ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన నయనతార | Nayanthara Responds Over Plastic Surgery Rumours | Sakshi
Sakshi News home page

Nayanthara: కావాలంటే నన్ను గిల్లి చూడొచ్చు!

Published Mon, Oct 28 2024 12:20 PM | Last Updated on Mon, Oct 28 2024 12:29 PM

Nayanthara Responds Over Plastic Surgery Rumours

దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ అనగానే అందరూ నయనతార పేరు చెబుతారు. అందుకు తగ్గట్లే ఒక్కో మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేంతవరకు వచ్చింది. యాక్టింగ్ గురించి వంక పెట్టడానికి ఏం లేదు గానీ కెరీర్ ప్రారంభంలోనే ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై వివరణ ఇచ్చింది. ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజమేంటో చెప్పేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

'నాకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎంతో సమయాన్ని దానికోసం పెడతాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రజలు అలా అనుకుంటున్నారు. అయితే వాళ్లు మాట్లాడుకునేది నిజం కాదు. డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు' అని నయనతార చెప్పింది.

గతేడాది మూడు సినిమాలు చేసిన నయనతార.. ప్రస్తుతం ఐదు మూవీస్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఇద్దరు కొడుకులకు ఎప్పటికప్పుడూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement