ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే? | Here's The List Of 15 New Movies And Web Series Releasing In OTT In October Last Week | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో క్రేజీ మూవీస్

Oct 28 2024 7:58 AM | Updated on Oct 28 2024 9:59 AM

Upcoming OTT Movies Telugu October Last Week 2024

ఈ వారం దీపావళి ఉంది. అందుకు తగ్గట్లే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు సినిమాలతో పాటు అమరన్, బఘీరా లాంటి డబ్బింగ్ బొమ్మలు.. వీటితోపాటు భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి హిందీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో దాదాపు నాలుగు మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ))

బిగ్ స్క్రీన్‪‌పై రిలీజయ్యే అన్ని సినిమాలపై మంచి బజ్ ఉంది. వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి. ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో లబ్బర్ పందు, కిష్కిందా కాండం, తంగలాన్ లాంటి డబ్బింగ్ మూవీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద సబ్‌స్టాన్స్' అనే ఇంగ్లీష్ సినిమా కూడా కచ్చితంగా చూడాల్సిందే. మరి ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 28- నవంబరు 03 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30

  • టైమ్ కట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30

  • మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్) -  అక్టోబర్ 31

  • తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 31

  • బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01

హాట్‌స్టార్

  • విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30

  • లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 31

  • కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 01

అమెజాన్ ప్రైమ్

  • జోకర్: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 29

ఆహా

  • అంజామై (తమిళ సినిమా) - అక్టోబర్ 29

  • అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - అక్టోబర్ 31

జియో సినిమా

  • సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 28

ముబి

  • ద సబ్‌స్టాన్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 31

జీ5

  • మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ సిరీస్) - నవంబరు 01

బీసీ నీట్

  • సివిల్ ఇంజినీర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోయిన్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement