
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీ రావా’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మళ్ళీరావా’ నాకు బాగా నచ్చింది.
సుమంత్ నటన అద్భుతం. కెమెరా పనితనం, సంగీతం కొత్తగా అనిపించాయి. ఆకాంక్ష సింగ్‌తో పాటు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన గౌతమ్ అనుభవం ఉన్నవాడిలా తీశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారి విజయం అందుకున్న రాహుల్ యాదవ్‌కి శుభాకాంక్షలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు.