
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు ఏప్రిల్ 28. బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడివి రాముడు’ విడుదలైన రోజు అది. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ విడుదలైన రోజు కూడా ఏప్రిల్ 28. ఇలాంటి ఒక ప్రాముఖ్యత ఉన్న ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న తాజా చిత్రం ‘పెళ్లిసందడి’ పాటల సందడి మొదలవుతోంది.
గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన శ్రీకాంత్ ‘పెళ్లిసందడి’కి రోషన్ ‘పెళ్లిసందడి’ సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త కథ. ఆ ‘పెళ్లిసందడి’కి చక్కని సంగీతం అందించిన కీరవాణి ఈ ‘పెళ్లిసందడి’కి కూడా సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఓ పాటను ఈ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్, సాహిత్యం: చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. సాయిబాబా.
చదవండి: ఒకే బాటలో నయనతార.. త్రిష!
Comments
Please login to add a commentAdd a comment