Raghavendra Rao
-
సర్కారు నౌకరికి డేట్ ఫిక్స్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు. -
రాఘవేంద్ర రావు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు ఇస్తున్న నెటిజన్లు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: వారంలోనే ఇంటిబాట పట్టిన కంటెస్టెంట్!) ఈ వివాదంపై సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించిన విషయం తెలిసిందే. 'చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి' అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. దీంతో రాఘవేంద్ర రావు చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాబును అరెస్ట్ చేయడం వల్ల అంబేద్కర్ విగ్రహాలు బాధ పడడం సంగతేమో గానీ.. దివంగత ఎన్టీఆర్ విగ్రహాలు మాత్రం ఆనంద భాష్పాలు రాల్చుతున్నాయని రాఘవేంద్రరావుకు చెంప చెళ్లుమనేలా నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబును మాత్రం గారు అని సంబోధిస్తూ ట్వీట్ చేశావ్... మరి అదే ట్వీట్లో అంబేద్కర్ గారిని మాత్రం 'గారు' అని సంబోధించడానికి మాత్రం తమకు మనుసు రాలేదు కదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయన్ను ఘోరంగా అవమానించి పదవీచ్యుతుడిని చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నీకు గుర్తు రాలేదా? అని రాఘవేంద్రరావును నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రజల్లో మమేకమై తన కష్టంతో అధికారాన్ని తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అన్యాయంగా చంద్రబాబు కూలదోసి గద్దెనెక్కాడు కదా... అప్పుడు మీరు హీరోయిన్ల బొడ్లపై పండ్లు చల్లుతూ గెస్ట్‌హౌస్‌లలో ఆడుకుంటున్నారా? అని నెటిజన్లు ఉతికేస్తున్నారు. అంతేకాకుండా గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలను విచక్షణ లేకుండా చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నాడు. వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. ఇది రాజ్యాంగబద్ధమేనా.. అప్పుడు అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదా..? కనీసం నీ జీవితంలో ఒక్కసారైనా అంబేద్కర్ గారి విగ్రహానికి పూల దండ అయినా వేశావా..? అంటూ పలువురు రాఘవేంద్ర రావును చాకిరేవు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ఉన్న స్క్రాప్ అంత ఇలా బయటకు వస్తుంది అంటూ బొడ్డు దర్శకుడికి నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఆయన ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి. కె రాఘవేంద్ర రావు — Raghavendra Rao K (@Ragavendraraoba) September 9, 2023 -
ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా
-
అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్..?
అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని సినిమాలు ఆమె చేయలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు అనుష్క- నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: ‘బలగం' హీరోయిన్‌కి అవమానం!) ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో అనుష్కని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావించారట స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారా? అని డైరెక్ట్‌గా అనుష్కనే అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్‌ని సున్నితంగా తిరస్కరించారట. (చదవండి: అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్ దేవరకొండ) ఇదీ గతంలో జరిగిన విషయం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గతంలో తన కుమారుడు ప్రకాష్‌కు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పడు రాఘవేంద్రరావు ఫస్ట్ చాయిస్ అనుష్కనే అనుకున్నారట. ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా అనుష్కను అడిగితే... తను సున్నితంగా తిరష్కరించిందట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనట్లు అనుష్క చెప్పిందట. దీంతో 2014లో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్‌కు పెళ్లి రాఘవేంద్రరావు జరిపించారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత 2017లో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు పెళ్లి మ్యాటర్ గురించి చర్చించాలని భావించాడట. కానీ అప్పటికే పెళ్లికి నో చెప్పిన అనుష్క.. మళ్లీ తన అబ్బాయిని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారట. -
నిర్మాతగా మారిన రాఘవేంద్రరావు మాజీ కోడలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా ధిల్లాన్ నిర్మాతగా అవతారమెత్తింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రచయితగా మారిన ఆమె గతేడాది రిలీజైన ఏక్ విలన్ రిటర్న్స్, రక్షా బంధన్‌లకు తనే స్వయంగా కథ అందించింది. ఇప్పుడేకంగా షారుక్ ఖాన్ నటిస్తున్న డుంకీ సినిమాకు కూడా తనే కథ అందించడం విశేషం. రచయితగా సత్తా చాటుతున్న ఆమె తాజాగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది. కథా పిక్చర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించింది. తన తొలి ప్రాజెక్ట్‌ను దో పట్టి అని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'కథా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాజోల్, కృతీ సనన్ వంటి ప్రతిభగల హీరోయిన్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది' అని ట్విటర్లో రాసుకొచ్చింది కనిక. కనికా ధిల్లాన్ పర్సనల్ లైఫ్.. రాఘవేంద్రరావు తనయుడు, డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి- కనికా ధిల్లాన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లోనే వీరిద్దరూ విడిపోగా 2019లో వచ్చిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి కలిసి పని చేశారు. ఈ చిత్రానికి ప్రకాశ్ దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించింది. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కనికా ధిల్లాన్ స్క్రీన్ రైటర్ హిమాన్షుతో ప్రేమలో పడగా 2021 ఆరంభంలో పెళ్లి చేసుకున్నారు. కాగా రాజ్ కుమార్ రావు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. చదవండి: పక్షవాతానికి గురైన హీరో కాలు.. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ఫుల్ బిజినెస్‌మెన్‌గా -
హాట్స్ ఆఫ్ రాజమౌళి ..!
-
ఆర్ఆర్ఆర్ పై భరద్వాజ కామెంట్లపై నాగబాబు, రాఘవేంద్ర రావు విమర్శలు
-
యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించిన రాఘవేంద్రరావు.. కారణమిదే!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భక్తిరస చిత్రాలు తెరకెక్కించడంలో అయినా, రొమాంటిక్ పాటలు చిత్రీకరించడంలో అయినా ఆయనది ప్రత్యేక శైలి. ఎంతోమంది నటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ స్టేటస్ అందించారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. దశాబ్దాలుగా తన సినిమాలతో అలరిస్తున్న రాఘవేంద్రరావు తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించిన ఆయన ఇప్పుడు కొత్తవారిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఎంతో టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫామ్ కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ఇదొక చక్కని అవకాశం. కాగా ఈ చానల్‌ను దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారు. ఎంత చేసినా అతని తపన ఆగలేదు. ఇప్పుడు మరింత మందిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ రాఘవేంద్రరావుపై ప్రశంసలు కురిపించారు. -
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్‌తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. -
గొప్ప జీవితం అనుభవించాడు..!
-
తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్
తండ్రి మరణాన్ని తట్టుకోలేక సూపర్ స్టార్ మహేశ్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి కృష్ణ పార్థివదేహం నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమాలను భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక సినీ ప్రముఖులు సైతం ఆయన నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికఖాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం ఆయన తనయుడు మహేశ్ బాబును ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మృతి.. స్పందించిన ఘట్టమనేని కుటుంబం ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను హత్తుకుంటోంది. మహేశ్ ఏడుస్తుంటే రాఘవేంద్రరావు ఆయనకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. కాగా ఏడాది వ్యవధిలోనే తండ్రి, తల్లి, సోదరుడిని కొల్పోయిన మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఇక ఈ వీడియోపై మహేశ్‌కు అభిమానులు స్పందిస్తూ ఆయనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని’
చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ జయచిత్ర మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో మెరిశారు. 70, 80లలో గ్లామరస్ హీరోయిన్గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు ఆమె. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జయచిత్ర అత్త, తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపంచారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జయచిత్ర తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చదవండి: హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్టార్ హీరోలకు అత్త పాత్రలు వంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన తనకు ఇప్పటికి ఓ అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ సీరియల్లో నటించే అవకాశం కొల్పోయానంటూ జయచిత్ర వాపోయారు. ‘నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ సీరియల్ పేరు ‘మంగమ్మగారి మనవరాలు’. దర్శకుడు రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను’ అని చెప్పారు. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన ‘‘అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి ఆసత్య ప్రచారం చేసి ఆ సీరియల్ అవకాశం పోయేలా చేశారు. నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో ఓ వ్యక్తి ‘నేను సీరియల్ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని’ అవతలివారికి చెప్పేశారు. రాజమౌళి గారి గెస్టు హౌస్‌లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఒకవేళ ఆ సీరియలక్లో నేను నటించి ఉంటే ‘బాహుబలి’ సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. -
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
సుధీర్ ఫ్యాన్స్‌పై రాఘవేంద్రరావు సీరియస్
-
పిచ్చిపిచ్చిగా ఉందా? సుధీర్ ఫ్యాన్స్‌పై రాఘవేంద్రరావు సీరియస్
‘‘ఇటీవల విడుదలైన ‘సీతారామం, బింబిసార, కార్తికేయ 2’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విజయాలతో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. వినోదాత్మకంగా రూపొందిన మా ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రం కూడా ఈ చిత్రాల్లానే విజయం సాధిస్తుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు. పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. -
ఎట్టకేలకు ఓటీటీలోకి పెళ్లి సందD, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించింది. గతేడాది అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. 'పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..' అంటూ జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లి సందడి ఈ శుక్రవారంనాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక ఓ పట్టు పట్టాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. పెల్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్ అందరూ ఆహ్వానితులే#PelliSandaDonZEE5 #PelliSandaD@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/17nMnoTzD6 — ZEE5 Telugu (@ZEE5Telugu) June 21, 2022 చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. -
'విరాట పర్వం' సినిమాపై రాఘవేంద్ర రావు రివ్యూ..
Director Raghavendra Rao Praises Virata Parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్ 17న విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు 'విరాట పర్వం' సినిమాను కొనియాడారు. 'కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.' అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
'ఓ మై లవ్' టీజర్‌ను విడుదల చేసిన రాఘవేంద్రరావు
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ఓ మై లవ్. స్మైల్ శ్రీను దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని జి.సి.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. రామంజిని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓ మై లవ్" సినిమా క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషంగా ఉంది. టీజర్ చూస్తే శీను టేలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకుని చాలా అందంగా చిత్రీకరించారు'' అని పేర్కొన్నారు. కాగా దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ టీజర్‌ను విడుదలను చేసిన రాఘవేంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
‘పచ్చి కడుపు వాసన’కు ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి యార్ల గడ్డ రాఘవేంద్రరావు రాసిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వం 34వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2021’కు ఎంపికైంది. యార్లగడ్డ కలం నుంచి వచ్చిన ఆరో సంపుటి ‘పచ్చి కడుపు వాసన’. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు సీనియర్ జర్నలిస్టు. 13 ఏళ్లుగా ఓ పత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డు న్యాయ నిర్ణేతలుగా కె. శివారెడ్డి, శీలా సుభద్రాదేవి, దర్భశయనం శ్రీనివాసాచార్య వ్యవహరించారు. -
వనమా రాఘవకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ–2 నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావుకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. గతంలో రెండు సార్లు రాఘవ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించిన విషయం విదితమే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా అక్కడా బెయిల్ తిరస్కరించారు. రాఘవ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముం దని, మరో పది కేసుల్లోనూ ఆయనపై విచా రణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దనే ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ నిరాకరించి, తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నాగరామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవికి మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే, రాఘవకు బెయిల్ నిరాకరిస్తూ గురువారం సాయంత్రమే తీర్పు వెలువడినా, ఉత్తర్వులు శుక్రవారం అందాయి. -
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన రాఘవేంద్రరావు
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నటుడు సునీల్, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం (యూఎస్ఏ) సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్నఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. ఆయన నా దర్శకత్వంలో రూపొంది మంచి విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందర’ చిత్రాలకు రచయితగా పని చేశారు. యండమూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలని’ అన్నారు. యండమూరి మాట్లాడుతూ... ‘రాఘవేంద్రరావు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. చదవండి: హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి! -
పెళ్లి సందD సినిమా రివ్యూ
టైటిల్: పెళ్లి సందD నటీనటులు: రోషన్, శ్రీలీలా, బ్రహ్మానందం, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, తదితరులు దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్ నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేదీ: అక్టోబర్ 15, 2021 దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందD. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించారు. గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైందీ చిత్రం. మరి ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూ చదివేయాల్సిందే! కథ: వశిష్ట(రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అతడి తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించాడు. ఎవరో చూసిన సంబంధం కాకుండా మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వశిష్ట. తన సోదరుడి వివావహంలో సహస్ర (శ్రీలీల)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆమె కూడా అతడి మీద మనసు పారేసుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. ఇంతలో వీరి ప్రేమ అనుకోని మలుపులు తిరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: హీరో శ్రీకాంత్‌కు జనాల్లో ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలతో, విలక్షణమైన నటనతో జనాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీ హీరో. అతడి తనయుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నటనతో మెప్పించాడీ హీరో. రెండో సినిమాకే పాత్రలో ఒదిగిపోయిన విధానం మనల్ని ఆశ్చర్యపరచక మానదు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే కథ, కథనం చాలా వీక్‌గా ఉంది. విజువల్స్ రాఘవేంద్రరావు స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కానీ కథలో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోతాయి. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. చాలా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు వాటికి ఉపశమనం కోసం పెట్టినట్లు అనిపించక మానదు. ఎమోషన్స్ పండించేందుకు ఆస్కారం ఉన్నా డైరెక్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు అనిపించింది. సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌గా.. బలమైన ఎమోషన్స్‌ను పండించడంలో డైరెక్టర్ కొంత తడబడ్డట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్లను కెమెరాల్లో బంధించి మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామన్ కొంత మ్యాజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలోని సన్నివేశాలతో పాటు సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను చాలా అందంగా చూపించాడు కీరవాణి సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగోలేదు. నటీనటులు: రోషన్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. సినిమాను సేవ్ చేసేందుకు అతడు చాలానే ప్రయత్నించాడు. నటన, డైలాగులు, డ్యాన్స్.. ఇలా అన్నింటినీ ఉపయోగించాడు, కానీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ గ్లామర్‌గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ ఇవ్వలేదు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. రాఘవేంద్రరావు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చివరగా.. సందడి ఎక్కువ అలజడి తక్కువ అన్నట్లు ఉందీ పెళ్లి సందD. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఎందుకో మెప్పించలేదనిపించింది. -
నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న(అక్టోబర్ 10) పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే 25 ఏళ్ల శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా! ఈ వేడుకలో ఒకప్పుటి హీరోయిన్ రవళిని చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అతిథులుగా వచ్చిన చిరు, వెంకటేశ్‌లు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు. తన అందం, అభినయంతో 90లలో హీరోయిన్గా చక్రం తిప్పిన రవళి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అంతేగాక తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ ముందుగా ‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకున్నారు. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నాను అంటూ సరదాగా చమత్కరించారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే.. ఆ తర్వాత రవళి మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. రావొద్దని కాదు కానీ.. వచ్చిన నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశాను. అయినా రాఘవేంద్ర రావు పిలిచిన తర్వాత రాకుండా ఉండలేను, ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఎలా ఉన్నా వస్తాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె పెళ్లి సందD హీరో రోషన్, శ్రీలీలా, మూవీ టీంకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ మూవీని రూపొందించారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోగా దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి!
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నటుడిగా హీరోగా మారారు. శతాధిక చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఎందరో హీరోలను వెండితెరకు పరిచయం చేసిన ఆయన కథానాయకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తనికెళ్ల భరణి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. దర్శకేంద్రుడి కోసం ప్రత్యేకంగా ఆయన కథ రెడీ చేసినల్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ స్క్రిప్ట్ కూడా పుర్తయిందని, త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఆయన నలుగురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారట. దీనితో పాటు మరో చిత్రంలో కూడా ఆయన హీరో నటించబోతున్నారట. చదవండి: Samantha: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. వీఎన్ ఆదిత్య దర్శకత్వం రాబోతున్న ఆ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా రానుందట. అయితే ‘ఓం నమో వెంకటేశ’ తరవాత రాఘవేంద్ర రావు దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. దీంతో ఆయన రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు హీరోగా తెరపై అలరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ‘పెళ్లి సందD’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాఘవేంద్రరావు వశిష్ట పాత్రలో కనిపించబోతున్నారు. -
దర్శకేంద్రుడు వదిలిన అందాల బాణం.. శ్రీలీల ఫొటోలు వైరల్
టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు. అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం ‘పెళ్లి సందD’తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ కన్నడ భామ. సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు. ట్రైలర్లో తన అందాలతో కవ్వించింది శ్రీలీల బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయే శ్రీలీల. మెడిసిన్ చదువుతుంది. పెళ్లి సందD కంటే ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేసింది హీరోయిన్ శ్రీలీల. అక్కడ ఆమెకు మంచి గుర్తింపు ఉంది తెలుగు సినిమాల అవకాశాల కోసం చూస్తున్న తరుణంలో ‘పెళ్లిసందD’లో హీరోయిన్గా ఎంపిక చేశాడు రాఘవేంద్రరావు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ట్రైలర్లో తన అందాలతో కవ్వించింది లీల తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఫేస్ అవ్వడంతో పాటు ఆమె మంచి అందం మరియు ప్రతిభ కలిగిన అమ్మాయి అంటూ రాఘవేంద్ర రావు నుండి కితాబు పొందింది. శ్రీలీల అందానికి టాలీవుడ్ కుర్రకారుతో పాటు దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారు పెళ్లి సందడి సినిమా తర్వాత ఈ చిన్నది.. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కుర్ర హీరోలు ఈ అమ్మడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారట. రవితేజ హీరోగా రూపొందబోతున్న త్రినాథరావు నక్కిన సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పెళ్లి సందD’ నుంచి మరో రొమాంటిక్ సాంగ్
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్‌ను పాటను విడుదల చేశారు మేకర్స్. మాస్ మహారాజా రవి తేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యంగా అందించగా.. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలను సమకూర్చారు. శ్రీనిధి, కాలభైరవ, నయన నాయర్ ఆలపించారు. చదవండి: పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు ‘మధుర నగరిలో..’ అంటూ సాగే ఈ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటతో దర్శకేంద్రుడు మరోసారి తన మార్క్ చూపించారు. కాగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘పెళ్ళిసందడి’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మరీ రోషన్‌కు ఎంత మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. చదవండి: Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్ అదిరిందిగా.. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
నటుడిగా మారిన రాఘవేంద్రరావు.. వీడియో వైరల్
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి 'పెళ్లి సందD' సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షనలో గౌరీ రోనంకి దర్శకత్వంలో 'పెళ్లి సందD' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు 'వశిష్ట' అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోను డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు లుక్ ఆకట్టుకుంటుంది. సూటు, బూటు ధరించి గాగుల్స్ పెట్టుకొని యమ స్టైలిష్‌గా కనిపించారాయన. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంత కాలం...కెమెరా వెనుక ఉండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం... 🙏....@Ragavendraraoba గురూజీ....మళ్ళీ ఈ "పెళ్లి సందడి" మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను 😍🎉🎉🎉 All the best to whole team ....💐💐 https://t.co/lV3Y6oT4UD — Anil Ravipudi (@AnilRavipudi) July 30, 2021 -
బన్నీ ఫ్రెండ్‌గా ‘గంగోత్రి’లో చాన్స్, పరువు పోతుందని చేయనన్నాను..
యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ‘బలుపు’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాబీ ఓ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ మూవీలో నటించే చాన్స్ వచ్చినట్లు చెప్పాడు. అయితే పరువు పోతుందని ఆ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబీ మాట్లాడుతూ.. ‘గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యుక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ తనని కలిసి హైదరబాద్‌కు వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అలా ఓ సారి హైదరబాద్‌కు వచ్చి ఆయనను కలిశాను. వెంటనే ఆయన నన్ను రఘవేంద్ర రావు దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కాసేపు నన్ను గమనించిన ఆయన గంగోత్రిలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నిక్కర్ వేసుకోవాలని నా కోలతలు తీసుకోమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్పారు. అయితే అలా నిక్కరులో కనిపిస్తే గుంటూరులో నా పరువు పోతుందని భయపడి వెంటనే నేను చేయనని చెప్పాను. మరీ ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగారు. వెంటనే నేను కథలు రాస్తానని చెప్పాను. దీంతో గంగోత్రికి కొన్ని సన్నివేశాలు రాసే అవకాశం ఇచ్చారు. అలా నేను రాసిన సన్నివేశాలు రాఘవేంద్రరావు నచ్చి సినిమాలో పెట్టుకున్నారు. అలా రచయిత, డైరెక్టర్‌ను అయ్యాను’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు. -
ఆ దర్శకుడు నా స్టార్డమ్ పెంచారు: చిరంజీవి
కె. రాఘవేంద్రరావు.. ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో కళాఖండం. నటీనటులతో నవరసాలను ఒలికించడమే కాదు ప్రేక్షకులు దాన్ని ఫీల్ అయ్యేలా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. నవతరం దర్శకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన రాఘవేంద్రరావు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. 'రాఘవేంద్రరావు సినీప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్రత్యేకత లభించింది. ఆ రకంగా మా కాంబినేషన్ ఎంతో స్పెషల్. నా స్టార్‌డమ్‌ను, కమర్షియల్ స్థాయిని పెంచాడీ దర్శకుడు. తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే జగదేకవీరుడు.. లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. Happy Birthday @Ragavendraraoba garu. Many happy returns of the day to you Sir. pic.twitter.com/CprQR5zFEf — Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2021 చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ -
ఆ రోజు రాఘవేంద్రరావుకు జీవితంలోనే స్పెషల్
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు ఏప్రిల్ 28. బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడివి రాముడు’ విడుదలైన రోజు అది. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ విడుదలైన రోజు కూడా ఏప్రిల్ 28. ఇలాంటి ఒక ప్రాముఖ్యత ఉన్న ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న తాజా చిత్రం ‘పెళ్లిసందడి’ పాటల సందడి మొదలవుతోంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకాంత్ ‘పెళ్లిసందడి’కి రోషన్ ‘పెళ్లిసందడి’ సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త కథ. ఆ ‘పెళ్లిసందడి’కి చక్కని సంగీతం అందించిన కీరవాణి ఈ ‘పెళ్లిసందడి’కి కూడా సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఓ పాటను ఈ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్, సాహిత్యం: చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. సాయిబాబా. చదవండి: ఒకే బాటలో నయనతార.. త్రిష! -
వంటలక్కను ఢీ కొట్టనున్న కృష్ణ తులసి!
టాలీవుడ్ సినీ దిగ్గజం, అగ్రదర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. దాదాపుగా అందరు అగ్రహీరోలతోనూ బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన ఆయన గత కొంత కాలంగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో టాప్‌లో వెలిగిన దర్శకేంద్రుడు తాజాగా ఓ తెలుగు టీవీ సీరియల్‌కు దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్లో ప్రసారం కానున్న 'కృష్ణ తులసి' సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు. సీరియల్లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని, ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్ జీ తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ సీరియల్‌కు దండిగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాఘవేంద్రరావు బరిలో దిగారంటే వంటలక్క సీరియల్‌కు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే కృష్ణ తులసి సీరియల్ టీఆర్పీలో కార్తీక దీపాన్ని దాటేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా చేశారు -
మా నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్..
సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాశారు.. చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. నర్తనశాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు.. పౌరాణికబ్రహ్మ పేరు సంపాదించారు.. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో శిరోమణి అవార్డు అందుకున్నారు.. సినిమాలలో బిజీగా ఉన్నా ఏనాడూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు.. ఆయనే దర్శకులు కమలాకర కామేశ్వరరావు.. నేడు(జూన్ 29) 23వ వర్ధంతి. ఈ సందర్భంగా తండ్రితో పిల్లలకున్న అనుబంధం గురించి పెద్ద కుమార్తె శ్రీమతి లక్ష్మి సాక్షితో పంచుకున్న వివరాలు... నాన్నగారు 1911, అక్టోబర్ 14న బందరులో పుట్టారు. తాతగారు సుందర్రావు, నాయనమ్మ కామేశ్వరమ్మ. తాతగారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. అది గోల్కొండ నవాబుల పరిపాలనా కాలం. మా తాతగారు నవాబుల దగ్గర పనిచేశారట. ఆ రోజుల్లో ఆయనను తీసుకువెళ్లడానికి బగ్గీ వచ్చేదట. నాన్నగారు ఆఖరి నవాబు కాలంలో పుట్టారు. ఆయన అందరికంటె చిన్నవారు. పది నెలల వయసు వచ్చేసరికే తాతగారు పోయారు. నాన్నగారు చంటిపిల్లాడు కావటంతో, ఆయనను అందరూ అల్లారుముద్దుగా పెంచారు. అప్పట్లోనే బిఏ నాన్నగారు ఎంతో కష్టపడి బందరు నోబుల్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండే కాలేజీలు.... మద్రాసులో లేదంటే మచిలీపట్టణంలో చదవాలి. అప్పట్లో ఇంట్లో కరెంటు లేదు. పుస్తకాలు కొనుక్కునే స్థాయి కూడా లేదు. పెద్దయ్యాక మాత్రం చాలా పుస్తకాలే కొన్నారు. ఇంట్లో ఒక బీరువాలో ఇంగ్లీషు పుస్తకాలు, మరొక బీరువాలో తెలుగు వేదాంత గ్రంధాలు ఉండేవి. మా కోసం పిల్లల పుస్తకాలు కొనేవారు. ‘మచిలీపట్టణం చరిత్ర’ పుస్తకంలో నాన్నగారి గురించి ఒక పేజీ రాశారు. ఆటో వద్దనేవారు.. మేం బస్సులోనే ప్రయాణించేవాళ్లం. ఎప్పుడైనా ఆటోలో వెళ్తాం నాన్నా అంటే, మీటర్ టాక్సీలో వెళ్లమనేవారు. ఆయన తాతయ్యాక మనవలతో ఎంతో సంతోషంగా గడిపారు. నెలల పిల్లాడికి ఉత్తరాలు రాశారు. మా ఇంట్లో పెద్ద చెక్క ఉయ్యాలలో చంటి పిల్లాడిని పడుకోబెట్టి, ఉయ్యాలకు తాడు కట్టి, ఆ తాడును తన కాలి బొటనవేలికి కట్టుకుని, కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతూ, కాలితో ఊపుతూ, ‘తాతా! ఉయ్యాల ఊపనా’ అంటూండేవారు. మాతో మౌనంగా ఉండే నాన్నేనా మనవలతో ఇంత సరదాగా ఉంటున్నది అనిపించేది. తెల్ల పంచె, లాల్చీ, నుదుటి మీద విభూతి, కుంకుమతో స్వచ్ఛంగా ఉండేవారు. సినీ ఫ్యాన్ – కృష్ణా పత్రిక నాన్నగారు బి. ఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో, కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు సినిమా రివ్యూలు రాయమని కోరటంతో, నాన్న అంగీకరించారు. సినీ ఫ్యాన్ పేరుతో రివ్యూలు రాయటం ప్రారంభించారు. అప్పట్లో హెచ్. ఎం. రెడ్డిగారు తీసిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’తో పాటు ‘ద్రౌపదీ మానసంరక్షణ’ చిత్రం కూడా విడుదలైంది. హెచ్. ఎం. రెడ్డి గారు తీసిన సినిమా బాగా ఆడింది. నాన్నగారికి ‘మాన సంరక్షణ’ పేరు వినసొంపుగా ఉండటంతో, ఆ పేరు పట్టుకుని, చాలా బావుంది అని రాశారు. టెక్నికల్‌గా కూడా ‘మాన సంరక్షణ’ చిత్రమే బాగుందట. రివ్యూ చూసిన హెచ్. ఎం. రెడ్డిగారు, ఏ మాత్రం బాధపడకుండా నాన్నను విజయవాడ వచ్చి కలవమన్నారట. ఆ మాట ప్రకారం వెళ్లి కలిస్తే, ‘మా దగ్గర పని చేస్తావా’ అని అడగటంతో, నాన్నగారి సినీ రంగ ప్రవేశం జరిగింది. అప్పట్లో కృష్ణా పత్రిక రివ్యూకి అంత విలువ ఉండేది. మేం బందరులో ఉండగానే పింగళి నాగేంద్రరావుగారితో స్నేహం ఏర్పడింది. నాన్నగారు విజయవాహినిలో నెల జీతానికి సెటిల్ అయ్యాక, ‘ఇక్కడ ఖాళీ ఉంది, నువ్వు కూడా మద్రాసు వచ్చేసై’ అని పిలవటంతో పింగళి నాగేంద్రరావుగారు మద్రాసు వెళ్లారు. చెన్నైలో కెవి రెడ్డి గారితో కలిసి ఒక రూమ్‌లో ఉండేవారు. నాగిరెడ్డి, బి.ఎన్. రెడ్డి గారి సంస్థల్లో పనిచేశారు. నాన్నగారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం ‘చంద్రహారం’ చిత్రం తరవాత నాన్నగారి నైపుణ్యం చూసి ఎన్. టి. ఆర్. తన సంస్థలో అవకాశం ఇచ్చారు. ఆ సంస్థలోనే ‘పాండురంగ మహాత్మ్యం’ చేశారు. ఆ చిత్రంతో బ్రేక్ రావటంతో, పౌరాణిక చిత్రాలకు నాన్న ఫేమస్ అయిపోయారు. నెహ్రూతోకమలాకర కామేశ్వరరావు సమయ పాలన... షూటింగ్‌కి కారు వస్తుందంటే, వరండాలో సోఫాలో రెడీగా కూర్చునేవారు. కారు రాగానే ఎక్కి వెళ్లిపోయేవారు. ప్రివ్యూలకు అందరం వెళ్లేవారం. మా మేనత్తగారు కూడా మాతో వచ్చేవారు. అందరినీ ఆలస్యం చేయకుండా టైమ్‌కి రెడీగా ఉండమనేవారు. ‘నిత్యం ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉండేవారు. ‘దుఃఖానికి సుఖానికి ఒకేలా ఉండాలి’ అనేవారు. ఆయన ఆ సూత్రాలే పాటించేవారు. నాన్నగారి దర్శకత్వంలో వచ్చిన, ‘నర్తనశాల’ చిత్రానికి జాతీయస్థాయిలో రెండో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారి దక్కిన గౌరవం అది. ఆ రోజు కూడా నాన్న ఎంతో స్థితప్రజ్ఞతతో ఉన్నారు. నాన్నగారికి రెండు సంవత్సరాలు వరుసగా జాతీయ అవార్డులు వచ్చాయి. పురాణ చిత్రాలకు ఆదరణం తగ్గుతుండటంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మాకు తెలియనిచ్చేవారు కాదు. సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు. ఒక్క నయా పైసా అప్పు లేనందుకు సంతోషించేవారు. ఉన్నదానితో సంతోషంగా ఉండాలి అనేవారు. సంగీతం – వేదాంతం నాన్న సంగీతం బాగా పాడేవారట. నా కంటె ముందు ఒక బాబు పుట్టి, పది నెలల వయసులోనే పోయినప్పటి నుంచి నాన్న పాడటం మానేశారని అమ్మ చెబుతుండేది. నాన్న సంగీతం నేర్చుకోకపోయినా, రాగాలు తాళాలు చెప్పగల పరిజ్ఞానం ఉంది. బందరులో సంగీత కచేరీలకు వెళ్లేవారట. అందుకునేమో నాన్నగారి సినిమాలలో సంగీతం, సాహిత్యం ఉన్నతంగా ఉండేవి. షూటింగ్‌లు లేనప్పుడు స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలు వినడానికి వెళ్లేవారు. ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాలు చదివేవారు. లైబ్రరీలో కూర్చుని ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించిన విషయాలు చదివేవారు. ఇంట్లో కూడా స్క్రిప్ట్ రాసుకునేవారు. ప్రతిరోజూ లేవగానే ధ్యానం, జపం చేసేవారు. రమణ మహర్షి, రామకృష్ణ, పరమహంస, వివేకానంద, అరవిందులు రచించిన పుస్తకాలు అధ్యయనం చేసేవారు. సహస్ర చంద్ర దర్శనం... వెయ్యి పున్నములు చూసిన వారికి ఒక భోగం జరుపుతారు. అందుకు ఆరోగ్యం, భార్య రెండూ ఉండాలి. ఆ రెండూ నాన్నగారికి ఉన్నాయి కనుక, ఆయనను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. ‘శతమానం భవతి’ అని వంద మందిని మాత్రమే పిలవమన్నారు. ఆయన కింద కూర్చోలేరేమో అనుకున్నాం, కానీ, మా అందరికీ ఆనందం కలిగించేలా చక్కగా చేయించుకున్నారు. ఆయన పిల్లలుగా పుట్టే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఆ ఒక్క వేడుకైనా చేయగలిగినందుకు సంతోషపడ్డాం. ఆ తరవాత నాన్నగారి శతజయంతి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా చెల్లెలు శాంతి పూర్తిగా సహకరించింది. బాలు గారి వల్లే... నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బాలు గారు ఆటా వాళ్ల చేత నాన్నగారికి ‘శిరోమణి’ అవార్డు ఇప్పించారు. 80 సంవత్సరాల వయసులో నాన్నగారు రాలేనని చెప్పినా, బాలుగారి బలవంతంతో అమ్మనాన్న కలిసి వెళ్లారు. సినీ పరిశ్రమలో నాన్నగారిని ధర్మరాజు అనేవారు. ఎవరైనా పిలిచి ఇస్తేనే సినిమా చేసేవారు. నాగిరెడ్డి గారు ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు లక్షరూపాయలు అవార్డు వస్తే, ఇందులో నాన్నగారి భాగస్వామ్యం ఉంది అని కొంత డబ్బు నాన్నకి ఇచ్చేశారు. ఆ రోజుల్లో అంత ఉన్నతంగా ఉండేవారు. రాఘవేంద్రరావుగారు నాన్నగారి దగ్గరే మొదట అసిస్టెంట్‌గా చేశారు, నాన్నగారిని గురువు గారు అంటుంటారు. ప్రేమగా చూసేవారు.. నాన్నగారికి మేం ఐదుగురం పిల్లలం. ఒక అబ్బాయి, నలుగురు ఆడ పిల్లలు. అందరి కంటే నేనే పెద్దదాన్ని. నా తరవాత శాంత, ఉష, ఉమ, అబ్బాయి రామకృష్ణ, మా అందరినీ నిశ్శబ్దంగా గమనిస్తూ, ప్రేమగా పెంచారు. ఇంట్లో పనులన్నీ అమ్మ ద్వారానే జరిగేవి. స్కూల్ డిబేట్లో మాట్లాడాలంటే, ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో చెప్పేవారు. మహిళా దినోత్సవం సందర్భంగా.. ద్రౌపది, సీతల గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ శక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నాన్నగారు ఆ రోజు చేసిన బోధన ఈ నాటికీ చాలా ఉపయోగపడుతోంది. అమ్మనాన్నలు వయసులో పెద్దవారయ్యాక మా చెల్లెళ్లు ఉష, ఉమ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. చివరి రోజుల్లో నెల్లూరులో తమ్ముడి దగ్గర గడిపారు. అక్కడ ఉండగానే జూన్ 29, 1998లో పరమపదించారు. - పానుగంటి లక్ష్మి (కమలాకర కామేశ్వరరావు పెద్ద కుమార్తె) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
నిర్మాత కన్నుమూత: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి నేడు(సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఇక లేరనే వార్త చాలా బాధాకరమని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సింహాద్రి చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని గుర్తు తెచ్చుకున్నాగు. దొరస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూత) "అజాత శత్రువు, అందరికీ బంధువు దొరస్వామి గారు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్‌లా వెలిగారు. మేం తీసిన 90 శాతం సినిమాలు ఆయనే రిలీజ్ చేశారు. ఆయన తీసిన అన్నమయ్య కీర్తనలకు నేను దర్శకుడిగా పని చేసినప్పుడు పంచుకున్న అనుభవాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. తదితరులు సైతం ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో రేపు ఉదయం 11 గంటలకు దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. (చదవండి: యాక్షన్ సీన్ కోసం 50 రోజులు నైట్ షూట్) దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను — Jr NTR (@tarak9999) January 18, 2021 We lost Telugu Cinema’s one of the passionate distributors & producers, VMC Doraswami Raju garu. My condolences to his family. - K. Raghavendra Rao @Ragavendraraoba pic.twitter.com/yrhtvXnGGr — BARaju (@baraju_SuperHit) January 18, 2021 -
హీరోగా రాఘవేంద్రుడు
దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు సాధారణం. ఆయన తదుపరి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకుడిగా తెరకెక్కించే సినిమాలో కాదు. హీరోగా చేయబోతున్న సినిమాలో. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆయన కథానాయకుడిగా, నలుగురు హీరోయిన్లతో ఓ సినిమా ప్రస్తుతం ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, సమంత, ఓ కొత్త హీరోయిన్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకుడు. జనార్దన∙మహర్షి కథారచయిత, చంద్రబోస్ పాటల రచయిత, కీరవాణి సంగీత దర్శకుడు. -
కాకర పువ్వొత్తుల రంగుపూలు
కాకర పువ్వొత్తులు రంగుపూలు పూశాయి. చిచ్చుబుడ్లు మెరుపులు విరజిమ్మాయి. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. లడ్డూలు ఇష్టంగా లాగించారు. దీపావళిని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటారు. సినిమా తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పూజ విశేషాలను, పండగ సంబరాలను ఎవరెవరు ఎలా జరుపుకున్నారో తెలుసుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రి మోహన్బాబువాళ్ల ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయని తెలిసింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను మంచు కుటుంబం ఆహ్వానించింది. కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్, రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయితలు బీవీఎస్ఎన్ రవి, గోపీ మోహన్, హీరో రాజ్ తరుణ్.. ఇలా పలువురు తారలు మంచు ఇంటి విందుకి హాజరయ్యారు. ఆ వేడుక విశేషాలను పక్కన ఫొటోల్లో గమనించవచ్చు. విష్ణు చిన్న కుమార్తె ఐరా విద్యా మంచుని చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో పాటు ఈ విందుకి సంబంధించిన పలు ఫొటోలు బయటికొచ్చాయి. కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, సత్యానంద్, చిరంజీవి, మోహన్‌బాబు ఇక కొత్తగా రీమోడలింగ్ చేయించిన ఇంట్లో దీపావళిని జరుపుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్.. ఇలా మొత్తం కుటుంబసభ్యులు పండగ చేసుకున్నారు. దీపావళిని అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రాండ్‌గానే చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి దీపావళిని ఎంజాయ్ చేశారు ప్రభాస్. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను పక్కన చూడవచ్చు. ఒక్కసారి బాలీవుడ్ సైడ్ వెళ్తే బోనీకపూర్ ఫ్యామిలీ మొత్తం దీపావళి సాయంత్రాన్ని ఎంజాయ్ చేశారు. దీపావళి ఈవెంట్‌ను అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నిర్వహించింది. ఆ వేడుకకు పలువురు తారలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేశారు స్టార్స్. ఫ్యామిలీతో తాప్సీ దీపావళిని జరుపుకున్నారు. తమన్నా, శ్రుతీహాసన్ సెల్ఫీను షేర్ చేశారు. రంగోలీతో పూజా హెగ్డే ఫొటో పంచుకున్నారు. ఇలా దీపావళి కాంతిని ఫేస్బుక్, ట్వీటర్ల ద్వారా అభిమానులకు కూడా షేర్ చేశారు స్టార్స్. రాజారవీంద్ర, చిరంజీవి, ఐరా విద్య, విరానికా, విష్ణు నాగార్జున, అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ విష్ణు,విరానికా, ప్రభాస్, అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో వరుణ్‌తేజ్ శ్యామల, కృష్ణంరాజు, ప్రభాస్ అల్లు అర్జున్, స్నేహ, రామ్‌చరణ్, ఉపాసన, అర్జున్‌కపూర్, జాన్వీకపుర్ -
తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రామ్‌చరణ్!
‘సైరా నరసింహారెడ్డి’.. ప్రస్తుతం మెగాస్టార్ అభిమానులకు ఈ పేరే ఒక ఎమోషన్‌గా మారిపోయింది. గాంధీ 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు వెళుతోంది. దాదాపు ఒకటో రెండో తప్ప మిగతా సంస్థలన్నీ సైరా సినిమాపై మంచి రివ్యూలనే అందించాయి. తాజాగా ఈ చిత్రంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనకు తెలిసిన చిరంజీవిగా కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే కనిపించాడన్నారు. మెగాస్టార్ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారన్నారు. ఈ సందర్భంగా సైరా టీంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సైరా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలుస్తుందని రాఘవేంద్రరావు కితాబిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా నటన అదరగొట్టిందన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్‌చరణ్ ఈ చారిత్రాత్మక చిత్రంతో తండ్రికి అసలు సిసలైన గిఫ్ట్ ఇచ్చారని రాఘవేంద్రరావు కొనియాడారు. Congratulations to the entire team of #SyeRaaNarasimhaReddy for scoring a blockbuster! This is a perfect gift to a father from a son... #RamCharan @KonidelaPro — Raghavendra Rao K (@Ragavendraraoba) October 3, 2019 కాగా సైరా హిట్‌తో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ఈ మేరకు సంతోష క్షణాలతో కూడిన ఫొటోలను సాయి ధరమ్ తేజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.. ‘చిరంజీవి అల్లుడిగా కాకుండా ఆయన అభిమానిగా చెప్తున్నా.. వెండితెరపై ఆయన మ్యాజిక్ చేశారు’ అంటూ చిరు నటనను కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించారని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. Congratulated our #megastar not as a nephew but as a fan, as a boy who saw him creating magic on screen ,who breathed life into the historical character of #uyyalawadanarasimhareddy , thank you my #HERO 🙏🏼, love you so much 🤗😘 #syeraanarasimhareddy #syeraa #megastar pic.twitter.com/K7SDng0eKO — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2019 -
ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాఘవేందర్‌రావుతోపాటు పలువురు ఎస్వీబీసీ చైర్మన్లుగా ఉన్నారని, వారి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే.. విచారణ తప్పదని పృథ్వీ స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎస్వీబీసీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, రాఘవేందర్రావుతో ఈ విషయంలో తనకు ఎలాంటి పోటీలేదని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక చిత్ర పరిశ్రమలో తనపై కక్షసాధింపులు మొదలయ్యాయని, సినిమాల కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లు కొంతమంది వెనక్కి తీసుకున్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతమని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారికి ఇలా సేవ చేసుకుంటానని తాను కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. జులై 28వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్‌గా పదవీ స్వీకారా ప్రమాణం చేశానని తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు. ఎస్వీబీసీ చానల్ ఆధ్యాత్మికతను కాపాడుతానని, చానెల్‌ను దేశంలో నంబర్ వన్ చానల్‌గా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ చానెల్‌ను నిబద్ధతతో నడిపిస్తానని తెలిపారు. ఈ పదవి తనకు అప్పగించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్య లాంటి వారని అన్నారు. పోసాని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడను! ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడుతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా రాజకీయలకు అతీతంగా పనిచేస్తానని, భక్తుల మనోభావాలను కాపాడుతానని తెలిపారు. నటుడు శివాజీ చంద్రబాబుకు భజన చేశాడని, ఆయనకు మాట మీద నిలకడ లేదని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైస్సార్సీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ
తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం సందర్భంగా మే4 వ తేదీన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుందాం అని తీర్మానించారు. ట్రస్ట్ ద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి ఆరోగ్య , విద్య మరియు కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధి ని ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా వచ్చే వడ్డీ తో అర్హులైన వారికి తోడ్పాటు ఇద్దాం అని నిర్ణయించారు. ఈ ట్రస్ట్ కోసం దర్శకుడు రాజమౌళి 50 లక్షలు, రాఘవేంద్ర రావు10 లక్షలు , నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా15 లక్షలు ప్రకటించారు. ట్రస్ట్ ఆలోచనని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు ప్రకటించారు.ఈ నెల 24న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ పేరిట రిజిస్టర్ అయిన ఈ ట్రస్ట్‌కు రాఘవేంద్ర రావు గారు చైర్మన్ గా, N శంకర్ (మేనేజింగ్ ట్రస్టీ)గా సేవలందించనున్నారు. వీరితో పాటు వి వి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్.రవి ట్రస్టీలు గా టీఎఫ్‌డీటీ (TFDT) ఆవిర్భావం జరిగింది. -
శోభన్‌బాబు ఆంధ్రుల అందగాడు
‘‘ఆంధ్రుల అందగాడు శోభన్‌బాబు. దర్శక–నిర్మాతలకు ఆయన అనుకూలంగా ఉండేవారు. సహ నటీనటులతో సోదరభావంతో ఉండేవారు. ఎప్పడూ సాధారణ జీవితాన్ని గడిపేందుకే ప్రయత్నం చేసేవారు. స్థిరాస్తులను అందరూ కలిగి ఉండాలని కోరేవారు. పుట్టినరోజులు, జయంతి వేడుకల పేరిట అనవసర ఖర్చులు చేయవద్దని చెప్పేవారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని అంటుండేవారు’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రతిష్టాత్మక శోభన్‌బాబు అవార్డుల కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శోభన్‌బాబు నటించిన పలు చిత్రాల సన్నివేశాలను ప్రదర్శించారు. పలు పాటలకు కళాకారులు నాట్యం చేసి అలరించారు. ఈ వేదికపై లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును నటుడు కృష్ణంరాజుకు అందజేశారు. పలువురు నటీనటులకు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరావు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నటీమణులు సరిత, భానుప్రియ, జయచిత్రలతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
‘గీత గోవిందం’ నా సినిమాకు కాపీ..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు ఈ చిత్రాన్ని అభినందించారు. ప్రస్తుతం వీరి కోవలోకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా చేరారు. ఒక అవార్డుల కార్యక్రమానికి హజరైన రాఘవేంద్ర రావు ‘గీత గోవిందం’ సినిమాను అభినందిస్తూ.. ఈ సినిమాను చూస్తే 20 ఏళ్ల క్రితం నేను శ్రీకాంత్‌తో తీసిన ‘పెళ్లి సందడి’ చిత్రం గుర్తుకు వచ్చింది అని తెలిపారు. దర్శకుడు పరుశురాం ‘పెళ్లి సందడి’ సినిమాను కాపీ కొట్టాడేమో అనిపించిందన్నారు. అసభ్యతకు తావు లేకుండా చాలా చక్కగా గీత గోవిందం చిత్రాన్ని తెరకెక్కించాడని అభినందించారు. చిన్న సినిమాగా విడుదలైన గీత గోవిందం ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో దర్శకుడు పరుశురామ్ని మెచ్చుకోవాలి అని తెలిపారు. 20 ఏళ్ల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అల్లు అరవింద్, అశ్విని దత్‌లు నిర్మాతలుగా ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మూడు నంది అవార్డులను అందుకుంది. -
‘మహానటి’కి అభినందనల వెల్లువ
సాక్షి, సినిమా: దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అద్భుతంగా నిజంగానే మహాద్భుతంగా ఉందటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, జెమినీ గణేషన్‌గా దుల్కర్ సాల్మన్ జీవించారని అభినందనలు కురుస్తున్నాయి. (చూడండి: ‘మహానటి’ మూవీ రివ్యూ) 28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..: మహానటి విడుదల సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావ్ ఒకింత భావోద్వేగపూరిత కామెంట్లు చేశారు. ‘‘సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే వైజయంతీ మూవీస్ బ్యానర్లో నేను తీసిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఇదే రోజు(మే 9న) విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా వచ్చింది. సావిత్రి జీవితచరిత్రను సినిమాగా మలిచిన వైజయంతి మూవీస్‌కి అభినందనలు’’అని పేర్కొన్నారు. ఫ్యాన్ అయిపోయా: జక్కన్న ‘‘ఏదో అనుకరిస్తున్నట్లు కాకుండా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. కీర్తి సురేశ్.. సావిత్రిని మళ్లీ మనముందుకు సజీవంగా తీసుకొచ్చారు. ఇక దుల్కర్ సాల్మన్.. ఫెంటాస్టిక్! నేను అతనికి ఫ్యాన్ అయిపోయా. స్వప్నదత్, నాగ అశ్విన్‌లకు అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. సావిత్రి ఆత్మే చేయించుకుంది: విజయవాడలో ‘మహానటి’ సినిమా చూసిన అనంతరం నిర్మాత అశ్వినీ దత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘18 నెలల కష్టానికి ఫలితం దక్కింది. బహుశా సావిత్రిగారి ఆత్మే దగ్గరుండిమరీ ఈ సినిమాను చేయించుకుంది. నా 44 ఏళ్ల సినీ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే. ఓవర్సీస్లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. సినిమాలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. సావిత్రి కూతురి వ్యాఖ్య: మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి సైతం తొలిరోజే ‘మహానటి’ని చూసి తన భావాలను పంచుకున్నారు.‘‘అమ్మ చిన్నతనం నుండి అగ్రకథానాయికగా ఎదిగిన తీరును సినిమాలో చూడటం ఆనందంగా ఉంది. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుంది. కీర్తి సురేష్ చక్కగా ఒదిగిపోయారు. దుల్కర్ సాల్మన్ అచ్చు మా నాన్నను అనుకరిస్తూ నటించారు. మహానటిపై ప్రముఖుల ట్వీట్స్... . @KeerthyOfficial’s potrayal of Savitri garu is one of the finest performances I've ever seen. It is not just imitating. She brought the legendry actress back to life. @dulQuer is absolutely fantastic. I am his fan now. — rajamouli ss (@ssrajamouli) 9 May 2018 Hearing the most wonderful things about #Mahanati ! Overwhelmed and grateful ! Thank you @nagashwin7 Swapna Priyanka and Ashwini Dutt garu for putting their faith in me. Lots of love to @KeerthyOfficial @Samanthaprabhu2 @TheDeverakonda Rajendra Prasad garu & the entire cast ! — dulquer salmaan (@dulQuer) 9 May 2018 28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజు న నేడు మహానటి విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. 🙏🏻🙏🏻🙏🏻 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . @KeerthyOfficial పాత్ర లో జీవించింది. శివాజీ గణేశన్ గా @dulQuer నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు. 😊 — Raghavendra Rao K (@Ragavendraraoba) 9 May 2018 #Mahanathi classic ,emotional inspirational bio epic of savithri Amma @KeerthyOfficial brought back the legendary actress hats off espl Mayabazar dance @Samanthaprabhu2 Thambi u rocked , congrats to whole team & Spl Thx to @VyjayanthiFilms for this unforgettable classic ... pic.twitter.com/2xvylpqufy — atlee (@Atlee_dir) 9 May 2018 I am very proud to have played a small part in this CLASSIC ❤️ Thankyou @nagashwin7 for Madhuravani .. #Mahanati @KeerthyOfficial you were just Outstanding !! Much love to my producers @VyjayanthiFilms and @TheDeverakonda @dulQuer . #TeamMahanati — Samantha Akkineni (@Samanthaprabhu2) 9 May 2018 -
రాఘవేంద్రుడి హెల్ప్ తీసుకుంటున్న బాలయ్య!
బాలకృష్ణ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత చాలా మంది పేర్లే వినిపించినా... ఎవరూ ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. సో..బాలయ్యే దాని పగ్గాలు చేపట్టి డైరెక్షన్ కూడా చేసేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే డైరెక్షన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అసలే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. అందుకే దర్శకేంద్రుడి సహాయాన్ని బాలయ్య తీసుకుంటున్నారని సమాచారం. దర్శకత్వ పర్యవేక్షణ అంటే గుర్తుకొచ్చేది రాఘవేంద్రరావే. ఆయన చాలా సినిమాలకు పర్యవేక్షణ చేశారు. సినిమాకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ... వెనకుండి నడిపిస్తారు. బాలయ్య కూడా దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ‘ఎన్టీఆర్’ సినిమాను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
‘టాలీవుడ్ పెద్దలు సమాధానం చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలిపిందన్న వార్తలపై సినీ పరిశ్రమ పెద్దలు సమాధానం చెప్పాలని నటుడు విజయ్‌చందర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై తాను స్పష్టత కోరానని, అయితే కేవలం వ్యక్తిగత మద్దతేనని అడహక్ కమిటీ చైర్మన్ కేఎల్ నారాయణ తెలిపారని అన్నారు. ఇందుకు సంబంధించి మిగిలిన నలుగురు కూడా స్పష్టత ఇవ్వాలని విజయ్ చందర్ పేర్కొన్నారు. సేవా సహాయ కార్యక్రమాల్లో మాత్రమే సినీ పరిశ్రమ ఒకేతాటిపై ఉంటుందని, రాజకీయ అంశాల్లో ఎవరి నిర్ణయం వారిదేనని ఆయన అన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖులు అశ్వనీదత్, కే రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దత ఉంటుందని తెలిపారు. ఇక ఇదే విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి కూడా సీఎం చంద్రబాబుకు చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. -
ఎవరినడిగి బాబుకు మద్దతునిచ్చారు
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు చేపట్టిన హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతుగా నిలుస్తోందంటూ దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు ఐదుగురు సినీ ప్రముఖులు ప్రకటించటాన్ని నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కేఎల్ నారాయణ, కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు ఇటీవల చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన కథనంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సినీ పరిశ్రమ చంద్రబాబు వెంట ఉందంటూ మీరు ప్రకటించినట్లు వచ్చిన వార్తా కథనం వల్ల కులం రంగు పులుముకుంది. చంద్రబాబు కమ్మ కులస్తుడైనందున కమ్మోళ్లమంతా ఆయనకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉంది..’అని పోసాని గురువారం ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ మండిపడ్డారు. ‘నలుగురైదుగురు సీఎంకు వద్దకు వెళ్లి సినీరంగం మొత్తం మద్దతుగా ఉంటుందని ఎలా చెబుతారు? ఇండస్ట్రీ అంటే మీ ఐదుగురేనా? మోహన్‌బాబు, జూ. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి ప్రముఖులెందరో సినీ పరిశ్రమలో ఉన్నారు. చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరం కోసం ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. ప్రత్యేక హోదా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే వైఎస్ జగన్ ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు ఎందుకు మద్దతు ప్రకటించలేదు? రాష్ట్రానికి హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేపట్టి చావుబతుకుల మధ్య పోరాడారు? మరి మీరు ఢిల్లీ వెళ్లి ఆ ఐదుగురు ఎంపీలకు ఎందుకు సానుభూతి తెలపలేదు? బాబుకే మద్దతిస్తారా? వైఎస్ జగన్‌ది ఉద్యమం కాదా? లెఫ్ట్ది, కాంగ్రెస్, చలసానిది ఉద్యమం కాదా?’ అని నిలదీశారు. -
సినీ పరిశ్రమ తరఫున మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు.?
-
ఆ ఐదుగురిపై పోసాని కృష్ణమురళి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంటుందని సినీ పెద్దలు ప్రకటన చేయడాన్ని ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు అంటూ ఆయన నిలదీశారు. అశ్వనీదత్, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్రావు, కిరణ్ తదితరులు చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటన చేసినట్టు ఓ పత్రికలో వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని పోసాని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని, చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉందని ఆయన మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. ‘హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు అంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకేతాటిపైకి వచ్చి సీఎంగారు చేస్తున్న ఉద్యమానికి బాసటగా ఉంటామని ఆ పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చిత్ర పరిశ్రమలో 33ఏళ్లకుపైగానే ఉన్నా. ఈ విషయం గురించి నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. మీటింగ్ పెట్టి అందర్నీ ఎవరూ పిలువలేదు. అలాంటప్పుడు మీరు నలుగురైదుగురు సీఎంకు వద్దకు వెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం మీకు మద్దతుగా ఉంటుందని ఎలా చెప్తారు. సీఎం చంద్రబాబును అశ్వనీదత్, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్రావు, కిరణ్ కలిశారు. వీళ్లు ఐదుగురు మాత్రమే సినీ పరిశ్రమ మొత్తం తరఫున వకాల్తా పుచ్చుకొని ఎలా హామీ ఇస్తారు? ఇది పత్రికలో వచ్చిన అబద్ధమా? అయితే ఈ వార్త అబద్ధమని, మేం వ్యక్తిగతంగానే సీఎంను కలిశాం. కానీ ఇండస్ట్రీ తరఫున రాలేదని మీరు వివరణ ఇచ్చి ఉండాలి? ఇప్పటివరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు? కేఎల్ నారాయణ జెంటిల్మెన్. క్యాస్ట్ రంగు పులుముకొని తిరగరు. కిరణ్‌గారు కూడా అంతే. వారందరూ అంటే నాకు గౌరవ ఉంది. కానీ ఎఇలా ప్రకటన చేయడం బాగాలేదు’ అని పోసాని అన్నారు. నేను చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం లేదు! ‘సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు హోదా ఉద్యమానికి మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు. కానీ నేను మద్దతు ఇవ్వడం లేదు. వీళ్లు సినీ పరిశ్రమ తరఫున ఎలా సీఎంకు హామీ ఇస్తారు? అని కొందరు నన్ను అడుగుతున్నారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోంది. చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టు అన్నట్టుగా ఇది ఉంది. మమ్మల్ని అడగకుండా ఎలా మొత్తం సినీ పరిశ్రమ తరఫున మద్దతు ఇస్తారు? ఇండస్ట్రీ అంటే ఆ ఐదుగురేనా? మీరు ఇలాంటి సేట్మెంట్ ఇచ్చి ఉండకుంటే.. పేపర్ వాళ్లు తప్పు రాశారని ప్రకటన ఇవ్వండి’ అని పోసాని కోరారు. ‘చంద్రబాబు వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆయన ఒకసారి ప్రత్యేక హోదా కావాలన్నారు. తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ చాలు అన్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరం కోసం ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. అందుకే మద్దతు ఇచ్చేందుకే మీరు వచ్చారా? మీకు అభిమానం ఉంటే.. వ్యక్తిగతంగా వెళ్లి చంద్రబాబుకు మద్దతు ఇచ్చుకోండి. అంతేకానీ సినీ పరిశ్రమలోని వేలమంది తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే హక్కు మీకు ఉండదు. ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ఈ ముఖ్యమంత్రి తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వెళ్లలేదు. పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే ఒక్కశాతం ఓట్లు అధికంగా వచ్చి తెలుగుదేశం గెలిచింది. అందుకే మీరు పవన్‌కు సన్మానం చేశారు. ఆయన కొంచెం విమర్శించడంతో ఇప్పుడు ఆయనపై మండిపడుతున్నారు’ అని అన్నారు. ప్రత్యేక హోదా మీద మీకు ప్రేమ ఉంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు ఎందుకు మద్దతు తెలుపలేదు. ఢిల్లీలో ఎంపీలు అన్నాపానాలు మరిచి దీక్ష చేశారు. పెద్ద వయస్సులో ఉన్నప్పటికీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా దీక్ష చేశారు. మరి మీరు ఢిల్లీకి వెళ్లి.. ఎందుకు ఆ ఐదుగురు ఎంపీలకు సానుభూతి తెలుపలేదు. కేవలం చంద్రబాబుకు మాత్రమే మద్దతు ఇస్తారా? వైఎస్ జగన్‌ది ఉద్యమం కాదా? వామపక్షాలది ఉద్యమం కాదా? కాంగ్రెస్ పార్టీది ఉద్యమం కాదా? చలసానిది ఉద్యమం కాదా?’ అని ప్రశ్నించారు. ‘హోదాపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో మీకు తెలియదా? మీరు పెద్దమనుషులు.. ఇలాంటి తప్పులు చేయకూడదు. కానీ మా తరఫున ఇలా వకాల్తా తీసుకొని మాట్లాడకూడదు’ అని సినీ పెద్దలకు పోసాని సూచించారు. ఒకవేళ ఈ ప్రకటన చేసి ఉండకుంటే.. ఇలాంటి ప్రకటన తాము చేయలేదని ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న అందరికీ కళాకారుల తరఫున మద్దతు ఇవ్వాలని సూచించారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
-
‘సైజ్ జీరో’ దర్శకుడి ‘మెంటల్ హై క్యా’
తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ కోవెలమూడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక పాత్రల్లో మెంటల్ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
శ్రీదేవిని ఎత్తుకునేవాణ్ణి
నివాళి మీ డైరెక్షన్లో 24 సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీదేవి. ఎన్నో అద్భుత పాత్రల్లో ఆమెను చూపించిన మీకు శ్రీదేవి ‘ఇక లేరు’ అంటే ఎలా అనిపిస్తోంది? రాఘవేంద్రరావు: నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్‌కి ఎలా వచ్చింది? ఎంత ఎదిగింది? అని స్వయంగా చూశాను. మా నాన్నగారు (కె.ఎస్. ప్రకాశ్‌రావు) డైరెక్ట్ చేసిన ‘నా తమ్ముడు’ సినిమాలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను శ్రీదేవిని ఎత్తుకుని షూటింగ్ లొకేషన్‌కి తీసుకువెళ్లేవాణ్ణి. ఆ సినిమాలో తను నెహ్రూ క్యారెక్టర్ చేసింది. అంత చిన్న పిల్ల నుంచి ప్రేక్షకుల మనసుల్లో అతిలోక సుందరిగా ఎదిగిన వరకూ శ్రీదేవిని నేను చూశాను. ఒక హీరోయిన్‌తో 24 సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు. 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవిని ఆ దేవుడు తీసుకెళ్లినందుకు బాధపడుతున్నా. శ్రీదేవి ‘నాన్ కాంట్రవర్షియల్’ హీరోయిన్ అనిపించుకున్నారు.. ఆ విషయం గురించి? శ్రీదేవి కొంచెం రిజర్వ్›్డగా ఉండేది. అయితే అది అహంభావం కాదు. తన తత్వం అంతే. కానీ ఎవరినీ నిందించడం, నొప్పించడం తనకు తెలియదు. కలుపుగోలుతనంగా ఉండేది. తన పనేంటో తను చూసుకునేది. అందుకే ఎలాంటి వివాదాలు లేవు. జనరల్‌గా మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అని అడిగితే, ఎవరి పేరు చెబితే ఏమొస్తుందోనని భయపడుతుంటాం. ఒక హీరోయిన్ పేరు చెబితే ఇంకో హీరోయిన్ బాధపడుతుందేమోననుకుంటాం. కానీ ఎవర్నడిగినా ‘శ్రీదేవి’ పేరును చెబుతారు. తన పేరు చెబితే ఎవరూ ఫీలవ్వరు. అంత మంచి పేరు సంపాదించుకుంది. ఆలిండియా సూపర్ స్టార్ అనిపించుకోవడానికి కారణం చెబుతారా? గ్లామర్ ఒక్కటే సరిపోదు. ఆ ఒక్కటితోనే శ్రీదేవి ఈ స్థాయికి రాలేదు. తను మల్టీ టాలెంటెడ్. ఎన్ని రకాల పాత్రలు ఇస్తే అన్నీ చేయగల సత్తా తనకుంది. ప్రతి పాత్రకీ వ్యత్యాసం చూపించగలదు. తెలుగులో ‘పదహారేళ్ల వయసులో’తో మొదలుపెట్టి తనతో ఎన్నో సినిమాలు చేశా. తెలుగు, తమిళ నుంచి జాతీయ.. అంతర్జాతీయ స్థాయి వరకు శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు. బాలనటి నుంచి కథానాయిక వరకూ నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి మరణం చాలా బాధాకరం. -
మళ్ళీరావా చాలా బాగుంది – రాఘవేంద్రరావు
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీ రావా’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మళ్ళీరావా’ నాకు బాగా నచ్చింది. సుమంత్ నటన అద్భుతం. కెమెరా పనితనం, సంగీతం కొత్తగా అనిపించాయి. ఆకాంక్ష సింగ్‌తో పాటు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన గౌతమ్ అనుభవం ఉన్నవాడిలా తీశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారి విజయం అందుకున్న రాహుల్ యాదవ్‌కి శుభాకాంక్షలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
నేనైతే తిరిగి విసురుతా!
అదే నేనైతే తిరిగి కొడతానంటోంది ఎమీజాక్సన్. ఈ ఇంగ్లీష్ భామకిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లలో అవకాశాలు లేవు. ఒక ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో 2.ఓ చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఎమీ అవకాశాల కోసం ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది. ఆ మధ్య నటి తాప్సీ దక్షిణాదిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లో మకాం పెట్టి దక్షిణాది సినిమా వారిపై ఆరోపణల దాడి మొదలెట్టింది. దక్షిణాది చిత్రాల్లో చిత్రవధకు గురయ్యానని, ఒక దర్శకుడు పాటల సన్నివేశాల్లో బొడ్డుపై కొబ్బరిచిప్పలు వేశారని, ఆయనకు అదేం ఆనందమో అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆమెకు టాలీవుడ్లో అవకాశం కల్పించిన ప్రముఖ దర్శకుడినే తాప్సీ అలా ఎగతాళి చేసింది. తరువాత క్షమాపణ చెప్పిందనుకోండి. తాప్సీకి మద్దతుగా నిలిచిన నటి ఎమీజాక్సన్ అలాంటి సంఘటనలు నిజంగా దారుణం అని పేర్కొంది. అలా తనపై ఎవరైనా చేస్తే అదే కొబ్బరి చిప్పను వారిపై విసురుతానని ఘాటుగా బదులిచ్చింది. అదృష్టవశాత్తు తానిప్పటివరకూ మంచి దర్శకుల చిత్రాల్లోనే నటించానని పేర్కొంది. అదే విధంగా అందరు హీరోయిన్లకు అలా జరగదని, దయ చేసి అలాంటి బాధాకరమైన చర్యలకు పాల్పడరాదని ఎమీ ఒక భేటీలో పేర్కొంది. ఇలా ఈ అమ్మడు తనకు సంబంధం లేని విషయాలతో ఫ్రీ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నట్లుంది కదూ! -
ఆ ధైర్యం మా తారక్ కి ఉంది...
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రశంసలతో ముంచెత్తారు. ‘జై లవ కుశ’ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి’ అంటూ రాఘవేంద్రరావు ట్విట్ చేశారు. కాగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ టీజర్ గురువారం రిలీజైన విషయం తెలిసిందే. ఆ టీజర్లో ‘‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘జై’ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ నత్తి ఉన్నవాడిలా మాట్లాడటం.. డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ సూపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. బాబీ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జై, లవ, కుశ అనే మూడు విభిన్నమైన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కథ విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి: శ్రీదేవి
హైదరాబాద్ : అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘మమ్’ సినిమా తెలుగు ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, తాజాగా రెండో ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ..సినిమా కథ విన్నాక తన కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. ఈ చిత్రం కోసం సంవత్సరం పాటు పని చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ... శ్రీదేవి కోసం అయినా ఈ సినిమా చూడాలన్నారు. అలాగే నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ మమ్ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవి చాందినీ సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. కాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించిన ఈ హిందీ చిత్రం తమిళం, తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుంది. మామ్ సినిమాలో ఇద్దరు పాకిస్తానీ నటులు సాజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి ఉడయార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 7న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. -
మిత్రుల వల్లే ఈ స్థాయికి...
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు - యూఎన్ హాబిటాట్ గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మిత్రుల ఆత్మీయ సన్మానం సాక్షి, హైదరాబాద్: జీవితంలో తాను పైకి రావడానికి కారణం మిత్రులేనని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. నమ్ముకున్న సిద్ధాంతం, శ్రమ, క్రమశిక్షణతోపాటు వివిధ స్థాయిల్లో మిత్రుల సహకారం అందుకు దోహదపడిందన్నారు. యూఎన్ హాబిటాట్ గవర్నింగ్ కౌన్సి ల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్య హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా శనివారం ఆయనకు మిత్రులు, సన్నిహితులు సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరిట ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇది దేశానికి లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. పదవిని ఉత్తమంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యర్థాల ద్వారా వచ్చే కంపోస్ట్ రైతులకు.. పెరుగుతున్న జనాభా, కాలుష్యం, రద్దీ, ఆరోగ్యంపై ఒత్తిడికి సంబంధించి నూతన పట్టణీకరణ ఎజెండా, భవిష్యత్ ప్రణాళికలపై యూఎన్ హాబిటాట్ దృష్టి పెట్టిందని వెంకయ్య తెలిపారు. కెన్యా రాజధాని నైరోబిలో శుక్రవారం ముగిసిన యూన్ హాబిటాట్ సమావేశంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాన్ని చాకచక్యంగా పరిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు. ప్రపంచజనాభా 1976లో 37.9 శాతం నగరాల్లో జీవించగా 2016కు 54.5 శాతానికి చేరుకుందని, 2020కల్లా 60 శాతానికి చేరుకోనుందన్నారు. ప్రపంచంలో కేవలం 2 శాతం భూభాగంలోనే నగరాలున్నాయని.. కానీ 70 శాతం గ్రీన్హౌస్ వాయువులు, ప్రపంచ వ్యర్థాలతోపాటు 60 శాతం విద్యుత్ వినియోగం ఈ నగరాల నుంచే ఉన్నాయన్నారు. కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, వాతావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వ్యర్థాల ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువును ఆయా సంస్థల ద్వారా కాకుండా వ్యవసాయశాఖ ద్వారా నేరుగా రైతులకు పంపిణీ చేస్తామని అన్నారు. వెంకయ్య రాజకీయ బాహుబలి: కె. రాఘవేంద్రరావు అచ్చమైన తెలుగుదనానికి వెంకయ్య నాయుడు మారుపేరని దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొనియాడారు. ఉత్తమ మానవ విలువలతో రాజకీయ బాహుబలిగా నిలిచిన వెంకయ్యను సాహో అంటూ ప్రశంసించారు. స్వశక్తితోఎదిగిన వెంకయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు అన్నారు. తామంతా వెంకయ్యకు నిత్య విద్యార్థులమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. మాడుగుల నాగఫణిశర్మ ఆశీర్వచనం పలకగా పలువురు ప్రముఖులు శాలువాలు, బొకేలతో వెంకయ్యను సన్మానించారు. డా. ఎన్. గౌతమ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎన్. ఇంద్రసేనారెడ్డి, ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పారిశ్రామికవేత్త డీవీ మనోహర్, గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ డా. కె. రవీంద్రనాథ్, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొనగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వందన సమర్పణ చేశారు. -
నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది
‘‘సినిమా చూసి ఇంటికి వెళ్లిన తర్వాత అమల గంటసేపు ఏడుస్తూనే ఉంది. తన మనసులో నాపై ఎంత ప్రేమ ఉందనేది అప్పుడు అర్థమైంది. నన్ను పట్టుకుని అలా నిలబడింది. ఆ మెమరబుల్ మూమెంట్స్‌ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు నాగార్జున. శ్రీవారి భక్తుడు హాథీరామ్ బావాజీగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు కూడా సినిమా చూసి కళ్లు చెమర్చాయని చెప్పారు. బాగా చేశావని మెచ్చుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు కలిగిన అనుభవాలను ఆయనతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పంచుకోబోతున్నాను. ఓ చక్కటి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. రాఘవేంద్రరావుగారు, జేకే భారవిలు మూడు నాలుగేళ్లు కష్టపడి ఈ కథ తయారుచేశారు. టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. ('ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ) రెండు కళ్లూ చాలవు: కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నేను ఏం ఆశించి ఈ సినిమా తీశానో, ఈ రోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అందులో రెండు ఫోన్ కాల్స్ మరచిపోలేను. ‘ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అన్నారొకరు. ఇంకొకరు ‘వెండితెరపై తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ఆవిష్కరించిన మీకు జన్మంతా ఋణపడి ఉంటాం’ అన్నారు. భగవంతుడి విశ్వరూపం చూడడానికి రెండు కళ్లూ చాలవు. అదే విధంగా ఈ సినిమాలో కళ్లతోనే నటించిన నాగార్జున నటన చూడడానికీ రెండు కళ్లూ చాలవు. ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన మా నిర్మాత మహేశ్‌రెడ్డి, చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ చిత్రంతో నా జన్మ ధన్యమైంది. దీనికి కారకులైన నాగార్జున, రాఘవేంద్రరావులకు జీవితాంతం రుణపడి ఉంటాను. శుక్రవారం నుంచి బోలెడంత మంది అభినందిస్తున్నారు. ఈ అనుభూతిని మరచిపోలేను. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం చూస్తుంటే ఆ స్వామివారితో నేను గడిపినట్టు అనిపిస్తోంది. ఏడు కొండల వెంకన్న సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్‌లో నలభై నిమిషాల పాటు నా కళ్లవెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. యువతరం నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కర్ని సినిమా అలరిస్తుంది. రాఘవేంద్రరావుగారు ఓ టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తుల ఇబ్బందులను చూసి, చలించి ఈ సినిమా తీశారనిపించింది. అంత అద్భుతంగా ఉందీ సినిమా. కీరవాణి సంగీతం, భారవి రచన, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ల నటన.. అన్నీ ఆణిముత్యాలే’’ అన్నారు. ‘‘శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో మూడు సినిమాలు వచ్చాయి. ఇదంతా స్వామివారి మహిమే. నాగార్జున, రాఘవేంద్రరావులకు నేను పెద్ద ఫ్యాన్. వాళ్ల కాంబినేషన్లో చేసిన ఈ సినిమా హిట్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రగ్యా జైశ్వాల్. -
అలౌకికానందం
వేయి నామాల శ్రీనివాసుడి వైభోగం... నిత్య కళ్యాణం... పచ్చ తోరణం... కనులారా వీక్షించడం తప్ప వర్ణించతరమా? తిరుమలేశుడు కరుణిస్తే... అనుగ్రహిస్తే... వర్ణించ తరమే. అడుగడుగునా ఏడు కొండల్లో ప్రతిధ్వనించే వేంకటేశ్వరడి విశిష్టతలు వర్ణిస్తే.. సాక్షాత్తు స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తే... ఎలా ఉంటుంది? ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలా ఉంటుంది. ‘అన్నమయ్య’లో శ్రీవారి భక్తుడి గురించి చెప్పిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ‘ఓం నమో వేంకటేశాయ’లో హాథీరామ్ బావాజీ భక్తుడి చరిత్రతో పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం జరిగే కైంకర్యాల వెనుక కథను చెప్పారు. కథేంటి?: దేవుణ్ణి చూడాలనే తపనతో చిన్నప్పుడే దైవాన్వేషణలో ఊరూరు తిరగడం మొదలుపెడతాడు రాజస్థాన్ వాసి రామ (నాగార్జున). అనుభవానంద స్వామి (సాయికుమార్) వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి అతడికి విద్యాబుద్ధులతో పాటు పాచికలు ఆడటం నేర్పిస్తారు. స్వామి దర్శనం కావాలంటే తపస్సు చేయాలని చెబుతారు. రామ తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి బాలుడి రూపంలో రామ దగ్గరికి వస్తారు. స్వయంగా శ్రీవారే బాలుడి రూపంలో వచ్చారని గుర్తించని రాము, అతణ్ణి వెళ్లిపొమ్మని ఆగ్రహిస్తాడు. గురువు ద్వారా ఆ బాలుడే ఏడుకొండలవాడని తెలుసుకుని, తిరుమలకు చేరతాడు. అక్కడ స్వామి దర్శనం ఎలా అయింది? రామ నుంచి హథీరామ్ బాబాజీగా ఎలా మారారు? స్వామివారి నిత్య కైంకర్యాలను ఎలా జరిపించారు? స్వామి చేతుల మీదుగా సజీవ సమాధి ఎందుకయ్యారు? అనేది మిగతా చిత్రకథ. విశ్లేషణ: తెరపై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్లముందు ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ తెరపై కనిపిస్తున్న దృశ్యంలో మమేకమై చూసేలా స్వామివారికి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన ఏడు కొండలపై ఎందుకు వెలిశారు?... ఇలా స్థల పురాణంతో పాటు భక్తులకు తెలియని ఎన్నో విషయాలను కమర్షియల్ హంగులు జోడించి రాఘవేంద్రరావు ఈ సినిమా తీశారు. రచయిత జేకే భారవి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి, విజువల్ ఎఫెక్ట్స్ బృందం.. ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. తెర వెనుక బృందం పడిన కష్టం ఒకెత్తయితే... తెరపై నటీనటుల అభినయం మరో ఎత్తు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, అస్మిత, రావు రమేశ్.. అందరూ చక్కగా నటించారు. కానీ, ప్రేక్షకుల కళ్లన్నీ నాగార్జున, సౌరభ్ జైన్.. పైనే ఉంటాయి. స్వామివారు నిత్య యవ్వనుడు, అంద గాడు. సౌరభ్ జైన్‌ని ఆ పాత్రలో చూడగానే అచ్చంగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. హాథీరామ్ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతు డికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్ జైన్లు జీవించారు. థియేటర్లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది. -
‘తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా’
సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలకృష్ణలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు...చిరు, బాలయ్యను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. చిరంజీవి 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అని అన్నారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు.. తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు...సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..... సాహో శాతకర్ణి.. జయహో శాతకర్ణి అంటూ ట్విట్ చేశారు. -
నాగ్ రిలీజ్ డేట్ చెప్పేశాడు
ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ తమ సినిమాలతో రెడీ అయిపోతున్నారు. అసలు నలుగురు సీనియర్లు సంక్రాంతి బరిలోనే దిగుతారని భావించినా.. ముఖాముఖి పోటి నుంచి తప్పుకొని కాస్త అటు ఇటుగా సర్దుకున్నారు. ఇప్పటికే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలు సంక్రాంతి బరిలో పోటి పడటం కాయమైపోయింది. ఇక కాస్త ఆలస్యంగా వస్తున్న విక్టరీ వెంకటేష్, తన గురు సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఒక్క నాగార్జున విషయంలోనే ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగార్జున, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ డేట్ ను ముందే చెప్పలేమని ప్రకటించాడు. అయితే ఇప్పటికే షూటింగ్ తో పాటు కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావటంతో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. బాలీవుడ్ నటుడు సౌరబ్ జైన్ వేంకటేశ్వరునిగా నటిస్తున్న ఈసినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?
జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేయలేదు. వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడట. ఆ తరువాత పూరి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ సినిమా ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓం నమోవేంకటేశాయ సినిమాను రూపొందిస్తున్న దర్శకేంద్రుడు రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా పౌరాణికం లేదా సోషియో ఫాంటసీ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమాను కూడా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాఘవేంద్రరావుపై దాడి చేసిన వ్యక్తికి జైలుశిక్ష
ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై దాడి చేయడమే కాకుండా ఆయనకుచెందిన ఖరీదైన కార్లను ధ్వంసం చేసిన ఘటనలో వల్లిపి రవీంద్ర(28)కి నాంపల్లిలోని మూడవ అదనపు న్యాయస్థానం రెండువారాల జైలు శిక్ష విదిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడిని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపర్చగా ఈ మేరకు కోర్టు తీర్పు అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లి గ్రామానికి చెందిన రవీంద్ర గురువారం ఉదయం ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకుడు రాఘవేంద్రరావు నివాసానికి వెళ్లి ఆయన బయటకు వెళ్లిన సమయంలో కారును అడ్డగించి దాడికి యత్నించాడు. 2006లో తీసిన శ్రీరామదాసు సినిమా కథ తనదేనని ఆ కథ స్క్రిప్ట్‌ను పోస్టులో పంపించానని అయితే కథ పేరు తనకు బదులుగా వేరొకరిని చేర్చారని నిలదీశారు. రాఘవేంద్రరావు సర్దిచెప్తున్నా వినకుండా ఆయన కారు అద్దాలు కొడుతూ దాడికి యత్నించాడు. రవీంద్ర నుంచి తప్పించుకొని రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. అనంతరం ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ రాడ్ తీసుకొని రాఘవేంద్రరావు ఇంట్లోకి ప్రవేశించిన రవీంద్ర అక్కడున్న ఆడి, బెంజ్, సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డు వచ్చిన వాచ్మెన్ కె. బాబుపై దాడి చేశాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి వస్తున్న రాఘవేంద్రరావు కొడుకు కోవెలమూడి ప్రకాశ్‌రావుపై కూడా దాడి చేశారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో రవీంద్ర ఆ సినిమా కథ తనదేనని పలుమార్లు రాఘవేంద్రరావును ప్రశ్నించడం జరిగిందని న్యాయం జరగలేదని అందుకే అందరి దష్టికి ఈ విషయం వెళ్లాలని దాడి చేశానని వెల్లడించారు. -
వడదెబ్బకు ఉద్యోగి మృతి
భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా.. చంపాపేట రెడ్డిబస్తీకి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. బీమ్నెట్ బంజారాహిల్స్ కార్యాలయంలో టీమ్హెడ్గా పనిచేస్తున్న కాశీపురం రాఘవేంద్రరావు (34) శనివారం ఎండలో బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో కార్యాలయంలో సిబ్బంది కొబ్బరి బోండా నీరు ఇచ్చి తిరిగి ఇంటికి పంపించేశారు. అర్ధరాత్రి అపస్మారక స్థితికిలోకి వెళ్లిన రాఘవేంద్రరావును కుటుంబ సభ్యులు మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆదివారం మృతి చెందాడు. రాఘవేంద్ర వివాహం జరిగి నెల రోజులు అయినట్లు సమాచారం. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. -
దర్శకేంద్రుడి క్లాస్ రూమ్
ఇన్నాళ్లు దర్శకుడిగా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు మరో అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటి వరకు మెగాఫోన్ పట్టుకొని సినిమా షాట్ల గురించి మాత్రమే చెప్పిన రాఘవేంద్రుడు త్వరలో దర్శకత్వ పాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడిగా సంచలన విజయాలు నమోదు చేసిన ఈ దిగ్థర్శకుడు తనలాంటి మేటి దర్శకులను తయారు చేసే పనిలో ఉన్నాడు. ఇందుకు సంభందించిన ఓ ప్రమోషన్ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాఘవేంద్ర రావు మరిన్ని వివరాల కోసం వేచిచూడాలంటూ ఊరిస్తున్నాడు. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్‌ను తయారు చేసిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఏకంగా స్కూలు పెట్టి మరి దర్శకులను తయారు చేయటం ఇండస్ట్రీకి శుభ పరిణామంఅంటున్నారు విశ్లేషకులు. Classes starting soon! Stay tuned!https://t.co/KFBiTS3wkJ — Raghavendra Rao K (@Ragavendraraoba) February 24, 2016 -
మరో చారిత్రక పాత్రలో నాగార్జున
సీనియర్ హీరోలలో తన వయసుకు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకోవటంలో ముందున్న హీరో కింగ్ నాగార్జున. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన నాగ్ మరోసారి భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున త్వరలో వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు 'హాథీరాం బాబా'గా కనిపించనున్నాడు. శిరిడి సాయి సినిమా తరువాత ఇంతవరకు దర్శకుడు రాఘవేంద్రరావు మరో సినిమాను ప్రారంభించలేదు. వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా, నాగార్జున డేట్స్ కాళీ లేకపోవటంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. సోగ్గాడే చిన్నినాయనా తరువాత మరో సినిమా అంగీకరించని నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
మాది విడదీయరాని బంధం
♦ దర్శకేంద్రుడితో మూడున్నర దశాబ్దాల అనుబంధం: చిరంజీవి ♦ రాఘవేంద్రరావుకు ‘అల్లు’ పురస్కారం సాక్షి, హైదరాబాద్: ‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో నాకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉంది. మాది విడదీయరాని అనుబంధం. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారమిక్కడ ‘సాంస్కృతిక బంధు’ సారపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ‘అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఆయనకు స్వర్ణకంకణం, స్వర్ణ కిరీటంతో పాటు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్యకు ఎంతో ఆప్తుడైన రాఘవేంద్రరావుకు ఈ అవార్డు ఇవ్వడం ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. దర్శకేంద్రుడు ఈ అవార్డుకు మరింత వన్నె తెచ్చారన్నారు. ‘అడవిదొంగ సినిమాతో రాఘవేంద్రరావు నన్ను మాస్ హీరోగా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేయడంతోపాటు ఇండస్ట్రీలో నా సత్తా పెంచారు. ఆయనతో 12 సినిమాలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు, నాకు దక్కింది. ఆయన కంటే చిన్నవాడిని అయినా నన్ను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అల్లుగారు హాస్యనటుడిగా అందరికీ తెలుసు. కానీ ఆయన గాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నది చాలామందికి తెలియదు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తలసాని, ఏపీ మంత్రులు గంటా, కామినేని, నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వినీదత్, రచయిత పరుచూరి వెంకటేశ్వరావు, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, చిరంజీవి సతీమణి సురేఖ, ప్రముఖులు పి.సుధాకర్ రెడ్డి, తెల్లంపల్లి శ్రీనివాస్, గాయని శారద, వాశిరాజు ప్రకాశం, రాంబాబు, జెఎస్టీ సాయి పాల్గొన్నారు. -
మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక
ఒక కోడలి కథ మంచి లావు ఛాన్స్ కొట్టేసింది - కోడలు పిల్ల. ‘సైజ్ జీరో’ సినిమా కథ ఆమెదే. లావుగా ఉన్నా మాకు ఓకే అంటున్నారు అత్తింటివారు. ఎంత లావు సక్సెస్ కొడుతుందో చూడాలి. రాఘవేంద్రరావు కొడుకు - కోడలుతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. సాక్షి: మాకు పూనమ్ ధిల్లాన్ తెలుసు. ఇప్పుడు రాఘవేంద్రరావుగారి కోడలు కనికా ధిల్లాన్ అనేసరికి తెలుగువారు మీ పట్ల కుతూహలంగా ఉన్నారు. కనిక: ఓ... అవునా... థ్యాంక్యూ. ‘సైజ్ జీరో’ సినిమాకు కథ అందించిన రచయిత్రిగా కూడా దక్షిణాదిలో మీరిప్పుడు వార్తల్లో ఉన్నారు. కనిక: అవును... ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సంతోషంగా ఉంది. ఇంతకూ మీ నేపథ్యం ఏంటి? ప్రకాశ్‌కు మీరెలా పరిచయం అయ్యారు. కనిక: మాది అమృత్సర్. నాన్నది వ్యాపారం. అమ్మ ప్రిన్సిపాల్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వల్ల కథలు అలవాటయ్యాయి. అలా రచయిత్రి కావాలనే కోరిక పుట్టింది. ముంబైలో షారూక్ ఖాన్ సంస్థలో పని చేశాను. ప్రకాశ్ ముంబైలో పని చేస్తూ కథలు రాసే వాళ్ల కోసం వెతుకుతూ నా గురించి తెలుసుకున్నారు. అలా మా పరిచయం అయ్యి, ప్రేమగా మారింది. ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఉన్న రాఘవేంద్రరావుతో: కనికను పెళ్లి చేసుకుంటానని మీ అబ్బాయి చెప్పగానే ఎలా అనిపించింది? రాఘవేంద్రరావు: అంతకు ముందు పెళ్లి గురించి ప్రకాశ్ అంతగా ఇంట్రస్ట్ చూపించేవాడు కాదు. అందుకని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఆనందపడ్డాను. అయితే మా ఆవిడ ఒప్పుకోదనుకున్నాను. వెంటనే ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచింది. కథ, డెరైక్టర్ భార్యాభర్తల్లాంటివాళ్లు. కనిక రచయిత. ప్రకాశ్ డెరైక్టర్. కనుక మంచి జోడీ అనిపించింది. తను కూడా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అమ్మాయిలాగా మా ఇంట్లో కలిసిపోయింది. నా సిస్టర్స్, బ్రదర్స్.. వాళ్ల పిల్లలతో చాలా బాగుంటుంది. మాకు ఒకే ఒక్క కొడుకు కాబట్టి.. మా కోడలినే కూతురిలా భావిస్తున్నాం. పెళ్లయిన ఈ ఏడాది కాలంలో మీ అత్తామామలు మీకిచ్చిన భరోసా గురించి? కనిక: మా అత్తామామలు నన్ను ఓ కోడలిలా చూడలేదు. కూతురిలానే అనుకున్నారు. ఎప్పుడైనాసరే అత్తామామల నుంచి ఎంకరేజ్మెంట్ లభిస్తే ఆ కోడలు కెరీర్‌పరంగా రాణించే వీలుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా కథలు రాసుకుంటూ, ప్రకాశ్‌తో కలిసి సినిమాలు చేయగలుగుతున్నానంటే మా అత్తామామలు ఇచ్చే ఎంకరేజ్మెంటే కారణం. మీ భార్య అత్తగారి దగ్గర ఉత్తమ కోడలనిపించుకోగలిగారా? ప్రకాశ్: (నవ్వుతూ) అమ్మ ముందు నుంచీ హౌస్ వైఫ్. గుళ్లకు ఎక్కువగా వెళుతుంది. కనిక ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇద్దరూ మాటా మాటా అనుకోవడం, లేనిపోని పట్టింపులు, పంతాలకు పోవడం చేయరు. కనికకు తెలుగు తెలియదు కాబట్టి మీ అమ్మగారు, తన మధ్య సంభాషణకు తావు లేకపోవడం కూడా ఓ అడ్వాంటేజ్ ఏమో? ప్రకాశ్: (నవ్వుతూ). మాటలకన్నా సైగలు ఎక్కువ. అమ్మ మాట్లాడింది అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయం తీసుకుంటుంది. అదంతా భలే ఉంటుంది. కనిక: కానీ, తెలుగు నేర్చుకుని ఒకరోజు అత్తయ్యతో గడాగడా తెలుగులో మాట్లాడి, ఆమెను సర్ప్రైజ్ చేయాలని ఉంది. ఇక్కడి సంప్రదాయాల గురించి మీ అత్తగారు చెబుతుంటారా? కనిక: ఇక్కడి ఫంక్షన్లకు ఎలా రెడీ అవ్వాలో నాకు తెలియదు. ఎలాంటి చీరలు కట్టుకోవాలో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో అత్తమ్మే చెబుతుంది. ఎలాంటి కలర్స్ సెలక్ట్ చేసుకోవాలో కూడా చెబుతుంది. మీ కోసం మీ అత్తగారు ఏమైనా వంటలు చేసి పెడుతుంటారా? కనిక: దోసలాగ పెద్దగా ఉంటుందే.. అది దోస కూడా కాదు (ప్రకాశ్: దిబ్బరొట్టె గురించి చెబుతోంది). అది చాలా బాగుంటుంది. ఉప్మా చేసి పెడుతుంది. ఒక్కోసారి మా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చేసి పెడుతుంది. ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే ‘ఓకే... వేరే చేసి పెడతాను’ అని చెబుతుంది. మీకు ఎవరైనా అక్కా, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారా? వాళ్లతో ప్రకాశ్ ఎలా ఉంటారు? కనిక: నాకు ఓ అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క లండన్‌లో జాబ్ చేస్తోంది. తమ్ముడు ముంబైలో బ్యాంకర్. ప్రకాశ్ మా ఫ్యామిలీతో చాలా బాగుంటారు. వాళ్లు కూడా ఆయన తో అలాగే ఉంటారు. ప్రకాశ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాక ఆయన ఎవరికైనా నచ్చేస్తాడు. మావాళ్లందరికీ చాలా త్వరగా దగ్గరయ్యాడు. లవ్ ప్రపోజల్ ముందు ఎవరు చేశారు? ఎలా చేశారు? ప్రకాశ్: నేనే చేశాను. సినిమాటిక్‌గా అయితే కాదు. {పకాశ్ ప్రపోజ్ చేస్తారని మీరు ముందే ఊహించారా? కనిక: ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందని మా ఇద్దరికీ తెలుసు. మా అమ్మానాన్నలకి ఓ విచిత్రమైన సంఘటన ద్వారా తెలిసింది. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి, ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. అప్పుడు ప్రకాశ్ చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడే మా అమ్మగారు ప్రకాశ్‌ని కలిసింది. ‘ఎవరీ కుర్రాడు.. ఇంత కేర్ తీసుకుంటున్నాడు. చాలా బాగున్నాడు’ అని అడిగింది. మీ నాన్నగారు ఫుల్ మాస్. మీరు క్లాస్ అనిపిస్తోంది. చిన్నప్పట్నుంచీ నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగినా ఆయన ప్రభావం మీ మీద పడలేదనుకోవచ్చా? ప్రకాశ్: బేసిక్‌గా చిన్నప్పట్నుంచీ సినిమాలు చూసినా సినిమాలంటే నాకు ఇంట్రస్ట్ లేదు. థియేటర్ (రంగస్థలం) ద్వారా సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. కాలేజ్‌లో థియేటర్ చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లి నేర్చుకున్నాను. థియేటర్ కథలు కమర్షియల్‌గా ఉండవు. నా మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంది. ముందు ఆర్టిస్ట్‌గానే పరిచయం అయ్యారు కదా.. తర్వాత డెరైక్షన్ వైపు వెళ్లిపోయారేంటి? ప్రకాశ్: అమెరికాలో థియేటర్లో నేర్చుకున్నది యాక్టింగే. అక్కడ నేర్చుకున్న యాక్టింగ్‌కీ, ఇక్కడ సినిమాలకు చేసే యాక్టింగ్‌కీ చాలా వ్యత్యాసం ఉందనిపించింది. నేను ఏదైతే ట్రైన్ అయ్యానో అందుకు పూర్తి డిఫరెంట్‌గా ఇక్కడ చేయమన్నారు. ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ చేసే తరహా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఏర్పడలేదు. డెరైక్షన్ మీద ముందు నుంచీ ఇంట్రస్ట్ ఉండటంతో అటువైపు వెళ్లిపోయాను. ‘అనగనగా ఓ ధీరుడు’ తర్వాత మీరు చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ప్రకాశ్: ఆ సినిమా తర్వాత ఓ ఏడాది కొన్ని కథలు రాసుకున్నాను. ‘గాన్ ఆఫ్ హంటర్స్’ అని ఒక హిందీ టెలివిజన్ షో చేశాను. అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. దానికి రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ బారామీటర్స్కు అతీతంగా సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలోనే కనిక చెప్పిన కథ నచ్చింది. కథలో మానవీయ విలువలు ఉన్నాయనిపించింది. అందుకని ‘సైజ్ జీరో’ చేశాను. వంద చిత్రాలకు పైగా చేసిన మీ నాన్నగారు ఎక్కువ సినిమాలు తీయమని ఒత్తిడి చేయలేదా? మీరు నాన్నగారి మేకింగ్ స్టయిల్ని అడాప్ట్ చేసుకోవాలనుకోలేదా? ప్రకాశ్: నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయం మీద మా ఫ్యామిలీలో ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదు. నాన్నగార్ని ఫాలో కావాలనుకోలేదు. ఆయన అన్ని సినిమాల్లోనూ ఫ్రూట్స్ లాంటి కలర్‌ఫుల్ థింగ్స్ వాడలేదు. ‘జ్యోతి’లో కానీ, ‘ఆమె కథ’లో కానీ అలాంటివి కనిపించవు. ఎందుకంటే, ఆ కథలకు అవి అవసరంలేదు. మేకింగ్ స్టయిల్ అనేది స్టోరీ జానర్‌ని బట్టే ఉంటుంది. నేను ఎన్నుకునే కథలు ఎలాంటి మేకింగ్ స్టయిల్ని డిమాండ్ చేస్తే అదే చేస్తాను. ఓకే... మళ్లీ కనికతో మాట్లాడదాం... మీ భర్త టాలెంటెడ్ అయినప్పటికీ ఇప్పటివరకూ చేసిన బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు కమర్షియల్‌గా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మీరు ఇచ్చిన కథతో ఆయన తీసిన ‘సైజ్ జీరో’ ఆ కొరతను తీస్తుందంటారా? కనిక: ప్రకాశ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. జాతీయ అవార్డు సాధించాడు. ఇక.. కమర్షియల్ సక్సెస్‌కి వస్తే.. ‘సైజ్ జీరో’ ఫన్ మూవీ, ఫ్యామిలీ ఫిల్మ్. సో.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఆ సినిమా ఇంత సక్సెస్ కావాలని నేను లెక్కలేసుకోవడంలేదు. మంచి సినిమా తీశాం. అందరూ ఎంజాయ్ చేయాలన్నది నా ఆకాంక్ష. మీ మామగారి మేకింగ్ స్టయిల్‌తో ప్రకాశ్ మేకింగ్ స్టయిల్ని కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? కనిక: మా మామగారిది విభిన్న శైలి. ప్రకాశ్‌ది మరో శైలి. ఇద్దరి టేకింగ్‌నీ కంపేర్ చేయలేం. మా మామగారి టేకింగ్ గురించి బాలీవుడ్లో కూడా మాట్లాడుకుంటారు. అక్కడి దర్శకుల్లో చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. మామగారి ప్రభావం ప్రకాశ్ మీద అంతగా లేదు. ఎందుకంటే, ప్రకాశ్ ఎంచుకునే కథలు మామగారి కథలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. కనికా.. మీరు కథలు రాస్తుంటారు కాబట్టి, ఓ స్టోరీ రైటర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కనిక: నేను తెలుసుకున్నదేంటంటే.. ఏ కథకైనా మంచి కథావస్తువు ముఖ్యం. కథలో ఎమోషన్ ఉండాలి. వేగం ఉండాలి. ఆ కథకు తగ్గ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ ఉండాలి. నేను కథలు రాసేటప్పుడు ఆ విషయాల్నే దృష్టిలో పెట్టుకుంటాను. ఇంట్లో మామగారు ఉంటారు కాబట్టి, కథ రాసేటప్పుడు ఇంకా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, తెలియకుండా ఆయన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. {పకాశ్లో ఉన్న మూడు బెస్ట్ క్వాలిటీస్ చెబుతారా? కనిక: ప్రకాశ్ గురించి మా అమ్మ దగ్గర చెప్పగానే ఆవిడ కూడా ఇలానే అడిగారు (నవ్వుతూ). బేసిక్‌గా నేను క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, తనూ ఈ ఫీల్డ్‌లో ఉండటం, స్టోరీ టెల్లింగ్‌లో తను చూపించే కొత్తదనం నాకు చాలా నచ్చాయి. ప్రకాశ్ చాలా టాలెంటెడ్. ఆ టాలెంట్‌ని ఇష్టపడ్డాను. ఎదుటి వ్యక్తుల కోసం తనను తాను మార్చుకోడు. ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటాడు. ఎవరి దగ్గరా నటించడు. ఈ రోజుల్లో ఇలాంటి లక్షణాలున్నవాళ్లు చాలా అరుదు. {పకాశ్.. కనికలో మీకు నచ్చిన లక్షణాలు? ప్రకాశ్: మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. చాలా మంచి వ్యక్తి. పంతం నెగ్గించుకోవాలనుకోదు. పట్టువిడుపుగా వ్యవహరిస్తుంది. స్నేహంగా ఉంటుంది. టోటల్‌గా కూల్ పర్సన్. ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి, చాలా విషయాల్లో ఇద్దరం కనెక్ట్ అవుతాం. ప్రొఫెషనల్లీ ఎదగడానికి మేం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. మీ చేతి వంటను ప్రకాశ్‌కు రుచి చూపించారా? కనిక: వంట చేస్తాను. అది తినే ధైర్యం ఒక్క ప్రకాశ్ మాత్రమే చేస్తాడు. రెగ్యులర్‌గా కుక్ చేయను. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. ప్రకాశ్ వద్దనకుండా తింటాడు. మరి.. మీకు వంట వచ్చా? ప్రకాశ్: అంత కాదు.. అస్సలు రాదనే చెప్పాలి. కనిక: శాండ్విచెస్ చేస్తాడు (నవ్వుతూ). ఓకే.. ఈ ఏడాది జీవితం ఎలా అనిపించింది? కనిక: ముందు మీరే చెప్పండి. ప్రకాశ్: వెరీ గుడ్ అండి. కనిక వేరే సిటీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. నేను షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఇంట్లో లేకపోతే తాను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. బాగానే ఎడ్జస్ట్ అయింది. పైగా మంచి రచయిత కావడంతో సెట్‌కు వచ్చి మంచి డెసిషన్స్ కూడా తీసుకునేది. నాకు ఆన్ సెట్లో మంచి సపోర్ట్ ఇస్తుంది. అఫ్ సెట్.. అంటే ఇంట్లో మేం హ్యాపీ కపుల్. కనిక: ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియడంలేదు. కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, కల్చర్ అన్నీ కొత్తే. కానీ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. బర్త్‌డేస్‌కి సర్ప్రైజ్ చేసుకోవడం వంటివి? ప్రకాశ్: నా 40వ పుట్టిన రోజుకి కనిక సర్ప్రైజ్తో కూడిన షాక్ ఇచ్చింది. కనిక: ఆయనకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టిన రోజున మంచి సర్ప్రైజ్ ఇచ్చాను. ప్రకాశ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ సూపర్ హీరో గెటప్‌లో పార్టీకి హాజరయ్యేలా చేశా. ఆయనకు నిజంగా ఆ రోజున అది స్వీట్ షాక్. మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి చిత్రం ‘సైజ్ జీరో’ ఎలా ఉంటుంది? కనిక: అందరూ మంచి సినిమా తీశారని అంటారు. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. అందర్నీ ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు. మీరింత సన్నగా ఉన్నారు. జీరో సైజ్ అని ఓ లావుగా ఉన్న అమ్మాయి గురించి రాయాలని ఎందుకనిపించింది? కనిక: నా చుట్టూ ఉన్న వాళ్లల్లో కొంతమంది జీవితం ఆధారంగా ఈ కథ రాశాను. పెళ్లి అవుతుందంటే నాలుగు నెలల ముందు నుంచి అమ్మాయిని బరువు తగ్గమంటారు. నార్త్, సౌత్ ఎక్కడైనా ఈ పద్ధతి ఒక్కటే. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ తెరిస్తే స్లిమ్ సెంటర్స్ గురించే ఉంటున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. ఓ లావుగా ఉన్న అమ్మాయి జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఆ అమ్మాయికి కొన్ని వెయిట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అమ్మాయి వాటిని ఎలా ఫేస్ చేసింది? అనేది సినిమా. ఎమోషనల్‌గా ఉంటూ నవ్విస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కనిక ‘సైజ్ జీరో’లోలా అనుష్క అంత బరువు పెరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రకాశ్: చెప్పాలంటే... నేను తనను బరువు పెరగమనే చెబుతున్నాను. వినడం లేదు. కనిక: ఆయనకు నేను బరువు పెరిగితే హ్యాపీనే. -
యువతిపై లైంగిక దాడి
- వీడియో తీసి బ్లాక్ మెయిల్ పటమట : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం రామవరప్పాడులోని మల్లెమూడివారి వీధి లో మోహనరావు ఇంట్లో అద్దెకు ఉం టున్న యువతి(24) పటమటలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. 2014 నవంబరు నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని మూడవ కుమారుడు రాఘవేంద్రరావు ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తన స్నేహితుడు వెంకటేష్ వీడియో తీసాడని, తాను చెప్పిన విధంగా చేయకపోతే ఆ వీడియో నెట్ లో పెడతానని బెదిరించి డిసెంబరు నుంచి తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు ఆ వీడియోను తన స్నేహితుల యిన నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్‌లకు పంపించాడు. అప్పటి నుంచి యువతికి రాఘవేంద్రరావు స్నేహితులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేకపోతే వారి కోరిక తీర్చాలని బెదిరించారు. దీంతో ఒకసారి కొంత నగదు ఇచ్చింది. మరలా ఫోన్లు చేసి డబ్బులు అడగడం ప్రా రంభించారు ఆ వేధింపులు భరించలేక యువతి రెండు రోజుల కిందట తన చెల్లెలకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తన స్నేహితులకు జరిగిన విషయం చెప్పడంతో వారు రాఘవేంద్రరావు సూర్యారావుపేటలో నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లి ప్రశ్నిం చారు. వారిపై అతను ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తండ్రి మోహనరావుకు షాపుపై యువకులను పంపించారని వివరించాడు. దీంతో తండ్రి మో హనరావు, కుటుంబ సభ్యులు కృష్ణకుమారి, వర, దుర్గలు యువతి ఇంటిపై గురువారం దాడి చేసి బాధితురాలి చెల్లెలిని, కుటుంబ సభ్యులను కొట్టా రు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన రాఘవేంద్రరావు, వీడియో తీసిన వెంకటేష్, స్నేహితులు నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్, ఇంటిపై దాడి చేసిన మోహనరావు, కృష్ణకుమారి, వర, దుర్గలపై కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. -
రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారానికి నాగ్
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున హాజరయ్యారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని రాఘవేంద్రరావు అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించి మనన్నలు పొందుతాని తెలిపారు. కాగా అన్నమయ్య చిత్రాన్ని తీసినందుకే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి తనకు టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాడని రాఘవేంద్రరావు పేర్కొన్న విషయం తెలిసిందే. -
అన్నమయ్య సినిమా తీసినందుకే...
తిరుమల : అన్నమయ్య చిత్రాన్ని తీసినందుకే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి తనకు టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాడని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. దీన్ని బోర్డు పదవిలా కాకుండా స్వామి ప్రసాదంలా భావిస్తానని చెప్పారు. మంగళవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించి మనన్నలు పొందుతానన్నారు. -
ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!
- దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒకటీ రెండు కాదు... ఏకంగా 44 చిత్రాలు రూపొందించి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా ఎక్కిన ఘనత నటి విజయ నిర్మలది. ఆమె సినీ జీవిత విశేషాలు, అరుదైన ఫోటోలతో సీనియర్ సినీ జర్నలిస్ట్ యు. వినాయకరావు ‘గిన్నీస్‌బుక్ విజేత’ పేరిట ఒక పుస్తకం రాశారు. విజయనిర్మల 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ పుస్తకావిష్క రణ జరిగింది. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు పుస్త కాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని హీరో కృష్ణ స్వీకరించారు. మలిప్రతిని సీనియర్ సినీ జర్నలిస్టు బి.ఏ. రాజు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు అభిమానులు, సినీ శ్రేయోభిలాషుల మధ్య విజయనిర్మల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనిర్మల కుమారుడు - నటుడు నరేశ్‌తో పాటు సీనియర్ సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతి, నటి జయసుధ, నటుడు ‘గుండు’ సుదర్శన్, దర్శకురాలు బి.జయ, నిర్మాత ‘పద్మా లయ’ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘విజయ నిర్మల స్ఫూర్తితో మరింత మంది మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి’’ అని రాఘవేంద్రరావు అభిప్రాయపడగా, ‘‘విజయనిర్మలపై పుస్తకం వెలువడిన ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది’’ అని కృష్ణ పేర్కొన్నారు. ‘‘ఈ పుస్తకం విజయ నిర్మల గారికి నేనిస్తున్న పుట్టినరోజు కానుక’’ అని వ్యాఖ్యానించిన వినాయకరావు త్వరలోనే హీరో కృష్ణపై ‘దేవుడు లాంటి మనిషి’ అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించ నున్నట్లు ప్రకటించారు. మహేశ్‌బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దయెత్తున వచ్చి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. -
ఇంకా నేర్చుకుంటున్నా...
సీనియర్ల సలహాలు తీసుకుంటున్నా నటి, యాంకర్ గాయత్రి భార్గవి బొబ్బిలి: తాను ఇంకా నటన నేర్చుకుంటున్నానని, షూటింగ్ ప్రదేశంలో ప్రతి ఒక్క ఆర్టిస్టును గమనించి మెలకువలు తెలుసుకుంటున్నానని నటి, టీవీ యాంకర్ గాయత్రి భార్గవి అన్నారు. బొబ్బిలిలో ముళ్లపూడి వర ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 18వ ఏట నుంచి ఈ రంగంలోనే ఉన్నానని తెలిపారు. చదువుతుండగా అవకాశాలు రావడంతో ఇటువైపు దృష్టి పెట్టానని, అయినా చదువు పూర్తి చేశానని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన తోక్కుడు బిళ్లాట యాడ్ ఫిల్మ్‌లో నటించానన్నారు. ఆ సమయంలో ముళ్లపూడి వర ఆ యాడ్‌కు సారథ్యం వహించారని తెలిపారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. బీకాం చదువుతుండగానే అవకాశాలు వచ్చాయని, జెమినీలో డ్రీం గర్ల్ బ్యూటీషియన్ కాంటెస్టుతో ముందుగా టీవీ రంగంలోనికి అడుగుపెట్టానని తెలిపారు. ఆ తరువాత ఆట కావాలా.. పాట కావాలా.., అదిరింది వంటి షోలు చేసి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నట్లు తెలిపారు. ఇటీవల సాక్షి టీవీ ‘ఫ్యామిలీ షో’కు మంచి స్పందన వచ్చిం దని చెప్పారు. దాదాపు ఆరు మాసాల పాటు కుటుంబాల్లో వ్యక్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భార్యభర్తల కల హాలు వంటి వాటిని పూర్తిస్థాయిలో తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కార మార్గం కూడా చూపించగలగడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో అగ్రనటులను ఇంటర్వ్యూ చేస్తుండడంతో పాటు స్టేజీ షోలు కూడా చేస్తున్నానని తెలిపారు. తాను మొదట సురేష్ ప్రొడక్షన్సలో వచ్చిన రవితేజ బలాదూర్ సినిమాలో నటించానని, తర్వాత గాలిపటం, అవును, బ్రహ్మిగాడి కథ, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో నటించానని చెప్పారు. అబ్బో చాలా తేడా ఉంది యాంకరింగుకు, యాక్టింగుకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. సమయస్ఫూర్తితో ఎవరినీ నొప్పించకుండా అప్పటికప్పుడు తెలివితేటలను ఉపయోగించి యాంకరింగు చేయాలని తెలిపారు. యాంకరింగ్‌లో కొంచెం కూడా ఏమరపాటు అనేదే ఉండకూడదని అన్నారు. సినిమాల్లో మాత్రం అంతా దర్శకుడి చేతుల్లో ఉంటుందని చెప్పారు. తన భర్త ఆర్మీలో పనిచేస్తున్నారని, తనకు ఏడేళ్ల కొడుకున్నాడని, కుటుంబ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవైపు చూసుకుంటూ మరో వైపు సినిమా, టీవీ రంగాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. సీనియర్లు ఝాన్సీ, సుమల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని చెప్పారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వృత్తిలో ముందుకు వెళుతున్నానని అన్నారు. -
అందుకే పెళ్లి చేసుకోలేదు!
సంభాషణం: అమాయకమైన ఇల్లాలిగా భర్తను విసిగించినా... ఉదాత్తమైన తల్లి పాత్రలో కన్నీళ్లు తెప్పించినా... కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా... ఏం చేసినా ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తారు రజిత. హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాలు చేసిన ఆమె... తన నట ప్రయాణం గురించి, తన అనుభవాల గురించి ఇలా పంచుకున్నారు. మీ కెరీర్‌కి పునాది ఎలా పడింది? మాది కాకినాడ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. అమ్మ చెల్లెళ్లు కృష్ణవేణి, రాగిణి... ఇద్దరూ నటీమణులే. పదిహేనేళ్లున్నప్పుడు ఓసారి వేసవి సెలవుల్లో మద్రాస్ వెళ్లాను పిన్ని దగ్గరికి. షూటింగ్ చూడ్డానికి వెళ్తే పరుచూరి గోపాలకృష్ణ చూసి నటిస్తావా అనడిగారు. నటించను, చదువుకోవాలి అని చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి, దర్శకుడు రాఘవేంద్రరావుగారితో చెప్పి, ‘అగ్నిపుత్రుడు’లో ఏఎన్నార్‌గారి కూతురి పాత్ర చేయించారు. తర్వాత నేను మళ్లీ చదువులో పడిపోయాను. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో, ఎందుకు వదులుకోవాలి అనిపించింది. అందుకే ఇంటర్‌తో చదువు ఆపేసి, సినిమా రంగంవైపు వచ్చేశాను. హీరోయిన్‌గానూ చేసినట్టున్నారు...? అవును. ఒరియా, మలయాళం, తమిళ భాషల్లో చేశాను. కానీ పరాయి భాషలో చేస్తే ఎవరికి తెలుస్తుంది, మన భాషలో చేస్తే మనవాళ్లు గుర్తుపడతారు కదా అనిపించింది. అందుకే అక్కడ హీరోయిన్ పాత్రలు వదులుకుని, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడటానికి సిద్ధపడ్డాను. పేరు తెచ్చిన పాత్రలు...? ‘పెళ్లికానుక’లో పాత్ర నాకు చాలా ఇష్టం. దానికి నంది అవార్డును కూడా అందుకున్నాను. ‘మల్లీశ్వరి’లో భరణిగారిని విసిగించే అమాయక భార్య పాత్ర, కొత్త బంగారులోకం, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లోని పాత్రలు బాగా పేరు తెచ్చాయి. చేయకుండా ఉండాల్సింది అనుకునే పాత్ర ఏదైనా ఉందా? ‘కబడ్డీ కబడ్డీ’లో చేసింది. కొత్త దర్శకులైతే తప్ప నేను నా పాత్ర గురించి అడగను. నాకెలాంటివి ఇవ్వాలో వారికి తెలుసులే అనుకుంటాను. ఆ సినిమాకీ అదే చేశాను. తీరా షూటింగుకు వెళ్లాక నా పాత్ర అసభ్యంగా ఉంది. చేయలేనని అన్నాను. అయితే ఔట్‌డోర్ షూటింగ్, అప్పటికప్పుడు ఆర్టిస్టును మార్చలేని పరిస్థితి. అందుకే చేయక తప్పలేదు. కాకపోతే నాకోసం కాస్త మార్చారులెండి. ‘నవ్వుతూ బ్రతకాలిరా’లో చేసింది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే! కోవై సరళకు బ్రహ్మానందంలాగా రజితకెవరు తగిన జోడీ? ఆహుతీప్రసాద్గారితో నా జోడీ బాగుంటుందని చాలామంది అంటుంటారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. అన్నీ బాగా పండాయి. నటిగా మీలో మైనస్లున్నాయా? నా హైట్. కమెడియన్లకు జోడీగా చేసినప్పుడు ఫర్లేదు కానీ హీరోయిన్లకు తల్లిగా చేసినప్పుడు మాత్రం, వాళ్ల పక్కన చాలా పొట్టిగా కనిపిస్తుంటాను. అలాంటప్పుడు ఇంకాస్త హైట్ ఉంటే బాగుణ్ననిపిస్తుంది. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? రమాప్రభగారు ఓ సినిమాలో రెండు జడలు వేసుకుని అమాయకంగా నటించారు. అలాంటిదొకటి చేయాలనిపిస్తుంది. అయితే ఆ అవకాశం దొరకడం కష్టమే. ఎందుకంటే, మన పరిశ్రమలో మగవారితో చేయించినంత కామెడీ, ఆడవాళ్లతో చేయించడం లేదు. ఎందుకంటారు? చాలా కారణాలున్నాయి. మేల్ కమెడియన్లు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంది. దాంతో వాళ్లకోసం రకరకాల పాత్రలు పుట్టిస్తున్నారు. కానీ మాకు ఆ అవకాశమే ఉండటం లేదు. తల్లి అంటే ఇలానే ఉండాలి, వదిన ఇలానే ఉండాలి అని ఫిక్స్ చేసేస్తారు. దాంతో మాకు ఓ పరిధి మేరకే నటించే చాన్స్ ఉంటుంది. దానికి తోడు ఒకప్పటిలాగా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండటం లేదు కాబట్టి పాత్రలు తక్కువే ఉంటున్నాయి. ఉన్నవాటికి కూడా ఏ ముంబై నుంచో, చెన్నై నుంచో, బెంగళూరు నుంచో ఆర్టిస్టుల్ని తీసుకొస్తారు. ఈ మధ్య అయితే హీరోలకు తల్లిగా, వదినగా చేయడానికి ఒకనాటి హీరోయిన్లను పెడుతున్నారు. అవి కూడా మాకు ఇవ్వకపోతే మేము ఏమైపోవాలి? మీ పిన్ని రాగిణిలాగా సీరియల్స్ కోసం ప్రయత్నించలేదా మీరు? లేదు. మంచి పాత్ర అని ‘అపరంజి’లో మాత్రం నటించాను. ఆ తర్వాత వీలు కాలేదు. కానీ సమయం వచ్చినప్పుడు నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు. మీ వ్యక్తిగతం జీవితం గురించి..? చెప్పుకోదగ్గ ప్రత్యేకతలేమీ లేవు. నాకు మొదట్నుంచీ ఆథ్యాత్మిక ధోరణి ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మకుమారిగా ఉండిపోయాను. షూటింగ్ లేకపోతే ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువ గడుపుతాను. పార్టీలకవీ వెళ్లను. నా ఫ్రెండ్స్ ప్రగతి, సన, సురేఖావాణిలతో ఎప్పుడైనా సరదాగా గడుపుతాను. అంతే! - సమీర నేలపూడి -
కన్నులపండుగగా గీతం వర్సిటీ స్నాతకోత్సవం
-
దర్శకేంద్రుడు, సుద్దాలకు డాక్టరేట్లు
విశాఖపట్నం: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. మంగళవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అగ్నిక్షిపణుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త, డి.ఆర్.డి.వో డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రకటించింది. ఈ నెల 13న జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు గీతం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాలకు చెందిన రాఘవేంద్రరావు (సినీ రంగం), సుద్దాల అశోక్ తేజ (సాహిత్యం), శైలజాకిరణ్ (పారిశ్రామిక)లకు గౌరవ డాక్టరేట్లకు... అవినాష్ చందర్ (శాస్త్ర సాంకేతిక) డాక్టర్ ఆఫ్ సైన్స్ కి ఎంపిక చేసినట్లు గీతం పేర్కొంది. -
వీఆర్వో జిల్లా టాపర్ రాఘవేందర్ రెడ్డి
వనపర్తి,న్యూస్‌లైన్: ఈ నెల 2న జరిగిన వీఆర్వో పరీక్షల్లో జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లికి చెందిన అబ్బ రాఘవేందర్ రెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. అతను ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ఇతని అన్న గణపతిరెడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి శనివారం వనపర్తిలో ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ తన లక్ష్యం గ్రూప్-1 పరీక్ష రాసి ర్యాంకు సాధించడమని తెలిపారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు సంబంధించి వీఆర్వో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థుల మెరిట్ జా బితాను శనివారం రాత్రి డీఆర్వో రాంకిషన్ తన చాంబర్లో విడుదల చేశారు. ఈఫలితాల్లో టాప్ వన్‌గా 97మార్కులను ముగ్గురు అభ్యర్థులు సాధించారు. అయితే ముగ్గురిలో వయసును పరిగణల్లోకి తీసుకొని ఎక్కువ వయసున్న రాఘవేందర్ రెడ్డిని జిల్లా టాపర్‌గా ఏపీపీఎస్సీ ప్రకటిం చింది. రాఘవేందర్రెడ్డితోపాటు ఈశప్ప, కోడేర్‌కు చెందిన మరో అభ్యర్థి టాపర్ల స్థానంలోనే రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈసారి ఓపెన్ కేటగి రిలో పురుషులు ప్రతిభను కనబర్చారు. ఓపెన్ కేటగిరి కోటా విషయానికొస్తే టాప్ టెన్‌లో ఇద్దరు మహిళలు మాత్రమే ఎంపికయ్యారు. ఇక మెరిట్ సాధించిన 500 మంది జాబితాను పరిశీలిస్తే కేవలం 26 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అం టే వీరికి కేటాయించిన 33పోస్ట్‌లకు సరి పడా ఎంపిక కాలేదని తెలుస్తోంది. జిల్లా లో ఖాళీగా ఉన్న 103 వీఆర్వొ పోస్ట్‌లకు గాను 80,674మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షల్లో మాత్రం 71,302మంది మాత్రమే పాల్గొన్నారు. అభ్యర్థులందరు చూసుకునేలా వారు సాధించిన మార్కులను విడుదల చేశా రు. 97మార్కులను ముగ్గురు, 96మార్కులను ఐదుగురు, 95మార్కులను ఏడుగు రు, 94మార్కుల్ని 14మంది, 93మార్కు లు 20కి పైగా అభ్యర్థులు సాధించారు. వీఆర్ఏ టాపర్‌గా బుక్కతిమ్మప్ప జిల్లాలో ఖాళీగా ఉన్న 94 వీఆర్ఏ పోస్ట్‌లకు సంబంధించి జిల్లాకు పంపించిన ఫలితాల్లో టాపర్‌గా బుక్కతిమ్మప్ప నిలి చినట్లు సమాచారం. ఈఫలితాలు జిల్లా కు వచ్చిన ట్రిబ్యునల్ కోర్టు స్టేను జారీ చేయడంతో అధికారులు విడుదల చేయకుండా నిలిపేశారు. స్టేను పరిష్కరించాకే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు. నేడు తుదిజాబితా.... జిల్లాకు వచ్చిన మెరిట్ జాబితాను రోస్టర్ ప్రకారం మెరిట్సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అధికారులు బిజీగా నిమగ్నమయ్యారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈకసరత్తును పూర్తి చేసుకొని ఆదివారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికి వెంటనే సమాచారం ఇచ్చి ఈనెల 25లోగా వారి సర్టిఫికెట్లను తనిఖీ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. అనంతరం 28న వారికి నియామక ఉత్తర్వులను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చం దర్రావు, ఈసెక్షన్ ఇన్చార్జి తహశీల్దార్ బాలచందర్‌తోపాటు, సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.