నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ | Actress Anju Kurian Engagement | Sakshi
Sakshi News home page

Anju Kurian: ప్రముఖ నటి సర్‌ప్రైజ్ ఎంగేజ్‌మెంట్

Oct 27 2024 11:36 AM | Updated on Oct 27 2024 11:56 AM

Actress Anju Kurian Engagement

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసిన కేరళ బ్యూటీ అంజు కురియన్ నిశ్చితార్థం చేసుకుంది. రోషన్ జాకబ్ అనే వ్యక్తితో కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ఇతడి ఇండస్ట్రీకి చెందినవాడేం కాదు. అయితే ఎంగేజ్‌మెంట్ ఫొటోలతో అందరినీ సర్‌ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే నెటిజన్లు, నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం.. హీరోయిన్ ప్రియాంక మోహన్‌ ఏమందంటే?)

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళ చిత్రాల్లోనూ నటించింది. 201‍3లో 'నేరమ్' అనే మలయాళ మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. ప్రేమమ్, ఓం శాంతి ఓషానా తదితర సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించింది. 'కవి ఉద్దేశించతు' అనే మూవీతో హీరోయిన్ అయిపోయింది. 2018లో 'ఇదం జగత్' అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్‪‌గా చేసింది. చివరగా 'అబ్రహం ఓజ్లర్' మూవీలో కనిపించింది.

31 ఏళ్ల అంజు కురియన్ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. బహుశా వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకునే అవకాశముంది. మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదంటే పుల్‌స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)

Advertisement
 
Advertisement
Advertisement