' అని క్రిస్టినా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: 15 ఏళ్ల బంధానికి ముగింపు, బాలీవుడ్ జంట విడాకులు -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్‌లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్‌లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్‌ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్‌గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్‌గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్‌పై విరుచుకపడ్డ నిక్కీ) -
అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..
శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది. ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఇంటికెళ్లిన కాసేపటికే.. సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు. అక్కడ సర్జరీలు కామన్.. కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..? -
మీ సర్జరీల మాటేమిటి..? నటిపై దారుణంగా ట్రోల్స్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి. గతంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలపై మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ అందం కోసం చేయించుకున్న సర్జరీల మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 2006లో శ్రీలంక మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. 'ప్లాస్టిక్ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్సల మాటేమిటి' అని ప్రశ్నించారు. తాజాగా జాక్వెలిన్ సర్కస్ ట్రైలర్ ప్రీమియర్‌లో కనిపించింది. అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన రామ్ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Pageant 💫 Influence (@pageantandinfluence) -
Hyderabad: ఇంప్లాంట్స్ క్రేజ్.. నగరంలో సర్జరీల సంఖ్య రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు. నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని పంటిబిగువున భరించే కంటే వ్యయ ప్రయాసలకోర్చి అయినా తొలగించుకోవడమే మేలనే ఆలోచనా ధోరణి ఆధునికుల్లో కనపడుతోంది. ఆర్ధిక స్వాతంత్య్రం మహిళలకు కల్పించిన వెసులుబాటు కూడా దీనికి తోడవుతోంది. అందంతో పాటు ఇది ఆత్మవిశ్వాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలకు ఈ సర్జరీ ఒక పరిష్కారంగా చెబుతున్నారు. సంఖ్య రెట్టింపు... నగరంలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంధ్యా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో నెలకు గరిష్ఠంగా 10–15 బ్రెస్ట్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్సలు జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 25–30కి పెరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెరుగుతుండడం వల్ల రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగవచ్చునన్నారు. అవసరాన్ని బట్టే... శరీరాకృతి ఒక తీరును సంతరించుకునే టీనేజ్‌లో ఈ తరహా సర్జరీలకు దూరంగా ఉండడం మేలు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాతే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. అదే విధంగా 50ఏళ్లు దాటిన వారు కూడా దూరంగా ఉండడమే మేలు. అందం ఒకటే కాకుండా శారీరక సమస్యలకు, ఇక కేన్సర్ చికిత్సలో భాగంగా రొమ్ము కోల్పోయిన వారికి కూడా ఈ ఇంప్లాంట్స్ ప్రయోజనకరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ శస్త్ర చికిత్సల గురించిన పలు అంశాలను గుర్తుంచుకోవాలని వైద్యులంటున్నారు. కొన్ని సూచనలు... ► రొమ్ములకు అమర్చే ఈ ఇంప్లాంట్స్‌కి 10 నుంచి 15 ఏళ్ల వరకూ వారంటీ ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఇంప్లాంట్ స్థితిగతులను పరీక్ష చేయించుకోవాలి. ► చాలా సహజమైన రీతిలో అమరిపోయే ఈ ఇంప్లాంట్ అత్యంత అరుదుగా మాత్రం అమర్చిన కొంత కాలానికి కొందరిలో చాలా గట్టిగా మారుతుంది. దీన్ని బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇల్నెస్ అంటారు. ఇలాంటి అలర్జీక్ రియాక్షన్ పరిస్థితిలో అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించుకోవడమే పరిష్కారం. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. ► ఈ ఇంప్లాంట్స్ అన్నీ యూరోపియన్ దేశాల నుంచీ దిగుమతయ్యే అమెరికన్ బ్రాండ్స్. ► స్వల్ప వ్యవధిలోనే పూర్తయే ఈ శస్త్రచికిత్సకు దాదాపుగా రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. సర్జరీ పూర్తయిన 2 గంటల్లోనే ఆసుపత్రి నుంచీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. (క్లిక్: కళ్లలో ఎరుపు చార, కన్నులో బూడిద రంగు వలయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!) అందుబాటులోకి అత్యాధునిక సర్జరీలు.. నగరంలో బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీల కోసం సగటున రోజుకు ఒకరైనా సంప్రదిస్తున్నారు. దానికి తగ్గట్టే సర్జరీల్లో కూడా మరింత మెరుగైన విధానాలు వస్తున్నాయి. తాజాగా ఛాతీ పరిమాణం పెరగాలని సంప్రదించిన 27 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి ఎటువంటి గాయం మచ్చ లేకుండా ట్రాన్స్ యాక్సిలరీ ఎండోస్కోపిక్ విధానంలో ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నిర్వహించాం. –డా.సంధ్యారాణి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ -
సమంత లాగే కాజల్ కూడా ఆ పార్టుకి సర్జరీ చేయించుకుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా విడుదలైన యాడ్‌షూట్‌లో సామ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా : హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు. కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. 'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది. -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ప్లాస్టిక్ సర్జరీ వికటించి యువ కన్నడ నటి చేతన రాజ్ మృతి
-
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్‌తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్‌లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్‌గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్‌ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్‌లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్‌తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
ప్లాస్టిక్ సర్జరీ.. మూడేళ్లు నరకం చూపించారు
Koena Mitra Recalls Her Struggle: బాలీవుడ్లో నెపోటిజం, గ్రూపిజం కొత్తేమీ కాదు. వీటివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు నటీనటులు బాహాటంగానే నోరు విప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా దీనిపై స్పందించింది. 'ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాటివల్ల నేనూ ఇబ్బందులకు లోనయ్యాను. నేను అవుట్ సైడర్(సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి) అయినప్పటికీ ఇండస్ట్రీలో నేను కూడా మంచి బ్రేక్ అందుకున్నాను. కానీ నాకవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నాకోసం వారు పెదవి విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు నాకెప్పుడూ ఉంటుంది' 'ఇక నా ప్లాస్టిక్ సర్జరీ అంటారా? అది పూర్తిగా నా నిర్ణయం. నా ఫేస్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాలకేంటి సమస్య? ఇలా సర్జరీ గురించి ఓపెన్‌గా చెప్పొద్దన్న విషయం నాకు తెలియదు. నన్ను దాని గురించి అడిగారు కాబట్టే అవును చేయించుకున్నానని వివరాలన్నీ చెప్పాను. ఆ మాత్రందానికి నన్ను నానామాటలు అన్నారు. నామీద వ్యతిరేక వార్తలు రావౠరు. ఇండస్ట్రీలో అయితే చాలామంది నాతో దూరం పాటించారు. అది నా కెరీర్‌ను దెబ్బతీసింది. మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు. ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్‌గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్రా. -
టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..
ఇటీవల కాలంలో జనాలు సామాజకి మాధ్యమాలకు ఎలా బానిసవుతున్నారో మనం చూస్తునే ఉన్నాం. అంతేందుకు ఆ వ్యసనం కారణంగా ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అచ్చం అలానే ఇక్కడోక ప్రముఖ డాక్టర్ సామాజకి మాధ్యమాలకు బానిసై తన చక్కటి కెరియర్ను ఎలా పాడుచేసుకున్నాడో చూడండి. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అసలు విషయంలోకెళ్లితే...టిక్‌టాక్ వ్యసనం ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డేనియల్ అరోనోవ్ కెరియర్ను దెబ్బతీసింది. అరోనోవ్కి టిక్‌టాక్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అతనికి ఎంత టిక్‌టాక్ పిచ్చి ఉందో తెలుస్తోంది. అయితే అతను టిక్‌టాక్ పిచ్చితో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఆపరేషన్లు అన్నింటిని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు. అంతేకాద ఆపరేషన్లు అన్నింటిని అసంపూర్తిగా చేసేవాడు. దీంతో పలువురు రోగుల నుంచి అరోనోవ్ పై ఫిర్యాదుల రావడం ప్రారంభమైంది. పైగా అరోనోవా వికృత వ్యసనం ఎంతకు దారితీసింది అంటు రోగుల ఆరోగ్యంతో ఆడుకునేంత దారుణానికి దిగజారింది. ఈ మేరకు పలువురు రోగులు అతను శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేస్తాడని, పైగా ఒకటి చేయబోయి మరోకటి చేస్తాడంటూ బాధితుల ఆవేదనగా ఫిర్యాదులు చేయడంతో ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ ఏజెన్సీ (ఏహెచ్పీఆర్ఏ) అతను ఎలాంటి శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించకుండా నిషేధించింది. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు
జైపూర్: ముఖంపై చిన్న మొటిమ, మచ్చ ఏర్పడితే చాలా బాధ పడతాం. దాన్ని తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మనిషి అందానికి మొహమే ప్రతీక. కనుక ముఖ సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. అలాంటిది అనుకోని ప్రమాదంలో ముఖం పూర్తిగా చిధ్రమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ వ్యక్తికి. ఊహించని ప్రమాదంంలో అతడి ముఖం నుజ్జు నుజ్జయ్యింది. పూర్తిగా రూపు కోల్పోయిన ముఖానికి పూర్వపు ఆకారం తీసుకురావడం కోసం డాక్టర్లు ఎంతో శ్రమించి.. అనేక సర్జరీలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దాడి జరగడానికి ముందు బిష్ణోష్ (ఫైల్ ఫోటో) రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన కర్ణీ బిష్ణోయ్ స్థానిక ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఆపరేటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో బిష్ణోయ్ తన సోదరి, స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా వారి వాహనానికి ముందు కొన్ని ఎద్దులు వచ్చాయి. దాంతో బిష్ణోయ్ కారు వేగాన్ని తగ్గించి.. నెమ్మదిగా వెళుతున్నాడు. ఈ క్రమంలో కారు అద్దం సగం దించి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా బిష్ణోయ్ ముఖాన్ని కొమ్ములతో కుమ్మింది. అతడిని కారు నుంచి బయటకు లాగి పడేసింది. ఆ దాడిలో బిష్ణోయ్ కుడి కన్ను, ముక్కుతో పాటు ముఖం కుడి భాగమంతా నుజ్జునుజ్జయింది. ఈ దాడిలో బిష్ణోయ్ స్నేహితునికి స్వల్ప గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న బిష్ణోయ్‌ను అతని సోదరి బికనీర్‌లోని ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక చిక్సిత్సనందించిన వైద్యులు.. అతడికి చికిత్స ఇవ్వడం తమ వల్ల కాదని.. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిష్ణోయ్‌ని సాకేత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక అతడి పరిస్థితి చూసి షాకయినట్లు సీనియర్ న్యూరో సర్జన్ తెలిపారు. అప్పటికే అతడి వెంటిలేషన్ ట్యూబ్ బ్లాక్ అయిటన్లు వైద్యులు గుర్తించారు. వెంటనే న్యూరో సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు పిలిపించారు. కరోనా నిబంధనలను అనుసరించి పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు సుమారు పదిగంటల పాటు శ్రమపడి అతని ముఖానికి సర్జరీ చేశారు. అప్పటికీ ముక్కలు ముక్కలైన అతని ముఖం ఎముకలు, ముక్కులను అతికించారు. తొమ్మిది గంటలపాటు నిర్వహించిన మరో సర్జరీతో అతని ప్రాణాలు కాపాడటమే కాకుండా ముఖం తిరిగి ఒక రూపు సంతరించుకుంది అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత మరో నాలుగు నెలల అనంతరం మరో సర్జరీ నిర్వహించారు. అప్పటికే అతని ముఖం కుడి భాగమంతా పక్షవాతానికి గురైంది. భారత్‌లో మొదటిసారిగా నుదిటి కండరాలకు తేలికపాటి చికిత్సను అందించినట్లు వైద్యలు తెలిపారు. జులై నాటికి బిష్ణోయ్ తన కుడి కనుబొమ్మను, నుదిటిని కదపగలిగాడు. నెమ్మదిగా అతని ముఖం కూడా పూర్తిగా మానవరూపాన్ని సంతరించుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ కన్నుతో ఉన్న అతనికి మరికొన్ని సర్జరీలు చేయాల్సి వుందని అన్నారు. -
ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు
హానోయ్ : జాబ్ ఇంటర్వ్యూలలో విఫలమవ్వటానికి తన ముఖమే కారణమని భావించిన ఓ యువకుడు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. దాదాపు 9 సర్జరీలతో అందంగా తయారై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ సంగతేటంటే.. వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్ అనే యువకుడు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఘోర అవమానాలకు గురయ్యాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి గేలి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డూకు తన ముఖంపై అసహ్యం వేసింది. ఎలాగైనా ముఖాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసి సంపాదించిన దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీల తర్వాత అతడి రూపు రేఖలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా.. అందంగా తయారయ్యాయి. అతడు తన మునుపటి, తర్వాతి ఫొటోను పక్కపక్కన పెట్టి టిక్‌టాక్‌లో షేర్ చేయగా ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ రెండు ఫొటోలు డూవని తెలిసిన తర్వాత ‘‘అది నువ్వేనా?!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్లాస్టిక్ సర్జరీల తర్వాత మొదటి సారి ఇంటికి వచ్చినపుడు కుటుంబసభ్యులు కూడా అతడ్ని గుర్తుపట్టలేకపోయారు. దీనిపై డూ కూయెన్ మాట్లాడుతూ.. ‘‘ ఎల్లప్పుడూ ధృడ చిత్తంతో ఉండండి. మిమ్మల్ని కాన్ఫిడెంట్‌గా ఉంచే అందంకోసం అన్వేషించండి. నా దృష్టిలో అందం అంటే.. అద్దంలో మనల్ని మనం చూసుకున్నపుడు సంతృప్తిగా.. కాన్ఫిడెంట్‌గా ఉండాలి’’ అని చెప్పాడు. చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల -
అరకు ప్రమాదం; కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన 27 మంది పర్యాటకులు విహార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అరకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. అనంతగిరి మండలం డముకు ఘాట్‌రోడ్డు మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 23 మంది గాయాల పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 16 మంది శనివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఏడుగురికి కేజీహెచ్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారు. మరో మహిళ కొట్టం చంద్రకళ (50) పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన కొట్టం సత్యనారాయణ (61), నల్ల లత (45), సరిత (40), కొట్టం శ్రీనిత్య (8 నెలలు) మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. 16 మంది స్వస్థలాలకు పయనం ప్రమాదంలో గాయపడి కోలుకున్న క్షతగాత్రుల్లో 16 మంది శనివారం హైదరాబాద్‌లోని స్వస్థలానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గాయపడి పూర్తిగా కోలుకున్న 16 మందిని మరో రోజు వైద్యుల పరిశీలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. క్షతగాత్రులు మాత్రం మృతదేహాల వెంట తాము కూడా హైదరాబాద్ వెళ్లిపోతామని అధికారులను కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ సాగింది. ఇక్కడి వైద్యులు వెళ్లొద్దని వారించినా.. క్షతగాత్రులు మాత్రం వెళ్లేందుకు సిద్ధపడటంతో అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన బంధువులతో పాటు 16 మందిని రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం క్షతగాత్రులకు నాలుగు వైద్య బృందాల (ఆర్థో, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ)తో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్‌తో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ శ్రీశైలం నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో 16 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారని, కొట్టం చంద్రకళ (50) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. కొట్టం కల్యాణి (30)కి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేయనుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు ప్రమాదం ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమికంగా తేల్చింది. అలసట కారణంగా డ్రైవర్ నిద్రమత్తుకు లోనవటంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. కోలుకుని హైదరాబాద్ పయనమైన వారి వివరాలు కొట్టం లత (45), యు.కృష్ణవేణి (50), కొట్టం అరవింద్‌కుమార్ (35), కొట్టం నరేష్కుమార్ (38), కొట్టం స్వప్న (32), కొట్టం శివాని (07), కొట్టం దేవాన్‡్ష(05), కొట్టం శాన్వి (05), కొట్టం విహాన్ (03), కొట్టం ఇషా (05), అనూష(26), కొట్టం హితేష్ (17), కొట్టం మౌనిక (27), కొట్టం అనిత(50), కొట్టం శ్రీజిత్(14), లోఖిశెట్టి నందకిశోర్ (25) కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు కొట్టం కల్యాణి (30), కొట్టం జ్యోతి (55), కొట్టం శైలజ (30), కొట్టం అభిరామ్ (07), మీనా (38), కొట్టం చంద్రకళ (50), బస్సు డ్రైవర్ సర్రంపల్లి శ్రీశైలం ప్లాస్టిక్ సర్జరీతో పాతరూపు అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద బస్సు ప్రమాదంలో కొట్టం కల్యాణి (30)కి ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పివీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది. కల్యాణి ముఖాన్ని ప్రమాదానికి ముందు ఎలా ఉందో అలా తీర్చిదిద్దారు.