స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఈ మధ్య యువత తెగ సెల్ఫీలకు పోజులిచ్చేస్తున్నారు. కాస్త ప్రత్యేకంగా ఉండాలని ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అయితే సెల్ఫీలంటే ప్రాణంగా భావించే వారూ ఈ మధ్య పెరిగిపోతున్నారు. అయితే వారందరినీ వెనక్కు నెట్టేసి ముందువరుసలో నిలుస్తాడు ఈ ఫొటోలోని యువకుడు. బ్రిటన్‌లోని పీటర్స్‌బర్గ్‌కు చెందిన జునైద్ అహ్మద్‌కు సెల్ఫీలంటే మహా............ పిచ్చి. ఎంత పిచ్చి అంటే సెల్ఫీలు దిగే ముందు కనీసం మూడు గంటల పాటు తయారవుతాడట.
రోజుకు తక్కువలో తక్కువ 200 సెల్ఫీలు దిగుతాడట. అంతేకాదు వాటిని వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాడట. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అహ్మద్‌కు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారట. దీంతో వారందరికీ నచ్చేలా ఉండేట్లు గంటల తరబడి అద్దం ముందు నిల్చుని రెడీ అవుతాడట. అంతేకాదు వారానికోసారి ఫేషియల్స్, కంటిబొమ్మలను సరిచేసుకోవడం వంటివి చేస్తాడట. అలాగే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నాడట. ఉదయం తన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే వందల కొద్దీ లైక్‌లు కామెంట్లు వస్తాయని, దీంతో తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెబుతున్నాడు. తనకు సెల్ఫీ కింగ్ అని కూడా బిరుదు ఇచ్చుకున్నాడు. ఇంతకు మించి సెల్ఫీ అంటే ‘పిచ్చి’ ఉన్న వ్యక్తి లోకంలో ఉండడేమో!
సెల్ఫీల వీరుడు!
Published Sun, Mar 4 2018 2:38 AM | Last Updated on Sun, Mar 4 2018 2:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment