Sumanth
-
వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ...
వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం(Brahmanandam ). మరి... ఏం కోరుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్(Sumanth) హీరోగా రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Vaarahi) చిత్రంలోని ఓ సన్నివేశం ఇది. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్పై కాలిపు మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘సుమంత్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని కాలిపు మధు తెలిపారు. -
సంక్రాంతి బరిలో...
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లమూడి దర్వకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాని తీస్తున్నాం. మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!
సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా.. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
Aham Reboot: సోలో క్యారెక్టర్.. గంటన్నర సినిమా
ఒకే ఒక్క క్యారెక్టర్.. దాదాపు గంటన్నర సినిమా. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలై, కొత్తదనాన్ని ప్రదర్శిస్తున్న సినిమా ‘అహం రీబూట్’. ఫిల్మ్ మేకింగ్‌లో..ఓటీటీ ఫ్లాట్‌ఫాం వినూత్న ప్రయోగాలకు వేదికగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఓటీటీ వేదికగా సినిమా రూపు రేఖలే మార్చుతూ విభిన్న కథాంశంతో, సరికొత్త సినిమాటిక్ ఫీల్‌తో వస్తున్న సినిమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ప్రముఖ సినీనటుడు సుమంత్ నటించిన ‘అహం రీబూట్’. నగరం వేదికగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మరోసారి తెలుగువారి ప్రమోగాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఆహాలో విడుదలైన 2 నెలల్లోనే 2 కోట్ల మంది వీక్షించిన సినిమాగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు దర్శకులు ప్రశాంత్ సాగర్..,95 నిమిషాల నిడివి ఉన్న సినిమా పూర్తైయ్యేంత వరకు ఒకే ఒక్క క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు అనుసంధానం చేయడం అంత సులువు కాదంటున్నారు దర్శకులు ప్రశాంత్‌సాగర్. సినిమా కోసమే నగరానికొచ్చి, సినిమాతోనే ప్రయాణం చేయాలంటే ఇంతకుమందెన్నడూ చూడని ప్రయోగాలను ఆసక్తికరంగా చూపించగలగాలని ఆయన అంటున్నారు. ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందించుకున్న ఈ సినిమాను అక్కినేని సుమంత్‌కు చెప్పాను. వినూత్న ప్రయోగాలు, నూతనత్వం ఉన్న కథాంశాలను వదులుకోని సుమంత్..ట్రయల్ ట్రైలర్ అడిగారు. ఆయన అడిగినట్టుగానే చేసి ఇవ్వడంతో నో చెప్పకుండా చేసి ఒప్పుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఈ మధ్యనే అమేజాన్ వేదిక కూడా ప్రసారం చేస్తుంది. సోలో క్యారెక్టర్‌తో గతంలోనూ ఒకటీ, రెండూ సినిమాలు వచ్చినప్పటికీ ఓటీటీ వేదికగా కొత్త ఫిల్మ్ మేకింగ్‌తో ఆకట్టుకుంటుంది అహమ్ రీబూట్. కొత్త సినిమాను పరిచయం చేయాలనే నిర్మాత రఘువీర్ గోరపర్తి లక్ష్యం నెరవేరడం మరింత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో కంటెంట్ రైటర్ సుమలత, ప్రేక్షకులను సంగీతంతో ఎంగేజ్ చేసిన శ్రీరాం మద్దూరి మంచి గుర్తింపు పొందుతున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా, నాన్ కమర్షియల్, డీగ్లామర్ సినిమాను కూడా ప్రేక్షకులు ఇంతలా ఆదరించడం తమలాంటి సినిమా ప్రేమికులకు శుభపరిణామం అని అన్నారు -
ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?
డిఫరెంట్ సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ వేరు. అలా అక్కినేని హీరో సుమంత్ కొత్తగా 'అహం రీబూట్' పేరుతో ఈ మూవీ రిలీజ్ చేశాడు. కొన్నిరోజుల క్రితం నేరుగా ఓటీటీలోకి రాగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా 2 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథేంటి అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి')కేవలం ఒక్క పాత్రతో తీసిన సినిమా 'అహం రీబూట్'. అప్పుడెప్పుడో షూటింగ్ జరగ్గా, థియేటర్ రిలీజ్ కోసం చాలారోజులుగా ఎదురుచూశారు. కానీ ఏది సెట్ అవ్వకపోవడంతో జూలై 1న ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికే రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. ఇందులో సుమంత్ రేడియో జాకీగా నటించాడు.'అహం రీబూట్' స్టోరీ విషయానికొస్తే.. ఆర్జే నిలయ్ ఓరోజు తన రేడియో స్టేషన్లో రాత్రిపూట పనిచేస్తుండగా.. ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. తను ఆపదలో ఉన్నానని చెప్పి, కాపాడమని వేడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్టూడియో నుంచే నిలయ్.. ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు అనేదే కాన్సెప్ట్. కేవలం గంటన్నర నిడివితో తీయగా, థ్రిల్లర్ చిత్రాలు చూసే ఆడియెన్స్‌కి నచ్చేస్తోంది!(ఇదీ చదవండి: ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో సుమంత్ నటిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అహం రీబూట్. ఈ సినిమాకు ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది.అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మొదట థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
సుమంత్ హీరోగా వస్తోన్న కొత్త మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
సుమంత్ , మీనాక్షి గోసామి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. క్రిష్ మాట్లాడుతూ...'మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నా' అని అన్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
వారాహి ఆలయం నేపథ్యంలో..
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోసామి హీరోయిన్. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టైటిల్ లోగోను సుమంత్ రిలీజ్ చేశారు. ‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
ప్రేమజంట ఆత్మహత్య
బోనకల్/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఐశ్వర్య హైదరాబాద్‌లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
కథ చెప్పే విధానం ముఖ్యం
‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్. మా ‘మేమ్ ఫేమస్’ కథని సుమంత్ ప్రభాస్ చక్కగా చెప్పారు. యూత్‌తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్ ఫేమస్’లో లీడ్ రోల్ కోసం ఆడిషన్స్ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్‌లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్ ఫేమస్’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
35 మంది కొత్తవారితో ‘మేమ్ ఫేమస్’
సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్‌కు ప్రముఖ హీరోలంతా హెల్ప్ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్ టాక్‌లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డెరైక్టర్ అయ్యాడు. అంతా యూత్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్’ చంద్రు మనోహర్. ‘‘వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్సీస్లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్ చంద్ర. -
మేము ఫేమస్ మూవీ టీజర్
-
హీరో నానికి నేను పోటీ? సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఈ సినిమాలో హీరోగా చేశా..!
-
వారాహి అమ్మవారి నేపథ్యంతో...
‘సుబ్రహ్మణ్యపురం’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో ‘వారాహి’ మూవీ షురూ అయింది. జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘సంతోష్ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా మంచి స్క్రిప్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్, సహనిర్మాత: కేఆర్ ప్రదీప్. -
'సీతారామం' డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ కూడా అద్భుతమే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్ సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్, సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సీన్ అది. ఫుట్‌బాల్ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్ చెప్పగా.. అతని కాలర్ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది.. నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా 1మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. -
సీతారామం సక్సెస్మీట్కు సుమంత్ డుమ్మా, ఎందుకంటే?
ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సుమంత్ సీతారామం సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా సపోర్టింగ్ రోల్ చేశాడు. ఈ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్ కూడా అయింది. అయినా సినిమా సక్సెస్ పార్టీలో సుమంత్ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటనేది ఆయన చెప్పుకొచ్చాడు. తాను కోవిడ్ బారిన పడినందువల్లే ఈవెంట్‌కు రాలేకపోయానని తెలిపాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్ మీట్‌కు హాజరైన తన చిన్నమామయ్య నాగార్జున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని, కథ నచ్చితే తప్పకుండా చేస్తానని చెబుతున్నాడు. Missed being there as I'm down with COVID! Thanks once again to our team, the audience, and to Chinmama @iamnagarjuna for gracing the success meet 🙏🏼 #SitaRamam https://t.co/pTjj1UNCyg — Sumanth (@iSumanth) August 11, 2022 చదవండి: ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో జైభీమ్ వివాదం: హైకోర్టులో సూర్య దంపతులకు ఊరట -
సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్ ప్రసాద్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్ పాత్ర రెబల్. నా పాత్ర పై ఆడియన్స్‌కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్ రొమాన్స్ వుంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు. -
సీఎం జగన్, నేను స్కూల్ లో ఎలా ఉండేవాళ్లమంటే..
-
అన్నపూర్ణ స్టూడియోలో అమల, చైతన్య బాధ్యత ఏంటంటే..?
-
పుష్ప-2 లో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ పై సుమంత్ రియాక్షన్ చూస్తే..
-
వైఎస్ జగన్ విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది.. నేను ఆయన శ్రేయోభిలాషిని
-
కథ నచ్చితే విలన్‌గా రెడీ
‘‘ఒక ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్లో తొలిసారిగా ‘సీతారామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. కథ నచ్చితే నెగటివ్ పాత్రలు చేయడానికి రెడీ’’ అని అన్నారు సుమంత్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్ చేసిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ... మద్రాస్ రెజిమెంట్’’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ చిత్రంలో సీతరాముల కథను చెప్పాం (ఈ చిత్రంలో హీరో సుమంత్ పాత్ర రామ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ పాత్ర సీత). ఇప్పుడు ఈ ‘సీతారామం’ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నన్ను నటించమన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని హను రాఘవపూడిగారిని అడగడం జరిగింది. దాదాపు 150 పేజీల స్క్రిప్ట్‌ను చదివి, ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. చాలా షేడ్స్ ఉన్నాయి. నెగటివ్ రోల్ కాదు. బ్యూటీఫుల్ అండ్ చాలెంజింగ్ రోల్లా అనిపించింది. నా కెరీర్లో దుల్కర్ సల్మాన్‌ను ఓ మంచి కో స్టార్‌గా చెబుతాను. జనరల్‌గా సెట్స్‌లో నేను మానిటర్ చూడను. డైరెక్టర్ ఓకే అంటే నాకు ఓకే. ఈ సినిమా రషెస్ చూసి అశ్వనీదత్ గారు నన్ను అభినందించారు. హ్యాపీ ఫీలయ్యాను. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘సీతారామం’ చిత్రం మంచి హిట్‌గా నిలుస్తుంది. మరోవైపు నేను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీ స్పేస్‌లో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. అలాగే నాకు, తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు)గారికి పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. మా అమ్మగారు తాతయ్యలా ఉంటారు. నేను మా అమ్మ పోలికలతో ఉంటాను (నవ్వుతూ). తాతగారి పోలికలు నాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు. -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్‌లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్‌గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
హీరో సుమంత్ కొత్త చిత్రం.. మళ్లీ ఆ డెరెక్టర్‌తో రిపీట్..
Hero Sumanth New Movie With Santhosh Jagarlapudi: హీరో సుమంత్ ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేన్లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కె ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం (జులై 3) ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్‌కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కె ప్రదీప్ తెలిపారు. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఆర్జేగా అక్కినేని హీరో.. 'అహం రీబూట్' ఫస్ట్ గ్లిట్చ్ రిలీజ్
Sumanth Aham Reboot First Glitch Released: ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు హీరో సుమంత్. తాజాగా సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిట్చ్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లిట్చ్‌ను యంగ్ హీరో అడవి శేష్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఈ ఫస్ట్ గ్లిట్చ్లో హీరో సుమంత్ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఒక అమ్మాయి కిడ్నాప్ అయినట్లు కాల్ చేస్తుంది. తనను ఒక డార్క్ రూమ్‌లో బంధించి ఉంచారని, త్వరలో తను చనిపోతున్నట్లు చెప్పుకొస్తుంది. ఆ యువతిని ఆర్జే నిలయ్ రక్షించాడా ? లేదా ? అనే కథాంశంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్సింగ్ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఫస్ట్ గ్లిట్చ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. చదవండి: హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా Here is the mighty Interesting peek into the world of #AhamReboot starting my dear bro @iSumanth In recent years, love his novel attempts Aham Reboot First Glitch | Sumanth | Prashanth Sagar Atluri | Sri Ram Ma... https://t.co/heZi6yZTjJ via @YouTube pic.twitter.com/hqdgPICXGs — Adivi Sesh (@AdiviSesh) June 14, 2022 -
‘కి’ రోల్స్‌కి సై అంటున్న స్టార్ హీరోలు
హీరో ఎప్పుడూ హీరోగానే చేయాలా? ‘కీ రోల్’లో కనిపించకూడదా? ‘ఎందుకు కూడదూ’ అంటున్నారు కొందరు టాప్ హీరోలు.. అందుకే హీరోగా తమ చేతుల్లో సినిమాలు ఉన్నా కీ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ హీరోల్ చేస్తున్న కీ రోల్ గురించి తెలుసుకుందాం. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన నాగార్జున చాలా గ్యాప్ తర్వాత చేసిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జునది కీ రోల్. ఇందులో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లు. మూడు భాగాలుగా రానున్న ఈ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగులో రాజమౌళి సమర్పణలో ‘బ్రహ్మాస్త్రం’గా వస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న రిలీజ్ కానుంది. ఇక నాగ్ హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునలానే గతంలో వెంకటేశ్ హిందీ చిత్రాల్లో హీరోగా నటించారు. ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో చేస్తున్న కీ రోల్‌తో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెబుతున్నారు వెంకటేశ్. సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఇక హీరోగా వెంకటేశ్ నటించిన ‘ఎఫ్ 3’ ఈ నెల 27న రిలీజ్ కానుండగా వెంకీ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ చిత్రీకరణలో ఉంది. మరోవైపు హీరోగా రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఊ కొట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి తమ్ముడి పాత్రలో కనిపిస్తారట రవితేజ. ఇదే నిజమైతే... ‘అన్నయ్య’ (2000) చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రను చేసిన రవితేజ మరోసారి చిరూకి తమ్ముడిగా కనిపించినట్లు అవుతుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోల్ చేశారు. ఈ సీనియర్ హీరోలు ఇలా కీలక పాత్రలు చేస్తుంటే యంగ్ హీరో నాగచైతన్య కూడా ఆ తరహా పాత్రలో కనిపించనున్నారు. హిందీ ‘లాల్‌సింగ్ చద్దా’లో కీలక పాత్ర చేశారు నాగచైతన్య. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు మలయాళ స్టార్స్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నవారి లిస్ట్‌లో ఉన్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’లో మమ్ముట్టి కీ రోల్ చేస్తుండగా, ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘సలార్’లో పృథ్వీరాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ‘సీతారామం’లో సుమంత్ ఓ కీ రోల్ చేశారు. సుమంత్ హీరోగా చేసిన ‘వాల్తేరు శీను’, ‘అహం రీబూట్’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రకు ఓకే చెప్పారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అటు హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ సేతు’లో కీ రోల్ చేశారు సత్యదేవ్. అలాగే చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేసిన సత్యదేవ్ ‘గాడ్ ఫాదర్’ లోనూ కీ రోల్ చేశారు. సత్యదేవ్ హీరోగా చేసిన ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’ రిలీజ్‌కి రెడీ అవు తున్నాయి. ఇక హీరోగా ఫామ్‌లోకి వస్తున్న విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’లో కీ రోల్ చేశారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్, అయేషా ఖాన్ ముఖ్య తారలు. విశ్వక్ ప్రస్తుతం ‘గామీ’, ‘ఓరి.. దేవుడా’, ‘దాస్‌కీ దమ్కీ’ చిత్రాల్లో హీరోగా చేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ‘కీరోల్స్’ చేయడం మంచి పరిణామం. ఎలానూ ఆ సినిమా హీరోకి ఉన్న స్టార్డమ్ వల్ల ఆ చిత్రంపై అంచనాలు ఉంటాయి. అదే సినిమాలో ఇంకో హీరో కీ రోల్లో కనబడితే అదనపు బలం చేకూరుతుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా ‘కీ రోల్స్’ చేసేందుకు రెడీ అంటున్నారు. -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
ఆసక్తిగా సుమంత్ ‘అహం రీబూట్’ ఫస్ట్‌లుక్
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహాం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ ఫస్ట్‌లుక్ విడదుల చేశారు మేకర్స్. ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుమంత్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో సుమంత్ లుక్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతుండగా.. సుమంత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కకినిపంచాడు. చదవండి: సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్, షూటింగ్ స్టార్ట్ చూస్తుంటే ఇందులో సుమంత్... సాయం కోరే వాళ్లతో మాట్లాడుతూ వారి సమ్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది! ఈ సందర్బంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు’ అన్నారు. అనంతరం నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు దర్శకుడు ప్రశాంత్ సాగర్‌తో పాటు మూవీ టీంకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. ‘అహాం రీ బూట్‌తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్‌ను అందించబోతున్నాం. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహాం రిబూట్. సుమంత్ నటన చాలా హైలెట్‌గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జయిట్మెంట్ మా టీం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. -
సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన యంగ్ హీరోలు
వేరీజ్ దట్ మోడ్రన్ హెయిర్ స్టయిల్.. వాటీజ్ దిస్ మీసకట్టు.. వేరీజ్ దట్ లవర్ బోయ్ లుక్ అంటే... కట్ చేశా.. లుక్ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్.. ఆన్ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం. 'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్‌కు వెళ్లొచ్చారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌లో ఆమిర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్‌గా కనిపిస్తారు. సినివలో ఓ వార్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్‌సింగ్ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్ రోల్. మరోవైపు విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సోల్జర్‌గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్’ (జేజీఎమ్ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘లైగర్’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘జేజీఎమ్’. ‘‘ఇండియన్స్ ఆర్ టైగర్స్, ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కేన్ రూల్ దిస్ వరల్డ్.. 'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఏ లెవల్లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్‌లోనే టైమ్ స్పెండ్ చేశారు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్‌గా రషి్మకా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ బోర్డర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సుమంత్‌ది కూడా సోల్జర్ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ‘ఏజెంట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్‌గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చదవండి: మందు తాగుతా, ఆ టైమ్‌లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్ దటీజ్ రామ్‌చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
ఆడియన్స్ అప్డేట్ అయ్యారు
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’. నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశాం. ‘నా సర్కిల్లో సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని సుమంత్ అనడంతో హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ ఆడియన్స్ లాక్డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మరింత అప్డేట్ అయ్యారు. కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. నేనూ అలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
విడాకులపై సుమంత్ ఆసక్తికర కామెంట్స్, ఇప్పుడది కామన్..
Sumanth Intresting Comments On Divorce: నాగార్జు అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్ తాజాగా నటించిన చిత్రం మళ్లీ ముదలైంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో సుమంత్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుమంత్ విడాకులపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా సుమంత్‌కు విడాకులపై ప్రశ్న ఎదురైంది. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ దీనిపై స్పందించిన సుమంత్.. ‘నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి కామన్ అయిపోయాయి’ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయంలో తాను దురదృష్టం అనే పదాన్ని వాడదలుచుకోవాలనుకోవట్లేదని, అలా జరుగుతున్నాయంతే అన్నాడు. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ సర్ధుకుపోతున్నారన్నాడు. ఎందుకంటే, రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడిపోతుందని చెప్పుకొచ్చాడు. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అంతా అనుకుంటారంటూ సుమంత్ ఆసక్తిగా స్పందించాడు. చదవండి: అన్‌స్టాపబుల్: చిరంజీవితో ఎపిసోడ్‌పై షో రైటర్ ఆసక్తికర కామెంట్స్ కాగా డివోర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో సుమంత్ భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా నటించాడు. కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే గతంలో సుమంత్ ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకోగా.. సుమంత్ మాత్రం మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీ ప్లాట్ఫామ్లో 'మళ్లీ మొదలైంది'.. అప్పటి నుంచే
Sumanth Malli Modalaindi Movie In Zee5: సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమంత్ మాట్లాడుతూ – ‘‘విడాకుల నేపథ్యంలో దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా. ఈ చిత్రంలోని ‘అలోన్.. అలోన్’ సిగ్నేచర్ సాంగ్ అవుతుంది. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగే కథ ఇది’’ అన్నారు కీర్తీ కుమార్. ‘‘కథలోని ఎమోషన్స్‌ను స్క్రీన్‌పై పర్ఫెక్ట్గా క్యారీ చేయాలని దర్శకుడితో అన్నాను.. అలాగే చేశారు’’ అన్నారు రాజశేఖర్. ‘బన్నీ’ వాసు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలోకి.. సుమంత్ 'మళ్ళీ మొదలైంది' మూవీ
Sumanth Malli Modalaindi Set to Release On OTT: సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'మళ్ళీ మొదలైంది'. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ న్యాయవాది, మెయిన్ లీడ్ హీరోయిన్గా నైనా గంగూలీ నటించారు. టీజీ కీర్తి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'జీ 5' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. -
మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ
సాక్షి, ప్రకాశం: చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా.. ఓ నరుడా సినిమాకు సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశారు. కాగా, ఈ సినిమాకు హీరోగా సుమంత్, నిర్మాతగా సుప్రియ ఉన్నారు. అదే సినిమాకు కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించారు. ఈ వ్యవహారంలోనే తనను మోసం చేశారని మార్కాపురంలో శ్రీనివాసరావు కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. చదవండి: (మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..) -
ఆసక్తిగా సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ మూవీ ట్రైలర్
Malli Modalaindi Trailer Release: హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మళ్లీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మళ్లీ మొదలైంది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇందులో సుమంత్‌కు జోడిగా నైనా గంగూలీ హీరోయిన్గా నటించగా, అతని భార్యగా యాంకర్ వర్షిణి నటిస్తోంది. చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ MARRIAGE 😡and DIVORCE 😍 watch the inspiring trailer of #MalliModalaindi starring @iSumanth @NainaGtweets https://t.co/5N4xTniKQe — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021 ఈ ట్రైలర్ విషయానికోస్తే.. ఈ ట్రైలర్లో ముందుగా టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ జంటలను చూపిస్తూ కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అని చూపించారు.. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగిన పరిణామాలు, సానుభూతులు, తిరిగి మరోఅమ్మాయిని ప్రేమించడం ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. మొదటి భార్య అయిన వర్షిణితో విడాకులు తీసుకున్న సుమంత్.. ఈ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా గంగూలిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి ప్రయత్నించడం ట్రైలర్లో చూపించారు. చూస్తుంటే విడాకుల అనంతరం ఓ మగాడి జీవితం ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారని అర్థమవుతోంది. చదవండి: ముంబైలో కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే -
'ఏంటో ఏమో జీవితం' అంటున్న సుమంత్
సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు బోలెడంత ప్రమోషన్ వచ్చిన సంగతి తెలిసిందే. సుమంత రెండవ పెళ్లి చేసుకోబుతున్నాడు. ఇదిగో వెడ్డింగ్ కార్డు అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. యంగ్ హీరో నితిన్ ఈ పాటను విడుదల చేశాడు. ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా… సాయిచరణ్ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. కాగా ఈ చిత్రంలోసుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #MalliModalaindi - 1st Single #EntoEmoJeevitham 🎶🎶 Out Now 🔊 Link:https://t.co/pnUuBbAwrD@tgkeerthikumar @anuprubens#KrishnaChaitanya @4anbhaskaruni @GRNSivakumaar @PradeepERagav@ArjunSurisetty #KRajashekarReddy #CharanTej #RedCinemas @NainaGtweets — Sumanth (@iSumanth) August 21, 2021 Here comes the quirky heartbreak song of “Malli Modalaindi”. @laharimusic@iSumanth@tej_Uppalapati@NainaGtweets@tgkeerthikumar @anuprubens #KRajashekarReddy #RedCinemas #krishnachaitanyahttps://t.co/5J9b9KN3iN pic.twitter.com/OVSqlL8s6G — nithiin (@actor_nithiin) August 21, 2021 చదవండి : 'విడాకుల తర్వాత జీవితం ఇలా'.. ఫోటో షేర్ చేసిన సుమంత్ 'ఓనమ్' సంబురాల్లో సినీ తారలు..ఫోటోలు వైరల్ -
రీఎంట్రీ ఇస్తున్న మహేశ్ సోదరి.. ఫస్ట్ లుక్ అవుట్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సిల్కర్ స్క్రీన్‌పై మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతోన్న మళ్లీ మొదలైంది చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజుల 'డాక్టర్ మిత్ర'-థెరపిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూవీ విడుదల తేదీపై ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 1998లో సమ్మర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో తొలిసారి వెండితెరకు కనిపించిన మంజుల ఆ తర్వాత నాని సినిమాతో నిర్మాతగా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందింది ఆ తర్వాత 2018లో మనసుకు నచ్చింది సినిమాకు దర్శకత్వం వహించింది. చివరగా 2013లో సేవకుడు చిత్రంలో కనిపించారు. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల అనంతరంనటిగా వెండితెరపై కనిపించనున్నారు. It was fun and exciting to act in the movie "malli modalaindi" as Dr.Mitra - the therapist. Eagerly looking forward to the movie release.@tgkeerthikumar@iSumanth@NainaGtweets@tej_uppalapati#MalliModalaindi #manjulaghattamaneni pic.twitter.com/L7NluBokIv — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 8, 2021 -
‘మళ్ళీ మొదలైంది’: మోటివేషనల్ స్పీకర్‌గా వెన్నెల కిషోర్
సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతొంది. ఈ చిత్రంలో ఇన్స్పిరేషనల్ సింగిల్ మదర్ పాత్రలో నటిస్తోన్న సుహాసిన లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాలో మరో కీలక పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది. ఆ కీలక పాత్ర చేసిందెవరో కాదు.. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. తక్కువగా మోటివేట్ చేస్తూ, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్ అలరించబోతున్నాడు. రీసెంట్గా ..కుటుంబం, సభ్యుల మధ్య ఉండే లవ్ అండ్ ఎమోషన్స్‌తో పాటు భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసేలా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. -
'విడాకుల తర్వాత జీవితం ఇలా'.. ఫోటో షేర్ చేసిన సుమంత్
సుమంత్ పెళ్లి కుదిరిందనే వార్త రెండు రోజుల క్రితం గుప్పుమన్న విషయం తెలిసిందే. వివాహ ఆహ్వానపత్రిక కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అయితే సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’ సినిమాలోని పెళ్లి ఇన్విటేషన్ ఇది. కాగా తన పెళ్లి గురించి వచ్చిన వార్తలకు సుమంత్ స్పందిస్తూ – ‘‘నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడంలేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ డైవర్స్ మరియు రీ మ్యారేజ్ అంశాల నేపథ్యంలో ఉంటుంది. తెలుగులో ఇలాంటి కథతో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలోని వెడ్డింగ్ కార్డ్ లీక్ అయింది’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. టీజీ కీర్తి కుమార్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నైనా గంగూలి హీరోయిన్గా నటిస్తున్నారు. -
రెండో పెళ్లిపై స్పందించిన సుమంత్
అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై హీరో సుమంత్ స్పందించాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, అవన్ని వట్టి రూమర్లే అని కొట్టిపడేశాడు. రియల్ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, వైరల్ అయిన వెడ్డింగ్ కార్డు తన తదుపరి సినిమాకి సంబంధించినది అని క్లారిటీ ఇచ్చేశాడు. పెళ్లి, విడాకులకు సంబంధించి ఓ సినిమా చేస్తున్నానని, ఆ ఫిల్మ్ షూట్ నుంచి ఒక పెళ్లి కార్డు ఫోటో లీకైందని చెప్పారు. ఆ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్ చెప్పాడు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’లోచిత్రంలో నటిస్తున్నారు. 🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8 — Sumanth (@iSumanth) July 29, 2021 -
అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి.. వెడ్డింగ్ కార్డు వైరల్
అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారట. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట. వెడ్డింగ్ కార్డులు కూడా పంచి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పెళ్లి కార్డులను SP(సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కాగా, సుమంత్‌కు హీరోయిన్ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సుమంత్.. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం ‘మళ్లీరావా’ సినిమాతో సుమంత్ పాజిటివ్ టాక్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘అనగనగా ఒక రౌడీ’లోచిత్రంలో నటిస్తున్నారు. -
దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్ ప్రత్యేక పాత్ర!
మామూలుగా హీరోకి దీటైన విలన్ అంటారు కదా.. హీరోకి దీటైన హీరో అన్నారేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సుమంత్ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. హీరోగా పాతిక సినిమాలకు పైగా చేసిన సుమంత్ ప్రత్యేక పాత్ర చేయడమేంటీ అనుకోవచ్చు. ఇది హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్ర కావడంతో ఒప్పుకున్నారట. 1964 బ్యాక్‌డ్రాప్‌లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ బహు భాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు సుమంత్ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు సిద్ధమైంది. -
రొమాంటిక్ కామెడీ
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. టి.జి. కీర్తి కుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సుమంత్. ‘‘రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జి.ఆర్.ఎన్. శివ కుమార్. -
మహేశ్ సినిమాలో ఈ ఇద్దరూ?
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డే, జాన్వీ కపూర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు హీరో సుమంత్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని సంప్రదించారనే ప్రచారం సాగుతోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ గత చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’లో సుశాంత్ ఓ కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో సుమంత్‌ని త్రివిక్రమ్ తీసుకోవాలనుకుంటున్న విషయం నిజమేనా? అనేది చూడాలి. అలాగే శిల్పా శెట్టి నటించనున్నది నిజమే అయితే 20 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపిస్తున్నట్లు అవుతుంది. 2001లో బాలకృష్ణ నటించిన ‘భలేవాడివి బాసూ’ చిత్రం తర్వాత శిల్పా శెట్టి మరో తెలుగు సినిమా చేయలేదు. -
కపటధారి మూవీ టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
కపటధారి మూవీ రివ్యూ
టైటిల్ : కపటధారి జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు : ధనంజయన్, లలితా ధనంజయన్ దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి సంగీతం : సిమన్ కె కింగ్ సినిమాటోగ్రఫీ : రసమతి ఎడిటర్ : ప్రవీన్ కేఎల్ విడుదల తేది : ఫిబ్రవరి 19 అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్ కృషి చేస్తున్నాడు. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్.. ఇప్పుడు థ్రిల్లర్ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. కన్నడ సూపర్ హిట్ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్ అందించిందా? రివ్యూలో చూద్దాం. కథ గౌతమ్ (సుమంత్) ఒక సిన్సియర్ ట్రాఫిక్ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్ కేసులను విచారించాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా..పై అధికారులు అతనికి ప్రమోషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైన విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్ గోపాల్ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్ చేసిన రిటైర్డ్ పోలీసు అధికారి రంజన్ (నాజర్) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ. నటీనటులు ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్ పాత్ర. రిటైర్డ్ పోలీసు అధికారి రంజిత్ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ రెండు మూడు సీన్లలో కనిపించినా.. తనదైన కామెడీ పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్ నందిత, గెస్ట్‌రోల్‌లో కనిపించిన సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్ కుమార్ తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘కవలుధారి’కి రీమేక్‌గా వచ్చింది ‘కపటధారి’. క్రైమ్ థ్రిల్లర్ సినిమా కావడంతో విడుదలైన రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగానే ఆదరిస్తారు. అదే నమ్మకంతో ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగులో ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు కొద్దిమేరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్ చేయగలిగాడు కానీ ఎమోషనల్ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. అది కొంత మైనస్. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చూశాం కదా అనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్, నాజర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్ అంశాలు నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ స్ర్కీన్ ప్లే రొటీన్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ కథ పూరి నాకే చెప్పారు
‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులు చాలా రకాల థ్రిల్లర్ చిత్రాలు చూశారు. కానీ మా ‘కపటధారి’ ఓ కొత్త తరహా థ్రిల్లర్. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది అని చెప్పగలను’’ అన్నారు సుమంత్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమాను జి. ధనంజయ్ నిర్మించారు. కన్నడ చిత్రం ‘కవలుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సుమంత్ చెప్పిన విశేషాలు. ►‘మళ్ళీ రావా’ చిత్రం తర్వాత వరుసగా నాకు రొమాంటిక్ చిత్రాలు వస్తాయనుకున్నాను. కానీ ఎక్కువ థ్రిల్లర్ ఆఫర్స్ వచ్చాయి. ‘కపటధారి’ చిత్రం థ్రిల్లర్స్‌లోనే భిన్నంగా ఉంటుంది. ‘కవలుదారి’ చూసినప్పడు నాకు కొన్ని సన్నివేశాలు కొత్తగా అనిపించాయి. ఈ సినిమా మూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కథ ఏ ప్రాంతం ఆడియన్స్‌కి అయినా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తాను. 40 ఏళ్ల క్రితం మూసివేసిన ఓ కేసును ఓ ట్రాఫిక్ పోలీస్ ఎలా చేధించాడు అనే కథాంశంతో సినిమా ఉంటుంది. కామెడీ, యాక్షన్ అన్నీ మోతాదులోనే ఉంటాయి. ఈ కథ నిజంగా జరిగినట్టుగా అనిపించేలా ఉంటుంది. కన్నడ సినిమా కాస్త నెమ్మదిగా ఉంటుంది. తెలుగు వెర్షన్ కాస్త వేగంగా ఉంటుంది. ►మహాభారతంలో శ్రీకృష్ణుణ్ణి కపటధారి అంటారు. అంటే పైకి కనిపించేది ఒకటి. కానీ లోపల జరిగేది ఒకటి. ఈ కథకు ఈ టైటిల్ కరెక్ట్‌గా సూట్ అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో విడుదల కావాల్సింది. లాక్‌డౌ¯Œ వచ్చింది. ►నేనెప్పుడూ నాకు నచ్చిన, నాకు నప్పే కథలే ఎంచుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ ఆ కథ నాకు సూట్ అవ్వదనిపిస్తే ఆ దర్శకుడికి అప్పుడే చెప్పేస్తాను. గతంలో చాలాసార్లు ఇలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్‌గారు ‘దేశముదురు’ కథ నాకు చెప్పారు. ఇది నాకు సూట్ కాదు సార్ అన్నాను. ఆ సినిమా నాతో తీస్తే పక్కా ఆడేది కాదు. ►మంచి కథ కుదిరితే ఓటీటీలో చేస్తాను. నిర్మాతగా మారాలనే ఆలోచన లేదు. ఒకవేళ ఎవరైనా మంచి కథతో వచ్చి, నిర్మాత దొరకలేదు అంటే నిర్మిస్తాను. ప్రస్తుతానికి అయితే నా సినిమాలకు నిర్మాతలు వస్తున్నారు. ఆ విషయంలో హ్యాపీ. నెక్ట్స్ ‘అనగనగా ఓ రౌడీ’ అనే సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత ఓ రొమాంటిక్ డ్రామా చేస్తాను. ►లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను. హోమ్ థియేటర్ కాస్త అప్‌గ్రేడ్ చేసుకున్నాను. లాక్‌డౌ¯Œ నాకు పెద్ద తేడా అనిపించలేదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం నాకు అలవాటు. -
ఆ హిట్లు కపటధారికి నమ్మకాన్నిచ్చాయి – నాగార్జున
‘‘కపటధారి ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కష్ణమూర్తి దర్శకత్వంలో డా. ధనంజయన్ నిర్మించిన చిత్రం ‘కపటధారి’. ఈ శుక్రవారం విడుద లవుతున్న ఈ చిత్రం కన్నడ ‘కవలుధారి’కి రీమేక్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా? అనుకున్నాం. ‘క్రాక్’ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్‌కి కంగ్రాట్స్. ఈ విజయాలు ‘కపటధారి’ యూనిట్‌కు నమ్మకాన్నిచ్చాయి’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ – ‘‘వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకు మా చిన్న మావయ్యే (నాగార్జున) స్ఫూర్తి. ‘కపటధారి’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమా ఇండియన్ సినిమాను లీడ్ చేస్తుందనే నమ్మకం పెరిగింది’’ అన్నారు ధనంజయన్. ‘‘తెలుగు, తమిళంలో నేనే దర్శకత్వం వహించాను’’ అన్నారు ప్రదీప్ కృష్ణమూర్తి. ఇంద్రగంటి మోహనకృష్ణ, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు. -
'కపటధారి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
సెట్లో అక్కినేని సుమంత్ బర్త్ డే సెలబ్రెషన్స్
-
ఆ సీన్లలో నటించడం తగ్గించేశా: సుమంత్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రి నిర్వహించిన అవగాహన ర్యాలీని హీరో సుమంత్ ప్రారంభించారు. తాతగారు చివరి దశలో క్యాన్సర్‌తో పోరాడటం బాధ కలిగించిందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తన సినిమాల్లో కూడా పొగ తాగడం వంటి సీన్లను తగ్గించేశానని చెప్పుకొచ్చాడు. ఎవరైనా సిగరెట్ తాగే సీన్ చెప్పగానే అవసరమా అని వారిస్తున్నానని పేర్కొన్నాడు. కాకపోతే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ మేరకు అలాంటి సీన్లలో నటించక తప్పదని తెలిపాడు. (చదవండి: ట్రైలర్: 'కపటధారి'ని సుమంత్ కనుక్కుంటాడా?) తన ఫ్యామిలీలో చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోయారని, మరి కొందరు దాన్ని జయించారని చెప్పుకొచ్చాడు. మొదటి దశలోనే క్యాన్సర్‌ను కనిపెట్టగలిగితే దాన్నుంచే బయటపడే అవకాశం ఉందన్నాడు. యువత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించాడు. కాగా సుమంత్ ప్రస్తుతం "కపటధారి" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మరోవైపు మురళీకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఐమా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. (చదవండి: హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి డేట్ ఫిక్స్) -
మెట్రో లైన్ తవ్వకాల్లో అస్థి పంజరాలు!
సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కపటధారి. ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత అక్కినేని- నాగచైతన్య నేడు సాయంత్రం విడుదల చేశారు. ఇందులో మెట్రోలైన్ తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడతాయి. అది ఎవరిది? వారిని ఎవరు? ఎందుకు చంపారు? దీని వెనక ఉన్నదెవరు? అన్న అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టి దోషులను శికక్షించాలన్న కసితో ఆ కేసును పూర్తిగా స్టడీ చేస్తుంటాడు ట్రాఫిక్ పోలీసాఫీసర్ అలియాస్ హీరో సుమంత్. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్‌కు ఓపెన్ చేసిన కేసును క్లోజ్ చేశాకే ప్రశాంతంగా ఉంటుందంటున్నాడు నాజర్. నిజంగా ఆయన చెప్పినట్లుగానే సుశాంత్ కూడా నిరంతరం ఆ కేసును చేధించేందుకు తీవ్రంగా పాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!) ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ, నిజానిజాలు నిర్ధారణ చేసుకుంటూ కేసు పరిష్కారం దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. అయితే ఇదంతా ఎవరు చేశారో తెలిస్తే షాకైపోతావని చెప్తున్నాడో వ్యక్తి. మరి ఆ హంతుకుడి గురించి ఆయన నిజంగానే నోరు విప్పాడా? లేదా సుమంతే అతడిని కనుక్కున్నాడా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే. సస్పెన్స్ అంశాలు బాగానే దట్టించిన ఈ థ్రిల్లర్ ట్రైలర్ సోషల్ మీడియాలో జనాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో నందిని శ్వేత హీరోయిన్గా నటించగా ప్రదీప్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ నెంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.. (చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే : శ్రుతీహాసన్) -
బ్యాక్ టు షూట్
సుమంత్ హీరోగా మురళీకృష్ణ దర్శకత్వంలో గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. ‘బ్యాక్ టు షూట్’ అని చిత్రబృందం పేర్కొంది. సుమంత్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికర కథనంతో, వినోదాత్మక సన్నివేశాలతో సినిమా నడుస్తుందని చిత్రబృందం తెలియజేసింది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించనున్నారు. సుమంత్ సరసన నాయికగా ఐమా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మాదాల ఝాన్సీకృష్ణ, రమేష్ మహేంద్రవాడ. -
‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దారుణ హత్యకు గురైన హేమంత్ తమ్ముడు సుమంత్ సాక్షి టీవీతో శనివారం మాట్లాడారు. తన అన్న హత్య కేసులో ప్రమేయమున్నా ఒక్కరినీ వదలొద్దని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి హత్యలు జరగొద్దని కోరుకున్నారు. హత్యోదంతంపై సుమంత్ మాట్లాడుతూ.. మా అన్న హేమంత్‌ను కొట్టుకుంటూ సంగారెడ్డి తీసుకెళ్లి చంపారట. చివరి సారిగా ఆకలిగా ఉందని చెప్పినా వాళ్లు కనికరించలేదంట. (చదవండి: మరో ‘పరువు’ హత్య) నీకెందుకురా అన్నం అంటూ కొట్టారంట. హత్య వెనకాల అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి అర్చన ప్రధాన పాత్ర పోషించినట్టు తెలసుస్తోంది. నా అన్న చంపిన వారిని వదలొద్దు. ఇలాంటి హత్యలు మళ్లీ జరగొద్దు. యూకేలో హోటల్ బిజినెస్ ప్లాన్ చేశాను. కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాం. ఈ లోపే అన్నయ్యకు ఇంత దారుణం జరగడం కష్టంగా ఉంది. అన్నయ్య సినిమాల్లో ప్రయత్నించాడు. అమ్మ ఇద్దరినీ అందంగా ఉండాలని కోరుకునేది. కానీ చివరిసారిగా అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’అని సుమంత్ కన్నీరుమన్నీరయ్యాడు. (చదవండి: వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) -
తండ్రికి భూమి కొనిచ్చిన కుమార్తె
రోజుకు 80 రూపాయలు సంపాదించే ఓ రైతు కూలీ కుమార్తె సోనాలి. అలాంటిది భారతదేశం నుండి అమెరికా వరకు డాన్స్ షోలలో విన్యాసాలను చూపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. కోల్‌కతాలోని భివాష్ అకాడమీ ఆఫ్ డాన్స్‌కు చెందిన ఇద్దరు నృత్యకారులు సుమంత్ మార్జు, సోనాలి మజుందార్. ఇద్దరూ అమెరికాలోని గాట్ టాలెంట్ షోలో పాల్గొని వారి అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచారు. ‘ఫాటా పోస్టర్ నిక్లా హీరో‘ చిత్రంలోని ‘ధాటింగ్ నాచ్‘ సాంగ్‌కి ఈ జంట అద్భుతమైన నృత్యం చేసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారంతా సోనాలిని ప్రశంసలతో ముంచెత్తారు. వారంతా ఆమె కుటుంబం గురించి తెలుసుకున్నప్పుడు సోనాలి పట్ల వారికున్న గౌరవం మరింత పెరిగింది. ఆకలితో నిద్రపోయిన రోజులు సోనాలి మాట్లాడుతూ ‘నా తండ్రి రోజూ 80 రూపాయలు సంపాదించే రైతు కూలీ. ఆర్థికలేమి కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు కడుపునిండా తినడానికి ఇంట్లో తిండే ఉండేది కాదు. ఆకలితో నిద్రపోయిన రోజులెన్నో. ఆ ఆకలే ఈ రోజు నాలో ప్రతిభను వెలికి తీయడానికి కారణమయ్యిందేమో అనిపిస్తోంది’ అని సవినయంగా తెలిపింది. తన ప్రతిభతో కుటుంబానికి కీర్తి తీసుకొచ్చింది. 2012 లో భారతదేశంలో గాట్ టాలెంట్ సీజన్ 4 విజేతగా సోనాలి మజుందార్ నిలిచింది. భూమి.. ఇల్లు 2019 లో సోనాలి బ్రిటన్ గాట్ టాలెంట్ లో పాల్గొంది. అక్కడ, తన ఊరి గురించి ప్రస్తావిస్తూ– ‘బంగ్లాదేశ్ సమీపంలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చాను, అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు‘ అని వివరించింది. ఇప్పుడు సోనాలీ సంపాదనతో ఆమె తండ్రి తన ఊళ్లో భూమి కొన్నాడు, ఇల్లు కట్టాడు. రైతు కూలీగా జీవితం వెళ్లిపోతుందనుకున్న ఆ తండ్రి కూతురు కారణంగా నిజమైన రైతు అయ్యాడు. కూతురుని కన్నందుకు ఆ తండ్రి అదృష్టవంతుడు అని గ్రామస్థులు చెప్పుకుంటూ ఉంటారు. కళ్లార్పని ప్రదర్శన అమెరికాలోని గాట్ టాలెంట్ కోసం సోనాలి, సుమంత్ రోజూ 8–10 గంటలు ప్రాక్టీస్ చేశారు. ‘ఈ షోలో పాల్గొనడం అనేది నా కల. మా గురువు బివాష్ సార్ వల్ల నా కల నెరవేరింది. నేను డ్యాన్స్ షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కటే అనుకున్నాను. ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేలా ప్రదర్శన ఇవ్వాలి అని’ చెప్పింది సోనాలి. ఆ మాటను షోలో పాల్గొన్న ప్రతీసారీ నిలబెట్టుకుంటోంది సోనాలి. -
ఎమర్జెన్సీ నేపథ్యంలో...
సుమంత్, నందితా శ్వేతా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. జి.ధనుంజయన్ సమర్పణలో లలితా ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. సోమవారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని టీమ్‌కు అభినందనలు తెలిపారు హీరో నాగచైతన్య. పోస్టర్‌పై ఆర్టికల్ 352 అని ప్రత్యేకంగా రాసి ఉంది. అంటే.. ఈ సినిమా ఎమర్జెన్సీ నేపథ్యంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా
సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా తెరపై కనిపించిన చిత్రం ‘గోదావరి’. విభిన్న శైలి కలిగిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఆర్ట్స్‌పై జివిజి రాజు నిర్మించారు. రాజమండ్రి నుంచి లాంచీలో భద్రాచలం వరకు జరిగిన ఈ రీల్ ప్రయాణంలో, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అతి సుందరమైన అందాలను చూపిస్తూ, సున్నితమై మనసులు, కుటంబాల మధ్య ఉండే భావోద్వేగాలను సహజత్వానికి దగ్గరగా, కమర్షియల్ పంథాకు దూరంగా ఉండే ‘గోదావరి’ చిత్రం విడుదలై నేటికి పద్నాలుగేళ్లు పూర్తయింది. సున్నితమైన ఎమోషన్స్, సహజత్వానికి దగ్గరంగా ఉండే సంభాషణలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన ప్రతి పాట సుమధురమైనదే. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆయువుపట్టు అనే చెప్పాలి. ఈ చిత్రం పూర్తిగా శేఖర్ కమ్ముల స్టైల్లో మంచి సంగీతంతో కూడిన ఓ ఫీల్‌గుడ్‌మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విశేష ప్రేక్షకాదారణ లభిస్తూనే ఉంది. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ చిత్రం టీవీల్లో వచ్చిందంటే రిమోట్ పక్కకు పడేసి ఛానల్ మార్చకుండా ఆసక్తిగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ పద్నాలుగేళ్ల కిత్రం వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ తన చల్లదనాన్ని అభిమానులకు పంచుతూ వారిని రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం సినిమా ఘన విజయం సాంధించడంతో పాటు ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకుంది. On its anniversary today, remembering #Godavari (May 19, 2006) pic.twitter.com/poayRKoEn2 — Sumanth (@iSumanth) May 19, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్‌కు డౌట్ -
కపటధారి
కన్నడంలో సూపర్ హిట్ అయిన చిత్రం ‘కవలుదారి’. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సుమంత్. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. సుమంత్, నందితా శ్వేత జంటగా నాజర్, పూజాకుమార్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనంజయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్ కే కింగ్, డైలాగ్స్: బాషా శ్రీ. -
కామెడీ గ్యాంగ్‌స్టర్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు హీరో సుమంత్. ఒక్కో సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్న ఈయన తాజాగా ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు. 2018లో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘పాదయోట్టం’ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో సుమంత్ హీరోగా నటించనుండగా విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నారు. ఈస్ట్ ఇండియా టాకీస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై తమ్మినేని జనార్థన రావు, శర్మ చుక్క ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఐమా అనే కొత్త హీరోయిన్ పరిచయం కానున్నారు. ‘‘గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షి. రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను. -
ఎవరూ చెడ్డ కాదు
‘ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు.. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు’ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సుమంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. నితిన్, నాని, నిఖిల్ వంటి హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్మోహన్ రావుతో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సంజన ప్రొడక్షన్స్– సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. సుమంత్ సరసన సిమ్రత్ కథానాయికగా నటించనుంది. సుమంత్‌ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్‌లో చూపించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: అష్కర్. -
మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సుమంత్
సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా మళ్లీ హిట్ కొట్టాలని కొత్త కథలకు ఓకే చెబుతున్నాడు హీరో సుమంత్. మళ్లీ రావా తరువాత మళ్లీ ఆరేంజ్‌లో సక్సెస్కొట్టలేకపోయాడీ హీరో. తాజాగా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కనున్న చిత్రానికి ఓకే చెప్పాడు. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. -
మా పాఠశాల నుంచి రెండో సీఎం వైఎస్ జగన్..
సాక్షి, సిటీబ్యూరో: ‘నాయకత్వ లక్షణం అనేది వారసత్వంగానే వచ్చింది. అందుకే ఆయన చిన్నప్పటి నుంచే నాయకుడిగా ఎదిగాడు. అందరిలో ఉన్నా... ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. మా అందరి ఆప్త మిత్రుడు, క్లాస్మేట్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతున్నాడంటే. .మేమెంతో మురిసిపోతున్నాం’ అని బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి చదువుకున్న మిత్రులు పులకించిపోయారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు అనేక మంది నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక పదవుల్లో ఉండగా... తాజాగా ఏపీ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న క్రమంలో ఆయన స్నేహితులంతా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. హైదరాబాద్ నగరమంతా డిజిటల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విద్య, వ్యాపార, క్రీడ, రాజకీయ రంగాల్లో పేరొందిన ఎంతోమంది చదువుకున్న హెచ్‌పీఎస్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి 1983లో 5వ తరగతిలో చేరి అక్కడే ప్లస్ టూ పూర్తి చేశారు. వైఎస్ జగన్‌తోనే చదువుకున్న సినీ నటుడు సుమంత్, సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఆమీర్ అలీఖాన్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి త్వరలోనే వైఎస్ జగన్‌తో ‘ఓల్డ్ స్టూడెంట్ మీట్’కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తో తమ చిన్ననాటి అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. స్టూడెంట్ లీడర్ వైఎస్ జగన్ స్కూల్లోనే మా అందరికీ నాయకుడు. ఆయన నాగార్జున హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే నేను డిప్యూటీ హెడ్‌బాయ్‌గా పని చేశాను. నాకంత పని ఉండేది కాదు. కానీ హౌస్ కెప్టెన్ అనేది అత్యంత కీలకం. ఆ బాధ్యతలను జగన్మోహన్రెడ్డి సులువుగా నిర్వహించేవారు. ప్లానింగ్, కో–ఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ ఫర్ఫెక్ట్గా ఉండేది. – సుమంత్, సినీనటుడు ఆయనే గుర్తొస్తాడు.. జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసేవాళ్లం. ఎమర్జెన్సీ వస్తే మాకు ఆయనే గుర్తొస్తాడు. సాదాసీదాగానే ఉంటూ అందరినీ కలుపుకుపోయేవాడు. అప్పుడే అనుకున్నాం.. గొప్ప నాయకుడు అవుతాడని. ఏపీ ప్రజల మద్దతుతో సీఎం అవుతుండడం సంతోషకరం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే జగన్ సైతం మైనారిటీలకు మంచి చేస్తాడన్న నమ్మకం ఉంది.– ఆమీర్ అలీఖాన్, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ ఆల్‌రౌండర్ జగన్ మేం 5వ తరగతి నుంచి కలిసే చదువుకున్నాం. మేమిద్దరం బెంచ్‌మేట్స్ కూడా. నాగార్జున హౌస్ గ్రూప్ మాది. జగన్ శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పడూ గర్వం చూపేవారు కాదు. జగన్ పాఠశాల విద్యార్థి దశ నుంచే గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు. తరగతి హెడ్ బాయ్‌గా ఉండేవారు. ఆటలు, చదువులో ఆల్‌రౌండ్ ప్రతిభ చూపేవారు. స్నేహానికి అత్యంత విలునిచ్చే వ్యక్తి మా జగన్. – కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త ఫుల్ హ్యాపీ... మా పాఠశాల విద్యార్థి జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండడం సంతోషంగా ఉంది. ఆయన జనరంజక పాలన అందిస్తూ అన్నివర్గాలకు మరింత మేలు చేస్తారని, రాష్ట్రాన్ని అగ్రస్ధానంలో నిలుపుతారనిఆశిస్తున్నాం. – మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి రెండో సీఎం... మా పాఠశాల నుంచి రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచే మంచి నాయకత్వ లక్షణాలున్న జగన్ ఎప్పటికైనా పాఠశాల గర్వించే స్థాయికి ఎదుగుతాడని మేము అనుకునేవాళ్లం. – ఫయాజ్‌ఖాన్,పూర్వ విద్యార్థి -
సుమంత్ స్పీచ్ 28 డిగ్రీ సెల్సియస్ టీసేర్ రిలీజ్
-
పతకాలు సాధిస్తాడు.. సాయం చేయండి
రాజేంద్రనగర్: వరల్డ్ యూనిఫైట్(కిక్ బాక్సింగ్) చాంపియన్ షిప్ 2019కి అర్హత సాధించిన రాజేంద్రనగర్‌కు చెందిన విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన కుమారుడికి ఆర్థిక సాయం చేస్తే పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తాడని విద్యార్థి తండ్రి కోరుతున్నాడు. వివరాల్లోకి వెళితే...రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన దేవా స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సుమంత్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బాల్యం నుంచే యూనిఫైట్లో అమితాసక్తి చూపించేవాడు. దీంతో తండ్రి అతడిని ప్రోత్సహించాడు. స్థానికంగా ఎక్కడ పోటీలు జరిగినా సుమంత్ పాల్గొని పతకాలు సాధించేవాడు. గత సంవత్సరం హర్యానాలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. ఏప్రిల్ 16 నుంచి 21వరకు రష్యాలో నిర్వహించే వరల్డ్ యూనిఫైట్ చాంపియన్ షిప్ 2019కి విద్యార్థి అర్హత సాధించాడు. పోటీల్లో పాల్గొనేందుకు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 1.60 లక్షలు అవసరం. చిరు ఉద్యోగినైన తనకు అంత స్తోమత లేదని, తెలంగాణ ప్రభుత్వం లేదా దాతలు ముందుకు వచ్చి తన కుమారుడికి సాయం చేస్తే రష్యా వెళ్లి పతకాలు సాధించుకొని వస్తాడని దేవా ధీమా వ్యక్తం చేశాడు. దయార్థ హృదయులు 84990 82474లో సంప్రదించాలని కోరాడు. -
గోల్డెన్ వాక్
-
చరిత్ర పాఠాలు చదువుకున్నట్టుంది
‘‘చిన్నప్పటి నుంచి నాలో తాతగారి పోలికలున్నాయని చాలా మంది చెప్పేవారు. కానీ తాతగారిలా నటించే అవకాశం దొరకలేదు. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ చిత్రంలో 25నుంచి 60 సంవత్సరాల వరకూ తాతగారిలా ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తాను. నా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని సుమంత్ అన్నారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. దివంగత ముఖ్యమంత్రి, నటుడు యన్టీ రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రని ఆయన మనవడు సుమంత్ పోషించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ... ► ఎన్టీఆర్‌గారి బయోపిక్ తీస్తున్నారు అని విన్నాను కానీ అందులో తాతగారి పాత్ర ఉంటుంది, అది నా వరకూ వస్తుంది అనే ఆలో^è న కూడా చేయలేదు. క్రిష్ కలిసి సీన్స్ అన్నీ వివరించాడు. తను కేవలం దర్శకుడు మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీకి విద్యార్థి కూడా. క్రిష్ న్యాయం చేయగలడని నాకు గట్టి నమ్మకం ఉంది. అతనికి కమర్షియాలిటీ, ఆర్ట్‌కి బ్యాలెన్స్ కుదర్చడం బాగా తెలుసు. ఒకవేళ క్రిష్, బాలకృష్ణగారు లేకుంటే ఈ సినిమా చేసేవాణ్ని కాదేమో? ► ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన లేదు. క్రిష్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం తాతగారి క్యారెక్టర్ చాలా హానెస్ట్‌గా, డిగ్నిఫైడ్‌గా చూపించాను. నాకు ఆ డౌటే లేదు. ఇది కేవలం సపోర్టింగ్ రోల్ అని యాక్సెప్ట్ చేయాలి. ► తాతగారి పాత్ర చేస్తున్నాను అని తాతగారిని అనుకరించడమో, మిమిక్రీ చేయడమో చేయలేదు. యూ ట్యూబ్‌లో ఒకే ఒక్క ఇంటర్వ్యూ చూశా. అదే ఈ సినిమాకు నా హోమ్ వర్క్. ఈ పాత్ర చేయగలను అనే నమ్మకం నాలో మొదటి నుంచీ ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగాను కాబట్టి ఆయన అలవాట్లు నాకు కొన్ని వచ్చేశాయి. ఆయన చాలా గొప్ప పరిశీలకుడు. నాకు కూడా అదే వచ్చింది. సినిమాలో ఏదీ కావాలని ప్రత్యేకంగా చేయలేదు. సహజంగా ఉండటానికి ప్రయత్నించాను. ► ఎప్పుడో ‘యువకుడు’ సినిమా టైమ్‌లో క్లీన్ షేవ్ చేశాను. మళ్లీ వేరే సినిమాల్లో ట్రై చేయలేదు. ‘యన్.టి.ఆర్’ చిత్రానికి ఫస్ట్ డే మేకప్‌లో చిన్న చిన్న ఇబ్బందులున్నా తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. యాక్టింగ్ పరంగా ఏ దశలోనూ కష్టంగా అనిపించలేదు. మేకప్ పరంగా 60 ఏళ్ల వయసు పాత్రప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ► యన్టీఆర్గారితో తాతగారు పంచుకున్న అనుంబంధం గురించి చెబుతూనే ఉండేవారు. కానీ నేను విన్నది ఏదీ స్క్రిప్ట్‌లో లేవు. నాకు తెలియని చాలా విషయాలు ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అది కొత్తగా, ఎగై్జటింగ్‌గా అనిపించాయి. హిస్టరీ క్లాసులకు వెళ్లినట్టు అనిపించింది. ► తాతగారి బయోపిక్ గురించి ఏం ఆలోచించలేదు. మా చిన్నమావయ్య (నాగార్జున)గారు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు చూద్దాం. నా లాస్ట్ సినిమా ‘ఇదంజగత్’ నిరాశ పరిచింది. రిలీజ్ కూడా సరిగ్గా జరగలేదు. ‘మళ్ళీరావా’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా అది. ‘యన్.టి.ఆర్’ తర్వాత రాబోతున్న సినిమాపై కూడా పూర్తి నమ్మకంతోఉన్నాను. -
వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు
‘‘ఒక రిపోర్టర్ సైలెంట్‌గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరగా వచ్చేశాడని.. వాడి నిశ్శబ్దం ప్రమాదం.. వదలడు, పాపకి ఏమైనా అయ్యుంటే.. నేనున్నాను కదా సార్, మరీ అంత డేంజరస్‌గా ఉన్నావేంట్రా’’ వంటి డైలాగులు ‘ఇదం జగత్’ చిత్రం ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. సుమంత్, అంజు కురియన్ జంటగా అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదం జగత్’. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. సినిమా ట్రైలర్‌ని అడవి శేష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను బయటకు వచ్చి మాట్లాడే రకం కాదు. ‘ఇదం జగత్’ సినిమా చూడలేదు. కానీ నచ్చిన పాయింట్ అనిపిస్తేనే ఇలా మాట్లాడతాను. నాకు సినిమాటోగ్రఫీలో బొకే షాట్స్ ఇష్టం. అలాంటి షాట్స్, కథ ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం’’ అన్నారు. ‘‘సుమంత్‌గారి కెరీర్లో ఇది డిఫరెంట్ మూవీ. అందరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’’ అని పద్మావతి అన్నారు. ‘‘సుమంత్‌గారు రాత్రి, పగలు అని తేడా లేకుండా ఈ సినిమా షూటింగ్ చేశారు’’ అన్నారు శ్రీధర్. ‘‘కె మెరా, మ్యూజిక్, ఎడిటింగ్.. లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా ఇలా బాగా వచ్చింది’’ అన్నారు అనిల్. ‘‘నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్ కథలంటే మొదట ఆసక్తి ఉండేది కాదు. నా మిత్రుడు అడవి శేష్ నటించిన ‘క్షణం, గూఢచారి’ వంటి థ్రిల్లర్స్ నాలో మార్పు తెచ్చాయి’’ అన్నారు సుమంత్. -
‘ఇదం జగత్’ ట్రైలర్ ఆవిష్కరణ
సుమంత్ నటిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడవి శేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా టీం అంతా నా ఫ్రెండ్సే. టీజర్, ట్రైలర్లో ‘ఇదం జగత్’ అనే టైటిల్ వచ్చినప్పుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది. ఆ బ్రాండింగ్, కనెక్షన్ రెండింటికీ ఇవ్వడం శ్రీచరణ్‌లో నాకు నచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది అలాగే సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన పద్మావతి మాట్లాడుతూ ‘సుమంత్ గారు ఇలాంటి స్టోరీ యాక్సప్ట్ చేస్తారా అనుకున్నాం. కానీ ఆయన ఓకే చెప్పడమే సర్ప్రైజ్ అనిపించింది. సుమంత్ గారి కెరీర్లో ఇది డిఫరెంట్ మూవీ. ఈ సినిమాకు పైకి కనిపించే హీరో సుమంత్ గారైతే తెరవెనుక హీరో దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు హార్ట్. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆయనకు థ్యాంక్స్. కెమెరా వర్క్ బాగుంది. ప్రతీ ఒక్కరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’ అన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ‘అవకాశం ఇచ్చిన నిర్మాతలు పద్మావతి, శ్రీధర్ గార్లకు థ్యాంక్స్. ఇది టెక్నీషియన్స్ మూవీ. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ థ్యాంక్స్’ అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘మనిషిలో మంచి, చెడుతో పాటు అన్ని కోణాలు ఉంటాయి. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ క్యారెక్టర్ కోసం పెద్దగా కష్టపడలేదు. నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల నాకు మొదట ఆసక్తి ఉండేది కాదు. రెండేళ్ల క్రితం నా మిత్రుడు అడవి శేష్ వల్ల ఆ ఆసక్తి పుట్టింది. అతను నటించిన క్షణం, గూఢచారి చిత్రాలు నాలో మార్పు తెచ్చాయి. నాకిప్పుడు థ్రిల్లర్ జానర్ అంటే పిచ్చి. అందుకే ఈ జానర్లో సినిమా చేశాను. థ్యాంక్స్ శేష్. ఈసినిమా కోసం నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. ‘మళ్లీరావా’ రిలీజ్‌కు ముందు నవంబర్‌లో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాలో చాలా కొత్తగా ప్రయత్నించాం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగా కుదిరాయి. హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం. విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. -
‘ఇదం జగత్’ ట్రైలర్ రిలీజ్
-
పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే
సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకునిగా పరిచయం అయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ఫుల్ కలెక్షన్లను సాధిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఈ రోజుల్లో సక్సెస్ అంటే మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటిది విపరీతంగా కలెక్షన్లు సాధించి దుమ్ము దులపటం. రెండోది విమర్శకుల ప్రశంసలతో పాటు పేరు, అవార్డులు రావడం. ఇక మూడోది నిర్మాత పెట్టిన డబ్బు ఆయనకి తిరిగి రావటం. ఈ కాలంలో అలా జరగటం చాలా అరుదు. పది శాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని సాధిస్తున్నాయి. ఇందులో మా సినిమా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ’’ అన్నారు. సంతోశ్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను, కథనాన్ని నమ్మిన భీరం సుధాకర్‌గారికి థ్యాంక్స్. నా ఫేవరెట్ హీరో సుమంత్. ఆయనతో నా మొదటి సినిమా చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు. భీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన సుమంత్ గారితో పాటుయూనిట్కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, ‘జోష్’ రవి పాల్గొన్నారు. -
ఎలక్షన్లోనూ కలెక్షన్స్ బాగున్నాయి
‘‘తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ నుంచి మంచి రిపోర్ట్స్ వింటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడినప్పుడు చాలా మంచి టాక్ వచ్చిందని చెప్పడంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సంతోష్‌లాగా ఎవరైనా మంచి కథతో వస్తే ఏ జానర్లో అయినా సినిమా చేయడానికి రెడీ’’ అని సుమంత్ అన్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘కథను నమ్మి అవకాశం ఇచ్చిన బీరం సుధాకర్ రెడ్డిగారికి, సుమంత్‌గారికి థ్యాంక్స్. అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ కాల్ చేసి సినిమా బావుందన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో సెకండ్ హాఫ్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఉదయం ఆట నుంచే మా సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. మేం అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయానికి సహకరించిన సుమంత్‌గారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు బీరం సుధాకర్ రెడ్డి. -
‘ఎలక్షన్స్ ఉన్నా కలక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి’
సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ని సొంత చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జగర్లపూడి, నిర్మాత బీరం సుధాకర రెడ్డి పాల్గొన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ... ‘నిన్న ఎలక్షన్స్ ఉన్నా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి చాలా మంచి రిపోర్ట్స్ విన్నాను. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను చాలా మంచి టాక్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే ఏ జానర్ లో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను’ అన్నారు. (మూవీ రివ్యూ : ‘సుబ్రహ్మణ్యపురం’) దర్శకుడు సంతోష్ జగర్లపూడి మాట్లాడుతూ... ‘ముఖ్యంగా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత బీరం సుధాకర రెడ్డి గారికి, సుమంత్ గారికి థాంక్స్. నిన్న యూఎస్ నుండి నా ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ ఆఫ్ గురించి కథనంపై చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మీడియా చాలా బాగా సపోర్ట్ చేసింది. చాలా థాంక్స్’ అన్నారు. నిర్మాత బీరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. ‘మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించింది సుబ్రహ్మణ్యపురం. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి సహకరించిన హీరో సుమంత్ గారికి, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’ తెలిపారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ రివ్యూ
టైటిల్ : సుబ్రహ్మణ్యపురం జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బా, సురేష్, భద్రం, జోష్ రవి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర నిర్మాత: భీరం సుధాకర్ రెడ్డి దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి ‘మళ్లీరావా’ లాంటి కూల్ హిట్‌తో పలకరించిన సుమంత్.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్ జానర్లో తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. సుమంత్ కొత్తగా ట్రై చేస్తూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యపురం’తో ఈ శుక్రవారం(డిసెంబర్ 7) ఆడియెన్స్‌ను పలకరించాడు. మరి ఈ సినిమాతో సుమంత్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? కొత్తగా ట్రై చేసిన ఈ మూవీ సుమంత్‌కు కలిసివచ్చిందా? ఓ సారి కథలోకి వెళ్దాం.. కథ : సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడి గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి అభిషేకం జరగదు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అప్పటినుంచి వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి.(సాక్షి రివ్యూస్) అయితే ఇదంతా దైవమహిమ అనుకుంటూ ఊళ్లో వాళ్లు భయపడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి? అసలు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు నిర్వహించరు? వీటన్నంటిని కనిపెట్టడానికి సుమంత్ చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ. నటీనటులు : కార్తీక్ (సుమంత్).. పురాతన దేవాలయాలపై పరిశోదన చేస్తూ ఉంటాడు. కార్తీక్‌కు దేవుడు అంటే నమ్మకం ఉండదు. ప్రతిదానికి కారణాలు వెతుకుతుంటాడు. హేతువాది పాత్రలో సుమంత్ బాగా చేశాడు. సత్యం, మళ్లీరావా లాంటి సినిమాల్లో కూల్ పర్ఫామెన్స్ ఇచ్చిన సుమంత్ ఈ చిత్రంలో తన నటనలోని మరో కోణాన్ని చూపించారు.(సాక్షి రివ్యూస్) ఇక ప్రియా పాత్రలో నటించిన ఈషా రెబ్బ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. సుమంత్ స్నేహితులుగా నటించిన భద్రం, జోష్ రవి ఫర్వాలేదనిపించారు. సాయి కుమార్, ఎస్సై పాత్రలో అమిత్ శర్మ, గిరి, గ్రామ పెద్దగా నరేంద్ర వర్మ క్యారెక్టర్లో సురేష్ తమ పరిధిమేరకు మెప్పించారు. విశ్లేషణ : దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ సక్సెస్ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ అల్లే కథాకథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్)ఇదివరకు ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చినా.. సుబ్రహ్మణ్యపురం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అయితే వీటిని తెరకెక్కించేప్పుడు గత చిత్రాల ప్రభావం పడకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది. ఇలాంటి కథలో వేగం ముఖ్యం. అదే ఈ చిత్రంలో కాస్త కొరవడినట్టు కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ లోపాలు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్ కథ మైనస్ పాయింట్స్ : స్లో నెరేషన్ నిడివి బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
పని అడిగితే తప్పు కాదు కదా?
‘‘సుబ్రహ్మణ్యపురం’ కథని డైరెక్టర్ సంతోష్ రెండు గంటలు చెప్పారు. కథ వింటున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. అన్ని రకాల సినిమాలు చూస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్ట్స్ ఏమవుతుంది? అని టెన్షన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ ‘సుబ్రహ్యణ్యపురం’లో చాలా ఉన్నాయి’’ అని ఈషా రెబ్బ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్యణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ– ‘‘ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్ర నాది. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తండ్రి అంటే మరింత ఇష్టం. ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంటుంది. కానీ అది థ్రిల్లర్ అనుభూతికి అడ్డుకాదు. నేను భక్తురాలిగా కనిపిస్తాను. సుమంత్ కంప్లీట్‌గా నాకు ఆపోజిట్ రోల్ ప్లే చేశారు. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడిపై రీసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా కలిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్‌లో వర్క్ చేయాలని ఉంటుంది. నేనే అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను.. పని అడగటంలో తప్పు లేదు కదా? తెలుగు అమ్మాయిలకు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు. -
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం : ఈషా
సుమంత్, ఈషారెబ్బ జంటగా సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ బ్యానర్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడి పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘దర్శకుడు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. రెండు పాత్రల అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.సుమంత్ నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. -
అందుకే నిర్మాతగా మారా
‘‘‘కార్తికేయ, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’ వంటి సినిమాలకు ఫైనాన్స్ చేశాను. ‘సుబ్రహ్మణ్యపురం’ కథ నచ్చి నిర్మాతగా మారాను. అంతా అనుకున్న విధంగానే జరిగింది. ఫైనాన్షియర్‌గా వర్క్ చేసిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది’’ అన్నారు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి చెప్పిన విశేషాలు.... ► కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యపురం పుత్తూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కట్టించింది మా పూర్వీకులే. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యస్మామి. ►‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా కథను సంతోష్ మరో నిర్మాతకు చెబుతుంటే నేను విన్నాను. సంతోష్ కథ చెప్పిన విధానం ఇంకా నచ్చి నిర్మాతగా మారాను. ఆ తర్వాత సంతోష్ తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ను పరిశీలించాను. సంతోష్ చెప్పింది చెప్పినట్లు తీశారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు కోట్లు అయింది. ►ఈ కథకు సుమంత్‌గారు సెట్ అవుతారని ఆయన్ను తీసుకున్నాం. సుమంత్‌గారి అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. దేవుడి మహిమ గొప్పదా? మానవ మేధస్సు గొప్పదా? అనే అంశాలను సినిమాలో చర్చించాం. సైంటిఫిక్ అంశాలు కూడా ఉన్నాయి. ఏది గొప్ప అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ►‘మదరాసు ఏస్టేట్’ అని చెన్నైలో నాకు కంపెనీ ఉంది. చెన్నై టు సేలం ఫంక్షన్ హాల్స్ కట్టాలనుకుంటున్నాం. ముందుగా ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కుదర్లేదు. కార్తీకమాసం చివరి రోజు అని రేపు విడుదల చేస్తున్నాం. రిలీజ్ రోజు అమావాస్య అని కూడా అన్నారు. చెన్నైలో మేం ఏం స్టార్ట్ చేసినా అమావాస్య రోజునే స్టార్ట్ చేస్తాం. ఆ కంపెనీస్‌లో ముఖ్యవాటాదారు నేనే. బాగానే ఉంది. అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. 2019లో మా సంస్థ నుంచి ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి. త్వరలో వివరాలు చెబుతాను. -
కుటుంబసమేతంగా.. ‘సుబ్రహ్మణ్యపురం’
‘మళ్లీరావా’ సినిమా విజయంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్‌కు 25 చిత్రం కావడం విశేషం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడంతో పాటు కథ నచ్చడంతో నేనే ప్రొడ్యూస్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా - దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించడం విశేషం. (‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్) పూర్వకాలం,సెకండ్ వరల్డ్ వార్ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈసినిమాలో ఉంటాయి. మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ స్టోరీకి సుమంత్ గారైతే యాప్ట్‌గా ఉంటుందని ముందే ఫిక్సయ్యాం. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌కు మంచిప్రాధాన్యం ఉంటుంది’ అంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. (నా ప్లస్, మైనస్ అదే) -
‘సుబ్రహ్మణ్యపురం’ ఆడియో లాంచ్
-
నా ప్లస్, మైనస్ అదే
‘‘హీరో పరిచయ సన్నివేశాలు కావాలి.. స్లో మోషన్ బిల్డప్ షాట్స్ కావాలని కోరుకోను. అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. విజిల్స్ వేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తాను. కానీ స్క్రిప్ట్‌లో అవసరం లేనప్పుడు ఎందుకు అన్నది నా ఫీలింగ్. నా సినిమా పూర్తి అయ్యాక విజిల్స్ వేయండి’’ అని సుమంత్ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ పంచుకున్న విశేషాలు... ► ‘సుబ్రహ్మణ్యపురం’ కథా చర్చలప్పుడు ‘కాన్సెప్ట్ నచ్చదు.. మిడిల్ డ్రాప్ అవుదాం’ అనే ఆలోచనతో విన్నాను. కానీ, గ్రిప్పింగ్ కథతో రెండున్నర గంటలు కూర్చోబెట్టాడు సంతోష్. తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అన్నీ థ్రిల్లర్సే. తన షార్ట్‌ఫిల్మ్స్ చూశాక నమ్మకం వచ్చింది. ► ఈ సినిమాలో హీరో దేవుడిని నమ్మడు. కానీ, పురాతన గుళ్ల గురించి అధ్యయనం చేస్తుంటాడు. హీరోయిన్ దేవుణ్ణి నమ్ముతుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా ఉంటుంది. అది సబ్‌ప్లాట్. మెయిన్ పాయింట్ వేరే ఉంటుంది. అది ఆసక్తిగా ఉంటుంది. పర్సనల్‌గా దేవుడిని నమ్ముతాను.. నమ్మను అని కాదు.. పట్టించుకోను. చరిత్ర, సంప్రదాయాల మీద నాకు ఆసక్తి ఉంటుంది. ► ‘మళ్ళీరావా’ స్క్రిప్ట్ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. అందుకే వెంటనే చేసేశాను. కమర్షియల్ మీటర్లో ఉందా లేదా అని ఆలోచించను. అదే నా ప్లస్సు, మైనస్సు అనుకుంటా. ఇది కమర్షియల్‌గా ఉంటుంది, ఇది ఉండదు అని లెక్కలు వేసుకొని సినిమా చేయను. కథ నచ్చితే చేస్తా. ‘మళ్ళీరావా’ విడుదల తర్వాత రొమాంటిక్ డ్రామాలు వస్తాయనుకున్నా. కానీ, అన్నీ థ్రిల్లర్ సినిమాలే రావడంతో ఆశ్చర్యపోయా. ► కొత్త దర్శకులతో వర్క్ చేస్తున్నాను. సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. క్యారెక్టర్, స్టోరీ మాత్రమే కథను ముందుకు నడిపిస్తుంటాయి. ఈ చిత్రంలో కావాలని ఏం ఇరికించలేదు. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా ఇది. నెక్ట్స్ చేయబోయే సినిమా ‘ఇదం జగత్’ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ► ‘సుబ్రహ్మణ్యపురం’లో స్పష్టమైన తెలుగు భాషను ఉపయోగించాం. అలా మాట్లాడే వాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దాం అనుకోగానే నాకు రానానే మనసులో కనిపించాడు. తను అప్పుడు బాంబేలో ఉన్నాడు. హైదరాబాద్ రావడం కుదరకపోవడంతో అక్కడే డబ్బింగ్ చెప్పించాం. ► క్రిష్ నా అభిమాన దర్శకుడు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ కోసం ఆయన సంప్రదించగానే కళ్లు మూసుకొని ఓకే చెప్పేశా. రెండు పార్ట్స్‌లోనూ కనిపిస్తాను. టఫ్, ఈజీ అని కాదు.. కథ నచ్చింది. చేసేశాను. ఈ సినిమా కోసం నేను చేసిన పెద్ద హోమ్ వర్క్ ఏంటంటే.. తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) సినిమాలు, ఇంటర్వ్యూలు అన్నీ తిరగేశాను. అలాగని ఇమిటేట్ చేయాలనుకోలేదు. ► నాలో తాతగారి పోలికలు ఉన్నాయి అని అందరికీ తెలుసు. అదృష్టవంతుడిని. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మేకప్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేనే నమ్మలేకపోయా. ‘మహానటి’లో చైతూని(నాగచైతన్య) చూసినప్పుడు భలే నచ్చింది. ‘గూఢచారి’లో సుప్రియ నటన చూసి షాక్ అయ్యాను. బాగా చేసింది. ► బీరం సుధాకర్‌రెడ్డిగారు ఇంతకుముందు ఫైనాన్సియర్‌గా చేశారు. పూర్తిస్థాయి నిర్మాతగా తొలి సినిమా ఇది. మార్కెటింగ్ కూడా బాగా చేశారు. చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో చేశాం. శేఖర్ చంద్రతో పని చేయడం ఫస్ట్ టైమ్. థ్రిల్లర్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. 3 పాటలుంటాయి. చాలా బాగా ఇచ్చాడు. కీరవాణిగారి స్టైల్ కనిపించింది. ► ‘ఇదం జగత్’ కూడా రిలీజ్‌కు రెడీ అయింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ శ్రీకంఠం కొత్తవాడే. బ్రదర్, సిస్టర్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తున్నాను. -
రానా కథ చెబితే...
ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ఎలా అవుతుంది? అంటే కొన్ని చిత్రాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు ‘సుబ్రహ్మణ్యపురం’ టీమ్. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్, సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రానికి రవితేజ వాయిస్, ఇదే రవితేజ నాని ‘ఆ’ చిత్రానికి ఇచ్చిన వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో రానా చేరారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రకథను నడిపించటానికి తన వాయిస్‌తో నడుం కట్టారు రానా. సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంతోశ్ జాగర్లమూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. ‘‘భగవంతుడు ఉన్నాడా? లేదా? అనేది మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం లేని మనిషి భగవంతునిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని, యస్పీబీ పాడిన థీమ్ సాంగ్ ఓ హైలైట్ అని, రానా వాయిస్ ఓ ఎస్సెట్ అని కూడా చెప్పారు. -
పెహెలా పచ్చీస్
‘పెహెలా’ అంటే హిందీలో మొదటి అని అర్థం. ‘పచ్చీస్’ అంటే తెలిసిందే! పాతిక. పాతిక సినిమాల మైలు రాయిని ‘పైలా పచ్చీసు’గా దాటేసిన స్టార్ల స్టేటస్ ఇది. సినీ కెరీర్ మొదలెట్టాక ఏదో ఒక ఘనతను సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ల హయాం వేరు. వాళ్లు రోజుకు మూడు సినిమాల్లో మూడు షిఫ్ట్‌ల లెక్కన పని చేసేవారు. కనుక 50, 100, 200 సినిమాల మైలురాళ్లను దాటటం కష్టం కాలేదు. ఇవాళ్టి స్పీడులో, రోజుకో కొత్త హీరో పుట్టుకొచ్చే కాంపిటీషన్లో, ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవడానికి చోటు చేసుకుంటున్న గ్యాప్‌లో పది ఇరవై సినిమాలు చేయడం పెద్ద విషయం అయ్యింది. ఈ నేపథ్యంలో కెరీర్లో కీలకమైన మైలురాళ్లను దాటనున్న నటీనటులు కొందరు తాము ఘనత సాధించినందుకు తల ఎత్తుకు నిలబడి కనిపిస్తున్నారు. ఫుల్ ఫామ్ ‘ప్రేమకథ’ (1999)తో అక్కినేని మరో వారసుడిగా తెర మీదకు వచ్చారు సుమంత్. ఆ తర్వాత ‘సత్యం’, ‘గౌరి’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’ వంటి హిట్ సినిమాల్లో నటించారు సుమంత్. ఎంతోమంది కొత్త హీరోల రాకతో ఆటుపోట్లకు గురైన ఆయన కెరీర్ ఇటీవల ‘మళ్ళీరావా’ హిట్‌తో ఆశావహంగా ఉంది. ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావులా నటిస్తున్న సుమంత్ అచ్చు తాతగారిలా కనిపిస్తున్న స్టిల్స్ విడుదల చేశారు. ఆయన తాజా సినిమా ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్ స్థాయి నుంచే బజ్ క్రియేట్ చేస్తోంది. అది సుమంత్ 25వ సినిమా కావడం వల్ల ఈ మైలురాయి మరో మంచి హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆడా ఉంటా.. ఈడా ఉంటా డబ్బింగ్ సినిమా ‘పందెం కోడి’తో గోదాలో దిగిన విశాల్ నాటి నుంచి డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు గోదాలో జూలు విదిల్చుకుని నిలుస్తున్నారు. ఆల్మోస్ట్ స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్న భ్రాంతి కలిగిస్తున్న నటుడు ఆయన. బాల దర్శకత్వంలో చేసిన ‘వాడు–వీడు’ విశాల్‌కు నటుడిగా పేరు తెచ్చింది. ఇటీవలి ‘డిటెక్టివ్’, ‘అభిమన్యుడు’ సినిమాలు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను చెదరకుండా కాపాడాయి. వేగంగా సినిమాలు చేసినప్పటికీ 25వ సినిమా మైలురాయి దాటడానికి ‘పందెం కోడి 2’ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అంత పే చేయకపోయినా మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. విశాల్ ప్రస్తుతం ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’లో నటిస్తున్నారు. రకుల్ ఎక్స్‌ప్రెస్ ‘పవిత్ర.. ప్రతి పైసా కౌంట్ ఇక్కడ’తో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాలో సందడి చేశారు రకుల్ ప్రీత్‌సింగ్. అంతకుముందు ‘కెరటం’ సినిమా చేసినా కెరీర్‌కి ప్లస్ కాలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ టైటిల్‌కి తగ్గట్టుగా రకుల్ కెరీర్ వేగం అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న రకుల్ హిందీలో చేసిన ‘అయ్యారీ’తో కలిపి ఇప్పటికి 22 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెంకీ–నాగచైతన్య ‘వెంకీ మామ’, యన్.టి.ఆర్ బయోపిక్, తమిళంలో సూర్య ‘ఎన్జీకే’, కార్తీ ‘దేవ్’, బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ ‘దేదే ప్యార్‌దే’, తదితర ఏడు సినిమాలు ఉన్నాయి. రిలీజ్ ఆర్డర్ బట్టి రకుల్ 25వ సినిమా ఏంటో తెలియడానికి కొంతకాలం వేచి ఉండక తప్పదు. జోరు మీదున్నారు కోలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఆయన స్క్రిప్ట్ నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తున్నారు. సేతుపతి హీరోగా వచ్చే నెలలో రిలీజ్ కానున్న ‘సీతకాత్తి’ ఆయన 25వ చిత్రం. కనుక దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లయడిత్తాల్’ సినిమాతో 25వ మైలురాయిని చేరుకున్నారు. అరుదైన రికార్డ్ వానకు తడవని వాడు, షకీలా పోస్టర్‌ను గోడ మీద చూడని వాడు దాదాపు తెలుగునాట ఉండడు. ఆమె అంత ఫేమస్. దాదాపు సౌత్ భాషలన్నింటిలోనూ నటించారు. ఈ ఏడాది ఆమెకు సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తన 250వ చిత్రం ‘శీలవతి’లో నటించారు. ఈరోజుల్లో ఇది అరుదైన రికార్డ్. సాయిరామ్ దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమా షకీలాకు అంత ఆనందాన్ని మిగల్చలేదనాలి. ‘శీలవతి’ సినిమా రిలీజ్ కోసం, సెన్సార్ చిక్కులను గట్టెక్కించడం కోసం టీమ్ అంతా కష్టపడ్డారు. అన్నట్లు.. షకీలా జీవితంపై హిందీలో ఓ బయోపిక్ రూపొందుతోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షకీలా’గా రిచాచద్దా నటిస్తున్నారు. షకీలా ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఆల్ రౌండర్ ‘మా పల్లెలో గోపాలుడు’ (1985)తో తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా చేరువయ్యారు అర్జున్. ఆ తర్వాత ‘ప్రతిధ్వని’, ‘మా ఊరి మారాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి హిట్స్ ఎన్నో ఇచ్చారు. తమిళంలో చేసిన ‘జంటిల్మెన్’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు తెలుగులో ఆయనకు భారీ విజయం ఇచ్చాయి. ‘జైహింద్’, ‘అభిమన్యు’ యాక్టర్‌గా ఆయన స్థాయిని పెంచిన చిత్రాలు. ఇండస్ట్రీలో దాదాపు 35 ఏళ్ల ప్రస్థానం ఉన్న అర్జున్ తమిళ, కన్నడ బైలింగ్వుల్ ‘నిబునన్’ చిత్రంతో 150వ చిత్రం మైలురాయి చేరుకున్నారు. ఈ సినిమాకు కన్నడలో ‘విస్మయ’ అనే టైటిల్ పెట్టారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకుడు. తెలుగులో ఈ ఏడాది ‘కురుక్షేత్రం’గా ఈ సినిమా రిలీజైంది. కానీ ఈ మైలురాయి చిత్రం అర్జున్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా నటించిన నటి శృతీ హరిహరన్ అర్జున్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ విషయం పక్కన పెడితే అర్జున్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా బిజీగా ఉంటున్నారు. ‘లై’, ‘అభిమన్యుడు’ సినిమాల్లో విలన్‌గా నటించి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నారు. ఆగని పరుగు ‘నిన్నేప్రేమిస్తా’, ‘పెళ్లి సందడి’, ‘ప్రేయసిరావే’, ‘ఎగిరే పావురమా’ వంటి లవ్‌స్టోరీలు ‘చాలా బాగుంది’, ‘మనసులో మాట’, ‘ఆమె’, ‘దీవించండి’ వంటి కుటుంబకథా చిత్రాలు, ‘ఖడ్గం’, ‘మహాత్మ’, ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి యాక్షన్ సినిమాలు శ్రీకాంత్ సొంతం. ‘పెళ్లాం ఊరెళితే’, ‘క్షేమంగావెళ్లి లాభంగా రండి’ చిత్రాలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టే ప్రయత్నం చేశారాయన. ఇప్పుడాయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఇండస్ట్రీలో ఉన్నారు. గతేడాది శ్రీకాంత్ నటించిన ‘రారా’ ఆయన కెరీర్లో 125వ సినిమా. కానీ ఈ సినిమా ఆయనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ క్రెడిట్ విషయంలో ఇష్యూ జరిగింది. డైరెక్టర్ పేరు లేకుండానే సినిమాను విడుదల చేశారు. తాజాగా శ్రీకాంత్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ 2019’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 125తో శ్రీకాంత్ పరుగు ఆగదు. 150 కూడా చేరుకునే అవకాశం ఉంది. ఎంతో దూరంలో లేరు ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేశ్’ అని డైలాగ్ చెప్పినట్టుగా అప్రతిహతంగా ఏ సినిమా అయినా చేసే సత్తాతో ముందుకు సాగుతున్నారు వెంకటేశ్. ఆయన హిట్లు రాయాలంటే ఇక్కడ స్థలం చాలదు. ఈ ఏడాది డిసెంబర్లో స్టార్ట్ అవ్వబోయే ‘వెంకీమామ’ ఆయనకు 73వ చిత్రం. ఇది కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా చేయాలి. అలాగే ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అంటే.. 75వ సినిమాకి ఎంతో దూరం లేదు. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సినిమాలో నటిస్తున్నారాయన. ఫుల్ బిజీ! ‘దేశ ముదురు’తో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక ఇక్కడ స్టార్డమ్ సంపాదించుకుని తమిళ్‌కి వెళ్లారు. అక్కడినుంచి మళ్లీ తెలుగుకి రాలేనంత బిజీ అయ్యారు. మధ్య మధ్యలో తెలుగు సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్లో 50వ చిత్రం ‘మహా’లో నటిస్తున్నారు. ఈ తమిళ చిత్రానికి జమీల్ దర్శకుడు. -
సెన్సార్ పూర్తిచేసుకున్న‘సుబ్రహ్మణ్యపురం’!
అక్కినేని హీరో సుమంత్ కొత్త కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరోకు గతకొంతకాలం పాటు సరైన విజయం దక్కలేదు. రీసెంట్గా ‘మళ్లీరావా’తో ఫామ్‌లోకి వచ్చి.. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. తాజాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. మొత్తంగా 132నిమిషాల వ్యవధితో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదలచేస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. సుమంత్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ‘ఇదంజగత్’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. It's U/A for @iSumanth's supernatural thriller #SubramanyaPuram with crisp runtime of 132 mins. Movie is releasing on Dec 7th. Produced by #BeeramSudhakaraReddy Directed by #SanthosshJagarlapudi@YoursEesha @MadhuraAudio pic.twitter.com/BAGL2dE8NO — BARaju (@baraju_SuperHit) 24 November 2018 -
వైరల్ అవుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్!
‘మళ్లీరావా’ లాంటి క్లాస్ హిట్ తరువాత సుమంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టిన సుమంత్.. రూట్ మార్చి విభిన్న కథలతో ప్రయోగం చేస్తున్నాడు. ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మళ్లీ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేమంతా భగవంతున్నే సర్చ్ చేస్తాము.. కానీ ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు’ , ‘గెలవడానికి ఆ భగవంతుడి సహాయం కావాలని మేము నమ్ముతాం.. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు’ లాంటి డైలాగ్‌లతో ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఆ ఊరు, గుడి, రహస్యం అంటూ మంచి ఇంట్రెస్ట్‌ను కలిగించేలా కట్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈషారెబ్బ కథానాయికగా నటించగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ లాంచ్
-
న్యూస్‌ను సృష్టిస్తే?
జ్ఞాపకం, ప్రేమ, చావు, స్నేహం ఇలా సమాజంలో ఇప్పుడు ప్రతిదీ న్యూసే. కానీ లేని న్యూస్‌ను సృష్టిస్తే? అది కూడా డబ్బు కోసం. అలా ఎవరు చేశారు? అలా తప్పు చేసిన వారు చట్టానికి ఎలా పట్టుబడ్డారు? అనే అంశాల ఆధారంగా రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్, అంజు కురియన్ జంటగా నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. కెరీర్లో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు సుమంత్. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించాడు అనీల్. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
డిసెంబర్ 14న ‘ఇదం జగత్’
మళ్ళీరావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్ హీరోగా నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇదం జగత్. అంజు కురియన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించి డిసెంబర్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారును పూర్తిచేసి డిసెంబర్ 14న చిత్రాన్ని ప్రేక్షకు ల ముందుకు తీసుకొస్తాం. ప్రామిసింగ్ చిత్రాల కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంద’ని తెలిపారు. -
మిస్టరీ థ్రిల్లర్
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. హీరోగా సుమంత్‌కి ఇది 25వ చిత్రం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకుడు. విజయదశమి కానుకగా సోషల్ మీడియాలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయగా 24 గంటల్లో పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ– ‘‘భక్తి ప్రధాన ఇతివృత్తంగా సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. నా సినిమా ప్రయాణంలో ఇదో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. సుధాకర్ మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్లో 25వ సినిమా కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సినిమాను నిర్మిస్తున్నాం. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించటం విశేషం. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. -
‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. విజయదశమి కానుకగా సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. భక్తి ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది.. అని తెలిపారు. నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించారు. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం.. అని అన్నారు. -
ప్రేక్షకులకు సర్ప్రైజ్
‘మళ్ళీరావా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుమంత్ నటించిన తాజా సినిమా ‘ఇదం జగత్’. అంజు కురియన్ కథానాయికగా నటించారు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు. తొలిసారి ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారు పూర్తిచేసి, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
‘సుబ్రహ్మణ్యపురం’ షూటింగ్ పూర్తి!
‘మళ్లీ రావా’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అక్కినేని హీరో సుమంత్. ఈ మూవీ తరువాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. సుమంత్ ప్రస్తుతం ‘ఇదంజగత్’, ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలుచేస్తున్నాడు. వీటిలో ఇదంజగత్ టీజర్ రిలీజై వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా సుబ్రహ్మణ్యపురం షూటింగ్ కూడా పూర్తైనట్టు సుమంత్ తెలిపాడు. ఈ రెండు చిత్రాలే గాక బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. #Subrahmanyapuram #ShootDone. Coming this November! Expect the unexpected... pic.twitter.com/oGbXojcAmm — Sumanth (@iSumanth) October 8, 2018 -
ఎన్టీఆర్ 60.. ఏఎన్నార్ 8..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యన్.టి.ఆర్. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసిన నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య 60 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారట. తాజా సమచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడు సుమంత్ తాత నాగేశ్వరరావు పాత్రలో నటిస్తుండగా ఆయన కూడా ఈ సినిమాలో దాదాపు 8 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్, ఏఎన్నార్లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా?
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుత్నున సినిమాల్లో ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రత్యేకం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించబోతోంది ‘ఎన్టీఆర్’ . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. నేడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రివీల్చేశారు చిత్రబృందం. ఫస్ట్ లుక్‌తో పాటు మరికొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఎన్టీఆర్ (బాలకృష్ణ), ఏఎన్నార్ (సుమంత్) కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’లో ఏఎన్నార్
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సినీ ప్రముఖులు సోషల్ ఈ మీడియా ద్వారా ఏఎన్నార్‌ను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రయూనిట్ ఏఎన్నార్‌కు నివాళులర్పిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. -
‘ఎన్టీఆర్’ సెట్‌కు ‘ఏఎన్నార్’!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలక్రిష్ణ, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ లుక్‌ను రివీల్ చేయించిన క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న సుమంత్ .. ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతోన్నట్లు ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ పాత్రలో నటించనున్న కళ్యాణ్ రామ్ కూడా షూటింగ్లో జాయిన్ కానున్నాడని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. -
మామా అల్లుళ్ల సవాల్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజుల క్రితమే దేవదాస్ యూనిట్ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా అక్కినేని వారసుడు నాగార్జున మేనల్లుడు సుమంత్ మామాతో పోటికి సై అంటున్నాడు. మళ్ళీరావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్ ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఇదం జగత్ సినిమాలో నటిస్తున్నాడు. సుమంత్ తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మామా అల్లుళ్ల మధ్య పోటి తప్పేలా లేదు. మరి ఈ మామా అల్లుళ్లు వెండితెర మీద బరిలో దిగుతారా లేక ఎవరైన పక్కకు తప్పుకుంటారా చూడాలి. -
ప్రతిదీ న్యూసే!
మనిషి చావు, జ్ఞాపకం, ప్రేమ, స్నేహం... ఇలా చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే. కానీ ఆ న్యూస్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఓ యువకుడు. అవసరమైతే న్యూస్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనిల్ శ్రీ కంఠ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా నటించారు. అంజు కురియన్ కథానాయిక. శివాజీ రాజా, సత్య, ఆదిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కథకు ‘ఇదం జగత్’ టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
‘ఇదం జగత్’ టీజర్ రిలీజ్ చేసిన వైఎస్ జగన్
-
‘ఇదం జగత్’ టీజర్ విడుదల చేసిన వైఎస్ జగన్
సుమంత్, అంజు కురియన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఇదం జగత్’ సినిమా టీజర్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్.. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో సాయంత్రం బస చేసిన శిబిరంలో హీరో సుమంత్ సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ శ్రీకంఠం దర్శకుడు. టీజర్లో.. ‘ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే.. చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే అది ఎన్‌క్యాష్ చేసుకోవడం తెలుసుకోండి. అవసరమైతే ఆ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలిసుండాలి అది నాకు తెలుసు’ అనే సుమంత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ డైలాగ్స్‌తో సుమంత్ కెమెరామన్ పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్గా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇదంజగత్ సినిమా టీజర్ రిలీజ్
-
ఇదంజగత్ సినిమా టీజర్ విడుదల చేసిన వైఎస్ జగన్
-
సూపర్ థ్రిల్లర్
సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓవర్సీస్ (భారతదేశం బయట మార్కెట్) బిజినెస్ కంప్లీట్ అయిపోయి ఆసక్తిని పెంచుతోంది సుమంత్ లేటెస్ట్ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. కంట్రీసైడ్ పిక్చర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నాం. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లాస్ట్ అర్ధగంటలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఫ్యాన్సీ రేట్‌కు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోవడం హ్యాపీగా ఉంది. సుమంత్ కెరీర్ బెస్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఆర్.కె.ప్రతాప్. -
దేవుడు ఆగ్రహిస్తే..
‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషా రెబ్బా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న 25వ చిత్రమిది. సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మంచి మిస్టరీ థ్రిల్లర్. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామిపై ఉన్న ఓ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంచి సాహిత్యం అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడేందుకు అంగీకరించారు’’ అన్నారు. ‘‘అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏంటి? అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సుమంత్ దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారు’’ అన్నారు సంతోష్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర. -
తాతలా మనవడు
‘మహానటి’ సినిమాలో ఏయన్నార్ పాత్రను ఆయన మనవడు నాగ చైతన్య పోషించి, అభిమానులను అలరించారు. ఇప్పుడు మరో మనవడు సుమంత్, తాత పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నట్లు సుమంత్ కన్ఫర్మ్ చేశారు. ‘‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో జాయిన్ అవ్వడం ఎగై్జటింగ్‌గా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ కానుంది. -
కన్ఫమ్ : ఏఎన్నార్‌గా సుమంత్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఇద్దరు యువ కథా నాయకులు ఎన్టీఆర్‌లో భాగమవుతున్నట్టుగా ప్రకటంచారు. ఇప్పటికే రానా.. ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించగా తాజా సుమంత్ కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టుగా కన్ఫమ్ చేశాడు. రానా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తాను కూడా ఎన్టీఆర్‌లో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే తాత ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పాడు సుమంత్. గతంలో ఈ పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్ కు చెక్ పెడుతూ ఎన్టీఆర్ లో ఏఎన్నార్‌గా కనిపించబోయేది తానే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు సుమంత్. Excited and honored to be joining this team, portraying my grandfather #ANR in this prestigious venture🙏🏼 #NTR https://t.co/6T09vrnCHB — Sumanth (@iSumanth) 4 August 2018 -
బ్రాండ్ బాబు సినిమాపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 'బ్రాండ్ బాబు' సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. -
‘బ్రాండ్ బాబు’ స్పెషల్ ప్రీమియర్ షో
-
‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్ బాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్ క్యారెక్టర్లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మెప్పించాడా..? కథ: డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్(సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్‌గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్‌తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్‌ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. (సాక్షి రివ్యూస్)హీరోకు హీరోయిన్ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ నటన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్స్ : పాటలు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఉపేంద్రగారిని చూసి హీరో అయ్యా
‘‘మా నాన్నగారు (శైలేంద్రబాబు) 20 ఏళ్లుగా కన్నడంలో సినిమాలు చేస్తున్నారు. అక్కడి స్టార్స్‌తో పని చేశారు. తెలుగులో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేశారు. ఇక్కడి మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ చూసి తెలుగులో నన్ను పరిచయం చేయాలనుకుని ‘బ్రాండ్బాబు’ సినిమా తీశారు’’ అని హీరో సుమంత్ శైలేంద్ర అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ శైలేంద్ర చెప్పిన విశేషాలు. ∙డైరెక్టర్ మారుతిగారిని ఓ మంచి సినిమా చేయమని రెండు మూడేళ్లుగా అడుగుతున్నాను. ఓ రోజు ఆయన నన్ను పిలిచి ప్రభాకర్ దర్శకత్వంలో సినిమా చేయమని, తాను రాసుకున్న కథ అందించారు. ప్రతి ఒక్కరికీ బ్రాండ్స్ వస్తువులు వాడాలనే పిచ్చి ఉంటుంది. అందుకే.. ఓ కొత్త హీరోగా ఇలాంటి కథ నాకు యాప్ట్ అవుతుందనిపించి ఈ చిత్రం చేశా. ఇది పక్కా మారుతి బ్రాండ్ మూవీ. ∙బ్రాండ్స్ అంటే ఇష్టపడే ఓ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిగా కనపడతాను. పెక్యులర్ పాత్ర నాది. బ్రాండ్స్ ధరించే వ్యక్తులతోనే మాట్లాడతాడు. అలాంటి యువకుడు ఓ పేదింటి అమ్మాయిని ఎలా ప్రేమించాడన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు సినిమాలను పండగలా ఫీలై చూస్తారు. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది. ∙సినిమాల్లోకి రావాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. ఓ రోజు మైసూర్లో ఉపేంద్రగారి సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఆయనకు దొరికిన ఆదరణ, గౌరవం చూసి నేనూ సినిమాల్లోకి రావాలనుకున్నా. ప్రజల్లో ఆదరణ పొందాలంటే రాజకీయాల్లో అయినా ఉండాలి... లేదా సినిమాల్లో అయినా ఉండాలి. రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ∙నటుడు అల్లు అర్జున్ నాకు ఇన్స్పిరేషన్. ఆయన నటించిన ‘ఆర్య’ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా. హీరో అయ్యాక రెండు సార్లు ఆయన్ను కలిశాను. అల్లు శిరీష్ చాలా క్లోజ్. ఎన్టీఆర్, మహేశ్‌బాబు, బన్ని సినిమాలు చూస్తుంటా. కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువగా చూశా. ∙ప్రేక్షకుల అభిరుచి మూడు నాలుగేళ్లకోసారి మారుతుంటుంది. ట్రెండ్ మారుతోంది కాబట్టి అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చేయడం కంటే పెద్ద మార్కెట్ ఉన్న తెలుగులోనే చేయాలనుకున్నా. పైగా.. రెండు భాషల్లో ఒకేసారి చేసే సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఉంది. -
సుమంత్‌కి మరోవైపు...
సుమంత్ సాఫ్ట్ హీరో. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్ సుమంత్‌కి అలాంటి ఇమేజ్‌నే తెచ్చాయి. ఇప్పుడు తనలో మరో కోణం చూపించడానికి రెడీ అయ్యారు. సుమంత్‌ని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మనం చూడబోతున్నాం. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా ‘ఇదం జగత్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ నెగటివ్ షేడ్ రోల్లో కనిపించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ తన కెరీర్లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. సుమంత్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్ట్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అంజు కురియన్ కథానాయికగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శివాజీ రాజా, ‘ఛలో’ ఫేమ్ సత్య, ఆదిత్యా మీనన్, కల్యాణ్, షఫీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కో–ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి. -
మానవుడి పరిస్థితి ఏంటి?
‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటి స్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ కెరీర్లో ఇది 25వ సినిమా. ఈషా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, ధీరజ్ బొగ్గరం నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. దెయ్యానికి ఆగ్రహమొస్తే దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే చక్కని కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుమంత్ ఈ చిత్రంలో నాస్తికుడిగా నటిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని హీరో ఇష్ట పడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠ కలిగించే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల, ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. సురేశ్, తనికెళ్ల భరణి, జోష్ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్కే ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర. -
‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్
మళ్ళీరావా సినిమాతో సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. "To believe or not to believe" #Subrahmanyapuram . Here's the first look. Shoot almost halfway thru. Due for release this November... pic.twitter.com/eeH51PkjM6 — Sumanth (@iSumanth) 1 July 2018 -
ఎన్టీఆర్ బయోపిక్.. కొత్త ట్విస్ట్!
నందమూరి బాలకృష్ణ ఏ ముహూర్తాని ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రకటించారో గాని.. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవటం, ఆ స్థానంలో క్రిష్ వచ్చి చేరటంతో సినిమా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్న క్రిష్ నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సమకాలీన నటుల పాత్రల్లో ఈ జనరేషన్ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపిస్తారన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఎన్నార్ పాత్రలో చైతూకు బదులుగా మరో అక్కినేని ఫ్యామిలీ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల మళ్ళీరావా సక్సెస్‌తో ఫాంలోకి వచ్చిన సుమంత్‌ను ‘ఎన్టీఆర్’లో ఏఎన్నార్ పాత్రకు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ధనం కాదా?
‘ధనం మూలం ఇదం జగత్’ అని అంటారు. ఈ సినిమా టైటిల్ ‘ఇదం జగత్’. మరి.. ఇదంకి ముందు ఉన్నది ఏంటి? ధనం కాదా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇటీవల ‘మళ్లీరావా’ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘ఇదం జగత్’. అంజు కురియన్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్ ఫిల్మ్స్ అండ్ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు టచ్ చేయని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో సుమంత్ చేశారు. ప్రేక్షకులు ఈ పాత్రకు థ్రిల్ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పనిసరిగా నచ్చుతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. శివాజీరాజా, సత్య, షఫీ, కళ్యాణ్ విథపు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో–ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి. -
‘ఇదం జగత్’ ఫస్ట్ లుక్!
‘మళ్లీ రావా’తో క్లాస్‌హిట్ కొట్టారు సుమంత్. చాలా కాలంపాటు సరైన హిట్ కోసం ఎదురు చూసిన సుమంత్‌కు ఈ సినిమాతో మంచి విజయం లభించింది. తనకు కలిసి వచ్చిన ప్రేమకథతోనే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం సుమంత్ తన తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుమంత్ రూట్ మార్చి ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను పట్టాలెక్కిస్తున్నారు . సుమంత్ ఫోటో జర్నలిస్ట్‌గా నటిస్తోన్నఈ సినిమాతో అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంతో పాటు సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నారు. Shoot all done, and in post production. Here's the first look of my next release #IdamJagath pic.twitter.com/t21cmcBu16 — Sumanth (@iSumanth) June 25, 2018 -
తర్వాత ఏం జరుగుతుంది?
‘మళ్ళీరావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటిస్తోన్న సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషారెబ్బా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఈ నెల 4 నుంచి ఆర్ఎఫ్సీలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ నెల 12 వరకు జరిగే ఈ షెడ్యూల్లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వి.. ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. సుమంత్ కెరీర్లో ఈ సినిమా మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర. -
కోర్టుకు హాజరైన సుప్రియ, సుమంత్
ప్రకాశం, మార్కాపురం: చెక్ బౌన్స్ కేసులో హిరో నాగార్జున మేనల్లుడు, మేనకోడలు సుమంత్, సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా..డో నరుడా సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో మార్కాపురంలోని కోర్టులో చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి వాయిదా కోసం వారు గురువారం హైదరాబాద్ నుంచి తమ న్యాయవాదులతో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. కేసును జూన్ 28కి కోర్టు వాయిదా వేసింది. -
వైవిధ్యం.. ఇదం జగత్
వైవిధ్యమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు సుమంత్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ‘ఇదం జగత్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు. మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అంజు కురియన్ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. పద్మావతి, శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్లో ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఎవరూ ఊహించని విభిన్నమైన ఆ పాత్ర ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమంత్ పాత్ర, కథకు ‘ఇదం జగత్’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. టైటిల్‌కు చక్కని స్పందన వస్తోంది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
సుమంత్ హీరోగా ‘ఇదం జగత్’
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఇదం జగత్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నాడు. -
సుమంత్ 25వ చిత్రం ప్రారంభం
-
సూపర్ న్యాచురల్ సుబ్రహ్మణ్యపురం
సుమంత్, ఈషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం లోగోను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, రాజశేఖర్, జీవితా సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సంతోష్ స్టోరీ న్యారేషన్లోనే సినిమాను చూపించారు. సూపర్ న్యాచురల్ అంశాలున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి జోనర్ అంటే నాకు భయం కానీ కథ నచ్చి చేస్తున్నాను. నిర్మాతలు గుర్తు చేసేవరకు ఇది నా 25వ సినిమా అని నాకు తెలియదు. అందుకే సందడిగా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘కథ వింటున్నప్పుడు తర్వాత ఏంటి? అనే ఉత్కంఠతో ఎదురు చూశాను. ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను’’ అన్నారు ఈషా. ‘‘నా షార్ట్ ఫిల్మ్స్ చూసి నిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు. సింపుల్‌గా అవుట్‌లైన్ చెబుదాం అని వెళ్తే క్లియర్‌గా స్టోరీ అంతా చెప్పమన్నారు సుమంత్‌గారు. కథ అంతా విన్న తర్వాత అంగీకరించారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ‘‘సుమంత్‌గారి 25వ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. సుధాకర్ రెడ్డిగారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు ధీరజ్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర. -
సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రారంభం
సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్ కెరీర్ మళ్ళీరావా సినిమాతో ఊపందుకుంది. ఇలాంటి క్లాస్‌హిట్ తర్వాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు సుమంత్. అయితే తాజాగా మరో ప్రాజెక్టును ప్రారంభించాడు. సుబ్రహ్మణ్యపురం పేరుతో రూపొందుతున్న సినిమాను ఉగాది సందర్భంగా ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై తొలిషాట్‌కు క్లాప్ కొట్టారు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్గా నటిస్తోంది. సంతోశ్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ధీరజ్ భోగారం, సుదాకర్ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సుమంత్‌కు జోడిగా ఈషా?
సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్‌కు మళ్ళీరావా పెద్ద ఊరటనిచ్చింది. ఇలాంటి క్లాస్‌హిట్ తర్వాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు సుమంత్. అయితే తాజాగా మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు ఈ హీరో. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్గా ఎంపిక చేశారని సమాచారం. అమీతుమీ సినిమాలోని నటన, తన అందంతో ఈషాకు తర్వాత అవకాశాలు పెరిగాయి. ఈ భామ రీసెంట్గా అ! సినిమాలో నటించింది. ప్రస్తుతం సుమంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
థ్రిల్లర్ జానర్లో ‘ఇదం జగత్’!
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సుమంత్ కొత్త స్టైల్లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
గెలిపించిన అక్షత్, సిరాజ్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ ‘డి’లో హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 128 పరుగుల భారీ తేడాతో సర్వీసెస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (116 బంతుల్లో 127; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి సెంచరీ సాధించగా, కొల్లా సుమంత్ (26 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరికి ఆకాశ్ భండారి (37 బంతుల్లో 47; 4 ఫోర్లు, ఒక సిక్స్), రోహిత్ రాయుడు (37; 2 ఫోర్లు), బావనక సందీప్ (36; 3 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం సర్వీసెస్ 40.4 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (92 బంతుల్లో 64; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, హార్దిక్ సేథి (38), సూరజ్ యాదవ్ (34) ఫర్వాలేదనిపించారు. మొహమ్మద్ సిరాజ్ 45 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రోహిత్, భండారిలకు చెరో 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌తో ముగ్గురు హైదరాబాద్ తరఫున, ఐదుగురు సర్వీసెస్ తరఫున లిస్ట్–ఎ క్రికెట్లో అరంగేట్రం చేయడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర 32 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... విదర్భ ఏడు పరుగులతో జార్ఖండ్‌పై గెలుపొందాయి. రాణించిన సుమంత్: ఆంధ్ర విజయం చెన్నై: ఆంధ్ర జట్టు మొదటి మ్యాచ్‌లో చెలరేగి టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది. గ్రూప్ ‘సి’లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్లతో రాజస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా రాజస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. చేతన్ (82 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, అయ్యప్పకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆంధ్ర 45 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసి గెలిచింది. బోడపాటి సుమంత్ (52 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేయగా, విహారి (49; 4 ఫోర్లు), భరత్ (38; 3 ఫోర్లు), అశ్విన్ హెబర్ (27 బంతుల్లో 33; 8 ఫోర్లు) రాణించారు. -
మళ్లీ విభిన్న కథాంశంతో సుమంత్
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన సుమంత్‌కు 'మళ్లీరావా' మంచి బూస్ట్‌నిచ్చింది. సత్యం, గోదావరి తరువాత మళ్లీ తన కెరీర్లో ఈ సినిమా ప్లస్ అయింది. అయితే మధ్యలో చాలా సినిమాలు చేసినా సమంత్‌కు విజయం దక్కలేదు. నరుడా డోనరుడా (హిందీ సినిమా ‘విక్కీ డోనర్’) తెలుగులో కొత్త కథే అయినా అది ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. చాలాకాలం తర్వాత మంచి కథాంశంతో, తనకు సరిపోయే ప్రేమకథా చిత్రంతోనే మళ్లీ సక్సెస్ అందుకున్నారు. ఈ ఉత్సాహంలో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుమంత్ నిద్ర సమస్యతో బాధపడే పత్రిక ఫోటోగ్రాఫర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తనకు ఉన్న సమస్యతో ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడనేదే సినిమా కథ అని సమాచారం. అనిల్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనిల్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక మళ్లీరావా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఏ-సెంటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. హిందీ టీవీ సీరియల్ నటి ఆకాంక్ష సింగ్ మళ్లీరావాతో హీరోయిన్గా పరిచయం అయింది. -
మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి – సుమంత్
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్కా నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ సక్సెస్, ఫెయిల్యూర్ రెండిటిని సమానంగా తీసుకుంటాను. ‘మళ్ళీ రావా’ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా గౌతమ్‌ను దర్శకునిగా పరిచయం చేసినందుకు గర్వంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ పాడైపోయింది, కొత్త ఫోన్ కొనాలి. సినిమాలో మ్యూజిక్ హైలైట్ అయింది. సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘సినిమాను ఎంత నమ్మామో అంత కంటే మంచి ఫలితం లభించింది. అందరూ తమ సొంత సినిమాలా పని చేశారు. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత. ‘‘నన్ను నమ్మిన సుమంత్ గారికి, నిర్మాతకు కృతజ్ఞతలు. ఇండస్త్రీ నుంచి ‘మంచి సినిమా చేశారు’ అంటూ అభినందనలు వస్తున్నాయి. ఇది టీమ్ సక్సెస్’’ అన్నారు గౌతమ్. చిత్రబృందానికి ‘మధుర’ శ్రీధర్ అభినందనలు తెలియజేశారు. -
నాదీ టీనేజ్ లవ్ స్టోరినే : హీరోయిన్
మళ్ళీరావా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముద్దగుమ్మ ఆకాంక్ష సింగ్. పలు హిందీ సీరియల్స్ లో నటించిన ఆకాంక్ష తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా తొలి సినిమానే ఘనవిజయం సాధించటంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆకాంక్ష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను పెళ్లయిన తరువాతే నటనను కెరీర్ గాఎంచుకున్నానని తెలిపింది ఆకాంక్ష. ఏడేళ్ల క్రితమే ఆకాంక్షకు పెళ్లైందట. 16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిన ఈ భామ 20 ఏళ్లకు పెళ్లి చేసుకుంది. తరువాత భర్త సహకారంలో నటనలో శిక్షణ తీసుకొని యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. మళ్ళీరావా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆకాంక్ష తెలుగు లో బిజీ అవుతుందని భావిస్తున్నారు. -
మళ్ళీరావా చాలా బాగుంది – రాఘవేంద్రరావు
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీ రావా’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మళ్ళీరావా’ నాకు బాగా నచ్చింది. సుమంత్ నటన అద్భుతం. కెమెరా పనితనం, సంగీతం కొత్తగా అనిపించాయి. ఆకాంక్ష సింగ్‌తో పాటు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన గౌతమ్ అనుభవం ఉన్నవాడిలా తీశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారి విజయం అందుకున్న రాహుల్ యాదవ్‌కి శుభాకాంక్షలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
నాగ్-సుమంత్.. అసలు గొడవేంటీ..?
టాలీవుడ్ అగ్రహీరో కింగ్ నాగర్జునకు, తన మేనల్లుడైన హీరో సుమంత్‌లకు మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఏఎన్నార్ మరణాంతరం ఆస్తుల పంపకం దగ్గర ఇద్దరి మధ్య తేడా వచ్చిందని రకరకాల రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు స్పందించలేదు. అయితే తన కొత్త సినిమా ‘మళ్ళీ రావా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయమై స్పందించాడు. తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట అవాస్తవమని సుమంత్ అన్నాడు. అసలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని సుమంత్ అన్నాడు. తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని.. తరచుగా కలుస్తుంటానని చెప్పాడు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కలవడం కొంచెం తగ్గిందని చెప్పాడు. మేమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పుకొచ్చిన సుమంత్.. అఖిల్.. చైతూ.. రానా.. ఇలా తన ఫ్యామిలీ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉందని.. వీరితో కలిసి సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానన్నాడు. తాను క్యారెక్టర్.. విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని సుమంత్ చెప్పాడు. ‘మనం’ సినిమాకు నంది అవార్డు రాకపోవడంపై వివాదం చెలరేగడం గురించి స్పందిస్తూ.. ఇలాంటివి మామూలే అని.. హాలీవుడ్లో ఎందరో గొప్ప దర్శకులకు ఆస్కార్ అవార్డులు రాలేదని.. కొందరికి లేటుగా వచ్చాయని.. కాబట్టి ఈ వివాదం గురించి తాను కామెంట్ చేయనని.. తమ సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్నందించారని.. అది చాలని సుమంత్ అన్నాడు. ఇక ప్రేమకథ సినమాతో సుమంత్‌ను హీరోగా నాగర్జున పరిచియం చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా సుమంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలోనూ ‘సత్యం’ సినిమాను నిర్మించి అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. -
సీఎం ఇంటికి 'మళ్లీరావా'
చాలా గ్యాప్ తర్వాత హీరో సుమంత్ చేసిన సినిమా 'మళ్లీరావా'. కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమా సక్సెస్‌ను ఎంజాయి చేస్తున్నాడు సుమంత్. ఈ నేపథ్యంలో వచ్చిన ఓ సందేశం ఆయన సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆ సందేశమేమిటంటే మళ్లీరావా సినిమా చూడాలని, ఓ ప్రింట్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి మేసేజ్ వచ్చిందట. ఈ విషయాన్ని సుమంత్ ట్వీట్ చేశారు. మా సినిమాను చూడలనుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రింట్ పంపిస్తున్నట్టు ఆయన ట్విట్టర్లో తెలిపారు. కాగా, రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ మూవీలో హిందీ టీవీ ఆర్టిస్ట్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. Just got a msg from honorable CM KCR garu's residence, requesting for a print to be sent for viewing. Sending it with pleasure and gratitude 🙏🏼 — Sumanth (@iSumanth) December 8, 2017 -
'మళ్ళీ రావా' మూవీ రివ్యూ
టైటిల్ : మళ్ళీ రావా జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : సుమంత్, ఆకాంక్ష సింగ్,మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క హీరోగా పదిహేనేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న అక్కినేని వారసుడు సుమంత్ కేవలం 22 సినిమాలు మాత్రమే చేశాడు. వాటిలో సక్సెస్ సాదించిన సినిమాలు మూడు నాలుగుకు మించి ఉండవు. దీంతో ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత చిత్రం నరుడా డోనరుడాతో మరోసారి నిరాశపరిచిన సుమంత్ లాంగ్ గ్యాప్ తరువాత మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మళ్ళీ రావా' సుమంత్ కు సక్సెస్ అందించిందా..? కథ : ఈ సినిమా కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష సింగ్)ల ప్రేమకథలు. కార్తీక్.. పద్నాలుగేళ్ల వయసులోనే అంజలితో ప్రేమలో పడతాడు. అది ప్రేమించే వయసుకాదని పెద్దలు చెప్పినా.. నాకు చిన్నప్పటి నుంచే అమ్మ, క్రికెట్, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇష్టమని తెలిసింది.. అలాగే అంజలి అంటే కూడా ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చేస్తాడు. అంజలి కూడా కార్తీక్ ను ఇష్టపడుతుంది. కానీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక్ ను వదిలి వెళ్లిపోతుంది. అలా వదివెళ్లిన అంజలి పదమూడేళ్ల తరువాత తిరిగి కార్తీక్ జీవితంలోకి వస్తుంది. (సాక్షి రివ్యూస్) సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ గా కార్తీక్ పనిచేస్తున్న కంపెనీకే అంజలి ప్రొజెక్ట్ మేనేజర్ గా వస్తుంది. అప్పటికీ కార్తీక్ తననే ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మరోసారి కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. కానీ బాధ్యత లేకుండా ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకున్న కార్తీక్ తో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో మరోసారి కార్తీక్ కు దూరమవుతుంది. అలా దూరమైన కార్తీక్, అంజలిలు తిరిగి కలిశారా..? కార్తీక్ ప్రేమను అంజలి అర్థం చేసుకుందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ మరోసారి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకున్నాడు. అందమైన ప్రేమ కథలో హుందాగా నటించాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో అంజలిని కలిసినప్పుడు అల్లరి అబ్బాయిగా మెప్పించినా సుమంత్, తరువాత హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉత్తరాది నటి ఆకాంక్ష సింగ్ అంజలి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ విషయంలో తెలుగమ్మాయే అనిపించిన ఈ భామ... పర్ఫామెన్స్ తోనూ మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకాంక్ష నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ఇతర పాత్రల్లో పెద్దగా పరిచయం ఉన్న నటీనటులెవరు కనిపించలేదు. విశ్లేషణ : డబ్బుకోసం కాదు మంచి సినిమా అయితేనే సినిమా చేస్తానన్న హీరో సుమంత్ అందుకు తగ్గట్టుగా అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశల్లో జరిగిన సంఘటనలు ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ దర్శకుడు గౌతమ్ కథ నడిపించిన విధానం ఆకట్టుకుంది. అయితే ఈ తరహా కథనం సామాన్య ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందన్న దాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. మనసును తాకే సంభాషణలతో రూపొందించిన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. మిర్చి కిరణ్ అండ్ గ్యాంగ్ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్) సినిమాకు మరో బలం పాటలు. ఎక్కడ అనవసరంగా ఇరికించినట్టుగా కాకుండా కథతో పాటే నడిచే పాటలో సినిమాలో ప్రేక్షకుణ్ని మరింత ఇన్వాల్వ్ చేస్తాయి. శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని కథనం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
డబ్బు కోసం పని చేయను
‘‘మళ్ళీ రావా’ రొమాంటిక్ లవ్ స్టోరీ. కార్తీక్, అంజలి మధ్య సాగే ప్రేమకథ. 20 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమికుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల వల్ల విడిపోయిన వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? అన్నది కథ’’ అని హీరో సుమంత్ అన్నారు. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన ‘మళ్ళీ రావా’ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ విలేకరులతో మాట్లాడారు. ► ఈ సినిమాను కథ రూపంలో చెప్పాలంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, స్క్రీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. మూడు దశల్లో సాగే ప్రేమకథ. ఒకటి చిన్నప్పుడు, మరొకటి వర్కింగ్ ప్లేస్‌లో, ఇంకొకటి కాస్త మెచ్యూర్డ్ ఏజ్‌లో సాగుతుంది. ఈ మూడు స్టేజ్‌ల సన్నివేశాలు సమాంతంరగా ఉండేలా గౌతమ్ ప్రెజెంట్ చేశాడు. గతంలో ‘నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్’ వంటి సినిమాలొచ్చినా ‘మళ్ళీ రావా’ కథనం కొత్తగా ఉంటుంది. ► నేను గతంలో ‘గోదావరి, మధుమాసం’ వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించినా, వాటికి భిన్నంగా సాగే చిత్రమిది. ఇదొక సహజమైన ప్రేమకథ. పాటలన్నీ కథలో భాగంగా వస్తుంటాయి. ∙గౌతమ్ చెప్పిన రెండు గంటల కథ వినగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. తను చేయాలనుకున్న సన్నివేశాలను వేరే నటీనటులతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చేసి చూపించాడు. తన ప్లానింగ్ నచ్చడంతోనే సినిమా చేస్తానన్నా. ► నిర్మాత రాహుల్ మేకింగ్‌లో పాటించిన ప్లానింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఓ నటుడిగానే నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యా. దర్శక–నిర్మాతలు చక్కగా ప్లాన్ చేయడం వల్ల సినిమాను 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అయితే ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌కు పది నెలల సమయం పట్టింది. ► నేను డబ్బు కోసమే సినిమాలు చేయను. అందుకు మా తాతగారు (నాగేశ్వర రావు), కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. నేను సంపాదించిన డబ్బు కూడా చక్కగా ఇన్వెస్ట్ చేశా. నా సంతృప్తి కోసం పని చేస్తున్నా. గత 17 ఏళ్లలో నేను చేసింది 22 సినిమాలే. గతంలో వరుసగా సినిమాలు చేశా. ఇప్పుడు నాకు ఆ తొందర లేదు. సహజమైన కథలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. ► ‘మళ్ళీ రావా’ తర్వాత రెండు సినిమాలు చేయబోతున్నా. వాటిలో ఒకటి డార్క్ థ్రిల్లర్. మరో సినిమా వివరాలను త్వరలోనే చెబుతా. -
'మళ్ళీ రావా' మూవీ స్టిల్స్
-
సుమంత్ అన్న మళ్ళీ రావా పెద్ద హిట్ అవ్వాలి – అఖిల్
‘‘చిన్నప్పుడు నన్ను సుమంత్ అన్న చాలా పాంపర్ చేసేవారు. ‘మళ్ళీ రావా’ పోస్టర్స్‌లో ఆయన ఫేస్‌లో పెయిన్‌తో చాలా బాగున్నారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్ అవ్వాలి. శ్రవణ్ ఇచ్చిన పాటలు బాగున్నాయి’’ అని అఖిల్ అన్నారు. శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’ . ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘అఖిల్‌కి ఈ సినిమా పాటలు బాగా నచ్చాయి. శ్రవణ్ మంచి సంగీతం ఇచ్చాడు. నేనిప్పటివరకూ 22 సినిమాలు చేశాను. వాటిలో గోదావరి, గోల్కొండ హైస్కూలు సినిమాలకి చాలా దగ్గరగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘సుమంత్ ఈ సినిమా గురించి నాకు చెబుతూనే ఉన్నారు. ఈ చిత్రంలోని డైలాగులను బట్టి చూస్తే దర్శకుడు తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారేమో అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘పాటలు బాగా రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. మధుర శ్రీధర్‌గారు, సుమంత్‌గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు’’ అని సంగీత దర్శకుడు శ్రవణ్ చెప్పారు. ‘‘గౌతమ్ మంచి స్టోరీ రాసుకున్నారు. చాలా హానెస్ట్‌గా మేం పని చేశాం. అందుకే మంచి అవుట్‌పుట్ వచ్చింది’’ అన్నారు నిర్మాత. ‘‘నాకిది మొదటి సినిమా. ఎంతోమందికి నిర్మాతలకు కథ చెప్పినా నన్ను నమ్మి చాన్స్ ఇవ్వలేకపోయారు. రాహుల్ ముందుకు వచ్చారు. సుమంత్ గారు ఇచ్చిన నమ్మకంతోనే బాగా చేయగలిగాను’’ అన్నారు దర్శకుడు. -
కథ విని షాకయ్యా – సుమంత్
విడిపోయి పదమూడేళ్లు గడిచిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఒకరిని గుర్తుపెట్టుకుంటే, ఆ వ్యక్తిపై ప్రేమ అయినా ఉండాలి. ద్వేషం అయినా ఉండాలి. కార్తీక్ కూడా అంజలిని గుర్తుపెట్టుకున్నాడు. మరి ప్రేమతోనా?.. ద్వేషంతోనా? అనేది తెలియాలంటే మా సినిమా చూడాలంటున్నారు కథానాయకుడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మళ్ళీ రావా..’. ఆకాంక్షా సింగ్ కథానాయిక. రాహుల్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనునున్నారు. తాజాగా చిత్రం ఆడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం గౌతమ్ చెప్పిన కథ విని షాక్ అయ్యా. కళ్లు మూసుకుని సినిమా చేయవచ్చు అనిపించింది. నేచురల్ లవ్‌స్టోరీ. ‘గోదావరి’ చిత్రం తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్– అంజలిల మధ్య నడిచే లవ్‌స్టోరీ డ్రామానే చిత్రకథ. 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం. శ్రవణ్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి అవుట్‌పుట్ వచ్చింది. సుమంత్‌గారు బాగా సపోర్ట్ చేశారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. -
డ్రామా థ్రిల్లర్
‘నరుడా డోనరుడా’ సినిమా తర్వాత కొంచెం విరామం తీసుకున్న తరువాత స్పీడు పెంచాడు. ఇప్పటికే మళ్లీ రావా షూటింగ్ పూర్తి చేసిన సుమంత్ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. అనీల్ శ్రీకంఠంని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరు సాంబ శివారెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో శుక్రవారం ప్రారంభమైంది. మలయాళ నటి అంజు కురియన్ నాయికగా నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘డ్రామా థిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. సుమంత్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన కెరీర్లో వైవిధ్యంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం అందర్నీ అలరించేలా ఉంటుంది. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్. Moving onto my next, a drama/thriller directed by Anil Srikantam, co starring Anju Kurian, and produced by G. Sridhar & AS Reddy. Godspeed! pic.twitter.com/3dEsJZP8xH — Sumanth (@iSumanth) 27 October 2017 -
ప్రేమను వెతుక్కుంటూ..!
చిన్ననాటి నుంచి ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కాలం వాళ్లను విడదీస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ అతను పదమూడేళ్ల తర్వాత వెళితే ఆ అమ్మాయి అతన్ని గుర్తుపట్టకుండా వెళ్లిపోతుంది. అసలు వీళ్ల ప్రేమకథ ఏంటి? ఇన్నేళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్న విషయాలను తెలుసుకోవాలంటే ‘మళ్లీ రావా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ–‘‘కథను నమ్మి నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన రాహుల్‌గారికి, సుమంత్‌గారికి కృతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.‘‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాహుల్‌యాదవ్. అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. -
మళ్ళీ రావా!
సుమంత్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మళ్ళీ రావా’. హిందీ హిట్ ‘బద్రినాద్కి దుల్హనియా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ కథానాయిక. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇది పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మూవీ అవుట్‌పుట్ బాగా వచ్చింది. సుమంత్‌గారి కెరీర్లో బిగ్ హిట్ అవుతుంది. అవకాశం ఇచ్చిన హీరో సుమంత్, నిర్మాత రాహుల్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘30 రోజుల్లో ఒకే షెడ్యూల్లో సినిమాను కంప్లీట్ చేశాం. పది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఆగస్ట్ 3న ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ యాదవ్ అన్నారు. కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, ఎ. కార్తీక్, సాత్విక్, ప్రీతి తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. -
రైతు కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం
బత్తలపల్లి : ఐఐటీ ప్రవేశాలు కోసం గత నెల 21న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన గడుపూటి సుమంత్ జాతీయ స్థాయిలో 409వ ర్యాంకు సాధించాడు. బత్తలపల్లికి చెందిన రైతు గడుపూటి రమేష్‌బాబు, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు గడుపూటి సుమంత్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెద్దనాన్న గడుపూటి శేషయ్య ప్రోత్సాహంతో 10వ తరగతి నుంచే విజయవాడలోని శ్రీచైతన్యలో విద్య అభ్యసించాడు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కూడా విజయవాడలోని శ్రీచైతన్యలోనే విద్య అభ్యసించాడు. ఇంటర్లో 15వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్‌లో 85వ ర్యాంకు సాధించాడు. మొదటగా జేఈఈ మెయిన్స్‌లో 589వ ర్యాంకు సాధించి అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించగలిగాడు. అనంతరం జరిగిన పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించాడు. డిల్లీ, చెన్నైలలోని ఐఐటీ క్యాంపస్‌ల్లో సీట్ దక్కె అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ఐఏఎస్ చేసి కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.తన వెనుక కుటుంబ ప్రోత్సాహం ఉందన్నారు. వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా బత్తలపల్లికి చెందిన మరో విద్యార్థి కల్లె కార్తీక్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 2501వ ర్యాంకు దక్కింది. -
సుమంత్‌కు హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన హీరో సుమంత్. కెరీర్లో సత్యం, గౌరీ, గోదావరి లాంటి హిట్స్ ఉన్నా.. ఆ ట్రాక్ రికార్డ్‌ను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయ్యాడు సుమంత్. లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల నరుడా డోనరుడా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. అందుకే తనకు సక్సెస్‌లు అందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ల మీద దృష్టి పెట్టాడు సుమంత్. ఇటీవల గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన సుమంత్, ఆ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేశాడు. వరుణ్ ధావన్, అలియా భట్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ బద్రినాథ్ కి దుల్హానియాలో అలియా భట్ ఫ్రెండ్‌గా నటించిన, ఆకాంక్ష సింగ్‌ను సుమంత్ సరసన హీరోయిన్గా ఫైనల్ చేశారు. పలు హిందీ సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌లో నటించిన ఆకాంక్ష తెలుగు తెరపై సత్తా చాటుతానంటోంది. -
మళ్లీ ప్రేమకథలో..
‘ఐయామ్ ఇన్ లవ్.. ఐయామ్ ఇన్ లవ్’ అంటున్నారు సుమంత్. రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. హీరోగా సుమంత్ డిఫరెంట్ సినిమాల్లో నటించినా... ఆయనకు ప్రేమకథలు ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. లేటెస్ట్గా మరో ప్రేమకథా చిత్రంలో నటించడానికి అంగీకరించారు సుమంత్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్‌యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ క్లాప్ ఇవ్వగా, చిత్రనిర్మాత రాహుల్ తల్లి సావిత్రి కెమేరా స్విచ్చాన్ చేశారు. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభించను న్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్ (వెంకట్) యాదవ్, బందరు బాబీ పాల్గొన్నారు. సుమంత్‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ నటించనున్న ఈ సినిమాలో అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, ‘మిర్చి’ కిరణ్, అభినవ్, అప్పాజీ అంబరీష తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: కృష్ణకాంత్, సంగీతం: శ్రవణ్. -
సుమంత్ హీరోగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా
సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ క్లాప్ నివ్వగా.., నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా గారి అమ్మ గారైన సావిత్రి గారు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, కాదంబరి కిరణ్, ప్రవీణ్ యాదవ్, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. -
'నరుడా డోనరుడా' మూవీ రివ్యూ
టైటిల్ : నరుడా డోనరుడా జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ సంగీతం : శ్రీ చరణ్ దర్శకత్వం : మల్లిక్ రామ్ నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట, స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ స్థాయికి తగ్గ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిన యంగ్ హీరో సుమంత్. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ ఓ బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేశాడు. 100% స్ట్రయిక్ రేట్ అన్న ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ స్పెర్మ్ డోనర్ సక్సెస్ సాధించాడా..? కథ : డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ల భరణి).. ఓల్డ్ సిటీలో ఓ చిన్న ఇన్పర్టిలిటీ క్లినిక్ నడుపుతుంటాడు. తన దగ్గరకు వచ్చే క్లయింట్స్‌కు సంతాన భాగ్యం కలిగించేందుకు ఓ వీర్యదాత కోసం వెతుకుతుంటాడు. విక్రమ్ అలియాస్ విక్కీ (సుమంత్) డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి పని పాట లేకుండా ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేస్తూ షాపింగ్‌లు పబ్‌లు అంటూ తిరుగుతుంటాడు. విక్కీ తండ్రి కార్గిల్ వార్‌లో మరణించటంతో తల్లి స్వీటి(శ్రీలక్ష్మీ) బ్యూటి పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఎప్పటికైనా కొడుకు మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఎదురుచూస్తుంటుంది. డాక్టర్ ఆంజనేయులు, ఖాళీగా టైంపాస్ చేస్తున్న విక్కీ తనకు బాగా పనికొస్తాడని భావించి అతని వెంటపడతాడు. డబ్బులు ఎరచూపి వీర్యదానానికి ఒప్పిస్తాడు. అదే సమయంలో ఓ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే ఆషిమా రాయ్(పల్లవి సుభాష్) అనే బెంగాళీ అమ్మాయితో విక్కీకి పరిచయం అవుతోంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆషిమా గతం గురించి తెలిసిన తరువాత కూడా విక్కీ పెళ్లికి అంగీకరించటంతో ఆషిమాకు విక్కీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది. పెళ్లి తరువాత మొదలవుతుంది అసలు సమస్య, అంత కాలం తాను ఏం బిజినెస్ చేస్తున్నాడో చెప్పకుండా మేనేజ్ చేసిన విక్కీ, ఫైనల్ గా ఓ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో తాను వీర్యదానం చేస్తున్న విషయం ఆషిమాకు చెప్పేస్తాడు. దీంతో ఆషిమా, విక్కీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా దూరమైన విక్కీ, ఆషిమాలు తిరిగి ఎలా ఒకటయ్యారు..? తన వల్లే విడిపోయినా ఆ దంపతులను డాక్టర్ ఆంజనేయులు ఎలా కలిపాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇలాంటి బోల్డ్ సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్న హీరో సుమంత్ ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేం. దాదాపు రెండేళ్ల విరామం తరువాత తెర మీద కనిపించిన సుమంత్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. పల్లవి సుభాష్ హీరోయిన్గా పరవాలేదనిపించింది. తన పరిధి మేరకు డిసెంట్ లుక్స్‌తో, కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇంకా సినిమా అంతా తానే అయి నడిపించాడు తనికెళ్ల భరణి, హీరోను వీర్యదాతగా మార్చే డాక్టర్ గా, అద్భుతమైన కామెడీ పండించాడు. ప్రతీ సీన్ లోనూ తన మార్క్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాడు. చాలా రోజుల తరువాత తెర మీద కనిపించిన సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మీ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. సాంకేతిక నిపుణులు : విక్కీ డోనర్ లాంటి బోల్డ్ సబ్జెక్ట్‌ను తెలుగు తెర మీద చూపించాలన్న నిర్ణయం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన దర్శకుడు మల్లిక్ రామ్, అందుకు తగ్గ కథనాన్ని సిద్ధం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ పెద్దగా పండకపోవటం మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథలోకి ఎంటర్ అయిన తరువాత వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీ చరణ్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : తనికెళ్ల భరణి నటన ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం తెలుగు నెటివిటీకి సూట్ అవ్వని సబ్జెక్ట్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఐస్‌క్రీములు అమ్మిన సుమంత్
ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు అండగా టాలీవుడ్ తారలు, జెమినీ టీవీ ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ వారం నేను సైతం అంటూ సుమంత్ ముందుకొచ్చారు. పిల్లలు పుట్టలేదని భర్త వదిలి వేయడంతో పుట్టింటికి చేరిన సుల్తానా, అప్పటికే కూతుళ్ల పెళ్లిళ్లు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుల్తానా తల్లి... ఈ నిరుపేద తల్లీకూతుళ్లకు అండగా హీరో సుమంత్ ఐస్‌క్రీమ్స్ అమ్మారు. నిస్సహాయ తల్లీకూతుళ్లను ఆదుకోవడానికి సుమంత్ చేసిన వినూత్న సేవతో ‘మేము సైతం’ కార్యక్రమం ఈ శనివారం రాత్రి 9:30 ని.లకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. -
అది మా కుటుంబంలోనే లేదు!
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుమంత్ ‘నరుడా.. డోనరుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హిందీ ‘విక్కీ డోనర్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌రామ్ దర్శకత్వంలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. పల్లవీ సుభాష్ కథానాయిక. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘నరుడా.. డోనరుడా’ గురించి సుమంత్ మాట్లాడుతూ- ‘‘ ‘గోల్కొండ హైస్కూల్’ తర్వాత నా మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో కెరీర్జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా. ఓ రోజు టీవీలో ‘విక్కీ డోనర్’ చూసిన తాతయ్య (ఏయన్నార్) చాలా బాగుందన్నారు. అటువంటి వైవిధ్యమైన కథలు రాయమని రచయితలకు చెప్పేవాణ్ణి. నిర్మాత రామ్మోహన్‌గారు దర్శకుడు మల్లిక్‌ను పరిచయం చేశారు. మల్లిక్ విజన్ ఉన్న డెరైక్టర్. వీర్యదానం నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదంతో పాటు సందేశం ఉంటుంది. సినిమాలో ఎక్కడా అసభ్యత ఉండదు. రెగ్యులర్ చిత్రాలు చేయడం మా కుటుంబంలోనే లేదు. ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తుంటాం. రావణాసురుడు, దుర్యోధనుడి తరహా విలన్ పాత్రలు చేయాలనుంది. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్బాబుగార్లు తొలుత విలన్‌గా నటించి, సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తర్వాత పూర్తి వివరాలు చెబుతా’’ అన్నారు. -
విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న హీరో
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుమంత్ రెండేళ్ల విరామం తరువాత ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం నరుడా డోనరుడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సుమంత్, నటుడిగానూ తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. అందుకే అవకాశం వస్తే విలన్ రోల్స్‌లో కూడా నటించడానికి రెడీ అంటూ ప్రకటించాడు. తనకు రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధుడు లాంటి పాత్రలంటే ఇష్టమని ఆ తరహా పాత్రకోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. -
తాతగారు చివరగా చూసిన సినిమాల్లో ఇదొకటి!
‘‘2012లో ‘విక్కీ డోనర్’ చూశా, బాగా నచ్చింది. చివరి రోజుల్లో తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) టీవీలో చూసిన చివరి రెండు మూడు సినిమాల్లో ఇదొకటి. ‘తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు చేయకూడదు’ అన్నారాయన. ఏడాదిపాటు ‘విక్కీ డోనర్’ లాంటి స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా. నిర్మాత రామ్మోహన్ సలహాతో రీమేక్‌కి ఓటేశా. రియల్ లైఫ్‌లో నాకు పిల్లలు లేకపోవడం ఈ సినిమా చేయడానికి ఓ కారణం’’ అని సుమంత్ అన్నారు. ఆయన హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుధీర్ పూదోట, వై.సుప్రియ నిర్మించిన సినిమా ‘నరుడా.. డోనరుడా’. హిందీ ‘విక్కీ డోనర్’కి ఇది రీమేక్. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ నెల 4న రిలీజవుతోంది. ‘‘ఓ మహిళగా చెబుతున్నా.. ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చిత్రమిది. వైవిధ్యమైన, సున్నితమైన కథను మల్లిక్ రామ్ తెరకెక్కించిన తీరు బాగుంది’’ అని వై. సుప్రియ అన్నారు. ‘‘వీర్యదానం మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ, ‘విక్కీ డోనర్’ వంటి గొప్ప సినిమా ఇప్పటివరకూ రాలేదు’’ అని మల్లిక్ రామ్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘కథ గీత దాటితే.. జుగుప్సగా, బూతుగా అనిపించే అవకాశం ఉంది. కానీ, హృదయానికి హత్తుకునేలా తీశారు’’ అన్నారు. ‘‘సుమంత్ ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది’’ అని సుధీర్ పూదోట అన్నారు. -
అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు- నాగార్జున
‘‘హిందీలో తెరకెక్కిన ‘విక్కీ డోనర్’ చిత్రంలో మంచి మెసేజ్ ఉంది. ఆ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ‘నరుడా.. డోనరుడా’తో చాలా రోజుల తర్వాత సుమంత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓ చిత్రానికి సందేశం, ఎంటర్టైన్మెంట్ కుదరడం కష్టం. కానీ, ఆ రెండూ ఈ చిత్రానికి కుదిరాయి’’ అని హీరో నాగార్జున అన్నారు. సుమంత్, పల్లవీ సుభాష్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రమా రీల్స్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించిన చిత్రం ‘నరుడా.. డోనరుడా’. శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ చిత్రం పాటలను నాగార్జున విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ- ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండే ఇలాంటి కథ నాకొచ్చినా చేసేవాణ్ణి. ‘నమో వెంకటేశాయ’ తర్వాత కొత్త జానర్లో ట్రై చేద్దామని ఓ కథ విన్నా. అది ఎంత బావుందంటే, అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు’’ అని చెప్పారు. ‘‘గోల్కొండ హైస్కూల్’ టైమ్‌లో ‘నరుడా.. డోనరుడా’ చేయమని రామ్మోహన్‌గారు చెప్పారు. ఇందులో వినోదం ఉంటుంది. ప్రేక్షకులకు బోర్ అనిపించదు. నవంబర్ 4న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని సుమంత్ అన్నారు. ‘‘ఇలాంటి కథతో ఓ చిత్రం చేయాలని నాకూ ఉంది. కానీ, అంత ధైర్యం లేదు’’ అని అఖిల్ అన్నారు. సుధీర్ పూదోట, మల్లిక్‌రామ్, హీరోలు సుశాంత్, మంచు మనోజ్, నటుడు తనికెళ్ల భరణి, నటి లక్ష్మీ మంచు తదితరులు పాల్గొన్నారు.