ప్రియుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోయిన్ | Qubool Hai Actor Surbhi Jyoti Married Sumit Suri, Wedding Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Surbhi Jyoti: ఐదేళ్ల ప్రేమ.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి

Published Mon, Oct 28 2024 7:19 AM | Last Updated on Mon, Oct 28 2024 9:42 AM

Surbhi Jyoti Married Actor Sumit Suri Pics Viral

ప్రముఖ హిందీ సీరియల్ నటి సురభి జ్యోతి పెళ్లి చేసుకుంది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమిస్తున్న నటుడు సుమిత్ సూరితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఈ శుభకార్యం జరిగింది. ప్రకృతి ఒడిలోనే వివాహం చేసుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: 'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ))

ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై తదితర సీరియల్స్‌తో సురభి గుర్తింపు తెచ్చుకుంది. సుమిత్ సూరి విషయానికొస్తే.. 30కి పైగా యాడ్స్‌లో నటించాడు. 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు.

ఐదేళ్ల క్రితం హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో సురభి-సుమిత్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది మేలో తమ బంధం గురించి బయటపెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే సహనటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement