Anju Kuriani
-
టాలీవుడ్ హీరోయిన్ అంజు సర్ప్రైజ్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన కేరళ బ్యూటీ అంజు కురియన్ నిశ్చితార్థం చేసుకుంది. రోషన్ జాకబ్ అనే వ్యక్తితో కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ఇతడి ఇండస్ట్రీకి చెందినవాడేం కాదు. అయితే ఎంగేజ్మెంట్ ఫొటోలతో అందరినీ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే నెటిజన్లు, నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళ చిత్రాల్లోనూ నటించింది. 2013లో 'నేరమ్' అనే మలయాళ మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. ప్రేమమ్, ఓం శాంతి ఓషానా తదితర సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించింది. 'కవి ఉద్దేశించతు' అనే మూవీతో హీరోయిన్ అయిపోయింది. 2018లో 'ఇదం జగత్' అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్గా చేసింది. చివరగా 'అబ్రహం ఓజ్లర్' మూవీలో కనిపించింది.31 ఏళ్ల అంజు కురియన్ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. బహుశా వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకునే అవకాశముంది. మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదంటే పుల్‌స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) -
వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు
‘‘ఒక రిపోర్టర్ సైలెంట్‌గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరగా వచ్చేశాడని.. వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు, పాపకి ఏమైనా అయ్యుంటే.. నేనున్నాను కదా సార్, మరీ అంత డేంజరస్‌గా ఉన్నావేంట్రా’’ వంటి డైలాగులు ‘ఇదం జగత్’ చిత్రం ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. సుమంత్, అంజు కురియన్ జంటగా అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదం జగత్’. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. సినిమా ట్రైలర్‌ని అడవి శేష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను బయటకు వచ్చి మాట్లాడే రకం కాదు. ‘ఇదం జగత్’ సినిమా చూడలేదు. కానీ నచ్చిన పాయింట్ అనిపిస్తేనే ఇలా మాట్లాడతాను. నాకు సినిమాటోగ్రఫీలో బొకే షాట్స్ ఇష్టం. అలాంటి షాట్స్, కథ ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం’’ అన్నారు. ‘‘సుమంత్‌గారి కెరీర్లో ఇది డిఫరెంట్ మూవీ. అందరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పద్మావతి అన్నారు. ‘‘సుమంత్‌గారు రాత్రి, పగలు అని తేడా లేకుండా ఈ సినిమా షూటింగ్ చేశారు’’ అన్నారు శ్రీధర్. ‘‘కె మెరా, మ్యూజిక్, ఎడిటింగ్.. లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా ఇలా బాగా వచ్చింది’’ అన్నారు అనిల్. ‘‘నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్ కథలంటే మొదట ఆసక్తి ఉండేది కాదు. నా మిత్రుడు అడవి శేష్ నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి థ్రిల్లర్స్ నాలో మార్పు తెచ్చాయి’’ అన్నారు సుమంత్. -
న్యూస్‌ను సృష్టిస్తే?
జ్ఞాపకం, ప్రేమ, చావు, స్నేహం ఇలా సమాజంలో ఇప్పుడు ప్రతిదీ న్యూసే. కానీ లేని న్యూస్‌ను సృష్టిస్తే? అది కూడా డబ్బు కోసం. అలా ఎవరు చేశారు? అలా తప్పు చేసిన వారు చట్టానికి ఎలా పట్టుబడ్డారు? అనే అంశాల ఆధారంగా రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్, అంజు కురియన్ జంటగా నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. కెరీర్లో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు సుమంత్. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించాడు అనీల్. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
మరో అమ్మకుట్టి
‘ఇదంజగత్’ సినిమాతో తెలుగు తెరకు అంజు కురియన్ రూపంలో మరో మలయాళీ భామ పరిచయమయింది. ఈ సినిమాలో ‘దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్లు.... దారాలేవో అల్లే్లస్తున్న స్నేహాలేవో’ అని పాట ఉంది. ఈ పాటలాగే సరిహద్దుల దూరాలను దూరం చేస్తూ మన చిత్రసీమకు వచ్చి స్నేహహస్తం చాటుతున్న అంజు కురియన్ గురించి... అప్పుడు అలా ఇప్పుడు ఇలా! తన గురించి తాను ఇలా రాసుకుంది అంజు.ఏజ్ 10: టీచర్ కావాలనుకున్నాను. ఏజ్ 15: డాక్టర్ కావాలనుకున్నాను. ఏజ్ 20: ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను. ఏజ్ 25: మళ్లీ కిడ్ కావాలనుకుంటున్నాను. కిడ్ అయితే కాలేదుగానీ హీరోయిన్ మాత్రం అయ్యింది. ‘అందం అనేది మనసులో నుంచి పుడుతుంది. కాస్మొటిక్స్ నుంచి కాదు’ అని నమ్మే అంజు సహజసౌందర్యానికే తన ఓటు అంటుంది. ప్రేమమ్‌తో... కేరళలోని కొట్టాయంలో పుట్టిన అంజు కురియన్ చెన్నైలో చదువుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది. ఈ సమయంలోనే డైరెక్టర్ ఆల్ఫాన్స్ మలయాళ చిత్రం ‘నేరం’తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ఈ బ్లాక్‌కామెడీ థ్రిల్లర్‌లో సహాయ పాత్రే అయినప్పటికీ తగిన గుర్తింపు తెచ్చింది. ఇక ప్రేమమ్ (మలయాళం)లో కూడా చేసింది సహాయ పాత్రే అయినా భా.....రీ గుర్తింపు తెచ్చిపెట్టింది. చెన్నై టు సింగపూర్ ‘చెన్నై టు సింగపూర్’ అంజు తొలి తమిళ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాపై విమర్శల మాట ఎలా ఉన్నా అంజు కురియన్ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘ఇదంజగత్’ అంజు తొలి తెలుగు చిత్రం. దీనికి ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ భాష సమస్య వల్ల నటించలేదు. ‘ఇదంజగత్’ కథ విన్న తరువాత మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనని అనుకుందట. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంది. భాష విషయంలో సుమంత్ సహకరించాడట. అంజు కోసం ఆయన తెలుగు టీచర్ అయ్యాడన్నమాట! కొత్త ప్రపంచంలోకి... రొటీన్ పాత్రలు కాకుండా భిన్నమైన అనుభూతిని ఇచ్చే పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది అంజు. ఇతర భాషా చిత్రాల్లో నటించడం ద్వారా తన కెరీర్ పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న అంజు ఇప్పుడు తెలుగు నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ‘కొత్త భాష నేర్చుకోవడం ద్వారా భాష రావడం మాత్రమే కాదు.... కొత్త సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెడతాం’ అని చెబుతుంది అంజు కురియన్. ‘కంఫర్ట్‌జోన్ నుంచి కదలడం కష్టమే’ అనుకున్న దశ నుంచి ‘నువ్వు దృష్టి పెట్టాల్సింది లక్ష్యం మీదే...నీ భయాల మీద కాదు’ అని నమ్మే దశకు వచ్చింది. ఇక విజయాలకు అడ్డేమున్నది! -
ప్రేక్షకులకు సర్ప్రైజ్
‘మళ్ళీరావా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుమంత్ నటించిన తాజా సినిమా ‘ఇదం జగత్’. అంజు కురియన్ కథానాయికగా నటించారు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు. తొలిసారి ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారు పూర్తిచేసి, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
ధనం కాదా?
‘ధనం మూలం ఇదం జగత్’ అని అంటారు. ఈ సినిమా టైటిల్ ‘ఇదం జగత్’. మరి.. ఇదంకి ముందు ఉన్నది ఏంటి? ధనం కాదా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇటీవల ‘మళ్లీరావా’ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘ఇదం జగత్’. అంజు కురియన్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్ ఫిల్మ్స్ అండ్ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు టచ్ చేయని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో సుమంత్ చేశారు. ప్రేక్షకులు ఈ పాత్రకు థ్రిల్ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పనిసరిగా నచ్చుతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. శివాజీరాజా, సత్య, షఫీ, కళ్యాణ్ విథపు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో–ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి. -
వైవిధ్యం.. ఇదం జగత్
వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు సుమంత్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ‘ఇదం జగత్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అంజు కురియన్ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. పద్మావతి, శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్లో ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఎవరూ ఊహించని విభిన్నమైన ఆ పాత్ర ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. టైటిల్‌కు చక్కని స్పందన వస్తోంది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
డ్రామా థ్రిల్లర్
‘నరుడా డోనరుడా’ సినిమా తర్వాత కొంచెం విరామం తీసుకున్న తరువాత స్పీడు పెంచాడు. ఇప్పటికే మళ్లీ రావా షూటింగ్ పూర్తి చేసిన సుమంత్ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. అనీల్ శ్రీకంఠంని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరు సాంబ శివారెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో శుక్రవారం ప్రారంభమైంది. మలయాళ నటి అంజు కురియన్ నాయికగా నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘డ్రామా థిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. సుమంత్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన కెరీర్లో వైవిధ్యంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం అందర్నీ అలరించేలా ఉంటుంది. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్. Moving onto my next, a drama/thriller directed by Anil Srikantam, co starring Anju Kurian, and produced by G. Sridhar & AS Reddy. Godspeed! pic.twitter.com/3dEsJZP8xH — Sumanth (@iSumanth) 27 October 2017 -
సెప్టెంబర్‌లో చెన్నై టూ సింగపూర్
తమిళసినిమా: చెన్నై టూ సింగపూర్ చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో విశేషం ఏమిటంటే సంగీతదర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రం కోసం సంగీత బాణీలను ప్రయాణంలో చెన్నై నుంచి సింగపూర్ వరకూ పయనిస్తూ కట్టారు. అదేవిధంగా ఈ చిత్రం నిర్మాణంలో ఒక భాగం అయ్యారు కూడా. కాగా కంబ్యాక్ పతాకంపై కే.అనంతన్ నిర్మించిన ఈ చిత్రానికి షబ్బీర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అబ్బాస్ అక్బర్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఇందులో గోకుల్ఆనంద్, అంజుకురియన్, రాజేశ్బాలచంద్రన్, శివకేవ్, కవితైకుందర్ ఎంసీ.జెస్సీ, సుమిత్ర ముఖ్య పాత్రలను పోషించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చెన్నై టూ సింగపూర్ చిత్ర వివరాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అబ్బాస్ అక్బర్ తెలుపుతూ చిత్రాన్ని 30 శాతం సింగపూర్‌లో చిత్రీకరించామని, మొత్తం చిత్రాన్ని 65 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. అయితే ముందుగానే అన్ని శాఖల్లోనూ రిహార్సల్ చేసుకుని షూటింగ్‌కు వెళ్లామని చెప్పారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఆధ్యంతం నవ్వుకుని ఆ తరువాత తమ సమస్యలన్నీ మరచిపోతారని అన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ మాట్లాడుతూ చిత్రం సంతృప్తిగా వచ్చినా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయం ఉండేదన్నారు. అయితే రెండు రోజుల కిందట కొందరు విద్యార్థులకు సినీ ప్రముఖులకు చూపించామని, వారి స్పందన చూసి చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.