
దక్షిణాదిలో గ్లామరస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అతికొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. అభిమానులు ఈమెని ముద్దుగా లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఇకపై అలా పిలవొద్దని నయన్ విజ్ఞప్తి చేసింది.
(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)
అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నా సరే నయనతార అనే పేరే తన మనసుకు దగ్గరైందని చెప్పుకొచ్చింది. నటిగానే కాకుండా వ్యక్తిగానూ తనేంటో ఆ పేరు తెలియజేస్తుందని సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేసింది.
'మీరు చూపించే అభిమానికి థ్యాంక్యూ. నా జీవితం తెరిచిన పుస్తకం. నా విజయంలో, కష్టసమయంలో మీరు అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు రుణపడి ఉంటాను. కానీ నయనతార అని పిలిస్తేనే నాకు సంతోషం. ఇలాంటి బిరుదుల వల్ల సౌకర్యంగా ఉండలేని పరిస్థితి. సినిమా మనందరినీ ఒక్కటిగా ఉంచుతుంది. దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం' అని నయనతార నోట్ లో రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)
