Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు | Mukku Avinash Not Eliminated From Bigg Boss 8 Telugu, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Avinash Elimination: ఎలిమినేట్ కాలేదు కానీ అందరినీ ఏడిపించాడు!

Published Mon, Oct 28 2024 9:37 AM | Last Updated on Mon, Oct 28 2024 12:21 PM

Mukku Avinash Not Eliminated Bigg Boss 8 Telugu

 

బిగ్‌బాస్ 8లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఇతడు.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడు. పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు. దీంతో ఓట్లు తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయాడు. అదే టైంలో అవినాష్ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ చివరలో చూపించారు. కానీ అదంతా ఉత్తిదే.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బెడ్రూంలోకి వచ్చిన అవినాష్.. రిపోర్ట్ వచ్చింది. కడుపులో ఏదో సమస్యగా ఉంది. మీకు కష్టం అవుతుంది. బయటకు వచ్చేసేయండి అని డాక్టర్స్ చెప్పారు. 'ఏది పడితే చెప్పకు.. అను (అవినాష్ భార్య) మీద ఒట్టేసి చెప్పు' అని నిఖిల్ అడిగేసరికి.. ఫొటోపై ఒట్టేసి మరీ నిజంగానే వెళ్లిపోతున్నా అని అవినాష్ చెప్పాడు. నాపై ఒట్టేసి నిజం చెప్పు అని నయని పావని అడిగినప్పుడు కూడా అవినాష్ అదే చెప్పాడు. 'నొప్పి తట్టుకోలేకపోతున్నా' అని ఏడ్చాడు. హౌస్‌లో అందరూ ఇతడిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే ఇదంతా ప్రాంక్‌లో భాగంగానే అవినాష్ చేశాడు. సోమవారం ఎపిసోడ్‌తో ఈ విషయం క్లారిటీ వస్తుంది. 24 గంటల స్ట్రీమింగ్ వల్ల అవినాష్.. తిరిగి ఇంట్లోకి వచ్చిన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పి అవినాష్.. ప్రాంక్ చేయడం వరకు బాగుంది కానీ మరీ భార్య మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడమే కాస్త ఇ‍బ్బందిగా అనిపించింది.

(ఇదీ చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement