
సుమంత్, అంజు కురియన్
‘మళ్ళీరావా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుమంత్ నటించిన తాజా సినిమా ‘ఇదం జగత్’. అంజు కురియన్ కథానాయికగా నటించారు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు.
తొలిసారి ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారు పూర్తిచేసి, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.
Comments
Please login to add a commentAdd a comment